March 8, 2013

కరీంనగర్: బాబ్లీ ప్రాజెక్టు నిర్మాణం అడ్డుకునేందుకు అవసరమైతే పదవులకు రాజీనామా సిద్ధమని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రకటించారు. శుక్రవారం బాబ్లీ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట టీడీపీ నిర్వహించిన ధర్నాలో ఎర్రబెల్లి మాట్లాడారు. బాబ్లీ పూర్తయితే తెలంగాణ ఎడారిగా మారే ప్రమాదం ఉందన్నారు. కేసీఆర్ కేంద్రమంత్రిగా ఉన్నప్పుడే బాబ్లీ పనులు ప్రారంభమయ్యాయని, హరీశ్‌రావు మంత్రిగా ఉన్నప్పుడు పోతిరెడ్డి ప్రాజెక్టు నిర్మాణం జరిగిందని, తెలంగాణకు ఇంత అన్యాయం జరుగుతున్న కేసీఆర్ నోరు మెదపకపోవడం చూస్తే కాంగ్రెస్‌తో కుమ్మక్కయినట్లు కనిపిస్తోందన్నారు.

సుప్రీంతీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం రివ్యూ పిటిషన్ వేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వంలో చలనం తెచ్చేందుకు త్వరలో 'చలోఢిల్లీ' ఆందోళన చేపడతామన్నారు. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడేందుకు ముఖ్యమంత్రి అఖిల పక్షం ఏర్పాటు చేసి ప్రధాని వద్దకు తీసుకెళ్లాలని ఎర్రబెల్లి డిమాండ్ చేశారు. ధర్నాలో ఎమ్మెల్యే విజయ రమణరావు, మాజీ మంత్రులు ఎల్ రమణ, పెద్దిరెడ్డి, సుద్దాల దేవయ్య పాల్గొన్నారు.

బాబ్లీ కోసం రాజీనామాకు సిద్ధం!:ఎర్రబెల్లి

విజయవాడ పురుషులతో సమానంగా మహిళలు అన్ని రంగాలలో ఎదిగేందుకు తెలుగుదేశం పార్టీ అండగా నిలుస్తుందని ఆ పార్టీ అధినేత చంద్రబాబు హామీ ఇచ్చారు. ఆర్థిక మంత్రి చిదంబరం కంటే భారతీయ మహిళలే ఆర్థిక వ్యవహారాలను చక్కగా నిర్వహించగలరని చమత్కరించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శుక్రవారం కృష్ణా జిల్లా మండవల్లి మండలం చావలిపాడులో పార్టీ ఆధ్వర్యంలో మహిళా సదస్సును నిర్వహించి వారికి వరాలు ప్రకటించారు.

టీడీపీ అధికారంలోకి వస్తే ఆడపిల్లల సంరక్షణ పథకం ప్రవేశపెట్టడమా..లేక పెళ్ళి ఖర్చులకు కొంత మొత్తం ఇస్తే బాగుంటుందా.. అని ఆలోచిస్తున్నానన్నారు. దీనిపై మహిళల అభిప్రాయం కోరగా.. ఆడపిల్లల సంరక్షణ పథకమే కావాలని చెప్పారు

మహిళలకు చంద్రబాబు కితాబు

కైకలూరు రూరల్ : "కొల్లేరును చూస్తే గుండె మండుతోంది, కడుపు తరుక్కుపోతుంది. చేపల చెరువు గట్లను బాంబులతో పేల్చేసి కడప సంస్కృతిని రాజశేఖర్‌రెడ్డి పెంచి పోషించారు. మేం అధికారంలోకి వస్తే కొల్లేరు ప్రజల కంటి నీరు తుడుస్తా''మని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు అన్నారు. శుక్రవారం కృష్ణాజిల్లా చాకలిపాడు వద్ద ఆయన పాదయాత్ర ప్రారంభించారు. కైకలూరు, ఆటపాక, గోనెపాడు, సింగాపురం, వదర్గపాడు, భుజబలపట్నం, పల్లెవాడ, ఆలపాడు పొలిమేరల దాకా 15.5 కిలోమీటర్లు నడిచారు. కైకలూరులో స్థానిక శ్యామలాంబ దేవాలయంలో కలిసిన వ్యాపార వర్గాలకు ధైర్యం చెప్పారు. అధికారంలోకి రాగానే వస్త్రాలపై వ్యాట్ రద్దు చేస్తామని హామీ ఇచ్చారు.

వ్యాపారులు సైతం కొంత సమయాన్ని రాజకీయాలకు వినియోగించాలని, అప్పుడే ఆ వర్గాల సమస్యలు పరిష్కరించుకునే వీలు ఉంటుందన్నారు. రాజశేఖర్‌రెడ్డి ప్రజల బాగోగులు పట్టించుకోలేదని, అన్ని వర్గాల ప్రజలను దోచుకున్నారని అన్నారు. పులిచర్మం కప్పుకుని పునీతునిగా ప్రజలను నమ్మించారని మండిపడ్డారు. రాజశేఖర్‌రెడ్డి కొల్లేరు ప్రజలను అప్పట్లో భయభ్రాంతులకు గురిచేశారన్నారు. ఆయన కోవలోనే కొల్లేరుపై కిరణ్ విధానాలున్నాయని ధ్వజమెత్తారు. పాలన పట్ల వీసమెత్తు అవగాహన లేకపోయినా అంతా తెలిసినట్టు గొప్పగా నటిస్తున్నారని ఎద్దేవా చేశారు. జగన్ పత్రికను విష కన్యగా ఆయన దుయ్యబట్డారు. "పూర్వం తమ శత్రువులపై ప్రయో గించేందుకు రాజులు విషకన్యలను తయారు చేసేవారు. దానికోసం కన్యలకు చిన్ననాటినుంచే విషం ఇచ్చేవారు. జగన్ పత్రిక కూడా అలాంటి విషకన్యే'' అని దుయ్య బట్టారు. కాగా, బాబుకు సంఘీ భావంగా శని వారం సాఫ్ట్‌వేర్ నిపుణులు పాదయాత్రలో పాల్గొననున్నారు.

'పశ్చిమ'లో మీకోసం..
ఏలూరు: 'మీ కోసం'.. అంటూ పశ్చిమగోదావరి జిల్లాలో చంద్రబాబు అడుగిడనున్నారు. శనివారంతో కృష్ణా జిల్లా యాత్రను ముగించుకుని కృష్ణ-పశ్చిమగోదావరి జిల్లాల సరిహద్దుల్లోని ఉప్పుటేరు వంతెన మీదుగా ఉండి నియోజకవర్గంలో ప్రవేశించనున్నారు. ఏడు రోజులు పర్యటించేందుకు వీలుగా ఆకివీడు నుంచి తణుకు వరకు రూట్‌మ్యాప్ ఖరారు చేశారు. తొలిరోజు ఆకివీడుసభలో పాల్గొని, అర్జమూరుగరువువద్ద బసచే స్తారు. కాగా, కృష్ణా జిల్లా కైకలూరు మండలం ఆలపాడు గ్రామంలో శనివారం టీడీపీ పోలిట్‌బ్యూరో సమావేశం నిర్వహించనున్నారు.

