March 12, 2013

వీరవాసరం/పాలకోడేరు/భీమవరం: తాగేందుకు ప్రజలకు నీరు లేదు. సెల్ ఫోన్ నుంచి ఎస్ఎంఎస్ పంపితే తాగేందుకు మం దు వస్తుంది కానీ, ఫోన్ చేసినా తాగునీరు రాదని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్రాన్ని 'మద్యం'ప్రదేశ్‌గా మార్చారని, గోదావరి నుంచి నీళ్ళు వస్తున్నా తాగేందుకు మాత్రం గ్రామాల్లో నీరు రాదన్నారు. వీరవాసరం బస్టాండ్ సెంటర్ మంగళవారం సాయంత్రం ప్రజలనుద్దేశించి ఆయన ప్రసంగించారు. వీరవాసరంలోని స్థానిక సమస్యలపై ఆయన విమర్శించారు. తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ సుజల కార్యక్రమం ద్వారా గ్రామాలకు సురక్షిత మంచినీటిని అందజేస్తుందన్నారు. తెలుగుదేశం అధికారంలోకి వస్తే బెల్ట్ షాపులు రద్దు చేస్తామన్నారు. వ్యవసాయాన్ని లాభసాటిగా చేసే వరకూ రైతులకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.

వృద్ధులకు ప్రస్తుతం ఇచ్చే పింఛనును రూ.600 చేస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటికీ ఇంటి జాగాలేక ఎందరో బాధపడుతున్నారని, తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఇంటి జాగా ఇవ్వడమే గాక ఉచితంగా రూ.లక్ష ఖర్చుపెట్టి, ఇళ్ళు కట్టిస్తామన్నారు. రాష్ట్రంలో అవినీతి పూర్తిగా పెరిగిపోయిందన్నారు. అగ్రవర్ణాల్లోనూ పేదలున్నారని, పేదలందరికీ రిజర్వేషన్‌లు పెట్టి న్యాయం చేస్తామన్నారు. ముఖ్యంగా కాపు సామాజిక వర్గాలకు న్యాయం చేసే బాధ్యత తీసుకుంటామని చంద్రబాబు హామీ ఇచ్చా రు. తెలుగుదేశం పార్టీ మాలలకు వ్యతిరేకమే మీ కాదని, వారిని ఆర్థికంగా పైకి తీసుకొచ్చే బాధ్యత చేపడుతుందన్నారు. ప్రజలు కరెంట్ ఛార్జీలు కట్టే స్థితిలో లేరని, అయినప్పటికీ మరో రూ.18వేల కోట్ల భారాన్ని ప్రజలపై మోపడానికి ఈ ప్రభుత్వం సిద్ధమవుతోందన్నారు.

కృష్ణా, గోదావరి బేసిన్‌లో గ్యాస్ ఉంది గానీ అది మనింటికి రాని పరిస్థితి ఉందన్నా రు. అవినీతిని పూర్తిగా నిరోదించాలని, అవినీతిపై ప్రచారం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నాయకులు పార్టీ జిల్లా అ«ధ్యక్షరాలు తోట సీతారామలక్ష్మీ, భీమవరం నియోజకవర్గ కన్వీనర్ గాదిరాజు బా బు, పాందువ్వ శ్రీను, స్థానిక నాయకులు వీరవల్లి చంద్రశేఖర్, పోలిశెట్టి సత్యనారాయణ (దాసు), మైలాబత్తుల ఐజక్‌బాబు, మోపిదేవి విశ్వేశ్వరరావు, పంజా నాగేశ్వరరావు, రాయపల్లి వెంకట్, నూకల అప్పాజీ, గన్నమనీడి జయప్రసాద్, చింతపల్లి మాణిక్యాలరావు, పీతల వరప్రసాద్, పోశింశెట్టి శ్యామలరావు, తదితరులు పాల్గొన్నారు.

