March 6, 2013

టీడీపీ పూర్వ వైభవం తీసుకురావాలని... రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల విజయానికి కార్యకర్తలు కృషి చేయాలని టీడీపీ మండల అధ్యక్షుడు ఇప్ప రవి కోరారు. బుధవారం శివాలయంలో టీడీపీ మండల ముఖ్య నాయకులు సమావేశం జరిగింది. ఈ సమావేశానికి నారాయణ, లచ్చన్న, రాజలింగు, వినోద్‌రావు ముఖ్య అతిథిలుగా హాజరయ్యారు. స్థానిక ఎన్నికల్లో పోటీ చేస్తున్న వారి విజయానికి కృషి చేయాలని సమావేశంలో తీర్మానించారు. ఈ సమావేశంలో శ్రీనివాస్, పాపయ్య, రాజు, పోశం, వెంకటి, వెంకటి, శ్రీనివాస్, మోహన్, రమేష్, గోపాల్ పాల్గొన్నారు.

తిర్యాణిలో...

మండలంలో పార్టీ బలోపేతానికి కార్యకర్తలందరు కృషి చేయాలని టీడీపీ అధ్యక్షుడు ముత్యం రాజయ్య కార్యకర్తలను కోరారు.పార్టీకి పూర్వ వైభవం తీసుకురావాలని అన్నారు. బుధవారం మండలంలోని మంగి, మాణిక్యపూర్, రోంపెల్లి గ్రామపంచాయతీల్లో జెండా పండగలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. త్వరలో జరగనునన్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ కార్యకర్తలందరు సైనికుల్లా పనిచేసి పార్టీ సత్తాను చూపాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల నాయకులు హనుమాండ్ల జగదీష్, శ్రీనివాస్‌గౌడ్, ఆయా గ్రామాల కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

టీడీపీ బలోపేతానికి కృషి చేయాలి

కూడు, గూడు, గుడ్డ అనేవి ప్రజల కనీస అవసరాలు. గుడ్డ కట్టిన తరువాతే మానవుడు నాగరికుడయ్యాడు. అలాంటి బట్ట నేసేవాడికి కూడు లేదు. ఆ బట్టను అమ్ముకొనే వారికి అసలు బతుకే లేదు. వ్యాట్‌కు వ్యతిరేకంగా ఉద్యమిస్తూ.. నా మద్దతు కోసం వచ్చి కలిసిన వస్త్ర వ్యాపారులు వినిపించిన గోడు సారాంశమిది. నడక మొదలుపెట్టిన అనంతపురం నుంచి ప్రతి జిల్లాలోనూ వీరు నన్ను కలుస్తూనే ఉన్నారు.

ప్రతిసారీ వాళ్ల కోసం నేను గొంతెత్తూనే ఉన్నాను. నిజానికి.. వాళ్ల పోరాటం కేవలం సొంత లాభాలు, ప్రయోజనాలు, లబ్ధి కోసమే అయితే ఇంత ఆలోచించాల్సిన పని లేదు. నిజానికి.. వ్యాట్‌వల్ల నష్టపోయేవారిలో సామాన్యులూ ఉన్నారు. వారి కోసమూ జరుగుతున్న పోరాటమిది. అందుకే అందరూ వ్యాట్‌ని వ్యతిరేకించాలని చెబుతున్నాను. వస్త్ర వ్యాపారులను కాపాడుకోవడం ఒకరివల్ల అయ్యేది కాదు.. అందరం కలిసి.. సాగించాల్సిన పోరాటం. ఈ పోరాటంలో వాళ్లను మనం ఒంటరిగా వదిలిపెట్టలేం కదా!

పని చేయడానికి తప్ప ఈ చేతులు తిండి తినడానికి లేవా! ఒళ్లు దాచుకోకుండా కష్టపడే ఈ మనుషులకు పిడికెడు అన్నం పెట్టలేమా? చౌడేపల్లి, పెదపాలపర్రులో రైస్‌మిల్లులో పనిచేసే హమాలీలను కలిసినప్పుడు కలిగిన వేదన ఇది. ఏడాదిలో నాలుగు నెలలే పని దొరుకుతుందట. మిగతా కాలం వేళ్లు నోట్లోకి వెళ్లే పరిస్థితి లేదట. 'ఏం చేయాలంటారు సార్..'' అని ప్రశ్నిస్తుంటే ఏమి చెప్పాలో అర్థం కాలేదు. యాజమాన్యాలను మాత్రం ఎలా తప్పుపట్టగలం? కరెంటు కోతలతో తద్వారా పుట్టెడు అప్పులతో, పెట్టుబడి నష్టాలతో కోలుకోలేనంతగా కుంగిపోయి ఉన్నారు. ఇక అడగాల్సింది.. కడగాల్సింది ఈ పాలకులనే.. నా పాదయాత్రలో నేను చేస్తున్న పనీ ఇదే!

