March 7, 2013

మండవల్లి: పులిచింతల ప్రాజెక్టు నిర్మాణానికి తొలుత శ్రీకారం చుట్టిన ఘనత టీడీపీ ప్రభుత్వానిదేనని పార్టీ అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. మండవల్లి మండలం పెరికెగూడెంలో గురువారం రాత్రి జరిగిన బహిరంగసభలో ఆయన ప్రసంగిస్తూ, ప్రాజెక్టు నిర్మాణానికి రూ.40 కోట్లమేరకు నిధు లు మంజూరు చేశామని, కాంగ్రెస్ జిమ్మిక్కులు వల్ల నిర్మాణం సాధ్యం కాదని, కేవలం టీడీపీవల్లే అది సాధ్య మని అన్నారు. జలయజ్ఞం పేరుతో రూ.8వేల కోట్లమేరకు కాంగ్రెస్ ప్రభుత్వం పులిచింతలకు కేటాయించినట్లు జిమ్మిక్కులు చేసి, తప్పడు లెక్కలు, బిల్లులతో దోసేశారని విమర్శించారు. కేవలం 8వేల ఎకరాలకు చుక్కనీరు కూడా ఇవ్వలేకపోయారని ధ్వజమెత్తారు. పులిచింతల ప్రాజక్టును టీడీపీ అధికారంలోకి రాగానే పూర్తిచేస్తామని వెల్లడించారు.

కృష్ణాడెల్టాలో అధునికీకరణకు రూ.4500కోట్లను కేటాయించినట్లు ప్రకటించి,పనులు చేపట్టిన దాఖలాలు లేకుండా, నిధులు కాస్తా జేబుల్లో నిపుంకున్నారని చంద్రబాబు విమర్శించారు. కాల్వల తవ్వకాలు చేపట్ట కుండా, పంటలకు నీరు ఇవ్వకుండా రైతులను ఇబ్బందులకు గురిచేశారని అన్నారు. మొక్కుబడిగా పనులు చేసి, బిల్లులు మార్చేశారన్నారు. టీడీపీ అధికారంలోకి రావటమే ఆధునికీకరణ పనులు నాణ్యతతో చేపట్టి, దాళ్వాపంటకు నీరు విడుదల చేస్తామని ప్రకటించారు. విద్యుత్ పేరుతో రూ.32కోట్లమేరకు ప్రజలపై భారాన్ని మోపేందుకు నీచమైన యోచన చేస్తుందని, ఇప్పటికే రూ.14 కోట్లమేరకు సర్‌చార్జీలు పేరుతో భారాన్ని మోపారన్నారు.మరో రూ.18కోట్లమేరకు భారా న్ని వేసేందుకు ప్రభుత్వం యోచన చేస్తున్నదని బాబు ఆరోపించారు. సక్రమంగా కరంట్ ఇవ్వకపోగా, విద్యుత్ బిల్లులతో మోత మోగిస్తున్న సిగ్గులేని ప్రభుత్వం కాంగ్రెస్ అంటూ ఆయన ధ్వజమెత్తారు.

2009లోనే నగదుబదిలీ పథకాన్ని టీడీపీనే ప్రవేశపెట్టిందని, కాంగ్రెస్ వచ్చి, నగదు బదిలీ ప«థకాన్ని నకిలీ బదిలీ పథకంగా మార్చేసారని విమర్శించారు. అధార్‌కార్డుల ద్వారా బియ్యాన్ని పంపిణీ చేసేందుకు యోచన చేస్తే సహించేదిలేదని, బియ్యాన్ని య«థావిధిగా పంపిణీ చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. దీనిపై పోరాటం చేస్తామని హెచ్చరించారు. వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబం అంతా అవినీతి పరులేనని, కొడుకు, అల్లుడు, మనవడు దోచేశారని చంద్రబాబు విమర్శించారు. అవినీతి ఆరోపణలతో చంచల్‌గూడా జైల్‌లో ఉంటున్న జగన్‌ను నమ్మితే దగా పడినట్లేనని పేర్కొన్నారు. అవినీతి ఊబిలో కురుకుపోయిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తమిరి కోట్టాలని పిలుపునిచ్చారు.

టీడీపీ అధికారంలో రావటంతోటే తొలి సంతకం రైతు రుణమాఫీ పథకం వర్తించేందుకు, రెండో సంతకం బెల్ట్‌షాపులు రద్దు చేస్తూ చేస్తానని బాబు వెల్లడించారు. తనకు పదవులపై ఆశలేదనీ, తొమ్మిది సంవత్సరాలు సీఎంగా, తొమ్మిది సంవత్సరాలు ప్రతిపక్షనాయుడిగా చేశానని, కాంగ్రెస్ దొంగల దోపీడీని చూడలేక ప్రజలకోసం వచ్చానని చెప్పారు. ఎమ్మెల్యేలు జయమంగళ వెంకటరమణ, దేవినేని ఉమా, మాజీ మంత్రి మాగంటి బాబులు ఉన్నారు.

పులిచింతల' పూర్తి చేస్తా

ముదినేపల్లి : టీడీపీ శాసనసభాపక్షం సమావేశం ఏర్పాటు చేయడంతో రాష్ట్రంలోని టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు ఇతర నాయకులు రావడంతో పోలవరపు సుబ్రహ్మణ్యానికి చెందిన తోటలో సందడి వాతావరం నెలకొంది. గురువారం ఉదయం నుంచి చంద్రబాబును కలిసేందుకు జిల్లా నాయకులే కాక ఇతర జిల్లాలకు చెందిన సీనియర్ నాయకులు, రైతు సమాఖ్య ప్రతినిధులు క్యూ కట్టారు. వారితో చంద్రబాబు సమావేశమై పలు విషయాలపై చర్చించారు. సాయంత్రం 4.30 గంటలకు చంద్రబాబు దాకరం నుంచి పాదయాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా మండలంలోని పలు గ్రామాల పార్టీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు వందల సంఖ్యలో ఆయనకు ఘనస్వాగతం పలికారు. మహిళలు నుదిట తిలకం దిద్ది హారతులు ఇచ్చారు.

పొలాల్లో పని చేస్తున్న కూలీలు సైతం చంద్రబాబును చూసేందుకు ఎగబడ్డారు. ఎంపీ కొనకళ్ళ నారాయణరావు, మాజీ మంత్రులు మాగంటి బాబు, ఎర్నేని సీతాదేవి, ఎమ్మెల్యేలు జయమంగళ వెంకటరమణ, జిల్లా అధ్యక్షులు దేవినేని ఉమామహేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి బచ్చుల అర్జునుడు, పార్టీ రాష్ట్ర కార్యదర్శులు చలమలశెట్టి రామానుజయ, కొనకళ్ళ బుల్లయ్య, రాష్ట్ర వైద్యవిభాగం అధ్యక్షులు సి.ఎల్.వెంకట్రావు, రైతాంగ సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు ఎర్నేని నాగేంద్రనాథ్, తెలుగురైతు జిల్లా కార్యదర్శి కామినేని శ్రీరామకృష్ణప్రసాద్ తదితరులు బాబును కలిశారు.

దాకరంలో నేతల సందడి

గుడివాడటౌన్ : మహిళలు స్వశక్తితో ఆర్థిక సాధికారత సాధించాలంటే తెలుగుదేశం ప్రభుత్వంలోనే సాధ్య పడుతుందని తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు శోభా హైమావతి అన్నారు. టీడీపీ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మహిళా హక్కుల సాధన కోసం వందేళ్ళకు పైగా అలుపెరగని పోరాటాలు చేస్తున్నా టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాతే ఆస్తి హక్కులో వాట వచ్చిందన్నారు. యూపీఏ చైర్మన్ సోనియా, పార్లమెంట్ ప్రతిపక్ష నేత సుస్మాస్వరాజ్, స్పీకర్ మీరాకుమార్ చట్ట సభల్లో ఉన్నా 33 శాతం మహిళలకు రిజర్వేషన్ కల్పించకపోవడం విచారకరమన్నారు. మహిళలు శాస్త్ర పరిశోధనా రంగాలతో పాటు రాజకీయ, క్రీడ, వ్యాపార, ఉద్యోగ, దేశ రక్షణ రంగాల్లో రాణిస్తూ అద్భుత విజయాలు సాధిస్తున్నారని హైమావతి అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుక్రవారం కైకలూరులో చంద్రబాబునాయుడు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు.

షర్మిల నీ స్థాయి ఏంటి.. కనీసం పంచాయతీ సభ్యురాలు కూడా కాని షర్మిల తొమ్మిదేళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబునాయుడిని విమర్శించడం హాస్యాస్పదమని హైమావతి అన్నారు. టీడీపీ పాలనలో రాష్ట్రాన్ని అత్యున్నత స్థానంలో నిలబెట్టిన చంద్రబాబుకు, రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అ«ధోగతి పాల్జేసిన రాజశేఖరరెడ్డికి పోలికా అంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. మాట్లాడితే రాజన్న రాజ్యం తెస్తానంటున్న ఆమె వైఎస్ పాలనలో 22వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని, ముదిగొండ, సోంపేటల్లో రైతులపై కాల్పులు జరిపించారు.

కొడుకు ధనదాహం తీర్చేందుకు పేదల భూములను దోచి బడా కంపెనీలకు దారాదత్తం చేశారనిఆరోపించారు. స్థాయి మరచి చంద్రబాబును విమర్శిస్తే మహిళలు చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు, తెలుగు మహిళా అధ్యక్షురాలు ఆచంట సునీత, జిల్లా కార్యదర్శి తమ్మినీడు గంగాభవానీ, పట్టణ అధ్యక్షురాలు బొడ్డు శివశ్రీ, రేమల్లి కమలకుమారి, ఎస్.తులసీరాణి పాల్గొన్నారు.

మహిళా సాధికారత


గుడివాడటౌన్: కనీస గుర్తింపు లేని వ్యక్తికి రాజకీయ భిక్ష పెట్టి, ఎమ్మెల్యేని చేయడానికి కారకులైన టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడ్ని విమర్శించడం దారుణమని మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి రావి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. స్థానిక టీడీపీ కార్యాలయంలో గురువారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ 5,6తేదీల్లో నియోజకవర్గంలో జరిగిన చంద్రబాబు వస్తున్నా మీకోసం పాదయాత్రకు మద్దతుగా తామున్నామంటూ అండగా ఉండి స్వార్థపరులకు చెంపపెట్టులా పాదయాత్రను విజయవంతం చేసిన నియోజకవర్గ ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు కృతజ్ఞతలని రావి చెప్పారు.