పులితోలు కప్పుకొన్న 'పునీతుడు'!

మండవల్లి : తనకు పదవుల్లో కూర్చోవలన్నా కోర్కెలేవి లేవని, సేవచేయాలన్న దృక్పథంతోనే మీ ముందుకు వచ్చానని. తాను అధికారంలోకి వస్తే మీ బాధలు తీరుస్తానని టీడీపీ అధినేత చంద్రబాబు కొల్లేటి ప్రజలకు భరోసా ఇచ్చారు. చంద్రబాబు చేపట్టిన పాదయాత్ర శుక్రవారం మండవల్లి మండలం చావలిపాడు, లోకుమూడి గ్రామాల మీదుగా కైకలూరు మండలంలోకి సాగింది. ప్రపంచ మహిళా దినోత్సవంలో పాల్గొన్న వేలాది మహిళలు చంద్రబాబుతో పాటు పాదయాత్రంలో పాల్గొనడంతో కత్తిపూడి-పామర్రు జాతీయ రహదారిపై మహిళలతో పొటెత్తింది. చావలిపాడు, లోకుమూడిల్లో ప్రజలు పూలతో, హారుతులతో అపూర్వ స్వాగతం పలికారు. వృద్దులను, వికలాంగులను, చిరువ్యాపారులను, వ్యవసాయ కూలీలను, చేతివృత్తివారిని చంద్రబాబు పలకరిస్తూ ముందుకుసాగారు. మిమ్మల్ని ముఖ్యమంత్రిగా మళ్ళీ చేస్తాం. మా కష్టాలు మీరే తీర్చాలి అంటూ పలువురు చంద్రబాబుతో అన్నారు.

కాంగ్రెస్ చేస్తున్న దారుణాలను చూడలేక, అవినీ రాజకీయాలను ప్రజలకు వివరించేందుకు మీముందుకు వచ్చానన్నారు. సేవదృక్పదమైన ప్రభుత్వాన్ని ఎంపికచేసుకోవాలని,అవినీతి పరులను తమిరికొట్టలని చంద్రబాబు కోరారు. మీ పిల్లలు చక్కటి చదువులు సాగాలన్న, ఉద్యోగాలు రావాలన్న టీడీపీ వల్లే సాధ్యమని స్పష్టం చేశారు. చిన్నారులకు బాబు ముద్దులు కైకలూరు రూరల్ : అడుగడుగునా బాబుకు మహిళలు మంగళహారతులు పట్టారు. దారిలో శ్యామలాంబ దేవాలయాన్ని దర్శించుకునేందుకు వేద పండితులు స్వాగతం పలికారు. దారిలో పసిపిల్లలను, చిన్నపిల్లలను ఎత్తుకుని ముద్దాడారు. బామ్ము చేసిన లడ్డూను రుచిచూశారు.

దర్జీని పలకరించి మిషన్ కుట్టారు. వ్యవసాయ కూలీలను పలకరించి వారి కష్టసుఖాలనుతెలుసుకున్నారు. షెడ్డు వద్దకు వెళ్ళి మోటార్ సైకిల్‌ను రిపేర్ చేశారు. మార్గం మధ్యలో అభిమానులు గజమాలతో చంద్రబాబును సత్కరించారు. మరోచోట కూరగాయల దండను వేశారు. భారీ సైజులో ఉన్న డప్పును కొడుతూ వినోదాన్ని పంచారు. దారిలోని మాగంటి బాబు ఇంటి వద్ద తేనీరు తాగారు. కైకలూరు నుంచి ఆటపాక, గోనేపాడు, శింగాపురం, వదర్లపాడు బ్రాంచ్, భుజబలపట్నం, పల్లెవాడ మీదుగా ఆలపాడు బసకు చేరుకున్నారు.

నేనే వస్తా...పూర్వ వైభవం తెస్తా!


మండవల్లి : బాబూ.. మీరే మాకు దిక్కు.. తెలుగుదేశం పార్టీ పాలనలో కొల్లేరు జీవనస్థితిగతులు మెరుగుపర్చేందుకు అండగా ఉన్నారు. అప్పటి ఎన్టీఆర్ నుంచి మీ వరకూ చేయూతనిస్తూనే ఉన్నారు. కాంగ్రెస్ కుట్ర చేసి నోటి వద్ద కూడు లేకుండా చేసింది. మండవల్లలో పాదయాత్ర చేస్తున్న చంద్రబాబును కలిసి కొల్లేరు వాసులు దీనగాథను వినిపించారు.కొల్లేరును నమ్ముకుని కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాలో 122 లంక గ్రామాల్లో మూడులక్షల మంది ప్రజలు ఉన్నాం. వందలాది కుటుంబాలు జీవనోపాధిపొందుతున్నాం. కొల్లేరులో చేపలు పట్టుకుని పట్టెన్నం తినే తరుణంలో కాంగ్రెస్ కన్నెర్ర చేసింది. నోటిదగ్గర కూడును నేలపాలు చే సింది. కొల్లేరు ఆపరేషన్ పేరుతో పరిధిని మించి చెరువులను ధ్వంసం చేశారు. అభయారణ్యం అంటూ అంక్షలు విధించారు.

చేపల వేటకు సైతం నిబంధనలు మాటున అడ్డుకుంటున్నారు. కొల్లేరులో జీవ నం సాగించటమే కష్టంగా మారింది. పొట్టచేతపట్టి, కొల్లేరును వదిలి, పొరు గు రాష్ట్రాలకు వలసలు వెళ్తాన్నాం. ప్రత్యేక ప్యాకేజీ అన్నారు. అచరణలో అందరికి దక్కలేదు. అదనంగా ధ్వం సం చేసిన 7500 ఎకరాల మిగులు భూములు పంపిణీ చేస్తామని ఆశపెట్టారు. ఏదీ అమలు చేయలేదు. గల్లీ నుంచి ఢిల్లీ వరకు తిరిగి ప్రభుత్వాల పై పోరాటం చేసిచేసి ఆలసిపోయాం. గమ్యం తెలియక సాగుతున్నాం. కొల్లేరులో పక్షుల కోసం అంటూ ప్రజలను బలిపశువులను చేస్తున్నారు. అభాగ్యులను అదుకోవటంలో వివక్ష చూపుతున్నారు. అని బాబుకు బాధితులు మొరపెట్టుకున్నారు.

