March 13, 2013

ఏలూరు ,పాలకొల్లు : బహుదూరపు బాటసారి చంద్రబాబు ' నేను నీతి తప్పను అని ఒట్టేశారు. నీతి, నిజాయితీలకు కట్టుబడతానని స్పష్టం చేశారు. ప్రజల కష్టాలు తుడిచేందుకు శారీరక కష్టాలు లెక్కచేయనని ప్రకటించారు. కాంగ్రెస్‌పై తుదివరకు పోరాడతానంటూ ప్రజల ముందు భరోసా ఇచ్చారు. చీకటి రాజకీయాలను గమనించండి అంటూ ప్రజలను చైతన్యపరిచారు. 'వస్తున్నా.. మీకోసం' యాత్రలో భాగంగా ఆయన బుధవారం 163వ రోజైన బుధవారం 12 కిలో మీటర్ల మేర పాదయాత్ర చేశారు. జనం మధ్య ఆయన యాత్ర ఉత్సాహంగా సాగింది. గడిచిన నాలుగు రోజుల కంటే ఐదవ రోజు అయిన బుధవారం ఆయన బహిరంగ సభల్లో ప్రత్యర్థి పార్టీలపై స్వరం పెంచి మాట్లాడారు. ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానంపై నేను సహకరించాలా, వద్దా అంటూ పాలకొల్లులో కీలక ప్రశ్నను ప్రజల ముందుంచి కొత్తదనం చూపించారు.

వద్దువద్దూ అంటూ జనం నుంచి వచ్చిన సమాధానం రాబట్టడం ద్వారా తన మార్గం సరైందే అన్నట్లుగా నేరుగానే బహిర్గతం చేశారు. పూలపల్లి, రైల్వేస్టేషన్ సెంటర్, ఎన్‌టీఆర్ సెంటర్ ఆయన టీఆర్ఎస్‌పైనా, తల్లి కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్‌లపై నిప్పులు చెరిగారు. ఆ పార్టీల తీరుపై మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీ జోలికి వస్తే మాడి మసైపోతారంటూ హెచ్చరించారు. ప్రధాన సమస్యలను ప్రస్తావించారు. ఒకప్పటి గోదావరి తీరం ఎంత హాయిగా ఉండేది, ఇప్పుడెంత కలుషితంగా మారిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మునపటి మాదిరిగానే గోదావరి తీరంను బంగారం చేస్తానని, రైతులకు అండగా ఉంటానని రైతులకు ధైర్యాన్ని ఇచ్చారు. కాలువలు కలుషితమయ్యాయి. తాగడానికి నీరు లేకుండా పోయింది, ఇదేమి పాలనా అంటూ కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు. కరెంటు కష్టాలన్నీ తొలగాలంటే అది తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. మేము ఏదైనా అనుకుంటే అది పూర్తయ్యేంత వరకు వదిలిపెట్టమని తమ ధోరణిని ప్రజలకు వివరించే ప్రయ త్నం చేశారు.

శాంతిభద్రతలు దెబ్బతిన్నాయని, ఆడపిల్లలకు రక్షణ లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. విజ్జేశ్వరం నుంచి సాగునీటి పథకాలు అమలుకు భారీ ఖర్చు చేసినా రైతులకు ఏమి ఒరగబెట్టలేకపోయారని దుయ్యబట్టారు. గోదావరి గట్టు ఆధునీకరణ పనులు ఏమైయ్యాయంటూ నిలదీశారు. నరసాపురం బ్యాంకు కెనాల్ పరిస్థితి అధ్వానంగా ఉంది, కాలువలు ఆధునీకరణ అన్నారు దాని సంగతి ఏమైందని నిగ్గతీశారు. అంతకుముందు పార్టీ కార్యకర్తల సమావేశంలో కూడా తాను వరుసగా తన నియోజకవర్గంలో ఎలా గెలుపొందుతూ వచ్చానో వివరించే ప్రయత్నం చేశారు. ఆరు నెలలకో, సంవత్సరానికో ఒకసారి నా నియోజకవర్గానికి వెళతాను.. కాని అక్కడ నా కార్యకర్తలంతా నిత్యం కష్టపడతారు. ప్రజలతో ఉంటారు. నాకు ఎంత మెజార్టీ ఇస్తారో ముందుగానే లెక్క చూపెడతారు. సరిగ్గా ఒక వెయ్యి అటో ఇటో మెజార్టీ మాత్రం ఖాయం అంతలా అక్కడ కష్టపడుతున్నారు. మీరు కూడా అలాగే కష్టపడితే మనకు 294 స్థానాలు మనవేనంటూ కార్యకర్తలకు ఉత్సాహాన్ని నూరుపోశారు.

అలాగే ఉద్యోగులను తమతో కలిసి రావాల్సిందిగా పిలుపునిచ్చారు. 5వ రోజు తన పర్యటనలో ఎక్కువగా ప్రజా సమస్యలతో రాజకీయ పరిణామాలపైనే ఎక్కువగా దృష్టిపెట్టారు. కరెంటు సమస్యలను ప్రస్తావించడంతో పాటు కరెంటు లేని లోటు పేద వర్గాలను కూడా కంటిమీద కునుకు లేకుండా చేస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. చంద్రబాబును బుధవారం ఎమ్మెల్సీ శమంతక మణి, మాజీ స్పీకర్ సూర్యనారాయణరాజు కలుసుకున్నారు.

నీతి తప్పను!- చంద్రబాబు

పాలకొల్లు, నరసాపురం నియోజకవర్గాల కార్యకర్తలతో గురువారం ఉదయం కవిటం వద్ద బాబు భేటీ కానున్నారు. ఆ మేరకు ఈ రెండు నియోజకవర్గాల కార్యకర్తలను హాజరు కావాల్సిందిగా కోరారు.

నేడు నరసాపురం, పాలకొల్లు సమీక్ష


పాలకొల్లు  : స్థానిక ఎన్టీఆర్ ఘాట్‌వద్ద బుధవారం రాత్రి జరిగిన బహిరంగ సభలో చంద్రబాబు తన ప్రసంగం అనంతరం సభికులకు మైకు ఇచ్చి సమస్యలు అడిగారు. దీనిపై సభికుల నుంచి విశేష స్పందన వచ్చింది. ఒక యువకుడు మాట్లాడుతూ పాలకొల్లు పట్టణంలో కొందరు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ప్రభుత్వ భూములను అమ్మి సొమ్ము చేసుకుంటున్నారని ఆరోపించాడు. దీనిపై బాబు తీవ్రంగా స్పందిస్తూ ఈ విషయం నిజమేనా... అని సభికులుని ప్రశ్నిస్తూ చేతులు ఎత్తమని సూచించారు. పెద్ద ఎత్తున చేతులు ఎత్తడంతో బాబు మాట్లాడుతూ పిచ్చి పిచ్చి పనులు చేస్తే క్షమించేది లేదని, తప్పు డు పనులకు సహకరిస్తే అధికారులకు సైతం పనిష్‌మెంట్ ఉంటుందని హెచ్చరించారు.

ఒక ఆటోవాలా మాట్లాడుతూ డ్రైవింగ్ లైసెన్స్ పొందడానికి 10వ తరగతి విద్యార్హత అడగడంతో ఆటో డ్రైవర్లకు లైసెన్స్‌లు రావడంలేదని చెప్పడంతో బాబు స్పంది స్తూ విద్య అంతగా అబ్బని యువకులే ఆటో డ్రైవింగ్ వంటి వృత్తుల్లోకి వస్తారని లైసెన్స్‌లు మంజూరు సులభతరం చేయడానికి ప్రయత్నిస్తామని హామీ ఇచ్చారు.

భవానీ అనే మహిళ మాట్లాడుతూ ఎకరం పొలం ఉంటే రూ. 10 వేలు ఆదాయం రావడంలేదని తీసుకున్న రుణాలు చెల్లించలేకపోతున్నామని, బ్యాంక్ అధికారులు తమ ఫోటోలను పత్రికలకు ఇస్తామని హె చ్చరిస్తున్నారని, అయితే లక్షల కోట్లు అవినీతి పరులను, బ్యాంక్‌లలో రుణా లు తీసుకొని కోట్లు ఎగవేస్తున్న వారిని పట్టించుకోవడంలేదని ఆమె వాపోయారు. దీనిపై బాబు స్పందిస్తు తా ము అధికారంలోకి వస్తే రైతుల కష్టా లు తీరుస్తామన్నారు.

స్వర్ణకార వృత్తికి చెందిన ఒక వ్యక్తి మాట్లాడుతూ తమకు ప్రభుత్వం నుంచి ఏ విధమైన సహకారం అందడంలేదన్నారు. బాబు బదులిస్తూ మంగళ సూత్రాలు తయారుచేసే పవిత్ర కార్యక్రమాన్ని స్వర్ణకారులు నిర్వహిస్తారని, అటువంటి వారిపై నేటి కాంగ్రెస్ పాలనలో దొంగ బంగారం కేసులు బనాయిస్తూ ఇబ్బందులు పెడుతున్నారని స్వర్ణకారులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. నాయీ బ్రాహ్మణులు, విశ్వబ్రాహ్మణులు ఇంకా పలు సామాజిక వర్గాలకు ఆరాధ్య దైవమైన వీరబ్రహ్మేంద్రస్వామిని కించపరుస్తూ ఒక వ్యక్తి పిహెచ్‌డి చేస్తే దానికి ఆమోద ముద్ర వేశారని ఈ అంశాన్ని తాము ఖండిస్తున్నామని బాబు అన్నారు. ఆయా సామాజిక వర్గాల మనోభావాలను కించపరచవద్దని హెచ్చరించారు.

పిచ్చి పిచ్చి పనులు చేస్తే క్షమించేది లేదు


ఏలూరు: క్షీరపురిలో 'చంద్రుడు' వెలిగిపోయాడు. మ హిళలు హారతులు పట్టారు. పిల్లలు చెంగుచెంగు నా పాదయాత్ర వెంట పరుగులు తీశారు. వృద్ధులు రక్షణ వలయాన్ని ఛేదించుకుని ఆయనకు చేరువయ్యారు.చల్లంగా ఉండాలంటూ నిండుమనసుతో దీవెనులు ఇచ్చారు. సమస్యలు తీర్చ ండి బాబూ అంటూ బాధితులు. మీరు సీఎం కావాలంటూ అప్యాయతతో మరికొందరు స్వా గతం పలికారు. 'వస్తున్నా..మీ కోసం'..యాత్రలో 163 వ రోజైన బుధవారం ఆయన పాలకొల్లు సమీపా న ఉన్న పూలపల్లి నుంచి కవిటం వరకు మ ధ్యాహ్నం వేళ పాదయాత్రకు ఉపక్రమించారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు పార్టీ పెద్దలతో టెలికాన్ఫరెన్సు, జిల్లాలో ఉండి, భీమవరం నియోజకవర్గాల సమీక్షలతో క్షణం తీరిక లేకు ండా బిజీబిజీగా గడిపిన ఆయన ఆ తర్వాత మ ధ్యాహ్నం నుంచి పాదయాత్రకు సిద్ధమయ్యారు.

తొలి అడుగులోనే మాకు గుక్కెడు మంచినీళ్ళు దొరకడం లేదంటూ వందలాదిమంది మహిళలు ఖాళీ బిందెలతో ఆయనకు ఎదురేగారు. దీనిపై స్పందించిన ఆయన మంచి రోజులు వస్తాయి, ఇక ఊరూవాడా ఎన్‌టీఆర్ సురక్ష జల పథకం క్రింద సమృద్ధిగా మంచినీరందిస్తామంటూ మహిళలకు భరోసా ఇస్తూ ముందుకు సాగారు. అక్కడ నుంచి ప్రారంభమైన యాత్ర దారిపొడవునా వందలాది మంది ఆయనతో జతకలిశారు.

పూలపల్లి దగ్గర నుంచి రైల్వే స్టేషన్ వరకు మా ర్గం జనంతో కిటకిటలాడింది.బహుదూరపు బాటసారికి ఎదురేగి స్వాగతం పలికారు. చిన్నారులతో కలిసి వచ్చిన మహిళలు ఆయనకు మంగళహారతులిచ్చారు.తమ సమస్యలను చెప్పుకున్నారు. కరెంటు కోతలు, గ్యాస్ కొరత, తాగునీటి సమస్యలను ఏకరువు పెట్టారు. మీరొస్తేనే కష్టాలు కడతీరతాయంటూ గోడు వెల్లబోసుకున్నారు.

నిరుద్యోగులు.. మీరే మాకు దిక్కంటూ ఆయనకు మొరపెట్టుకున్నారు.దారిపొడవునా ఉన్న దుకాణాలను సందర్శించారు. వారి కష్ట, నష్టాలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఎంత పెట్టుబడి పెట్టారు, ఆదాయం ఎంత వస్తుందంటూ ఆరా తీస్తూనే వాళ్ళ నుంచి వచ్చిన సమాధానం విన్న తర్వాత నాతో కలిసిరండి కష్టాలు తొలగిపోతాయంటూ భరోసా ఇచ్చారు. రైల్వే స్టేషన్ రోడ్డు దగ్గర నుంచి ఎన్‌టి ఆర్ విగ్రహం వరకు వందలాది మంది ఆయనను అనుసరించారు. కాబో యే సీఎం అంటూ జైజై ధ్వానాలు చేశారు. పూల వర్షం కురిపించారు. డప్పులు వాయిస్తూ యువకులు నృత్యాలు వేశారు. వారితో నాయకులు జత కలిశారు. పాలకొల్లు పట్టణం అయితే జనసంద్రం అయ్యింది. ఎన్‌టి ఆర్ విగ్రహం వద్ద వేలాదిమంది గుడిగూడి ఆయన ప్రసంగాన్ని ఆసక్తిగా విన్నారు. పాలకొల్లు దగ్గర నుంచి కవిటం వరకు ఇదే తరహాలో అన్ని చోట్ల భారీ ఎత్తున బాబు రాక కోసం పొద్దుపోయేంత వరకు ఎదురు చూ స్తూనే ఉన్నారు.