వ్యాట్.. అందరిపై వేటే!

వైఎస్, ఎన్టీఆర్ కుటుంబాలను పోల్చి చూడండి
ఎవరు మంచి చరిత్రగలవారో స్పష్టమవుతుంది

  ప్రజలను దోచుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం మరోసారి అధికారంలోకి వస్తే నెత్తిమీద జుట్టు కూడా మిగలదని టీడీపీ అధినేత చంద్రబాబు వ్యాఖ్యానించారు. వైఎస్ కుటుంబాన్ని, ఎన్టీఆర్ కుటుంబంతో పోల్చి చూడాలని, ఎన్టీఆర్ కుటుంబంపై ఒక్క కేసు కూడా లేని విషయం అప్పుడు తెలుస్తుందని పేర్కొన్నారు. కృష్ణాజిల్లా గుడివాడ మండలం మల్లాయపాలెం వద్ద బుధవారం సాయంత్రం 4 గంటలకు చంద్రబాబు పాదయాత్ర ప్రారంభించారు. ప్రతి ఒక్కరిజూఠీ పలకరిస్తూ వారి కష్టాలను తెలుసుకుంటూ ముందుకు సాగారు.

మల్లాయపాలెం గేటు సమీపంలోని రైస్‌మిల్‌లోకి వెళ్లి రైతులను కలుసుకున్నారు. ధాన్యం ఎంతకు కొనుగోలు చేస్తున్నారు..ట్రేడింగ్ ఎలా ఉందంటూ ఆరా తీశారు. దారిలో గేదెలను మేపుకుంటున్న వ్యక్తిని పిలిచి పాడి పంటల పరిస్థితిని అడిగి తెలుసుకొన్నారు. మల్లాయపాలెం రైలు గేటు పక్కన గల ఎఫ్‌సీఐ గోదాముల కూలీలను కలిసి వారి బాగోగులను అడిగారు. తిరిగి వస్తుండగా.. ముస్లిం మహిళలు నీరాజనాలు పట్టారు. పెరిగిన ధరలు, గ్యాస్, విద్యుత్ కోతలతో అల్లాడుతున్నామని వాపోయారు. ఈ సమయంలో చంద్రబాబు ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ వైఎస్ కుటుంబంపై దుమ్మెత్తిపోశారు.

"వచ్చే ఏడాది పార్టీకి కీలకం. ఎన్నికలు ఎప్పుడైనా రావచ్చు. కాబట్టి ఈ ఏడాదంతా ఇంటి పనులు ఎవరికైనా వదిలేసి పార్టీకి అంకితం కావాలి. ఇప్పటికే బాగా అలసిపోయారని, చాలా ఖర్చు పెట్టుకుని వట్టిపోయారని నాకు తెలుసు. అయినా తప్పదు. కాస్తోకూస్తో మీ స్థోమతను బట్టి ఇంకో ఏడాది పార్టీని భరించాల్సిందే. అభ్యర్థులను గెలిపించే బాధ్యత మీది... మీ బాగోగులు చూసుకునే బాధ్యత నాది'' అని గుడివాడ కార్యకర్తల భేటీలో చంద్రబాబు హామీ ఇచ్చారు.

ఎందుకూ పనికిరాని వారికి కూడా సీటిచ్చి మీరు గెలిపిస్తే వారు డబ్బుకు అమ్ముడుపోయి, మిమ్మల్ని నోటికొచ్చినట్టు తిడుతుంటే రక్తం సలసల ఉడుకుతోందని నూజివీడు కార్యకర్త చందు ఉద్వేగంతో అన్నారు. ఇకనైనా పుట్టు పూర్వోత్తరాలు పూర్తిగా తెలుసుకుని విధేయులకే సీటివ్వాలని కోరారు. మీరు చెప్పినట్టే అభ్యర్థుల పుట్టు పూర్వోత్తరాలు, గోత్రాలు తెలుసుకుని మరీ సీటిస్తానని బాబు చిరునవ్వుతో చమత్కరించారు.

