March 14, 2013

ఇంకొల్లు రూరల్ : దీర్ఘకాలంగా గ్రామాల్లో నెలకొని ఉన్న సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తానని, ప్రజలకు అందుబాటులో ఉంటానని పర్చూరు నియోజకవర్గ టీడీపీ ఇన్‌చా ర్జి ఏలూరి సాంబశివరావు అన్నారు.

మండల టీడీపీ సమావేశం బుధవా రం ఇంకొల్లులో పర్చూరు రోడ్డులోని ఒక ప్రైవేటు గోడౌన్‌లో గోరంట్ల జాన య్య అధ్యక్షతన జరిగింది. ముఖ్య అతి థిగా పాల్గొన్న ఏలూరి సాంబశివరావు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వా లు గత ఎన్నికలలో ఇచ్చిన హామీలను మరచి,ధరలు విపరీతంగా పెంచి ప్రజ లపై భారం మోపాయని విమర్శించా రు. ధరల నియంత్రణపై పర్యవేక్షణ కూడా లేకుండా పోయిందన్నారు. పెట్రోలు, డీజిల్‌పై ఇప్పటికే పలుమా ర్లు ధరలు పెంచారని తెలిపారు. విద్యు త్ సర్‌చార్జిల పేరిట బిల్లులు పెంచి ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నా రని ఆవేదన వ్యక్తం చేశారు.

టీడీపీ, కాంగ్రెస్ ప్రభుత్వాల పని తీరు బేరీజు వేసుకుని ప్రజలు ఎన్నిక లలో తీర్పు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. గ్రామాల్లోని సమస్యలపై ప్రజలకు అవగాహన కల్పించి వారిని చైతన్యప రచాలన్నారు. ఎన్నికల సమయంలో ప్రలోభాలకు గురికాకుండా ప్రతిఒక్క కార్యకర్త పార్టీ విజయం కోసం కృషిచే యాలని తెలిపారు. ఎన్టీఆర్ సుజల ధార పథకం ద్వారా గ్రామాలలో మిన రల్ వాటర్ ప్లాంట్లను ఏర్పాటుచేయ టం జరుగుతుందన్నారు.

17వ తేదీ పెదగంజాం హైస్కూల్‌లో మెగా ఉచి త కంటి వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కంటి చూపులో సమస్యలు ఉన్నవారు పేర్లను నమోదు చేయించు కోవాలని కోరారు. గ్రామాల్లోని నాయ కులు ఓటరు జాబితాలను పరిశీలించా లని తెలిపారు. సమావేశంలో బాచిన అమరారావు, సొసైటీ అధ్యక్షుడు పం గులూరి బాపారావు, మాజీ ఏఎంసీ చైర్మన్ కొల్లూరి నాయుడమ్మ, పేర్ని బాపారావు, వై.ప్రసాద్, షేక్ అన్సారీ, గుంజి వెంకట్రావు, లేళ్ల తిరుపతిరా యుడు, గ్రామాల నాయకులు, కార్య కర్తలు, ముస్లిం, మైనార్టీ నాయకులు, అభిమానులు పాల్గొన్నారు.

స్థానిక ఎన్నికల్లో గెలుపు టీడీపీదే

యద్దనపూడి : రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను గెలిపించుకు నేందుకు కార్యకర్తలందరూ ఐక్యంగా కృషి చేయాలని పర్చూరు నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి ఏలూరి సాంబశివరా వు పిలుపునిచ్చారు. బుధవారం యద్ద నపూడిలోని గోనుగుంట అప్పయ్య ఇంటి వద్ద మండల పార్టీ అధ్యక్షుడు రంగయ్యచౌదరి అధ్యక్షతన కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సాంబశివరావు మాట్లాడుతూ రాష్ట్రం లో విద్యుత్ సంక్షోభం వల్ల రైతులు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నార న్నారు.

రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ సర్ చార్జిల పేరుతో పేద ప్రజలపై అధిక భారం మోపుతుందని విమర్శించారు. మండలంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని,సాగర్ కాల్వ ద్వారా చెరువుకు నీరు నింపి తాగునీటి సమ స్య లేకుండా ప్రజా ప్రతినిధులు, అధి కారులు చొరవ తీసుకోవాలన్నారు. ముందు గా గన్నవరంలో ముస్లిం పీర్ల చావిడిని పరిశీలించారు. ధూళిపాళ్ల రామస్వామి, కొల్లా సాంబశివరావుల ను పరామర్శించారు.