ఒక వైపు కాలు సహకరించకపోయినా కాస్తంత వేగంగానే ఆయన తన పాదయాత్రను కొనసాగించారు.ఈ యాత్రలో మా గంటి బాబు, సీతారామలక్ష్మీ, రామానాయుడు, గాదిరాజు బాబు,అంగర రామ్మోహన్, డాక్టర్ బా బ్జి,పీతల సుజాత, శివరామరాజు, పాలి ప్రసాద్, జయరాజు, పాందువ్వ శ్రీను ఉన్నారు.

క్షీరపురిలో 'చంద్ర' శోభ

జీవితం గడుస్తోందా...
పూలపల్లిలో వెల్డింగ్, మెకానిక్ చేసే షాపుల్లోకి చంద్రబాబు వెళ్ళారు. వెల్డింగ్ పరికరాలను పరిశీలించారు. వె ల్డింగ్ వృతిపై ఆదాయం ఎంత వస్తుందని అడిగారు. ఇక్కడ ఆదాయం నీ కుటుంబానికి సరిపోతుందా అని ప్ర శ్నించారు. ఒక్క వెల్డింగ్ మాత్రమే కాకుండా వివిధ రకాల పనులు చేస్తేగానీ గడవటం లేదని చెప్పారు.

టైలరింగ్‌తో ఆదాయం ఎలా ఉంది...

పూలపల్లిలో ఓ టైలరింగ్ షాపులోకి చంద్రబాబు వెళ్ళా రు. టైలరింగ్ వృత్తిలో ఆదాయం ఎలా ఉందని అడిగారు. అంతగా ఆదాయం ఉండడం లేదని, రెడీమేడ్ వల్ల వృత్తి బాలేదంటూ వాపోయాడు. ఇటువంటి వృత్తిదారుల సంక్షేమానికి కృషి చేస్తానని చంద్రబాబు చెప్పారు.

శనక్కాయల వ్యాపారికి రూ.2వేల నజరానా...

పూలపల్లి గ్రామంలో బుట్టలో శనక్కాయలు అమ్ముతున్న చిరువ్యాపారితో చంద్రబాబు మాట్లాడారు. బుట్ట తీసుకుని ఎలా అమ్ముతున్నావంటూ ప్రశ్నించారు. తనది భీమవరం దగ్గరి బలుసుమూడని, తన పేరు వెంకటేశ్వరరావు అని, ఎంత కష్టపడ్డా జీవనం గడవడం లేదని వా పోయాడు. తాను అధికారంలోకి రాగానే చిన్నవ్యాపారుల కు సహకారం అందిస్తానం టూ చంద్రబాబు ఆ చిరు వ్యా పారికి రూ.2వేల నజరానా అందజేశారు.

18 నెలలైనా పరిహారం లేదు సార్...

పూలపల్లికి చెందిన గుబ్బల గోపాలం అనే గీతకార్మికుడు చంద్రబాబుకు కార్మికుల కష్టాలను వివరించారు. త న సోదరుడు 18 నెలల క్రితం చెట్టుపై నుంచి పడిపోయాడని, ఇంత వరకూ ప్రభుత్వం పరిహారం ఇవ్వలేదని, ఏ సాయం అందలేదని వాపోయారు. పలువురు కార్మికులు రైతులు, పింఛన్ సమస్యలను వివరించారు.

వివేకానంద వేషధారిణి 'వర్షిణి'కి ఆశీర్వచనాలు..

చంద్రబాబు నాయుడు పాదయాత్రలో భాగంగా ప ట్టణ తెలుగు యువత కార్యదర్శి అప్పారి నాగరాజు కు మార్తె సంగీత వర్షిణి వివేకానంద స్వామి వేషధారణతో చంద్రబాబుకు స్వాగతం పలుకగా.. బాబు ఆబాలికను ఎత్తుకుని ఆశీర్వదించారు.ఈసందర్భంగా చంద్రబాబుకు ప లువురు చిన్నారులు అమృత వర్షిణి, కళ్యాణి, కనకదుర్గ పుష్పగుచ్ఛాలతో స్వాగతం పలికారు.

నిత్యావసర వస్తువుల ధరలెలా ఉన్నాయ్...

నిత్యావసర వస్తువుల ధరలు ఎందుకుపెరిగిపోతున్నాయి, గ్యాస్, కూరగాయల ధరలు చుక్కలనంటుతున్నాయి, ఈపరిస్థితి ఎందుకు దాపురించిందని తెలుగుదే శం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మహిళలను ప్ర శ్నించారు. గత తమ పాలనకు ప్రస్తుత కాంగ్రెస్‌పాలనను ఉన్న వ్యత్యాసాన్ని తెలుసుకోవాలని కోరారు.

'చంద్రుని' జోరు

ఏలూరు : 'మనకు బలమైన కార్యకర్తలున్నారు. పని చేసే గుణం కూడా ఉంది. అయినా అవినీతిని తిప్పికొడుతూనే నాయకులుగా ఎదగాలి. మనకు ఇప్పు డు తిరుగులేదు. రాష్ట్రంలో మీర ంతా కష్టపడి పని చేస్తే 294 స్థ్ధానాలను మనమే గెలుచుకుంటాం..'' అని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ధీమా వ్యక్తం చేశారు. మన పార్టీకి తగినంత మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.తొమ్మిదేళ్ళు అధికారంలోనూ, మరో తొమ్మిదేళ్ళు ప్రతిపక్షంలో ఉ న్నాం. అయినా మన పార్టీకి తగినన్ని నిధులు లేవు..కానీ మిగతా పార్టీలు మాత్రం అవినీతితో విరాళాల పేరిట తెగ పోగేసుకున్నాయని చంద్రబాబు అన్నారు. అవినీతిపై పోరాడే వాళ్ళకి ప్రజల మద్దతు ఉంటుందని ఆ దిశగానే కార్యకర్తలు, నాయకులు ఎదగాలని పిలుపునిచ్చారు.

పాలకొల్లు మం డలం పూలపల్లిలో బుధవారం ఉండి, భీమవరం నియోజకవర్గాల కార్యకర్తలతో ఆయన భేటీ అయ్యారు. వారి కష్టాలను అడిగి తెలుసుకున్నారు. పార్టీ మరింత పటిష్టం కావాలంటే మీ సలహాలు, సూచనలు అవసరమని, అప్పు డే పార్టీ మరింత ధృడంగా ఉంటుందని అన్నారు. ఒకటి, రెండు సీట్లు ఉన్న పార్టీలు కూడా పేపర్లు, టీవీలు పెట్టుకున్నాయని మన పార్టీకి మాత్రం అలాంటివి లేవన్నారు.పేపర్లు,టీవీలు పెట్టుకోవాల్సిన అవసరం కూడా మ నకు లేదన్నారు. ప్రజల దీవెనలే మన పార్టీ గెలుపునకు కారణమవుతాయన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షురాలిగా సీతారామలక్ష్ష్మి పార్టీ కోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారని అభినందించారు. మిగతా నియోజకవర్గాల్లో కూడా కార్యకర్తలు, పార్టీని అధికారంలోకి తీసుకువచ్చే దిశగా పోరాడాలని, కష్టించి పనిచేయాలని పిలుపునిచ్చా రు. పార్టీ కోసం నిర్విరామంగా పని చేస్తూ ప్రాణాలు కోల్పోయిన వారు, ఆస్తులు తెగనమ్ముకున్న త్యాగశీలులు ఉన్నారన్నారు. మీరు అనుకుంటే ఏ దైనా చేయగలరు.

అందుకే మీరు కష్టపడి పనిచేస్తే రాష్ట్రంలో అన్ని స్థ్ధానాలను మనమే గెలుచుకుంటామని అన్నారు.ఉండి నియోజకవర్గ ఎమ్మెల్యే శివరామరాజు,గాదిరాజు బాబు, సీతారామలక్ష్మీలతో సహా పలువురు నేతలు ఇలాగే కష్టపడుతున్నారని వారిని ఆదర్శంగా తీసుకోవాలన్నారు.పార్టీ నుంచి రాష్ట్రంలో 16మంది ఎమ్మెల్యేలు బయటకు వెళ్ళిపోయారని, అయితే వీరి స్థ్ధానంలో వందమందిని తయారు చేసే శక్తి టీడీపీకే ఉందన్నారు. ఆ తర్వాత ఉండి, భీమవరం నియోజకవర్గాలకు చెందిన కార్యకర్తల నుంచి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు.

మీకోసం ఏదైనా చేస్తాం కార్యకర్తలు

'పార్టీ కోసం తుది రక్తం బొట్టు వరకు పని చేస్తాం.. భీమవరంలో తోట సీతారామలక్ష్మీ, గాదిరాజు బాబు, మెంటే పద్మనాభంలలో ఎవరినో ఒకరిని అభ్యర్థిగా ప్రకటించండి. ఇప్పుడున్న గందరగోళం తొలగుతుంది, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బాబ్జీని నరసాపురం ఎంపిీగా నిలబెట్టండి అని భీమవరం నేత కొట్టు సత్యనారాయణ (బాబు) విజ్ఞప్తి చేశారు.అయితే నాయకుల పేర్లు చెప్పి మాట్లాడొద్దంటూ ఆయనను చంద్రబాబు సముదాయించారు. బీసీల కోసం మీరు చేస్తున్న సేవలు, ఇస్తున్న ప్రాధాన్యం అద్భు తం.. ఈ పార్టీ బీసీలదే, మిమ్మల్ని చూసి ఎంతో నేర్చుకున్నాం అని కార్యకర్త కడలి నెహ్రూ అన్నారు. ఇప్పుడు రాజకీయాల్లో డబ్బుకే ప్రాధాన్యం పెరిగింది. ఇలాంటి రాజకీయాలను ఇకముందు తరిమికొడతాం అని మరో కార్యకర్త మావుళ్ళయ్య అన్నారు. అధికారంలోకి వస్తే లక్ష రూపాయలతో ఇల్లు కట్టిస్తామన్నారు, దీనిని లక్షన్నరకు పెంచాలని ఉండి నియోజకవర్గ కార్యకర్త సాయికృష్ణ సూచించారు. మిమ్మల్ని సిీఎం చేస్తాం, పార్టీ కోసం కష్టపడతామని ఇంకొక కార్యకర్త కోనా నాగేశ్వరరావు అన్నారు.

డ్వాక్రా సం ఘాల పరిస్థ్ధిితి అధ్వాన్నంగా ఉందని, వీరిని ఆదుకోవాల్సి ఉందని వెంకటేశ్వరరావు అనే టీడీపీ నాయకుడు సూచించారు. పార్టీలో పరిస్థ్ధిితిని చక్కదిద్దడం ద్వారా మరింత ప్రోత్సాహాన్ని ఇవ్వాలని ఆకివీడుకు చెందిన గణపతి కోరారు. ఇప్పుడు రాష్ట్రంలో దొంగలు పడ్డారని, వీరిని తరిమికొట్టి బాబును సీఎంగా గెలిపిస్తేనే మనబిడ్డల భవిష్యత్‌కు మంచి జరుగుతుందని భీమవరం నేత వేగి మాధవరావు పేర్కొన్నారు.

మనకు తిరుగులేదు- చంద్రబాబు

పాలకొల్లు : దేశంలో ఎక్కడ అవినీతి జరిగినా, బాంబు దాడులు జరిగినా రాష్ట్ర రాజధాని హైదారాబాద్ పాత్ర ఎంతో కొంత కన్పిస్తుందని, ఇం దులో వైఎస్సార్ కుటుంబీకుల ప్రమే యం సైతం ఉంటుందని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. వస్తున్నా మీకోసం కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు పాల కొల్లు కెనాల్ రోడ్డులోని ఎన్టీఆర్ ఘాట్ ప్రసంగించారు. బుధవారం రాత్రి 7.20 ని. లకు ప్రారంభమైన ప్రసంగం సుమారు 60 నిమిషాలు కొనసాగింది. రాష్ట్రంలో ప్రజల కష్టాలు తీరాలంటే కాంగ్రెస్‌పార్టీని భూస్థాపితం చేయడం ఒక్కటే మార్గమని చంద్రబాబు పిలుపునిచ్చా రు. నేను మీ అందరి కోసం గత 170 రోజులుగా పాదయాత్ర నిర్వహిస్తున్నానని ఇప్పటికి 2,350 కిలోమీటర్లు నడిచానని మీరందరూ కలిసి వస్తేనే అవినీతిపై పోరాటం సాధ్యమవుతుందన్నారు.

ఎన్టీఆర్ సారధ్యం వహించిన హిందుపూర్‌లో ప్రారంభమైన తన పాదయాత్ర నేటికి పాలకొల్లులోని ఎన్టీఆర్ విగ్రహం వద్దకు వచ్చిందన్నారు. జిల్లాలో తన పర్యటన ఇప్పటికి 5వ రోజుకు చేరుకొందని, ప్రతీ ప్రాంతంలో పాదయాత్రకు పెద్ద ఎత్తున హాజరవుతున్న ప్రజలను గమనిస్తే ప్రభుత్వంపై ఎంతటి వ్యతిరేకతను కనబరుస్తున్నారో తెలుస్తుంద న్నారు. 2004 తర్వాత కాంగ్రెస్ హయాంలో వైఎస్సార్ రాష్ట్రాన్ని దో చేస్తూ విద్యుత్ కష్టాలతో పాటు లక్షలకోట్లు అప్పులు చూపించారని దుయ్యబట్టారు. ప్రస్తుత ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కిరికిరిలు పెడుతూ అవినీతిని పెంచుతున్నారన్నారు. అవినీతి పాపం పిల్ల కాంగ్రెస్‌దేనని దుయ్యబట్టారు. రాష్ట్రంలో నేడు మద్యం ఏరులై పారుతుందని, ఒక్క సెల్ మెస్సెజ్ ఇస్తే మద్యం ఇంటికే అందుతుందని తాగడానికి గుక్కెడు నీళ్ళు లభ్యం కావడం లేదని విమర్శించారు. ఒకప్పటి బీహార్ పరిస్థితి ఇప్పుడు మనరాష్ట్రానికి దాపరించిందన్నారు.

