March 1, 2013

ఎన్ని అవాంతరాలు సృష్టించినా తెలుగుదేశం పార్టీ డీసీసీబీ, డీసీఎంఎస్‌లను సునాయాసంగా గెలుచుకుంది. ఊహించని విధంగా ఆ పార్టీ అభ్యర్థులకు 75 నుంచి 80 చొప్పున ఓట్లు వచ్చా యి. కాంగ్రెస్ 52 సొసైటీలలో గెలుపొందినా డీసీసీబీ, డీసీఎంఎస్ ఎన్నికల్లో పూర్తి స్థాయిలో ఓట్లు వేయించుకోలేకపోయింది. మొదటి నుంచి టీడీపీ బలంగా ఉన్న సొసైటీలకు ఎన్నికలు జరగకుండా అధికార పార్టీ నే తలు అవాంతరాలు సృష్టించారు.

నూ తక్కి సొసైటీకి నామినేషన్ల ఉపసంహరణ పూర్తి అయ్యి అధ్యక్షుడిని ఎన్నుకోబోయే సమయంలో మంత్రి కాసు వెం కటకృష్ణారెడ్డి స్టేఇచ్చి నవ్వులపాలయ్యా రు. ఓటర్ల చేర్పుల సమయం నుంచి ఎన్నిక పూర్తి అయ్యే వరకు టీడీపీ నేత లు, కార్యకర్తలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ లు, ఎంపిీలు, మాజీ మంత్రులు, నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌లు ఐకమత్యంగా ముం దుకు కదిలారు. డీసీసీబీ, డీసీఎంఎస్‌లను సునాయాసంగా గెలుచుకున్నారు.

ఫలించిన ముమ్మనేని ప్రయోగం సహకార ఎన్నికలు ప్రకటించిన తరువాత కాంగ్రెస్ డీసీసీబీ, డీసీఎంఎస్‌లను నిలబెట్టుకుంటుందని భావించారు. టీడీపీకి 50 సొసైటీలు వచ్చే అవకాశం ఉందనుకున్నారు. ఈ దశ లో చైర్మన్ పదవి కోసం అంతగా ఆసక్తి చూపలేదు. ఒక దశలో పెదకూరపాడు బుజ్జి చైర్మన్ పదవిని ఆశించి పరసతాళ్లూరు సొసైటీలో అధ్యక్షుడుగా గెలుపొందటానికి ప్లాన్ చేసుకున్నారు. ఈ దశలో ఊహించని విధంగా ముమ్మనేని వెంకట సుబ్బ య్య పేరు తెరపైకి వచ్చింది. జంపని షుగర్ ఫ్యాక్టరీ చైర్మన్‌గా, ఆదర్శ రైతుగా, ఇంజనీరింగ్ విద్యా వేత్తగా ఆయనకు పేరుంది.

దీంతో పాటు రెండు సార్లు ఎమ్మెల్యేగా పని చేశారు. 1989-2004 మధ్య నాలుగుసార్లు రేపల్లెలో పోటీ చేశారు. నియోజకవర్గాల పునర్విభజన తరువాత కూచినపూడి రద్దయింది. దీంతో రేపల్లెను బీసీలకు కేటాయించాల్సి వచ్చింది. భవిష్యత్తులో కూడా వెంకట సుబ్బయ్యకు పోటీ చేసే అవకాశం లేదు. వీటన్నింటిని పరిశీలించిన సీనియర్ నేత లు ఆర్థికంగా బలవంతుడైన వెంకట సుబ్బయ్యను అభ్యర్థిగా ప్రకటించింది. వ్యవసాయంపై మక్కువతో ఆయన ఇప్పటికీ పెసర్లంకలోనే ఉంటున్నారు. వెంకటసుబ్బయ్య అభ్యర్థిత్వం ప్రకటించిన తరువాత పార్టీ నేతలంతా ఐకమత్యంగా పని చేశారు. ఎన్నికల ముందే కొన్ని సొసైటీలకు ఆర్థిక వనరులు సమకూర్చారు. మొత్తం మీద వెంకట సుబ్బ య్య ప్రయోగం ఫలించింది.