చంద్రబాబుకు ప్రజల నుంచి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక విమర్శలు చేయడం అజ్ఞానాన్ని తెలియజేస్తుందన్నారు. నియోజకవర్గ సమస్యలపై ఏనాడూ అసెంబ్లీలో ప్రస్తావించని వ్యక్తికి చంద్రబాబును విమర్శించే అర్హత లేదన్నారు. వైసీపీకి అమ్ముడుపోయిన స్వార్థ రాజకీయ నాయకులకు కడుపు మండిన ప్రజలు రాబోయే ప్రజా కురుక్షేత్రంలో ఓట్లతో గట్టి గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. చంద్రబాబుపై మరోసారి నోటికొచ్చినట్లు వాగితే ప్రజలు, మహిళలు తగిన బుద్ధి చెబుతారన్నారు. సమావేశంలో టీడీపీ నాయకులు బేతనపల్లి నాగేశ్వరరావు, అంగడాల సతీష్, గొర్రెల పాండురంగారావు, నూతక్కి బాలాజీ, అవధానం మల్లిబాబు, యార్లగడ్డ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

రాజకీయ భిక్ష పెట్టిన చంద్రబాబును విమర్శించడం దారుణం

ముదినేపల్లి: వైఎస్ పాలనలో జరిగిన అవినీతికి సాక్ష్యంగా కిరణ్ ప్రభుత్వం నిలిచిందని శాసన మండలి టీడీపీ ఫ్లోర్ లీడర్ దాడి వీరభద్రరావు విమర్శించారు. చంద్రబాబు వస్తున్నా.. మీకోసం పాదయాత్రలో భాగంగా దాకరం వద్ద గురువారం జరిగిన టీడీఎల్పీ సమావేశానికి విచ్చేసిన ఆయన విలేకర్లతో మాట్లాడుతూ, రాష్ట్రంలో కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం ప్రజలను పూర్తిగా గాలికి వదిలేసిందని అన్నారు. ఏ కోణంలో చూసినా కాంగ్రెస్ ప్రభుత్వంలో కుంభకోణమే తప్పా ప్రజలకు ఒరగబెట్టింది ఏమి లేదని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏమి చేసిందని అడిగితే ఆకాశం వైపు చూడటమే తప్ప ప్రజలకు జవాబుదారితనంగా ఏమి చెప్పాలో అర్థం కావడం లేదని అన్నారు. జరుగుతున్న అవినీతి, అక్రమాలపై ప్రతిపక్షాలు సాక్ష్యాధారాలు చూపించినప్పటికీ ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి ఒప్పదం కుదుర్చుకున్న కంపెనీ దాఖలు చేసిన అనుభవ సర్టిఫికెట్లు తప్పుడవని తేలినా సీఎం తనదైన శైలిలో అవినీతిని ప్రోత్సహిస్తూ టెండర్లను ఆమోదించారని విమర్శించారు. రాష్ట్ర కార్యదర్శి చలమలశెట్టి రామానుజయ ఉన్నారు.

వైఎస్ అవినీతి సాక్షిగా కిరణ్ ప్రభుత్వం

నా 30 ఏళ్ల రాజకీయ జీవితం ఒక ఎత్తు. ఈ 150 రోజుల పాదయాత్ర ఒక ఎత్తు. ఈ యాత్ర నాకు అనేక అనుభవాలను నేర్పుతోంది. ఆర్థిక సంస్కరణల తర్వాత కూడా క్షేత్రస్థాయిలో ప్రజల కష్టాలు, కడగండ్లలో ఏమాత్రం మార్పు లేకపోవడాన్ని కళ్లారా చూస్తున్నా. కానుకొల్లు, లింగాల, పెరికిగూడెం ప్రాంతాలన్నీ ఆకుపచ్చ చీర కట్టినట్టు.. పచ్చటి కొబ్బరి తోటల మధ్య ఉన్నాయి. కానీ, ఇక్కడి జనం జీవితాలు మాత్రం ఎండిన కొబ్బరి చెట్టులా జీవం కోల్పోయాయి. ఒకప్పుడు ఇక్కడ చేపలు, రొయ్యల చెరువులు విరివిగా ఉండేవి.

వేల మందికి అవే ఉపాధి. ఎక్కడెక్కడి నుంచో వచ్చి చేపలు, రొయ్యల చెరువులపై బతికేవారు. ఎగుమతులతో పెద్దఎత్తున విదేశీ మారక ద్రవ్యమూ వచ్చేది. ఇప్పుడు కూడా అక్కడక్కడా చెరువులు కనిపిస్తున్నా.. గత వైభవం మాత్రం లేదు. అప్పట్లో చేపలు, రొయ్యల చెరువుల వ్యాపారం చేసిన రైతులంతా ఇప్పుడు నీటిలోంచి బయటపడిన చేపల్లా గిలగిలలాడుతున్నారు. వారి జీవితాలూ అస్తవ్యస్తం అయిపోయాయి. దీనంతటికీ కారణం పాలకుల విధానాలే. ఈ వ్యాపారాన్ని ప్రభుత్వం గాలికి వదిలేసింది.

వ్యవసాయానికి, వ్యాపారానికి ప్రభుత్వం నుంచి ఏమాత్రం చేయూత లేదని ఇక్కడి వారు ఆరోపిస్తున్నారు. ఇతర జిల్లాల నుంచి పొట్ట చేతపట్టుకుని ఇక్కడికి వలస వచ్చి రొయ్యల చెరువులపై ఉపాధి పొందినవారు ఇప్పుడు రోడ్డున పడ్డారు. ఇప్పుడు ఆ భూముల్లో వ్యవసాయం చేసే పరిస్థితి లేదు. చేపలు, రొయ్యల సాగు చేసే పరిస్థితీ లేదు. ఇప్పుడు ఇక్కడి భూములతోపాటు రైతులు కూడా రెంటికి చెడ్డ రేవడిలా మారారు. అటు వ్యవసాయం చేయలేక, ఇటు చేపలు పెంచి వ్యాపారమూ చేయలేక చిన్న రైతులు చాలామంది అప్పుల ఊబిలో కూరుకుపోయారు.

నీటి లోంచి బయటపడిన చేపలు

దానికే పెద్దపీట వేస్తానని చంద్రబాబు వెల్లడి

టీడీపీ నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి. సామాజిక న్యాయానికి పెద్దపీట వేసే ఉద్దేశంలో ఉన్నానని గురువారం కృష్ణా జిల్లాలో జరిగిన టీడీఎల్పీ సమావేశంలో ఆయన చేసిన ప్రకటనతో అభ్యర్థుల ఎంపికపై ఆ పార్టీలో కొత్త ఊహాగానాలు మొదలయ్యాయి. ముస్లిం, ఎస్సీ మాదిగ, బ్రాహ్మణ, బీసీ, మహిళ, వికలాంగ వర్గాలతోపాటు పార్టీ విధేయులకు ప్రాధాన్యం ఇవ్వాలనే ఆలోచన తనకు ఉందని, అయితే పార్టీకి వచ్చేవి మూడు సీట్లే అయినందువల్ల అవకాశం ఉన్నమేరకు చోటుకల్పిస్తానని చంద్రబాబు పేర్కొన్నారు.

ఆయన చెప్పిన సామాజిక సమీకరణాల్లో ముస్లింల నుంచి హైదరాబాద్ నగర నేత సలీం, బ్రాహ్మణ సామాజికవర్గం నుంచి పోలీస్ శాఖ మాజీ ఉన్నతాధికారి రావులపాటి సీతారామారావు పేర్లు ముందుకొచ్చాయి. ఈ వర్గాల నుంచి ఆయన ఎంపిక చేయదలిస్తే వీరికే అవకాశం వస్తుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ప్రస్తుతం పదవీ విరమణ చేస్తున్న ఎమ్మెల్సీ మస్కతి గురువారం చంద్రబాబును కలిసి మాట్లాడినా ఆయన పేరు పెద్దగా ప్రచారంలోకి రాలేదు. బీసీ వర్గాలకు ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉందని చంద్రబాబు చెబుతూ.. దాడి వీరభద్రరావు పేరును కూడా ప్రస్తావించారు. అదే సమయంలో మహిళలకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని కూడా అన్నారు.

ఎక్కువ అవకాశాలు దాడికే ఉన్నాయని, లేని పక్షంలో పంచుమర్తి అనూరాధ, తెలుగుమహిళ అధ్యక్షురాలు శోభా హైమావతి పేర్లను పరిశీలనకు తీసుకోవచ్చని అంటున్నారు. ఎస్సీ మాదిగ సామాజిక వర్గం నుంచి మాజీ ఎమ్మెల్యేలు బక్కాని నర్సింహులు, శమంతక మణి, పార్టీ ఎస్సీ విభాగం అధ్యక్షుడు డి. శ్రీశైలం పేర్లు ప్రచారంలో ఉన్నాయి. వికలాంగ వర్గాల గురించి చంద్రబాబు ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ ఆ వర్గానికి చెందిన పార్టీ నేత కోటేశ్వరరావు ఎన్టీఆర్ హయాం నుంచి పార్టీని అంటిపెట్టుకొని ఉన్నారని.. అలాంటి వారినీ పట్టించుకోవాల్సి వస్తోందని పేర్కొన్నారు.

వీటితోపాటు మరో రెండు కోణాలను ఆయన ప్రస్తావించారు. తన సొంత జిల్లా చిత్తూరుకు ఇంతవరకూ ఎమ్మెల్సీ పదవి ఇవ్వలేకపోయానని, అలాగే ఏ అవకాశాలు రాకపోయినా పార్టీని దీర్ఘకాలంగా పార్టీని అంటిపెట్టుకొని ఉన్నవారి గురించి కూడా ఆలోచించాలని వ్యాఖ్యానించారు. ఆయన ప్రస్తావించిన వర్గాలు చాలా ఉండి సీట్లు మూడే ఉండటంతో వీటిలో ఏవో మూడు వర్గాలకే అవకాశం దక్కుతుందన్నది పార్టీవర్గాలకు స్పష్టమై పోయింది. పార్టీ విధేయుల గురించి బాబు చేసిన ప్రస్తావన ఎల్‌విఎస్ఆర్‌కె ప్రసాద్ వంటి వారిలో ఆశలు రేకెత్తించింది. మహిళా కోటాలో మాజీ స్పీకర్ ప్రతిభా భారతి పేరు కూడా ప్రచారంలో ఉంది.

ఎమ్మెల్సీ టికెట్లలో సామాజిక న్యాయం


వైఎస్ కొడుకు దోచుకున్న చిట్టా వెలుగు చూడటంతో ఆయన జైలులో గడుపుతుండగా ప్రస్తుతం ఆయన అల్లుడు అనిల్‌కుమార్ అక్రమాల చిట్టా బయటకు వస్తోందని చంద్రబాబు చెప్పారు. అనిల్ బినామీల గుట్టు బయట పడకుండా ఆయన అనేక వక్రమార్గాలు వెతుకుతున్నారన్నారు. దీనికి ఇటీవల ఇదే జిల్లాలో చనిపోయిన వీరభద్రారెడ్డి వ్యవహారమే దర్పణమన్నారు. వీరభద్రారెడ్డిది హత్య, ఆత్మహత్యా అనేది పోలీసులు తేల్చగలిగితేనే అనిల్ అక్రమ కార్యకలాపాలు బయటకు వస్తాయన్నారు. వైఎస్ కుటుంబమంతా జైళ్ల పాలవుతోందని, ఆయన బావమరిది, మాజీ మేయర్ రవీంద్రనాథ్ రెడ్డి కడప దొంగ అని, ఇటీవల ఫోర్జరీ చేసి జైల్‌కు వెళ్లి వచ్చారని తెలిపారు.