కాంగ్రెస్ మా కడుపు కొట్టింది

మండవల్లి : అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మండవల్లి మండలం చావలిపాడులో శుక్రవారం జరిగిన రాష్ట్రస్ధాయి మహిళా దినోత్సవ వేడుకల సభలో మహిళల హక్కుల సాధన, మహిళలకు జరుగుతన్న అన్యాయాలపై ప్ల కార్డులు ఏర్పాటుచేశారు. అందులో భాగంగా వైసీపీ అధ్యక్షుడు జగన్ అక్రమాస్తులపై ఏర్పాటుచేసిన ప్ల కార్డు విశేషంగా ఆకర్షించింది. తొలుత టీడీపీ తెలుగు మహిళ సభ కావటం, అందులోనూ సభకు పార్టీ అధినేత చంద్రబాబు పాల్గొనే సభాప్రాంగణంలో జగన్ ఫొటోతో ఫ్లెక్సీ ప్రత్యక్షమవటం చర్చనీంశంగా మారింది. సభా ప్రాంగణంలో ప్రవేశించిన ప్రతిఒక్కరూ జగన్ ప్లకార్డు ఫ్లెక్సీ వద్ద క్షణం నిలబడి ఆసక్తిగా పరిశీలించారు. ఈ ప్ల కార్డులో ఏముందంటే జగన్ అక్రమాస్తుల వివరాలు అంటూ ఇల్లు, పరిశ్రమల, విలాసవంతమైన భవనాలతో కూడిన చిత్రాలను ప్రదర్శించారు. వీటిని అమ్మితేనే మహిళ లక్షాధికారులయ్యేది అంటూ పేర్కొన్నారు. అలాగే ఈసభా ప్రాంగణంలో తలదించుకుంటున్నాం.. తల్లీ అనే ప్ల కార్డును కూడా ఏర్పాటు చేశారు. ఢిల్లీ సంఘటనపై ఉదహరిస్తూ ప్రభుత్వ వైఫల్యాన్ని తప్పు పట్టుతూ ప్లకార్డు ఏర్పాటుచేశారు.

మహిళా దినోత్సవ సదస్సులో జగన్ అక్రమాస్తుల చిట్టాపై ప్ల కార్డు

యాత్రలో హారతులు పట్టేదే కాదు..నా నడకకు నీడనిచ్చేది కూడా ఈ ఆడపడుచులే. నేను మహిళా పక్షపాతిని. తొలి నుంచి వాళ్లూ నా పక్షమే. నా విజయంలో, కష్టంలో నిత్య భాగస్వాములు. స్థానిక సంస్థల్లో కోటా మొదలు.. డ్వాక్రా సంఘాల ఏర్పాటు దాకా.. వాళ్ల గురించి మా పార్టీ ఆలోచించని రోజే లేదు. జనాభాలో సగమని ఇదంతా మేం చేయలేదు. సామర్థ్యమూ చూశాం. మాట నిలకడే కాదు.. ఆర్థిక ముందుచూపునకూ ముచ్చటపడ్డాం. వాళ్లూ నాకు గౌరవం పెంచారు. ఆంధ్రా మహిళకు అంతర్జాతీయస్థాయిలో గుర్తింపు వచ్చిందంటే.. ఆ ఘనత వాళ్లదే. వాళ్ల పట్టుదల, చిన్న అవకాశాన్నీ చేజార్చుకోని అప్రమత్తతే దానికి ప్రధాన కారణం. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వాళ్లు ఏర్పాటుచేసుకొన్న కార్యక్రమంలో పాల్గొని.. యాత్ర ప్రారంభించాను.

నిజమే..ఈ రోజు దూబగుంట రోశమ్మ గుర్తొచ్చినట్టే, ఢిల్లీ యువతి 'నిర్భయ' జ్యోతి పాండే కూడా పదేపదే గుర్తుకు వస్తున్నది. వీళ్ల కోసం ఎంత చేసినా తక్కువేననిపిస్తోంది. జన్మనిచ్చిన తల్లి రుణం తీర్చుకోలేనట్టే.. మన ఉన్నతి కోసం ప్రతి అడుగులో ఆసరాగా నిలిచే ఈ ఆడపడుచులకు ఏమిచ్చినా ఇంకా వెలితి ఉంటూనే ఉంటుంది. అవకాశాల్లో సగం అని నినదించడం తప్ప ఆచరణలో వాళ్లకు దక్కుతున్నదేమిటి? పార్లమెంటులో 33 శాతం కోటా కోసం..30 ఏళ్లుగా పోరాడుతూనే ఉన్నారు కదా! ఆర్థికంగా ఎదిగితే మిగతా సమస్యలను వారే ఎదుర్కొంటారనే ఉద్దేశంతో నా హయాంలో డ్వాక్రా సంఘాలు పెట్టాను. కానీ, కైకలూరులో చూస్తే అవన్నీ డొల్ల సంఘాలుగా మారిపోయాయి. నా ఆశలు, వారి కోరికలు తలకిందులయిపోయాయి. వారంతా ఇప్పుడు మైక్రో ఫైనాన్స్ కోరల్లో చిక్కుకుపోయారు. ఈ మహిళల కన్నీటి శాపం తగలపోదు!

అడుగడుగులో ఆడపడుచు నీడ!

తుని: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నిర్వహిస్తున్న 'వస్తున్నా మీకోసం' పాదయాత్రను విజయవంతం చేయాలని ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు పిలుపు నిచ్చారు. ఈ మేరకు ఆయన కార్యకర్తలతో సమా వేశమయ్యారు. రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా నడిపించేందుకు ప్రణాళికలు రూపొందించిన నేత చంద్రబాబు అని కొనియాడారు. పదేళ్ళుగా కాంగ్రెస్ కబంధ హస్తాల్లో నలిగిపోతున్న ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు ఆయన వస్తున్నారన్నారు.