ఉపయోగపడిన చంద్రబాబు పాదయాత్ర

తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు చం ద్రబాబు నాయుడు సహకార ఎన్నికల సమయంలోనే జిల్లాలో పాదయాత్ర నిర్వహించారు. దీంతో ఆ ప్రాంతంలో పార్టీకి మంచి ఊపు వచ్చింది. సహకార ఎన్నికల్లో నేతలు ఐకమత్యంగా పని చేసే విధంగా చంద్రబాబు అప్రమత్తం చేశారు. 63 ఏళ్ల వయసులో చంద్రబాబు పాదయాత్ర చేస్తూ పార్టీని ఉత్సాహ పరుస్తున్నా నేతల్లో కదలిక లేదంటూ కార్యకర్తలు అప్రమత్తం అయ్యారు.

న్యాయ పోరాటానికి దిగిన దేశం

అధికార పార్టీ న్యాయ బద్ధంగా డీసీసీబీ, డీసీఎంఎస్‌లను గెలవలేమని భావించింది. మంత్రి కాసు ద్వారా 13 సంఘాలకు స్టే ఇచ్చారు. దీనిని తెలుగుదేశం నేతలు న్యాయ బద్ధంగా ఎదుర్కొన్నారు. హైకోర్టులో ఫిర్యాదు చేసి డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్ల ఎన్నికల వాయి దా వేయించారు. దీంతో తెలుగుదేశంలో నైతిక బలం పెరిగింది. కాంగ్రెస్ నేతలు టీడీపీని ఎదుర్కోవటానికి అనేక ప్రయత్నాలు చేశారు. వాటన్నింటిని చాకచక్యంగా తిప్పి కొట్టారు. సొసైటీ అధ్యక్షులతో చంద్రబాబు నేరుగా చర్చించి డీసీసీబీ, డీసీఎంఎస్ ఎన్నికలపై న్యాయ పో రాటానికి సిద్ధం చేశారు. ఈ దశలో అధికార పార్టీ ఎన్నికల తేదీని ప్రకటించింది.

క్యాంప్‌ల నిర్వహణతో లబ్ధి టిడిపి క్యాంప్‌లు ఏర్పాటు చేసి లబ్ధి పొందింది. కాంగ్రెస్ కర్నూలులో క్యాంప్ ఏర్పాటు చేస్తే టిడిపి విజయవాడలోని భవానీ ద్వీపంలో విడది చేసింది. ఒక దశలో ఎన్నికలు వాయిదా పడటం తో క్యాంపును క్లోజ్ చేశారు.

వెంటనే ఎ న్నికల తేదీ ఖరారు కావడంతో మరలా క్యాంప్ ఏర్పాటు చేశారు. విజయవాడలోని ముమ్మనేని వెంకట సుబ్బయ్య వియ్యంకుని హోటల్‌లో క్యాంప్ కొనసాగించారు. క్యాంప్‌లో ఎంత మంది ఉన్నా రు, బయట ఉన్న వారిలో పార్టీ సొసైటీ అధ్యక్షులు ఎంత మంది, మాజిక్ ఫిగర్ ఎంత, శత్రు శిబిరం నుంచి ఎన్ని ఓట్లు కొ నుగోలు చేయాలి అనే అంశంపై సుదీర్ఘం గా కసరత్తు చేశారు. జిల్లా అధ్యక్షుడు పు ల్లారావు, మాజీ మంత్రి ఆలపాటి, ఎమ్మెల్యేలు కొమ్మాలపాటి, ధూళిపాళ్ల, శివ శక్తి ఆంజనేయులు, నక్కా ఆనందబాబు, యరపతినేనిలు ఎప్పటికప్పుడు క్యాంప్ కు వెళ్ళి అధ్యక్షులకు అండగా ఉన్నారు. మరో వైపు ఎమ్మెల్సీ రాజకుమారి కూడా క్యాంప్‌ను పరిశీలిస్తూ కాం గ్రెస్ కుయుక్తల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.