మళ్లీ కాంగ్రెస్ వస్తే నెత్తిన జుట్టూ ఉంచదు!

  ఢిల్లీ పెద్దల ఆదేశాల మేరకే ట్రాన్స్‌ట్రాయ్‌కు పోలవరం టెండర్లను అప్పగించారని టీడీపీ నేత తుమ్మల నాగేశ్వరరావు ఆరోపించారు. బుధవారం ఉదయం మీడియాతో మాట్లాడుతూ రష్యాలో విహారయాత్ర చేసి వచ్చిన ఇంజనీర్ల బృందం నివేదిక బూటకమని ఆయన అన్నారు. పోలవరం టెండర్లలో అక్రమాలపై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తామని తుమ్మల నాగేశ్వరరావు హెచ్చరించారు.

పోలవరం టెండర్లపై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తాం : తుమ్మల

'మహానేత ఎన్టీఆర్ రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన పుణ్యభూమి గుడివాడ. రాజకీయాల్లో చరిత్ర సృష్టించి దివికేగిన ఎన్టీఆర్ ఫొటోలు దేవుళ్ళ పక్కన పెట్టడం సముచితం. కానీ ఆ యుగపురుషుడి ఫొటోలు లక్షల కోట్లు తిన్న రాబందుల పక్కనపెట్టడం దుర్మార్గం.పిల్ల కాంగ్రెస్‌కు ఓట్లేస్తే కేసుల మాఫీకు వాడుకుంటుంది. టీడీపీకి అధికారం కట్టబెడితే ప్రజల కష్టాలు తీరుస్తుందని'' గుడివాడ సభలో చంద్రబాబు అన్నారు.


గుడివాడటౌన్: గుడివాడ అంటేనే ఎన్టీఆర్ అని ఆయన రాజకీయ ప్రస్థానం ఇక్కడ నుంచే ప్రారంభమైందని కుప్పం తర్వాత గుడివాడకే తాను ప్రాధాన్యత ఇస్తానని మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. 'వస్తున్నా మీకోసం' పాదయాత్రలో భాగంగా ఆయన గుడివాడ నెహ్రూ చౌక్‌లో మంగళవారం రాత్రి ప్రసంగించారు. ఎన్టీఆర్‌కు సాటిగల నాయకుడు లేడని, రాడని, రాబోడని ఉద్ఘాటించారు. రాష్ట్ర రాజకీయాల్లో చరిత్ర సృష్టించిన యుగపురుషుడు ఎన్టీఆర్ అని ప్రస్తుతించారు. ఢిల్లీతో పాటు కొన్ని రాష్ట్రాల్లో తెలుగువారిని మద్రాసిీలుగా పిలిచేవారని, అన్న ఎన్టీఆర్ టీడీపీని స్థాపించి తెలుగు తేజాన్ని దశ దిశలా చాటారన్నారు.

ఢిల్లీ నేతల గుండెల్లో రైళ్ళు పరిగెత్తించారన్నారు. దీంతో గుడివాడ చరిత్రకెక్కిందన్నారు. కిరికిరి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి గుడ్డి కరెంట్‌తో గుడ్డి ప్రభుత్వాన్ని నడుపుతున్నారన్నారు. ఇంతటి చేతగాని అవినీతి అసమర్థ ప్రభుత్వాన్ని తాను చూడలేదన్నారు. కాంగ్రెస్‌ను నమ్ముకుంటే ఆధార్ ఎక్కౌంట్‌లో డబ్బులు సైతం కాంగ్రెస్ ఖాతాలోకి వెళ్ళిపోతాయన్నారు. తమ హయాంలో లోఓల్టేజ్, కరెంట్ కోతలు లేవన్నారు. ముందు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా నాణ్యమైన విద్యుత్‌ను ఇచ్చామన్నారు. సెల్‌ఫోన్లు, రోడ్లు తమ ప్రభుత్వ ప్రతిభేనని గుర్తు చేశారు. టీడీపీ అధికారంలో ఉంటే కేజీ బేసిన్ల గ్యాస్ ప్రథమ వాటా రాష్ట్రానికే దక్కేదన్నారు. సహజ వనరులను సైతం స్వలాభానికి దోచుకున్న రాజశేఖరరెడ్డి వల్ల రాష్ట్రానికి అనేక అనర్థాలు జరిగాయన్నారు. ఆయన వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ దొంగలను పొలిమేర్లు దాటేలా తరిమికొట్టాలన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు విద్యావంతులు, యువకులు రాజకీయ రంగంలోకి రావాలన్నారు.

