March 11, 2013

  ఏలూరు : 'కాంగ్రెస్ తప్పుడు నాటకాలాడుతోంది. టీడీపీని దెబ్బతీయాలని చూ స్తోంది. ర్రాష్టాన్ని అడ్డగోలుగా మింగే సి, పందికొక్కుల మాదిరిగా తయారై న ఈ పార్టీలను నమ్మితే సర్వనాశనమే. తస్మాత్ జాగ్రత్త' అంటూ తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు ప్రజలను అప్రమత్తం చేశారు. పేదల సంక్షేమానికి పుట్టింది తెలుగుదేశం పార్టీ అయితే దోచుకోవడానికి, దాచుకోవడానికి తల్లికాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్‌లు పో టీలుపడ్డాయని ఎద్దేవా చేశారు. మంచినీళ్లు కూడా ఇవ్వలేని ప్రభుత్వం ఏకం గా మద్యాన్ని సరఫరా చేయడంలో పోటీపడుతోందని, పేదలతో ఆడుకుంటోందని విరుచుకుపడ్డారు. వస్తున్నా మీకోసం యాత్రలో భాగంగా చంద్రబాబు మూడోరోజు పెదఅమిరం నుం చి పెన్నాడ వరకు పదమూడు కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశారు. ఆయనకు అడుగడుగునా ప్రజలు బ్రహ్మర థం పట్టారు. హారతులతో స్వాగతం ప లికారు. రోజువారీ ప్రసంగాల శైలిని ఆ యన కొంత మార్చి మూడో రోజు ప్ర జలకు ప్రశ్నలు సంధించడం, వాటికి తానే స్వయంగా జవాబులు ఇవ్వడాని కి ప్రాధాన్యత ఇచ్చారు.

కాంగ్రెస్ వ్యవహార శైలిని తప్పుబడుతూనే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావల్సిన ఆవశ్యకత గురించి మరీమరీ చెప్పారు. ' ఇంతకుముందు సంక్షేమం, అభివృద్ధి కోసం తెలుగుదేశం ఆలోచిస్తే, ఎలా దోచుకుతిందామా అని కాంగ్రెస్ ఆలోచించింది' అని ఎద్దేవా చేశారు. సాధారణ ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలను ఆయన అన్నిచోట్లా ప్రస్తావించారు. అ ధికార కాంక్ష లేదని, ప్రజల కష్టాలను తీర్చేందుకే ఈ యాత్ర చేస్తున్నాని విడమర్చి చెప్పారు. కాళ్లు పీకుతున్నా, శరీ రం సహకరించకపోయినా మీ కష్టాల ను తీర్చాలన్న ఆశతోనే ముందుకు వె ళ్తున్నాని చెప్పారు. 'మీరు ఒక విష యం గమనించాలి. ర్రాష్టం ఇంతకుముందు ఎలావుంది, ఇప్పుడెలా ఉం ది.

ప్రజల ఆరోగ్యానికి ఐదున్నర వేల కోట్లు కేటాయించి, మద్యం ద్వారా 20 వేల కోట్లు రాబడుతున్నారు. దీంట్లో పరమార్ధాన్ని గ్రహించండి అంటూ ప్ర జలకు విజ్ఞప్తి చేశారు. తల్లికాంగ్రెస్, పి ల్ల కాంగ్రెస్‌లు నాటకాలాడుతున్నాయ ని, వీటిని చిత్తు చేయాలని విజ్ఞప్తి చేశా రు. తెలుగుదేశం హయాంలో జరిగిన అభివృద్ధి ఒక ఎత్తయితే ఇప్పుడు కాం గ్రెస్ చేస్తున్న నష్టం అత్యంత ఘోరం గా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఏది మంచో, ఏది చెడ్డో తెలుసుకునే చై తన్యం మీలో ఉంది. భీమవరం వంటి ప్రాంతం రాజకీయ చైతన్యవంతమైం ది. మీరందరూ కలిసొస్తేనే నేను చేస్తు న్న అవినీతిపై రాజీలేని పోరాటం విజయవంతం అవుతుందని అభ్యర్ధించా రు.

ఎట్టి పరిస్థితుల్లోనూ వై ఎస్సార్‌సీపీ లాంటి పార్టీలను నమ్మవద్దంటూ విజ్ఞప్తి చేశారు. పార్టీపరంగా కష్టపడి పనిచేసేవారికి గుర్తింపు ఉంటుందని, పార్టీ కార్యక్రమాలు వేరు, ప్రజా సేవ వేరని, తన పార్టీ శ్రేణులకు కూడా స్ప ష్టం చేశారు. పనిచేసే తత్వం అలవర్చుకోవాలని, అవినీతి పెరిగినప్పుడు ప్రజలే గట్టిగా నిలదీయాల్సిన ఆవశ్యకత ఇప్పుడు అన్నిచోట్లా కనపడుతోందని అన్నారు. 'మమ్మల్ని కేసుల్లో ఇరికించడానికి రాజశేఖరరెడ్డి ఎన్నో ప్రయత్నాలు చేశాడు. నేను నిజాయితీగా వ్య వహరించాను. ఏం చేసుకుంటారో చే సుకోండి అని నేను ఆనాడే చెప్పాను' అని భీమవరం బహిరంగసభలో అ న్నారు. పెదఅమిరంలో గుమ్మిగూడిన ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ ఏది జరిగితే మనకేంటిలే అని వదిలేస్తే ఈ ర్రాష్టంలో ప్రజలెవరూ సుఖంగా బతకలేరని, అందుకే తాను చేస్తున్న ఆందోళనలో, పోరాటాల్లో కలిసి రావాలని కోరారు.

తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ కలిగిన పార్టీ అని పేర్కొంటూ 'నాకు అధికార కాంక్ష లేదు. దాని కోసం ప్రా కులాడటం లేదు. ర్రాష్టాన్ని ఒక గాట న పెట్టాలన్న తపనతోనే శారీరక కష్టాలను కూడా ఓర్చుకుని వేల కిలోమీటర్ల నడకను కొనసాగిస్తున్నట్లు చంద్రబాబు చెప్పుకొచ్చారు. తన మూడో రో జు పాదయాత్రలో ఎక్కువగా స్థానిక సమస్యలకే ప్రాధాన్యత ఇచ్చారు. రాజకీయ ఆరోపణల విమర్శల వేడిని కొం త తగ్గించి నేనేం చేయాలి, మీకేం కా వాలి అంటూ ప్రశ్నలు, సమాధానాలు రాబట్టారు.పెదఅమిరం, ఎస్ఆర్‌కె ఇం జనీరింగ్ కళాశాల ప్రాంగణం, ప్ర కా శం చౌక్‌లలో మాట్లాడుతున్నప్పుడు ఆయన తన ప్రసంగాలను తగ్గించి సభికులకే ఎక్కువ మాట్లాడే అవకాశం కల్పించారు. దీంతో పలువురు తమ స మస్యలను ఏకరవు పెడుతూ వచ్చారు.

