February 24, 2013

పల్లెలు దేశానికి పట్టుగొమ్మలు అంటారు. పల్లెలను చూసి దేశం గురించి చెప్పొచ్చునని కూడా చెబుతారు. కానీ, పల్లెలకు ఈ దేశంతో సంబంధం తెగిపోయిందా అనే అనుమా నం కలుగుతోంది. ఒకప్పుడు ఈ సీమలు జ్ఞానానికి, స్ఫూర్తికి నిలయాలు. ఐతే ఇప్పుడవి ఆకలికి ఆలవాలాలు. నిరుద్యోగానికి నిలువెత్తు నిదర్శనాలు. పేదరికానికి ప్రతిధ్వనులు. పేటేరునే కాదు.. ఏ పల్లెను చూసినా అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నాయి. తెలుగుదేశం హయాంలో చేసిన అభివృద్ధి గుర్తులు తప్ప మరే దాఖలా కనిపించలేదు. సిమెంట్ రోడ్లు, రక్షిత మంచినీటి పథకాలు, పాఠశాల భవనాలు తదితరాలన్నీ పల్లెల పట్ల అప్పటి నా ప్రభుత్వానికి ఉన్న శ్రద్ధకు సూచికలు! పేటేరు.. పేదల, బడుగుల ఊరు..గీత కార్మికులు, నేతన్నల జనాభా ఎక్కువ.

ఒకరకంగా మాకు సంప్రదాయ ఓటుబ్యాంకు. పాలకులు వాళ్లపై కక్ష కట్టడానికి ఇంతకుమించిన కారణం ఏమి కావాలి? ఇందిరమ్మ ఇళ్ల నుంచి పెన్షన్ల వరకు మొండిచెయ్యి చూపారట. రాజకీయ వివక్ష చూపించారట. గీత కార్మికుల ఉపాధికి ఆధారం లేదట. కులవృత్తులు, చేతివృత్తులు అంతరించిపోయే దశకు వచ్చాయని చెప్పుకొని జనం వాపోయారు. భూములు తనఖాకు పోకుండా భార్యల తాళ్లను రైతులు అడ్డం వేస్తుంటే, మగ్గాలు ఆడించేందుకు నరాలనే నేతన్నలు దారాలు చేస్తున్నారు. వాళ్ల శ్రమశక్తులకు సలామ్!

బేతపూడి..వేములపల్లి శ్రీకృష్ణ పుట్టిన ఊరు. అక్కడకు వెళ్లాకే ఈ విషయం తెలిసింది. ఆయన ప్రసిద్ధ గీతం 'చెయ్యెత్తి జైకొట్టు తెలుగోడా..' ఎంతో స్ఫూర్తిదాయకం. ఎన్టీఆర్‌కు ఈ గీతం అంటే ఎంతో ఇష్టం. ఆ గ్రామంలో పర్యటించినంత సేపూ ఆ రోజు లు గుర్తుకొచ్చాయి. ఈ మొండిచేతుల పాలనపై చెయ్యెత్తి తిరగబడేది ఎప్పుడో!

చెయ్యెత్తి తిరగబడేది ఎప్పుడో!

కాంగ్రెస్‌ను చంపాలి!
కత్తులు, కొడవళ్లతో రైతులు రోడ్డెక్కాలి
బ్యాంకుల్లోని రైతుల బంగారమంతా విడిపిస్తా
గుంటూరు జిల్లా పాదయాత్రలో చంద్రబాబు

  "మీరు ఆత్మహత్య చేసుకోవడం కాదు. మిమ్మల్ని ఈ స్థితికి తీసుకొచ్చిన కాంగ్రెస్‌ను చంపాలి. రైతులు కత్తులు, కొడవళ్లతో...గీత కార్మికులు మోకులతో రోడ్డెక్కి తిరగబడాలి. అప్పుడే కాంగ్రెస్ కు బుద్ధివస్తుంది'' అని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పిలుపునిచ్చా రు. కల్లును నిషేధించి గీత కార్మికుల పాలిట వైఎస్ రాజశేఖరరెడ్డి రాక్షసుడిలా వ్యవహరించారని మండిపడ్డారు. "పేదవాళ్లు తెల్లచొక్కా వేసుకొంటే ఆయన సహించేవారు కాదు. పెత్తందారీ, భూస్వామ్య పోకడలతో వ్యవహరించేవారు'' అని గుర్తుచేశారు.