తాము 9 సంవత్సరాల పాలనలో నిప్పులా బతికామని తమ హయాం లో పనిచేసిన నాయకులు, అధికారులు ఇప్పుడు హాయిగా ఉన్నారని, వైఎస్సార్ పాలనలో పనిచేసిన నాయకులు, అధికారుల్లో పలువురు చంచల్‌గూడా జైలులో ఊచలు లెక్కబెడుతున్నారన్నారు. ప్రజలలో చైతన్యం రావడం ద్వారానే రాష్ట్రంలో సుపరిపాలన సాధ్యమవుతుందని, టీడీపీ అధికారంలోకి వస్తే అన్ని వర్గాల ప్రజల సమస్యలను పరిష్కరించడమే కాకుండా అవినీతిని అరికడతామని హామీ ఇచ్చారు

కాంగ్రెస్‌ను భూస్థాపితం చేయండి. కష్టాలు తీరుతాయి

హైదరాబాద్ : గవర్నర్ ప్రసంగించిన చాంబర్‌లో 144 సెక్షన్ విధించినట్లుగా ఉందని, ఎమ్మెల్యేల కంటే పోలీసులే ఎక్కువగా కనిపించారని టీడీపీ శాసనమండలిపక్షనేత దాడి వీరభద్రరావు అన్నారు. గవర్నర్ ప్రసంగం చిన్న పిల్లల మాటల్లా ఉందని, ఇది అబద్ధాల ప్రసంగం కాబట్టే తాము బహిష్కరించామని, వాకౌట్ చేస్తుంటే కూడా పోలీసులు అడ్డుపడ్డారని చెప్పారు. గవర్నర్ ప్రసంగం అబద్ధాల పుట్ట అని, వాస్తవాలకు విరుద్ధంగా ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ధ్వజమెత్తారు. 2007లో వైఎస్ హయాంలో చెప్పిన విషయాలే ఇప్పుడూ ఉన్నాయని ఎద్దేవా చేశారు. విద్యుత్తు సంక్షోభంతో ప్రజలు అల్లాడుతుంటే గవర్నర్ తన ప్రసంగంలో కనీసం ఆ అంశాన్ని స్పృశించకపోవడం దుర్మార్గమని యెండల లక్ష్మీనారాయణ విమర్శించారు.

మొండివాడినని చెప్పుకొంటున్న సీఎం.. ప్రజాసమస్యల పరిష్కారంలో ఆ మొండితనాన్ని చూపించాలి తప్ప అణచివేయడంలో కాదని టీఆర్ఎస్ శాసనసభాపక్ష నేత ఈటెల రాజేందర్ చెప్పారు. కాంగ్రెస్, వైసీపీలను తల్లి, పిల్ల కాంగ్రెస్ అంటున్న చంద్రబాబుది ఏ కాంగ్రెస్ అని మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రశ్నించారు. గవర్నర్ ప్రసంగం నిస్సారంగా, హాస్యాస్పదంగా ఉందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి రాఘవులు విమర్శించారు. వరుస కుంభకోణాలు, కరెంటు కోతలు, ఎఫ్ఎస్ఏ, మూత్రపిండాల అమ్మకాలు, రైతుల ఆత్మహత్యలు తదితర అంశాలను ప్రస్తావించలేదని విమర్శించారు.

గవర్నర్ ప్రసంగం ఏమాత్రం గమ్యం లేనిదని సీపీఎం శాసనసభాపక్ష నేత జూలకంటి రంగారెడ్డి విమర్శించారు. ప్రభుత్వం రాసిచ్చిందే గవర్నర్ చదివారని, ప్రజాసమస్యల పరిష్కారానికి ఎటువంటి దిక్సూచి లేదని సీపీఐ శాసనసభాపక్ష నేత గుండా మల్లేష్ మండిపడ్డారు. గవర్నర్ ప్రసంగంలో తెలంగాణ ప్రస్తావన లేకపోవడం దారుణం, విచారకరమని తెలంగాణ నగారా సమితి అధ్యక్షుడు నాగం జనార్దన్ రెడ్డి అన్నారు. గవర్నర్ ప్రసంగం కాంగ్రెస్ కార్యకర్త ప్రసంగంలా ఉందని వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి విమర్శించారు.

2009 నాటి ప్రసంగానికి నకలుగా ప్రసంగం ఉందని వైసీపీ నేత కొణతాల రామకృష్ణ అన్నారు. గవర్నర్‌పైకి కాగితాలను విసిరేయడం దుస్సంప్రదాయమని కాంగ్రెస్ ఎమ్మెల్సీగా ఎన్నికైన పొంగులేటి సుధాకర్‌రెడ్డి విమర్శించారు. కాగా, రాష్ట్రంలో అన్ని ప్రాంతాల ప్రజలు కరెంటు కోతతో అల్లాడుతుంటే జగన్ ఉన్న చంచల్‌గూడ జైలులో మాత్రం ఒక్క నిమషం కూడా కోత లేదని, సీఎం కిరణ్‌కు ప్రభు భక్తికి ఇదే నిదర్శనమని టీడీపీ ఎమ్మెల్యేలు దేవినేని ఉమా మహేశ్వరరావు, శ్రీరాం తాతయ్య, తంగిరాల ప్రభాకర్‌రావు, ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్రప్రసాద్ విలేకరులతో అన్నారు.

ఎమ్మెల్యేల కంటే పోలీసులే ఎక్కువ: టీడీపీ

నలుగురూ బాగుండాలని ప్రార్థించే గొంతుకలవి. పది కాలాలపాటు సుఖశాంతుల్తో వర్ధిల్లాలని ఆశీర్వదించే చేతులవి. లోకకల్యాణం కోరుకునే మంచి మనస్సు వారిది. ఏ శుభకార్యం జరిగినా ఇంట్లో అతిథులు వాళ్లు. అలాంటివారికి కష్టమొచ్చింది. వాళ్ల వృత్తికే కాదు.. ఉనికికే ఆపద ముంచుకొచ్చింది. ఆశీస్సులు అందించిన చేతులతోనే ఇప్పుడు ఆదుకోవాలని కోరుతున్న బ్రాహ్మణ ప్రతినిధులను చూస్తే బాధనిపించింది. పాలకొల్లు సెంటర్‌లో వారంతా నన్ను కలిశారు. ఎలా బతికిన వారు ఎలాగయిపోయారు! అగ్రవర్ణాల్లో పేదల దుస్థితికి నిదర్శనంగా కనిపించారు. దీపానికీ నోచుకోని దేవాలయాలు ఎన్నో.. గుడి కింద భూములన్నీ కబ్జాదారుల చేతుల్లోకి వెళ్లిపోయాయి. మరి గుడిని, ఆ అరకొర గుడి మాన్యాన్ని నమ్ముకొని బతుకుతున్న వారి గతి ఏమి కావాలి?

అభిమానానికి హద్దులు లేవంటారు. విదేశాల నుంచి తరలివచ్చిన ఈ యువకులను చూస్తే..అది నిజమేననిపించింది. సంపన్న జీవితాలు గడుపుతూ ఎక్కడో విలాసంగా జీవించే ఈ కుర్రాళ్లు..నా కోసం ఇంత దూరం వచ్చారు. కష్టంలో ఉన్న ప్రజల కోసం నేను నడు స్తుండగా, నా కోసం వీళ్లు ముందుకు రావడం ముచ్చటేసింది. నడిచినంత సేపూ రాష్ట్ర పరిస్థితులపై పదేపదే ఆవేదన వెలిబుచ్చారు. "అప్పట్లో మీరు తీసుకున్న విధానాలే మాకిప్పుడు బంగారు బాటలుగా మారాయి సార్.. ఆ రోజు మీరు మా గురించి పట్టించుకోకపోతే ఎదుగూబొదుగూ లేకుండా పడి ఉండేవాళ్లం. ఈ అవకాశం మాతోనే ఆగిపోరాదు. మరికొందరు సోదరులూ పైకి రావాలి. మంచి ఉద్యోగాలు పొంది ప్రపంచవ్యాప్తంగా రాష్ట్రానికి గౌరవం పెంచాలి. దానికోసం మీరు మళ్లీ అధికారంలోకి రావాలి'' అని వాళ్లు చెబుతుంటే.. ఈ రాష్ట్ర యువత కలలు నా కళ్ల ముందు కదలాడాయి.

ఆశీర్వదించిన చేతులకు ఆపదా..!

ఏలూరు : అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం దశ, దిశ లేనిదని చంద్రబాబు అభివర్ణించారు. అసలు ఆ ప్రసంగంలో ఏం చేస్తారో, ఏం చేయబోతున్నారో చెప్పలేకపోయారని.. ప్రభుత్వం చేతకానితనానికి ఇదే నిదర్శనమని, సీఎం కిరణ్‌కు అనుభవం లేదని మరోసారి గవర్నర్ ప్రసంగం ద్వారా ధ్రువపడిందని అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా పాదయాత్రలో ఉన్న ఆయన పూలపల్లిలో విలేకరులతో మాట్లాడారు.

ప్రసంగంలో పేర్కొన్న అంశాలకు విరుద్ధమైన అనుభవాలు బయట ఉన్నాయని చంద్రబాబు చెప్పారు. రాజీవ్ యువకిరణాల ద్వారా ఉద్యోగాలు రాలేదు గానీ ఉన్న 10 లక్షల ఉద్యోగాలు కరెంటు లేక ఊడాయని ఆవేదన వ్యక్తం చేశారు. మిల్క్‌మిషన్ కాస్తా మిల్క్ కమీషన్‌గా మారిందని, పశుక్రాంతి పశుభ్రాంతిగా మిగిలిందని ఎద్దేవా చేశారు. వీటన్నింటికీ కిరణ్ సర్కార్ అసమర్థతే కారణమని బాబు విమర్శించారు.

ఆ ప్రసంగం దారుణం: చంద్రబాబు

'తోక'లు పట్టుకుని వేలాడం
టీడీపీకి ఆ ఖర్మ పట్టలేదు
ఎప్పుడేం చేయాలో మాకు తెలుసు

ఏలూరు : "తోక పార్టీలను పట్టుకుని వేలాడే ఖర్మ మాకు పట్టలేదు. వాళ్లేదో అంటే మేము వాళ్ల వెంట వెళ్లాలా? టీఆర్ఎస్, వైసీపీలవి చీకటి రాజకీయాలు. ఎప్పుడేం చేయాలో మాకు తెలుసు. వీళ్లకు మేం సమాధానం చెప్పాల్సిన పనిలేదు'' అని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. కాంగ్రెస్ సర్కారుపై టీఆర్ఎస్ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి.. తమను మద్దతు కోరడంపైన, వైసీపీ వ్యవహారాలపైన ఆయన తీవ్రంగా మండిపడ్డారు. ఆ తోక పార్టీలను పట్టుకుని వెళ్తే కుక్కతోక పట్టుకుని గోదారి ఈదినట్టే ఉంటుందని ఆక్షేపించారు.

పశ్చిమగోదావరి జిల్లాలో 'వస్తున్నా.. మీ కోసం' యాత్రలో భాగంగా పాలకొల్లు మండలం పూలపల్లిలో బస చేసిన ఆయన బుధవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎవరు ఏదైనా ప్రతిపాదించొచ్చు గానీ.. నీతి, నిజాయితీ ఉండాలని, అవిశ్వాసం పేరు పెట్టి సూట్‌కేసులతో ఎమ్మెల్యేలను కొనాలనుకునే ప్రయత్నానికి మేం మద్దతివ్వాలా అంటూ ప్రశ్నించారు. 'టీఆర్ఎస్‌కి, వైసీపీకి ఎన్ని సీట్లు ఉన్నాయి? టీఆర్ఎస్‌ది బ్లాక్‌మెయిల్. అలాంటి నీతిమాలిన రాజకీయాలకు మా పార్టీ దూరం' అని చంద్రబాబు అన్నారు.

"ప్రభుత్వాన్ని కాపాడాల్సిన అవసరం మాకేముంది? మాపార్టీ వారికి ఏమైనా లెసెన్సులు ఇప్పించుకోవాలా, వీళ్ల మాదిరిగా దోచుకు తినాలా, ఇదేదీ మాకు అవసరం లేదు. ఉంటే, గింటే బెయిల్ కోసం వైసీపీ, బ్లాక్ మెయిల్ కోసం టీఆర్ఎస్‌లే ఆ పని చేయాలి'' అని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే విషయమై పార్టీ నేతలు మోత్కుపల్లి నర్సింహులు, ముద్దు కృష్ణమ నాయుడు, అశోక్ గజపతిరాజు హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడారు.

టీఆర్ఎస్, వైసీపీలు రాజకీయ వ్యభిచారులని, ఈ తోడుదొంగలిద్దరూ ఇప్పుడు కుమ్మక్కయ్యారని, వాటిని నమ్మి అవి పెట్టే అవిశ్వాసాలకు తాము మద్దతు ఇచ్చేది లేదని స్పష్టం చేశారు. 'ఆ రెండు పార్టీలు కాంగ్రెస్‌లో విలీనం కావడం ఖాయం. ఆ పార్టీలను నమ్మి మేం వాటికి మద్దతిచ్చే ప్రశ్నే లేద'ని మోత్కుపల్లి అన్నారు. స్థానిక ఎన్నికల్లోనూ ఓడిపోతామని భయపడి దాన్ని అడ్డుకోడానికి టీఆర్ఎస్, వైసీపీలు అవిశ్వాసం నాటకం ఆడుతున్నాయని ముద్దుకృష్ణమ అన్నారు. తగిన సమయంలో మా నిర్ణయం మేం తీసుకొంటామని అశోక్ గజపతిరాజు పేర్కొన్నారు.

బెయిల్ కోసం ఒకరు.. బ్లాక్‌మెయిల్ కోసం మరొకరు

ఐదు రోజులే పని!
వాళ్ల మాటే వింటా
పశ్చిమ యాత్రలో చంద్రబాబు వ్యాఖ్య
అది టీఆర్ఎస్ కాదు.. సూట్‌కేసు పార్టీ
సంఘీభావంగా నడిచిన ఎన్ఆర్ఐలు

 ఉద్యోగులకు టీడీపీ వ్యతిరేకం కాదని ఆ పార్టీ అధినేత చంద్రబాబు అన్నారు. అనడమే కాదు.. అధికారంలోకి వస్తే వారానికి ఐదు రోజులు పని దినాలు ఉండేలా నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు. ఆరోగ్య పథకాల నుంచి ఇళ్ల స్థలాల దాకా, ప్రతి విషయంలోనూ ఉద్యోగుల మాట ప్రకారమే పోతానని హామీ ఇచ్చారు. బుధవారం పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు మండలం పూలపల్లి వద్ద ఆయన పాదయాత్ర ప్రారంభించారు. పాలకొల్లు, ఉల్లంపర్రు, జిన్నూరు, మట్టపర్రు ఎక్స్‌రోడ్, వేడంగి మీదుగా నడిచి.. కవిటం క్రాస్‌వద్ద బస చేశారు. అంతకుముందు.. ప్రజలను కలుసుకుంటూ ఉత్సాహంగా ముందుకు సాగారు. వైండింగ్ షాపులోకి వెళ్లి కష్టాలు ఆరా తీశారు.