కాంగ్రెస్‌ది నాటకం

ఏలూరు :'పార్టీ కోసం త్యాగాలు చేసిన వాళ్లు, ఆస్తులను తెగనమ్ముకున్న వాళ్లు ఎంద రో ఉన్నారు. తొమ్మిదేళ్లు ప్రతిపక్షంలో ఉన్న పార్టీని రక్షించుకోవడానికి మీలో ఎంతోమంది ఎన్నో తిప్పలు పడ్డారు. అసలు సమయం వచ్చింది. ఉన్న ఆ స్తుల్లోనే కొంత అమ్ముకున్నా సరే పా ర్టీని సంరక్షించుకుందాం. గెలిపించుకుందాం' అని తెలుగుదేశం అధినేత చంద్రబాబు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. వస్తున్నా మీకోసం యాత్రలో భాగంగా పెదఅమిరంలో బసచేసిన ఆయన సోమవారం ఉదయం ఏలూ రు, చింతలపూడి నియోజకవర్గాల ప నితీరును సమీక్షించారు.

ఈ రెండు ని యోజకవర్గాల నుంచి పెద్దసంఖ్యలో హాజరైన కార్యకర్తలకు మాట్లాడే అవకాశం ఇచ్చారు. అసలు సంగతి మీరు చెప్పండి.. ఏం చేయాలో నేను చెబుతానంటూ ఆయన పార్టీ కార్యకర్తలను ఉత్సాహపరిచారు. దీంతో ఈ రెండు నియోజకవర్గాల సమీక్ష సుమారు రెం డు గంటలకుపైగానే సాగింది. పార్టీ కార్యకర్తలు మొదటి నుంచి పార్టీకి ఆ క్సిజన్‌లా ఉన్నారు. అప్పులపాలైన వా రు ఉన్నారు. చేతికి వచ్చే పంట ద్వారా వచ్చే ఆదాయంలో సగాన్ని పార్టీ కోస మే ఖర్చుపెట్టిన వారు ఉన్నారు. ఇదం తా తెలుగుదేశంలోనే సాధ్యం అని చం ద్రబాబు అన్నారు. మీ నియోజకవర్గా ల్లో పరిస్థితుల గురించి అన్నీ నాకు క్షు ణ్ణంగానే తెలుసు.

కానీ మీరు ఇప్పుడు ఉమ్మడిగా పార్టీ కోసం కలిసి పనిచేయాల్సిందే అంటూ సున్నితంగా వా ర్నింగ్‌లు ఇచ్చారు. ఇంతకుముందు పార్టీ ఎలా ఉండేది, ఇప్పుడెలా ఉంది, కార్యకర్తలు బలంగానే ఉన్నారు, నా యకులే కాస్త మారాలంటూ చురకలు అంటించే ప్రయత్నం చేశారు. ఏదో సమీక్షతో సరిపెట్టే ఉద్దేశం తనకు లేద ని, పార్టీకి పటిష్టవంతమైన నాయకత్వాన్ని అందిస్తామని చెప్పుకొచ్చారు. ఏలూరు, చింతలపూడి నియోజకవర్గా ల్లో పార్టీ పరిస్థితులపై ప్రత్యేకంగా ప్ర స్తావించకుండానే ఆయన ఎన్నో త్యా గాలు చేసి పార్టీని బతికించుకుంటూ వచ్చిన వారే ఇప్పుడు మరోమారు అ ప్రమత్తం కావాలి. ఉన్న దాంట్లోనే పా ర్టీ కోసం కూడా వినియోగించాల్సిన స మయం ఆసన్నమైంది. అధికారంలోకి వచ్చిన తర్వాత మీ అందరి భవిష్యత్ ను నేను దగ్గరుండి చూసుకుంటానని భరోసా ఇచ్చారు.

తెలుగుదేశం మాలలకు వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. వారికి తగిన ప్రాధాన్యత ఇస్తూనే ఉ న్నామని గుర్తు చేశారు. దీంట్లో ఎలాం టి అపోహలకు తావులేదన్నారు. చిం తలపూడి నియోజకవర్గం ఎస్సీ రిజర్వు డ్ నియోజకవర్గం కాబట్టి అక్కడ ని యోజకవర్గ ఇన్‌ఛార్జి నియామకంతో పాటు సమన్వయ కమిటీని ఏర్పాటు చేసేలా ఈ వారంలోనే మీరందరూ సమావేశమై ఒక నిర్ణయానికి రండి అ ని చెప్పారు. మిగతా పార్టీలు చేస్తున్న విమర్శలు, ఆరోపణలను కూడా తిప్పికొట్టాలి. అప్పుడే పార్టీ బలోపేతమవుతుందన్నారు. ఆరు నెలల ముందే అ భ్యర్ధులను ఖరారు చేస్తాను, వారు పనిచేసే తీరునుబట్టే తుది జాబితా కూడా ఉంటుందని ప్రకటించారు. ఎవరైతే పార్టీ కోసం కష్టపడతారో వారికే అవకాశం ఉంటుందని, సీనియర్లతో పాటు పార్టీ కోసం పనిచేస్తున్న కార్యకర్తలు అ వకాశమిస్తామన్నారు.

ఆ తర్వాత పార్టీ కార్యకర్తలు కూడా తమ మనోభిప్రాయాలను అధినేత ఎదుట ఉంచారు. మీరు సీఎం కావాలి, మీ పాదయాత్ర మాకు స్ఫూర్తినిచ్చింది. మా నియోజకవర్గానికి కన్వీనర్‌ను నియమించండి. ఇక ఇప్పటి నుంచి నిద్రపోం, పార్టీని గెలిపించుకుంటాం అని లింగపాలెం మండలానికి చెందిన చలపతిరావు స్ప ష్టం చేశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ సెల్‌ను ఇంతకుముందు లింగపాలెంలో మీ మాదిరిగానే పాదయాత్రలు చేశాం. అ యితే పార్టీలో ఏమైనా అపోహలు ఉం టే కొందరు వాటిని మర్చిపోవాలి. మి మ్మల్ని సీఎంను చేసేలా వాళ్లూ కష్టపడాలి. అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు ఎవరికి న్యాయం చేస్తారో అది మీ ఇష్టం అని వెంకటేశ్వరరావు అన్నా రు.

ప్రతి చిన్నదానికి మేమే ఖర్చులు బరాయించి పార్టీ కోసం కష్టపడుతు న్నాం. కన్వీనర్‌ను నియమించండి అని నవీన్ విజ్ఞప్తి చేశారు. ఏలూరు నియోజకవర్గానికి చెందిన దాసరి ఆంజనేయులు మాట్లాడుతూ మీరు పార్టీలో అంబేద్కర్ లాంటివారని కీర్తించారు. మాల వర్గాలకు నష్టం చేసేలా జగన్ వంటి నేతలు వర్గీకరణ చేస్తామని ప్రకటించినప్పుడు ఇదే సామాజికవర్గానికి చెందిన జూపూడి ప్రభాకరరావు నోరెత్తలేకపోయారని, అయితే మేము మా త్రం వీటిని ఖండిస్తూ వచ్చామన్నారు. మాదిగలంతా పార్టీకే కట్టుబడి ఉన్నారన్న అపోహ అవసరం లేదని ఆయన పార్టీ అధినేతకు సూచించారు. ఏలూరులో పార్టీ బ్రహ్మాండంగా ఉందన్నా రు.

