March 5, 2013

గుడివాడలో నడవడం సొంత ఊళ్లో నడక లాంటిదే. ఇక్కడి జనం అభిమానం అలాంటిది. కొన్ని తరాలుగా పసుపు జెండా నీడన బతుకుతున్న మనుషులు వీళ్లు. ఆ మహానుభావుడి రాజకీయాలకు తొలిపాదు. అప్పటి నుంచి ఇప్పటిదాకా మాకిక్కడే తొలి పొద్దు. నా దారిని పసుపుమయం చేయడమే కాదు.. గుండె గూట్లోని ఆ దేవుడి జ్ఞాపకాలను పదేపదే గుర్తు చేసుకున్నారు. నన్నూ ఆ జ్ఞాపకాల్లోకి తీసుకుని వెళ్లారు. గుడివాడ పార్టీలో ఇటీవలి పరిణామాలపై కొంత కలత చెందినా.. నాలో ఉత్సాహం నింపేందుకు ఆ బాధని, కసిని గొంతులోనే దాచేసుకున్నట్టనిపించింది. గుండెలపై తన్నిపోయిన వారిపట్ల ధర్మాగ్రహంతోపాటు పార్టీకి చిన్న కష్టం వచ్చినా తట్టుకోలేని తల్లిమనసు సైతం వాళ్లలో కనిపించింది.

గుడివాడ పట్టణంలోకి వస్తుండగా శివార్లలో దారిపొడవునా చిన్న చిన్న పరిశ్రమలు కనిపించాయి. కోల్డు స్టోరేజీలు, ప్లాస్టిక్ తయారీ యూనిట్లు, ఇంజినీరింగ్ వర్క్స్.. ఇలా చాలా పరిశ్రమలు వేలాదిమందికి అన్నం పెడుతున్నాయి. స్వయం ఉపాధికి ఊతమిస్తున్నాయి. కానీ, ఇప్పుడు వాటిని చూస్తే ప్రాణం ఉసూరుమనిపించింది. కరెంటు కోతలతో దిక్కుతోచని పరిస్థితి నెలకొందని నన్ను కలిసిన చిన్న పరిశ్రమల యజమానులు వాపోయారు.

ఒకప్పుడు ఊళ్లో పిల్లలు రోడ్డున పడకుండా అక్కున చేర్చుకున్న చరిత్ర ఇప్పుడు తలకిందులయిందని వారంతా కుమిలిపోయారు. "సార్.. సముద్రతీరాన వ్యాపారం చేస్తున్నాం. వాణిజ్యానికీ కొదవ లేదు. కొరతల్లా కరెంటుకే. వీళ్లు మాకేం ఒరగబెట్టాల్సిన పనిలేదు. రోజులో కొన్ని గంటలైనా కరెంటు ఇస్తే చాలు'' అని ఆవేదన చెందారు. ఆ పరిస్థితి లేకపోవడంతో యూనిట్లు కుంటుబడ్డాయట.. చేసిన అప్పులు ఎలా తీర్చాలో తోచడం లేదట.. పూలు అమ్ముకున్న చోట కట్టెలు అమ్ముకోవాల్సి వస్తోందంటూ వాపోయారు. కష్టం చేసేవారిపై ఎందుకో ఇంత కక్ష?

గుడివాడ జనం అభిమానం అలాంటిది...

చంద్రబాబు పాదయాత్ర సందర్భంగా మోటా రు సైకిళ్ల ర్యాలీ నిర్వహిస్తున్న యువకులపై గుడివాడ కి దిగారు. గుడివాడలో యువ కార్యకర్తలు మోటారుసైకిళ్ల ర్యాలీ ని ఏర్పాటు చేసుకున్నారు. గుడ్లవల్లేరు యువకులు ర్యాలీచేస్తూ వాసవీ చౌక్, థియేటర్ మీదుగా వస్తుండగా నాని ఎదురుపడ్డారు. ఈ సందర్భంగా మోటారు సైకిల్‌పై ఉన్న ఒక యువకుడిపై నాని దాడిచేసి బైక్ లాగేసుకున్నట్టు చెబుతున్నారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు ఇరుపక్షాలనూ పంపించివేయడంతో పరిస్థితి చల్లబడింది.