కాంగ్రెస్ క్యాంప్‌లో ఉన్న కొంత మంది సొసైటీ అధ్యక్షులకు ఆర్థిక వనరులు సమకూర్చారు. ఛైర్మన్ పదవుల కోసం కాంగ్రెస్ నేతలు మాజీ ఎమ్మెల్యే గుదిబండి ద్వారా ప్రయత్నాలు చేస్తున్నారని పసికట్టా రు. వాటికి విరుగుడుగా మాజీ మంత్రి ఆలపాటి తన శిష్య గణం ద్వారా వైఎస్ ఆర్ సిపిలో ఒక వర్గంతో మంతనాలు జరిపారు. ఓట్లు చేర్పుల సమయంలో అధికారులు, కార్యదర్శులు పెట్టిన ఇబ్బందులను అధిగమించారు. ఇక్కు ర్రు, నందిరాజుపాలెం సొసైటీ అధ్యక్షులపై పోలీసులు కేసు నమోదు చేసినా తెలుగుదేశం నేతలు జంకలేదు. రెండు నెలల పాటు చేసిన సుధీర్ఘ పోరాటంతో రెండు జిల్లా స్థాయి ఛైర్మన్ పదవులను కైవసం చేసుకున్నారు.

దేశమే గెలిచంది

జీడీసీసీ, డీసీఎంఎస్‌ల ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించడంతో ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్సా హం ఉరకలేస్తోంది. శుక్రవారం జిల్లా కేంద్రంలో జరిగిన ఎన్నికల్లో ఒక్క డైరెక్టర్ మినహా అన్ని స్థానాల్లోనూ టీడీపీ అభ్యర్థులే విజయదుందుబి మోగించడంతో నాయకులు, కార్యకర్తల్లో ఆనందోత్సాహాలు అంబరాన్నంటాయి. గెలుపు పరిపూర్ణం కాగానే అందరూ ఎన్‌టీఆర్ భవన్‌కు చేరుకొని విజయానందాన్ని పరస్పరం పంచుకొన్నారు.

పార్టీ అభ్యర్థుల గెలుపులో కీలక పాత్ర పోషించిన టీడీపీ జిల్లా అధ్యక్షుడు ప్రత్తిపాటి పుల్లారావును నాయకులు, కార్యకర్తలు అభినందించారు.

సహకార ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన రోజు నుంచి ఎలాగైనా సరే జీడీసీసీ, డీసీఎంఎస్‌లపై తెలుగుదేశం పార్టీ జెండా ఎగిరేలా చేసేందుకు పార్టీ జిల్లా అధ్యక్షుడు పుల్లారావు నాయకత్వంలో పకడ్బందీగా వ్యూహాలు రూపొందించి నేతలు విజయవంతంగా అమలు చేశారు. పార్టీ అధినేత చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్‌లో జారీ చేసిన ఆదేశాలను ఎప్పటికప్పుడు ఆచరణలో పెట్టారు. తరచుగా నేతలంతా సమావేశమౌతూ లోపాలను సవరించారు. ఎన్నికల ప్రక్రియలో అక్రమాలను ఎండగట్టారు.

అక్రమాలపై రాష్ట్ర స్థాయిలో 'కోడెల' పోరాటం

సహకార ఎన్నికల్లో మంత్రి కాసు కృష్ణారెడ్డి అక్రమాలకు మాజీ మంత్రి డాక్టర్ కోడెల శివప్రసాదరావు పెద్ద ఉద్యమమే చేశారు. నరసరావుపేటలో మంత్రి కాసు కృష్ణారెడ్డి ఇంటిని ముట్టడించిన ఉదంతం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టించింది. ఆ సంఘటనలో కోడెలతో పాటు టీడీపీ నాయకులు, కార్యకర్తలపై పోలీసులు లాఠీలు ఝుళిపించడంపై సర్వత్రా వ్యతిరేకత వ్యక్తమైంది.

ఆ సంఘటనతో నాయకులంతా ఒక్కటయ్యారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నరసరావుపేట ఎంపీ మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి, ఎమ్మెల్యేలు పుల్లారావు, ధూళిపాళ్ల నరేంద్రకుమార్, యరపతినేని శ్రీనివాసరావు, కొమ్మాలపాటి శ్రీధర్, జీ వీ ఆంజనేయులు, నక్కా ఆనంద్‌బాబు, మాజీ మంత్రులు ఆలపాటి రాజేంద్రప్రసాద్, జే ఆర్ పుష్పరాజ్, ఎమ్మెల్సీ నన్నపనేని రాజకుమారి ఉద్యమించి కార్యకర్తల్లో స్ఫూర్తి నింపారు.