ఆయన యాత్రను కార్యకర్తలంతా సైనికుల్లా పనిచేసి విజయవంతం చేయాలని పిలుపు నిచ్చారు. రాష్ట్రాన్ని తిరిగి అభివృద్ధి పట్టాలపైకి ఎక్కించే సత్తాగల నేత చంద్రబాబేనని అన్నారు. మెట్టలోని సమస్యల పరిష్కారానికి పార్టీ విశేష కృషి చేస్తుందన్నారు. పోల్నాటి శేషగిరిరావు, సుర్ల లోవరాజు, యినుగంటి సత్యనారాయణ, సూరంపూడి అప్పారావు, కూరపాటి రఘు, రాపేటి సూరిబాబు, కుచ్చర్లపాటి జగన్నాథరాజు, కుక్కడపు బాలాజీ, యనమల శివరామకృష్ణన్, పప్పు సత్యనారాయణ, చింతంనీడి అబ్బాయి, నడిగట్ల సూరిబాబు, ఆడారి ఈశ్వరరావు, అంకంరెడ్డి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

స్థానిక ఎన్నికల్లో సత్తా చూపాలి

తునిరూరల్: రాబోయే స్థానిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ సత్తా చూపించేందుకు కార్యకర్తలంత కృషి చేయాలని పొలిట్‌బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు అన్నారు. పార్టీ కార్యాలయంలో గురువారం గ్రామాల వారీగా సమీక్ష సమావేశాన్ని ఆయన నిర్వహించారు. తొండంగి మండలం పీఈ చిన్నయ్యపాలెం, ఎ.కొత్తపల్లి, తుని మండలం టి.తిమ్మాపురం, తేటగుంట, ఎన్ఎస్‌వీ.నగరం, ఎస్. సూరవరం గ్రామాల నాయకులు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానిక ఎన్నికల్లో ఏ అభ్యర్థిని నిలబెట్టిన గెలుపుకోసం ప్రతి ఒక్కరూ కష్టపడి పని చేయాలన్నారు. టీడీపీలో చేసిన పనులు తప్ప కాంగ్రెస్ ఏం చేశారన్నది ప్రజల్లోకి తీసుకెళ్ళాలన్నారు. అవినీతి రహితమైన పాలన కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారని అది ఒక్క చంద్రబాబు వల్లే సాధ్యమన్నారు. చంద్రబాబు పాదయాత్రతో సానుకూల పవనాలు వీస్తున్నాయని, వీటిని స్థానిక ఎన్నికల విజయానికి వినియోగించాలన్నారు. పోతుల వీర్రాజు, వెలుగుల శేషరావు, కాపారపు అబ్బులు, దాట్ల వర్మ, సీహెచ్. అబ్బాయి, యడ్ల అప్పలరావు, పంపనబోయిన నర్సింహమూర్తి తదితరులు పాల్గొన్నారు.

చంద్రబాబు యాత్రను విజయవంతం చేయాలి
క్రోసూరు: మామా, అల్లుళ్ళైన యువరత్న నందమూరి బాలకృష్ణ, చంద్రబాబు నాయుడు కుమారుడు నారా లోకేష్‌బాబులు త్వరలో పెదకూరపాడు నియోజకవర్గంలో పర్యటించనున్నట్టు ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ వెల్లడించారు. గురువారం శ్రీధర్ మాట్లాడారు. బాలకృష్ణ, లోకేష్‌ల పర్యటన నియోజకవర్గంలోని వివిధ మండలాలలోను, గ్రామాలలోను ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. వివిధ గ్రామాలలో నెలకొల్పనున్న ఎన్టీ రామారావు విగ్రహాలను వారు ఆవిష్కరిస్తారని, పలు పార్టీ కార్యక్రమాలలో పాల్గొంటారని చెప్పారు. పర్యటన తేదీని త్వరలో ఖరారు చేయనున్నట్టు తెలిపారు. వచ్చే ఎన్నికలలో వెనుకబడిన వర్గాల వారికి 100సీట్లను ఇస్తామన్న తెలుగుదేశం వాగ్దానం కచ్చితంగా అమలు జరుగుతుందని, ఇప్పటికే సుమారు 50 సీట్లకు అభ్యర్థుల పేర్లు ఖరారయ్యాయని ఆయన చెప్పారు. రానున్న అన్నిరకాల ఎన్నికలలోను కార్యకర్తలు చురుకైన పాత్ర పోషించాల్సి ఉంటుందని, బలమైన కార్యకర్తల అండ తెలుగుదేశం పార్టీకి ఉండటం పార్టీ అదృష్టమని ఆయన తెలిపారు.

త్వరలో బాలకృష్ణ, లోకేష్ పర్యటన


పెదకూరపాడు: తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, సానుభూతిపరులు త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలలో ఐకమత్యంతో సైనికుల్లా పనిచేయాలని శాసనసభ్యుడు డాక్టర్ కొమ్మాలపాటి శ్రీధర్ , జీడీసీసీ బ్యాంక్ డైరెక్టర్ వరప్రసాద్ అన్నారు. పెదకూరపాడులోని శ్రీ సాయి శ్రీనివాస కల్యాణ మండపంలో బుధవారం పార్టీ మండల విస్తృతస్థాయి సమావేశం జరిగింది. తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు అర్తిమళ్ళ రమేష్ అధ్యక్షత వహించారు.

ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే మాట్లాడుతూ, చంద్రబాబునాయుడు ప్రజల కష్టాలను తెలుసుకునే వ్యక్తి అని, ఆయన రాష్ట్ర నాయకుడిగా ఉంటే పేదల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తారన్నారు. గ్రామస్థాయి నుంచి తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, చిన్నచిన్న సమస్యలేమైనా ఉంటే పక్కకునెట్టి పార్టీ పటిష్ఠతకు కృషి చేయాలన్నారు. ప్రతి గ్రామంలో రాజకీయ పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. పార్టీ పటిష్ఠతకు సంబంధించి ఎన్ని అడ్డంకులు వచ్చినా రాజీపడే ప్రసక్తేలేదన్నారు. టీడీపీ అందరి పార్టీ అని, ఏ ఒక్కరి సొత్తూ కాదని, పార్టీ పదవులలో సామాజిక న్యాయం పాటిస్తున్నామన్నారు. కాంగ్రెస్ ఎన్ని కుతంత్రాలు పన్నినా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. సహకార ఎన్నికల ఫలితాలే ఇందుకు నిదర్శనమన్నారు.

జీడీసీసీ బ్యాంక్ డైరెక్టర్, పరసత్యాళ్ళూరు సహకార సంఘ అధ్యక్షుడు ఎన్‌వివిఎస్ వరప్రసాద్ మాట్లాడుతూ, పార్టీ పూర్తిస్థాయిలో విజయం సాధించడానికి ఐక్యమత్యం అవసరమన్నారు. ముందుగా ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి, ఘనంగా నివాళులర్పించారు.

సమావేశంలో తెలుగురైతు రాష్ట్ర నాయకుడు నాదెండ్ల అప్పారావు, రిటైర్డ్ డీఎస్పీ బాలశౌరి, మాజీ ఎంపీపీ గల్లా బాబురావు, మండల తెలుగుదేశం నాయకులు ఏరువా బాలిరెడ్డి, నియోజకవర్గ నాయకులు బుర్రి ఏడుకొండలు, నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు వేగుంట రాణి, చక్కా కేశవరావు, మద్దిరాల గంగాధర్, తాళ్ళూరి వసంతకుమార్, మోదుగుల చంద్రశేఖర్ తదితరులు ప్రసంగించారు. మండలంలోని పార్టీ నాయకులు, కార్యకర్తలు సమావేశంలో పాల్గొన్నారు.

ఐక్యమత్యంతోనే టీడీపీ విజయం

రంగారెడ్డి అర్బన్ :ఈ నెల 9వ తేదీన టీడీపీ జిల్లా విస్తృతస్థాయి సమావేశాన్ని నిర్వహిస్తున్నట్టు ఆ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి జి.సుభాష్‌యాద్ ఒక ప్రకటనలో తెలిపారు. చెంపాపేట్‌లోని సామ సరస్వతి గార్డెన్స్‌లో ఉదయం 10.30 గంటలకు సమావేశం ఉంటుందని పేర్కొన్నారు. ఈ సమావేశానికి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, ఎంపీ టీ.దేవేందర్‌గౌడ్, రాష్ట్ర పరిశీలకులు, ఎంపీ రమేష్ రాథోడ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శివర్గ వర్ల రామయ్యతో పాటు జిల్లాలోని ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జీలు పాల్గొంటారని తెలిపారు.

ఈ సమావేశంలో సహకార సంఘాల ఎన్నికలు, పల్లెపల్లెకు తెలుగుదేశం కార్యక్రమంపై సమీక్షించనున్నట్టు, స్థానిక సంస్థల ఎన్నికలపై, స్థానిక సమస్యలపై కార్యచరణ ప్రణాళికలపై చర్చించనున్నట్టు పేర్కొన్నారు. ఈ సమావేశాన్ని ఆహ్వానించిన ముఖ్యనాయకులందరూ హాజరుకావాలని కోరారు.

టీడీపీ విస్త్తృతస్థాయి సమావేశం

శ్రీకాకుళం: టీడీపీ జిల్లా నాయకుల్లో శాసనమండలికి జరుగుతున్న ఎన్నికల్లో టికెట్ లభిస్తుందని ఆశలు చిగురిస్తున్నాయి. శనివారం జరిగే కోర్‌కమిటీలో ఈ ఎన్నికలపై చర్చించి అభ్యర్థుల పేర్లను వెల్లడించనున్నారని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. ఆ పార్టీ అధినేత చంద్రబాబును జిల్లా నేతలు కృష్ణాజిల్లాలో కలిసి ఎమ్మెల్సీ ఎన్నికల ప్రస్తావనకు తీసుకొచ్చారు. ఈసారి తప్పనిసరిగా జిల్లాకు ప్రాతినిధ్యం కల్పించాలని గట్టిగా డిమాండ్‌చేశారు. ఈ నేపధ్యంలో ఆంధ్రజ్యోతి దినపత్రికలో 'అధ్యక్షా.. అనే దేవ రు' శీర్షికతో వెలువడిన కథనం పార్టీలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మిగిలిన జిల్లాల నుంచి పార్టీ తరఫున చట్ట సభల్లో ప్రాతినిధ్యం ఉన్నా శ్రీకాకుళం జిల్లా నుంచి ఎవరూ లేకపోవడమే కాకుండా దివంగత నేత ఎర్రన్నాయుడు లేని లోటు పార్టీపై ప్రభావం చూపుతోందని.. ఈనేపథ్యంలో ఎమ్మెల్సీ అవకాశం కల్పిస్తే పార్టీ క్యాడర్‌లో ఉత్తేజం వస్తుందని నాయకులు బాబుకు వివరించారు.

బాబ్జి ప్రయత్నాలు: జిల్లా టీడీపీ తరఫున 2009 ఎన్నికల తర్వాత పార్టీ పగ్గాలు చౌదరి నారాయణమూర్తి అప్పగించారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ కోసం ఆయన ప్రయత్నిస్తున్నారని సమాచారం. కాగా టీడీపీ నుంచి సామాజిక ప్రాధాన్యత చూసుకొంటే మాజీ మంత్రి సీతారాం అలకపాన్పుపై ఉన్నారు. సాయిరాజ్ పార్టీని వాడారు.ఈ నేపథ్యంలో రాజకీయ ప్రాధాన్యత కోసం ప్రధాన సామాజిక వర్గాలతో పోటీ పడాలనే దృష్టితోనే బాజ్జి ఆ పదవిని ఆశిస్తున్నారు.

ఎమ్మెల్సీపై టీడీపీ నాయకుల్లో ఆశలు

పార్వతీపురం టౌన్- : టీడీపీతోనే అభివృద్ధి సాధ్యమని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు ద్వారపురెడ్డి జగదీష్ అన్నా రు. బుధవారం పురపాలక సంఘం పరిధిలోని 25వ వార్డు పర్యటనలో ఆయన పాల్గొన్నారు. రెల్లివీధి, పెదమాదిగవీధులలో ప్రజలు సమస్యలను ఆయన ముం దు ఏకరవు పెట్టారు. దినదిన ప్రాణగండంగా ఇళ్ల ముందు విద్యుత్ తీగలు వేలాడుతున్నా పట్టించుకొనే నాధుడే కరువయ్యారని వారంతా వాపోయారు.

సామహిక మరుగుదొడ్లు లేక మహిళలు అవస్థలు పడుతున్నారన్నారు. కాల్వలు లేక మురుగునీరు నిలిచి వ్యా« దుల బారిన పడుతున్నామని తెలిపారు. ఈ సందర్భంగా జగదీష్ మాట్లాడుతూ కళ్లుండి చూడలేని ప్రభుత్వ పాలనలో రాష్ట్రం అన్ని విధాలా భ్రష్టు పట్టిపోయిందన్నారు. పర్యటనలో పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు గొట్టాపు వెంకటనాయుడు, పట్టణ పార్టీ అధ్యక్షుడు కోలా వెంకటరావు, జిల్లా ప్రచార కమిటీ కార్యదర్శి బార్నాల సీ తారాం, జిల్లా బీసీ సెల్ ఉపాధ్యక్షుడు మంచిపల్లి సత్యనారాయణ, పట్టణ సెక్రటరీ కోరాడ సింహాచలం, చందక దేశాలు, ఎం.సూర్యనారాయణ, మరియదాసు పాల్గొన్నారు.