పూలకొట్టు దగ్గరకెళ్లి.. "మీ జీవితాలు మల్లెపూలు ఉన్నంత తెల్లగా ఉన్నాయా'' అని ఓ మహిళను పలకరించారు. యాత్రకు సంఘీభావంగా రక్తదానం చేసిన రైతులను శిబిరానికి వెళ్లి అభినందించారు. పాదయాత్రకు మద్దతుగా కొంతమంది ఎన్నారైలు చంద్రబాబుతో కలిసి కొద్ది దూరం నడవడం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఈ ప్రవాసాం««ద్రుల బృందంలో పీవీవీ రామరాజు (అఫ్ఘానిస్థాన్), కెనడా ఎన్ఆర్ఐ వింగ్ నాయకుడు కొడాలి నవీన్ చౌదరిసహా 10 మంది ఉన్నారు. అనంతరం పాలకొల్లు సభలో ఆయన మాట్లాడారు. అవినీతి రాష్ట్రాన్ని గాడిన పెట్టేందుకు ఉద్యోగులు కలిసి రావాలంటూ ఉత్సాహపరిచారు. అన్ని విధాలా అండగా ఉంటానని ప్రకటించారు.

ఉద్యోగవర్గాల సమస్యలను ఏకరువు పెట్టారు. 'ఉద్యోగులుగా మీరెంతో కష్టపడుతున్నా పేరూ పెంపు లేదు. ఆర్టీసీ ఉద్యోగుల నుంచి, గ్రామసహాయకుల దాకా అంతా కష్టాల్లో ఉన్నారు. కాంట్రాక్టు ఉద్యోగుల పరిస్థితి మరింత దారుణం. అధికారంలోకి వచ్చిన వెంటనే మీ సమస్యలు పరిష్కరిస్తా' అని భరోసా ఇచ్చారు. రాబోయే రోజుల్లో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నానని వెల్లడించారు. 'అవిశ్వాసం' అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఆయన ప్రయత్నించారు. టీఆర్ఎస్ పెట్టే అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇవ్వరాదని ఇప్పటికే టీడీపీ నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో.. " అవిశ్వాసానికి మద్దతు ఇవ్వాలా'' అని పాలకొల్లు సభావేదిక నుంచి ప్రజలను కోరగా, వారంతా "వద్దు.. వద్దు'' అని నినదించారు.

"రాష్ట్రంలో సూట్ కేసు రాజకీయాలకు, లాలూచీ రాజకీయాలకు తెరదించాలి. ఈప్రయత్నంలో ప్రజలంతా నాకు సహకరించాలి. ఒకవైపు మా ఎమ్మెల్యేలను కొంటుంటే, మరోవైపు అవిశ్వాసంపై వారికి (వైసీపీ) మేం మద్దతు ఇవ్వాలా? జగన్ జైలులో కూర్చుని మంతనాలు నడుపుతూ రాజకీయాలను భ్రష్టు పట్టిస్తుంటే చూస్తూ ఉరుకోవాలా? బ్లాక్‌మెయిల్ రాజకీయాలు చేసే టీఆర్ఎస్.. అవిశ్వాసం పెడతానంటే మేము సహకరించాలా?' అని మండిపడ్డారు.

టీఆర్ఎస్‌ది బ్లాక్‌మెయిల్ అని, అదో సూట్‌కేసుల పార్టీ అని ఎద్దేవాచేశారు. "ఏ వానకు ఆ గొడుగు పట్టే టీఆర్ఎస్.. మమ్మల్ని వివాదంలోకి లాగే ప్రయత్నం చేస్తోంది. చూస్తూ ఊరుకుందామా?'' అని ప్రశ్నించారు. అవిశ్వాసం పెడితే ప్రజా సమస్యలపై పెడతామే గానీ రహస్య అజెండాలతో కాదని స్పష్టం చేశారు. జగన్ పత్రికపైనా ఆయన నిప్పులు చెరిగారు. పెట్టాలంటే ఇప్పటికే అలాంటివి పది పేపర్లు పెట్టేవాడినని చెప్పుకొచ్చారు. గవర్నర్ ప్రసంగంలో ఎలాంటి పస లేదని ఆక్షేపించారు.

ఇక ఉద్యోగులతోనే నా పయనం

హన్మకొండ : బాబ్లీ ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం మొద్దు నిద్రపోతోందని, తెలంగాణలో ని ఆరు జిల్లాల రైతాంగం భవిష్యత్తు ప్రమాదంలో పడబోతున్నా పట్టింపులేదని తెలుగుదేశం పార్టీ నేతలు తీవ్ర స్థా యిలో ధ్వజమెత్తారు. సుబేదారిలోని రాయల్ ఫంక్షన్‌లో సోమవారం టీడీపీ జిల్లా విస్త­ృత స్థాయి సమావేశం జరిగింది. నేతలు తమ ప్రసంగాల్లో బాబ్లీ, కరెంట్ కోతలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై దుమ్మెత్తి పోశారు. కాంగ్రెస్, టీఆర్ఎస్‌ను ప్రధాన టార్గెట్‌గా చేసుకున్నారు.టీడీపీ జిల్లా అధ్యక్షుడు ఎడబోయిన బస్వారెడ్డి అధ్యక్షతన జరిగిన విస్త­ృత స్థాయి సమావేశంలో ప్రసంగించిన వక్త లు బాబ్లీ వల్ల తెలంగాణాకు తాగునీ రు, సాగునీటి విషయంలో శాశ్వతంగా జరగనున్న అపార నష్టాలను గణాంకాలతో సహా వివరించారు. బాబ్లీకి వ్యతిరేకంగా ఇప్పటికైనా ఉదృత స్థాయిలో ఉ ద్యమం సాగించకపోతే భవిష్యత్‌తరా లు కూడా మనల్ని క్షమించరన్నారు.

గో దావరి నదిపై మహారాష్ట్ర ప్రభుత్వం ని ర్మించిన బాబ్లీతోపాటు మరో 14 ప్రాజెక్టుల గురించి సమాచారాన్ని టీడీపీ ఎ న్నో సార్లు, పలు వేదికలపైనా, సుప్రీం కోర్టులో సైతం సాక్ష్యాలతో సహా అందచేసినప్పటికీ కేంద్రం, రాష్ట్రంలోనే అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఏమాత్రం ప ట్టించుకోలేదన్నారు. స్వార్థ రాజకీయ ప్రయోనాల కోసం ఆ పార్టీతో అంటకాగున్న టీఆర్ఎస్ సైతం దగుల్బాజీ మాటలు మాట్లాడుతోందన్నారు. బాబ్లీకి, కరెంట్ కోతలకు వ్యతిరేకంగా రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళనలను చేపట్టనున్నట్టు ప్రకటించింది.

లోతుగా చర్చసమావేశంలో బాబ్లీ ప్రాజెక్టుపై సుప్రీం కోర్టు తీర్పు పర్యవసానం, రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం, బాబ్లీకి వ్యతిరేకం గా పార్టీ భవిష్యత్తులో చేపట్టనున్న ఆందోళన కార్యక్రమాలపై చర్చించింది. విద్యుత్ సమస్య, కోతలు, చార్జీల పెం పు తదితర అంశాలపై కూడా సమావేశంలో చర్చ జరిగింది. ఇటీవల జరిగిన సహకార సంఘాల ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ అనుసరించిన అప్రజాస్వామిక విధానాలు, తత్ఫలితంగా తెలుగు దేశం పార్టీ ఓటమి, పార్టీపరం గా చోటు చేసుకున్న లోపాలపై కూడా సమావేశం సమీక్షించింది. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, గెలుపునకు కార్యకర్తలు చేయాల్సిన కృషిపై కూడా చర్చించింది.

ఇటీవల మృతి చెందిన టీడీపీ కార్యకర్త అయితా భాస్కర్, వర్ధన్నపేటలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన మరో ఇద్దరు కార్యకర్తలు, హైదరాబాద్ దిల్‌సుఖ్‌నగర్ బాంబు పేలుళ్లలో మృ తి చెందిన వారికి సంతాప సూచికంగా సమావేశం రెండు నిమిషాలు మౌనం పాటించింది. ఈ సమావేశంలో రాజ్యసభ సభ్యురాలు గుండు సుధారాణి, ఎమ్మెల్యేలు సత్యవతి రాథోడ్, సీతక్క, నియోజకవర్గ ఇన్‌చార్జీలు గండ్ర సత్యనారాయణ, చల్లా ధర్మారెడ్డి, టీడీపీ బీసీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుం డు ప్రభాకర్, టీడీపీ జిల్లా మహిళా అ ధ్యక్షురాలు గాడిపెల్లి ప్రేమలతా రెడ్డి, టీడీ ఎల్‌పి కార్యాలయ కార్యదర్శి కేలిక కిషన్ ప్రసాద్, బీసీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గట్టు ప్రసాద్ బాబు, నేతలు పు ల్లూరి ఆశోక్‌కుమార్, మార్గం సారం గం, అనిశెట్టి మురళీ, సంగని మల్లేశ్వర్, పూజారి సుదర్శన్‌గౌడ్, బయ్య స్వామి, గుండు పూర్ణచందర్, షేక్‌బాబా ఖాద ర్ అలీ తదితరులు పాల్గొన్నారు.

బాబ్లీ'పై సర్కారు మొద్దు నిద్ర


లక్కవరపుకోట:వైసీపీ, కాంగ్రెస్‌లు ఒక్కటేనని, టీడీపీ ఎప్పుడో చెప్పిందని ఎస్.కోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి అన్నారు. మంగళవారం ఆమె విలేఖ రులతో మాట్లాడారు. రాహుల్‌గాం«ధీని 2014లో ప్రధానమంత్రిని చేయడానికి మేం పూర్తిగా సహకరిస్తామని, కాంగ్రె స్‌లో విలీనమవుతామని వైసీపీ గౌర వాధ్యక్షురాలు విజయమ్మ వ్యాఖ్యలతో అది తేటతెల్లమయ్యిందన్నారు. గను లు, భూములు, అడ్డగోలుగా కట్టబెట్టి కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని లూ టీ చేసి కొడుకు జగన్మోహన్‌రెడ్డికి ధారాదత్తం చేసి, రాష్ట్రాన్ని అధోగతి పట్టించి న ఘనత రాజశేఖర్‌రెడ్డిదేనన్నారు.

ప్రతిపక్ష పార్టీగా తెలుగుదేశం, కొన్ని ప్రగ తిశీల పత్రికలు అలుపెరగకుండా చేసి న పోరాట ఫలితంగా జగన్ అవినీతి భాగోతం బైటపడి, జైలు పాలయ్యాడ న్నారు. కేంద్ర ప్రభుత్వం తన ప్రభుత్వాన్ని కాపాడుకోడానికి జగన్‌ను శిక్షించకుండా నాటకాలు ఆడుతోందన్నారు. జగన్‌కి శిక్ష పడకుండా ఉండేందుకు వైసీపీ రాష్ట్రపతి ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మద్దతిచ్చిందన్నారు. ఎవరి ప్రయోజనాలకనుగుణంగా వారు ఎత్తులు వేస్తూ కాంగ్రెస్, వైసీపీ ప్రజలను మ భ్యపెడుతున్నరన్నారు.

వైసీపీ నిజస్వరూపం బయటపడింది

గజపతినగరం: వైసీపీ నిజ స్వరూపాన్ని విజయలక్ష్మి బయట పెట్టారని మాజీ మంత్రి పడాల అరుణ అన్నా రు. మంగళవారం ఆమె తన నివాసం లో విలేఖరులతో మాట్లాడుతూ కాంగ్రె స్‌తో వైసీపీ చీకటి ఒప్పందాలను కొనసాగిస్తోందని, టీడీపీ మొదటి నుంచి చెప్తూనే ఉందన్నారు. తమ అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి ఆ పార్టీ రకరకా ల వేషాలు వేస్త్తోందన్నారు. జరుగుతు న్న పరిణామాలను అర్థం చేసుకుని ప్ర జలు వైసీపీని తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. షర్మిళకు పాదయాత్ర చేసే హక్కు ఉందా? అని ప్రశ్నించారు. అ సత్య ప్రచారాలకు షర్మిళ ఓ బాకా అని అన్నారు.

సమావేశంలో పార్టీ నాయకు లు సామంతుల పైడిరాజు, మండల పైడిరాజు, మజ్జి గోవింద, నక్కల రా మినాయుడు, మజ్జి రామునాయుడు తదితరులు పాల్గొన్నారు.

కాంగ్రెస్, వైసీపీ విష వృక్షపు కొమ్మలే


పార్వతీపురంటౌన్: కాంగ్రెస్, వైసీ పీ ఒకే విష వృక్షానికి చెందిన కొమ్మలే నని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షు డు ద్వారపురెడ్డిజగదీష్ అన్నారు. మం గళవారం ఆయన పార్టీ కార్యాలయం లో విలేఖరులతో మాట్లాడారు. ఎన్ని కల ముందు ఏ పార్టీతో పొత్తు పెట్టుకో మని ప్రగల్భాలు పలికిన వైసీపీ నేడు కాంగ్రెస్‌కు మద్దతు ఇస్తామని చెప్పడం సిగ్గు చేటన్నారు. జైల్‌లో ఉండి పిల్ల కాంగ్రెస్, జైలు బయట తల్లి కాంగ్రెస్ విలీనం కోసం ఉవ్విళ్లూరుతున్నాయ న్నారు.

ప్రజల పక్షాన, ప్రజలకు అం డగా నిలబడి పనిచేసేది ఒక్క తెలుగు దేశం పార్టీయేనన్నారు. అధికారం కో సం ఆ రెండు పార్టీలు ఎంతకైనా తెగి స్తాయని ప్రజలు గమనిస్తున్నారన్నా రు. వైఎస్సార్ మరణం కాంగ్రెస్ కుట్ర అని పలికిన విజయమ్మ అదే కాంగ్రెస్ కు ఎలా మద్దతు ఇస్తామని చెపుతున్నా రన్నారు.