గోదావరి ఉన్నానీళ్ళకు కరువే:బాబు

భీమవరం/పాలకోడేరు/వీరవాసరం: 'సాక్షి పత్రిక విషకన్య.. అది సాక్షి కాదు అసత్యాల పుట్ట.. రోజూ నాపై ఒక పేజీ రాస్తేగా నీ దానికి గడవని పరిస్థితి. దొంగలు పెట్టిన టీవీ, పేపర్ అది'... అంటూ సాక్షి పత్రికపై చంద్రబాబు మరోసారి విరుచుకుపడ్డారు. త మ కుటుంబంలో ఎన్టీయార్, తాను 17 ఏళ్ళ పాటు ముఖ్యమంత్రులుగా పనిచేశామని, తాము టీవీ కానీ, పేపర్ కానీ పెట్టలేదన్నా రు. 'వస్తున్నా మీకోసం' పాదయాత్రలో భాగంగా పాలకోడేరు మండలం శృంగవృక్షం బస్టాండ్ సెంటర్‌లో మంగళవారం జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. భీమవరం ఇంజనీరింగ్ విద్యా ర్థి ఒకరు మీరూ పేపర్, టీవీ పెట్టవచ్చుకదా అన్నాడని, సాక్షి లాంటి పేపర్, టీవీలను దొంగలే పెట్టగలరని, తనకు పెట్టే ఉద్దేశ్యం లేదని చెప్పారు. ప్రజా సేవ చేయడమే తన లక్ష్యం అని చెప్పారు.

మొన్నటి వరకు రాయలసీమ పౌరుషం, పులవెందుల పోరాటం రాజీలేని వైఖరి అం టూ ప్రగల్భాలు పలికిన పిల్ల కాంగ్రెస్ ఇప్పు డు తల్లికాంగ్రెస్‌లో కలిసిపోతుందన్నారు. ఇప్పుడు పొత్తు పేరుతో ఆ పార్టీలో కలవడం ఖాయమన్నారు. ఇలాంటి పార్టీలను ప్రజలు ఎన్నో చూశారన్నారు. నీలం సంజీవరెడ్డి, చిరంజీవి వంటి వారు సొంత పార్టీలను పెట్టి ఇలా ప్రగల్భాలు కలిపి చివరికి కాంగ్రెస్ పార్టీలో కలిసిపోయారని విమర్శించారు. అటువంటి వారిని నమ్మవద్దన్నారు.

రాష్ట్రం అథోగతి పాలవుతోందని, తొమ్మిదేళ్ళుగా దొంగలు దొరికిన కాడికి దోచుకుంటున్నారని చంద్రబాబు విమర్శించారు. ఈ పరిస్థితికి గతంలో రాజశేఖర్‌రెడ్డి, ఇప్పుడు కిరికిరి కిరణ్‌కుమార్‌రెడ్డిలు కారణమని విమర్శించారు. కిరణ్‌కుమార్‌రెడ్డి సాగునీరు ఇవ్వలేకపోతున్నాడు, ధరలు అదుపు చేయలేకపోతున్నాడు, కరెంటు ఇవ్వలేకపోతున్నాడు.. ఇటువంటి అసమర్థ పాలన వల్ల ప్రజలు కష్టాల్లో పడ్డారన్నారు. వేలకోట్లు తిన్నవారందరూ జైల్లో ఉన్నారని, కొంతమంది మంత్రులు, రేపో మాపో జైలుకు వెళ్ళతారన్నారు. కిరణ్‌కుమార్ తన క్యాబినెట్ సమావేశాన్ని చంచల్‌గూడ జైల్లో పెట్టాల్సిందేని ఎద్దేవా చేశారు.

సాక్షికాదు..అసత్యాల పుట్ట

ఏలూరు: ఆచంట నియోజకవర్గంలో ఆచంటకు చెందిన సీనియర్ నేత గుబ్బల తమ్మయ్య టీడీపీలో చేరబోతున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సమక్షంలో ఆయన బుధవారం కవిటంలో టీడీపీలో చేరనున్నట్టు సమాచారం. ఇంతకు ముందు ఆయన ఆచంటలో కాంగ్రెస్ జడ్పీటీసీగా వ్యవహరించారు. కాంగ్రెస్‌కు రాజీనామా చేసి పీఆర్పీలో చేరారు. విద్యావంతుడు, బీసీ తరగతులకు చెందివాడై ఉండటంతో ఆయన్ను 2009 లోక్ సభ ఎన్నికల్లో పీఆర్పీ నరసాపురం లోక్‌సభ స్థానం నుంచి బరిలోకి దింపింది. ఆ ఎన్నికల్లో ఆయన ఓటమి చెందారు. పీఆర్పీ కాంగ్రెస్‌లో విలీనమైన తర్వాత తమ్మయ్య కాంగ్రెస్ పార్టీ కార్యకలాపాలకు దూరంగానే ఉండిపోయారు. అయితే ఈ నియోజకవర్గంలో ఉన్న బీసీల సంఖ్యను దృష్టిలో పెట్టుకుని ఆయన్ని టీడీపీలో చేర్చుకోవాలని తాజాగా టీడీపీ వర్గాలు ఒక నిర్ణయానికి వచ్చాయి.

టీడీపీలో చేరనున్న గుబ్బల తమ్మయ్య

హైదరాబాద్ : భవిష్యత్తులో కాంగ్రెస్‌లో విలీనం కాబోమని ప్రమాణం చేస్తే టీఆర్ఎస్, వైసీపీలు పెట్టే అవిశ్వాస తీర్మానాలకు మద్దతు ఇవ్వడానికి తమ పార్టీ సిద్ధమేనని టీడీపీ అధికార ప్రతినిధి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. "టీఆర్ఎస్, వైసీపీ వైఖరిపై మాకు చాలా అనుమానాలున్నాయి. ఒకపక్క కాంగ్రెస్‌కు మద్దతు ప్రకటిస్తూ మరోపక్క అవిశ్వాస తీర్మాన ప్రతిపాదనలు తెస్తున్నాయి. అందుకే ప్రమాణం చేయమంటున్నాం. భవిష్యత్తులో ఏనాడూ కాంగ్రెస్‌తో చేతులు కలపబోమని, మద్దతు ఇవ్వబోమని తెలంగాణ తల్లి, జయశంకర్ విగ్రహాల వద్ద కేసీఆర్.. ఇడుపులపాయలోని వైఎస్ సమాధి వద్ద రాజశేఖర రెడ్డి కుటుంబ సభ్యులు ప్రమాణం చేయాలి. అప్పుడు నిరభ్యంతరంగా మద్దతిస్తాం'' అని ఆయన వివరించారు.

ఒట్టేసి చెబితేనే మద్దతు: రేవంత్

ఏం తెలుసని వీళ్లకు పదవులు?
దొంగ డబ్బుల జగన్
అమ్మ చాటున రాహుల్
జిల్లా నేతగా కొరగానివారూ సీఎంలేనా?
పశ్చిమ యాత్రలో చంద్రబాబు ఎద్దేవా'సోనియాగాంధీ..తన కొడుకు రాహుల్‌గాంధీని ప్రధానిని చేయాలనుకుంటున్నారు. విజయలక్ష్మి.. జగన్‌ని సీఎంను చేస్తామని చెబుతున్నారు. అసలు వీళ్లిద్దరికీ ఏం రాజకీయ అనుభవం ఉంది? అమ్మమాటన రాహుల్‌గాంధీ ఉంటే,దొంగ డబ్బులు పోగేసుకున్న జగన్ ఇంకోవైపు పదవులను ఆశిస్తున్నారు' అని తెలుగుదేశం అధినేత చంద్రబాబు మండిపడ్డారు. జిల్లా కాంగ్రెస్ నాయకుడిగా అనుభవం లేదుగానీ, సీఎం పదవి కోసమే పార్టీ పెట్టారట.. అంటూ వైసీపీ అధినేత జగన్‌ను దుయ్యబట్టారు. సబ్జెక్టు తెలియదుగానీ ఫోజులు కొడుతున్నారని సీఎం కిరణ్‌ను ఉద్దేశించి ఎద్దేవా చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం పెన్నాడ వద్ద మంగళవారం ఆయన పాదయాత్ర ప్రారంభించారు.

శృంగవక్షం, నందమూరు గర్వు, వీరవాసరం, ఎస్ చిక్కాల, దగ్గులూరు, లంకలకోడేరు, వెలియలఅడ్డరోడ్డు, బగ్గేశ్వరం, పూలపల్లి మీదుగా నడిచారు. శృంగవృక్షం వద్ద ఒక పేద ఇంటికి వెళ్లి కుటుంబ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఆ రోడ్డుపక్కన చేపలు అమ్ముతున్న వారిని పలకరించారు. హైస్కూల్‌లో పదవ తరగతి చదివే విద్యార్థులను కలిశారు. మార్గమధ్యలో కలిసిన గౌడ కులస్తులను భుజం తట్టి ముందుకు నడిచారు. రోడ్డుపక్కన నిలిపిన బజ్జీల బడ్డీ దగ్గరకు వెళ్లి.. ఒక బజ్జీ తిని రెండు వేలు ఇచ్చారు. శృంగవృక్షంలో జరిగిన సభలో జగన్, కిరణ్‌ల తీరును తూర్పారబట్టారు.

"ఈ సీఎం చాలా దుర్మార్గుడు. వైఎస్ తన హయాంలో టీడీపీ కార్యకర్తలను హత్యలు చేయించగా, కిరణ్ మా పార్టీనేతలు, కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నా''రంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పిల్ల కాంగ్రెస్‌గా తాను పిలిచే జగన్ పార్టీ.. జైలు పార్టీ కూడానని పేర్కొన్నారు. "ఎవరైనా గుడికి వెళ్లి కొబ్బరికాయ కొడతారు. కానీ, పదవులు కోరుకుంటున్న వారికే చంచల్‌గూడ జైలే గుడిగా మారింది. అక్కడే కొబ్బరికాయలు కొట్టి,లోపలకు వెళ్లి జగన్‌కు పూజలు చేస్తున్నారు'' అని ఎద్దేవా చేశారు.

"జగన్ సీఎం అవుతారు. రాజన్న సువర్ణ యుగం తిరిగి తీసుకొస్తారు'' అంటూ విజయలక్ష్మి చేసిన వ్యాఖ్యలను చంద్రబాబు తప్పుబట్టారు. "వైఎస్ హయాంలో సాగింది స్వర్ణయుగం కాదు. అదో అరాచక కాలం. ర్రాష్టంలో కష్టాలకు అప్పుడు వైఎస్, ఇప్పుడు కిరణ్‌కుమార్‌రెడ్డే కారణం'' అని మండిపడ్డారు. అనంతరం దెందులూరు, నిడదవోలు నియోజకవర్గాల కార్యకర్తలతో సమీక్ష నిర్వహించారు. అబద్ధాల, విషకన్యగా జగన్ పత్రికను అభివర్ణించారు.

'జగన్' భక్తులకు చంచల్‌గూడే గుడి

తోక పార్టీలకు తలూపొద్దు
వాటి వలలో చిక్కుకోవద్దు
టీఆర్ఎస్ అవిశ్వాసానికి టీడీపీ దూరం
పార్టీ నేతలతో చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్
స్థానిక ఎన్నికలకు భయపడే వాటి ఎత్తులు
తగిన సమయంలో సొంతంగానే పెడదాం
అధినేతకు నేతల స్పష్టీకరణ
టీఆర్ఎస్, వైసీపీలది ఒంటెత్తు పోకడ
ముందుగా చర్చించలేదు.. సంప్రదించలేదు
మొక్కుబడిగా లేఖ: చంద్రబాబు

  : రాష్ట్ర ప్రభుత్వంపై టీఆర్ఎస్ ప్రతిపాదించదల్చిన అవిశ్వాసాన్ని పట్టించుకోరాదని తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది. తోక పార్టీలు తమ రాజకీయ అవసరాల కోసం వేసే ఎత్తుగడల్లో చిక్కుకోవాల్సిన అవసరం లేదని, వాటికి రాజకీయంగా లాభం కలిగించడానికి తాము పావులుగా ఉపయోగపడకూడదని ఆ పార్టీ నిశ్చయించింది. ప్రజా సమస్యలు ఎజెండాగా తగిన సమయంలో అవిశ్వాస తీర్మానాన్ని తామే సొంతంగా ప్రతిపాదించాలని నిర్ణయం తీసుకొంది. పశ్చిమ గోదావరి జిల్లాలో పాదయాత్రలో ఉన్న టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు మంగళవారం రాత్రి అక్కడి నుంచే పార్టీ సీనియర్ నేతలు, కొందరు ఎమ్మెల్యేలతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు.

టీఆర్ఎస్ ప్రతిపాదిస్తానని చెబుతున్న అవిశ్వాస తీర్మానంపై ఎటువంటి వైఖరి అవలంబించాలన్న దానిపై చర్చించారు. టీఆర్ఎస్, జగన్ పార్టీలు లోపాయికారీ అవగాహనతో తమ రాజకీయ అవసరాల కోసం ఇప్పుడు అవిశ్వాస తీర్మానాన్ని ముందుకు తెస్తున్నాయని, వాటి వలలో తాము పడాల్సిన అవసరం లేదన్న అభిప్రాయం ఈ సందర్భంగా వ్యక్తమైంది. తుమ్మల నాగేశ్వరరావు వంటి కొందరు సీనియర్ నేతలు కుండ బద్దలు కొట్టినట్లు తమ అభిప్రాయం తేల్చి చెప్పారు. "టీఆర్ఎస్, వైసీపీలు రెండూ ఇటీవలి సహకార ఎన్నికల్లో ఘోరంగా దెబ్బతిన్నాయి.

స్థానిక సంస్థల ఎన్నికలు వస్తే వాటిలో కూడా తమకు అవే ఫలితాలు వస్తాయని ఆ పార్టీలకు భయం పట్టుకొంది. వాటిని అడ్డుకోవడానికి ఇప్పుడు ఆ రెండూ కలిసి ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టి పడగొట్టాలని ప్రయత్నిస్తున్నాయి. వాటి రాజకీయ అవసరాలు, వ్యూహాలకు ఉపయోగపడాల్సిన ఖర్మ మనకు పట్టలేదు. అసెంబ్లీలో మన సంఖ్యా బలంతో పోలిస్తే అవి రెండూ మనకు తోక పార్టీలు. తోక ఆడించినట్లు మనం ఆడలేం. వాటిది రాజకీయ కోణం. మనది ప్రజా సమస్యల కోణం. అవి తమ మనుగడ కోసం పోరాటం చేస్తున్నాయి. మనం ప్రజల ప్రయోజనాల కోసం పోరాటం చేస్తున్నాం. ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని తగిన సమయంలో మనమే అవిశ్వాస తీర్మానం సొంతంగా ప్రతిపాదిద్దాం.

తోక పార్టీలు పెట్టే అవిశ్వాస తీర్మానాలకు మనం మద్దతు ఇవ్వాల్సిన అవసరం లేదు'' అని వారు తేల్చి చెప్పారు. టెలి కాన్ఫరెన్సులో పాల్గొన్న వారిలో అత్యధికులు ఈ అభిప్రాయాన్ని సమర్థించారు. "ఇంత కీలకమైన అంశంలో రాజకీయ నిర్ణయం తీసుకొనేటప్పుడు ముందుగా అందరితో సంప్రదింపులు జరుపుతారు. టీఆర్ఎస్, వైసీపీ ఇంతవరకూ మనను సంప్రదించలేదు. మనతో చర్చించలేదు. అవిశ్వాసం పెడతామని ముందుగా విలేకరుల సమావేశంలో ప్రకటించి తర్వాత అర్ధరాత్రి సమయంలో మన పార్టీ కార్యాలయానికి కవర్లో పెట్టి ఒక లేఖ పంపారు. నేను ఇక్కడ పాదయాత్రలో ఉన్నానని తెలిసీ పార్టీ కార్యాలయానికి మొక్కుబడిగా ఒక లేఖ పంపి చేతులు దులుపుకొన్నారు. ఒంటెత్తు పోకడగా వ్యవహరించడం తప్ప రాజకీయ విజ్ఞత ఎక్కడా కనిపించడం లేదు'' అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

అల్లుడు అనిల్‌పై తాజాగా వెలుగులోకి వచ్చిన అంశాలతో అతను కూడా సీబీఐ దర్యాప్తులో ఇరుక్కొంటాడన్న భయం వైసీపీ నేతలను ఆవరించిందని, ప్రభుత్వం పడిపోతే తప్ప దీనిని ఆపలేమని వారు భావిస్తున్నారని మరో ఎమ్మెల్యే చెప్పారు. ప్రజా సమస్యల పరిష్కారానికి, ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడానికి అవిశ్వాస తీర్మానం ఒక అంశమే తప్ప అదొక్కటే మార్గం కాదని, అసెంబ్లీలో చర్చలు.. బయట ప్రజలను కూడగట్టి పోరాటం చేయడం వంటి అన్ని రకాల మార్గాలను రాజకీయంగా వినియోగించుకోవాలని మరికొందరు నాయకులు అన్నారు. అవిశ్వాసానికి మద్దతు ఇవ్వకపోతే కాంగ్రెస్‌తో కుమ్మక్కు అయ్యారని ఆయా పార్టీలు విమర్శించే అవకాశం ఉందని ఒకరిద్దరు ఎమ్మెల్యేలు సందేహం వ్యక్తం చేశారు.

"ఎన్నికల తర్వాత కాంగ్రెస్‌కు మద్దతు ఇస్తామని వైఎస్ విజయలక్ష్మి బహిరంగంగా ప్రకటించారు. కాంగ్రెస్‌లో తమ పార్టీని విలీనం చేయడానికి సిద్ధంగా ఉన్నామని కేసీఆర్ అనేకసార్లు చెప్పారు. వాళ్లు మనల్ని అనేదేమిటి? ఆ రెండు పార్టీలు టీడీపీ ఎమ్మెల్యేలకు వల విసిరి వలసలు ప్రోత్సహించి మన పార్టీని బలహీనపర్చాలని ప్రయత్నం చేశాయి. మనను దెబ్బకొట్టాలని చూసిన పార్టీలకు మనం మద్దతు ఇచ్చేదేమిటి? అవిశ్వాసం ఎప్పుడు పెట్టాలో మన నిర్ణయం మనం తీసుకొందాం. మే వరకూ సమావేశాలున్నాయి. ఎప్పుడు ఎలా పెట్టాలో మనం ఆలోచించుకొని నిర్ణయం తీసుకొందాం'' అని సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి, ముద్దు కృష్ణమ నాయుడు వంటివారు తేల్చి చెప్పారు.

తోక పార్టీల తీర్మానాలకు మద్దతు ఇవ్వొద్దు