ఎమ్మెల్యే కొడాలి నాని దాడి

 టీడీపీ శాసనసభాపక్ష సమావేశం గురువారం ఉదయం కృష్ణా జిల్లా ముదినేపల్లి మండలం దాకరంలో జరగనుంది. అక్కడ సమావేశం నిర్వహించాలని బాబు నిర్ణయించారు. త్వరలో జరగనున్న శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై ఈ సందర్భంగా చర్చిస్తారు. పాదయాత్రలో ఉన్న చంద్రబాబు అసెంబ్లీ సమావేశాలకు హాజరవ్వాలా... వద్దా? అనే విషయంపైనా నిర్ణయం తీసుకోనున్నారు.

రేపు దాకరంలో టీడీఎల్పీ భేటీ

జగన్ అంటేనే ప్యాకేజీల పుట్ట అని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. చంచల్‌గూడ జైలులో ఉన్న ఆయన వద్దకు బేరాలు కుదుర్చుకోవడానికే వెళుతున్నారని, ఆ పని కాగానే ఫిరాయిస్తున్నారని విమర్శించారు. కృష్ణాజిల్లా గుడివాడ మండలం గాంధీ ఆశ్రమం వద్ద మంగళవారం ఆయన పాదయాత్ర ప్రారంభించారు. రామనపూడి, చిన ఎరికపూడి, గుడివాడ పట్టణం మీదుగా 14.5 కిలోమీటర్లు నడిచారు. గుడివాడ పట్టణంలో జరిగిన బహిరంగ సభకు జనం పెద్దఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా వైఎస్ కుటుంబం అవినీతిపై చంద్రబాబు నిప్పులు చెరిగారు. "జగన్ ప్యాకేజీలతో రాజకీయ విలువలు పతనమవుతున్నాయి.

పార్టీ మారేందుకు ముందుకొచ్చిన వారికి సూట్‌కేసుల ద్వారా కోట్లు ముట్టచెబుతున్నారు. ఆ డబ్బులకు ఆశపడే ఫిరాయింపుదారులు చంచల్‌గూడ జైలు చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు'' అని దుమ్మెత్తిపోశారు. దేశంలో ఎక్కడ అవినీతి జరిగినా వైఎస్ కుటుంబంతో లింకు ఉంటోందన్నారు. బ్రదర్ అనిల్‌ను నమ్ముకున్న వారికి ప్రాణాలు మిగిలే పరిస్థితి కూడా లేదంటూ.. కడపలో వీరభద్రారెడ్డి అనుమానస్పద మృతిని పరోక్షంగా ప్రస్తావించారు.

కాంగ్రెస్ ఘనతగా చెప్పుకొంటున్న రైతు రుణమాఫీలో అవినీతి జరిగిందని 'కాగ్' తేల్చిందని గుర్తుచేశారు. భావి తరాల భవిష్యత్ కోసం ఆరాట పడుతున్నానని, నిద్రలో కూడా ప్రజా సమస్యలే గుర్తుకు వస్తున్నాయని ఆవేదనాపూరిత స్వరం తో చెప్పారు. పాదయాత్ర వల్ల తనకు తెలియకుండానే తనలో మార్పు వచ్చిందని, ప్రజలకు ఏమి చేయాలన్న యాక్షన్ ప్లాన్ మైండ్‌లో రూపుదిద్దుకుంటోందన్నారు. తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా చేసిన తాను బాంబులకే భయపడలేదంటూ 'అలిపిరి' ఘటనను గుర్తుచేశారు.

జగన్ అంటేనే ప్యాకేజీ బేరాల కోసమే ఆయన వద్దకు.....

రైతు రుణ మాఫీలో భారీ కుంభకోణం
రాష్ట్ర ప్రభుత్వానికి కాగ్ అక్షింతలు
ప్రభుత్వం వివరణ ఇవ్వాలి: నామా

రైతులకు రుణాలు మాఫీ చేయడానికి ఉద్దేశించిన ప్రజా ధనంలో దాదాపు రెండు వేల కోట్ల రూపాయలు పక్కదారి పట్టాయని, ఇందుకు రాష్ట్ర ప్రభుత్వానిదే బాధ్యత అని కాగ్ అక్షింతలు వేసింది. రైతు రుణ మాఫీలో పెద్ద ఎత్తున కుంభకోణం జరిగిందని కాగ్ ఆరోపించింది.

ఆంధ్ర ప్రదేశ్‌లో మొత్తం 11 వేల కోట్ల రూపాయల మేర రుణ మాఫీకి కేటాయించారు. ఇందులో కనీసం రెండువేల కోట్ల రూపాయలు చేతులు మారాయని కాగ్ నిర్ధారణకు వచ్చింది. ఇందుకు సంబంధించిన నివేదికను కాగ్ ప్రభుత్వానికి అందజేసింది.