టీడీపీతోనే అభివృద్ధి సాధ్యం

పాలకుర్తి:  మండలంలోని లక్ష్మీనారాయణపురం శివారులో ఎమ్మెల్యే ఎర్రబెల్లి బృందంపై తేనెటీగలు దాడి చేశాయి. అధికారులతో పాటు పలు వురు అస్వస్థత పాలయ్యారు. గురువా రం పలు గ్రామాలల్లో వివిధ అభివృద్ధి పనుల శంకుస్థాపనలు, ప్రారం బోత్సవాలు చేసిన బృందం తిరిగి పా లకుర్తికి బయల్దేరింది. మార్గమధ్యలో లక్ష్మీనారాయణపురం శివారు మామి డి తోటలో భోజనానికి ఉపక్రమించా రు. కాగా, మామిడి చెట్టు కొమ్మపై తేనెతుట్ట కదిలింది. తేనెటీగలు ఒక్కసారిగా దాడి చేయడంతో అంతా పరుగులు తీశారు.

తేనెటీగల దాడిలో హోటల్ యజమాని చిలుకమారి వాసుదేవ్, ఎమ్మె ల్యే ఎర్రబెల్లి ఎస్కార్ట్ ఏఆర్ ఎస్సై క రీం, ఎంపీడీవో గోవింద్, ఏపీవో ఇంది రా, టీడీపీ నాయకులు బండి కొండ య్య, ఎండా,మదార్, విలేఖరులు కత్తుల యాకయ్య, గుగులోతు దేవో జీ, చిదురాల ఎల్లయ్య, సలేంద్ర సో మన్న గాయపడ్డారు. తీవ్రంగా గా యపడిన హోటల్ యాజమాని వాసుదేవ్, ఏఆర్ ఎస్సై కరీంలను పాలకుర్తి ఆస్పత్రికి తరలించారు. వాసుదేవ్‌ను ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు పరామర్శించారు.సంఘటనా స్థలానికి ఎ ర్రబెల్లి దూరంగా వుండడంతో తేనెటీగల బారి నుంచి తప్పించుకోగలిగారు.

ఎర్రబెల్లి పర్యటనలో అపశృతి

  ఏలూరు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు 'వస్తున్నా.. మీకోసం' పాదయాత్ర ఈ నెల 9వ తేదీన జిల్లాలో ప్రారంభం కానుంది. ఈ మేరకు పార్టీ ముఖ్యులు ఆయన పాదయాత్రకు సంబంధించి రూట్‌మ్యాప్‌ను సిద్ధం చేశారు. చంద్రబాబు పాదయాత్ర ఆసాంతం విజయవంతం అయ్యేలా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. 9వ తేదీ నుంచి 16వ తేదీ వరకు ఆయన జిల్లాలో పాదయాత్ర నిర్వహించనున్నారు. ఈ మేరకు పార్టీ చంద్రబాబు పాదయాత్ర సాగే రూట్‌మ్యాప్‌ను ఆకివీడు నుంచి తణుకు వరకు సాగేలా విడుదల చేశారు.

పాదయాత్ర సాగేది ఇలా :
తొలి రోజు 9వ తేదీ (శనివారం) 6.7 కి.మీ : ఉప్పుటేరు బ్రిడ్జి, దుంపగడప అడ్డరోడ్డు, దుంపగడప, ఆకివీడు జూనియర్ కాలేజీ గ్రౌండ్, ఆకివీడు రైల్వే స్టేషన్, పొట్టి శ్రీరాముల విగ్రహం సెంటర్ వద్ద బహిరంగ సభ, సి ఎం మిషనరీ స్కూల్. రాత్రి బస అర్జమూరు గరువు

10వ తేదీ ( ఆదివారం ) 12.1 కి.మీ :
అర్జమూరు గరువు, చెరుకువాడ, కలిసిపూడి, గోరింతోట, పె దపుల్లేరు అడ్డరోడ్డు, ఉండి (బహిరంగ సభ), మహదేవపట్నం అడ్డరోడ్డు. రాత్రి బస పెద అమిరం రియల్ ఎస్టేట్ ఖాళీ స్ధలం

11వ తేదీ (సోమవారం) 13.1 కి.మీ : పెద అమిరమ, జువ్వలపాలెం అడ్డరోడ్డు, చిన అమిరం క్రాస్ రోడ్డు- ఎస్ ఆర్‌కె ఇంజనీరింగ్ కాలేజీ నుంచి భీమవరం పట్టణంలో ప్రవేశం. ఉండి రోడ్ (బోంబే స్వీట్‌షాప్ సెంటర్), ప్రకాశంచౌక్ సెంటర్ (బహిరంగసభ), ఎం ఆర్‌వో ఆఫీసు సెంటర్, మావుళ్ళగుడి సెంటర్, బస్టాండ్ సెంటర్, రైల్వే ఓవర్‌బ్రిడ్జి సెం టర్, సెయింట్ మేరిస్, షిర్డీ సాయి ట్రస్టు బహిరంగ ప్రవేశం, విస్సాకోడేరు, గొరగనమూడి, పెన్నాడ. రాత్రి బస మార్కెట్ యార్డ్ స్థలం

12వ తేదీ (మంగళవారం) 12.7 కి.మీ. :


శృంగవృక్షం, నందమూరుగరువు, వీరవాసరం, ఎస్.చిక్కా ల, చిక్కాల, దగ్గులూరు, లంకలకోడేరు, వెలివెల అడ్డరోడ్డు, భగ్గేశ్వరం, సూర్యతేజ ఫంక్షన్ హాలు. రాత్రి బస పూలపల్లి

13వ తేదీ (బుధవారం) 12 కి.మీ. :

పూలపల్లి, పాలకొల్లు రైల్వేగేటు సెంటర్, ఎన్టీయార్ విగ్ర హం సెంటర్ (బహిరంగసభ), ఉల్లంపర్రు, జిన్నూరు, మట్టప ర్రు అడ్డరోడ్డు, వేడంగి, కవిటం లాకుల సెంటర్, కవిటం, రాత్రి బస కవిటం దాటిన తరువాత

14వ తేదీ (గురువారం) 14.3 కి.మీ :

జగన్నా«థపురం, మార్టేరు, మార్టేరు సెంటర్, నెగ్గిపూడి (బహిరంగసభ), పెనుగొండ (వాసవీ మాత గుడి ఆవరణ), గాంధీ సెంటర్, మార్కెట్ సెంటర్, అయితంపూడి, ఏలేటిపాడు అడ్డరోడ్డు, గొల్లగుంటపాలెం, వేండ్రవారిపాలెం, రాత్రి బస ఇరగవరం వెంకటేశ్వర రైస్‌మిల్లు ప్రాంగణం

15వ తేదీ (శుక్రవారం) 11.8 కి.మీ. :


యర్రాయిచెరువు, అతనికుంట, మహలక్ష్మి చెరువు, వేల్పూ రు బీసీ కాలని, వేల్పూరు సెంటర్, వీరభద్రాపురం,మండపాక మీదుగా పైడిపర్రు. రాత్రి బస పైడిపర్రు. తణుకు నుంచి పాదయాత్ర ఎలా జరగబోతుందో గురువారం ప్రకటించనున్నారు.