రాష్ట్రంలో సుపరిపాలన రావాలంటే టీడీపీ అధికారంలోకి రావడం ఒక్కటే మార్గమని చంద్రబాబు చెప్పారు. "ప్రజలకు రక్షణగా ఉండాల్సిన ప్రభుత్వమే మిమ్మల్ని భక్షిస్తోంది. కాపాడాల్సిన వారే కాటేస్తున్నారు. ప్రజల రక్తాన్ని పన్నుల రూపంలో జలగల్లా పీలుస్తున్నారు. సంక్షేమ పథకాలను అమలు చేయాల్సిన సొమ్మును తల్లి, పిల్ల కాంగ్రెస్‌లు దిగమింగాయి. వైఎస్ హయాంలో జగన్ దోచుకున్న లక్ష కోట్లు పెట్టి మీ అందరికీ ఉచితంగా ఇళ్లు నిర్మించి ఇవ్వవచ్చు'' అని చంద్రబాబు అన్నారు. బుధవారం రాత్రి 1.30 గంటల వరకు నడిచిన చంద్రబాబు కాళ్ల నొప్పులతో బాధపడ్డారు.

వీరభద్రారెడ్డి మృతి వెనక మర్మమేమిటి?

వారిని ఎన్నుకుంటే పైశాచిక పాలనే
టీడీపీకి ద్రోహం చేస్తే పుట్టగతులుండవ్
పాదయాత్రలో చంద్రబాబు

  "లక్ష కోట్లు తిన్న జగన్‌ను స్ఫూర్తిగా తీసుకుని మరికొంతమంది అవినీతిపరులు పుట్టుకొస్తున్నారు. వారంతా వైసీపీలో చేరి అవినీతి అక్రమాలతో సంపాదించుకోవచ్చని భావిస్తున్నారు. అటువంటి వారిని చట్టసభలకు పంపిస్తే ప్రజలను దోచుకుంటూ పైశాచిక పాలన చేస్తారు'' అని టీడీపీ అధినేత చంద్రబాబు వ్యాఖ్యానించారు. కృష్ణా జిల్లాలో గురువారం పాదయాత్ర చేస్తున్న చంద్రబాబు.. లింగాలలో మాట్లాడుతుండగా టీడీపీ నుంచి వైసీపీలోకి వెళ్లిన వారిని క్షమించవద్దంటూ అక్కడి వారు చేసిన నినాదాలకు బాబు ఈ విధంగా స్పందించారు. టీడీపీకి ద్రోహం చేసిన వారికి పుట్టగతులుండవని మండిపడ్డారు.

ఇప్పుడు కూడా రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతోందని, రాక్షస పాలనను అంతమొందించే దిశగా ప్రజలు టీడీపీకి పట్టం కట్టాలని పిలుపునిచ్చారు. ఇప్పటికే కరెంట్ సర్ చార్జీలతో రూ.1400 కోట్లు భారం మోపారని, మరోసారి సర్ చార్జీ వడ్డించనున్నారని చంద్రబాబు అన్నారు. కృష్ణా డెల్టా ఆధునికీకరణ పనుల్లో రూ.4500 కోట్లు దుర్వినియోగమయ్యాయని, వీటివల్ల రైతాంగానికి ఎటువంటి ఉపయోగం లేదని విమర్శించారు. వైఎస్ చేసిన పాపాలన్నీ ప్రజలను పట్టి పీడిస్తుంటే, ప్రస్తుత పాలకులు ప్రజలను మరిన్ని కష్టాలకు గురి చేస్తున్నారని ధ్వజమెత్తారు. అవినీతి వైఎస్ కుటుంబాన్ని, ప్రజా సంక్షేమమే పరమావధిగా భావించిన ఎన్టీఆర్ కుటుంబాన్ని బేరీజు వేసుకోవాలని సూచించారు.

వైఎస్ కుటుంబానిది నేర చరిత్ర..


టీడీఎల్పీ సమావేశం అనంతరం మోత్కుపల్లి నరసింహులు, పయ్యావుల కేశవ్, గాలి ముద్దుకృష్ణమనాయుడు, ధూళిపాళ్ల నరేంద్రకుమార్, హేమలత విలేకరులతో మాట్లాడారు. అవిశ్వాస తీర్మానం పెట్టాలని డిమాండ్ చేస్తున్న వైసీపీ... అసలు తన బలం ఎంతో తేల్చి చెప్పాలన్నారు. ఎవరెన్ని మాట్లాడినా, తమ వ్యూహం ప్రకారమే నిర్ణయాలు తీసుకుంటామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై తమ కోర్టులో అవిశ్వాసం ప్రకటించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని మోత్కుపల్లి అన్నారు.

వైసీపీ బలమెంతో ప్రకటించాలి


ప్రస్తుతం తనకున్న సమాచారాన్ని బట్టి అక్టోబర్, నవంబర్ నెలల్లో ఎన్నికలకు వెళ్లే ఆలోచనలో కాంగ్రెస్ ఉందని చంద్రబాబు చెప్పారు. అయితే, రోజురోజుకు రాజకీయాలు మారుతున్నందున ఎప్పుడు ఏమైనా జరగవచ్చని, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కొనేందుకు టీడీపీ సిద్ధంగా ఉండాలని నేతలకు సూచించారు.

రాష్ట్రంలోనూ, కేంద్రంలోను ఒకేసారి ఎన్నికలకు వెళితే తప్ప కేంద్రంలో అధికారంలోకి రాలేమన్న అభిప్రాయం ఆ పార్టీ అధినాయకత్వంలో ఉందన్నారు. కాగా ఉదయం 10 గంటలకు ప్రారంభం కావాల్సిన టీడీఎల్పీ సమావేశం గంటన్నర ఆలస్యంగా ప్రారంభమైంది. బుధవారం రాత్రి చంద్రబాబు పాదయాత్ర ముగిసేసరికి అర్ధరాత్రి 1.30 గంటలు కావడం, కాళ్ల నొప్పులు విపరీతంగా ఉండడంతో ఆయన ఈ సమావేశానికి ఆలస్యంగా వచ్చారు. వివిధ జిల్లాలకు చెందిన సుమారు 40 మంది ఎమ్మెల్యేలు హాజరయ్యారు. వివిధ అంశాలపై సుమారు రెండున్నర గంటలపాటు చర్చించారు.

అక్టోబర్‌లో ఎన్నికలు?


పాదయాత్రలో ఉన్న తాను అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యే అవకాశం లేదని... ఎమ్మెల్యేలు మొహమాటం లేకుండా ప్రభుత్వ వైఫల్యాలపై రెచ్చిపోవాలని చంద్రబాబు సూచించారు. విద్యుత్ సమస్యపై అసెంబ్లీలో బ్లాక్ పేపర్ పెట్టాలన్నారు. విద్యుత్, నిత్యావసరాలు, బాబ్లీ, రుణమాఫీలో అవినీతి, ఇతర ప్రజా సమస్యలపై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయాలని కర్తవ్యబోధ చేశారు. బ్రదర్ అనిల్, కొండలరావుల బినామీ వీరభద్రారెడ్డి అనుమానాస్పద మృతిపై విచారణ కోసం పట్టుపడదామని ఎమ్మెల్యేలు తీర్మానించారు. చంద్రబాబు కూడా దీనిని బలపరిచారు.

బ్రదర్ అనిల్ తనపై వచ్చిన ఆరోపణలకు జవాబు ఇవ్వకుండా కథలు చెబుతున్నారని, ఈ విషయాన్ని ప్రజలలోకి తీసుకువెళ్లాలని ఆయన సూచించారు. తెలంగాణపై శాసన సభలో చర్చకు వచ్చినప్పుడు ఇతర పార్టీల ట్రాప్‌లో పడవద్దని ఎమ్మెల్యేలకు సూచించారు. టీఆర్ఎస్ తెలంగాణవాదంతో... కాంగ్రెస్, వైసీపీ సమైక్యాంధ్ర వాదనతో టీడీపీని ఆత్మరక్షణలో పడేయడానికి ప్రయత్నిస్తాయని, దీనిని జాగ్రత్తగా ఎదుర్కోవాలని తెలిపారు. అసెంబ్లీలో జరిగే చర్చలో కాంగ్రెస్ వర్సెస్ టీడీపీ అనే విధంగా ఎమ్మెల్యేలు డామినేట్ చేయాలని చంద్రబాబు సూచించారు.

మీరు రెచ్చిపోండి...

అవిశ్వాసం వాళ్లనే పెట్టనీ...
వారి బలమెంతో తేలిపోతుంది
వైసీపీ పెడితే మనమూ మద్దతు ఇద్దాం!
బేరాల కోసమే మనపై ఒత్తిడి
అసెంబ్లీకి నేను రాకపోవచ్చు
మొహమాటంలేకుండా రెచ్చిపోండి
బీసీ, మహిళకు ఎమ్మెల్సీగా అవకాశం
ఎమ్మెల్యేలకు చంద్రబాబు స్పష్టీకరణ
కృష్ణా జిల్లాలో టీడీఎల్పీ సమావేశం

రాష్ట్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టే విషయాన్ని జగన్ పార్టీకే వదిలేయాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించుకుంది. "ప్రజా సమస్యలపైనే అవిశ్వాసం పెడతాం. అంతేతప్ప... ఎవరో డిమాండ్ చేశారని మనం అవిశ్వాసం పెట్టాల్సిన అవసరంలేదు'' అని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని తమ పార్టీ ఎమ్మెల్యేలకు సూటిగా చెప్పారు. 'వస్తున్నా మీకోసం' పాదయాత్రల్లో ఉన్న చంద్రబాబు... గురువారం కృష్ణా జిల్లా ముదినేపల్లి సమీపంలోని దాకరం వద్ద శాసనసభాపక్ష (టీడీఎల్పీ) సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో అవిశ్వాస తీర్మానంపై సుదీర్ఘమైన చర్చ జరిగింది.

'పిల్ల కాంగ్రెస్' బేరసారాల కోసం టీడీపీ అవిశ్వాసం పెట్టదని చంద్రబాబు తేల్చి చెప్పారు. "వైసీపీ అధికారిక బలం 17 మంది మాత్రమే. మరో 14 మంది జంప్ జిలానీలు వారికి అనుకూలంగా ఉన్నారు. అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్‌లో పాల్గొంటే... ఈ 14 మందిపై అనర్హత వేటు పడుతుంది. పిల్ల కాంగ్రెస్ ఈ విషయాలు చెప్పకుండా... అవిశ్వాస తీర్మానం పెట్టాలంటూ మనపై ఒత్తిడి తెస్తోంది'' అని చంద్రబాబు వివరించారు. సూట్‌కేస్ బేరాల కోసమే మరోసారి అవిశ్వాసం అంటోందని విమర్శించారు. వైసీపీ అవిశ్వాసం ప్రవేశపెడితే దానికి టీడీపీ కూడా మద్దతు ఇస్తుందని వివరించారు. అయితే.. 155 ఎమ్మెల్యేలు ఉన్న కాంగ్రెస్ నుంచి 8 మంది చేజారారని, ఇంకొందరు అటూ ఇటుగా ఉన్నారని చెప్పారు. అయినప్పటికీ ప్రభుత్వం అంత తేలికగా పడిపోదని అభిప్రాయపడ్డారు. వైసీపీ అవిశ్వాసం పెడితే... ఎవరి డ్రామా ఏమిటో తేలిపోతుందన్నారు.