ఆంజనేయులు ప్రసంగాన్న చంద్రబాబు సైతం అభినందించారు. వైశ్యులకు సముచిత న్యాయం చేయాలి మీ హయాంలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు వ చ్చాయి. ఇప్పుడా పరిస్థితి లేదు. కృష్ణా జిల్లాకు ఎన్టీ ఆర్ పేరు పెట్టాలని పైడే టి రఘు సూచించారు. పార్టీ కోసం పనిచేసే వారం ఎంతోమంది ఉన్నాం. మీరు సీఎం అయితే మాకు అదే పదిలేవు అని ఏలూరు కార్యకర్త మల్లెపు రాము అన్నారు. లీగల్ సెల్‌లో పనిచేస్తున్నాం. అనుబంద సంఘాలను కూ డా మీరు పరిగణనలోకి తీసుకోవాలని సుబ్రహ్మణ్యేశ్వరి తన అభిమతాన్ని చంద్రబాబు ముందుంచారు. సమావేశంలో పార్టీ అధ్యక్షురాలు సీతారామలక్ష్మి, మాగంటిబాబు, ఎమ్మెల్యే టి.వి. రామారావు, చింతమనేని ప్రభాకర్, అంబికా కృష్ణ, బడేటి బుజ్జి, కొక్కిరిగ డ్డ జయరాజు, పాలీ ప్రసాద్, ఉప్పాల జగదీష్‌బాబు, ముళ్లపూడి బాపిరాజు, గన్ని వీరాంజనేయులు, ముత్తారెడ్డితో పాటు పలువురు సీనియర్ నాయకులు పాల్గొన్నారు.

పార్టీని రక్షించండి

భీమవరం/భీమవరం అర్బన్/పాలకోడేరు : చంద్రబాబు నాయుడు స్వయంగా పెట్రోల్ ఫిస్టన్ పట్టుకుని బైకులకు పెట్రోల్ పంపింగ్ చేస్తే రెండు లీటర్లు ఫ్రీ.. ఆశ్చర్యపోకండి ఇదంతే. భీమవరం పట్టణంలో సోమవారం రాత్రి పాదయాత్ర నిర్వహించిన చంద్రబాబు పద్మాలయ థియేటర్ పక్కన ఉన్న పెట్రోల్ బంకులోకి వెళ్ళారు. ఇంతలో సూర్యనారాయణ అనే వ్యక్తి బైకుతో వచ్చాడు. బాబు పెట్రోల్ ధరలు ఎలా పెరుగుతున్నాయంటూ ప్రశ్నించారు. నెలకోసారి పెంచుతున్నారు సార్.. చాలా దారుణంగా ఉంది అం టూ బదులిచ్చారు. ఈ ప్రభుత్వం పెట్రోల్ ధరలతో మోత మోగిస్తూ ప్రజలకు వాతలు పెడుతోందని చంద్రబాబు ఎద్దేవా చేశారు. అతనికి పెట్రోల్ కొట్టారు. తదుపరి అతనికి కొట్టిన రెండు లీటర్ల పెట్రోల్‌కు చంద్రబాబు బిల్లు కట్టారు. ఇదీ చంద్రబాబు పెట్రోల్ కథ.

విద్యుత్ కోతతో ఉపాధి కరువు..చంద్రబాబు వద్ద మెకానిక్ గోపీ ఆవేదన

జువ్వలపాలెం రోడ్డులో నడుస్తున్న చంద్రబాబు ఆ సమీపంలో ఉన్న మెకానిక్ షెడ్‌లోకి వెళ్ళారు. పనులు ఎలా ఉన్నాయంటూ మెకానిక్ గోపీని ప్రశ్నించారు. కరెంట్ లేక ఎటువంటి పనులు చేసుకోలేకపోతున్నామంటూ ఆ మెకానిక్ వాపోయాడు. ఈ విద్యుత్ కోత వల్ల ఒక్కొసారి ఆదాయం కూడా ఉండడం లేదంటూ చెప్పాడు. మెకానిక్ చేసే పనుల్లో వచ్చే ఆదాయం గురించి చంద్రబాబు ప్రశ్నించారు. ఇబ్బందులతో కూడి ఉందంటూ ఆ మెకానిక్ బదులిచ్చాడు. షెడ్‌లో పరికరాలను చంద్రబాబు పరిశీలించారు.

బాల అల్లూరితో చంద్రబాబు..

అడ్డవంతెన ప్రాంతంలో అల్లూరి సీతారామరాజు వేషం వేసిన చిన్నారిని చంద్రబాబు ఎత్తుకున్నారు. సీతారామరాజు వేషంలో ఆ బాలుడిని వారు కుటుంబ సభ్యులు తీసుకురాగా చంద్రబాబు ఆసక్తిగా ఎత్తుకున్నారు. అంతకు ముందే చంద్రబాబు తన ఉపన్యాసంలో అల్లూరి సీతారామరాజు స్ఫూర్తి పొం దాలంటూ విద్యార్థులకు పిలుపునిచ్చారు. తరువాత పాదయాత్ర సాగిస్తుండగా అల్లూరి వేషధారణలో చిన్నారి కన్పించగా అప్యాయం గా ఎత్తుకుని ముద్దాడారు.

ప్రజలపై పెట్రో వాతలు

జగన్‌ను బయటకు తెచ్చుకునేందుకే 'ఆఫర్'
వైసీపీ.. కాంగ్రెస్ బినామీ: పయ్యావుల
వైఎస్ మృతి కుట్ర గాలికిపోయిందా: ఎర్రబెల్లి

హైదరాబాద్ : 'కడప పౌరుషానికీ, ఢిల్లీ అహంకారానికీ మధ్య పోటీ' అని ప్రగల్బాలు పలికిన జగన్ ఇప్పుడు వాటిని గాలికి వదిలేశారని టీడీపీ ధ్వజమెత్తింది. కాంగ్రెస్ కాళ్ల ముందు సాగిలపడుతున్నారని ఎద్దేవా చేసింది. కాంగ్రెస్ పార్టీతో పొత్తుకు సిద్ధమని వైసీపీ గౌరవాధ్యక్షురాలు విజయలక్ష్మి చేసిన బహిరంగ ప్రకటనే దీనికి నిదర్శమని తెలిపింది. 'తమ పార్టీని హోల్‌సేల్‌గా, రిటైల్‌గా అమ్ముకోవడానికి వైఎస్ కుటుంబం బేరాలు మొదలు పెట్టింది' అని టీడీపీ ప్రధాన కార్యదర్శి పయ్యావుల కేశవ్ ఆరోపించారు.

సోమవారం ఆయన ఎన్టీఆర్ భవన్‌లో విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ మాటమాత్రమైనా అడగకుండానే మద్దతు ఇస్తామంటూ వెంట పడే పరిస్థితికి వైసీపీ దిగజారిందని అన్నారు. "ఇంకా ఎందుకు మీ దిక్కుమాలిన పాదయాత్రలు? ఎవరిని మోసం చేయడానికి? ఎన్నికల ముందు ప్రజలను మోసం చేసి, ఆ తర్వాత మీ చీకటి ఒప్పందాలతో కలిసిపోతారా? జగన్ ఆర్థిక నేరాల కేసుల్లో పీకలదాకా కూరుకుపోవడంతో ఆ పార్టీ నేతలకు భయం పట్టుకొంది. కాంగ్రెస్‌ను మంచి చేసుకొని బయటకు రావడానికే ఈ ఆఫర్లు ప్రకటిస్తున్నారు. పోయిన అసెంబ్లీ ఎన్నికల ముందు పీఆర్పీ కూడా ఇలాగే చేసింది.