గుంటూరు జిల్లా రేపల్లె నియోజకవర్గం పేటేరు నుంచి ఆదివారం ఉదయం ఆయన పాదయాత్ర ప్రారంభించారు. మోర్లవారిపాలెం, బేతపూడి, రేపల్లె టౌన్, అరవపల్లి మీదుగా10 కిలోమీటర్లు నడిచారు. పలుచోట్ల పార్టీ జెండాలను ఆవిష్కరించారు. ప్రజల సమస్యలు అడిగి తెలుసుకొన్నారు. కాంగ్రెస్ పార్టీ తొమ్మిదేళ్లుగా రాష్ట్రంలో రాక్షసపాలన కొనసాగిస్తోందని, విద్యుత్ చార్జీలు మొదలు నిత్యావసర సరుకుల ధరల దాకా..సమస్తం పెంచేసి ప్రజల నడ్డి విరిచిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలను నరకయాతన పెట్టిన కాంగ్రెస్ పార్టీ ఇక అధికారంలోకి రాదని, దాన్ని ఎవరూ కాపాడలేరని జోస్యం పలికారు. "ఇప్పుడు ఆ పార్టీకి చావుతెలివి పుట్టుకొచ్చింది. రుణమాఫీ, బీసీలకు 100 సీట్లపై నేను పాదయాత్రలో ఇస్తున్న హామీలను తామూ అమలు చేస్తామని నమ్మించే ప్రయత్నం చేస్తోంది'' అని ఎద్దేవా చేశారు. అధికారంలోకి వస్తే గీత కార్మికులను ఎక్సైజ్ శాఖ నుంచి తొలగిం చి పౌరసరఫరాల పరిధిలోకి తీసుకొచ్చి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తామని హామీ ఇచ్చారు.

"గీత కార్మికులు ఎక్కువగా నివసించే గ్రామాల్లో చిల్లింగ్ సెంటర్లు ఏర్పాటు చేసి, నీరా నిల్వ చేసుకునేందుకు అవకాశమిస్తాం. కల్లుతోనే శీతల పానీయా లు, మిఠాయిలు, చాక్లెట్లు తయారు చేసే పరిశ్రమల స్థాపనకు కృషి చేస్తాం. వడ్డీలేని రుణాలు ఇస్తాం. భూములు కొనుగోలు చేసి తాటి చెట్ల పెంపకానికి, గొర్రెలను మేపుకోడానికి కేటాయిస్తాం''అని భరోసా ఇచ్చారు. వ్యవసాయం కోసం చాలామంది రైతులు ఇంట్లో ఆడవారి బంగారాన్ని తాకట్టు పెట్టారని, ఆ రుణాలన్నింటినీ మాఫీ చేసి ఆ బంగారమంతా విడిపిస్తామని చంద్రబాబు వాగ్దానం చేశారు. ఒక అన్నగా, తమ్ముడిగా ఆ బంగారాన్ని ఆడబిడ్డలకు బహుమతిగా ఇప్పిస్తానని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజల ప్రాణాలకు ముఖ్యమంత్రి కిరణ్ రక్షణ కల్పించలేరని చంద్రబాబు విమర్శించారు. ఇప్పటికైనా ప్రజలు రోషం తెచ్చుకొని ఎన్నికల రోజున డబ్బు, మద్యానికి ప్రలోభపడకుండా తనను గుర్తు పెట్టుకోవాలని విజ్ఞప్తి చేశారు.

2,100 కిలోమీటర్లు పూర్తి
చంద్రబాబు పాదయాత్ర ఆదివారం నాటికి 2,100 కిలోమీటర్లు పూర్తి చేసుకుం ది. గుంటూరు జిల్లా రేపల్లె పట్టణం ఇసుకపల్లి నె హ్రూ విగ్రహం వద్ద ఆయన ఈ దూరం అధిగమించారు. ఇప్పటివరకు చంద్రబాబు 13 జిల్లాలు 58 నియోజకవర్గాల పరిధిలోని 115 మండలాల్లో పాదయాత్ర జరిపారు. ఆయనకు పాదయాత్రలో బాసటగా నిలుస్తున్న వివిధ సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, రైతులు, పేదలు, మహిళలు, యువతకు పార్టీ ఉపాధ్యక్షుడు కంభంపాటి రామ్మోహన్ రావు ఒక ప్రకటనలో కృతఙ్ఞతలు తెలిపారు.