కార్యక్రమంలో టీడీపీ నాయకులు గొట్టాపు వెంకటనాయుడు, బొబ్బిలి చి రంజీవులు, మిరియాల ప్రకాష్ రావు, దేవకోటి వెంకటనాయుడు, చిన్ను తది తరులు ఉన్నారు.

కాంగ్రెస్, వైసీపీ క్కటే


మాజీ మంత్రి కిమిడి   కవిటి: రెండు పార్టీల ప్రయోజనాల కోసమే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలంటున్నాయని తెలుగుదేశం నేత, మా జీ మంత్రి కె.కళావెంకటరావు అన్నారు. మంగళవారం కవిటి వచ్చిన ఆయన మాట్లాడుతూ, వైసీపీ స్వలాభానికి, టీ ఆర్ఎస్ సెంటిమెంటు కోసమే అవిశ్వా సం అంటున్నాయే తప్ప, ప్రజల కష్టాలు కోసం కాదని విమర్శించారు. అవిశ్వాసాన్ని సాకుగా చూపించి జగన్ అండ్ కంపెనీ అవినీతి నుంచి తప్పించుకొనేందుకే యత్నిస్తుందన్నారు. కాంగ్రెస్ అనే విషవృక్షంలో భాగమే వైసీపీ అని దుయ్యబట్టారు.

ఈ రెండు పార్టీల రహస్య ఒప్పందం మేరకే జైలుకు వెళ్లకుండా అడ్డుకునేందుకు క్యాబినెట్ తీర్మానాలు చేస్తున్నారే తప్ప, ప్రజల సంక్షేమానికి పాటుపడింది శూన్యమని పేర్కొన్నారు. లక్షల కోట్లు బడ్జెట్‌తో అభివృద్ధి సంక్షేమం అని కాంగ్రెస్ చెప్పటమే తప్ప విద్యుత్ ప్రాజెక్టులకు ఇవ్వాల్సిన వాటా ధనం అందించలేని దుస్థితిలో ఉందన్నారు. తెలుగుదేశం పార్టీ పేదల అభ్యున్నతి కోసం పోరాటం చేసి, వారి పక్షాన నిలుస్తుందన్నారు. ధరలు పెరిగి సామాన్యులు ఇబ్బందులు పడుతున్నా కాంగ్రెస్, వైఎస్ఆర్ సీపీలకు పట్టడంలేదన్నారు. ఈ సందర్భంగా జిల్లా కోప్సన్ మాజీ సభ్యులు సందానంద్ రౌళో, బీ జయప్రకాష్‌లను పరామర్శించారు. సమావేశంలో టీడీపీ నాయకులు పి.కృష్ణారావు, బి.ప్రకాష్, పీఎం తిలక్, ఎస్.వెంకటరమణ, డి.శ్రీనివాసరావు, పార్టీ మండలాధ్యక్షుడు మణిచంద్ర ప్రకాష్, బి.చిన్నబాబు పాల్గొన్నారు.

అసలు రంగు బయటపడింది

కంచిలి: తల్లి పార్టీ కాంగ్రెస్‌లోనే పిల్ల పార్టీ వైసీపీని విలీనం చేయడానికి ఆ పార్టీ అధ్యక్షురాలు విజయమ్మ పరోక్షంగా అంగీకరించారని మాజీ మంత్రి కిమిడి కళావెంకటరావు అన్నారు. మంగళవారం కంచిలిలో విలేఖరులతో మాట్లాడారు. కాంగ్రెస్‌లో వైసీపీ విలీనం కావడం తధ్యమన్నారు. విజయమ్మ ప్రకటనతో జగన్ పార్టీ అసలు రంగు బయటపడిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం జలయజ్ఞం పేరిట రూ.90 కోట్లు మంజూరు చేసి, తొమ్మిది కోట్ల రూపాయల మట్టి కూడా తీయలేదన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న కాంగ్రెస్ పార్టీకి ప్రజలు గుణపాఠం చెప్పేరోజు దగ్గర్లోనే ఉందన్నారు. ఈ సమావేశంలో టీడీపీ నాయకులు బి.కామేష్‌రెడ్డి, జగదీష్ పట్నాయిక్, పీఏసీఎస్ అధ్యక్షుడు తమరాల శోభన్‌బాబు, ఎం.రామారావు తదితరులు పాల్గొన్నారు.

పార్టీల ప్రయోజనం కోసమే అవిశ్వాసం

నందిగామ: జగన్‌ను జైలు నుంచి విడుదల చేయించుకునేందుకు పార్టీని కాంగ్రెస్‌లో కలిపేందుకు విజయలక్ష్మి సిద్ధమయ్యారని టీడీపీ జిల్లా అధ్యక్షుడు, మైలవరం శాసనసభ్యుడు దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు. మంగళవారం స్థానిక పార్టీ కార్యాలయంలో శాసనసభ్యుడు తంగిరాల ప్రభాకరరావుతో కలిసి విలేకరులతో మాట్లాడారు.అవినీతి సొమ్ముతో అధికారం చెలాయించాలనుకున్న పార్టీలకు ప్రజలు బుద్ధ్ది చెప్పడం ప్రారంభించారని తల్లి, పిల్ల కాంగ్రెస్‌లు ఆడుతున్న నాటకాలను ప్రజలు గమనిస్తున్నారని వారిద్దరికి బుద్ధి చెప్పే రోజులు దగ్గర పడ్డాయన్నారు.

కర్నాటకలో బీఎస్ఆర్ పార్టీకి పట్టిన గతే మన రాష్ట్రంలో వైసీపీకి పడుతుందన్నారు. విద్యుత్, తాగునీరు, గిట్టుబాటు ధరలపై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తామని చెప్పారు. శాసనసభ్యుడు తంగిరాల ప్రభాకరరావు మాట్లాడుతూ అధికార పార్టీ నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గి ఓటర్ల జాబితాలో అవకతవకలకు పాల్పడితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందని అధికారులను హెచ్చరించారు.

అసెంబ్లీ సమావేశాలను అరకొరగా నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోందని, ప్రజా సమస్యల పరిష్కారంపై వారికి చిత్తశుద్ధి లేదని విమర్శించారు. సాగర్ నీటిని విడుదల చేసి గ్రామాలలో చెరువులు నింపి మంచినీటి కొరత ఏర్పడకుండా చూడాలని ఆయన డిమాండ్ చేశారు.

జగన్‌ను విడిపించేందుకే విలీనం

కడప, కోటిరెడ్డిసర్కిల్: పదవుల కోసం పిల్ల కాంగ్రెస్ ఆశపడుతుండ గా అధికారం కోసం తల్లి కాంగ్రెస్ ఆరాట పడుతోందంటూ తెలుగుదే శం పార్టీ నేతలు ఎద్దేవా చేశారు. మాజీ ఎమ్మెల్సీ ఎం.వెంకటశివారెడ్డి నివాసంలో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో తెలుగుదేశం పార్టీ నేతలు గోవర్ధన్‌రెడ్డి, వెంకటశివారెడ్డి, సుబాన్‌బాష, సుగవాశి హరీంద్రనాధ్ మాట్లాడుతూ మాట తప్పం మడమతిప్పం, ఢిల్లీకి కడప గడపకు పోటీ, యూపీఏ సర్కారు తీరు ఎమర్జెన్సీ రోజులను తలపిస్తోందంటూ ప్రగల్భాలు పలికిన వైకాపా నేతలు ఇప్పడు యూపీఏతో పొత్తు పెట్టుకునేందుకు ఉవ్విళ్ళూరుతున్నారన్నారు.

జైల్లో ఉండి పిల్ల కాంగ్రెస్, బయట ఉండి తల్లి కాంగ్రెస్ విలీనం కోసం రాజకీయ నాటకం ఆడుతున్నాయన్నారు. వైకాపా నేతల జుట్టు సోనియా చేతిలో ఆమె గుట్టు వీరి గుప్పెట్లో ఉంచుకుని ఒకరి నొకరు బ్లాక్ మెయిలింగ్ చేసుకుంటూ ప్రజలను వంచిస్తున్నారన్నారు. అధికార దుర్వినియోగం, అవినీతి, ఆర్థిక నేరాలకు పాల్పడి న వైకాపా వారి మీద కేంద్రం చర్యలు తీసుకోకపోవడం మ్యాచ్ ఫిక్సింగ్ కాదా అని ప్రశ్నించారు.

కాంగ్రెస్‌లో విలీనానికి, పొత్తులకు సిద్దమంటూ జైలుకె ళ్ళక ముందు జగన్, ఇప్పుడు వైఎస్ విజయమ్మలు ఇంగ్లీషు పత్రికలకు ఇంటర్వ్యూలు ఇచ్చి సోనియాకు సంకేతాలు పంపించారన్నారు. ఇందులో భాగంగా సీబీఐకి జగన్ కేసులో దర్యాప్తునకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదన్నారు. వివరాల కోసం నెలలో 15 సార్లు విజ్ఞప్తి చేశామని సీబీఐ న్యాయవాది హై కోర్టుకు కూడా తెలిపారన్నారు. అక్రమాస్తుల కేసులో జగన్‌ను కాపాడేందుకు సీఎం ఉత్సాహం చూపుతున్నారన్నారు.

అధికారం కోసం తల్లి,పిల్ల కాంగ్రెస్‌ల ఆగ్రహం

చిత్తూరు టౌన్: జైల్లో వున్న పిల్ల కాంగ్రెస్, జైలు బయట వున్న తల్లి కాంగ్రెస్ పార్టీలు వీలీనం కోసం ఆరాటపడుతున్నాయి, ఈ రెండు పార్టీలు ఎప్పటికైనా కలిసేవేనని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి దొరబాబు అన్నారు. మంగళవారం స్థానిక జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల ముందు ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోము... మతతత్వ పార్టీలకు మేము మద్దతు ఇవ్వం... భవిష్యత్తులో మేము కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని యూపీఏకి లేదా థర్డ్ ఫ్రంట్‌కు మద్దతిస్తామని, ప్రభుత్వంతో చేరి కీలక మంత్రి పదవులు తీసుకుంటామంటూ సాక్షాత్తు వైసీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయలక్ష్మి అన్న మాటలివి అన్నారు. మాట తప్పం... మడమ తిప్పం... ఢిల్లీకి - కడప గడపకు పోటీ అంటూ ప్రగల్భాలు పలికి ఇప్పుడు ఆ పార్టీతో పొత్తు పెట్టుకోవడానికి వైసీపీ నేతలు ఉవ్విళ్ళూరుతున్నారని విమర్శించారు.

సోనియాగాంధీ చేతిలో కీలుబొమ్మగా వున్న విజయలక్ష్మి తరచూ తన ప్రసంగంలో కాంగ్రెస్, టీడీపీ పార్టీలు ప్రజలను మోసం చేస్తున్నాయని చెప్పడం విడ్డూరంగా వుందన్నారు. ఇటీవల తొమ్మిది మంది ఎమ్మెల్యేలను బహిష్కరించినట్లు గొప్పలు చెప్పిన పీసీసీ చీఫ్ బొత్సా పబ్బం హరిపై ఎందుకు మాట్లాడటం లేదని ఆయన ప్రశ్నించారు. జగన్‌కు బెయిల్ ఇవ్వాలంటే కాంగ్రెస్‌లోకి వైసీపీ విలీనం కావాలని కాంగ్రెస్ పెద్దలు షరతులు పెట్టిన దానికి తలొగ్గిన విజయమ్మ ఇకపై టీడీపీ గురించి దుష్ప్రచారాలు చేయడాన్ని మానుకోవాలని హెచ్చరించారు. ఈ సమావేశంలో టీడీపీ నేతలు నాని, బాలాజి నాయుడు, ఇందిర, విల్వనాధం, సురేష్, కృష్ణమూర్తి, శశికర్ బాబు, వెంకటేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

తల్లి కాంగ్రెస్,పిల్ల కాంగ్రెస్‌లు నాటకాలాడుతున్నాయి

వి.కోట: పల్లెపల్లెకు తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా ఎంఎం కుంట గ్రామానికెళ్లిన టీడీపీ నాయకులకు గ్రామస్థులు పలు సమస్యలను ఏకరువు పెట్టారు. తాగడానికి నీరు, రాత్రివేళ వీధిదీపాలు లేకుండా చీకట్లో గడుపుతుంటే తమ సమస్యలెవరికీ పట్టడం లేదని వారు వాపోయారు. దీంతో తాము అధికారంలో లేమని ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రజాసమస్యలు పట్టించుకోవడంలేదని అందుకే సమస్యల అ«ధ్యయనం కోసం తాము ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు మాజీ మంత్రి పట్నంసుబ్బయ్య వివరించారు. మంగళవారం మండల పరిధిలోని యాలకల్లు, ముదరందొడ్డి, ఓగు పంచాయతీల పరిధిలో పల్లెపల్లెకు తెలుగుదేశం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎర్రిగానేపల్లె, తిమ్మరాజుపురం గ్రామాల్లో కాంగ్రెస్, వైసీపీ నుంచి సుమారు 20 కుటుంబాల వారు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. టీడీపీ నాయకులు వారికి పూలమాలతో సత్కరించి పార్టీ కండువా వేసి ఆహ్వానించారు.

చంద్రబాబు నాయకత్వంతోనే అభివృద్ధి సాధ్యమని రానున్న ఎన్నికల్లో అభ్యర్థులెవరైనా గెలుపే ధ్యేయంగా పని చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు రామచంద్రనాయుడు, రంగనాథ్, సోము, సుభాష్‌చంద్ర బోస్, రత్నప్ప, చౌడప్ప, సింగిల్ విండో అధ్యక్షుడు నాగప్ప, చక్రపాణినాయుడు, ఉపాధ్యక్షులు సురేష్, స్థానిక నాయకులు శంకర, రవి, నాగరాజు, రాజారెడ్డి, విజయసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

పల్లెపల్లెకు టీడీపీలో వెల్లువెత్తిన వినతులు

పామిడి: తెలుగుదేశం పార్టీకి పూ ర్వ వైభవం తీసుకురావాలని మండల నాయకులకు పొలిట్ బ్యూరో సభ్యు డు కాల్వ శ్రీనివాసులు పిలుపునిచ్చా రు. స్థానిక షాదీఖానాలో మైనార్టీ నా యకుడు డి. ఫకృద్ధీన్ వివాహానికి కా ల్వతో పాటు టీడీపీ మైనార్టీ జిల్లా అ ధ్యక్షుడు నదీం హాజరయ్యారు. వధూవరులను ఆశీర్వదించారు. అనంతరం మండల నాయకులతో కాల్వ మాట్లాడుతూ... స్థానిక ఎన్నికలకు సన్నద్ధమవ్వాలన్నారు.