చంద్రబాబు రూట్ రెడీ

ఏలూరుకార్పొరేషన్: తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు వస్తున్నా మీకోసం పాదయాత్రకు జిల్లాలో ప్రవేశించే తరుణంలో ఏలూరు నియోజకవర్గం నుంచి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వెళ్ళి ఘన స్వాగతం పలుకుదామని ఏలూరు నియోజకవర్గం టీడీపీ కన్వీనర్ అంబికా కృష్ణ అన్నారు. గురువారం రాత్రి ఏలూరు పవరుపేటలోని అంబికా భవన్ వద్ద ఏర్పాటు చేసిన నాయకులు, కార్యకర్తల సమావేశానికి నగర కార్యదర్శి కొల్లేపల్లి రాజు అధ్యక్షత వహించారు.

ఈ సందర్భంగా అంబికా కృష్ణ మాట్లాడుతూ చంద్రబాబు పర్యటనకు ఇతర జిల్లాల్లోజరిగిన స్వాగతాంజలి కంటే మన జిల్లా నుంచి ఘన స్వాగతం పలకాలని, ఇందుకోసం యువత, మహిళలు పెద్ద సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు. కార్యకర్తలకు, నాయకులకు తగు సౌకర్యాలు కలుగజేస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు విసుగుచెంది ఉన్నారని, తెలుగుదేశం పార్టీ పాలన కోసం ప్రజలు నిరీక్షిస్తున్నారని, ఈ తరుణంలో చంద్రబాబు జిల్లాకు రావడం, పార్టీకి శుభపరిణామమన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాలి ప్రసాద్, ఉప్పాల జగదీష్‌బాబు, బంకా రామ్మోహనరావు, లుకలాపు సత్యనారాయణ, నెర్సు గంగరాజు, ఇక్బాల్, పైడేటి రఘు, జంపా సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. వివిధ డివిజన్ల నుంచి నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు.

చంద్రబాబుకు ఘన స్వాగతం పలుకుదాం


చంద్రబాబు మా నియోజకవర్గాలకూ రావాల్సిందే. ఆయన యాత్ర సాగితే ఇక్కడ పార్టీకి మంచి ఊపు వస్తుంది. స్థానిక సంస్థల ఎన్నికలకు ఉపయోగపడుతుంది. రెండు రోజులు పెంచినా సరే మావైపు వచ్చేలా చూడండి అంటూ జిల్లా పార్టీ నేతల ఒత్తిళ్లు కొనసాగుతూనే ఉన్నాయి. దీంతో చంద్రబాబు పూర్తి పర్యటనను గురువారం వరకు ఖరారు చేయలేకపోయారు. ఆకివీడు నుంచి తణుకు వరకు మాత్రమే రూట్‌మ్యాప్‌ను సిద్ధం చేయగలిగారు. ఆ తర్వాత ఆయన సిద్ధాంతం మీద నుంచి గోదావరి దాటి ముందుకు సాగాలా, లేదా నిడదవోలు, కొవ్వూరు మీదుగా రోడ్డు కం రైల్ బ్రిడ్జి మీదుగా రాజమండ్రి చేరాలా అనే దానిపై ఇంకా తర్జనభర్జనలు సాగుతూనే ఉన్నాయి. దీనిపై ర్రాష్ట పార్టీ నుంచి కూడా ఇప్పటిదాకా కీలక నిర్ణయం

వెలువడలేదు.

ఆంధ్రజ్యోతి, ఏలూరు : పశ్చిమగోదావరిలో పది రోజుల పాటు మాత్రమే తన పర్యటన ఉండేలా ఏర్పాట్లు చేయాల్సిందిగా ఇంతకుముందే చంద్రబాబు కూడా పార్టీ నేతలకు సూచించారు. ఆ మేరకు ముందుగా రూపొందించిన రూట్‌మ్యాప్‌ను ఆయన ఓకే చేశారు. అయితే గడిచిన మూడు రోజులుగా ఆయన పాదయాత్రకు సంబంధించిపూర్తిస్థాయి ప్రణాళిక మాత్రం పెండింగ్‌లోనే ఉంది. చంద్రబాబునాయుడు కొవ్వూరు మీదుగా గోదావరి బ్రిడ్జి దాటి రాజమండ్రిలో ప్రవేశించేలా పార్టీ ముఖ్యనేతలు కొందరు గట్టిగా పట్టుపడుతుండటంతో ఇప్పటిదాకా పశ్చిమగోదావరిలో ఆయన పర్యటన తణుకు వరకు మాత్రమే ఖరారు చేయగలిగారు. అక్కడి నుంచి ఎలా ముందుకు సాగాలనేదానిపై మాత్రం తుది నిర్ణయం తీసుకోలేకపోతున్నారు.

గడిచిన రెండు రోజులుగా పార్టీ అధినేత చంద్రబాబు కూడా పూర్తిగా బిజీగా ఉండటం, టీడీఎల్‌పీ సమావేశాలు, అసెంబ్లీ సమావేశాలపై వ్యూహరచన, ఎమ్మెల్యేలకు దిశానిర్దేశంచ చేయడంలోనూ, ఎమ్మెల్సీ అభ్యర్థ్ధుల ఎంపికలోనూ చంద్రబాబు క్షణం తీరిక లేకుండా ఉండటంతో పశ్చిమలో పూర్తి పర్యటన ఒక కొలిక్కి రాలేదని చెబుతున్నారు. శనివారం నాటికల్లా ఆయన పర్యటనకు తుది రూపు రావచ్చు. ఇప్పటిదాకా అందుతున్న సమాచారం ప్రకారం ఈ నెల 16వ తేదీ నాటితోనే చంద్రబాబు పాదయాత్ర ఈ జిల్లాలో ముగియగలదని అంచనా వేస్తున్నప్పటికీ ఇది మరో మూడు రోజులు పెరిగే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు.