ప్రధాని ఎందుకొచ్చినట్టు?: బాబు
ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్ హైదరాబాద్‌కు ఎందుకొచ్చిందీ అర్థం కావడం లేదని చంద్రబాబు అన్నారు. ఇంత దూరం వచ్చి.. అమాయక ప్రజల ప్రాణాలను బలిగొన్న ఉగ్రవాదులకు హెచ్చరిక జారీ చేయకపోవడం దారుణమని విమర్శించారు. కేవలం బాధితు ల పరామర్శకే ప్రధాని పర్యటన పరిమితం కావడం ఏమిటని ఘాటుగా ప్రశ్నించారు.

పేదోడు తెల్లచొక్కా వేస్తే వైఎస్ సహించేవారు కాదు

కాంగ్రెస్ ప్రభుత్వ అవినీతి, అసమర్థత వల్లే ప్రజలు అనేక కష్టాలు పడుతున్నారని తెలుగు దేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విమర్శించారు. వస్తున్నా మీ కోసం పాదయాత్రను శనివారం 19వ రోజు భట్టిప్రోలు మండల కేంద్రంలోని డిగ్రీ కళాశాల నుంచి ప్రారంభించారు. పాదయాత్ర దుర్గా పిక్చర్ ప్యాలెస్ వద్దకు చేరుకున్న సమయలో పలువురు చేనేత కార్మికులు చంద్రబాబుకు వారి సమస్యలు విన్నవించారు. రోజంతా కష్టపడ్డా రూ. 100 ఆదాయం రావడం లేదని, కుటుంబాలు గడవక అనేక ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు.

చేనేత సహకార సంఘాలు ఉన్నా వాటి వల్ల 20 శాతం మంది మాత్రమే లబ్ధిపొందుతున్నారని, మిగిలిన 80 శాతం మందికి ప్రభుత్వ సాయం అందడం లేదని కన్నీళ్లుపెట్టుకున్నారు. తమను ఆదుకోవాలని కోరారు. దీనికి స్పందించిన చంద్రబాబు ప్రతి పక్షంలో ఉన్నా చేనేత కార్మికుల కోసం అనేక పోరాటాలు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. తాను చరఖా పట్టుకుని అసెంబ్లీకి వెళ్తే భయపడిన కాంగ్రెస్ ప్రభుత్వం రూ. 312 కోట్ల నిధులు నేతన్నల కోసం కేటాయిస్తున్నట్లు బడ్జెట్‌లో పేర్కొందన్నారు. ఇది జరిగి మూడేళ్లు గడిచినా వాటిలో మూడు రూపాయలు కూడా నేత కార్మికుల కోసం ఖర్చు చేయలేదన్నారు.

నేతన్నల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వ చిన్న చూపుకు ఇది నిదర్శనమన్నారు. తాము అధికారంలోకి వస్తే నేత కార్మికుల కోసం రూ. లక్ష వడ్డీ లేని రుణాలు ఇస్తామని, ఏడాదికి వెయ్యి కోట్ల వంతున ఐదేళ్లలో ఐదు వేల కోట్లు నేత కార్మికుల సంక్షేమం కోసం వెచ్చిస్తానని, రూ.1.50 లక్షలు వెచ్చించి పక్కా గృహాలు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు. అలాగే జనతా వ్రస్తాలు అందుబాటులోకి తెచ్చి నేత వృత్తిని ప్రోత్సహిస్తామన్నారు. దీనికి చేనేత కార్మికులు హర్షం వ్యక్తం చేశారు. తమ మద్దతు తెలుగు దేశానికే అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

బట్టీ చదువులొద్దు... లోకజ్ఞానం నేర్పండి.. పాదయాత్రలో చంద్రబాబు కేఎస్‌కే బాలికల కళాశాల వద్ద విద్యార్థినులతో ముచ్చటించారు. ఎలా చదువుతున్నారని అడిగి తెలుసుకున్నారు. తాను అధికారంలో ఉన్నప్పుడు బాలికల విద్యకు, మహిళల ఉద్యోగాల కల్పనకు అనేక చర్యలు తీసుకున్నానని చెప్పారు. తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతికి పాల్పడి లక్ష కోట్లు దండుకుందని విమర్శించారు.

అవినీతి గురించి ఎంత మందికి తెలుసునని ఆయన విద్యార్థినులను ప్రశ్నించారు. దీనికి ఒక్కరి నుంచీ సమాధానం రాకపోవడంపై బాబు విస్మయం వ్యక్తం చేశారు. విద్యార్థులకు పుస్తకాల్లోని చదువులను బట్టీ కొట్టించడం కాకుండా లోకజ్ఞానం పెంపొందించేలా విద్యనందించాలని ఉపాధ్యాయులకు సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వ అవినీతిని విద్యార్థినులను వివరించారు.

వృద్ధులకు రూ. 600 పింఛను పాదయాత్రలో పలువురు వృద్ధులను చంద్రబాబు ఆప్యాయంగా పలుకరించి, వారి ఆశీస్సులు తీసుకున్నారు. తాను అధికారంలోకి వచ్చాక పింఛన్‌ను రూ. 600కు పెంచుతానని వారికి భరోసా కల్పించారు.అలాగే గ్రామంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద చంద్రబాబు దళితులతో కొద్ది సేపు మాట్లాడారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. తాను అధికారంలోకి వస్తే దళితుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

సమాన పనికి సమాన వేతనం కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ కార్మికులకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని పలువురు చంద్రబాబును కలసి కోరారు. దీనికి స్పందించిన ఆయన తాను అధికారంలోకి వచ్చిన వెంటనే సమాన పనికి సమాన వేతనం అందించేలా చూస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు ప్రత్తిపాటి పుల్లారావు, దూళిపాళ్ల నరేంద్ర, మోదుగుల వేణుగోపాలరెడ్డి, నక్కా ఆనందబాబు, మన్నవ సుబ్బారావు, గ్రేటర్ హైదరబాద్ మాజీ మేయర్ తీగల కృష్ణారెడ్డి, కృష్ణాజిల్లా నాయకులు గరికపాటి మోహనరావు, కంటమనేని రవిశంకర్, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

వస్తున్నా మీ కోసం సైడ్ లైట్స్ .. * పాదయాత్రలో పలు చోట్ల చంద్రబాబు వృద్ధులను పలుకరించి వారి ఆశీస్సులు తీసుకున్నారు.

* నేటి పిల్లలే రేపటి భావి భారత పౌరులని, వారి కోసం అవినీతి రహిత సమాజమే థ్యేయమంటూ చంద్రబాబు పలు చోట్ల ఉద్ఘాటించారు.

* వేమూరు పార్టీ నాయకులు దారిపొడవునా పూలతో చంద్రబాబుకు స్వాగతం పలికారు.

* కొబ్బరి బొండాల విక్రేత, దర్జీ, ఇస్త్రీ, చేనేత కార్మికులతో చంద్రబాబు వారి సమస్యలు తెలుసుకున్నారు.

* పచారీ దుకాణానికి వెళ్లి నిత్యావసర వస్తువుల ధరలు అడిగి తెలుసుకున్నారు

* పలు చోట్ల చిన్నారులను దగ్గరకు తీసుకుని వారిని ముద్దాడారు.

అసమర్థ ప్రభుత్వం

చంద్రబాబు నాయుడు చేపట్టిన వస్తున్నా మీ కోసం పాదయాత్ర ఆదివారం రేపల్లె నియోజకవర్గంలో జరుగుతుందని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి మన్నవ సుబ్బారావు తెలిపారు. ఈ యాత్ర పేటేరు గ్రామం నుంచి బయల్దేరి, మోర్లవారిపాలెం, బేతపూడి గ్రామానికి చేరుకుంటారు. మధ్యాహ్న భోజనం విరామం అనంతరం బేతపూడి నుంచి బయల్దేరి ఇసుకపల్లి సెంటర్, రేపల్లె పట్టణంలోని నెహ్రూబొమ్మ సెంటర్, పాతపట్నం మీదుగా ఆరవపల్లి గ్రామానికి చేరుకుందని తెలిపారు. ఆరవపల్లిలో రాత్రికి బస చేస్తారని సుబ్బారావు తెలిపారు.

రేపల్లె నియోజకవర్గంలో వస్తున్నా.. మీకోసం

మగవాళ్ల కంటే ఆడవాళ్లు ఎంతో తెలివైన వాళ్లు. ఏ పని అప్పగించినా సమర్థవంతంగా చేయగల శక్తి, సామర్థ్యాలు వారి స్వంతం. అయినా మన సమాజంలో ఆడపిల్లలపై వివక్ష నేటికీ కొనసాగుతూనే ఉన్నది. మగపిల్లలను ్రపైవేటు పాఠశాలల్లో, ఆడపిల్లలను ప్రభుత్వ బడులకు పంపుతారు. ఆడబిడ్డలపై వివక్ష అనేది ఇక్కడి నుంచే మొదలౌతుందని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. భట్టిప్రోలు మండలంలో తన రాకకోసం గంటల తరబడి ముం డుటెండలో నిరీక్షించిన విద్యార్థులతో చంద్రబాబు కాసేపు సరదాగా గడిపారు.

'ఏమి గర్ల్స్ బావున్నారా... గుడ్ ఆఫ్టర్‌నూన్... ఏంటి డల్‌గా చెబుతున్నారు... బాగా చదువుకొంటున్నారా... టీచర్స్ బాగా పాఠాలు చెబుతున్నారా' అంటూ కులాస ప్రశ్నలు వేశా రు. అనంతరం చంద్రబాబు ఆడపిల్లలపై కొనసాగుతోన్న వివక్ష గురించి ప్రస్తావించారు. మగ పిల్లలతో పాటు ఆడపిల్లల్ని అన్ని రంగాల్లో పైకి తీసుకురావాలని తాను విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు అమలు చేశానని గుర్తు చేశా రు. ఆ నాడు విద్యార్థినులకు ఉచితంగా సైకిళ్లు ఇప్పించాం. ఆ సైకిల్ ఇచ్చింది కళాశాలలకు వెళ్ళడానికే కాదు.

మగవాళ్లకు ధీటుగా తాము కూడా సైకిళ్లు తొక్కుతామని సమాజానికి చాటి చెప్పేందుకే తాను సైకిళ్లను పంపిణీ చేశానని చె ప్పారు. ఆడపిల్లలు ఎవరైనా ముందుకొస్తే ఆర్‌టీసీలో ్రడైవర్లు అయ్యే అవకాశం కూడా కల్పిస్తానని హామి ఇచ్చారు.

మీరు శారీరకంగా బలహీనులు కారు. మీకు అవకాశం ఇస్తే దూసుకెళతామని నిరూపిస్తారని చైతన్యం నింపారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో శాంతిభద్రతలను పరిరక్షించి ఆడపిల్లలు స్వేచ్ఛగా తిరిగేలా చేశానన్నారు. ఎవరైనా రౌడీలు తోక జాడితే వారికి ఇవ్వాల్సిన ట్రీట్‌మెంట్ ఇచ్చాం. నేడు విద్యార్థినులు ఇంటినుంచి బయటకు వెళితే భద్రంగా ఇంటికొస్తుందనే పరిస్థితి లేకుండా పోయిందన్నారు. హైదరాబాద్ బాంబుపేలుళ్ల దుర్ఘటనలో శాశ్వత విద్యార్థినులు వికలాంగులయ్యా రు.

పోలీసులు, సీఎం జాగ్రత్తగా ఉంటే బాం బుపేలుళ్లు జరిగి ఉండేవి కావని చంద్రబాబు స్పష్టం చేశారు. ఆడబిడ్డల రక్షణ కోసం తాను పటిష్ఠమైన చట్టాలను రూపొందించి అమలులోకి తీసుకొస్తానని హామి ఇచ్చారు.

మహనీయులను ఆదర్శంగా తీసుకోవాలి దేశానికి స్వాత్రంత్యం తీసుకొచ్చిన గాంధీ జీ, రాజ్యాంగాన్ని రూపొందించిన అంబేద్కర్, తెలుగువారికి ఆత్మగౌరవాన్ని తీసుకొచ్చి పేదోడికి కూడు, గూడు, గుడ్డ ఇచ్చిన ఎన్‌టీఆర్ వంటి మహనీయులను విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవాలి. అదే జైలుకు వెళ్లిన నాయకులను ఆదర్శంగా తీసుకొంటే విద్యార్థుల జీవితాలు అంధకారమౌతాయని హెచ్చరించారు.