పార్టీ ఫిరాయింపులు షురూ..!

ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో మండలంలో పలువురు పార్టీ ఫిరాయించారు. ఇదే కోవలోనే మిడుతూరు రామచంద్ర ఉన్నారా? అని మంగళవారం షాదీఖానాలో పలువు రు చర్చించుకున్నారు. మైనార్టీ నాయకుడి వివాహానికి టీడీపీ నాయకులతో పాటు పలువురు కాంగ్రెస్ నేతలు హా జరయ్యారు. కాల్వతో మిడుతూరు రా మచంద్ర మాట్లాడారు. టీడీపీ నాయకులతో ఫొటోలకు ఫోజులిచ్చారు. దీంతో పార్టీ ఫిరాయిస్తున్నారా... అన్న చర్చ మొదలైంది.

ఈ విషయమై ఆ యనను అడగ్గా.. అలాంటిదేమీ లే దంటూ తోసిపుచ్చారు. మాజీ ప్రజాప్రతినిధి కావడంతో పరిచయం ఉండటంతో మాట్లాడానని తెలిపారు. కార్యక్రమంలో మండల కన్వీనర్ కత్రిమల ప్రభాకర్‌చౌదరి, నాయకులు పాళ్యం నారాయణస్వామి, టైలర్ భాస్కర్, సంజీవకుమార్, రామాంజనేయులు, లంగాల గౌస్, కరూరు శివశంకర్, హుస్సేన్‌పీరా, మోహన్ కృష్ణ, శ్రీనివాసులు, సునీల్, జాఫర్, శ్రీ రాములు, సుంకప్ప, షేక్షావలి పాల్గొన్నారు.

టీడీపీకి పైర్వవైభవం తీసుకురావాలి: కాల్వ

ఆదిలాబాద్‌టౌన్: ఎట్టకేలకు తెలుగుదేశం పార్టీ జిల్లా కమీటీని అధ్యక్షులు, బోథ్ శాసనసభ్యుడు గోడం నగేష్ మంగళవారం విడుదల చేశారు. జిల్లా కమిటీని అధ్యక్షుడితోపాటు 158 మందితో కూర్పు చేశారు. జిల్లా అధ్యక్షుడిగా నగేస్ ఉండగా ఇద్దరిని ప్రధాన కార్యదర్శులు గతంలోనే ప్రకటించిన విషయం తెలిసిందే. జిల్లాకు చెందిన సీనియర్ నాయకులు లోలం శ్యాంసుందర్, అబ్దుల్ కలాం ఇప్పటికే ప్రధాన కార్యదర్శులుగా ఎన్నుకున్నారు.

కాగా తాజాగా ఉపాధ్యక్షులు, సంయుక్త కార్యదర్శులు, ప్రచార కార్యదర్శులు, కోశాధికారి, అధికార ప్రతినిధులు మొత్తం 159 మందితో జిల్లా కమిటీని అధికారికంగా ప్రకటించారు. పార్టీని బలోపేతం చేసేందుకే కమిటీని ఎన్నుకున్నట్లు టీడీపీ వర్గాలు తెలిపాయి.

ఉపాధ్యక్షులు వీరే...

తెలుగుదేశం పార్టీ జిల్లా కమిటీలో గణపురం ప్రకాష్, ఘన్‌శ్యాం ముండా, అత్రం భగవంత్‌రావు, ఎస్.రామేశ్వర్‌రెడ్డి, బి.లక్ష్మినారాయణ, మొహినొద్ధీన్, సిహెచ్.నాగభూషణం, జె.శ్రీనివాస్, కొప్పుల లచ్చన్న, శనిగరపు చిన్నయ్య, జీఆర్.కుర్మే, వి.మోహన్, రైసాబాను, ఎం.రామేశ్వర్‌గౌడ్, ప్రసాద్‌గౌడ్, ప్రేమ్‌నాథ్‌రెడ్డి, గోక గణేష్‌రెడ్డి ఉపాధ్యక్షులుగా ఎన్నికయ్యారు. వీరితో పాటు 28 మంది ఆర్గనైజింగ్ కార్యదర్శులు, 21 మంది అధికార ప్రతినిధులు, 17 మంది ప్రచార కార్యదర్శులు, మరో 35 మంది కార్యదర్శులు, ఓ కోశాధికారి, 32 మందితో కూడిన జిల్లా కమిటీని ఖరారు చేశామని ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు గోడం నగేష్ మంగళవారం తెలిపారు.

అనుబంధ సంఘాలు...

అధ్యక్షులు

జిల్లా తెలుగు యువత జిల్లా అధ్యక్షునిగా గాజుల ముఖేష్‌గౌడ్ ఎన్నికయ్యారు. తెలుగు మహిళా అధ్యక్షురాలిగా సొల్లు లక్ష్మి, జిల్లా తెలుగు రైతు విభాగం అధ్యక్షుడిగా పి.రాజేశ్వర్‌రెడ్డి, జిల్లాఎస్టీ సెల్ అధ్యక్షునిగా జాదవ్ బలిరామ్(బోథ్), జిల్లా బీసీ సెల్ విభాగం అధ్యక్షునిగా బాశెట్టి రాజన్న(ముధోల్), జిల్లా మైనార్టీ సెల్ విభాగం అధ్యక్షునిగా అబ్ధుల్లా(ఆసిఫాబాద్), జిల్లా వాణిజ్య విభాగం అధ్యక్షునిగా పాలెపు మరళీధర్(సిర్పూర్-టి) ఎన్నికైనట్లు నగేష్ తెలిపారు.

టీడీపీ జిల్లా కమిటీ ఎన్నిక


హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీతో టీఆర్ఎస్ కుమ్మక్కైందని టీడీపీ నేతలు మోత్కుపల్లి నర్సింహులు, గాలి ముద్దుకృష్ణమనాయుడు ఆరోపించారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ టీఆర్ఎస్ అవిశ్వాసానికి మద్దతు ఇవ్వమని వారు తేల్చి చెప్పారు. కాంగ్రెస్‌ను బలోపేతం చేయడమే టీఆర్ఎస్ లక్ష్యమన్నారు. నీచ రాజకీయాలు చేసే పార్టీలను టీడీపీ నమ్మదని, కేసీఆర్ చెబితే అవిశ్వాసం పెట్టాలా అని మోత్కుపల్లి, గాలి ప్రశ్నించారు.

కాంగ్రెస్‌తో టీఆర్ఎస్ కుమ్మక్కు : మోత్కుపల్లి, గాలి

గవర్నర్ ప్రసంగం తప్పుల తడక
ఈ ప్రభుత్వంలో ఇదే గవర్నర్ చివరి ప్రసంగం

ప.గో : అసెంబ్లీలో గవర్నర్ నరసింహన్ ప్రసంగానికి దశాదిశా లేదని, ప్రసంగమంతా తప్పుల తడక అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. వస్తున్నా...మీకోసం పాదయాత్రలో ఉన్న చంద్రబాబు నాయుడు గవర్నర్ ప్రసంగంపై స్పందించారు. కాంగ్రెస్ హయాంలో గవర్నర్‌కు ఇదే చివరి ప్రసంగం అని ఆయన అన్నారు. మూడున్నరేల్లలో గవర్నర్ ప్రసంగంలో చెప్పినవేవి అమలుకాలేదని బాబు ఆగ్రహం వ్యక్తపరిచారు.

పంటలకు మద్దతు ధరలేదు...సీఎం కిరణ్‌కుమార్‌కు అనుభవం లేదని బాబు ఎద్దేవా చేశారు. అభివృద్ధిలో 11 స్థానానికి పడిపోయామని, అన్ని రంగాల్లో వెనుకబడి పోయామన్నారు. ప్రపంచం ఆశ్చర్య పోయేలా కాంగ్రెస్ వాళ్లు అవినీతికి పాల్పడ్డారని, రాష్ట్రాన్ని ఈ స్థాయికి పతనం చేయడం కాంగ్రెస్‌కే సాధ్యమని విమర్శించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవస్థలను నాశనం చేసిందని మండిపడ్డారు. ప్రపంచంలో ఎక్కడ బాంబు పేలినా...దాని మూలం హైదరాబాద్‌లోనే ఉంటుదన్నారు. టీడీపీ హయాంలో రూ.50 వేల కోట్లు ఉన్న అప్పు ఇప్పుడు లక్షా 73 వేల కోట్లకు చేర్చారన్నారు. ఉపాధి హామీ పథకం ఓ అవినీతి పథకమని దుయ్యబట్టారు. కరెంట్ కోతలతో 10 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారని ఆయన అన్నారు. పావలావడ్డీ ఓ ఫాల్స్ అని మహిళలు తిడుతున్నారని చంద్రబాబు పేర్కొన్నారు.

అవిశ్వాసంపై బాబు మాట్లాడుతూ అవిశ్వాసం ఎప్పుడు పెట్టాలో తమకు తెలుసని, తమ వ్యూహం తమకుందన్నారు. సూట్‌కేసులతో ఎమ్మెల్యేలను కొన్నవారికి తాము మద్దతివ్వాలా అని ప్రశ్నించారు. మనుషులను కొని రాజకీయాలు చేయడం నీతి మాలిన చర్యగా బాబు అభివర్ణించారు. కాంగ్రెస్‌తో లాలూచీ పడాల్సిన ఖర్మ లేదని, తనపై ఏమాన్న కేసులున్నాయా, తన ఇంటి అనుమతులు కావాలా వైసీపీపై పరోక్ష విమర్శలు చేశారు.అవిశ్వాసం రాజకీయ ప్రయోజనాల కోసమే తప్ప ప్రజా అవసారల కోసం కాదని చంద్రబాబునాయుడు అన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవస్థలను నాశనం చేసింది : చంద్రబాబు

(ఏలూరు) ఒకవైపు సహకరించని కాళ్లు. ఒళ్లు నొప్పులు. ఉదయం పూట పార్టీ సమీక్షలు.మధ్యాహ్నం నుంచి కాలినడక. వస్తున్నా మీకోసం అంటూ చంద్రబాబు మొక్కవోని యాత్ర. చంద్రబాబు తలపెట్టిన పాదయాత్ర 162 రోజుకు చేరుకుంది. జిల్లాలో 4వ రోజున కూడా అదే జనం.. అదే అభిమానం. అవే హారతులు. కలబోసి ఆయనకు పశ్చిమ వాసులు తమ ఆదరాభిమాలను పంచారు. ఆయనను చూసేందుకు, ఆయనతో చేయి కలిపేందుకు, అడుగులో అడుగు వేసేందుకు పోటీలుపడ్డారు. 214ఎ జాతీయ రహదారి జనంతో నిండింది. బాబు రాకకోసం వేయికళ్లు ప్రతిచోటా ఎదురుచూశాయి. పెన్నాడలో రాత్రి బస ముగించుకుని మంగళవారం ఆయన మధ్యాహ్నం వేళ దెందులూరు, నిడదవోలు నియోజకవర్గాల సమీక్షలు చేశారు. కార్యకర్తలతో ముఖాముఖి సంభాషించారు.

పార్టీ విజయానికి మరింత గట్టి పునాదివేసే క్రమంలో కార్యకర్తలు పడుతున్న పాట్లను అడిగి తెలుసుకున్నారు. అక్రమ కేసులు పెడుతున్నారంటూ కార్యకర్తలు ఆవేదన చెందినప్పుడు.. 'అక్రమ కేసులు పెడితే ఖబడ్దార్' అంటూ కాంగ్రెస్ సర్కార్‌కు వార్నింగ్ ఇచ్చారు. మన విజయాన్ని అడ్డుకోవడానికి వాళ్లు ఇలాంటి తప్పుడు కేసులు పెడతారు. ఇక ముందు కూడా పెడతారు. మన వాళ్లను జైళ్లలో కుక్కి మన విజయాలను అడ్డుకోవాలని చూస్తున్నారు. జాగ్రత్తగా ఉండండి అంటూ కార్యకర్తలకు సూచించారు. 'ఏది ఏమైనా నేను చూసుకుంటాను. మీరు మాత్రం ముందుకే వెళ్లండి' అంటూ ధైర్యాన్ని నూరిపోశారు. ఎన్నికలు ఎప్పుడైనా వచ్చే అవకాశం ఉంది, సిద్ధంగా ఉండండి అంటూ కూడా పిలుపునిచ్చారు.

దెందులూరు, నిడదవోలు నియోజకవర్గాల కార్యకర్తలతో సమావేశ ప్రాంగణం కిక్కిరిసిపోయింది. ఇది సహజంగానే పార్టీ అధినేతకు సంతృప్తినిచ్చింది. కార్యకర్తలు నిర్మొహమాటంగా మాట్లాడుతున్నప్పుడు 'స్పీచ్‌ల్లో మన వాళ్లంతా ఆరితేరిపోయినట్లు ఉన్నారు' అంటూ చమత్కరించి కార్యకర్తల నుంచి హర్షధ్వానాలు అందుకున్నారు. అలాగే పెన్నాడ మార్కెట్ యార్డు సెంటర్ నుంచి ఆయన సాయంత్రం వేళ పూలపల్లి వైపు ముందుకు సాగారు. దారికి ఇరువైపులా వందలాదిమంది ఆయన రాకకోసం ఎదురు చూశారు. ఆయనకు దగ్గరగా వెళ్లి చూసేందుకు కొందరు, కరచాలనం చేసేందుకు ఇంకొందరు, తమను తాము పరిచయం చేసుకునేందుకు మరికొందరు పోటీలు పడుతున్నప్పుడు పోలీసులు కొన్నిచోట్ల అడ్డుకున్నారు. దీనిని గమనించిన చంద్రబాబు వారిని తన దగ్గరకు పిలుచుకుని మరీ సంభాషించి పంపించి సంతృప్తిపరిచారు.