ఇవన్నీ కాంగ్రెస్‌కు బినామీ పార్టీలు'' అని పయ్యావుల మండిపడ్డారు. కర్ణాటకలో గాలి జనార్దన్ రెడ్డి పార్టీకి పట్టణ ప్రాంత స్థానిక సంస్థల ఎన్నికల్లో డిపాజిట్లు దక్కలేదని, ఇక్కడ జగన్ పార్టీకి కూడా అదే గతి పట్టబోతోందని జోస్యం చెప్పారు. " స్థానిక సంస్థల ఎన్నికల్లో జగన్ పార్టీకి సహకార ఎన్నికల ఫలితాలు ఎదురుకావడం ఖాయం. ఆ ఎన్నికలు రాకూడదనే అవిశ్వాసం పెడతామని హడావుడి చేస్తోంది'' అని కేశవ్ పేర్కొన్నారు. ఢిల్లీలో కాంగ్రెస్ పెద్దలకు మాత్రమే అర్థం కావాలన్న కోరికతో, వారు చదివే ఆంగ్ల పత్రికలకు జగన్ పార్టీ నేతలు ఇంటర్వ్యూలు ఇ స్తున్నారని అన్నా రు. కాగా, వైసీపీ కూడా పీఆర్పీ బాటలోనే ఉందని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి పెళ్లకూరులో విమర్శించారు. వైఎస్ విజయలక్ష్మి రాష్ట్రపతిని కలిసి మాట్లాడినప్పుడే ఇరు పార్టీల విలీనం ప్రస్తావన జరిగినట్లు తెలుస్తోందన్నారు.

అవన్నీ బెయిల్ పాట్లు: ఎర్రబెల్లి ఎద్దేవా
'వైఎస్ రాజశేఖరరెడ్డి మరణం వెనుక కాంగ్రెస్ పెద్దల కుట్ర ఉందని ఉప ఎన్నికల ప్రచారంలో విజయలక్ష్మి ఊరూరా చెప్పారు. ఇప్పుడు అదే కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామంటున్నారు. వైఎస్ మరణం కుట్ర గాలికి పోయిందా' అని టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకరరావు ప్రశ్నించారు. జగన్‌కు బెయిలు కోసం ఆయన పార్టీ పడరాని పాట్లు పడుతోందన్నారు. "వైసీపీ మద్దతు కోసం కాంగ్రెస్ పార్టీ కూడా సీబీఐకి సహకరించకుండా తెర వెనుక ప్రయత్నాలు చేస్తోంది. వైసీపీ అసలు గుట్టు ఇప్పుడు బయట పడింది. ఎప్పటికైనా పిల్ల కాంగ్రెస్ తల్లి కాంగ్రెస్‌లో కలవడం ఖాయం' అని ఆయన అన్నారు.

'నాడు షర్మిల అవిశ్వాస తీర్మానం అన్నారు. నేడు... వైఎస్ విజయలక్ష్మి 2014 ఎన్నికల తర్వాత కాంగ్రెస్‌తో పొత్తు అంటున్నారు. రేపు... జగన్ వచ్చి కాంగ్రెస్‌లో విలీనం అంటారా?' - ట్విట్టర్‌లో నారా లోకేశ్

కాంగ్రెస్‌తో కాళ్లబేరం ఇదేనా కడప పౌరుషం?

భారతీయ రైల్వే ఆర్థిక పట్టాలు తప్పిందని, బడ్జెట్‌లో చెబుతున్న దానికి, చేస్తున్న దానికీ పొంతన లేదని తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ నాయకుడు నామా నాగేశ్వరరావు విమర్శించారు. బడ్జెట్‌పై చర్చ సందర్భంగా సోమవారం ఆయన లోక్‌సభలో మాట్లాడుతూ.. రైల్వే లైన్ల సాంద్రతలో ఆంధ్రప్రదేశ్ వెనుకబడిందని, ప్రతి వెయ్యి కిలో మీటర్ల సగటు లైన్ల నిర్మాణంలో ఆంధ్రప్రదేశ్‌లో 18.2 కి.మీ.లే ఉన్నాయని, దీనిని బట్టే వెనుకబాటు తనాన్ని అర్థం చేసుకోవచ్చన్నారు. ఆంధ్రప్రదేశ్ పట్ల రైల్వే శాఖ నిర్లక్ష్యం వహిస్తోందని, ఇది సమంజసం కాదన్నారు.

నిర్లక్ష్యం తగదు: నామా

బాబ్లీ ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఆందోళన బాట పట్టనున్నారు. ఈ మేరకు మంగళవారం కలెక్టరేట్ ఎదుట మహాధర్నా చేపట్టనున్నారు. ఈపాటికే ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆందోళనలో పార్టీ సీనియర్ నాయకులు, ఎమ్మెల్యేలు మండవ వెంకటేశ్వరరావు, అన్నపూర్ణమ్మ, హన్మంత్ షిండే, ఎమ్మెల్సీలు అరికెల నర్సారెడ్డి, వీజీగౌడ్‌లతో పాటు వెయ్యి మందికి పైగా నాయకులు, కార్యకర్తలు పాల్గొననున్నారు.

నేడు టీడీపీ మహా ధర్నా

ఇదే జగన్ పార్టీ రంగు!
అదేమాట చెప్పిన విజయలక్ష్మి
2014 తరువాత విలీనమేనట
పశ్చిమ యాత్రలో చంద్రబాబు ధ్వజం

ఏలూరు : " వైసీపీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో 'కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోనున్నాం. 2014 తర్వాత కాంగ్రెస్‌లోనే కలుస్తా'మని స్పష్టం చేశారు. ఆ పార్టీ విజయ రహస్యం ఏమిటన్నది ఇప్పుడు బయటపడింది'' అని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. వైసీపీని కాంగ్రెస్ లో విలీనంచేసే దిశగా ఎత్తుగడలు ప్రారంభమయ్యాయని విమర్శించారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరం ప్రాంతం పెద అమిరం గ్రామంలో సోమవారం ఆయన పాదయాత్ర ప్రారంభించారు. భీమవరం క్రాస్‌రోడ్స్, విస్సాకోడేరు, గొరగనమూడి, పాలకోడేరు మార్కెట్‌యార్డ్ వరకు నడిచారు. అంతకుముందు చింతలపూడి, ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గాల కార్యకర్తలతో మాట్లాడినప్పుడు, భీమవరంలో జరిగిన సభలోనూ విజయలక్ష్మి ఇంటర్వ్యూ సారాంశాన్ని చంద్రబాబు.. ప్రజలకు వివరించారు.

'నేను మొదటి నుంచి తల్లి కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్ రెండూ విలీనం కాక తప్పదని చెబుతూనే ఉన్నాను. ఇప్పుడు ఆ రెండు పార్టీలూ ఒకే గూటికి చేరుకోవడం ఖాయమ''ని జోస్యం చెప్పారు. '2014 ఎన్నికల తర్వాత కాంగ్రెస్‌కు సహకరిస్తాం' అనే ఆమె మాటల్లో అంతరార్థం ఏమిటనేది గమనించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. "జగన్‌ను కేసుల నుంచి బయటపడేసేందుకు తొలినుంచీ ఇలాంటి ప్రయత్నాలు చేస్తూనే వస్తున్నారు. ఇప్పుడు అదే విషయం రట్టయింది'' అని విమర్శించారు.