ఎన్టీఆర్, నేను నిప్పులాంటి మనుషులం


ఎన్టీఆర్ తాను నిప్పులాంటి మనుషులమని నిప్పులాగానే బతుకుతానని చం ద్రబాబు అన్నారు. విష కన్య సాక్షి ప్రచురించే ఆసత్య విషయాలపై పబ్లిక్ డిబేట్‌కు రమ్మని తాను అనేకసార్లు సవాల్ విసిరినా పలాయనం చిత్తగిస్తున్నారన్నారు. సర్కారు భూములు అమ్మి అక్రమంగా గడించిన సొమ్ము తో పెట్టిన పత్రికలో విపక్షాలను, సాటి పత్రికలను సైతం బ్లాక్ మెయిల్ చేసే విధంగా వార్తలు రాస్తున్నారని ధ్వజమెత్తారు. లక్షల కోట్లు దోచుకున్న వైఎస్సార్ పక్కన యుగపురుషుడు ఎన్టీఆర్ ఫొటో పెట్టడం ఏమిటని కార్యకర్త చంద్రబాబును ప్రశ్నించగా దొంగల పక్కన దేవుడు ఫొటో పెట్టి రాజకీయ బేరాలు సాగిస్తున్నారని వైఎస్ బతికున్నప్పుడు ఎన్టీఆర్‌ను అనేక ఇబ్బందు లు పెట్టారన్నారు. హైదరాబాద్ విమానాశ్రయానికి ఎన్టీఆర్ పేరు పెడితే దాన్ని తొలగించి ఘనత వైఎస్సార్‌దేనన్నారు. ఎన్టీఆర్ పేరు పెట్టేదాక విశ్రమించమన్నారు.

రౌడీల కోరలు పీకేశాం

తమ ప్రభుత్వం ఉన్నప్పుడు రాష్ట్రంలో రౌడీల కోరలు పీకేశామని, ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణిచివేశామని చంద్రబాబు అన్నారు. మత కలహాలు లేకుండా తమ ప్రభుత్వం చట్టాలను సక్రమంగా వినియోగించిందన్నారు. కాంగ్రెస్ పాలనలో ఆడబిడ్డలకు రక్షణ లేకుండా పోయిందని, తమ హయాం లో మహిళల పట్ల దురాఘతాలకు పాల్పడే వారిని కఠినంగా శిక్షించామన్నారు. ప్రజలు ఓటు వేసే విషయంలో నిర్లక్ష్యంగా ఉండటం తగదన్నారు.

గుడివాడ అంటేనే ఎన్టీఆర్

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు 'వస్తున్నా.. మీకోసం' పాదయాత్రకు గుడివాడ నియోజకవర్గంలో ప్రజలు బ్రహ్మరథం పట్టారు. పామ ర్రు, గుడివాడ నియోజకవర్గాల సరిహద్దు గాంధీ ఆశ్రమం నుంచి ప్రారంభమైన పాదయాత్రకు అడుగడుగునా ప్రజలు నీరాజనాలు పలికారు. పూలతో స్వాగతం పలుకుతూ హారతులు పట్టిన మహిళలు మీ పరిపాలన రావాలంటూ చేతులు ఎత్తి ఆశీర్వదించారు. రామన్నపూడిలో మహిళలు, వివిధ కుల వృత్తిదారులు పెద్ద సంఖ్యలో హాజరై బాబును స్వాగతించారు. చినఎరుకపాడు వద్ద రోడ్డుకు ఇరువైపులా భారీ సంఖ్యలో ప్రజలు బారులు తీరి చంద్రబాబు పాదయాత్రను తిలకించారు. ఆర్టీసీ కాలనీలో మహిళలు పెద్ద సంఖ్యలో హాజరై బాబుకు హారతులు ఇచ్చి ఆశీర్వదించారు.