తెలంగాణపై ఇతర పార్టీల ట్రాప్‌లో పడొద్దు

'పక్కన నిలబడితే పాల వాసనొస్తారు..' - నరనరానా టీడీపీ రక్తం ప్రవహిస్తున్న ఓ అరవయ్యేళ్లు పైబడ్డ కార్యకర్త నారా లోకేష్ గురించి వెలువరించిన అభిప్రాయమిది. 25 ఏళ్లనుంచి కుప్పం టీడీపీ రాజకీయాల్లో పండిపోయిన ఆయన తాను నాయకుణ్ణనే చెప్పుకుంటారు కానీ, సాధారణ కార్యకర్తగానే జీవిస్తున్నారు. మరి మూడురోజుల పాటు కుప్పం పర్యటన చేయనున్న లోకేష్, ఆ కార్యకర్త భావిస్తున్నట్టు పాల వాసనొస్తారా, పగ్గాలు తీసుకుని పార్టీని రాబోయే స్థానిక ఎన్నికల్లో విజయపథంలో నడిపిస్తారా అన్న ఉత్కంఠ కుప్పంలో సర్వత్రా నెలకొంది.

ఎప్పుడో 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ముందు ప్రచార సందర్భంగా తండ్రి చంద్రబాబుకు మారుగా లోకేష్ కుప్పంలో పర్యటించారు. మళ్లీ మొన్న ఫిబ్రవరి 22న ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనడానికొచ్చి ఇక్కడి టీడీపీ శ్రేణులపై ఆగ్రహా వేశాలు వ్యక్తం చేసి హడలెత్తించారు. ఆయనప్పట్లోనే ప్రకటించినట్లు ఈనెల 7, 8, 9 తేదీల్లో అటు వి.కోటలోను, ఇటు కుప్పం నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లోనూ పర్యటించనున్నారు. ప్రధానంగా యువతపైనే తన పర్యటన మొత్తాన్ని కేంద్రీకరించారు లోకేష్. ఆ మేరకే పకడ్బందీగా పర్యటన కార్యక్రమాన్ని స్థానిక యంత్రాంగంచేత ఖరారు చేయించారు. మొత్తం ఐదు మండలాల్లో ప్రతిచోటా ఆయన యువతతో సమావేశమవుతున్నా రు. అలాగే మహిళలు, మైనారిటీలనూ మరచి పోలేదు.మధ్యలో ఒకట్రెండు పల్లెలనూ చుట్టబెట్టను న్నారు. ఇంత హఠాత్తుగా కుప్పం పర్యటించాలన్న ఆలోచన లేదా నిర్ణయం లోకేష్ ఎందుకు తీసుకున్నా రో ఇతమిద్దంగా తెలియకపోయినా, స్థానిక టీడీపీ శ్రేణుల్లో ఉత్తేజం నింపాలన్న ఉద్దేశం ఆయన లక్ష్యంలో స్పష్టంగా కనిపిస్తోంది. వైసీపీ ఉనికితో కుప్పంలో కాంగ్రెస్ పూర్తిగా డీలా పడింది. ఆ పార్టీ తరఫునుంచి నాయక శ్రేణిని కానీ, కార్యకర్తల యంత్రాంగాన్ని కానీ ఉత్తేజితం చేసే కార్యక్రమాలేవీ ఉన్నత స్థాయి నాయకత్వం చేపట్టకపోవడం అది మరింత బలహీన పడడానికి దోహదం చేసింది. రెండు దఫాలుగా అధికారంలో లేకపోవడంతో తెలుగుదేశం పార్టీ యంత్రాంగం కూడా ఒకింత నిస్తేజంగానే తయారైంది.ఇతర నియోజకవర్గాలైతే ఇదంతగా పట్టించుకోదగ్గ అంశం కాకపోవచ్చు. అయితే కుప్పం స్వయంగా పార్టీ అధినేత చంద్రబాబు సారథ్యం వహిస్తున్న నియోజకవర్గం. ఏ ఎన్నికల్లోనైనా సరే.. కుప్పంలో ఒకింత మెజారిటీ తగ్గినా వెంటనే చంద్రబాబు నాయకత్వాన్నే ప్రతి పక్షాలు వేలెత్తి చూపుతాయి.అది రాష్ట్రంలో అధికా రంలోకి రావాలనుకుంటున్న అధినేతకు చెరుపు చేసే అంశమవుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో చంద్ర బాబు తన తనయుడైన లోకేష్‌కు కుప్పం నియోజక వర్గ బాధ్యతలు అప్పగించినట్లు కనిపిస్తోంది. అయితే లోకేష్ ఇక్కడి నాయకత్వంతో, కార్యకర్తలతో నెట్టుకు రాగలరా అన్నది ఆలోచించాల్సిన అంశం. మొన్న జరిపిన ప్రైవేటు పర్యటనలో ఆయన నియోజకవర్గ సరిహద్దుల్లో అడుగు పెట్టీపెట్టగానే తనను స్వాగతించబోయిన స్థానిక నాయకులపై విరుచుకు పడ్డారు. ఆయన ఆయన ఆగ్రహం నాయకత్వంపైనా, కార్యకర్తలమీదా అన్నది ఎవరికీ అర్థం కాలేదు. దీంతో సీనియర్ నాయకులనుంచి కిందిస్థాయి కార్యకర్తలు కూడా లోకేష్ వ్యవహార శైలికి నొచ్చుకున్నట్లు కనిపిస్తోంది. ఈ సందర్భంలోనే 'పక్కన నిలబడితే పాల వాసనొస్తార'న్న వ్యాఖ్యానం సగటు కార్య కర్తనుంచి వెలువడింది. చంద్రబాబు పార్టీ అధినేత కాబట్టి ఆయనెంత ఆగ్రహించినా, కసిరి పొమ్మన్నా.. నాయకులు, కార్యకర్తలు అనుకునేందుకేమీ ఉండదు. కానీ, రాకరాక నియోజకవర్గానికి వచ్చిన లోకేష్ నుంచి ఆగ్రహావేశాలు ఎదుర్కోవాల్సి రావడం టీడీపీ శ్రేణుల్లో ఎవ్వరికీ మింగుడు పడడంలేదు. మూడు రోజులపాటు జరుగనున్న పర్యటనలో సైతం లోకేష్ అదేవిధంగా వ్యవహరిస్తే పరిస్థితులు ఎదురు తిరిగే ప్రమాదం ఉన్నదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అలాకాకుండా సౌమ్యంగా, స్పష్టమైన లక్ష్యంతో దిశానిర్దేశం చేస్తేనే లోకేష్ పర్యటనకు అర్థం, పరమార్థం ఏర్పడుతుందని, అప్పుడే స్థానిక ఎన్నికల లక్ష్య ఛేదన సాధ్యమవుతుందని విశ్లేషిస్తున్నారు.

పాల వాసనొస్తారా.. పగ్గాలు తీసుకుంటారా?

శాంతిపురం: పార్టీని బలోపేతం చేయటం కార్యకర్తల చేతుల్లోనే ఉందని టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాసులు, సీడీసీఎంఎస్ ఛైర్మెన్ శ్యామరాజ్ అన్నారు. బుధవారం స్థానిక లక్ష్మీనారాయణ కళ్యాణ మండపంలో టీడీపీ మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సింగిల్ విండో, సీడీసీఎంఎస్ ఛైర్మెన్ శ్యామరాజ్‌ను మండల టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా దుశ్యాలువలతో సన్మానిం చారు. ఆయనతోపాటు సింగిల్ విండో డైరెక్టర్లను సన్మానించారు. అనంతరం వారు మాట్లాడుతూ సింగిల్ విండో ఎన్నికల్లో కృషి చేసిన వారికి పేరుపేరున కృతజ్ఞతలు తెలిపారు.

టీడీపీ నాయకుల ప్రోత్సాహంతో, కార్యకర్తల అండదండలతో ప్రభుత్వాన్ని, అధికారులను నిలదీసి రైతులు, ప్రజల అభివృద్ధికి పాటు పడుతానని శ్యామరాజ్ పేర్కొన్నారు. స్థానిక ఎన్నికల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ సర్పంచ్ స్థానాలను గెలిపించి చంద్రబాబుకు కానుకుగా అందించాలని అన్నారు. జి.శ్రీనివాసులు మాట్లాడుతూ చంద్రబాబు రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్‌గా మార్చాలని ఎన్నో విధాలుగా కృషి చేస్తున్న క్రమంలో అధికారం పోవడంతో అది కలగానే మిగిలిందన్నారు. అధికారం చేపట్టిన కాంగ్రెస్ స్వర్ణాంధ్రప్రదేశ్‌ను అవినీతి ఆంధ్రప్రదేశ్‌గా మార్చేసిందన్నారు. టీడీపీ నుంచి వైసీపీకి వలసలు వెళ్లిన ఎమ్మెల్యేలు, నాయకులు ఎందుకీపార్టీలోకి వచ్చామా అని మదన పడుతున్నారని, వారందరూ తిరిగి టీడీపీలో చేరేందుకు సన్నాహాలు చేస్తున్నారని ఆయన అన్నారు. సింగిల్ విండో ఎన్నికల్లో ఎలా కష్టపడి గెలిపించుకున్నామో స్థానిక ఎన్నికల్లో కూడా అదే విధంగా కష్టపడి గెలిపించుకోవాలన్నారు. కొంతమంది లేనిపోని మాటలు చెప్పి అపోహాలు సృష్టిస్తున్నారని వాటిని ఎవరు నమ్మరాదన్నారు. కార్యకర్తలు, నాయకులు 7, 8, 9వ తేదీల్లో జరగనున్న లోకేష్ పర్యటనను విజయవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మనోహర్, మునిరత్నం, చలపతి, నందిగం ఉదయ్‌కుమార్, నాగరాజు, దేవరాజులనాయుడు, మునిరత్నం, విశ్వనాథనాయుడు, జయరామిరెడ్డి, వెంకటమునిరెడ్డి, లోకీ, రమేష్, త్యాగరాజ్ తదితరులు పాల్గొన్నారు.