ఇంత పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని కాగ్ నిర్ధారించినందువల్ల ప్రభుత్వం వెంటనే ఈ విషయమై వివ రణ ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ ఎం.పి. నామా డిమాండ్ చేశారు.

చేతులు మారింది రూ.2000 కోట్లు

జిల్లా టీడీపీ పరిస్థితులపై తనకు సంపూర్ణ అవగాహన ఉందని, పార్టీకి నష్టం చేకూర్చే వ్యవహారాలు అరికడతానని ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. పామర్రు మండలం కురుమద్దాలిలో 'వస్తున్నా.. మీ కోసం' పాదయాత్ర బసలో సోమవారం ఆయన పెనమలూరు, గన్నవరం నియోజకవర్గాల సమీక్షా సమావేశాలు నిర్వహించారు. పార్టీకి కార్యకర్తలు బలం, శక్తి అని 1983లో అనేక మంది కార్యకర్తలనే ఎన్టీఆర్ గెలిపించి చట్ట సభల్లో కూర్చోపెట్టారన్నారు. టీడీపీలో కుదుపులు కొత్త కాదని, ఒక పర్యాయం ఏడుగురు ఎంపీలు వెళ్ళిపోయినా పార్టీ చెక్కు చెదరలేదన్నారు. ఎన్ని అవాంతరాలు వచ్చినా కార్యకర్తల అండతో పార్టీ పటిష్ఠంగా ఉంటోందన్నారు. పార్టీ కోసం 30 ఏళ్లుగా కార్యకర్తలు అనేక కష్టాలు అనుభవిస్తున్నారని, ప్రాణాలు కూడా పోగొట్టుకుంటున్నారని చెప్పారు.

ఇటువంటి పరిస్థితుల్లో పార్టీని కాపాడుకోవాల్సిన అవసరం వచ్చిందన్నారు. జిల్లా నాయకత్వం ఐదేళ్లుగా పార్టీ కార్యక్రమాలపై దృష్టి పెట్టడం లేదని కొం దరు కార్యకర్తలు చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు. ఇకపై జిల్లా, మండల, గ్రామస్థాయి పార్టీ సమావేశాలు పారదర్శకంగా సాగేలా ప్రణాళిక రూపొందించనున్నట్లు చంద్రబాబు వెల్లడించారు. పీఎసీఎస్, ఎమ్మెల్సీ ఎన్నికల్లో పరాజయాలకు కారణాలను అధినేత దృష్టికి తీసుకెళ్ళారు. జిల్లాలో సమన్వయం లోపం వల్ల కేడీసీసీ బ్యాంక్ చేజారిందని కార్యకర్తలకు సర్దిచెప్పారు. పట్టభద్రుల నియోజకవర్గం విషయంలో పార్టీ నాయకులు ప్రణాళికబద్ధంగా వ్యవహరించకపోవడమే ఓటమికి కారణమని పేర్కొన్నారు.

అయితే అభ్యర్థి చిగురుపాటి వరప్రసాద్ వ్యక్తిగత వైఫల్యమే కారణమని కార్యకర్తలు సమాధానమిచ్చారు. రాజకీయాల్లో నైతిక విలువలు కొరవడి అమ్ముడుపోయే వ్యక్తులను పార్టీలో ఉంచరాదని కార్యకర్తలు పేర్కొనగా, అందరూ శాఖాహారులే, గంపలో రొయ్యలు మాయం అన్న చందంగా రాజకీయాల్లో విపరీత పోకడలు పెచ్చుమీరాయన్నారు. మంచివాడు అనుకుని ప్రోత్సహిస్తే బుద్ధి చెడి అనైతికతకు పాల్పడుతున్నారన్నారు. ఎంపీ కొనకళ్లకు చంద్రబాబు ప్రశంస మచిలీపట్నం ఎంపీ కొనకళ్ల నారాయణరావు అందుబాటులో లేరని ఒక కార్యకర్త ఫిర్యాదు చేయగా అనవసరమైన విషయాల జోలికి వెళ్ళవద్దని వ్యక్తిగత అభిప్రాయాలకు విలువ ఇవ్వవద్దని చెబుతూ కొనకళ్ల పనితీరును చంద్రబాబు ప్రశంసించారు.