బాబు ప్రజానీకానికి అభివాదం చేస్తూ ముందుకు సాగారు. అన్న ఎన్టీఆర్ హయాంలో టీడీపీ వైభవాన్ని ప్రజలు గుర్తుకు తెచ్చే ప్రయత్నం చేశారు. రామన్నపూడి వద్ద సీనియర్ టీడీపీ నాయకులు లింగం సాయిబాబు, సూరపనేని రామచంద్రరావు పాదయాత్రలో పాల్గొన్నారు. గంగాధరపురం, బిళ్లపాడు కాలనీల మహిళలు బాబుకు మంగళ హారతులు పట్టి పూలాభిషేకం చేశారు. దారిలో స్కూ ల్ బస్సు ఎక్కిన బాబు విద్యార్థులతో ముచ్చటించారు. కూల్‌డ్రింక్ షాపులో డ్రింక్ తాగారు. వృద్ధురాలిని ఆప్యాయంగా పలుకరించి సాధక బాధలు అడిగి తెలుసుకున్నారు. వ్యవసాయ కూలీని పిలిచి బతుకు ఎట్టా సాగుతోందని ఆరా తీశారు. చంద్రబాబు పాదయాత్రను చూసేందుకు చిన్నారులు సైతం పొలాల వెంట పరుగులు తీస్తూ కన్పించారు. లారీలు, బస్సుల్లో వెళ్తు న్న ప్రయాణికులు సైతం బాబును చూసి కేరింతలు కొడుతూ చేతులు ఊపారు. కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల తా ము ఎదుర్కొంటున్న సమస్యల చిట్టా ను ఒక మహిళ చంద్రబాబుకు అందించింది. మొత్తంమీద మంగళవారం బాబు పాదయాత్ర గుడివాడ వరకు అత్యంత ఉత్సాహంగా సాగింది.

డప్పులు, వాయిద్యాలతో కోలాహలం

పాదయాత్ర ప్రారంభం నుంచి డప్పులతోపాటు కరీంనగర్ నుంచి వచ్చిన 50 మంది వాయిద్యకారులు లయబద్ధం గా తమ డోలులపై నాదాలు చేస్తూ నాయకులు, కార్యకర్తలను హుషారెత్తించారు. విచిత్ర వేషధారణతో పాదయాత్ర ముందు భాగం ఆకట్టుకుంది. గుడివాడ రూరల్ మండలం మాజీ అధ్యక్షుడు గుత్తా శివరామకృష్ణ(చం టి), నూతక్కి బాలాజీల ఆధ్వర్యంలో 60 మంది తెలుగు మహిళలు పసుపు చీరలు ధరించి బాబుకు పూలతో స్వాగ తం పలికారు. హోరెత్తిన డప్పులు, నృత్యాలతో విజయవంతం చేశారు.

పెద్ద సంఖ్యలో యువత

బాబు పాదయాత్రకు యువత నుంచి పెద్ద ఎత్తున స్పందన లభించింది. గుడ్లవల్లేరు, గుడివాడ ఇంజనీరింగ్ కాలేజీలకు చెందిన వేలాది మంది విద్యార్థులు బాబు పాదయాత్రలో పాల్గొన్నారు. మరోవైపు 100 మందికి పైగా విద్యార్థులు భారీ మోటారు సైకి ళ్ళ ర్యాలీతో బాబుకు స్వాగతం పలికారు. ఎంపీ కొనకళ్ళ నారాయణరావు, మాజీ ఎంపీ గద్దె రామ్మోహనరావు,ఎమ్మెల్యేలు దేవినేని ఉమామహేశ్వరరావు, దాసరి బాలవర్ధనరావు, తంగిరాల ప్రభాకరరావు, మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు, నేతలు వల్లభనేని వంశీమోహన్, కొనకళ్ళ బుల్లయ్య, లంకదాసరి ప్రసాదరావు, కాగిత వెంకట్రావ్, బొండా ఉమామహేశ్వరరావు, పంచుమర్తి అనురాధ పాల్గొన్నారు.