కార్యకర్తల చేతుల్లోనే టీడీపీ భవిష్యత్తు


నియోజకవర్గంలో ఎంతమంది నాయకులున్నా ఎమ్మెల్యే టికెట్ ఒక్కరికే వస్తుంది...అయితే ఆ ఒక్క ఎమ్మెల్యే పదవే కాదు ఇంకా చాలా పదవులున్నాయి.. టికెట్ ఎవరికి వచ్చినా అందరు కలసికట్టుగా పనిచేసి పార్టీని గెలిపించండి..కష్టపడి పనిచేసే వారికే సముచితస్థానం ఉంటుంది అని టీడీపీ జిల్లా అధ్యక్షుడు జంగాలపల్లె శ్రీనివాసులు పార్టీ శ్రేణులకు హితబోధ చేశారు. మదనపల్లెలోని ఆర్అండ్‌బీ అతిథి గృహం లో మంగళవారం మదనపల్లె, తంబళ్లపల్లె, పీలేరు నియోజకవర్గ నాయకులతో సమన్వయకమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీడీపీ లో నాయకులు ఎక్కువమంది అవుతుండడంతో క్రమక్రమంగా కార్యకర్తలను పట్టించుకునేవారు తగ్గిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ పరిస్థితి నుంచి బయటపడి పార్టీ కి పూర్వవైభవం తీసుకొచ్చేందుకు నాయకులందరూ కృషిచేయాలని పిలుపునిచ్చారు. చంద్రబాబు పడుతున్న కష్టంలో పదో వంతు మనమంతా కష్టపడ్డా 2014లో టీడీపీ అధికారంలోకి రావడం తథ్యమన్నారు. ఇటీవల జరిగిన సహకార ఎన్నికల్లో టీడీపీ గెలిచే స్థానాల్లో కూడా ఓటమి పాలుకావడం బా ధాకరమన్నారు. దీనిపై మండల స్థాయి లో సమావేశాలు నిర్వహించి ఓటమికి గల కారణాలను విశ్లేషించుకోవాలన్నారు. రాను న్న స్థానిక, మున్సిపల్ ఎన్నికలకు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలన్నారు. గ్రామస్థాయి నుం చి పార్టీని బలోపేతం చేసేలా కమిటీలు ఏ ర్పాటు చేయాలన్నారు. మున్సిపాలిటీలో వార్డుకు 15మందితో అన్ని వర్గాలకు ప్రాధాన్యం ఇచ్చేలా కమిటీలు ఏర్పాటు చేయాలన్నారు. గ్రామ, మండల, నియోజకవర్గస్థాయిలో ప్రణాళికలు సిద్ధం చేసి ఈనెల 9న చిత్తూరులో జరిగే సమావేశంలో అందజేయాలన్నారు. ఈనెల 11 నుంచి ప్రతి నియోజకవర్గంలో పల్లెపల్లెకు తెలుగుదేశం కార్యక్రమం చేపట్టాలని నాయకులకు సూచించారు.ప్రజల సంక్షేమం కోసం చంద్రబాబు ప్రకటించిన రైతులకు వడ్డీమాఫీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, చేనేత కార్మికుల సంక్షేమం కోసం డిక్లరేషన్‌లతో పాటు కాంగ్రెస్ ప్రభు త్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానా లను ప్రజలకు వివరించాలన్నారు.

మూడునెలల క్రితం వరకు వైసీపీ హవా ఉందని అం దరూ భావించారని, అయితే సహకార ఎన్నికల తర్వాత ఆ పార్టీ పరిస్థితి మూడోస్థానానికే పరిమితం కావడం, కాంగ్రెస్ పాలనపై ప్రజలు విసుగుచెంది వున్న ప్రస్తుత పరిస్థితుల్లో వచ్చే ఎన్నికల్లో టీడీపీకే మెరుగైన అవకాశాలు ఉన్నాయన్నారు.జిల్లా నాయకుల ముందు నియోజకవర్గ పరిస్థితులపై వివిరిస్తున్న సమయంలో మిట్స్‌కృష్ణకుమార్, రాటకొండ మధుబాబు వాగ్వాదానికి దిగడంతో కొంతసేపు గందరగోళం నెలకొంది. టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి గౌనివారి శ్రీనివాసులు, నాయకులు గంగారపురాందాస్‌చౌదరి, కొడవలి శివప్రసాద్, రాటకొండబాబురెడ్డి, నాదేళ్లవిద్యాసాగర్, ఎస్.ఎ.మస్తాన్, రాటకొండగుర్రప్ప నాయుడు, పోతుల విజయ్‌కుమార్, దొరస్వామి నాయుడు, వల్లిగట్ల రెడ్డెప్ప, రాటకొండ శోభన్, నీలకంఠ, కామకోటి ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు.

కష్టపడి పని చేసేవారిదే భవిష్యత్తు


బైరెడ్డిపల్లె : రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీ గెలుపునకు కార్యకర్తలు కృషి చేసి సత్తాచాటాలని మాజీ మంత్రి పట్నం సుబ్బ య్య పిలుపునిచ్చారు. బైరెడ్డిపల్లెలో రంగయ్య శెట్టి కల్యాణ మండపంలో మంగళవారం మాజీ ఎంపిీపీ, మం డల టీడీపీ అధ్యక్షులు శ్రీనివాసులు రెడ్డి అధ్యక్షతన కార్యకర్తల సమావేశం జరిగింది.

ఈ సమావేశానికి ముఖ్య అతిధిగా హాజరైన మాజీ మంత్రి పట్నం సుబ్బయ్య మాట్లాడుతూ అవినీతి ఊబిలో కూరుకుపోయి ప్రజా సమస్యలను పట్టించుకొని కాంగ్రెస్ ప్రభుత్వానికి త్వరలో ప్రజలే తగిన బుద్ధిచెబుతారన్నారు. రాష్ట్రంలో విద్యుత్ సమస్యతో రైతులు తల్లడిల్లుతున్నా ప్రభుత్వం నిద్రావస్థలో వుందని విమర్శించారు. వచ్చే ఎ న్నికల్లో టీడీపీ ప్రభంజనంలో కాంగ్రె స్ గల్లంతుకావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. మాజీ ఎంపిీపీ శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ పార్టీకి మూలస్తంభాలుగా వున్న కార్యకర్తలు ఇప్పటినుంచే సైనికుల్లా పనిచేసి పార్టీ విజయానికి కృషి చేయాలన్నారు. రేపటిరోజు వి.కోట మండలంలో జరిగే నారా లోకేష్ పర్యటనకు విజయవంతం చేయాలని కోరారు. కాగా ఈ సారి శాసన సభ ఎన్నికల్లో పలమనేరు ఎమ్మెల్యే టికెట్ పార్టీలో సీనియర్ నాయకుడైన శ్రీనివాసులు రెడ్డికి కేటాయించాలని కార్యకర్తలు తమ అభిప్రాయం వ్యక్తం చేశారు.

గత 25సం,గా వివిధ పదవుల్లో కొనసాగి జాతీయ అవార్డు పొందిన మాజీ ఎంపిపి శ్రీనివాసులు రెడ్డికి అధిష్టానం తగిన ప్రాధాన్యత కల్పించాలని వారు కోరారు. సమావేశానికి అధిక సంఖ్యలో కార్యకర్తలు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు శ్రీనివాసులు రెడ్డి, వెంకటప్ప గౌడు, అమరనాధరెడ్డి, నాగభూషణం, వెంకట్రమణగౌడు, ఓబుల్‌రెడ్డి, సుబ్రమణ్యం శెట్టి, క్రిష్ణారెడ్డి, నాగరాజు, సుబ్రమణ్యంరెడ్డి, షౌకత్, తదితరులు పాల్గొన్నారు.

స్థానిక ఎన్నకల్లో సత్తా చాటుతాం

అసెంబ్లీలో చాకచక్యంగా వ్యవహరించాలి
వచ్చే ఎన్నికల్లో టీడీపీ-కాంగ్రెస్ మధ్యే పోటీ

త్వరలో ప్రారంభం కానున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో చాకచక్యంగా వ్యవహరించాలని, ప్రతి నిముషాన్ని సద్వినియోగం చేసుకోవాలని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఆ పార్టీ నేతలకు సూచించారు. ఎన్నికలు ఎప్పుడైనా జరిగే అవకాశాలు ఉన్న నేపథ్యంలో మొహమాటం లేకుండా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయాలని ఆయన చెప్పారు.

'వస్తున్నా..మీకోసం' పాదయాత్ర కృష్ణా జిల్లాలో నిర్వహిస్తున్న చంద్రబాబు నాయుడు గురువారం ఉదయం ముదినేపల్లి మండలం, దాకారంలో ఆపార్టీ ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు. ఈ సమావేశానికి అందుబాటులో ఉన్న 50 మంది ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహాలపై పలు సూచనలు చేశారు. ప్రభుత్వం ట్రాప్‌లో పడకుండా అసెంబ్లీలో చాకచక్యంగా వ్యవహరించాలన్నారు ఈ ఏడాది ఎన్నికల ఏడాది కాబట్టి అసెంబ్లీలో మనదే పైచేయి కావాలని బాబు ఎమ్మెల్యేలకు సూచించారు.

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి బావ బ్రదర్ అనిల్ కుమార్, విద్యుత్ సమస్యలు, బాంబు పేలుళ్ల సమస్యలపై ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని చంద్రబాబు నేతలకు సూచించారు. వచ్చే ఎన్నికల్లో టిడిపి, కాంగ్రెసు మధ్యే పోటీ ఉంటుందని చెప్పారు. వీరభద్రా రెడ్డి మరణంపై విచారణ జరిపించాలని డిమాండ్ చేయాలని బాబు సూచించారు. అనిల్ కుమార్ ఏ భార్యపై ప్రమాణం చేస్తారో డిమాండ్ చేయాలని, కొందరు ఎమ్మెల్యేల తీరు తాళి కట్టేది ఒకరితో కాపురం మరొకరితో అన్నట్లుగా ఉందని, వారికి ప్రజలు గుణపాఠం చెబుతారని, వారు ప్రజలచే తిరస్కరించబడతారని చంద్రబాబు అన్నారు.

రాష్ట్రపతి ఎన్నికల్లో జగన్ పార్టీ కాంగ్రెసుకు మద్దతు పలికిందని చంద్రబాబు నాయుడు ఈ సందర్భంగా గుర్తుచేశారు. అవిశ్వాసం పెడితే వారు ప్రభుత్వాన్ని కూల్చుతారనే నమ్మకం లేదని, ఆ పార్టీయే అవిశ్వాసం పెడితే డ్రామాలు ఎవరివో తెలుస్తాయన్నారు. ఈ సమావేశం రెండున్నర గంటల పాటు సాగింది. శాసనమండలిలో, శాసనసభలో అనుసరించాల్సిన వ్యూహంపై బాబు వారికి దిశానిర్దేశనం చేశారు.

వీరభద్రారెడ్డి మరణంపై విచారణ జరపాలి : చంద్రబాబు

రాష్ట్రంలో శాంతి భద్రతలు కొరవడ్డాయి
కాంగ్రెస్ హయాంలో పెరిగిన ధరలు

  రాష్ట్రంలో శాంతి భద్రతలు కొరవడ్డాయని, ప్రజలకు భద్రతపై కూడా భరోసా లేకుండా పోయిందని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు తనయుడు లోకేష్‌నాయుడు విమర్శించారు. వీధికో బెల్టు షాపు పెట్టి ప్రజల ఆరోగ్యంతో ఆడుకుంటున్నారని ఆయన ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. విద్యుత్ చార్జీలు పెంచి కరెంట్ ఇవ్వడం లేదని లోకేష్ నాయుడు మండిపడ్డారు.

నారా లోకేష్ నాయుడు గురువారం చిత్తూరు జిల్లా కుప్పంలో పర్యటించారు. ఇక్కడ ఆయన మూడు రోజుల పాటు పర్యటించనున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఒకప్పుడు పరిశ్రమలు పెట్టేందుకు రాష్ట్రానికి క్యూ కట్టిన పారిశ్రామిక వేత్తలు, ప్రస్తుతం బాబోయ్ అంటూ వెనక్కి వెళుతున్నారన్నారు. కాంగ్రెసు హయాంలో ఛార్జీలు విపరీతంగా పెరిగాయని విమర్శించారు. శాంతిభద్రతలు పూర్తిగా కొరవడ్డాయన్నారు.

బడుగు, బలహీన వర్గాలకు తెలుగుదేశం పార్టీ మొదటి నుండి అండగా ఉందని లోకేష్‌నాయుడు అన్నారు. విద్యా, ఉపాధి అవకాశాలు కల్పించడమే అసలైన ఉపాధి అన్నారు. అభివృద్ధి అంటే ఏమిటో తెలుగుదేశం పార్టీ హయాంలో చేసి చూపించామన్నారు. వచ్చే ఎన్నికల్లో టిడిపి అధికారంలోకి వస్తే రూ.150 కోట్లతో కుప్పంను అభివృద్ధి చేస్తామని లోకేష్ నాయుడు చెప్పారు. పేదల కోసం తపించే నేతకు అధికారం ఇవ్వాలని తన తండ్రి చంద్రబాబు నాయుడును ఉద్దేశించి అన్నారు.

టీడీపీ హయాంలోనే అభివృద్ధి : లోకేష్ నాయుడు

'మన పార్టీ నాయకుడు పాదయాత్ర మా ఊరి మీదుగా వెళ్లేలా చూడండి. చిన్న చిన్న మార్పులేమైనా ఉంటే చేయండి. మాకూ ఓ అవకాశం ఇవ్వండి. బాబు మా ఊళ్ల వైపు నడిస్తే పార్టీ మరింత పట్టు వస్తుంది. ఆయనను ఒప్పించి అయినా సరే ఇది జరగాల్సిందే' ఇదీ టీడీపీ నేతల్లో కొందరు పట్టుదల. తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు పాదయాత్ర ఈ నెల 9న జిల్లాలో ప్రవేశించబోతోంది. దీనికి సంబంధిం చి గడిచిన వారం రోజులుగా పార్టీ జి ల్లా నేతలు తీవ్రస్థాయిలో కసరత్తులు కొనసాగిస్తున్నారు. పార్టీ ముఖ్యులం తా రూట్‌మ్యాప్ ఖరారులో తలమునకలయ్యారు. ఒక దఫా 200 కిలోమీటర్ల మేర పాదయాత్ర సాగేలా ఒక రూట్‌మ్యాప్‌ను ర్రాష్ట పార్టీకి సమర్పించారు.

అయితే దీనిని కుదించాల్సిందేనని, ప్రస్తుతం పార్టీ అధినేత ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యాను, సమయాన్ని దృష్టిలో పెట్టుకుని దీనిని కుదించాలని జిల్లా కమిటీకి తిరుగు టపా పంపించారు. దీంతో రూట్‌మ్యాప్‌ను స్వయం గా చంద్రబాబు దృష్టికి కూడా తీసుకువెళ్లారు. ఈ నేప«థ్యంలో పాదయాత్ర జిల్లాలో పది రోజుల వరకే కుదించాల ని చంద్రబాబే స్వయంగా సూచించా రు కూడా. దీనిపై చర్చించేందుకు పార్టీ సీనియర్లు డాక్టర్ కోడేల శివప్రసాదరావు, మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు, మాగంటి బాబు, పార్టీ జిల్లా అధ్యక్షురాలు సీతారామలక్ష్మితో పాటు మిగతా ముఖ్యులు సోమవారం ఏలూరులో ప్రత్యేకంగా సమావేశమయ్యా రు.

పాదయాత్ర ఏర్పాట్లు, నేతల సమన్వయం, తదితర అంశాలు ఈ సందర్భంగా చర్చకు కూడా వచ్చాయి. అయితే పార్టీలో నియోజకవర్గాలకు చెందిన ముఖ్యులు కొందరు మాత్రం బాబు పాదయాత్ర తమ గ్రామాల మీ దుగా సాగేలా చూడాల్సిందిగా పదే పదే విజ్ఞప్తి చేశారు. సమయం తక్కువగా ఉన్నప్పటికీ ఆయన పాదయాత్ర ఎక్కువ సమయం గ్రామీణ ప్రాంతాల్లోనే సాగేలా రూట్‌మ్యాప్ ఉండాలని మరికొందరు సూచించారు. ప్రధాన రహదారుల మీదుగా కాకుండా కీలకమైన గ్రామాల మీదుగానే బాబు పాదయాత్ర కొనసాగేలా చూడటం ద్వారా పార్టీలో మరికాస్త గట్టి ఊపునకు పునా ది వేయాలని కూడా ఇంకొందరు సల హా ఇచ్చారు. అయితే ప్రస్తుతం చంద్రబాబు పది రోజుల పాటు మా త్రమే జిల్లాలో పర్యటించేలా రూట్‌మ్యాప్‌కు తుది రూపునిస్తున్నారు. పదకొండు మండలాలు, పది రోజులు, 120 కిలోమీటర్లు, ఈ మూడింటినీ క్రోడీకరించి రూట్‌మ్యాప్‌ను దాదాపు ఒక కొలిక్కితెచ్చినట్లు సమాచారం. దీ నికి ఇంకా ర్రాష్ట పార్టీ ఆమోదముద్ర వేయాల్సి ఉంది. రోజుకు పది నుంచి 12 కిలోమీటర్ల చొప్పున మధ్యాహ్నం నుంచి రాత్రి 11 గంటల వరకు పాదయాత్ర కొనసాగేలా కూడా యాత్ర ఏర్పాట్లకు నాయకులు ఒక నిర్ణయానికి వచ్చారు.

మా ఊరికి రావాలి

నిజామాబాద్: బాబ్లీ ప్రాజెక్ట్‌పై ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో సోమవారం నిజామాబాద్ జిల్లాలో పెద్దఎత్తున ఆందోళనా కార్యక్రమాలను నిర్వహించారు. బాబ్లీ ప్రాజెక్ట్‌పై సుప్రీం కోర్టులో రాష్ట్ర ప్రభుత్వం సరైన వాదనలను వినిపించలేదని, బాబ్లీ మూలంగా తెలంగాణ ఎడారిగా మారుతుందని ఆరోపిస్తూ జిల్లా వ్యాప్తంగా ఆందోళనలను చేపట్టారు. డిచ్‌పల్లి, సిరికొండ, ధర్పల్లిలో టీడీపీ నేతలు పెద్ద ఎత్తున రాస్తారోకో నిర్వహించారు. ఆర్మూర్ కెనాల్ బ్రిడ్జిపై టీడీపీ కార్యకర్తలు రాస్తారోకో చేయడంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. వేల్పూర్, కమ్మర్‌పల్లిలో 63వ జాతీయరహదారిపై, నందిపేట్ మండల కేంద్రంలో రాస్తారోకో చేశారు.

జక్రాన్‌పల్లిలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి వినతిపత్రం సమర్పించగా, బాబ్లీపై రివ్యూ పిటీషన్ వేయాలని బాల్కొండలో తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. బోధన్ డివిజన్ పరిధిలోని రెంజల్, నవీపేట్, వర్ని మండలాల్లోబాబ్లీ ప్రాజెక్టుకు సంబంధించిన ఆందోళనలు కొనసాగాయి. రెంజల్‌లో టీడీపీ నాయకులు బాబ్లీ ప్రాజెక్టును కూల్చివేయాలని రాస్తారోకో నిర్వహించగా, నవీపేట్, వర్నిలో రాస్తారోకో చేశారు. బాన్సువాడ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో, జుక్కల్‌లో రాస్తారోకో చేయగా, కామారెడ్డిలోని నిజాంసాగర్ చౌరస్తాలో, మాచారెడ్డి చౌరస్తాలో టీడీపీ నేతలు రాస్తారోకో చేశారు. రాస్తారోకో మూలంగా రోడ్లకిరువైపులా వాహనాలు నిలిచిపోవడంతో ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు.

బాబ్లీపై టీడీపీ ఆందోళన


మహబూబ్‌నగర్ జిల్లాలో తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు బక్కని నర్సింహులు పిలుపునిచ్చారు. కార్యకర్తలు ప్రజల్లోకి వెళ్లిప్రజాసమస్యల సరిష్కారానికి తమ వంతు కృషి చేయాలని సూచించారు. నూతనంగా జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన రాజేశ్వర్‌గౌడ్‌ను మంగళవారం జిల్లా కేంద్రంలోని గాయత్రి ఫంక్షన్ హాల్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ బలోపేతం కావాలంటే యువతను ఆకర్షించాలని సూచించారు.

స్థానిక సంస్థల ఎన్నికలపై పార్టీ అభ్యర్థుల గెలుపునకు కృషి చేయాలని పేర్కొన్నారు. గ్రూప్ రాజకీయాలు వీడి తెలుగుదేశం పార్టీని 2014లో అధికారంలోకి తీసుకువచ్చేలా కలసి పనిచేయాలని కోరారు. కార్యక్రమంలో మాజీ మంత్రి పి.చంద్రశేఖర్, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్‌గౌడ్,నాయకులు ఆంజనేయులు, జయశ్రీ, ఎన్‌పీ. వేంకటేష్, నాగేశ్వర్‌రెడ్డి,శంకర్, చంద్రశేఖర్‌రెడ్డి, జ్యోతి , వనజ, లక్ష్మీ, ఆనంద్‌గౌడ్, వెంకటేష్‌గౌడ్ తదితరు లు పాల్గొన్నారు.

పార్టీ బలోపేతానికి కృషి చేయండి

హైదరాబాద్, మార్చి 6 : ఇంజనీరింగ్ కళాశాలల్లో అర్హత లేని సిబ్బందిని నియమిస్తున్నారని, ఈ అంశంపై ఎఎఫ్ఆర్‌సీ దృష్టి సారించాలని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నన్నూరి నర్సిరెడ్డి సూచించారు. బుధవారం ఆయన ఇక్కడ ఒక ప్రకటన చేస్తూ.. తనిఖీలు చేసే ఎఎఫ్ఆర్‌సీకి చూపించే సిబ్బందిని యాజమాన్యాలు కాలేజీల్లో తర్వాత కొనసాగించడం లేదని ఆరోపించారు.

ఇంజనీరింగ్ కాలేజీల్లో అర్హత లేని సిబ్బంది: టీడీపీ


హైదరాబాద్ నగరంలో తెలుగు తమ్ముళ్ల కీచులాటలు ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఆగ్రహం తెప్పించాయి. పార్టీ అంతర్గత వ్యవహారాలపై బహిరంగ విమర్శలకు దిగితే ఊరుకొనేది లేదని ఆయన వారిని హెచ్చరించారు. హైదరాబాద్ నగర టీడీపీ కమి టీ నియామక వ్యవహారం ఆ పార్టీలో చిచ్చు రేపింది. పార్టీ నగర అధ్యక్షుడు తలసాని శ్రీనివాస యాదవ్ నియోజకవర్గ ఇన్‌ఛార్జుల అభిప్రాయాలతో నిమి త్తం లేకుండా ఏకపక్షంగా తనకు నచ్చి న వారితో కమిటీ వేసి దానిని ప్రకటించారని కొందరు నగర నేతలు పార్టీ అధినేతకు ఫిర్యాదు చేశారు. అందరినీ అడిగే వేశానని తలసాని చెబుతున్నా రు. ఈ నియామకాలను నిరసిస్తూ తలసాని వ్యతిరేక వర్గీయులు బహిరం గ ప్రకటనలు చేశారు. వారికి వ్యతిరేకంగా తలసాని వర్గీయులూ ప్రకటనలు చేశారు.