పార్టీలను కలిపేసుకోవడానికి కాంగ్రెస్ ఎత్తుగడలు వేయడం కొత్తేమీ కాదని, బ్రహ్మానందరెడ్డి కాంగ్రెస్ నుంచి చిరంజీవి పార్టీ వరకు.. ఇదే కథ కొనసాగిందని గుర్తుచేశారు. పాదయాత్రలో భాగంగా ఆయన ఎస్ఆర్‌కే ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులను కలుసుకున్నారు. "సార్.. లోకేశ్‌కి తెలుగు యువత విభాగం బాధ్యతలు ఎందుకు అప్పగించరు?'' అంటూ విద్యార్థులు ప్రశ్నించగా, నవ్వి ఊరుకున్నారు. మార్గమధ్యంలో చిన్నాచితకా వ్యాపారులను కలిసి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.

భీమవరం ప్రకాశం చౌక్‌లో జరిగిన బహిరంగసభలో విద్యార్థులు, మహిళలు, ఆక్వా రైతులు, వ్యాపారులు, బాధితులకు మైక్ ఇచ్చి మాట్లాడించారు. అంతకుముందు చింతలపూడి, ఏలూరు నియోజకవర్గాల పరిస్థితిపై కార్యకర్తలతో సమావేశమయ్యారు. "ఆశలు ఉండొచ్చుగానీ పార్టీపరంగా అందరూ ఎన్నికలకు సమాయత్తం కావాలి. ఎన్నికలకు ఆరు నెలల ముందే అభ్యర్థులను ప్రకటిస్తామ''ంటూ కార్యకర్తలను ఉత్సాహపరిచారు. నియోజకవర్గ ఇన్‌చార్జిలనే అభ్యర్థులుగా ప్రకటిస్తామని, ఎక్కడైనా ప్రజా వ్యతిరేకత వస్తే కొత్తవారికి అవకాశం ఇస్తామని చెప్పుకొచ్చారు. కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు, పశ్చిమగోదావరి జిల్లాకు అల్లూరి సీతారామరాజు పేరు పెట్టాలన్న కార్యకర్తల డిమాండ్‌ను ఆయన ఆమోదించారు.

కాంగ్రెస్‌తో కలయికే విజయ రహస్యం

"సార్! కట్నం కోసం ప్రాణాలు తీస్తారా?. ఇదేం ఆటవికం''.. ఈ ప్రశ్న రోజంతా నన్ను వెంటాడింది. అప్పటికి ఏమి సమాధానం చెప్పినా.. తీవ్రంగా ఆలోచింపజేసింది. నేనే కాదు, యావత్ సమాజమూ ఆలోచించాల్సిన ప్రశ్న ఇదనిపిస్తోంది. అడిగింది ఓ ఇంజనీరింగ్ విద్యార్థిని కావడం వల్ల కూడా ఈ ప్రశ్న బాగా కదిలించేసింది. చదువుకొనే అమ్మాయిలూ అభద్రత అనుభవిస్తున్న సమాజం ఇది. స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్లయినా ఆడపడుచులకు అభయహస్తం లభించకపోవడం నిజంగానే సిగ్గుచేటైన విషయం.

ఇది కేవలం ఓ విద్యార్థిని సమస్య కాదు.. మొత్తం సమాజమే జాగృతమై ముక్తకంఠంతో బదులివ్వాల్సిన ప్రశ్న ఇది. భీమవరంలోని ప్రైవేట్ కాలేజీ విద్యార్థులను కలిసినప్పుడు 'నిర్భయ' నుంచి అవినీతి దాకా.. వాళ్లు వేసిన ప్రశ్నలు నన్ను ఉత్సాహపరిచాయి. వట్టి మాటలు కట్టిపెట్టి.. గట్టి మేల్ చేయడానికి యత్నించి ఎదురుదెబ్బలు తిన్న కథలెన్నో వినిపించారు. లంచం పెట్టనందుకు కొన్నేళ్లుగా మండల ఆఫీసుల చుట్టూ తిరగాల్సి వస్తున్నదన్న ఆ అమ్మాయి ఆవేదన, పట్టుదల ముచ్చటేశాయి. పేరుకు తగినట్టే యువత 'కీర్తి'ని పెంచే ఇలాంటి ఆడబిడ్డలే కావాలిప్పుడు!

కూలీలు, హమాలీలు, మెకానిక్కులు, దర్జీలు.. భీమవరం క్రాస్ వైపుగా పోతున్నప్పుడు కలిసిన వీరంతా వినిపించిన కథలన్నీ ఒక్కటేననిపించింది. పైగా.. వాళ్ల సమస్యలన్నీ పరస్పరం ముడిపడినవి కూడా. చేతి నిండా పని దొరికితేనే కూలీలు, హమాలీలు కోలుకుంటారు. వాళ్ల చేతుల్లో డబ్బులు ఆడితేనే, అదీఇదీ కొనగలుగుతారు. అప్పుడే మెకానిక్ చేతుల్లో సుత్తికి, దర్జీల కత్తెరకు పని పడుతుంది. ఇప్పటికే పొలమారిన ఈ బతుకులకు పన్నులు, సర్‌చార్జీలంటూ మరింత పొగబెట్టడం ఎంత దారుణం!

'కీర్తి'ని పెంచే యువతరమిది!


ఇంద్రవెల్లి : వచ్చే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రాగానే రైతుల రుణమాపీ చేయనున్నట్లు ఆదిలాబాద్ ఎంపీ రాథోడ్ రమేష్ అన్నారు. ఆదివారం మండలంలోని దొడంద, డోం గ్రగాం, కేస్లాపూర్ తదితర గ్రామాల్లో పర్యటించి ఆ పార్టీ జెండాను ఆ విష్కరించారు. ప్రజల సమస్యలను తెలుసుకోనేందుకు చంద్రబాబు నాయుడు పాదయాత్ర చేస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయంలో అవినీతి రాజ్యమేలిందన్నారు.

ఎరువుల, విత్తనాల ధరలు విపరీతంగా పెరిగిపోయాయని అన్నారు. పంటకు గిట్టుబాటు ధర కల్పించడం లేదన్నారు. ఘాట్ రోడ్డు నిర్మాణానికి కృషి చేస్తానన్నారు. డోంగర్ గాంలో రూ. 15 లక్షతో బ్రిడ్జి నిర్మాణం చేపట్టేందుకు హామీ ఇచ్చారు. గోండుగూడలో శివాలయ నిర్మాణానికి రూ. 50 వేలు అందిస్తానన్నారు. కార్యక్రమంలో దిలిప్ మోరె, నాయకులు కనక తుకారాం, ఆడేధన్‌లాల్, మసూ ద్, భారత్ బామ్నే, విజయ్‌కుమార్, రోహిదాస్, ఇందుబాయి పాల్గొన్నారు.