జిల్లా నేతలకు క్లాస్ జిల్లాలో కార్యకర్తలను నడిపించే నా యకులే కరువయ్యారని దీంతో కార్యకర్తలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కార్యకర్తలు చంద్రబాబుకు ఫిర్యా దు చేశారు. దీనిపై చంద్రబాబు నాకు అందరి విషయాలు తెలుసు, ఆవలిస్తే పేగులు లెక్కిస్తానని, ప్రజా సమస్యలపై ఎలా పోరాడాలని అనే విషయమై దృష్టి పెట్టాలని హితవు పలికారు. జనాలు కాంగ్రెస్‌కు శాపనార్థా లు పెడుతున్నారని, బూతులు తిడుతున్నారని, కనిపిస్తేనే వారి చొక్కాలు చించడానికి సిద్ధంగా ఉన్నారని చంద్రబాబు అన్నారు. ఈ పరిస్థితుల్లో పార్టీ జిల్లా నాయకత్వం గ్రా మ, మండల, నియోజకవర్గ స్థాయి సదస్సులు నిర్వహించి కార్యకర్తలను సమాయత్తం చేయాలని ఉద్బోధించారు.

జిల్లా టీడీపీని గాడిలో పెడతా

మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు సొంత గడ్డ పామర్రులో సోమవారం టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు పాదయాత్రకు విశేష స్పందన లభించింది. మండల పరిధిలోని కురుమద్దాలి నుంచి ప్రారంభమైన 'వస్తున్నా.. మీ కోసం' పాదయాత్రకు ప్రజలు అడుగడుగునా నీరాజనం పలికారు. ప్రత్యేకించి మహిళలు బారులు తీరి చంద్రబాబు కోసం ఆసక్తిగా ఎదురు చూశారు. పాదయాత్ర మార్గంలోని పామర్రు అస్సెస్సీ పాఠశాల వద్ద క్రైస్తవులు స్వాగతం పలికి ప్రార్థనలు చేశారు. అనంతరం సమీపంలోని అంకమ్మతల్లి దేవాలయ పూజారులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికి ప్రత్యే క పూజలు నిర్వహించారు. అనంతరం ఎన్టీఆర్ విగ్రహం వద్ద జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు.

చంద్రబాబు పాదయాత్ర సందర్భంగా పామర్రు రోడ్లు, ఎన్టీఆర్ సర్కిల్ తోరణాలతో పసుపు మయమయ్యాయి. ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు చంద్రబాబు జిందాబాద్ అంటూహల్‌చల్ చేశా రు. బహిరంగ సభ అనంతరం సదస్సులో విద్యకు సంబంధించిన పలు సమస్యలను ప్రజలు చంద్రబాబు దృష్టికి తీసుకు వచ్చారు. ఆయన వాటి పరిష్కారానికి తగు సూచనలిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ముందు చూపులేకపోవడం వల్ల రాష్ట్రంలో ఈ పరిస్థితు లు దాపురించాయని విమర్శించారు. చంద్రబాబుకు పూలబాట పామర్రులో ప్రవేశించే ముందునుంచి ఆయన నడిచే మార్గంలో బండి పూల బాట ఏర్పాటు చేశారు.

పలు చోట్ల మహిళలు హారతులు ఇచ్చి తిలకం దిద్దారు. పార్టీ కార్యకర్తలు భారీ మోటారుసైకిళ్ళ ర్యాలీ నిర్వహించారు. నియోజకవర్గ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో స్వాగతం పలికి డప్పు వాయిద్యాలతో ఉత్సాహభరితంగా చంద్రబాబుతో అడుగులు కలిపారు. అనంతరం పామర్రు నుంచి బల్లిపర్రు రోడ్డు మీదు గా పెదమద్దాలి, జమీగొల్వేపల్లిల్లో సాగిన పాదయాత్ర కొమరవోలుకు చేరింది. దారి పొడవునా బాబుకు ప్రజలు తమ సమస్యలు మొర పెట్టుకున్నారు.

సర్కారు కరెంట్ బిల్లులతో కాల్చుకు తింటోందని గ్యాస్ ధర మండిస్తోందని చంద్రబాబు వద్ద మహిళలు మొరపెట్టుకున్నారు. తమ ప్రభుత్వం వస్తే కష్టాలు తీరతాయంటూ చంద్రబాబు అభయమిస్తు ముందుకు సాగారు. పామర్రులో పార్టీ కార్యాలయం ప్రారంభం పామర్రు సెంటర్‌లో టీడీపీ కార్యాలయాన్ని చంద్రబాబు సోమవారం ప్రారంభించారు. కార్యకర్తలు ప్రజా సమస్యలను పరిష్కరించించే దిశగా కార్యకర్తలు కృషి చేయాలని ఈ సందర్భంగా బాబు పిలుపునిచ్చారు. వర్ల రామయ్య, మండపాక శంకరబాబు, గొట్టిపాటి లక్ష్మీదాసు, పరిచూరి లాల్‌కిషోర్ పాల్గొన్నారు.