కొన్నిచోట్ల ఈ రెండు వర్గాల నేతలు పరస్పరం తలపడ్డారు. ఈ మొత్తం వ్యవహారం అంతా చంద్రబాబు వద్దకు చేరింది. 'ఎవరికి ఏ అభిప్రాయం ఉన్నా దానిని పార్టీ నేతల దృష్టికి తీసుకురండి. వారితో చర్చించండి. కాని బహిరంగ విమర్శలకు దిగితే ఊరుకొనేది లేదని హెచ్చరించినట్టు సమాచారం. ఇరు వర్గాల వారితో మాట్లాడి సమస్య ఏమిటో తెలుసుకొని తనకు చెప్పాలని ఆయన హైదరాబాద్ నగర ఇన్‌ఛార్జి మోత్కుపల్లి నర్సింహులుకు సూచించారు.

టీడీపీ నగర నేతలపై బాబు ఆగ్రహం

: రానున్న ఎన్నికల తర్వాత చంద్రబాబు అధికారంలోకి వస్తాడన్న విశ్వాసం తనకుందని సినీనటి, టీడీపీ నేత కవిత అన్నారు. అలా జరగని పక్షంలో తాను రాష్ట్రం విడిచి వెళ్లిపోతానని, రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకొంటానని ఆమె ప్రతినబూనారు. చంద్రబాబును గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు.

బాబు అధికారంలోకి రాకుంటే ఇక్కడ ఉండను: కవిత

  ఇంజనీరింగ్ కళాశాలల్లో అర్హత లేని సిబ్బందిని నియమిస్తున్నారని, ఈ అంశంపై ఎఎఫ్ఆర్‌సీ దృష్టి సారించాలని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నన్నూరి నర్సిరెడ్డి సూచించారు. బుధవారం ఆయన ఇక్కడ ఒక ప్రకటన చేస్తూ.. తనిఖీలు చేసే ఎఎఫ్ఆర్‌సీకి చూపించే సిబ్బందిని యాజమాన్యాలు కాలేజీల్లో తర్వాత కొనసాగించడం లేదని ఆరోపించారు.

ఇంజనీరింగ్ కాలేజీల్లో అర్హత లేని సిబ్బంది: టీడీపీ

రైతు రుణాల మాఫీలో చోటు చేసుకొన్న అవకతవకలపై సిీబీఐ విచారణ జరిపించాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేసింది. రైతు రుణాల మాఫీలోనూ కుంభకోణాలు చోటు చేసుకోవడం సిగ్గుచేటని విమర్శించింది. బుధవారం టీడీఎల్పీ కార్యాలయంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు మండవ వెంకటేశ్వరరావు, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి విలేకరులతో మాట్లాడారు.

అర్హులైన రైతులకు రుణ మాఫీ వర్తించలేదని, ఆ పేరుతో అనర్హులు లబ్ధి పొందారని తాము గతం నుంచీ చెబుతున్నా ప్రభుత్వం పట్టించుకోలేదని వారు ఆరోపించారు. తమ ఆరోపణలు నిజమేనని ఇప్పుడు కాగ్ నిర్ధారించిందని పేర్కొన్నారు. ఏ కుంభకోణం బయట పడినా అందులో నిజం లేదని కాంగ్రెస్ వెంటనే బుకాయింపులు మొదలు పెడుతోందని, తర్వా త దానిని ఇతరులపైకి తోసేయడానికి మార్గాలు వెతుకుతోందని బొజ్జల ఆరోపించారు.

రుణ మాఫీ'పై సీబీఐ విచారణ: టీడీపీ

టీడీపీలో 'ఎమ్మెల్సీ' వేడి!
చంద్రబాబును కలిసి విజ్ఞప్తులు
9న పార్టీ పొలిట్ బ్యూరోలో నిర్ణయం!

ఎమ్మెల్సీ ఎన్నికలకు అభ్యర్థుల ఖరారు గడువు సమీపిస్తున్న కొద్దీ టీడీపీలో ఆశావహుల ప్రయత్నాలు వేడి పెంచుతున్నాయి. పార్టీ గెలుచుకోవడానికి అవకాశమున్న మూడు సీట్ల కోసం ఇప్పటికే సుమారు వంద మంది నేతలు చంద్రబాబును కలిసి విజ్ఞప్తి చేశారు. దీంతో అభ్యర్థుల ఎంపిక చంద్రబాబుకు కూడా క్లిష్టంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. మూడు నాలుగు రోజుల్లో అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉండగా.. చంద్రబాబుకు ఇంకా వినతులు అందుతూనే ఉన్నాయి.

గుంటూరుజిల్లాకు చెందిన పార్టీ రాష్ట్ర కార్యదర్శి చందు సాంబశివరావు తాజాగా ఎమ్మెల్సీ పదవి కోసం చంద్రబాబుకు వినతిపత్రం పంపారు. కాపు సామాజిక వర్గం నుంచి తనకు అవకాశం ఇవ్వడం పార్టీకి ఉపకరిస్తుందని.. ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు పార్టీని వీడినందున తన ఎంపిక ఆ లోటును భర్తీ చేస్తుందని ఆయన చెప్పారు. మండలిలో ప్రతిపక్ష నేత దాడి వీరభద్రరావుకు మళ్లీ అవకాశం వస్తుందా లేదా అన్నదానిపైనే కోస్తా నుంచి ఇతరుల పేర్ల పరిశీలన ఆధారపడి ఉంది. ఆయనను ఎంపీగా నిలపాలని చంద్రబాబు భావిస్తే మళ్లీ ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వకపోవచ్చునని అంటున్నారు.

దాడి మాత్రం ఎమ్మెల్సీగా కొనసాగింపునే కోరుకొంటున్నారు. ఆయన కాని పక్షంలో ఆ ప్రాంతం నుంచి టీడీ జనార్దనరావు, పంచుమర్తి అనురాధ, ప్రతిభా భారతి పేర్లు పరిశీలనలోకి వచ్చే అవకాశం ఉంది. ఈసారి ఒక మహిళా నేతకు అవకాశం ఇవ్వాలని అనుకొంటే మిగిలిన సమీకరణాలతో సంబంధం లేకుండా అనురాధ, ప్రతిభా భారతి పేర్లు పరిశీలనకు వచ్చే అవకాశం ఉంది. ఉత్తరాంధ్ర నుంచి దాడి ఎంపిక జరిగితే ప్రతిభాభారతి పేరు వెనక్కు వెళ్లిపోవచ్చునని పార్టీ వర్గాలు అంటున్నాయి. అయితే.. తెలంగాణ నుంచి ఎవరికి అవకాశం వస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.

మైనారిటీలకు అవకాశం ఇవ్వదలిస్తే వక్ఫ్‌బోర్డు మాజీ అధ్యక్షుడు సలీం.. రెడ్డి సామాజిక వర్గానికి అవకాశం ఇస్తే మహబూబాబాద్ మాజీ ఎమ్మెల్యే వేం నరేంద్రరెడ్డికి చాన్స్ రావడం ఖాయమని అంటున్నారు. మరోవైపు పద్నాలుగేళ్లుగా పార్టీ మీడియా విభాగానికి అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న ఎల్‌వీఎస్ఆర్‌కే ప్రసాద్ కూడా గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. హైదరాబాద్ నగర నేత కొమ్మినేని వికాస్ ఇటీవల చంద్రబాబును కలిసి ఈ సారైనా తనకు అవకాశమివ్వాలని కోరారు. కానీ, ఈసారి ఇవ్వలేని పరిస్థితులు ఉన్నాయని చంద్రబాబు ఆయనతో అన్నట్లు సమాచారం. ఇక రాయలసీమ నుంచి బీసీ నేత కాల్వ శ్రీనివాసులు, ఎస్సీ వర్గాలకు చెందిన మహిళ శమంతక మణి కూడా రేసులో ఉన్నారు.

ఈ నెల 9న జరిగే పార్టీ పొలిట్‌బ్యూరో సమావేశంలో దీనిపై చర్చ జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. నిర్ణయం నామినేషన్ల తుది గడువు రోజు వెలువడవచ్చని అంటున్నారు. కాగా.. ఎమ్మెల్సీ సీటుపై సీపీఐ దృష్టిపెట్టింది. ప్రస్తుతం మండలిలో పార్టీ నేత జల్లి విల్సన్ రిటైర్ అవుతున్న సంగతి తెలిసిందే. ఆ స్థానానికి తిరిగి తమ పార్టీ అభ్యర్థినే బలపరచాలని టీడీపీని కోరే యోచనలో సీపీఐ ఉంది. మరోవైపు.. సీపీఐకి సభలో తగినంత బలం లేకున్నా ఆ పార్టీకి చెందిన పీజే చంద్రశేఖర్ ఎమ్మెల్సీగా ఎన్నిక కావడానికి గతంలో టీడీపీ సహకారం అందించింది. మళ్లీ మరో స్థానం కోరడం ఎంతవరకు సరైనదన్న చర్చ కూడా నడుస్తోంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏ విధానాన్ని అనుసరించాలన్న దానిపై ఈ నెల 8 నుంచి జరిగే పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో సీపీఐ ఒక నిర్ణయానికి రానుంది.

మూడు సీట్లకు వంద దరఖాస్తులు..

కృష్ణా జిల్లా ముదినేపల్లి మండలం దాకారంలో టీడీపీఎల్పీ సమావేశం గురువారం మధ్యాహ్నం ప్రారంభమైంది. అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై సమావేశంలో చర్చించనున్నట్లు తెలుస్తోంది.

టీడీపీఎల్పీ సమావేశం ప్రారంభం

టీడీపీ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు తనయుడు నారా లోకేష్ నేడు(గురువారం) కుప్పంలో పర్యటించనున్నారు. నేటి ఉంచి మూడు రోజుల పాటు పర్యటన జరుగనుంది. లోకేష్ పర్యటనపై పార్టీ కార్యాలయం తొలిసారిగా అధికారిక ప్రకటన చేసింది.

కుప్పంలో నారా లోకేష్ పర్యటన

పక్కా ఇళ్ళ నిర్మాణం అటకెక్కింది... పింఛన్లు ఇవ్వకుండా వంచిస్తున్నారు... సంక్షేమ పథకాలు పేదలకు చేరడం లేదు... టీడీపీ హయాంలో ప్రజల వద్దకు పాలన వస్తే ఇప్పుడు అధికారుల వద్దకు వెళ్ళినా వారు అందుబాటులో ఉండటం లేదంటూ పాదయాత్రలో మహిళలు గ్రామగ్రామాన తమ గోడు వెళ్ళబోసుకున్నారు.