గుడి వాడలో బాబుకు బ్రహ్మరథం


'మన లక్ష్యం - 2014.. నాలాగా మీరూ క్షేత్రస్థాయిలో తిరిగితే 294 అసెంబ్లీ సీట్లూ మనవే. టీడీపీ భవిష్యత్తు కోసం నేను పాదయాత్ర చేస్తుంటే.. మీరు ఇంట్లో పడుకుని టీవీలు చూస్తే ఎలా? ఇక నుంచి నేను పరుగెడతా.. మిమ్మల్ని పరుగెట్టిస్తా.. నాతోపాటు పరుగెట్టిన వాడే నాయకుడు...' అని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కార్యకర్తలకు, నాయకులను తట్టి లేపే ప్రయత్నం చేశారు. పాదయాత్రలో భాగంగా మంగళవారం పమిడిముక్కల మండలం కొమరవోలు గ్రామం లో చంద్రబాబు విజయవాడ తూర్పు, నందిగామ నియోజకవర్గాల కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా కార్యకర్తల నుంచి సూచనలు, సలహాలు స్వీకరించారు. కార్యకర్తలతో కలుపుగోలుగా మాట్లాడారు. ఎలా పనిచేయాలో చెబుతూ నాయకులకు సుతిమెత్తగా చురకలు వేశారు. ప్రతి నియోజకవర్గం ఇన్‌చార్జ్, ముఖ్య నాయకులు జనంలోకి వీలైనంత ఎక్కువగా వెళ్ళాలని పదేపదే గుర్తు చేశారు. ఈ ఏడాది కాలంలో జనంతో ఎంతగా మమేకం అయితే.. పార్టీకి అంతగా లాభిస్తుందని చెబుతూ 'నాలాగే మీరూ తిరిగితే 294 సీట్లు మనవే' అంటూ ఉత్సాహ పరిచారు. పార్టీ ఆదేశించే కార్యక్రమాలతో పాటు, స్థానిక ఆందోళనలను 'రిజల్ట్ ఓరియెంటెడ్'గా చేయాలని హితబోధ చేశారు. 'మీలో హనుమంతుడి అం త బలం ఉంది. ఆ విషయం నాకు తెలుసు. ఇంకా ఒక్క సంవత్సరం ఉంది. పదవులు రాలేదనో, మరో కారణంతోనో దూరంగా ఉండవద్దు. భేషజాలు మరచి, పార్టీ కోసం ఐక్యం గా పనిచేయండి.

లక్ష్యం పెట్టుకుని పని చేయండి ఎన్టీఆర్‌ను, నన్ను ప్రపంచ వ్యాప్తంగా గుర్తు పెట్టుకుంటున్నారంటే కార్యకర్తలే కారణం. ఎప్పుడూ పార్టీ గురించే ఆలోచించే మీరు ఇప్పుడు కాడి పారేయకండి. ఆ తర్వాత మిమ్మల్ని ఎలా చూసుకుంటానో నాకు వదిలివేయండి' అంటూ ఉద్విగ్నంగా కార్యకర్తలతో మాట్లారు.

294 సీట్లు మనవే

చంద్రబాబునాయుడు సోమవారం రాత్రి బస చేసిన గుడివాడ-పామర్రు హైవే సమీపంలోని గాంధీఆశ్రమం వద్దకు టీడీపీ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలిరావడంతో కోలాహలంగా మారింది. మంగళవారం ఉదయం నుంచే జిల్లా నలుమూలల నుంచి, గుడివాడ నియోజకవర్గం నుంచి వేలాదిమంది కార్యకర్తలు తరలివచ్చారు. ఉదయం నందిగామ, విజయవాడ తూర్పు నియోజకవర్గాల సమీక్షా సమావేశం ఉండటంతో అటు నేతలు, ఇటు కార్యకర్తలు గాంధీఆశ్రమం ప్రాంతానికి ఉదయం 10గంటల కల్లా చేరుకున్నారు. అలాగే చంద్రబాబును చూసేందుకు వేలాదిమంది తరలిరావడంతో బాబు బస ఏరియా అంతా జనంతో కిక్కిరిసింది.

చిత్తూరు జిల్లా నగిరి నియోజకవర్గం నుంచి దాదాపు 20మంది నాయకులు, కార్యకర్తలు తరలివచ్చి బాబు ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని సంఘీభావం ప్రకటించారు. విజయవాడకు చెందిన దేవినేని చంద్రశేఖర్, కేశినేని నాని, కాట్రగడ్డ బాబు, గుంటూరుకు చెందిన లాల్‌జాన్‌బాషా, తిరువూరు మాజీ ఎమ్మెల్యే నల్లగట్ల స్వామిదాసు, బందరు నుంచి బచ్చుల అర్జునుడు తదితరులు ఉదయం నుంచే గాంధీఆశ్రమం వద్ద ఉన్నారు. కైకలూరు ఎమ్మెల్యే జయమంగళ వెంకటరమణ, ఈడ్పుగంటి వెంకట్రామయ్య, నియోజకవర్గ కార్యకర్తలు వచ్చి బాబును కలిశారు. వర్ల రామయ్యతో పాటు పామర్రు నియోజకవర్గ కార్యకర్తలు, దండోరా నాయకులు బాబును కలుసుకున్నారు. నాలుగుగంటలకు బాబు పాదయాత్ర ప్రారంభం కావడంతో ఆప్రాంతమంతా ఒక్కసారిగా బోసిపోయింది.