ఒకవైపు పాదయాత్ర... మరోవైపు సహకారం

సహకార ఎన్నికలు జరిగే నాటికి చంద్రబాబు 'వస్తున్నా... మీకోసం' పాదయాత్ర జిల్లాలోకి ప్రవేశించింది. దాంతో పుల్లారావుతో సహా ఇతర నాయకులు చంద్రబాబు వెంట నడుస్తూనే మరోవైపు విరామ సమయంలో జిల్లా కేంద్రానికి చేరుకొని సహకార ఎన్నికల పర్యవేక్షించారు. చంద్రబాబు ప్రత్యేకించి ఎమ్మెల్యేలు, సహకార అధ్యక్షులు, ఇన్‌చార్జ్‌లతో సమావేశం నిర్వహించి ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాన్ని నిర్దేశించి. ఆ ప్రకారం వ్యూహాన్ని అమలు చేసి విజయం సాధించడంలో ప్రత్తిపాటి, కోడెల, ఆలపాటి, ధూళిపాళ్ల, యరపతినేని కీలకభూమిక పోషించారు. మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ క్యాంపు బాధ్యతలను తీసుకొని సమర్థవంతంగా నిర్వర్తించారు.

చంద్రబాబుతో ఫోన్‌లో మాట్లాడిన నాయకులు

జీడీసీసీ, డీసీఎంఎస్ ఎన్నికల్లో గెలుపొందిన వెంటనే పార్టీ జిల్లా నాయకులు కృష్ణాజిల్లా పర్యటనలో ఉన్న చంద్రబాబుకు ఫోన్ చేసి సమాచారం చేరవేశారు. తొలుత పుల్లారావు ఫోన్‌లో మాట్లాడి అందరం సమష్టిగా పని చేసి విజయం సాధించామన్నారు. చంద్రబాబు ఫోన్‌లోనే పార్టీ విజయానికి కృషి చేసిన నాయకులందరిని అభినందించారు. రా బోయే ఎన్నికలకు ఇదే నాంది అని చెప్పా రు. ఇదే పోరాట స్ఫూర్తిని రానున్న ప్రతీ ఎన్నికల్లో గెలిపించాలని సూచించారు.

నేడు 'బాబు' వద్దకు నాయకులు, సొసైటీల అధ్యక్షులు తెనాలి సెంట్రల్ బ్యాంక్‌లో శనివారం ఉదయం ఉదయం 9 గంటలకు జరిగే సమావేశానికి టీడీపీ జిల్లా నాయకులు, సహకార సంఘాల అధ్యక్షులు తప్పక హాజరు కావాలని ఛైర్మన్ పదవి అభ్యర్థి ముమ్మనేని వెంకట సుబ్బయ్య విజ్ఞప్తి చేశారు. సమావేశం తర్వాత అందరూ కలిసి కృష్ణా జిల్లాలో పాదయాత్ర కొనసాగిస్తోన్న చంద్రబాబు వద్దకు వెళ్ళాల్సి ఉంటుందన్నారు. తన విజయానికి కృషి చేసిన నేతలందరికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

టీడీపీ శ్రేణుల విజయనాదం


రైతులకు పంటలు చేతికి అందే సమయంలో సాగునీటిని విడుదల చేసి రైతులను ఆదుకోవాలని టీడీపీ జిల్లా అధ్యక్షుడు ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. శుక్రవారం జిల్లా పార్టీ కార్యాలయంలో పార్టీ నేతలతో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ డెల్టా ప్రాంతంలో మొక్కజొన్న, పసుపు వంటి వాణిజ్య పంటలకు ప్రస్తుతం నీటి అవసరం ఎంతైనా ఉందన్నారు. నీటిని విడుదల చేయకపోతే పంట నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అటు వ్యవసాయం, పారిశ్రామిక అభివృద్దికి కారణమైన విద్యుత్ రంగాన్ని దివాలా తీయించారన్నారు. ముందు చూపు లేకుండా అప్పటి వైయస్, ప్రస్తుత కిరణ్‌ల నిర్వాహకమే దీనికి కారణమన్నారు. అవినీతి, అసమర్దులు రాజ్యమేలితే ఎలా ఉంటుందో చూస్తున్నామన్నారు.

మాజీ మంత్రి జె ఆర్ పుష్పరాజ్ మాట్లాడుతూ టీడీపీ హయాంలో ర్రాష్టానికి అంతర్జాతీయ ఖ్యాతిని తెస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం స్కామ్స్ క్యాపిటల్ ఆప్ ఇండియాగా మార్చారన్నారు. తక్షణమే పంటలకు సరిపడా నీరు అందజేసి విద్యుత్ కోతలను ఎత్తివేయకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ముక్త కంఠంతో తీర్మానించారు. కార్యక్రమంలో మాజీ మంత్రి ఆలపాటి, ఎమ్మెల్సీ నన్నపనేని రాజకుమారి, ఎమ్మెల్యేలు యరపతినేని శ్రీనివాసరావు, జీ వియస్ ఆంజనేయులు, కొమ్మాలపాటి శ్రీధర్, మాజీ శాసనసభ్యులు ముమ్మనేని వెంకటసుబ్బయ్య, ఎస్ ఎం జియావుద్దీన్, నియోజక వర్గ ఇన్‌చార్జిలు తెనాలి శ్రావణ్‌కుమార్, అనగాని సత్యప్రసాద్, కందుకూరి వీరయ్య, చుక్కా ఏసురత్నం, దాసరి రాజా మాస్టర్, బోనబోయిన శ్రీనివాస యాదవ్, గుంటుపల్లి నాగేశ్వరరావు, కార్యదర్శులు వెన్నా సాంబశివారెడ్డి, తాతా జయప్రకాశ్ నారాయణ, దామచర్ల శ్రీనివాసరావు, చిట్టాబత్తిన చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు.

సాగు,తాగునీరు వెంటనే విడుదల చేయాలి

పరీక్షలనేవి ఏదో ఒక పాఠ్యాంశానికి పరిమితం. కానీ, పిల్లల భవిష్యత్తుకు ఇది పరీక్షా కాలం. పేద పిల్లలు..ఆడపిల్లలు.. బడి దాకా రావడమే కష్టం. ఇంటా బయట సమస్యలు ఎదుర్కొంటూనే పదో తరగతి దాకో, ఇంటర్ దాకో చేరుకున్న వీరికి దారి చూపించాల్సిన వారే.. ఇప్పుడు ఆ దారిలో దీపం ఆర్పేస్తున్నారు. వారి ప్రయాణాన్ని అంధకారం చేసేస్తున్నారు. కన్నవారికి, ఉన్న ఊరికి వెలుగులు తీసుకువద్దామని ఆశపడుతున్న ఈ పిల్లలను గుడ్డి దీపాల కిందకు నెట్టేస్తున్నారు. ఎప్పుడు వస్తుందో తెలియని కరెంటులాగే..వీళ్ల ఉజ్వల జీవితాన్ని డోలాయమానంలో పడేస్తున్నారు. ఏ అపరాత్రో వచ్చే కరెంటు కోసం పొలంలో ఆ తండ్రి.. దీపం బుడ్డి ముందు కునికిపాట్లు పడుతూ ఆ కొడుకు.. వారిద్దరి కోసం కళ్లు పత్తికాయలు చేసుకొని ఆ తల్లి.. కొడాలి ప్రాంతంలోని ఆ చీకటి పల్లెల్లో నేను ఎక్కిన ప్రతి గడపలో కనిపించిన దృశ్యమిదే!

మొవ్వ చేరుకోగానే మొదట ఆ వృద్ధుడే నన్ను ఆకర్షించాడు. బాగా నడుం వంగిపోయి కనిపించాడు. ఆయన చేతికి కర్ర.. ఆ కర్రపై రెపరెపలాడుతున్న మా పార్టీ జెండా.. సహజంగానే ఆసక్తి కలిగింది. దగ్గరకు వెళ్లాను. వృద్ధాప్య పింఛను దగ్గర నుంచి వృద్ధ శరణాలయం దాకా.. ఆ వయసులో ఉండే సమస్యలన్నీ ఏకరువు పెట్టాను. కుటుంబంలో కొడుకూకోడళ్ల ఆదరణ గురించీ ఆరా తీశాను. కానీ, అవేవీ ఆయనను ఉత్సాహపరచలేదు. ఇప్పటిదాకా నాకు వినిపించిన ఈ సమస్యలేవీ ఆయనను బాధిస్తున్నట్టు కనిపించలేదు. కానీ, కాస్త బెంగయితే కనిపించింది. అడగ్గా అడగ్గా మనసులో కోరిక బయటపెట్టాడు. " నాకేం వద్దయ్యా.. మన పార్టీ తిరిగి అధికారంలోకి వస్తే చాలు.. అన్ని సమస్యలూ అవే తీరిపోతాయి'' అని చెప్పుకొచ్చాడు. నిజంగానే ఎంత పెద్ద మనసు!

నిజంగా ఎంత పెద్ద మనసు!

గుర్రపుడెక్కలు.. ఆ నేతలు!
ఎప్పటికీ ఆ మురుగ్గుంటలోనే...
వాటాలుగా రాష్ట్రం స్వాహా
ఫైళ్లను శాసిస్తున్న ఆయన తమ్ముళ్లు
కృష్ణాజిల్లా పాదయాత్రలో చంద్రబాబు నిప్పులు
పార్టీకి నష్టం తెస్తే సహించను
జగయ్యపేట కార్యకర్తల సమీక్షలో హెచ్చరిక

కాంగ్రెస్ నేతలు రాష్ట్రాన్ని వాటాలేసుకుని తింటున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. రాష్ట్రాన్ని దోచుకుతినటం వైఎస్ నేర్పగా, కిరణ్ ఆ పాలసీని చక్కగా అమలు చేస్తున్నారని విమర్శించారు. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం వేములపల్లి వద్ద పాదయాత్రను ఆయన ప్రారంభించారు.

కొడాలి, మొవ్వ, కూచిపూడి వరకు నడిచారు. ఈ సందర్భంగా కొడాలి సెంటర్‌లో జరిగిన బహిరంగసభలో కాంగ్రెస్ నేతలను తూర్పారపడ్డారు. మురుగుకాల్వల్లోని గుర్రపుడెక్క తొలగించటం ఎంత కష్టమో కాంగ్రెస్ నాయకులు చేస్తున్న అవినీతిని అరికట్టడం అంత కష్టమని తెలిపారు. మండల స్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకూ వాటాలుగా దోచుకుతింటున్నారని దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ ఇద్దరు తమ్ముళ్లు రాష్ట్రాన్ని చెరోపక్క నుంచి దోచుకుంటున్నారని విమర్శించారు. వారికి డబ్బులు ఇవ్వనిదే ఏ ఫైలూ కదలటంలేదన్నారు. వైఎస్ బంధువులు దేశంపై పడ్డారని మండిపడ్డారు. "కేరెక్టర్ లేని అనిల్ కుమార్ క్రైస్తవ మతాన్ని కించపరుస్తున్నారు. బయ్యారం గనులు, హైదరాబాద్‌లో వందల కోట్లు విలువైన భూములు కబ్జాచేశారు. వైఎస్ బావమరిది, మాజీ మేయర్ కడపలో అరాచకాలు చేస్తున్నారు.

ఫోర్జరీ సంతకాలు చేసిన కేసులో ఆయనను పోలీసులు విచారిస్తున్నారు. వైఎస్ బతికిఉండగానే భారీగా ఎర్రచందనం స్మగ్లింగ్ చేసిన ఘనత ఆయనదే. ఏ ముఖ్యమంత్రి కొడుకూ చేయని అరాచకాలు జగన్ చేశారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని దొంగ కన్నీళ్లు పెట్టి జనం సొమ్ము దోచుకున్నారు'' అని దుమ్మెత్తిపోశారు. పెట్రోలు ధరలను మళ్ళీ పెంచటం దారుణమన్నారు. కాగా, రోజువారీ సమీక్షల్లో భాగంగా శుక్రవారం విజయవాడ సెంట్రల్, జగ్గయ్యపేట నియోజకవర్గ కార్యకర్తలను కలిశారు. పార్టీకి నష్టం చేసే పరిస్థితికి ఎవరైనా వస్తే కఠిన నిర్ణయాలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యకర్తలంతా సంవత్సరంపాటు కష్టపడి పనిచే స్తే, వారి అభివృద్ధి తాను చూస్తానని భరోసానిచ్చారు.

అనంతరం మొవ్వలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. తల్లి కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్‌లు రాయబారాలు నడుపుకుంటూ చీకటి ఒప్పందాలకు సిద్ధమయ్యాయని, నేడో...రేపో ఏదో ఒకరోజు కలవటం తథ్యమని పేర్కొన్నారు. వైకుంఠపాళిలో తన కుమారుడిని నిచ్చెన ఎక్కించి ప్రజలను పాములకు పట్టించిన ఘనుడు వైఎస్ అని ఈ సందర్భంగా దుయ్యబట్టారు. తెలుగుదేశం పార్టీకి హైకమాండ్ అనేది లేదనీ, ప్రజలే హైకమాండ్ అని తెలిపారు. ఆ తరువాత పార్టీ బీసీ విభాగం నిర్వహించిన చైతన్య సదస్సులో ఆయన పాల్గొన్నారు. బీసీ రిజర్వేషన్ల కోసం పార్లమెంటులో పోరాడతామని ఆయన హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా బీసీ నేతలు చంద్రబాబుకు కత్తీ డాలును బహూకరించారు.