అధికారంలోకి వస్తే... రుణాలు మాఫీ

శింగనమల: తెలుగుదేశం పార్టీ తరుపున ఎమ్మెల్సీ పదవిని శింగనమల నియోజకవర ఇన్‌చార్జ్ శమంతకమణికి ఇవ్వడంతో మండల తెలుగు తమ్ముళ్లు హర్షం వ్యక్తం చేశారు. ఆదివారం శింగనమలలో మండల అధ్యక్షుడు అమ్మలదిన్నె చితంబరి దొర, రాష్ట్ర తెలుగు యువత కార్యదర్శి మాసూల చంద్రమోహన్ మాట్లాడుతూ టీడీపీలో కష్టపడి పనిచేసే వ్యక్తికి ఎప్పుడైనా పార్టీలో భవిష్యత్ ఉంటుందనే దానికి నిదర్శనంగా పామిడి శమంతకమణికి ఎమ్మెల్సీ పదవి ఇవ్వడమన్నారు నియోజకవర్గంలోని కార్యకర్తలు, ప్రజలతో కలసి ఎన్నో కార్యక్రమాలు శమంతకమణి చేసిందన్నారు.

ఎమ్మెల్సీగా శమంతకమణి ఎంపికపై హర్షం

తుని: జిల్లాలో రాజకీయ సమీకరణాలు కొత్తరూపు సంతరించుకుంటున్నాయి. మరికొద్ది రోజుల్లో వస్తున్నా... మీ కోసం పాదయాత్ర ద్వారా చంద్రబాబు జిల్లాకు రానున్న సందర్భంగా ఆ పార్టీ భారీ వ్యూహ రచనకు దిగింది. ఆయన యాత్రలో భారీ ఎత్తున కొత్త నేతలను సమీకరించి పార్టీ తీర్థం ఇచ్చేందుకు రంగం సిద్ధం చేస్తోంది. పోతుల విశ్వం ఆదివారం తుని వచ్చి యనమల రామకృష్ణుడిని రహస్యం కలవడంతో ఇందుకు అద్దం పడుతోంది. ఆయన ఆరేళ్ల క్రితం ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీగా పోటీచేసి స్వల్ప తేడాతో ఓటమిపాలయ్యారు. కొంత కాలంగా ప్రజారాజ్యం పార్టీలో కొనసాగిన ఆయన పిఠాపురం, కాకినాడ రూరల్‌కు ఎమ్మెల్యే టిక్కెట్ ఆశించి భంగపడడంతో పార్టీ నుంచి వైదొలిగారు.

ఆయనకు పలు విద్యా సంస్థలు ఉన్నాయి. యనమలకు శుభాకాంక్షలు తెలిపేందుకు తన అనుచరగణంతో వచ్చిన ఆయన సుమారు గంట కాలంపాటు ఏకాంత చర్చలు జరపడం చర్చనీయాంశమైంది. త్వరలో చంద్రబాబు పాదయాత్రలో విశ్వం పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు సమాచారం. పార్టీ కూడా అందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. బలమైన సామాజిక వర్గానికి చెందిన నేతగా విశ్వం కాకినాడ పార్లమెంటు స్థానం నుంచి లోక్‌సభకు తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేయాలని భావిస్తున్నట్టు కొందరు ముఖ్య నేతలు చెబుతున్నారు. పార్టీ కూడా భరోసా ఇచ్చినందునే ఆయన యనమలను కలిశారంటున్నారు

ముందుగా కాకినాడ లోక్ సభా స్థానానికి పార్టీ ఇన్‌చార్జిగా చంద్రబాబే ప్రకటిస్తారని తెలుస్తోంది. విశ్వంతో పాటు మరికొందరు ఇతర పార్టీ నేతలు చంద్రబాబు యాత్రలో పార్టీలో చేరేందుకు మంతనాలు సాగిస్తున్నట్లు సమాచారం. మరికొద్ది రోజుల్లో ఇటువంటి నేతలు ఎవరనేది బయపడే అవకాశముంది.

టీడీపీలో చేరనున్న పోతుల విశ్వం?

రంగంపేట: థర్మల్ ప్రాజెక్టు నిర్మాణానికి వ్యతిరేకంగా పోరాడుతున్న బాలవరం, దొంతమూరు ప్రజలకు టీడీపీఈ మద్దతు ఉంటుందని రాజానగ రం ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్ తెలిపారు. ఆదివారం అనపర్తి టీడీపీ ఇన్‌చార్జి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఆయా గ్రామాల్లోని రిలే నిరాహర దీక్షా శిబిరాలను పెందుర్తి సందర్శించారు. థర్మల్ ప్రాజెక్టు నిర్మాణం వ ల్ల తీవ్రమైన అనారోగ్యాలు వస్తాయని శనివారం జరిగిన డీఆర్‌సీ సమావేశం లో చర్చించామన్నారు. ప్రతి పో రాటానికి ప్రజల మద్దతు ఉంటే విజయమ వుతాయన్నారు. ఇక్కడ విద్యుత్ ఉత్ప త్తి చేయడం కాకుండా బొగ్గు దొరికే చో టే ఫ్యాక్టరీలు నిర్మించాలని పెందుర్తి సూచించారు.

అసెంబ్లీలో థర్మల్ ప్రాజె క్టు విషయాన్ని ప్రస్తావించనున్నట్లు పెందుర్తి తెలిపారు. కమిటీ నిర్ణయానికి కట్టుబడి పనిచేయాలని, పార్టీ రహితం గా అందరూ పనిచేయాలని పెందుర్తి కోరారు. «థర్మల్ ఉద్యమ నాయకుడు పడాల రాము భార్య సునీత మాట్లాడు తూ ప్రాజెక్టు విషయాన్ని హోం మం త్రి సబితా ఇంద్రారెడ్డికి కాకినాడలో వివరించామన్నారు. థర్మల్ బాధితుల ను కలెక్టరేట్‌లోకి రాకుండా అనపర్తి ఎ మ్మెల్యే శేషారెడ్డి ఆపించారని, తనకు తెలిసిన వ్యక్తి ఉండడంతో హోం మంత్రిని కలిశానన్నారు.

అనపర్తి నియోజ క వర్గ టీడీపీ ఇన్‌చార్జి నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడుకు బాలవరం విషయాన్ని కృష్ణా జిల్లా పర్యటనలో వివరించామన్నారు.

కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షుడు పెండ్యాల నళినీ కాంత్, రాష్ట్ర తెలుగురైతు ఉపాధ్యక్షుడు తనకాల నాగేశ్వరరావు, వాణిజ్య విభా గం కార్యదర్శి డి.లాజర్, జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి ఉద్దండ్రావు శ్రీనివాసరావు, ఎస్ నాగేశ్వరరావు పాల్గొన్నారు

థర్మల్ విద్యుత్ ప్లాంట్ బాధితులకు టీడీపీ మద్దతు

సిరిసిల్ల టౌన్ : మహారాష్ట్ర బాబ్లీ ప్రాజెక్టు పాపం నుంచి టీఆర్ఎస్ తప్పించుకోవడానికే టీడీపీపై విమర్శ లు చేస్తుందని ఆ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి రెడ్డబోయిన గోపి అన్నారు. టీడీపీ పట్టణ కార్యాలయంలో ఆదివా రం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ టీడీపీ అధికారంలో ఉన్నప్పుడే బాబ్లీ ప్రాజెక్టుకు అనుమతి వచ్చిందని, ప్రాజెక్టు నిర్మాణాలకు రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతులివ్వమని కేం ద్ర ప్రభుత్వమే అనుమతి ఇస్తుందన్న విషయాన్ని ఎమ్మెల్యేకేటీఆర్ గుర్తెరుగాలన్నారు.