పాదయాత్రకు తరలివచ్చిన నేతలు

దొండపాడు నుంచి మాజీ సర్పంచ్ అడుసుమిల్లి వెంకటరత్నం ఆధ్వర్యంలో వందలాది మంది కార్యకర్తలు పాదయాత్రకు తరలివచ్చారు. రామన్నపూడి మాజీ సర్పంచ్ జుజ్జవరపు వీరభద్రరావు, నూజెళ్ళ మాజీ సర్పంచ్ అట్లూరి దుర్గాభవానీ ఆధ్వర్యంలో కార్యకర్తలు పాదయాత్రకు తరలివచ్చారు. రూరల్ మండలం నుంచి వందలాది మంది కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.

బాబు బస వద్ద కోలాహాలం

గ్రామసీమల అభివృద్ధి టీడీపీ పాలనలోనే సాధ్యమని, చంద్రబాబునాయుడు 2014లో ముఖ్యమంత్రి కావడం ఖాయమని, ప్రముఖ సినీ నటుడు నందమూరి బాలకృష్ణ అన్నారు. సోమవారం బాలయ్య పోలిమెట్ల గ్రామానికి వచ్చారు. మాజీ సర్పంచ్ అట్లూరి సీతారామచంద్రప్రసాద్(పోలిమెట్ల ప్రసాద్) స్వగృహంలో టీడీపీ నాయకులు, నందమూరి అభిమానులతో ముప్పావుగంట గడిపారు. చంద్రబాబు పాదయాత్ర జిల్లా దాటిన తర్వాత వచ్చే నెలలో గుడ్లవల్లేరు మండలంలో తాను పర్యటిస్తానని హామీ ఇచ్చారు. గుడివాడ నియోజకవర్గంలో రావి వెంకటేశ్వరరావు 2014 ఎన్నికల్లో ఖచ్చితంగా గెలుస్తారని అన్నారు. కార్యకర్తలు, నాయకులు రావికి అండగా నిలవాలని కోరారు. కూర్చోగానే ఫ్యాన్ తిరుగుతుండటంతో ..ఏమిటి కరెంట్ ఉందా? లేక ఇన్‌వర్టరా? అని బాలయ్య ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

బాబు యాత్ర ఉండటంతో విద్యుత్ సరఫరా ఉంచుతున్నారని, ఈ ప్రాంతం దాటాక మళ్ళీ అంధకారమేనని ఒక కార్యకర్త అన్నారు. కొసరాజు బాపయ్యచౌదరి కార్యకర్తలను బాలయ్యకు పరిచయం చేయగా, ఆయన వారిని పేరు పేరునా పలుకరించారు. అందరు కష్టపడి పని చేసి పార్టీని నిలబెట్టాలని విజ్ఞప్తి చేశారు. మినపకాయ తీతకు వచ్చిన కూలీలు పనులకు వెళ్లకుండా చూసేందుకు రావడంతో ఆయన వారితో మా ట్లాడి ఫొటోలు తీయించారు. పశుభొట్లపాలెంకు చెందిన బాలయ్య అభిమాని పాములు ఫొటో దిగేందుకు వచ్చి తాను పెట్టుకున్న నల్లఅద్దాల కళ్ళజోడు తీస్తుండగా.. ఆగు..ఆగు ఎందుకు తీస్తావు ఉంచుకో అని తీసిన జోడును పెట్టించి మరీ ఫొటో దిగారు. కొసరాజు బాపయ్యచౌదరి, జిల్లా ఉపాధ్యక్షుడు జంగం మోహనరావు, జిల్లా పాల ఉత్పత్తిదారుల సంఘ డైరెక్టర్ వి.బి.కె.బి సుబ్బారావు, సొసైటీ అధ్యక్షుడు పి.రవికుమార్, బొప్పన శివప్రసాద్, పిన్నమనేని రాఘవేంద్రరావు, చంద్రాల చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు.

టీడీపీ వస్తేనే గ్రామాల అభివృద్ధి