ఈ సమావేశం లో టీడీపీ నాయకులు కనపర్తి నాగేశ్వ రరావు, కోడె రామారావు, గోనుగుం ట్ల పెద్దబ్బాయి, నాగేశ్వరరావు, పెద్ద బాబు, పేరయ్య, కామేశ్వరరావు, ఈ దర రవి, రాము, కిరణ్, పోపూరి శ్రీను, ఆదినారాయణ పాల్గొన్నారు.

ప్రజలసై భారం మోపుతున్న ప్రభుత్వాలు

కలెక్టరేట్ : బాబ్లీ ప్రాజెక్టు విషయం లో నిర్లక్ష్యం వహించిన కాంగ్రెస్ సర్కారును అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో టీ డీపీ ఎమ్మెల్యేలందరం కలిసి నిలదీస్తామని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే మండవ వెంకటేశ్వర్‌రావు అన్నారు. బా బ్లీ ప్రాజెక్టుపై సుప్రీం కోర్టులో రివ్యూ పి టిషన్ వేయాలని డిమాండ్ చేస్తూ మం గళవారం టీడీపీ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ముందు మహాధర్నా ని ర్వహించారు. మండవ మాట్లాడుతూ బాబ్లీ ప్రాజెక్టు పనులు జరుగుతుంటే మన రాష్ట్రానికి చెందిన ఓ పశువులు కా సే రైతు చూసి మన రాష్ట్రానికి అన్యా యం జరుగుతోందని కలిగిన ఆలోచన రాష్ట్ర ప్రభుత్వానికి ఎందుకు కలుగలేదన్నారు. ఈ దారుణానికి దివంగత ము ఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డే కారణమన్నారు. నీళ్ల కోసం కొట్లాడే ధైర్యం లే కనే కాంగ్రెస్ మహారాష్ట్ర ప్రభుత్వానికి తలవంచిందన్నారు. 2.74 టీఎంసీల నీ రును వాడుకునే ఉద్దేశం మహారాష్ట్ర ప్ర భుత్వానికి లేదని, మొత్తం నీరును దో చుకుంటుందని, అక్రమంగా నిర్మిస్తున్న 12 ప్రాజెక్టులతో రాబోయే టీఎంసీల నీ టిని వాడుకుంటారని ఇది వాస్తవమన్నారు.

ఒక పక్క కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షు డు బొత్స సత్యనారాయణ బాబ్లీతో రా ష్ట్రానికి అన్యాయం జరిగిందని నేరుగా ఆవేదన వ్యక్తం చేస్తే మీకేమైందని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రభుత్వం కళ్లు తె రిచి బాబ్లీ నష్టాన్ని నివారించే వరకు టీ డీపీ పోరాడుతుందన్నారు. శివరాత్రి రో జు కూడా కరెంట్, నీరు లేక దారుణ ప రిస్థితి ఎదుర్కొవాల్సి వచ్చిందన్నారు. జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్‌షిండే మా ట్లాడుతూ బాబ్లీ విషయంలో బలమైన న్యాయవాదిని రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకోలేదన్నారు. ప్రభుత్వ వైఖరితో రైతుల నోట్లో మట్టి కొట్టిందని, తెలంగాణకు తీ రని అన్యాయం జరిగిందన్నారు. ఆరు నెలల తర్వాత వచ్చే ఎన్నికల్లో టీడీపీ అ ధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చే శారు. ఎమ్మెల్సీలు అరికెల నర్సారెడ్డి, వీ జీగౌడ్ మాట్లాడుతూ మహారాష్ట్ర ప్రభుత్వానికి సీఎం అండగా ఉన్నాడని, ఈ నిర్వాకం వల్లే రాష్ట్రానికి ఈ పరిస్థితి దా పురించిందన్నారు.

తెలంగాణ విషయ లో కేసీఆర్, ఎంపీ మధుయాష్కీ, మ త్రి సుదర్శన్‌రెడ్డి జరుగుతున్న అన్యాయాన్ని ఉద్యమ సమయంలో వెల్లడించారన్నారు. బాబ్లీ ప్రాజెక్టు నిర్మాణం కా రణంగా జిల్లాలో అన్ని వ్యవసాయ భూముల పంటలు బీడు భూములుగా మారనున్నాయన్నారు. నిజాంసాగర్ ప్రాజెక్టు ఎండిపోతుందని, బాబ్లీ లాంటి అక్రమ ప్రాజెక్టులను కూల్చివేస్తే కానీ తె లంగాణకు నీరు రాదన్నారు. కార్యక్రమ ంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి మదన్‌మోహన్‌రావు, దినేష్‌కుమార్, అమర్‌నాథ్‌బాబు, మోహన్‌రెడ్డి, సునీత దేశాయి, బద్యానాయక్, విజయ్‌కుమార్, రామాగౌడ్, జిల్లా అధికార ప్రతినిధి నరేందర్‌గౌడ్, అంబదాస్‌రావు పాల్గొన్నారు.

అసెంబ్లీలో కాంగ్రెస్‌ను నిలదీస్తాం

కవాడిగూడ:: వ్యాట్‌ను రద్దు చేసేవరకూ వస్త్ర వ్యాపారులకు టీడీపీ అండగా ఉంటుందని నగర అధ్యక్షుడు తలసాని శ్రీనివాస్‌యాదవ్, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి హామీ ఇచ్చారు. అసెంబ్లీ ముట్టడికి పిలుపునిస్తే టీడీపీ మద్దతు ఇస్తుందని అన్నారు. వ్యాట్‌ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ఫెడరేషన్ ఆఫ్ టెక్స్‌టైల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇందిరాపార్క్ వద్ద చేపట్టిన రిలే నిరాహార దీక్షలు బుధవారానికి ఐదో రోజుకు చేరాయి. చంద్రమోహన్‌రెడ్డి, తలసాని, టీడీపీ నగర ప్రధాన కార్యదర్శి ఎమ్మెన్ శ్రీనివాస్‌రావు, సింగిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డిలు దీక్షలో పాల్గొని మద్దతు ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న అన్ని రాష్ట్రాలలో వస్త్రాలపై వ్యాట్ వి«ధించడం లేదని, మన రాష్ట్రంలో ఎందుకు విధిస్తున్నారని ఆయన ప్రశ్నించారు. మీ సమస్యలను అసెంబ్లీలో చర్చించి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

తలసాని మాట్లాడుతూ, వస్త్ర వ్యాపారులు అసెంబ్లీ ముట్టడికి సిద్ధమైతే ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి దిగివచ్చి వ్యాట్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటిస్తారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నగరం ఉగ్రవాదులకు అడ్డాగా మారిందని అన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగిస్తున్న సమయంలో ఏ టీవీలో చూసినా ఎమ్మెల్యేలు కనిపించడం లేదని... చుట్టూ పోలీసులే కనిపిస్తున్నారని అన్నారు.

ఆంధ్రప్రదేశ్ ఫెడరేషన్ ఆఫ్ టెక్స్‌టైల్ అసోసియేషన్ అధ్యక్షుడు అమ్మనబోలు ప్రకాశ్, జంటనగరాల కోఆర్డినేటర్స్ మహేంద్ర ప్రసాద్ అగర్వాల్, చీర సత్యనారాయణ, ఉపాధ్యక్షుడు సంతోష్ చౌకాని, కమిటీ సభ్యుడు పత్తిపాక సంజయ్ మాట్లాడుతూ, వ్యాట్‌ను ఎత్తివేసే వరకు పోరాటం చేస్తామన్నారు. దీక్షల్లో టైక్స్‌టైల్ వ్యాపారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.

వస్త్ర వ్యాపారులకు టీడీపీ అండ

హైదరాబాద్ : అసెంబ్లీలో సీఎం కిరణ్‌కుమార్ రెడ్డిని కలిసేందుకు వచ్చిన టీడీపీ ఎమ్మెల్సీ పొగాకు యాదగిరి సీఎం కార్యాలయంలో తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. వెంటనే ఆయనను అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు.

టీడీపీ ఎమ్మెల్సీ పొగాకు యాదగిరికి అస్వస్థత

హైదరాబాద్ : కేసీఆర్ బ్లాక్‌మెయిల్ రాజకీయాలకు భయపడేది లేదని టీడీపీ నేత రేవంత్‌రెడ్డి తెలిపారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ నిజంగా ప్రభుత్వాన్ని పడగొట్టే ఉద్దేశమే ఉంటే టీఆర్ఎస్, వైసీపీ పార్టీలు రెండూ వేర్వేరుగా నోటీసులు ఎందుకు ఇచ్చారని ప్రశ్నించారు. ఢిల్లీలో కాళ్ల బేరాలు చేసేవారు తమను విమర్శిస్తారా అని ఆయన మండిపడ్డారు. ఎన్టీఆర్ ఆత్మఘోష గురించి మాట్లాడుతున్న టీఆర్ఎస్, 2004 లో కాంగ్రెస్‌తో ఎందుకు పొత్తు పెట్టుకుందని రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు.

కేసీఆర్ బ్లాక్‌మెయిల్ రాజకీయాలకు తలొగ్గం : రేవంత్‌రెడ్డి