ముదినేపల్లి: వస్తున్నా మీకోసం పాదయాత్రలో భాగంగా బుధవారం రాత్రి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ముదినేపల్లి మండలంలో నిర్వహించిన పాదయాత్రలో ప్రజలు అడుగడుగునా తాము ఎదుర్కొంటున్న సమస్యలపై ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు పెదపాలపర్రు నుంచి దాకరం వరకు నిర్వహించిన పాదయాత్రలో గ్రామగ్రామాన ప్రజలు సమస్యలతోనే స్వాగతం పలికారు. పలుచోట్ల మహిళలు, వృద్ధులు చంద్రబాబు మీరు అధికారంలోకి వస్తేనే మా కష్టాలు తీరుతాయంటూ మొరపెట్టుకున్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ఫలితాలు సక్రమంగా, సజావుగా పేదలకు చేరడం లేదని, చాలా చోట్ల టీడీపీ అభిమానులకు, కార్యకర్తలకు అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.

పెదపాలపర్రు గ్రామం వద్ద వందల సంఖ్యలో గుమిగూడిన మహిళలు, వృద్ధులు తమకు పింఛన్లు కూడా సకాలంలో అందడం లేదని, పక్కా గృహాల నిర్మాణం నిలిచి పోయిందని గతంలో తెలుగుదేశం పార్టీ హయాంలో అన్ని పథకాలు సకాలంలో అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉండేవని, ఇప్పుడు చిన్న చిన్న పనులకు సయితం ప్రభుత్వ కార్యాలయాలు చుట్టూ నెలల తరబడి తిరుగుతున్నామని పలువురు వృద్ధులు చంద్రబాబు వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. మీ హయాంలో పాలన ప్రజల వద్దకే వచ్చిందని, ఇప్పుడు అధికారుల వద్దకు తాము వెళ్ళినా అందుబాటులో ఉండటం లేదని తెలిపారు. రైతులు కూడా తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులను చంద్రబాబుకు వివరించారు.

అధైర్య పడకండి! మరో సంవత్సరం ఓపిక పట్టి, రాబోయే శాసనసభ ఎన్నికల రోజున ఒక్కరోజు మాకు అవకాశం ఇవ్వండి, మీ సేవకుడిగా, మీ ఇంట పెద్ద కొడుకుగా మీ బాగోగులు చూసుకుంటానని చంద్రబాబు భరోసా ఇచ్చారు. పెదపాలపర్రు గ్రామం దాటిన తరువాత జాతీయ రహదారి కుంగిపోయి ప్రమాదకరంగా ఉన్న దుస్థితిని చూసి చంద్రబాబు మన హయాంలో నిర్మించిన రోడ్లు అభివృద్ధిని కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించిందని ఆవేదన వ్యక్తం చేశారు. కలవపూడి సత్రం వద్ద పలు గ్రామాల ప్రజలు తమసమస్యలను ఏకరవు పెట్టి మీ పాలన రావాలని మేము కోరుకుంటున్నామని చంద్రబాబును ఆశీర్వాదించారు. చినపాలపర్రు గ్రామం రోడ్డు వద్ద ప్రజలు తమ రోడ్డు దుస్థితిని వివరిస్తూ ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిని విస్మరించిందని ఆవేదన వ్యక్తం చేశారు. పోలరాజ్ మేజర్ డ్రైన్ ఆధునికీకరణ పనులు నామమాత్రంగానే చేసిన విషయాన్ని పలువురు రైతులు చంద్రబాబుకు చూపించారు.

ఎమ్మెల్యే జయమంగళ వెంకట రమణ, టీడీపీ జిల్లా కార్యదర్శి ఈడ్పుగంటి వెంకట్రామయ్య, జిల్లా తెలుగు రైతు కార్యదర్శి చలసాని జగన్మోహనరావు, పార్టీ మండల అధ్యక్షుడు కొట్టూరి విఠల్ తదితరులు చంద్రబాబుకు వివిధ సమస్యలను వివరించారు. ఈ పర్యటనలో ఎంపిీ కొనకళ్ళ నారాయణ, ఎమ్మెల్యే దాసరి బాలవర్ధనరావు, మాజీ శాసనసభ్యులు కాగిత వెంకట్రావు, రావి వెంకటేశ్వరరావు, మాజీ ఎంపీ గద్దే రామ్మోహన్, విజయవాడ అర్బన్ పార్టీ అధ్యక్షుడు వల్లభనేని వంశీమోహన్ పాల్గొన్నారు.

బాబూ..నువ్వే కావాలి..

టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు 'వస్తు న్నా మీకోసం' పాదయాత్రలో మహిళ దినోత్సవాన్ని జరపడానికి తెలుగు మహిళ సంఘం నిర్ణయించింది. ఈ కార్యక్రమాన్ని ఈ నెల ఎనిమిదో తేదీన మండవల్లి మండలం చావలిపాడులో జరపడానికి నిర్ణయించారు. చంద్రబాబు పాల్గొనే ఈ వేడుకలను భారీ స్థాయిలో మహిళలు పాల్గొనే రీతిలో గ్రామాల్లో చైతన్యం చేస్తున్నారు.

చావలిపాడులోని గాదిరాజు వరదరాజు గార్డెన్‌లో సభా వేదిక ఏర్పాటు చేశారు. వేదికను అందంగా రూపొందిస్తున్నారు. సభా ప్రాంగణాన్ని ఇప్పటికే పోలీసులు, నిఘా బృందాలు పలు మార్లు పర్యవేక్షించాయి. కైకలూరు ఎమ్మెల్యే జయమంగళ వెంకటరమణ, తెలుగు మహిళ జిల్లా అధ్యక్షురాలు ఆచంట సునీత 'ఆంధ్రజ్యోతి'తో మాట్లాడారు.

బాబు సమక్షంలో మహిళా దినోత్సవం

స్పర్థలు వీడండి.. పార్టీని విజయపథంలో నడిపించేందుకు సమష్టిగా కృషి చేయాలని కార్యకర్తలకు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. ప్రస్తుత పరిస్థితుల్లో సమర్థవంతులైన నాయకులు అవసరమన్నారు. యువతను, మహిళలను ఎంపికచేసుకుని ప్రజల్లోకి వెళ్ళాలన్నారు. గుడివాడలో బుధవారం నూజివీడు, పెడన నియోజకవర్గాల కార్యకర్తలతో సమీక్ష నిర్వహించారు. పార్టీ విజయం.. మీ విజయంగా భావించండి. కష్టాలున్నా వెనక్కు తగ్గకండి.. బాంగారం లాంటి కార్యకర్తలున్నారు. మీరే నాబలం అంటూ చంద్రబాబు కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు.

పరిస్థితులను బట్టి సూది మందు.. శస్త్ర చికిత్స

నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితులను గాడిలో పెట్టేందుకు చికిత్స అవసరం ఉందని బాబు చురక వేశారు. కొన్నిచోట్ల సూది మందు, మరికొన్ని చోట్ల శస్త్ర చికిత్స చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఎవరైనా పార్టీ ఇచ్చిన గౌరవాన్ని కాపాడుకోవాలన్నారు. అధికారంలోకి వచ్చి కాలక్షేపం చేస్తే ప్రజలు క్షమించరన్నారు. కొందరు నాయకుల పేర్లు కూడా ప్రజలకు తెలియని పరిస్థితి. ఇది దురదుష్టకరమన్నారు. నాయకుడి పేరు చెబితే ప్రజలు గుర్తు పట్టాలన్నారు. నా భారాన్ని మీ అందరూ పంచుకోవాలి నేను కష్టపడుతుంటే మీరు ఇంటి వద్ద పడుకోవాలనుకోవడం సరి కాదన్నారు. పార్టీ బలోపేతానికి మరిన్ని పాలసీలను ప్రకటించబోతున్నాం. వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలన్నారు. అందుకు నియోజకవర్గ, మండల, గ్రామాల కమిటీలను సమాయత్తం చేయాలన్నారు. ఈ సమావేశాలను నాయకులు నిర్వహించకపోవడంతో కార్యకర్తల్లో ఉన్న నైపుణ్యం, నిరుపయోగంగా మారిందని చంద్రబాబాఉ అన్నారు. కార్యకర్తలే పార్టీకి బలమని తాను త్రికరణశుద్ధిగా నమ్ముతున్నానన్నారు. తెలుగుదేశం పార్టీ విధానాలను నిరంతరం ప్రజల్లోకి తీసుకెళ్ళేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

యువతను ప్రోత్సహించండి...
రాజకీయాల్లో యువతను ప్రోత్సహించాలన్నారు. సొంత కుటుంబ సభ్యులే యువతను రాజకీయాల్లోకి రాకుండా అడ్డుకుంటున్నారు. వారిని రాజకీయాల్లోకి ఆహ్వానించి సరైన శిక్షణ ఇస్తే పార్టీ మరింత బలపడుతుందని చంద్రబాబు నాయకులకు ఉపదేశించారు.

ఎస్సీలకు న్యాయం చేసింది టీడీపీనే...

ఎస్పీలకు అన్ని విధాలా న్యాయం చేసింది తెలుగుదేశమేనని చంద్రబాబు అన్నారు. శాశ్వత గృహాలు, అందుకు అవసరమైన నిధులు కేటాయించడంలో చిత్తశుద్ధి చూపామన్నారు. ఎస్సీలకు డీకేటీ పట్టాలిస్తే వాటిని వైఎస్ రద్దు చేసి పరిశ్రమలకు కట్టబెట్టారని ఆరోపించారు. మాల, మాదిగలందరికీ న్యాయం చేశామన్నారు. జస్టిస్ పున్నయ్య కమిషన్, బాలయోగిని లోక్‌సభ స్పీకర్‌గా చేసి గౌరవించింది, కాకి మాధవరావును చీఫ్ సెక్రటరీగా నియమించింది మా హయాంలోనేనన్నారు.

హత్యా రాజకీయాలు చేస్తే ఖబడ్దార్


కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్‌లు హత్యా రాజకీయాలకు పాల్పడితే సహించేది లేదని తమ కార్యకర్తలను రక్షించుకునేందుకు ఎటువంటి త్యాగాలకైనా సిద్ధమన్నారు. చాట్రాయి మండలం చిత్తవూరికి చెందిన నెట్టెంపల్లి జోగేశ్వరరావును సహకార సంఘ ఎన్నికల సందర్భంగా వైసీపీ హత్య చేయించిందన్నారు. ఆయన కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని చంద్రబాబు హామీ ఇచ్చారు. రాష్ట్రాన్ని పులివెందుల మార్చుదామని పిల్ల కాంగ్రెస్ నాయకులు అనుకుంటే తగిన గుణపాఠం చెబుతానన్నారు. తెలుగుదేశం రౌడీయిజాన్ని సహించదని, హత్యా రాజకీయాలను సమర్థించదన్నారు. సమీక్షా సమావేశాల్లో ఎంపీ కొనకళ్ళ నారాయణ, జిల్లా అధ్యక్షులు దేవినేని ఉమామహేశ్వరరావు, రావి వెంకటేశ్వరరావు, కాగిత వెంకట్రావ్, కాపా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

స్పర్థలు వీడండి.. పార్టీని గెలిపించండి