వైఎస్ దోపిడీ వారసుడు కిరణే!

వైఎస్ అవినీతి పాలసీని కిరణ్ అమలు చేస్తున్నారు
వైఎస్ కొడుకు, అల్లుడు, బావమరిది అందరూ దోచుకున్నారు
నేడు అదే బాటలో కిరణ్ తమ్ముళ్ళు : చంద్రబాబు

కాంగ్రెస్ నేతలు రాష్ట్రాన్ని వాటాలేసుకుని తింటున్నారని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. రాష్ట్రాన్ని దోచుకుతినటం వైఎస్ నేర్పగా, కిరణ్ ఆ పాలసీని చక్కగా అమలు చేస్తున్నారని విమర్శించారు. మండల స్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకూ కాంగ్రెస్ నాయకులు వాటాలుగా దోచుకుతింటున్నారని అన్నారు.

'వస్తున్నా... మీకోసం' పాదయాత్ర 151వ రోజు కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో శుక్రవారం జరిగింది. గురువారం రాత్రి వేములపల్లిలో బస చేసిన చంద్రబాబు శుక్రవారం సాయంత్రం అక్కడి నుంచి ఘంటసాల మండలం కొడాలి సెంటర్ వరకు 3.3 కిలోమీటర్ల పాదయాత్ర చేసి అక్కడ జరిగిన బహిరంగసభలో మాట్లాడారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ ఇద్దరు తమ్ముళ్ళు రాష్ట్రాన్ని చోరోపక్క నుంచి దోచుకుంటున్నారన్నారు. డబ్బులు వారికి ఇవ్వనిదే ఏ ఫైలూ కదలటంలేదన్నారు. మురుగుకాల్వల్లో ఉండే గుర్రపుడెక్క తొలగించటం ఎంత కష్టమో కాంగ్రెస్ నాయకులు చేస్తున్న అవినీతిని అరికట్టడం అంత కష్టమని ఆయన తెలిపారు.

వైఎస్ బంధువులు దేశంలో పడ్డారన్నీ, కులాన్ని, మతాన్ని అడ్డం పెట్టుకుని పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారని చంద్రబాబు నాయుడు చెప్పారు. క్యారెక్టర్ లేని అనిల్ కుమార్ క్రైస్తవ మతాన్ని కించపరుస్తున్నారనీ, బయ్యారం గనులు, హైదరాబాద్‌లో వందల కోట్లు విలువైన భూములు కబ్జాచేయటం ఆయన వ్యక్తిత్వానికి నిదర్శనమన్నారు. వైఎస్ బావమరిది, మాజీ మేయర్ కడపలో అరాచకాలు చేస్తున్నారనీ, ఫోర్జరీ సంతకాలు చేసిన కేసులో ఆయనను పోలీసులు విచారిస్తున్నారని తెలిపారు. వైఎస్ బతికి ఉండగానే భారీగా ఎర్రచందనం స్మగ్లింగ్ చేసిన ఘనత ఆయనదన్నారు. గతంలో ఏ ముఖ్యమంత్రి కొడుకూ చేయని అరాచకాలు వైఎస్ తనయుడు చేశారన్నారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని దొంగ కన్నీళ్ళు పెట్టి జనం సొమ్ము దోచుకున్నారని అన్నారు.

పెట్రోలు ధరలను మళ్ళీ పెంచటం దారుణమనీ, ఫలితంగా నిత్యావసర ధరలు పెరిగి సామాన్యులు కష్టాలు పడాల్సి వస్తుందని చంద్రబాబు నాయుడు అన్నారు. ఏప్రిల్ నెలలో సర్‌ఛార్జీల భారాన్ని ప్రజలనెత్తిన వేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. రాష్ట్రంలో టీడీపీకి 42 మంది ఎంపీలను గెలిపిస్తే గ్యాస్ ధరలను తగ్గిస్తామని చంద్రబాబు ప్రజలకు హామీ ఇచ్చారు.

రాష్ట్రాన్ని వాటాలేసుకుని తినేశారు

వస్తున్నా..మీకోసం పాదయాత్రలో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబునాయుడిని పార్టీ నేత అయ్యన్నపాత్రుడు శుక్రవారం ఉదయం కలుసుకున్నారు. విశాఖ జిల్లాలో నేతల మధ్య వివాదం విషయంలో త్రిసభ్య కమిటీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని, టీడీపీని వీడుతానని వస్తున్న వార్తలు అవాస్తవమని అయ్యన్నపాత్రుడు పేర్కొన్నారు.

చంద్రబాబును కలిసిన అయ్యన్నపాత్రుడు

'వస్తున్నా..మీకోసం' పాదయాత్ర ముగింపు సందర్భంగా తమ అధినేత చంద్రబాబు ప్రకటించిన గుంటూరు డిక్లరేషన్‌లో పేర్కొన్న హామీలన్నింటిని నెరవేరుస్తామని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు ప్రత్తిపాటి పుల్లారావు స్పష్టం చేశారు. గురువారం తెదేపా జిల్లా కార్యాలయంలో విలేఖర్ల సమావేశంలో ఆయ న మాట్లాడుతూ జిల్లాలో 201 కిలోమీటర్ల దూరం పాదయాత్ర చేసిన చంద్రబా బు 165 గ్రామాలు, నాలుగు మునిసిపాలిటీలు, గుంటూరు కార్పొరేషన్ పరిధి లో లక్షల మంది ప్రజలను కలుసుకొని వారి సమస్యలు తెలుసుకొన్నారని చెప్పా రు. ఆ సమస్యలపై ఎక్కడికక్కడ స్పం దించి తాము అధికారంలోకి వస్తే ఏమి చేసేది స్పష్టంగా చెప్పారన్నారు.

22 రోజుల పాటు జరిగిన పాదయాత్రను విజయవం తం చేసిన జిల్లా ప్రజానీకానికి, టీడీపీ నాయకులు, కార్యకర్తలకు పు ల్లారావు కృతజ్ఞతలు తెలిపా రు. పాదయాత్రలో ఎక్కడికెళ్లినా రైతులు సాగునీటి సమస్యను ప్రస్తావించారని, దానిపై తాము ఆందోళనలు కొనసాగిస్తామన్నారు. సా గర్, డెల్టా ఆయకట్టులో ఆరుతడి పం టలకు సాగునీరు విడుదల చేయించేవరకు పోరాడుతుమన్నారు. ప్రజాస్వా మ్య పద్ధతిలో జీడీసీసీ, డీసీఎంఎస్‌ల ఎన్నికలు నిర్వహించాలన్న చిత్తశుద్ధి కాంగ్రెస్ పార్టీకి లేదు. టీడీపీకి స్పష్టమైన సంఖ్యాబలం ఉన్నా కాంగ్రెస్ ప్రలోభాలకు గురి చేస్తూ గిమ్మికులకు పాల్పడుతోంది. మా పార్టీ సహకార అధ్యక్షులెవరూ వాళ్లకు లొంగరని పుల్లారావు ధీమా వ్యక్తం చేశారు. వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు మాట్లాడుతూ డెల్టా రైతులకు తక్షణం మరో తడికి నీరు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే రూ.500 కోట్ల విలువైన మొక్కజొన్న, మినుము పంట ఎండిపోతుందన్నా రు. నూటికి 70 మంది కౌలురైతులు ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం మీనమేషాలు లెక్కించరాదన్నారు.

సహకార ఎన్నికల్లో కాంగ్రెస్, వైసీపీ నిజాయితీగా పాల్గొనాలని డిమాండ్ చేశారు. సమావేశంలో గురజాల ఎమ్మెల్యే య రపతినేని శ్రీనివాసరావు, టీడీపీ జిల్లా నాయకులు మన్నవ సుబ్బారావు, యాగంటి దుర్గారావు, నిమ్మకాయల రాజనారాయణ, మానుకొండ శివప్రసాద్, ఎస్ఎల్ వజీర్, చంద్రగిరి ఏడుకొండలు పాల్గొన్నారు.

పాదయాత్ర హామీలు నెరవేరుస్తాం