ఎన్టీఆర్ గడ్డపై బాబు యాత్రకు విశేష స్పందన

కూడు, గూడు, గుడ్డ నినాదంతో ఎన్టీఆర్ పేదల పెన్నిదిగా పాటుపడితే కాంగ్రెస్ పెద్దలు గద్దల్లా వారిని పీక్కుతింటున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. వస్తున్నా మీకోసం పాదయాత్రలో భాగంగా ఆయన పామర్రు మండలం బల్లిపర్రులో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అవినీతే తన ప్రథమ శత్రువని, అవినీతి పరుల గుండెల్లో రైళ్ళు పరిగెత్తించాలని కోరారు. ఎన్టీఆర్ యుగపురుషుడని కొనియాడారు. రాష్ట్ర ప్రజల మనస్సు చూరకున్న ఎన్టీఆర్ త్రికరణశుద్ధిగా ఆచరించి పేదల అభ్యున్నతికి పాటు పడ్డారన్నారు.

నిరంతరం ప్రజల్లో ఉండే వ్యక్తిగా ఎన్టీఆర్ మరణించినా చిరస్మరణీయులయ్యారన్నారు. రైతును రైతుగా నిలబెట్టాలని, పేద బడుగు వర్గాల అభ్యున్నతిని కళ్ళారా చూడాలని ఎన్టీఆర్ ఊబలాట పడేవారన్నారు. ఆయన దూర దృష్టితో వ్యవహరించే వారని, తాను కూడా అదే విధానాన్ని కొనసాగిస్తున్నానని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ముందు చూపులేకపోవడం వల్ల రాష్ట్రం అధోగతి పాలవుతుందని విమర్శించారు.

ఎన్టీఆర్ పాతిన జెండాను ఆవిష్కరించడం నా అదృష్టం అనంతరం ఆయన పెదమద్దాలిలోని ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. అక్క డ టీడీపీ జెండాను ఆవిష్కరించారు. ఎన్టీఆర్ పాతిన జెండాను తాను ఆవిష్కరించడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. మా అత్తగారి గ్రామానికి పక్క ఊరైన పెదమద్దాలి అనేక మంది ప్రముఖులకు జన్మనిచ్చిందన్నారు. ప్రభుత్వ చీఫ్ సెక్రటరీగా, రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా చేసిన కాకి మాధవరావు పెదమద్దాలి గ్రామానికి చెందడం ఇక్కడి వారి అదృష్టమన్నారు. ఇదే గ్రామానికి చెందిన సుజనా చౌదరికి ఎంపీ పదవి ఇచ్చి గౌరవించామన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ పాలనలో రైతులు, వెనుకబడిన వర్గాలు, మహిళలు ఆనందంగా లేరన్నారు. కరెంట్ బిల్లులు చేస్తే గుండె జారిపోతోందన్నారు. టీడీపీ హయాంలో రూ.12 ఉండే కిలో చక్కెర రూ.46కు పెరిగిందన్నారు.

పప్పు రూ.22 నుంచి రూ.80కి పెరిగిందన్నారు. ఉప్పు రూ.2 నుంచి రూ.10కి పెరిగిందన్నారు. నీరుల్లి రూ.4నుంచి రూ.40కి పెరిగిందన్నారు. కష్టాలు ప్రజలకు, సుఖాలు కాంగ్రెస్ దొంగలకు దక్కుతున్నాయన్నారు. ప్రజలకు తుక్కు బెల్లాలు పెట్టిన వైఎస్ కొడుక్కి లక్ష కోట్లు దోచి పెట్టారన్నారు. ఈ పరిస్థితుల వల్ల సామాన్యుడు చితికి పోతున్నాడని, ప్రజలు అవినీతి పరుల గుండెల్లో నిద్రపోవాలని పేర్కొన్నారు. అనంత రం పాదయాత్ర జమీగొల్వేపల్లి మీద గా కొమరవోలుకు చేరింది. కొమరవోలులో చంద్రబాబు ప్రసంగించారు.

అవినీతటే ప్రథమ శత్రువు