2001మే నుంచి టీడీపీ ఉద్యమిస్తుందని ఉత్తర తెలంగాణలోని 19 లక్షల ఎకరాల సాగు భూమి ఎడారిగా మారుతుందని పార్లమెంట్ ,అసెంబ్లీలో టీడీపీ ప్రాస్థావించిందన్నారు. 2007 లో బాబ్లీని సందర్శించడానికి వెళ్లిన టీడీపీ ఎమ్మెల్యేలపై మహారాష్ట్ర ప్రభు త్వం లాఠీచార్జి చేయించి జైల్లో పెట్టార న్నారు. విపక్షాలతో కలిసి 22మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీ ఎదుట ఆ తరువాత ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ధర్నా చేసి కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిందన్నారు. బాబ్లీ ప్రాజెక్టును సందర్శించడానికి వెళ్లిన మాజీ ముఖ్యమంత్రి చం ద్రబాబు, ఎమ్మెల్యేలను మహారాష్ట్ర ప్రభుత్వం ధర్మాబాద్‌లో అరెస్ట్ చేసిందని తెలిపారు. ఉప ఎన్నికల్లో లబ్ధి కోసమే డ్రామా చేసిందని టీఆర్ఎస్ ఆరోపించడం సిగ్గుచేటన్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పెంచుకోవడమే తప్ప ప్రజా సమస్యలను ఏనాడూ పట్టించుకోలేదని ఆరోపించారు.

బాబ్లీ ప్రాజెక్టు నిర్మాణంపై కంటి తుడుపుగా టీఆర్ఎస్ కోర్టులో కేసు వేసి వదిలేసిందని పేర్కొన్నారు. ఈ సమావేశంలో టీడీపీ పట్టణ అధ్యక్షుడు చిటికెన కనుకయ్య, కార్యదర్శి భీమవరపు మనోహర్, జిల్లా కార్యదర్శి ఏనుగుల ఎల్లయ్య, లెంకల లక్ష్మారెడ్డి, కామినేని రవీందర్, తెలుగు యువత పట్టణ అధ్యక్షుడు గుండ్లపెల్లి పూర్ణచందర్, ఉపాధ్యక్షుడు వంగరి గోపి తదితరులు పాల్గొన్నారు.

బాబ్లీ పాపం తప్పించుకోవడానికే టీఆర్ఎస్ విమర్శలు

( మండవల్లి ) రాష్ట్రంలోనే కీలమైన ఆంశాలపై వ్యూహాత్మకమైన తుది నిర్ణయాలు తీసుకునేందుకు తెలుగుదేశం పార్టీ కి కైకలూరే వేదిక అయింది. రాష్ట్రంలో అనుచిత రాజకీయ పరిణామాలు...అసెంబ్లీ సమావేశాలు సమీపిస్తున్న ఉత్కంఠ పరిస్థితుల్లో ప్రతిపక్షనేత హోదాలో ఉన్న చంద్రబాబు కైకలూ రు పాదయాత్రలో ఉండటంతో అందరి దృష్టీ కైకలూరు వైపు పడింది. చంద్రబాబు ఎలా స్పందిస్తారో... అవిశ్వాసం ప్రవేశపెట్టేస్తారా...ప్రభుత్వం పడిపోతుందా...అనే రీతిలో ఒకవైపు , ఎమ్మెల్సీ అభ్యర్థిగా టీడీపీ ఎవరి పేరు వెల్లడిస్తుందో నని మరోవైపు అంతా ఉత్కంఠగా కైకలూరు నుంచి వెలువడే సమాచారం వైపు ఎదురు చూశారు. నియోజకవర్గంలో ఈనెల 6నుంచి 9వరకు చంద్రబుబు పాదయాత్ర సాగింది. నియోజకవర్గంలో మూడుచోట్ల చంద్రబాబు నిద్ర చేశారు.

అయా బస చేసిన ప్రాం తాల పేరు రాష్ట్రస్థాయిలో గుర్తుండే రీతిలో రెండుచోట్ల రాజకీయ కీలకమైన సమావేశాలు, ఒకచోట రాష్ట్ర మహిళదినోత్సవాన్ని నిర్వహించారు. 7వతేదీన చంద్రబాబు బస చేసిన దాకరంప్రాంతంలో టీడీపీ సీఎల్‌పీ సమావేశాన్ని నిర్వహించటంతో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నేతలు తరలివచ్చారు. అసెంబ్లీ సమావేశాల్లో అవిశ్వాసతీర్మానం ప్రవేశపెట్టాలా? వద్దా? అనే ఆంశంపై సుదీర్ఘస్థాయిలో చర్చించి, ఎట్టకేలకు తీర్మానాన్ని ప్రవేశపెట్టే యోచన విరమించుకున్నట్లు ప్రకటించారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలైన విద్యుత్‌కోత, సర్‌చార్జీల పెంపు, నిత్యావసర వస్తుల ధరల పెరుగుదలపై అసెంబ్లీలో పోరు సాగించేందుకు చంద్రబాబు దాకరంలోనే సూచనలు ఇచ్చారు. 8వతేదీన రాష్ట్ర స్థాయిలో చావలిపాడు పేరు నిలచే రీతిలో మహిళ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.

ఈ కార్య క్రమానికి రాష్ట్ర స్థ్ధాయి మహిళా నేతలు తరలివచ్చారు. అంతకుముం దు బస శిబిరం వద్దే గుడివాడ, పామర్రు నియోజక వర్గాల సమీక్ష సమావేశాన్ని చంద్రబాబు నిర్వహించటం నియోజక వర్గాల కార్యకర్తల్లో ఉత్సాహాన్ని కలిగించింది. పార్టీలో తమసమస్యలను సాక్షాత్తూ పార్టీ అధ్యక్షుడికే విన్నవించే అవకాశం వచ్చినందుకు ఎంతో సంతృప్తి కలిగినట్లు ఆనందోత్సాహాలను వ్యక్తంచేశారు. చంద్రబాబు బస చేసిన ఆలపాడులో 9వతేదీ న ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థుల జాబితా ఖారారు పక్రియను చేపట్టేందుకు టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుల సమావేశాన్ని నిర్వహించడంతో ఆలపాడు గ్రామం పేరుకూ డా రాష్ట్ర స్థాయిలో వినిపించింది.

టీడీపీలో అతిర«థమహారధులు ఆలపాడుకు రావటంతో కోలహాలంగా మారింది. అక్కడే కైకలూరు, మైలవరం నియోజక వర్గాల పార్టీ సమీక్ష సమావేశాలను కూడా చంద్రబాబు నిర్వహించారు. అదే రోజు ఉప్పటేరు వరకు పాదయాత్ర సాగించి రాత్రి 8గంటలకు కృష్ణాజిల్లా వాసులకు బై..బై..చెబుతూ పశ్చిమగోదావరి జిల్లాలోకి చంద్రబాబు పాదయాత్ర ప్రవేశించింది.