దారిపొడవునా వందలాది మంది ఆయన అడుగులో అడుగు కలిపారు. శృంగవృక్షం, వీరవాసరం సెంటర్లు జనసంద్రమయ్యాయి. పార్టీ నేతలు ఒకవైపు తన వెంట నడుస్తుండగానే ఇంకోవైపు తన కోసం రోడ్డుకిరువైపులా వేచిచూస్తున్న మహిళల దగ్గరకు వెళ్లి వారిని పలకరించారు. ఎలా ఉన్నారమ్మా అంటూ ప్రశ్నించి వారి బాగోగులను అడిగి తెలుసుకుంటూ 'ఒక పెద్దన్నయ్యగా మీ ముందుకొచ్చా. తప్పనిసరిగా పార్టీ అధికారంలోకి రాగానే మీకు ఏలోటూ రాకుండా చూసుకుంటా'నంటూ వారికి భరోసా ఇచ్చారు. యువకులు, కార్యకర్తలు ఉత్సాహం ప్రదర్శించారు. దారిపొడవునా కొందరు నృత్యాలు చేస్తూ డప్పు వాయిద్యాల మధ్య పార్టీ అధినేతకు స్వాగతం పలికారు. ఈ ఉత్సాహ వాతావరణం గమనించిన బాబు వీరవాసరానికి ముందు కోలాట బృందంతో కలిసి సరదాగా కోలాటం ఆడారు.

మిరపకాయ బజ్జీ రూ. 2 వేలు! మార్గమధ్యలో ఒక పచ్చిమిరపకాయ బజ్జీని రుచి చూసి, ఇదిగో ఈ రెండు వేలు ఉంచుకోండి అంటూ దుకాణం యజమానికి ఇవ్వడంతో ఆయన తబ్బిబ్బు అయ్యారు. పదవ తరగతి చదువుతున్న పిల్లలను బాగా చదువుకోండి అంటూ ప్రోత్సహించారు. ఇద్దరు పేద డిగ్రీ విద్యార్థులకు రెండు వేల రూపాయల సాయం అందించారు. నాలుగో రోజు పాదయాత్ర అత్యంత ఉల్లాసంగా, ఉత్సాహంగా, ఉత్తేజంగా సాగింది. పార్టీ ఎమ్మెల్యేలు చింతమనేని ప్రభాకర్, శివరామరాజు, బూరుగుపల్లి శేషారావు, ఎమ్మెల్సీ అంగర రామ్మోహనరావు, పార్టీ అధ్యక్షురాలు సీతారామలక్ష్మి, గాదిరాజు బాబు, గన్ని వీరాంజనేయులు, ముళ్లపూడి బాపిరాజు తదితరులు అంతా పాల్గొన్నారు.

బాబూ ఎలాగుంది? భీమవరంపై గాదిరాజును ఆరా తీసిన చంద్రబాబు 'భీమవరం పట్టణంలో మంచి స్వాగతం పలికారు. నా యాత్రకు వచ్చిన జనం చూసి సంతృప్తి పడ్డాను. బాగా చేశారు. భీమవరంలో తాజా పరిస్థితులు ఏమిటి?' అంటూ పార్టీ నేత గాదిరాజు బాబును పార్టీ అధినేత స్వయంగా ఆరా తీశారు. 'ఎప్పుడూ బయటకు రాని కొన్ని కుటుంబాలకు చెందిన మహిళలు కూడా మిమ్మల్ని స్వయంగా చూసేందుకు తొలిసారిగా వీధుల్లోకి వచ్చారు. ఇది భీమవరంలో ఆల్‌టైమ్ రికార్డు' అని గాదిరాజుబాబు పార్టీ అధినేతకు వివరించారు. భీమవరం పట్టణంలో సోమవారం తనకు ప్రజలు బ్రహ్మరథం పట్టడం పట్ల చంద్రబాబు పూర్తిస్థాయి సంతృప్తి వ్యక్తం చేశారు.

అదే జనం..అదే నడక


(ఏలూరు) 'ఈ ర్రాష్టం బాగుపడాలన్నా, ప్రజలు సుఖసంతోషాలతో గడపాలన్నా, ప్రతి ఇంట్లో సుఖశాంతులు వర్థిల్లాలన్నా ముందుగా పార్టీలుగా చెప్పుకొచ్చే దోపిడీదారులను తరిమివేయండి. అధికారంలోకి రాగానే మీకు పెద్దన్నగా తోడుగా నిలుస్తా' అని తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు ప్రజలకు పిలుపునిచ్చారు. వస్తున్నా మీకోసం యాత్ర జిల్లాలో నాల్గవ రోజైన మంగళవారం ఉత్సాహంగా సాగింది. వందలాది అభిమానుల నడుమ బాబు పాదయాత్ర సాగించారు. పెన్నాడ, శృంగవృక్షం, వీరవాసరం, ఎస్.చిక్కాలతో పలు కూడళ్లలో భారీగా హాజరైన ప్రజలనుద్దేశించి మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వమే దద్దమ్మ ప్రభుత్వంగా అభివర్ణించారు. ఇక అవినీతిని చూస్తూ ఊరుకుంటే ఈ ర్రాష్టం అధోగతి పాలవుతుందని, నేనొక్కడినే కాదు, మీరు కూడా ఈ ధర్మపోరాటంలోకి కలిసి రావాలంటూ పిలుపునిచ్చారు. అవినీతికి వ్యతిరేకంగా సాగుతున్న ఆందోళనలో అన్ని వర్గాలు పాలుపంచుకోవాలని పిలుపునిచ్చారు.

'ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కరెంటు లేదు, మంచినీళ్లు లేవు, సుఖశాంతులు లేవు, ఉన్నదల్లా అవినీతే' అంటూ ఎద్దేవా చేశారు. మీలో ఎవరైనా సుఖశాంతులతో గడుపుతున్నారా అంటూ అన్నిచోట్ల ప్రశ్నలు సంధిస్తూ లేదు.. లేదు అని సమాధానాలను ప్రజల నుంచి రాబట్టారు. కరెంటు కోతలతో పాటు గుండెలు అదిరే బిల్లులువస్తున్నాయని, ఇది చేతకాని ప్రభుత్వ పాలనకు మచ్చుతునక అన్నారు. వైఎస్ ర్రాష్ట సంపదను కొడుకికి దోచిపెట్టారని, కిరణ్‌కుమార్‌రెడ్డి పన్నుల రూపంలో జనం మీద పడుతున్నారని ఆరోపించారు. వైఎస్ హయాంలోను, ఇప్పుడు కూడా కాంగ్రెస్ దొంగలు ఊళ్లకు ఊళ్లే దోచేస్తున్నారని ఆరోపించారు. ముందు చూపు లేని పాలన కారణంగా ఏఒక్క వర్గం కూడా ఇప్పుడు సుఖంగా లేకుండా పోయిందన్నారు. రాజకీయాల్లో ఉండే వ్యక్తులు అంటే మీకు ఆదర్శంగా ఉండాలే తప్ప మీరు అసహ్యించుకునే మాదిరిగా ఉండకూదని, అందుకోసమే తాను నిప్పులా పాలించానని, ప్రజలకు అండగా నిలిచానని చెప్పుకొచ్చారు.

ఏ అనుభవం లేని కిరణ్‌కుమార్‌రెడ్డి వల్ల ర్రాష్టం అధోగతి పాలైందన్నారు. చీకటి రాజకీయాలు సాగుతున్నాయి, దొంగలు మళ్లీ ర్రాష్టం మీద పడాలనిచూస్తున్నారు, జాగ్రత్త అంటూ ప్రజలను సున్నితంగా హెచ్చరించారు. ర్రాష్ట ఆర్ధిక వ్యవస్థ దారుణంగా మారిపోయింది. రైతులు అప్పుల్లో కూరుకుపోయారు. మద్దతు ధర లేకుండా పోయింది. దద్దమ్మలకు ఓటేసినందుకుగాను ఇప్పుడు ఇన్నికష్టాలు వచ్చాయని, ఇప్పటికైనా ప్రజలకోసం పనిచేసే తెలుగుదేశం పార్టీని ఆదరించాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. కాంగ్రెస్, వైఎస్సార్‌సీపీలపై కూడా ఆయన చాలాచోట్ల విరుచుకుపడ్డారు. 'నేను ఒక్కడినే అవినీతిపై పోరాటం చేయాలా, మీరంతా ఆ బాధ్యత నాకే వదిలేసి ఊరుకోదలిచారా?' అంటూ కొన్నిచోట్ల సభికులను ప్రశ్నించారు. రాజకీయాల్లో ఓనమాలు తెలియని వ్యక్తి జగన్ అని అపహాస్యం చేశారు.

వాళ్ల అమ్మ మాత్రం తన కొడుకుని సీ ఎం చేయాలని తెగ ఆరాటపడిపోతోందని, ఇప్పటివరకు దోచుకుంది చాలక, మళ్లీ మళ్లీ దోచుకుందామని పిల్ల కాంగ్రెస్ ఆరాటపడిపోతోందని అపహాస్యం చేశారు. రైతులకు రుణాలు మాఫీ చేసే విషయంలో తన వద్ద ఒక ప్రణాళిక ఉందని, అది అధికారంలోకి రాగానే అమలులోకి తెస్తానని అన్నారు. వీరవాసరంలో మురికినీళ్లనే మంచినీళ్లుగా ఇస్తున్నారు.. అయితే మందు కావాలంటే మాత్రం క్షణాల్లో మీ ముందు వుంచుతున్నారు. ప్రజలకు నీళ్లు కావాలా.. మందుకావాలా కూడా తెలియనంతగా ఈ గుడ్డి ప్రభుత్వం వ్యవహరిస్తోందని కాంగ్రెస్ సర్కార్‌పై విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిని కిరికిరి సీఎంగా ఆయన పదే పదే అభివర్ణించారు.

ఇక ముందు ఎప్పుడైనా ఎన్నికలు రావచ్చు. మీరంతా సిద్ధంగా ఉండాలని కూడా పార్టీ కార్యకర్తలకు పిలుపునిస్తూనే ఒకప్పుడు ఏ చిన్న విషయంపైనైనా కార్యకర్తలు, నాయకులు ప్రతిస్పందించేవారు. ఇప్పుడా పరిస్థితి నుంచి చూద్దాంలే అనే స్థాయికి ఎవరూ వెళ్లవద్దు. తప్పుని తప్పుగానే ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్నారు. 2014 ఎన్నికల నాటికి జగన్‌పై ఉన్న కేసులను మాఫీ చేసేందుకు ఆ పార్టీ కుతంత్రాలకు దిగుతోందని, రాజీపడుతోందని చంద్రబాబు మండిపడ్డారు. ఆమె(విజయలక్ష్మి) ప్రతిసారీ ప్రధాన ప్రతిపక్షం విఫలమైందని ఆరోపిస్తోంది.. అంటే మీరు డబ్బుదోచుకున్నారు, జనం సొమ్ము దోచుకున్నారు.. అని మేము బహిర్గతం చేసినందుకేనా ప్రతిపక్షం విఫలమైందంటూ ఆయన ప్రశ్నల వర్షంకురిపంచారు. వైఎస్ బతికున్నప్పుడే ఆయన గుండెల్లో రైళ్లు పరిగెత్తించాం.

ఇప్పుడు తల్లి కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్ మాకేమీ కొత్త కాదని ప్రజల హర్షధ్వానాల మధ్య అన్నారు.పార్టీలో కొందరు ఎమ్మెల్యేలు బాగా పనిచేస్తున్నారు. ఎమ్మెల్యేలు లేని నియోజకవర్గాల్లో ఇక కార్యకర్తలకు పని కల్పించేందుకు కూడా పార్టీపరంగా చర్యలు తీసుకుంటామని మరికొన్నిచోట్ల చెప్పారు.వీరవాసరం బహిరంగ సభలో అవినీతికి దాసోహం అయ్యేలా కొందరు వ్యవహరిస్తున్నారు, వీరి పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరారు. కాపులు, బ్రాహ్మణులు, వైశ్యులతో సహా అగ్రవర్ణాల్లో కూడా పేద కుటుంబాలు ఉన్నాయి. ఈ కుటుంబాలకు చెందిన పిల్లలకు ఫీజు రీయింబర్స్‌మెంట్ కల్పించడానికి తాము సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. కాపులకు ఖచ్చితంగా న్యాయం చేస్తామని, ఇప్పటికే బీసీలకు, మైనార్టీలకు ప్రత్యేక ప్యాకేజీ కల్పించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

పోలవరం ప్రాజెక్టును నిర్మించే సత్తా మాకే ఉంది, మీరెవరూ అధైర్యపడాల్సిన పనిలేదు. అధికారంలోకి రాగానే దీనిని పూర్తి చేస్తామని, రైతులకు పూర్తిగా సాగునీరు అందిస్తామన్నారు. బాబు వెంట జిల్లా పార్టీ అధ్యక్షురాలు సీతారామలక్ష్మి, మాగం టి బాబు, పాలి ప్రసాద్, వై.టి.రాజా తదితరులు ఉన్నారు.

దోపిడీదారులను తరిమేయండి

ఏలూరు: 'ఒక సంవత్సరంలో కాని, ఆలోపే కాని ఎ న్నికలు ఎప్పుడైనా రావచ్చు, ఇంటి పనులు మిగతా వాళ్ళకు అప్పగించండి, ఎన్నికలకు బ యలుదేరండి, ఎవ్వరూ వెనక్కుపోవద్దు, మ న పార్టీ గెలుపు చారిత్రక అవసరం' అని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఇక తాడోపేడో తేల్చుకోవడానికి మనం సిద్ధం కావాలి. ఎంపీలు, ఎమ్మెల్యేలను గెలిపించుకునే బాధ్యత కూడా మీదే అని చెప్పారు. 'వస్తున్నా మీకోసం' పాదయాత్రలో భాగంగా మంగళవారం ఉదయం పె న్నాడ మార్కెట్ యార్డులో నిడదవోలు, దెం దులూరు నియోజకవర్గాల పార్టీ పనితీరుపై సమీక్షించారు. కార్యకర్తలతో ముఖాముఖి మాట్లాడారు. పార్టీలో కార్యకర్తలే తనకు ము ఖ్యమని, మీకోసం ఏం చేయడానికైనా మేము సిద్ధమేనన్నారు.