వివక్ష పాఠశాల నుంచే...


వస్తున్నా మీకోసం పర్యటనలో భాగంగా భట్టిప్రోలు మండలంలో పర్యటిస్తున్న చంద్రబాబు సూరేపల్లిలో అంబేద్కర్ విగ్రహా న్ని, కోనేటిపురంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. కోనేటిపురంలో ఏర్పా టు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ భారతరాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్, తెలుగువారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన మహనీయుడు నందమూరి తారక రామారావు అని, వీరిని ఆదర్శం గా తీసుకోవాలన్నారు. బడుగు, బలహీనవర్గాలకు వీరిద్దరూ ఎంతో కృషి చేశారన్నారు. బీసీలకు రాజ్యాంగాధికారం కల్పించిన ఘనత ఎన్టీఆర్‌కు దక్కుతుందన్నారు. ఆయన బాటలోనే పయనిస్తునానన్నారు.

బీసీల కోసం పదివేల కోట్లతో ప్రత్యేక బడ్జెట్ ఏర్పాటు చేయనున్నట్లు, రానున్న ఎన్నికల్లో బీసీలకు వంద సీట్లు రిజర్వు చేశామన్నారు. భట్టిప్రోలు మండలంలో చేనేత, గౌడ కార్మికుల సంక్షేమానికి కృషి చేస్తానన్నారు. అక్కడి నుం చి పాదయాత్ర పల్లెకోనకు చేరుకుంది. పల్లెకోన సెంటర్‌లో ప్రజలనుద్ధేశించి బాబు మాట్లాడుతూ గౌడ కార్మికుల పొ ట్టకొట్టేలా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరించిందన్నారు. తాను అధికారంలోకి వస్తే బెల్ట్ షాపులను రద్దు చేయటంతోపాటు గౌడల సంక్షేమానికి కృషి చేస్తానన్నారు.

వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన నాయకులు, కార్యకర్తలు పాదయాత్రలో పాల్గొని చంద్రబాబుకు మద్దతు తెలిపేందుకు వివిధ జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు శనివారం భట్టిప్రోలు మండలానికి తరలివచ్చారు. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరుకు చెందిన కాకతీయ యూత్ పది వాహనాల్లో భట్టిప్రోలు చేరుకుని చంద్రబాబుతో కలసి పాదయాత్రలో పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా పిచ్చాటూరు మండలం నుంచి పార్టీ జిల్లా అధ్యక్షుడు జనార్థన్‌రెడ్డి ఆధ్వర్యంలో పలువురు కార్యకర్తలు, మెదక్ జిల్లా సదాశివపేట మండలం నుంచి పార్టీ నాయకులు అబ్దుల్ ఖాదిర్, హైటెక్ ఆధ్వర్యంలో పలువురు కార్యకర్తలు భట్టిప్రోలు తరలివచ్చి బాబు పాదయాత్రలో పాల్గొన్నారు.

వేమూరి ఆనందసూర్య ఆధ్వర్యంలో, రాష్ట్రీయ బ్రాహ్మణ సంఘం ప్రముఖులు సుమారు 150 మంది బ్రాహ్మణ ప్రముఖులు మూడు బస్సుల్లో వచ్చి కోనేటిపురంలో చంద్రబాబుతో భేటీ అ య్యారు. కార్యక్రమంలో జిల్లా నా యకులు ప్రత్తిపాటి పుల్లారావు, నక్కా ఆనందబాబు, ధూళిపాళ్ళ నరేంద్ర, యరపతినేని శ్రీనివాసరావు, మన్నవ సుబ్బారావు, జియావుద్దీన్, శనక్కాయల అరుణ, చిట్టిబాబు, దానబోయిన శ్రీనివాస్‌యాదవ్, స్థానిక నాయకులు అధికసంఖ్యలో పాల్గొన్నారు.

స్ఫూర్తి ప్రదాతలు అంబేద్కర్, ఎన్టీఆర్