తణుకు నుంచి సిద్ధాంతం బ్రిడ్జి మీదుగా తూర్పుగోదావరి జిల్లాలో ప్రవేశించాలనుకుంటే ఆయన పర్యటన తొమ్మిది రోజుల్లో ముగియనుంది. లేదంటే కొవ్వూరు మీదుగా వెళ్లాలని భావిస్తేనే మరో రెండు రాత్రులు అదనంగా ఇక్కడ బస చేసేందుకు అవకాశం ఉంది. ఇంకోవైపు చంద్రబాబు పాదయాత్రను విజయవంతం చేసేందు పార్టీ జిల్లా అధ్యక్షురాలు సీతారామలక్ష్మి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ సీనియర్ నేత మాగంటి బాబుతో సహా మిగతా నేతలంతా ఇప్పటికే అన్ని ప్రాంతాల్లోనూ పార్టీ నేతలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఒక క్రమపద్ధతిలో, క్రమశిక్షణతో ఆయన పాదయాత్రలో పాల్గొనాల్సిందిగా పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. శనివారం చంద్రబాబు ఉప్పుటేరు దాటి జిల్లాలో కాలిడుతున్న సందర్భంగా భారీగా స్వాగతం పలికేందుకు పార్టీ నేతలు, కార్యకర్తలు ముందుకు కదలాలని పార్టీ జిల్లా అధ్యక్షురాలు సీతారామలక్ష్మి, పార్టీ కార్యాలయ సమన్వయ కార్యదర్శి పాలిప్రసాద్‌లు గురువారం విజ్ఞప్తి చేశారు.

గోదావరి దాటేదెటు

బాబ్లీ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా శుక్రవారం కరీంనగర్‌లో టీడీపీ ఆందోళన కార్యక్రమం చేపట్టింది. ఆ పార్టీ కార్యకర్తలు కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ తెలుగుదేశం ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర్‌రావు మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి బాబ్లీపై రివ్యూ పిటిషన్ వేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అఖిలపక్షాన్ని ఢిల్లీ తీసుకెళ్లాలన్నారు.

బాబ్లీప్రాజెక్టుకు వ్యతిరేకంగా టీడీపీ ధర్నా

కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టే విషయంలో తమకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సలహాలు అవసరం లేదని టీడీపీ సీనియర్ నేత గాలి ముద్దు కృష్ణమ నాయుడు అన్నారు.

ఈ సందర్భంగా శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి జైలు నుండి బయటకు వచ్చేందుకే అవిశ్వాసం నాటకం ఆడుతున్నారని విమర్శించారు. దోపిడీలో జగన్ ఎ1 అయితే, బ్రదర్ అనిల్ ఎ2 ముద్దు కృష్ణమ నాయుడు అన్నారు.

అవిశ్వాసంపై వైఎస్సార్‌సీపీ సలహాలు వద్దు : ముద్దుకృష్ణమ

రాష్ట్రంలో పాలన గాడి తప్పిందని, తిరిగి గాడిలో పడాలంటే, రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని లోకేష్ నాయుడు ఆకాంక్షించారు. మూడు రోజుల పార్యటనలో భాగంగా రెండో రోజైన శుక్రవారం జిల్లాలో పల్లె పల్లెకు తెలుగుదేశం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పూర్తి అవినీతి పార్టీ అని ధ్వజమెత్తారు. ఆ పార్టీని గెలిపిస్తే రాష్ట్రానికి నష్టమేనని అభిప్రాయపడ్డారు. వైయస్సార్ కాంగ్రెసు అవినీతి పార్టీ అయితే, కాంగ్రెసు అసమర్థ పార్టీ అన్నారు.

ప్రజలు టిడిపిని అందలమెక్కిస్తే రాష్ట్రం తిరిగి అభివృద్ధిలో పుంజుకుంటుందని లోకేష్ నాయుడు అన్నారు. రాజకీయాల్లో సామాజిక న్యాయం పాటించిన ఏకైక పార్టీ తెలుగుదేశం మాత్రమే అన్నారు. టిడిపి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకు వెళ్తుందన్నారు. గత 2009 ఎన్నికల్లో చంద్రబాబును ఓడించేందుకు కాంగ్రెసు పార్టీ రూ.25 కోట్లు ఖర్చు పెట్టిందని, అయినా గెలువలేకపోయిందన్నారు. పార్టీ కార్యకర్తలు ఎన్నికలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఎన్నికల్లో బిసిలకు వంద స్థానాలు ఇస్తామని, అధికారంలోకి వస్తే పదివేల కోట్లతో బడ్జెట్ ప్రవేశ పెడతామన్నారు.

రాష్ట్రంలో పాలన గాడి తప్పింది : లోకేష్ నాయుడు

ఆంధ్ర ప్రదేశ్‌ను అంధకార ప్రదేశ్‌గా దిగజార్చడమే తొమ్మిదేళ్ల పాలనలో కాంగ్రెస్ సాధించిన ఘనతని టీడీపీ వ్యాఖ్యానించింది. ఆ పార్టీ నేత కిమిడి కళా వెంకట్రావు గురువారం మీడియాతో మాట్లాడారు.'రైతులకు తొమ్మిది గంటల కరెంటు ఇస్తామని వాగ్దానం చేసి కాంగ్రెస్ రెండుసార్లు అధికారంలోకి వచ్చింది. ముగ్గురు ముఖ్యమంత్రుల పాలనలో దానిని చివరకు మూడు గంటలకు తెచ్చారు. కరెంటు ఇవ్వలేని అసమర్థత వల్ల 30 లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోయాయి' అని ఆయన విమర్శించారు. విద్యుత్ ఉత్పత్తికి పైసా నిధులు ఇవ్వకుండా ఆ వ్యవస్థను నాశనం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

పొలిట్‌బ్యూరో సమావేశాలకు ఉపనేతలు
టీడపీ పొలిట్‌బ్యూరో సమావేశానికి శాసనసభాపక్షం ఉప నేతలను ప్రత్యేక ఆహ్వానితులుగా పిలవాలని చంద్రబాబు నిర్ణయించారు. ఇప్పటిదాకా పొలిట్‌బ్యూరో సమావేశానికి వీరికి ఆహ్వానం లేదు. ప్రస్తుతం టీడీపీ శాసనసభాపక్షానికి నలుగురు ఉప నేతలు ఉన్నారు. వీరిలో అశోక్ గజపతిరాజు ఇప్పటికే పొలిట్‌బ్యూరో సభ్యునిగా ఉన్నారు. మిగిలిన ముగ్గురు ఉప నేతలు ముద్దు కృష్ణమ నాయుడు, మోత్కుపల్లి నర్సింహులు, ఎల్.రమణలను ఈసారి పిలుస్తున్నారు. ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయం ఈ విషయాన్ని అధికారికంగా తెలిపింది. పోయినసారి పొలిట్‌బ్యూరో సమావేశంలో తెలంగాణపై చర్చ జరిగినప్పుడు తనను పిలవకపోవడంపై మోత్కుపల్లి మనస్థాపానికి గురైన విషయం తెలిసిందే.

ఆంధ్రప్రదేశ్ కాదు.. అంధకారప్రదేశ్: టీడీపీ