ఈ ర్రాష్టాన్ని మరో బీహార్‌గా మార్చేలా జరిగే ప్రయత్నాలను తెలుగుదేశం గెలుపు ద్వారా అడ్డుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. పార్టీ కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని, ఈ విషయంలో ఇప్పటికే కాంగ్రెస్‌పై పోరాడుతున్నామని, అయినా కూడా జాగ్రత్తగా ఉండాలని హితవు పలికారు. ఈ ఆరు నెలల్లో పార్టీ కోసం బాగా పని చేసేవారిని జైళ్ళలో పెట్టడం ద్వారా పార్టీ విజయావకాశాలను అడ్డుకోవడానికి కాంగ్రెస్ కుతంత్రాలు పన్నుతుందని ఆరోపించారు. రైతులు రుణమాఫీ విషయంలో మనం ఇప్పటికే పక్కా ప్లాన్‌తో ఉన్నాం. రైతులకు మేలు చేసేలా నాకు ఒక ప్రణాళిక ఉందని స్పష్టం చేశారు.

అధికారంలోకి రాగానే బ్యాంకుల్లో ఇస్తున్న రుణాలను మాఫీ చేస్తామని, అయితే ఇప్పటి దాకా ఉన్న రుణాలు కట్టాలా, వద్దా అనేది మీరే స్వీయ నిర్ణయం తీసుకోవాలన్నారు. ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో పార్టీ పర్‌ఫెక్ట్‌గా ఉందని, మిగతా నియోజకవర్గాల్లో పరిస్థితిని ఎప్పటికప్పుడు బేరీజు వేసుకుంటున్నామని చంద్రబాబు చెప్పారు. డబ్బు కాంక్షతో లీడర్లే పార్టీని వదిలిపోతున్నారే తప్ప కార్యకర్తలు అందరూ సొంత పార్టీనే నమ్ముకుని ఉంటున్నారని చంద్రబాబు పేర్కొన్నా రు. పార్టీ ఎమ్మెల్యేలు ప్రభాకర్, బూరుగుపల్లి శేషారావు పనితీరుపై ఆయన సంతృప్తిని వ్యక్తం చేశారు.

పార్టీ కోసం కష్టించి పని చేస్తుంటే ఓర్వలేక తమపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని, దెందులూరు, నిడదవోలు నియోజకవర్గాల కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేశారు. ' మిమ్మ ల్ని సీఎంగా చూసేంత వరకు ఎన్ని పోరాటాలైన చేస్తాం, మడం తిప్పం, అయినా మీరు, స్థానిక ఎమ్మెల్యేలు మాకు అండగా నిలవాలి' అని పార్టీ కార్యకర్తలు అధినేతకు, ఎమ్మెల్యేలకు కూడా విజ్ఞప్తి చేశారు. యువతకు కూడా తగిన ప్రాధాన్యత ఇవ్వాలని అని దెందులూ రు నియోజకవర్గానికి చెందిన నవీన్ అనే కా ర్యకర్త కోరారు. ఒక అప్పటి అభివృద్ధి చెట్టు మనది, కాయలు మాత్రం కాంగ్రెస్ వాళ్ళు కోసేసుకుంటున్నారు, మన పార్టీ ప్రజలకు కూడు పెడితే కాంగ్రెస్ పొట్ట కొట్టిందని నిడదవోలు కార్యకర్త సురేష్ అభిప్రాయపడ్డాడు.

కొల్లేరు సమస్య పరిష్కరించాలని దెందులూరు నియోజకవర్గానికి చెందిన తిరుపతి స్వామి కోరారు. టీడీపీ కార్యకర్తలపై కేసులు పెడుతున్నారని నిడదవోలుకు చెందిన వెంక ట రమణారావు పేర్కొంటూ ఇక ముందు ధనిక, పేద వర్గాలను పూర్తిగా గమనించేలా మల్టీపర్పస్ కార్డును మీరే రూపొందించాలని చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు. మా ఎమ్మెల్యే ప్రభాకర్‌పై కేసులు పెట్టినా కూడా మొక్కవోని ధైర్యంతో ఆయన ముందుకు సాగారు. మీరూ అండగా నిలిచారు.. అని దెందులూరు సీనియర్ నేత రాయల భాస్కరరావు అన్నా రు. పార్టీని గెలిపించుకుంటామని, దైనికైనా సిద్ధమేనని కుటుంబ శాస్త్రి పేర్కొనగా, రైతులకు తగినంత మద్దతు ధర, ఇతరత్రా వాటి పై ఊరూవాడా విస్తృత ప్రచారం చేస్తే పార్టీకి తిరుగుండదని నిడదవోలుకు చెందిన లాల్‌బహుదూర్ అన్నారు.

తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయు డు నిర్వహించిన సమీక్షకు దెందులూరు, నిడదవోలు నియోజకవర్గాలకు చెందిన వందలాదిమంది కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. పార్టీ ఎమ్మెల్యేలు బూరుగుపల్లి శేషారావు, చింతమనేని ప్రభాకర్ పనితీరుపై పూర్తి స్థాయి సంతృప్తి వ్యక్తం చేశారు. తమ నేతల పనితీరును అధినేత దృష్టికి తీసుకువెళ్ళేందుకు చాలా మంది ప్రయత్నించారు. మా గంటి బాబు, సీతారామలక్ష్మీ తదితరులు పా ర్టీ కోసం కష్టపడి పని చేస్తున్నారని వారి పట్ల కూడా అభిమానం చాటుకున్నారు. తెలుగుదే శం పార్టీ అధికారంలోకి వస్తే మాగంటి బా బును మంత్రిగా చూడాలని, ప్రభాకర్, శేషారావులను తిరిగి ఎమ్మెల్యేలుగా గెలిపించుకుంటామని కార్యకర్తలు స్వయంగా చంద్రబాబుకే భరోసా ఇచ్చారు. ఈ సమావేశంలో పార్టీ అధ్యక్షురాలు సీతారామలక్ష్మీ, ఎమ్మెల్యేలు ప్రభాకర్, శేషారావు, మాగంటి బాబు, ఎమ్మెల్యే శివరామరాజు, పాలిప్రసాద్, జగదీష్‌బాబు, ముఖ్య నేతలు పాల్గొన్నారు.

ఎన్నికలకు సిద్ధం కండి

వీరవాసరం/పాలకోడేరు/భీమవరం: చంద్రబాబు నాయుడు వస్తు న్నా మీకోసం పాదయాత్రను మంగళ వారం ప్రారంభించిన కొద్దిసేపటికే శృంగవృక్షం జిల్లా పరిషత్ హైస్కూల్‌ను సందర్శించారు. రహదారిపై నుం చి అకస్మాత్తుగా స్కూలు బాట పట్టా రు. హైస్కూల్లోకి వెళ్ళిన చంద్రబాబుకు స్కూలు విద్యార్థులు హర్షధ్వనాలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంలో చంద్రబాబు విద్యార్థులను ప లు విధాలుగా ప్రశ్నించారు. ఇది ప్రైవే టు స్కూలా, ప్రభుత్వ పాఠశాల, మ ధ్యాహ్న భోజన పథకం బాగుందా అని చంద్రబాబు ప్రశ్నించిగా బాగుందని విద్యార్థులు చెప్పడంతో అలా అని చెప్పమన్నారా.. అంటూ ప్రశ్నించారు. విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలనే ఉద్దేశ్యంతో తెలుగుదేశం పార్టీ మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రవేశపెట్టిందని, ఎప్పటి నుంచి అమలు చే స్తుందో తెలుసా అంటూ ప్రశ్నించారు.

ఈ సందర్భంగా విద్యార్థులను పలు అంశాలపై ప్రశ్నించారు. అదే విధంగా మీ పాఠశాలలో నూతన భవనాన్ని, అదనపు తరగతుల భవనాన్ని నిర్మించడానికి ఎమ్మెల్యే శివరామరాజు కృషి చేశారని, ఎమ్మెల్యేను విద్యార్థు లకు చూపించారు. మీకు బంగారు భ విష్యత్ ఉంటుందని, విద్యార్థుల కోసం తెలుగుదేశం ప్రభుత్వం ఎన్నో పథకాలను అమలు చేసిందన్నారు. మహాత్మాగాంధీ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్, ఎన్టీ రామారావు, అల్లూరి సీతారామరాజులు తెలుసా అంటూ ప్రశ్నించి ఒక లక్ష్యం కోసం ఆదర్శమూర్తులను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఈ సందర్భంలో డీఈడీకి చెందిన టీచర్లు చంద్రబాబుకు వినతిపత్రం అందజేశారు.

అది చదివిన చంద్రబాబు ఉపాధ్యాయ పోస్టులలో 40శాతం మహిళలకు రిజర్వేషన్ అమలు చేసింది తెలుగుదేశం ప్రభుత్వమేనని అన్నారు. ఉపాధ్యాయ నియామకాల్లో సెట్ పరీక్షలు లేకుండా చేస్తామన్నారు. ఆయన వెంట పార్టీ జిల్లా అధ్యక్షరాలు తోట సీతారామల క్ష్మీ, ఎమ్మెల్యే శివరామరాజు, రాష్ట్ర కా ర్యదర్శి మంతెన వెంకటసత్యనారాయణరాజు (పాందువ్వ శ్రీను), ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ ఉన్నారు.

మీకు బంగారు భవిష్యత్

ఏలూరుసిటీ : వస్తున్నా.. మీకోసం పాదయాత్ర రెండో రూట్ మ్యాప్ రెడీ అయింది. జిల్లాలో చంద్రబాబు పాదయాత్రకు సంబంధించి తొలుత 10 రోజులు నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. అయితే జిల్లాలో ప్రజాప్రతినిధులు కోరిక మేరకు మరో రెండు నియోజకవర్గాల్లో చంద్రబాబు వస్తున్నా..మీకోసం పాదయాత్ర నిర్వహించాలని నిర్ణయించారు. ఈ మేరకు రెండో రూట్‌మ్యాప్‌ను రెడీ చేశారు. ఈ నెల 20వ తేదీ వరకు పాదయాత్ర కొనసాగేలా జిల్లా తెలుగుదేశం పార్టీ ఏర్పాట్లు చేస్తోంది. రెండో రూ ట్‌మ్యాప్ వివరాలు ఇలా ఉన్నాయి.*16వ తేదీ తణుకు మండలం పైడిపర్రు నుంచి చంద్రబాబు యాత్ర ప్రారంభమై తణుకు రైల్వే ఓవర్‌బ్రిడ్జి సెంటర్, నరేంద్ర సర్కిల్ సెంటర్, ఉండ్రాజవరం రోడ్, నేషనల్ హైవే, ఎన్‌జీవో కాలనీ, అజ్జరం కాలనీ వరకు నిర్వహిస్తారు.

అనంతరం నిడదవోలు నియోజకవర్గంలోని పెరవలి మండలం అజ్జరం- వెంకట్రాయపురం చేరుకుని అజ్జరం బ్రిడ్జి మీదుగా ప్రయాణించి కాకరపర్రు హైస్కూలుకు చేరుకుని చంద్రబాబు రాత్రి బస చేస్తారు. 16వ తేదీన మొత్తం 10.5 కి.మీ. చంద్రబాబు పాదయాత్ర నిర్వహిస్తారు.*17వ తేదీ కాకరపర్రు హైస్కూల్ నుంచి బయలుదేరి కాకరపర్రు, శ్రీపర్రు, ఉసునుమర్రు, కానూరు మీదుగా నిడదవోలు మండలం మునిపల్లి, పెండ్యాల సెంటర్, కలవచర్ల వరకు పాదయాత్ర నిర్వహించి, కలవచర్ల దాటిన తర్వాత వీరమనేని రామకృష్ణ ఫీడ్స్ వద్ద రాత్రి బస చేస్తారు. 17వ తేదీ మొత్తం 13.7 కిలో మీటర్ల మేర చంద్రబాబు పాదయాత్ర నిర్వహిస్తారు.

*18వ తేదీ వీరమనేని రామకృష్ణ ఫీడ్స్ నుంచి చంద్రబాబు పాదయాత్ర ప్రారంభమై నిడదవోలు మండలం డి.ముప్పవరం, పందలపర్రు, పురుషోత్తమ పల్లి మీదుగా కొవ్వూరు నియోజకవర్గంలోని ముద్దూరు బ్రిడ్జికి చేరుకుని, మద్దూరు మీదుగా చాగల్లు మండలం చంద్రవరం వద్ద ఉండవల్లి వెంకటరామారావు తోటలో రాత్రి బస చేస్తారు. 18వ తేదీ మొత్తం 10.1 కి.మి మేర చంద్రబాబు పాదయాత్ర కొనసాగుతుంది. *19వ తేదీ ఉదయం చాగల్లు మండలం చంద్రవరం ఉండవల్లి వెంకటరామారావు తోట నుంచి చంద్రబాబు పాదయాత్ర ప్రారంభమై చంద్రవరం ఎన్‌టీఆర్ విగ్రహం సెంటర్, మల్లవరం, గౌరీపల్లి, పశివేదల, నందమూరు మీదుగా కొవ్వూరు కంఠమని నారాయణ గ్రౌండ్స్‌కు చంద్రబాబు చేరుకుని అక్కడ రాత్రి బస చేస్తారు.

19వ తేదీ మొత్తం 9.1 కిలో మీటరు పాదయాత్ర కొనసాగుతుంది. * 20వ తేదీ కొవ్వూరు కంఠమని నారాయణ గ్రౌండ్స్ నుంచి చంద్రబాబు పాదయాత్ర ప్రారంభమై కొవ్వూరులోని ఎన్‌టీఆర్ విగ్రహం సెంటర్, కొవ్వూరు బ్రిడ్జి టోల్‌గేట్ వరకు కొనసాగి తూర్పుగోదావరి జిల్లాకు చంద్రబాబు పాదయాత్ర కొనసాగుతుంది. 20వ తేదీ మొత్తం 3.9 కి.మి మేర చంద్రబాబు పాదయాత్ర జిల్లాలో కొనసాగుతుంది. మొత్తం మీద రెండో సారి 47.3 కిలో మీటర్లు చంద్రబాబు పాదయాత్ర కొనసాగించడానికి తెలుగుదేశం పార్టీ ఏర్పాట్లు చేసింది.

వస్తున్నా మీకోసం' రెండో రూట్‌మ్యాప్ రెడీ