టీడీపీ వ్యూహానికి వేదికైన కైకలూరు

(ఒంగోలు కార్పొరేషన్):దేశంలో దొంగలు పడ్డారు... నేటి భారతం... వంటి సినిమాలతో నేటి పరిస్థితులను మహానుభావుడు టి.కృష్ణ ఆనాడే చెప్పారు..ఆయన దర్శకత్వంలో ఈతరం పిక్చర్స్ బ్యానర్‌లో నటించిన తర్వాత సినీ కేరీర్‌లో అనుకోని మార్పు, ఆదరణ, అభిమానం లభించింది. ప్రస్తుత రాజకీయాల్లో చంద్రబాబు నిజమైన లీడర్. తనకు రాజకీయాల్లోకి రావాలన్న ఆలోచన ప్రస్తుతం లేదని సినీ హీరో సుమన్ తెలిపారు. ఒంగోలులోని రైలు పేటలో శ్రీ నేతాజీ కళాశాల 7వ వార్షికో త్సవ వేడుకలకు వచ్చిన సుమన్ ఆంధ్ర జ్యోతితో ముచ్చటించారు.

ఒంగోలుతో అనుబంధం మరువలేనిది

అప్పటి వరకు ఆరు ఫైట్లు ఆరు పాట లతో బిజీ హీరోగా ఉన్నాను. ఆ సమయం లో రెండు ఫైట్లు, నాలుగు బ్యాగ్రౌండ్ పాటలతో సినిమా అన్నారు. ఆలోచించా ను. కానీ పెద్దవారు ఎమ్మెస్ రెడ్డి కృష్ణ గురించి గొప్పగా చెప్పటంతో ఒప్పేసు కున్నాను. ఆ తర్వాత తెలిసింది కృష్ణ సత్తా...ఒంగోలు గొప్పతనం. ఆ అనుబం ధం మరిచిపోలేనిది.

పైలట్ అవ్వాలనుకున్నా...


వాస్తవంగా కరాటే, మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ పొందుతూ పైలట్ అవ్వాలని పదేపదే కలలు కన్నాను. కానీ చెన్నైలో కారు మెకానిక్, ప్రస్తుతం కిట్టు ట్రావెల్స్ కిట్టు నాకు మంచి మిత్రుడు. ఆయనకు సినిమాలపై మోజు...కానీ అవకాశాల్లేవ్. ఎందుకంటే మెకానిక్. అయితే తనను హీరోలా ఉన్నావంటూ పదే పదే ప్రోత్స హించాడు. అలా 48 గంటల్లోనే అవకాశం రావడం అంతా అదృష్టం.

అన్నమయ్యకు అవార్డు వస్తుందనుకున్నా...


కృష్ణుడు పాత్రకు ఎన్టీఆర్, రాముడు పాత్రకు ఏఎన్నార్, వేంకటేశ్వర స్వామి పాత్రకు సుమన్ ప్రస్తుతం ఇదీ ప్రేక్షకుల మనస్సులో భావన. అయితే కోట్లాది మంది ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిర స్థానం కల్పించిన అన్నమయ్య చిత్రం మరి చిపోలేని అనుభూతి అందరు మెచ్చినా అవార్డు రాకపోవడం బాధ కలిగించింది. అయితే ఆ బాధ కొద్ది రోజులే. అన్నయ్య చిత్రాన్ని అప్పటి భారత రాష్ట్రపతి శంకర్ దయాళ్ శర్మ స్వయంగా సీడీ తెప్పించి చూడటం. అంతే కాకుండా వెంకటేశ్వర స్వామి పాత్ర వేసిన నన్ను పక్కనే కూర్చో పెట్టుకుని సినిమా మూడుగంటలు చూశా రు. పాత్రలో నటనకు పదే పదే మెచ్చుకు న్నారు. అంతకన్నా ఆనందం ఏముంది.

చిన్న సినిమాలు బతకాలి

ప్రస్తుతం సినిమా థియేటర్లు నలుగు రు, ఐదుగురు చేతుల్లోనే ఉంది. అయితే ఆ విధానం మారాలి. చిన్న నిర్మాతలు బతకాలి. వారసత్వ నటన తప్పేమీ కాదు. నాడు వంద రోజులు సినిమా కోసం ఆశపడేవారు. ప్రస్తుతం వారం, ఒక రోజు, గంటలు...ఇలా మారింది పరిస్థితి. మొద టి వారంలోనే హిట్... ఫట్... టాక్...

త్వరలోనే 100వ చిత్రం

ఇప్పటి వరకు 99 చిత్రాలలో వివిధ పాత్రలు పోషించాను. అన్నింటిలోనూ సంతృప్తి మిగిలింది. త్వరలోనే 100వ చిత్రంలో నటించబోతున్నాను. ఆ చిత్రం మన దేశ నాయకులు స్వాతంత్య్రం కోసం చేసిన త్యాగాలు, మన దేశాన్ని కాపాడేం దుకు సైనికులు పడుతున్న పాట్లు వివరి స్తూ ఉండాలి. సామాన్యుడు చల్లగా ఉండలాంటే రైతన్న సంతోషంగా ఉండా లి. అందుకే ఓ చత్రపతి శివాజీ, రవీంద్ర నా«థ్ ఠాగూర్...ఇలా ఉండొచ్చు. అయితే ఫిల్మ్ డాక్యుమెంటరీ కాదు. కమర్షియల్ చిత్రమే..

చంద్రబాబు నిజమైన లీడర్...

ప్రస్తుతం రాజకీయ ఆలోచన లేదు. అయితే టీడీపీ అధినేత చంద్రబాబు నిజమైన లీడర్. ఆ మాట ఆయనతోనే అప్పట్లో చెప్పాను. విజన్, రాష్ట్ర ప్రజల సంక్షేమం చంద్రబాబుతో సాధ్యమని పలుమార్లు చెప్పాను కూడా. కానీ అలా అనీ నేనేమీ రాజకీయాల్లో రావడం లేదు.

చంద్రబాబు నిజమైన లీడర్

హైదరాబాద్ : తెలుగుదేశం పార్టీ నుంచి ఎంపికైన ఎమ్మెల్సీ అభ్యర్ధులు యనమల రామకృష్ణుడు, సలీం, శమంతకమణి సోమవారం అసెంబ్లీ కార్యదర్శికి నామినేషన్ పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల మీడియాతో మాట్లాడుతూ అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకునే ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక జరిగిందని తెలిపారు. పార్టీ నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉండాల్సిందేనని ఆయన అన్నారు.

టీడీపీ ఎప్పుడూ ప్రజల పక్షాన నిలబడుతుందని, ప్రజల పక్షాన పోరాడటమే పార్టీ ఎజెండా అని యనమల వ్యాఖ్యానించారు. అంతకుముందు టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు సోమవారం ఉదయం పార్టీ కార్యాలయం నుంచి ఎన్టీఆర్‌ఘాట్‌కు ర్యాలీగా బయలుదేరి వెళ్లారు. ఎన్టీఆర్ ఘాట్ లో పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ కు ఘనంగా నివాళులు అర్పించారు.

నామినేషన్లు దాఖలు చేసిన టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు