February 13, 2013

అదేమీ మారుమూల గ్రామం కాదు. గుంటూరు పట్టణానికి పది కిలోమీటర్ల దూరంలోనే ఉంది. కృష్ణానదికి కూడా ఇంచుమించు అంతే దూరం. కానీ, ఎక్కడా ఆ ఛాయలు కనిపించవు. ఎక్కడా ఆ వెలుగులు చూడలేం. మంచి ఎండలో ఉప్పలపాడులోకి అడుగుపెట్టినప్పుడు.. నాకు కాసిని నీళ్లు ఇవ్వడానికీ ఊరి జనం జంకారు. అర్థం కాలేదు. దాహం కూడా తీర్చలేని గ్రామామా ఇది..అనిపించింది. అయితే, వాళ్లు చెప్పింది విన్నాక ఆ దాహం విషయమే మరిచిపోయాను. ఆ ఊరంతా ఉప్పునీరేనట. పశువులు కూడా ఆ నీళ్లు ముట్టడం లేదట. కొన్ని గొంతులో పోసుకున్నా. నాలుక పీక్కుపోతున్నట్టనిపించి ఊసేశాను.

అసలు వీళ్లెలా బతుకుతున్నారు? ఉప్పు ఉరిపెట్టిన ఈ ఊరికి ఊపిరి పోవడమెలా? ఊళ్లో మరే సమస్యా లేదు. ఎవరిని కదిలించినా నీళ్లూకన్నీళ్లే! ఆ ఊరు దాటి ముందుకు సాగుతుంటే ఒక లారీ డ్రైవర్ కలిశాడు. 'సార్.. మీతో మాట్లాడాలి' అని కోరడంతో ఆగి ఆరా తీశాను. "పేరుకి లారీ ఓనర్‌ని. క్లీనర్ కన్నా దుర్భరంగా ఉంది జీవితం. డీజిల్ ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. బాడుగ గిట్టుబాటు కావడం లేదు. అరకొర సంపాదనంతా నా వైద్యానికే పోతోంది. ఇంత చేస్తున్నా..మంచం పట్టడం తప్ప బతుకులో మార్పేమీ లేదు'' అని వాపోయాడు.

హైదరాబాద్‌లో స్టీరింగ్ మారకుండా ఈ డ్రైవర్ల లారీ గాడిన పడేనా!
హాఫ్‌పేటలో ఆ మహిళ తలపోత నన్ను కదిలించింది. పేరు రాజ్యలక్ష్మి అట. "కరెంట్ బిల్లులు కట్టలేకపోతున్నాం. ఇదేం ప్రభుత్వమ''ని ఆక్రోశిస్తుంటే.. 'కారణం ఎవరో తెలుసా?' అని ప్రశ్నించాను. తెలియదని అమాయకంగా ముఖం పెట్టింది. తొమ్మిదేళ్ల కాంగ్రెస్ పాపాలే ఈ శాపాలని చెబితే.. 'అవును కదా' అని రాజ్యలక్ష్మి తలూపింది. 'చార్జీలు పెరిగాయనుకుంటున్నామేగానీ, ఎందుకు..ఏమిటీ..ఎలా అనేది ఆలోచించలేదు సార్..' అని ఒప్పేసుకుంది. ఇలాంటి రాజ్యలక్ష్మిలే కదా రాష్ట్రమంతటా!

ఇలాంటి రాజ్యలక్ష్మిలే రాష్ట్రమంతా!

బాబు యాత్రపై పార్టీ వర్గాల విశ్లేషణ

చంద్రబాబు పాదయాత్ర మరో మూడునెలలు కొనసాగే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ నెల 22వ తేదీ నాటికి గుంటూరు జిల్లాలో యాత్ర పూర్తి కావాల్సి ఉంది. కానీ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా 19వ తేదీ సాయంత్రం నుంచి 21వ తేదీ సాయంత్రం వరకూ యాత్రకు విరామం ఇవ్వాల్సి వస్తోంది. దీంతో ఆ జిల్లాలో ఆయన రెండు రోజులు అదనంగా ఉంటున్నారు. ఆ తర్వాత కృష్ణా జిల్లాలో రెండో దఫా అడుగు పెడతారు.

ఈ విడతలో సుమారు పది రోజులు అక్కడ పాదయాత్ర చేసి పశ్చిమ గోదావరి జిల్లాలో అడుగు పెడతారు. ఉభయ గోదావరి జిల్లాల్లో ఆయన పర్యటన కనీసం పాతిక రోజులు ఉంటుంది. ఏప్రిల్ ఐదో తేదీ నా టికి ఈ జిల్లాలను పూర్తి చేసుకొని ఉత్తరాంధ్రలో అడుగు పెడతారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఒక్కో జిల్లాకు పది రోజులు వేసుకొన్నా మూడు జిల్లాలు పూర్తి కావడానికి నెల పడుతుందని, ఈ లెక్కన మే నెల మొదటి వారానికిగాని యాత్ర పూర్తి కాదని అంటున్నాయి. వీటన్నింటి దృష్ట్యా ఈసారి బడ్జెట్ సమావేశాలకు చంద్రబాబు వచ్చే అవకాశం కనిపించడం లేదు.

ఢిల్లీలో ప్రకంపనలు: లోకేశ్
పాదయాత్ర ప్రకంపనలు ఢిల్లీలో వినిపిస్తున్నాయని లోకేశ్ వ్యాఖ్యానించారు. రైతులకు రుణ మాఫీ గురించి కేంద్రం ఆలోచన చేస్తోందని కేంద్ర మంత్రి సచిన్ పైలెట్ చేసిన ప్రకటనపై ట్విటర్‌లో ప్రతిస్పందించారు. "పాదయాత్ర వెయ్యి కిలోమీటర్లు పూర్తి కాగానే చంద్రబాబు గత ఎన్నికల్లో వాగ్దానం చేసిన నగదు బదిలీ పధకాన్ని కాపీ కొట్టి ఒక చెత్త నగదు బదిలీ పధకాన్ని ప్రకటించారు. రెండు వేల కిలోమీటర్లు పూర్తి కాగానే రుణ మాఫీ ప్రకటన గురించి విన్నాం. పాదయాత్ర ప్రకంపనలు ఢిల్లీకి తగులుతున్నాయా?' అని వ్యాఖ్యానించారు.

మే' దాకా నడవడమే..

పెడితే తిని పడుకుంటుందంతే
ఇంకా మాట్లాడితే రంకెలేస్తుంది
మీరు మేల్కొంటేనే మంచి రోజులు..
గుంటూరు జిల్లా పాదయాత్రలో చంద్రబాబు

దున్నపోతుకు గడ్డివేస్తే తిని పడుకుంటుందని, పాలివ్వకపోగా రంకెలేస్తుందని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అన్నారు. అదే ఆవుకు గడ్డి వేస్తే సాధుజంతువులా పాలు ఇస్తుందని పేర్కొన్నారు. దున్నపోతులాంటి కాంగ్రెస్ పార్టీ కావాలో.. సాధుజంతువులాంటి ఆవును కోరుకుంటారో తేల్చుకోవాలని గుంటూరు జిల్లా పాదయాత్రలో ప్రజలను ఆయన కోరారు. బుధవారం పొన్నూరు నియోజకవర్గం ఉప్పలపాడు నుంచి ఆయన పాదయాత్ర ప్రారంభించారు. వెంకట క్రిష్టాపురం, ఆఫ్‌పేట మీదుగా 11.4 కిలోమీటర్లు నడిచి కాజీపేటలో రాత్రి బస చేశారు. అంతకుముందు.. యాత్రలోభాగంగా కలిసిన ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. కాంగ్రెస్, వైసీపీ దోపిడీపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. డబ్బు పోవడమే గానీ ప్రాజెక్టులు పూర్తికావడం లేదని రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించారు.

"పోలవరం కట్టకుండా రూ. 10 వేల కోట్లు వృధాగా ఖర్చుపెట్టారు. పులిచింతల ప్రాజెక్టు తొమ్మిదేళ్లయినా పూర్తికాలేదు. మేమైతే రెండేళ్లలోనే పూర్తి చేసేవాళ్లం. మేమొస్తే పూర్తి చేసి తీరతాం'' అని పేర్కొన్నారు. సీఎం కిరణ్‌కు నీటి యాజమాన్యం అంటే ఏమిటో కూడా తెలియదని దుయ్యబట్టారు. " ఈయనకు (కిరణ్) దూరదృష్టే లేదు. నాగార్జున సాగర్‌లో 495 అడుగులు నీటి మట్టం ఉన్నప్పుడూ మేము పంటలకు నీరిచ్చాం. ఇప్పుడు 517 అడుగులున్నా ఇవ్వడం లేదు'' అని విమర్శించారు, సాగునీటి సంఘాల ఎన్నికల పేరిట విడుదల చేసిన 500కోట్లు కాంగ్రెస్ దొంగల జేబుల్లోకి పోతాయని ఆరోపించారు. ఈ విషయాలపై ప్రజలు మేల్కొని నేతలను అదుపులో పెట్టాలని కోరారు.

"మాదేం పోయింది. ఎవరి డబ్బో తింటున్నారనుకుంటే పోయేదంతా మీదే. మీ ఎంగిలి మెతుకులే వారు తింటున్నారు''అని చెప్పారు. తన పాదయాత్రపై వస్తున్న విమర్శలకు దీటుగా స్పందించారు. తమ వల్లనే తొలినుంచి రైతు రుణాల మాఫీ అంశం చర్చకు వస్తున్నదని గుర్తుచేశారు. "దేశంలో ఇప్పటివరకు రెండు సార్లు రుణమాఫీ అమలు జరిగింది. టీడీపీ వత్తిడితో నాడు దేవీలాల్ అమలు చేశారు. 2009కు ముందు మా పార్టీ రుణమాఫీపై హామీ ఇవ్వగా, వైఎస్ అడ్డుపడ్డారు. కానీ, కేంద్రం అమలు చేసింద''ని వివరించారు.

సహకార సొసైటీ ఎన్నికల ఫలితాలు చూస్తే, అసెంబ్లీలోకి సైకిల్ దూసుకు వెళ్లడం ఖాయమనిపిస్తోందని చంద్రబాబు జోస్యం చెప్పారు. వ్యవసాయం దండగ అని ఏనాడూ తాను అనలేదని చెప్పారు. "రైతుబిడ్డలు ఉన్నత చదువులు అభ్యసించి పైకి రావాలని నేను అంటే వ్యవసాయం దండగ అని అన్నానని వైఎస్ ద్రుష్పచారం చేశారు. అది మీరు కూడా నమ్మి ఓట్లేశారు.'' అని పేర్కొన్నారు. టీడీపీ వస్తే పేద వాడి ఆరోగ్యం కోసం సమగ్ర బీమా పథకం తీసుకొచ్చి డెంగ్యూ, చికున్‌గున్యా, మలేరియా సహా అన్ని వ్యాధులకు చికిత్స చేయిస్తా''నన్నారు.

సమైక్యాంధ్ర అనండి సార్..
ఉప్పలపాడులో బాబు మాట్లాడుతుండగా ఓ రై తు ముందుకొచ్చాడు. రాష్ట్రం కలిసిమెలిసి ఉండాలన్న ఆకాంక్షను వెలిబుచ్చారు. అంతటితో ఆగకుండా 'సార్.. సమైక్యాంధ్రపై ప్రకటన చేయండి' అని అడిగాడు. పార్టీ వైఖరిని ఇప్పటికే తెలియజేశామని చంద్రబాబు గుర్తుచేశారు. "పార్టీ వైఖరిని పలుమార్లు స్పష్టం చేశాం. దానిపై నిర్ణయం కేంద్రం చేయాల్సి ఉంది'' అని వివరించారు.

దున్నపోతుకి గడ్డేసి పాల కోసం చూస్తారా?

జర్నలిస్టులపై టీడీపీ ఎప్పుడూ దాడి చేయలేదు
టీడీపీ లక్ష్యంగా సాక్షి మీడియా పనిచేస్తోంది
దాడుల చరిత్ర వైఎస్ జగన్ కుటుంబానిదే : రేవంత్‌రెడ్డి

జర్నలిస్టులపై తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ దాడులు చేయలేదని, జర్నలిస్టులంటే తమకెంతో గౌరవమని టీడీపీ నేత రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. గుంటూరు జిల్లాలో సాక్షి కార్యాలయంకై టీడీపీ కార్యకర్తలు దాడి చేశారన్న వార్తలను ఆయన ఖండించారు. నాలుగేళ్లుగా సాక్షి పత్రిక చంద్రబాబు గురించి వ్యక్తిగతంగా రాసినా టిడిపి ఎప్పుడూ దాడి చేయలేదన్నారు. దాడుల చరిత్ర వైఎస్ జగన్ కుటుంబానిదేనని రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

ఈ సందర్భంగా బుధవారం టీడీపీ కార్యాలయంలో రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ సాక్షి దిన పత్రిక పుట్టుకే అవినీతి, అబద్దాల పుట్టుక అన్నారు. ప్రతిరోజు తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడును విమర్శించడమే ఆ పార్టీ లక్ష్యంగా పెట్టుకుందన్నారు. టీడీపీ లక్ష్యంగా సాక్షి మీడియా పని చేస్తోందని ఆయన విమర్శించారు. టీడీపీ కార్యాలయం ముందు జర్నలిస్టులు ధర్నా చేయలేదని, జగన్ అనుచరులే ధర్నా చేశారని రేవంత్ చెప్పారు.

గుంటూరులో సాక్షి కార్యాలయం నుండి తమ పార్టీ నేతలపై జగన్ పార్టీ కార్యకర్తల రాళ్ల దాడి, గుడ్ల దాడికి ప్రతిస్పందనగానే అది జరిగినట్లుగా తమ దృష్టికి వచ్చిందని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. అవసరమనుకుంటే ఈ ఘటనపై విచారణ చేపట్టాలన్నారు. దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి ఆ రెండు పత్రికలు చదువొద్దని చెప్పిన సందర్భాలు ఎన్నో ఉన్నాయన్నారు. షర్మిల, అంబటి రాంబాబులకు తమ పార్టీ అధ్యక్షుడిని విమర్శించే నైతిక హక్కు లేదన్నారు. తమ తీరు కుసంస్కారం అని షర్మిల చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. కుసంస్కారం అంటే ఏమిటో ఆమె చెప్పాలన్నారు. 35 ఏళ్లుగా ప్రజా జీవితంలో ఉన్న వ్యక్తిని విమర్శించడం, కెసిఆర్, టిడిపి నేతలను కాళ్లు పట్టుకోమని అడగడం, అవినీతికి పాల్పడ్డ జగన్‌ను జైలు నుండి విడిపించుకునేందుకు తమ పార్టీపై బురద జల్లడం, ఆపరేషన్ పైన నివృత్తి చేయాలని అడిగితే ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడటం కుసంస్కారం కాదా? అని రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు.

జర్నలిస్టులు జగన్ కోసం పని చేయడం మానుకోవాలని రేవంత్‌రెడ్డి హితవు పలికారు. సాక్షిది అబద్దాల పుట్టుకని, అవినీతి సొమ్ముతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పుట్టిందని ఆయన ఆరోపించారు. కలర్ ఫుల్ పేజీలతో అందరికంటే తక్కువ ధరకు ఇస్తామని చెప్పిన జగన్ రెండు రూపాయల నుండి ఇప్పుడు నాలుగు రూపాయలు చేశారన్నారు. అవినీతి జగన్‌ను బయటకు తీసుకు వచ్చేందుకు తప్పుడు రాతలు, అబద్దాలు రాస్తోందన్నారు. సాక్షిలో పని చేసే జర్నలిస్టులు చిల్లరమల్లర పనులు చేయవద్దని హితవు పలికారు. తిరుపతి, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాల్లో ఆంధ్రజ్యోతి దిన పత్రిక కార్యాలయాలపై దాడి చేసిన సంస్కృతి వైఎస్సార్‌సీపీదేనని రేంత్‌రెడ్డి అన్నారు.

అవినీతి సొమ్ముతో వైఎస్సార్‌సీపీ పుట్టింది

మీ సమస్యల ముందు నా సమస్య లెక్క కాదు
ఉపాధిహామీ పేరుతో కోట్లు స్వాహా : చంద్రబాబు నాయుడు

జీవితంలో ఎప్పుడూ ఆరోగ్య సమస్య రాలేదని, కొత్తగా బీపీ, ఇతర సమస్యలు వస్తున్నాయని, అయితే మీ సమస్యల ముందు తన సమస్య లెక్క కాదని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర బాబు నాయుడు పేర్కొన్నారు. తొమ్మిదేళ్లు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేశానని, ఇప్పుడు కొత్తగా వచ్చేది ఏమీ లేదని, వచ్చే అసెంబ్లీ ఎన్నిక ల్లో గెలిచినా మళ్లీ సీఎంనే అవుతానని బాబు చెప్పారు.

బుధవారం ఉదయం గుంటూరు జిల్లాలోని పెదకాకాని మండలం ఉప్పలపాడు నుంచి చంద్రబాబు నాయుడు 135 వ రోజు పాదయాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ అబద్ధాలను నమ్మి ప్రజలు మోసపాయారని, ఇప్పుడు ప్రజలు వాస్తవాలను తెలుసుకుంటున్నారని ఆయన అన్నారు. బీహార్, గుజరాత్ రాష్ట్రాలు అభివృద్ధిలో ముందన్నాయని, కాంగ్రెస్ పాలన వల్ల మనం ఇరవై ఏళ్లు వెనక్కి పోయామని చంద్రబాబు విమర్శించారు.

ఉపాధి హామీ పేరుతో కాంగ్రెస్ నేతలు కోట్లు స్వాహా చేశారని, సాగునీటి సంఘాల ఎన్నిక ల పేరుతో రూ.900 కోట్లు తిన్నారని చంద్రబాబు నాయుడు ఆరోపించారు. రైతులు, ప్రజల ఆలోచన విధానాల్లో మార్పురావాలని ఆయన కోరారు. కాగా పాదయాత్రలో ఉన్న చంద్రబాబునాయుడిని చలపతి విద్యాసంస్థల అధినేత ఆంజనేయులు, విద్యార్థులు బుధవారం ఉదయం కలుసుకున్నారు. బాబు పాదయాత్ర రెండు వేల కిలోమీటర్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయనకు విద్యార్థులు స్వీట్లు తినిపించారు. అనంతరం చంద్రబాబుకు ఆంజనేయులు రూ.5.20 లక్షల చెక్కును అందజేశారు. మరోవైపు చంద్ర బాబు పాదయాత్ర రెండు వేల కిలోమీటర్లు పూర్తి చేసుకున్న సందర్భంగా టీడీపీ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు.

కాంగ్రెస్ పాలన వల్ల ఇరవై ఏళ్లు వెనక్కి పోయాం

వస్తున్నా..మీకోసం పాదయాత్రలో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబునాయుడిని చలపతి విద్యాసంస్థల అధినేత ఆంజనేయులు, విద్యార్థులు బుధవారం ఉదయం కలుసుకున్నారు. బాబు పాదయాత్ర రెండు వేల కిలోమీటర్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయనకు విద్యార్థులు స్వీట్లు తినిపించారు. అనంతరం చంద్రబాబుకు మాజీ ఎమ్మెల్యే ఆంజనేయులు రూ.5.20 లక్షల చెక్కును అందజేశారు.

చంద్రబాబును కలిసిన చలపతి విద్యాసంస్థల అధినేత

టీడీపీ అధినేత చేపట్టిన వస్తున్నా...మీకోసం పాదయాత్ర 135వ రోజు కొనసాగుతోంది. బుధవారం ఉదయం పెదకాకాని మండలం ఉప్పలపాడు నుంచి బాబు పాదయాత్రను ప్రారంభించారు. మరోవైపు చంద్ర బాబు పాదయాత్ర 2వేల కి.మీ పూర్తి చేసుకున్న సందరంగా టీడీపీ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు.

135వ రోజు చంద్రబాబు పాదయాత్ర ప్రారంభం

'ర్రాష్టానికి అవినీతి చెదులు పట్టింది. అది ర్రాష్టాన్ని తినేస్తోంది. కిరికిరి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి చెదులును వదిలించాల్సిందిపోయి దానిని పెంచడంలో బిజీగా ఉన్నాడు. మీరు కూడా మాకేమి పోయిందని అనుకోవద్దు. పోయేదంతా మీదే. మీరు కట్టే పన్నులు మీ సంక్షేమం కోసం కాకుండా కాంగ్రెస్, వైసీపీ దొంగల జేబుల్లోకి వెళుతున్నాయనేది గమనించాలని' తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు హెచ్చరించారు.

చంద్రబాబు తన ఆరో రోజు పాదయాత్రలో ప్రధానంగా గుంటూరు పట్టణంలోని పలు ప్రాంతాల్లో అవినీతికి వ్యతిరేకంగా ప్రజలను చైతన్యవంతం చేసే దిశగా ప్రసంగాలు చేశారు. డీఎస్ నగర్, బండ్లబజార్ కూడలి, ఎన్‌టీఆర్ ఐలాండ్ వద్ద చేసిన ప్రసంగాల్లో అందరికి అర్థమయ్యే రీతిలో అవినీతి గురించి వివరించారు. 'అవినీతి వలన ప్రజలు నష్టపోయారు. ఏదో ఒక విధంగా బాధపడుతున్నారు. కేంద్రం నుంచి రూ. 12 వేల కోట్లు పట్టణాల అభివృద్ధికి వస్తే వాటిల్లో చాలావరకు పనులు చేయకుండా కాంగ్రెస్ దొంగలు దోచేశారని' ఆరోపించారు. వైఎస్ హయాం నుంచి దీనికి బీజం పడిందని, జలయజ్ఞంలో రూ. 30 వేల కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించారు. 26 వివాదాస్పద జీవోలు జారీ చేసిన మంత్రులపై చర్యలు తీసుకొని ప్రక్షాళన చేయాల్సిందిపోయి సీఎం కిరణ్ దొంగలను కాపాడేందుకు సుప్రీంకోర్టులో వారికి ప్రభుత్వపరంగా డబ్బులు పెట్టి న్యాయసాయం అందజేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వీళ్లు దోచుకొన్న రూ. లక్ష కోట్లతో కోటి మంది పేదలకు ఉచితంగా ఇళ్లు కట్టించ వచ్చని, అలానే రైతులకు ఐదు సార్లు రుణమాఫీ చేయవచ్చని పునరుద్ఘాటించారు.

తాను 30 ఏళ్లు పాటు పెంచి పోషించిన కొంతమంది పార్టీ ఎమ్మెల్యేలు విశ్వాసం లేకుండా వైసీపీ సూట్‌కేసులు, ప్యాకేజ్‌లకు అమ్ముడుపోతున్నారన్నారు. వాళ్లకు ప్రజలే బుద్ధి చెబుతారని చంద్రబాబు వెల్లడించారు. '2009 ఎన్నికలకు ముందు చిరంజీవి పార్టీ పెట్టాడు. వెంటనే సర్వే చేయించి ఒక్క పులివెందులు, కుప్పం తక్క మిగతా 292 సీట్లు తమవేనన్నాడు. తీరా ఎన్నికల్లో 16 సీట్లు మాత్రమే గెలిచాడు.. ఆ రోజున చిరంజీవి పార్టీ లేకపోతే టీడీపీనే అధికారంలోకి వచ్చి ఉండేది. అదే తరహాలో జగన్ ఎలాంటి సిద్ధాంతాలు లేకుండా సీఎం కుర్చీ, దోచుకొన్న రూ. లక్ష కోట్లను కాపాడుకొనేందుకు పిల్ల కాంగ్రెస్‌ను పెట్టాడు. ఇటీవల జరిగిన సహకార ఎన్నికల్లో ఆ పార్టీ ఎక్కడా నిలబడలేదు. రేపటి రోజును ఏ రెండో, మూడో సీట్లు వస్తే దానిని తన కేసులు మాఫీ చేసేందుకు ఉపయోగించుకొంటాడే తప్పా అతను ప్రజాసేవ చేయడని. అలాంటి పార్టీకి ఓటేయొద్దని' ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

బండ్లబజార్‌లో ఒక వ్యక్తి మీకు సింగపూర్‌లో హోటల్ ఉందని అంటున్నారని అడిగిన ప్రశ్నకు చంద్రబాబు ఉద్రేకంగా ప్రసంగించారు. మంచికి చెడుకు, నీతికి అవినీతికి, ధర్మానికి అధర్మానికి మధ్య తేడా తెలియకపోతే వాడు మనిషి కాదు. పశువు కంటే హీనమని చెబుతూ ప్రజలు కొన్ని సందర్భాల్లో మోసం చేయవచ్చని, అన్ని సార్లు మోసం చేయలేరని చెప్పారు. వైఎస్ కుటుంబం తనపై అసత్య ప్రచారం చేస్తూ నీతిమాలినదని దుమ్మెత్తిపోశారు.

వ్యాట్ వలన ఎన్నో ఇబ్బందులు పడుతున్నామని వస్త్ర వ్యాపారులు చంద్రబాబు దృష్టికి తీసుకొచ్చిన సమస్యపై సానుకూలంగా స్పందించారు. వ్యాట్‌ను ఎత్తివేయమని పోరాడితే 5 శాతం నుంచి నాలుగు శాతానికి కాంగ్రెస్ పార్టీ తగ్గించిందని, తాము అధికారంలోకి రాగానే పూర్తిగా ఎత్తివేస్తామన్నారు. వ్యాపారాలు చేసి పది మందికి సహాయపడే వైశ్యులు రాజకీయాల్లోకి వస్తే తాను ప్రోత్సహిస్తానన్నారు. తాము అంబికా కృష్ణ, సిద్ధా రాఘవరావు, తాతబ్బాయి తదితర నేతలను ప్రోత్సహాన్ని అందించామని, వారు రాజకీయాల్లో ముందుకు వెళుతున్నారని చెప్పారు.

రైతుబజార్లు పెట్టి

'నిత్యవసరాల'ను నియంత్రించా
..

తాను సీఎంగా ఉన్న సమయంలో రైతుబజార్లను ఏర్పాటు చేసి నిత్యవసర సరుకుల ధరలను నియంత్రించానని చంద్రబాబు చెప్పారు. అయితే కాంగ్రెస్ దొంగలు అంతకంటే బాగా చేస్తామని చెబితే మీరు నమ్మారు. మీ నమ్మకాన్ని వమ్ము చేస్తూ బియ్యాన్ని రూ. 15 నుంచి రూ. 50కి, ఉల్లిపాయలను రూ. 4 నుంచి రూ. 40కి, ఉప్పును రూ. 2 నుంచి రూ. 10కి చేర్చి నడ్డి విరిచారని చెప్పారు. అదే 2009లో ఇప్పుడు చూపిస్తోన్న కసి చూపించి ఉంటే కాంగ్రెస్ పీడ విరగడై కష్టాలు పోయేవన్నారు. మీరు పడుతోన్న కష్టానికి మంచి ప్రభుత్వమైతే 50 శాతం ఆదాయం చూపించి ఉండేదని, చెత్త కాంగ్రెస్ ప్రభుత్వం నష్టపోయేలా చేస్తోందని విమర్శించారు.

తొమ్మిదేళ్లుగా రాష్ట్రానికి కాంగ్రెస్ చెదలు

సామాజిక న్యాయమే తెలుగు దేశం పార్టీ ధ్యేయమని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. 'వస్తున్నా మీ కోసం' పాదయాత్ర ఆరో రోజైన మంగళవారం గుంటూరు నగరంలో ఆరంభం నుంచి ఉత్సాహంగా కొనసాగింది. సాయంత్రం బస్టాండ్ సమీపంలోని ఎన్టీఆర్ విగ్రహం కూడలి వద్ద భారీగా వచ్చిన ప్రజలనుద్దేశించి మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అవినీతి కారణంగా ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. అగ్రవర్ణాల్లోని పేదలకు రిజర్వేషన్లు వర్తింపజేస్తానని హామీ ఇచ్చారు.

రవాణా రంగంలోని ్రడైవర్లకు ప్రభుత్వమే రూ. 5 లక్షల ప్రమాద బీమా సౌకర్యం కల్పించేలా చూస్తానన్నారు. ఆటో ్రడైవర్లను, ఓనర్ కం ్రడైవర్లగా మారుస్తానని ఇందుకు రూ. లక్ష వరకు రుణం ఇప్పించేలా చూస్తానన్నారు. ఎలాంటి విద్యార్హతతో సంబంధం లేకుండా పరీక్షలు నిర్వహించి లైసెన్స్‌లు మంజూరు చేయిస్తానన్నారు.

నగరాల్లో పార్కింగ్ ప్రదేశాలు ఏర్పాటు చేసి జరిమానాలు కట్టే పని లేకుండా చూస్తానన్నారు. ప్రజలకు మైకు అందించి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వారు చెప్పిన సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తుండటంతో సుమారు గంటకు పైగా మాట్లాడారు. ఏపీఎస్ ఆర్టీసీకి పూర్వ వైభవం తీసుకువస్తానని, ఇందులోని ఉద్యోగుల కోసం ప్రత్యేక పాలసీ రూపొందిస్తానన్నారు. స్థానికులకు స్థానికంగా ఉద్యోగాలు కల్పించేందుకు విజయవాడ, గుంటూరులను ట్విన్ సిటీస్‌గా అభివృద్ధి చేస్తానన్నారు. వ్యవసాయ ఆధారిత పరిశ్రమల స్థాపనతో పాటు ఐటీ రంగాన్ని ఇక్కడ ప్రోత్సహిస్తానన్నారు. ఔటర్ రింగ్ రోడ్డులు ఏర్పాటు చేసి రహదారులను అభివృద్ధి చేస్తానన్నారు. సాగర్ జలాల సమస్యను పరిష్కరించి కృష్ణా, గుంటూరు జిల్లాలకు సక్రమంగా సాగర్ జలాలు అందేలా చర్యలు తీసుకుంటానన్నారు. తాను అధికారంలోకి వచ్చిన వెంటనే రైతుల కోసం తొలి సంతకం రుణమాఫీపై పెడతానని, మహిళల కోసం బెల్టు షాపులు రద్దు చేయిస్తానన్నారు. అదే విధంగా అవినీతిపై పోరాటానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. అందివస్తున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని కాంగ్రెస్ ప్రభుత్వ అవినీతిని ఎండగట్టాలన్నారు. నేడు కొంత మంది సూట్ కేసుల మోజులో పార్టీలు మారుతున్నారని, అలాంటి వారికి తగిన గుణపాఠం చెప్పాలన్నారు. సామాజిక న్యాయం పేరుతో ఏర్పడిన ప్రజా రాజ్యం పార్టీ తర్వాత కాంగ్రెస్‌లో విలీనం అయిన విషయాన్ని గుర్తు చేస్తూ, జైలు పార్టీ కొన్ని స్థానాల్లో గెలిచినా, కేసులు మాఫీ కోసం తిరిగి కాంగ్రెస్‌లో కలుస్తుందని జోస్యం చెప్పారు. రానున్న ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీని గెలిపిస్తే ఉజ్వల భవిష్యత్ అందిస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తెలుగు దేశం పార్టీ నాయకులు కోడెల శివప్రసాదరావు, ప్రత్తిపాటి పుల్లారావు, కడియం శ్రీహరి, పెద్దిరెడ్డి, లాల్‌జాన్ భాషా, దూళిపాళ్ల నరేంద్ర, జీవీవీ ఆంజనేయులు, నక్కా ఆనందబాబు, నన్నపనేని రాజకుమారి, కవిత, జియావుద్దీన్, సుద్దాల దేవయ్య, విజయ రమణారావు, స్థానిక నాయకులు కొంపల్లి మాల కొండయ్య, బొల్లా నాగేశ్వరావుపాల్గొన్నారు.

సామాజిక న్యాయం.. టీడీపీ ధ్యేయం

తెలుగుదేశం పార్టీ నగర అధ్యక్షుడు బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ ఆ పార్టీ శ్రేణుల్లో సమరోత్సాహం నింపారు. పార్టీ నగర నాయకులందరిని ఒక తాటి పైకి తీసుకొచ్చి చంద్రబాబు వస్తున్నా... మీకోసం పాదయాత్రకు జనం బ్రహ్మరథం పట్టేలా తన సత్తాను చాటారు. ఎన్‌టీఆర్ కాలనీలో చంద్రబాబు పాదయాత్ర ప్రవేశించినప్పటి నుంచి ఆయన వెంటే ఉంటూ ఎక్కడికక్కడ ప్రజల సమస్యలు నివేదించారు. డివిజన్ స్థాయిలో కార్యకర్తలు మొదలుకొని నాయకుల వరకు ప్రతీ ఒక్కరిని చంద్రబాబుకు పరిచయం చేస్తూ వారిలో ఉత్సాహం నింపారు.

నగరమంతటా భారీ ఫ్లెక్సీలు, తోరణాలు ఏర్పాటు చేయించి పసుపు పరవళ్లు తొక్కేలా చేశారు. చంద్రబాబు పాదయాత్రకు రాష్ట్రంలో మరెక్కడా రానంతగా జనం హాజరయ్యేలా చేసేందుకు నెల ముందు నుంచే బోనబోయిన కసరత్తు ప్రారంభించి, ప్రణాళికలు అమలు చేశారు. తూర్పు నియోజకవర్గ ఇన్‌చార్జ్ ఎస్ ఎం జియావుద్దీన్, పశ్చిమ నియోజకవర్గ ఇన్‌చార్జ్ యాగంటి దుర్గారావును సమన్వయం చేసుకొని పలుమార్లు డివిజన్ నాయకులు, కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించారు. ఎక్కడా గ్రూపులకు తావివ్వకుండా అందరూ అధినేత పర్యటనలో కలిసి పాల్గొనేలా చేశారు. పశ్చిమ నియోజకవర్గంలో పాదయాత్ర జరిగిన తీరు చూసి చంద్రబాబే ఆనందం వ్యక్తం చేస్తూ శ్రీనివాస్... కీపిట్ అప్ అంటూ భుజం తట్టి ప్రోత్సహించడం విశేషం. టీడీపీ నగర అధ్యక్ష బాధ్యతలను మూడు నెలల క్రితమే చేపట్టిన బోనబోయిన పార్టీ శ్రేణుల్లో గూడుకట్టుకొని పోయి ఉన్న నిరాశ, నిస్పృహ, నిస్తేజాన్ని పారద్రోలి పూర్వవైభవం తీసుకురావడం కేడర్‌లో నూతనోత్సాహాన్ని నింపుతోంది. చంద్రబాబు పాదయాత్రను నగరంలో విజయవంతం చేసిన బోనబోయినను పార్టీ సీనియర్ నాయకులు ప్రత్తిపాటి పుల్లారావు, డాక్టర్ కోడెల శివప్రసాదరావు తదితరులు అభినందిస్తూ ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని సూచించారు. బీసీలకు 100 సీట్లు కేటాయిస్తానని చంద్రబాబు హామి ఇచ్చిన నేపథ్యంలో రానున్న ఎన్నికల్లో జిల్లాలోని ఏదో ఒక నియోజకవర్గంలో అవకాశం లభించ వచ్చని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

నగర టీడీపీలో సమరోత్సాహం నింపిన బోనబోయిన

పెదకాకాని: వస్తున్నా మీ కోసం పాదయాత్రలో భాగంగా తక్కెళ్ళపాడు బైపాస్ వద్దకు వచ్చిన చంద్రబాబుకు ఘన స్వాగతం లభించింది. తక్కెళ్ళపాడు రామచంద్రపాలెం, గ్రామాల నుంచి మహిళలు, యువకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి, స్వాగతం పలికారు. అడుగడుగునా మహిళలు చంద్రన్నకు హారతులిచ్చారు. నందివెలుగు రోడ్డు గుండా తక్కెళ్ళపాడు బైపాస్, సిబార్ కాలేజి, ఉప్పలపాడులోని గ్రామాల గుండా పాదయాత్ర సాగింది. అడుగడుగునా పూలు చల్లి, బాబుకు స్వాగతం పలికారు. నందివెలుగు రోడ్డు మొత్తం జనసంద్రంగా మారింది. తక్కెళ్ళపాడు బైపాస్ వద్ద నుంచి ఉప్పలపాడు వరకు 'దేశం' కార్యకర్తలు, మహిళలు, అభిమానులు బారులు తీరారు.

తమ ప్రియతమ నేత చంద్రబాబు రాక కోసం గంటలతరబడి రోడ్డు పక్కన వేచి ఉన్నారు. విశేషంగా తరలివచ్చిన మహిళలతో చంద్రబాబు కొద్ది సేపు ముచ్చటించారు. మీ కష్టాలు తీరుస్తానంటూ వారికి భరోసా ఇచ్చారు. తక్కెళ్ళపాడు బైపాస్ వద్ద పెద్ద ఎత్తున జనం తరలిరావడంతో ఆ ప్రాంతం జనసంద్రంగా మారింది. టీడీపీ నాయకులు వెలినేని శ్రీనివాసరావు (బాబు), గోగినేని అమరేంద్ర, మల్లికార్జునరావు తదితరులు బాబు వెంట నడిచారు. నందివెలుగు రోడ్డు పూర్తిగా జనంతో నిండిపోయింది.

తక్కెళ్ళపాడు, ఉప్పలపాడులో చంద్రబాబు పర్యటన విజయవంతంగా సాగింది. భారీ స్థాయిలో తరలివచ్చిన కార్యకర్తల మధ్య చంద్రబాబు అడుగులు వేశారు. చంద్రబాబు ప్రసంగంలో అధ్యంతం ఎన్టీ రామారావు పేరును ఉచ్చరించడం, తక్కెళ్ళపాడులో ఎన్టీఆర్ ఉన్నట్లు అప్పటి స్మృతులను చంద్రబాబు నాయుడు గుర్తు చేసుకున్నారు. దీంతో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు ఆనందం వ్యక్తం చేశారు.

చంద్రబాబుకు బ్రహ్మరథం


 రాష్ట్రంలో ముస్లిం మైనార్టీలకు మేలు చేసింది తెలుగుదేశం పార్టీనేనని చంద్రబాబు అన్నారు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో మంగళవారం పాదయాత్ర నిర్వహించిన చంద్రబాబు తన హయాంలో హజ్‌హౌస్, రెండో భాషగా ఉర్దూ, మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు, ప్రత్యేక డీఎస్‌సీ ద్వారా 1200 మంది ఉర్దూ టీచర్ల నియామకం, ఇంజనీరింగ్, మెడికల్ కళాశాలల ఏర్పాటు వంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశానన్నారు.

నేడు నాలుగు శాతం రిజర్వేషన్లు వచ్చాయంటే అది కూడా తమ చలవేనన్నారు. అయితే అది న్యాయ చిక్కులో పడిందన్నారు. తాము అధికారంలోకి వస్తే ముస్లింలకు చట్ట సభల్లో ఎనిమిది శాతం రిజర్వేషన్లు కల్పిస్తామన్నారు. కేంద్రం పరిధిలో ఉంటే పోరాడి సాధిస్తామని చెప్పారు. అలానే రూ. 2,500 కోట్ల మైనార్టీల సంక్షేమానికి చర్యలు చేపడతామన్నారు. అసెంబ్లీలో 15 సీట్లు మైనార్టీలకు ఇస్తామన్నారు. ఇనాంలు, మతవలీలకు రూ. ఐదు వేల చొప్పున భృతి చెల్లిస్తామని హామీ ఇచ్చారు.

గుంటూరు - విజయవాడకు మెట్రో రైలు తీసుకొస్తా..

గుంటూరు, విజయవాడ నగరాలను కలిపేసి ఒక మహానగరంగా తీర్చిదిద్దుతాని చంద్రబాబు పునరుద్ఘాటించారు. ఇక్కడే ఐటీహబ్, వ్యవసాయాదారిత పరిశ్రమలు, ఆటోమొబైల్ కేంద్రం నెలకొల్పి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని హామి ఇచ్చారు. గుంటూరు - విజయవాడ మధ్య ప్రయాణాన్ని అరగంటకు తగ్గించేందుకు అవసరమైన మెట్రో రైలును ఏర్పాటు చేస్తానని చెప్పారు.

నా పోరాటం ఆర్థిక స్వాత్రంత్యం కోసం

నేను చేసేది ధర్మ పోరాటం. అవినీతికి వ్యతిరేక పోరాటం. నీతిని కాపాడే పోరాటమని చంద్రబాబు పాదయాత్రలో పలుచోట్ల అన్నారు. దేశంలో ఏ ఒక్కడు అవినీతికి పాల్పడకపోతే ఆ దేశంలో పేదరికం ఉండదు. నా పోరాటం ఆర్థిక స్వాత్రంత్యం కోసం. నాడు గాంధీజీ బ్రిటీష్ వారి పై పోరాడి మనకు రాజకీయ స్వాత్రంత్యం తెచ్చి పెట్టారు. నేను పేదవాళ్లు, రైతుల భవిష్యత్తు కోసం పోరాడుతున్నాను.

పదేళ్లుగా వేధిస్తున్నారు..

బాబుకు చంద్రబాబు కాలనీ మహిళ వినతి


'అయ్యా నగర శి వారులో గుడిసెలు వేసుకున్నాం.. దానికి చంద్రబాబు కాలనీ అని పేరు పెట్టుకున్నాం... పదేళ్లు గా ఇళ్ల స్థలాల పట్టాల కోసం తిరుగుతున్నాం... పట్టాలు అడిగితే కేసులు పెట్టి వేధిస్తున్నారు... మీరే కాపాడాలి.. అని వస్తున్నా మీ కోసం పాదయాత్రలో చంద్రబాబు కాలనీ మహిళలు వారి గోడు వెళ్ల బోసుకున్నారు. బస్టాండ్ సమీపంలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద చంద్రబాబు ప్రజల ను ఉద్ధేశించి కొంత సేపు ప్రసంగించారు.

ఈ సమయంలో పలువురిని వారి సమస్యలు చెప్పాలని చంద్రబాబు కోరారు. దీంతో చంద్రబాబు కాలనీకి చెందిన పలువురు మహిళలు మాట్లాడా రు. ' నగర శివారులో పొన్నూరు రోడ్డులో ఇళ్లు కట్టుకుని ఓ కాలనీ ఏర్పాటు చేసుకున్నాం. దానికి చంద్రబాబు కాలనీ అన్న పేరు పెట్టాం. పదేళ్ళుగా ఆ ఇళ్ల స్థలాలకు పట్టాలు ఇవ్వమని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అడిగిన ప్రతిసారీ కేసు పెట్టి వేధిస్తున్నారు. మీరు అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చిన రేషన్ కార్డు మాత్రమే ఉంది. ఆ తరువాత ఎలాంటి లబ్ధీపొందలేదు. మీరు అధికారంలోకి రావాలి. మా కష్టాలు తీర్చాలి.' అని వారు గోడు వెళ్లబోసుకున్నారు. దీనికి స్పందించిన చంద్రబాబు అవినీతి కాం గ్రెస్ పార్టీ దోచుకున్న డబ్బుతో కోటి మందికి లక్ష రూపాయలతో పక్కా ఇళ్లు కట్టించి ఇవ్వవచ్చన్నారు. తాము అధికారంలోకి వస్తే ఇళ్ల స్థలాల కు పట్టాలు ఇవ్వడంతో పాటు అర్హులైన పేదలకు రూ.లక్షతో ఇళ్లు కట్టించి ఇస్తానని హామీ ఇచ్చారు.

సమస్యలు పరిష్కరించండి

- ఆర్టీసి ఉద్యోగులు

ఆర్టీసి ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని సంస్థ ఉద్యోగులు కొందరు వస్తున్నా మీ కోసం పాదయాత్రలో చంద్రబాబును కలసి కోరారు. మంగళవారం పాదయాత్ర బస్టాండ్ సమీపంలో నుండి వెళ్లే సమయంలో డిపో వద్ద కొందరు కార్మికులు చంద్రబాబును కలిసారు. పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రం అందించారు. దీనికి స్పందించిన చంద్రబాబు మాట్లాడుతూ ప్రభుత్వం రూ. 400 కోట్లకు ఆర్టీసీ స్థలాలను బ్యాంకులకు తాకట్టు పెట్టిందన్నారు. దీనికి నెలకు రూ. కోటికిపైగా వడ్డీ కడుతుందన్నారు. పెరిగిన డీజిల్ ధరల కారణంగా ఆర్టీసీపై మరో రూ. 700 కోట్ల భారం పడుతుందన్నారు. ఇంకో వైపు కాంగ్రెస్ ప్రభుత్వం విచ్చలవిడిగా వేస్తున్న పన్నులు ఆర్టీసీకి భారంగా పరిణమించాయన్నా రు ఆర్టీసీని ్రపైవేటు పరం చేయాలన్న దురుద్ధేశం తో ప్రభుత్వం ఇలాంటి పనులు చేస్తుందన్నారు. తెలుగు దేశం పార్టీ అధికారంలోకి వచ్చాక ఆర్టీసీకి పూర్వ వైభవం తీసుకువస్తానన్నారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక పాలసీ రూపొందిస్తానన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ఆర్టీసీ ఉద్యోగులు పాల్గొన్నారు.

టీడీపీ వల్లే గుంటూరు అభివృద్ది

 కాంగ్రెస్ ప్రభుత్వం తొమ్మిది సంవత్సరాలు అధికారంలో ఉన్నా చెప్పుకోదగి న అభివృద్ది కార్యక్రమాలు ఏమీ చేయలేదని చం ద్రబాబు నాయడు ఆరోపించారు. మంగళవారం పాదయాత్రలో ఎన్టీ ఆర్ బస్టాండ్ వద్ద ఆయన మాట్లాడుతూ టీడీపీ వల్లే గుంటూరు ఇంతగా అభివృద్ది చెందిందని ఆయన గుర్తుచేశారు. పలు అవస్థాపనా సౌకర్యాలు, బృందావన్‌గార్డెన్స్‌లోని ఎన్టీఆర్ స్టేడియం, మణిపురం బ్రిడ్జి, మా నససరోవరం పార్క్, ఎన్టీఆర్ స్టేడియం, మైనారిటీ షాదిఖానాలు, మాయబజార్‌లో షాపింగ్ కాంప్లెక్స్‌లు, రెడ్ ట్యాంక్ ద్వారా తాగునీటి సదుపాయాలు, రైతు బజార్లు లాంటి అనేక అభివృద్ది కార్యక్రమాలు తెలుగుదేశం హయాంలోనే అభివృద్ది చేశామని చంద్రబాబు చెప్పారు. టీడీపీ అధికారంలోకి రాగానే గుంటూరులోని శిధిలావస్థలో ఉన్న జిన్నాటవర్‌ను అభివృద్ది పరచి దాని ప్రాభవం నిలబడే విధంగా కృషి చేస్తామన్నారు.

లయన్స్ క్లబ్ సేవలు విస్తరించండి
దేశంలో పేద, ధనికుల మధ్య అంతరాలను తగ్గించేందుకు లయన్స్ క్లబ్‌లు విశేషంగా కృషి చేస్తున్నాయని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. లయన్స్ క్లబ్ మాజీ గవర్నర్ నూతలపాటి వీర ప్రకాశరావు ఆధ్వర్యం లో లయన్స్ క్లబ్, మెల్విన్ జోన్స్, గుంటూరు గ్రేటర్, కె ఎస్ ఆర్ క్లబ్ ఆధ్వర్యంలో మంగళవా రం సంగడిగుంటలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ప్ర పంచంలో అతిపెద్ద సేవా సంస్థ అయిన ల యన్స్ క్లబ్‌లో మన రాష్ట్రం నుంచి చిగురుపాటి వరప్రసాద్ ఇంటర్నెషనల్ బోర్డు ఆఫ్ డైరెక్టర్‌గా పది దేశాల్లో కోట్లాది రూపాయలతో సేవా కార్యక్రమాలు అందించారని ప్రశంసించారు. చంద్రబాబును కలిసిన వారిలో క్లబ్ అధ్యక్షులు ఈశ్వరరావు, కృష్ణమూర్తి, నాగేశ్వరరావు, సుబ్బయ్య, ఆదిశేషయ్య, కళ్యాణ్, నవీన్‌చంద్ ఉన్నారు.

బాబును కలిసిన మాజీ ఎంపిీ వైవీరావు

 'వస్తున్నా...మీకోసం' చంద్రబాబు చేస్తున్న పాదయాత్రలో చంద్రబాబును మంగళవారం ఉదయం 9 గంటల ప్రాంతంలో ఆయన బస చేసిన ప్రాంతంలో మాజీ ఎంపి వైవిరావు కలిశారు. పేదలు, రైతుల సంక్షేమం కోసం ముందుకు సాగుతున్న చంద్రబాబును అభినందించారు. అనంతరం వైవిరావు విలేకరులతో మాట్లాడుతూ ప్రపంచ రాజకీయాలలో మొదటి సారిగా ఎన్టీఆర్ 36వేల కిలోమీటర్లు దూరాన్ని చైతన్య ర«థంలో ప్రయాణించి కాంగ్రెస్‌ను మట్టి కరిపించారన్నారు. అదే స్పూర్తితో వస్తున్నా మీ కోసం ద్వారా చంద్రబాబు 2వేల కిలోమీటర్లు దాటి అలుపెరుగని యోధుడిలా ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్నారన్నారు.

ఆకర్షణగా నిలిచిన కవిత, నన్నపనేని

చంద్రబాబు పా దయాత్రలో మంగళవారం తెలగు దేశం పార్టీ మహిళా నాయకురాళ్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఎమ్మెల్సీ నన్నపనేని రాజకుమారి, సినీ న టి కవిత పాదయాత్రకు ముందు వెళ్తూ మహిళలతో ముచ్చటించారు. మీ సమస్యలు తెలుసుకునేందుకు చంద్రబాబు వస్తున్నారు.. మాట్లాడండి అంటూ వారిలో ఉత్సాహం నింపారు.

ఏర్పాట్ల పర్యవేక్షణలో మన్నవ..

చంద్రబాబు పాదయాత్ర ఏర్పాట్లును ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి మన్నవ సుబ్బారావు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. పాదయాత్ర తా జా సమాచారం తెలుసుకుని జిల్లా నాయకులకు, అటు రాష్ట్ర నాయకులకు అందిస్తూ ముందుకు సాగుతున్నారు. పాదయాత్ర రూట్‌మ్యాప్ ఏర్పా ట్లు, వసతి వంటి వాటి గురించి అందరితో చర్చించి నిర్ణయాలు జరిగేలా చూస్తున్నారు.

బాబు చేతుల మీదుగా

బాలికకు అన్నప్రాసన


వస్తున్నా మీ కోసం యాత్రలో చంద్రబాబు దామోదర సంజీవయ్యనగర్‌లో ఓ బాలికకు అన్నప్రాసన నిర్వహించారు. డీఎస్‌నగర్‌కు చెం దిన బొల్లా సురేష్ కుమార్, అనూషలు తమ సం తానమైన దేదీప్యకు మంగళవారం నాడు చంద్రబాబు చేతుల మీదుగా ఆన్నప్రాసన చేయించా రు. దేదీప్య నోటిని తేనెతో తీపి చేసి చంద్రబాబు అన్నప్రాసన తంతు పూర్తి చేశారు. తమ అభిమా న నేత చేతుల మీదుగా కుమార్తెకు అన్నప్రాసన చేయించడం ఆనందంగా ఉందని ఈ సందర్భం గా సురేష్, అనూషలు పేర్కొన్నారు.

నగర నేతల్లో

ఉప్పొంగిన ఉత్సాహం


చంద్రబాబు పా దయాత్ర నగరంలో విజయవంతం కావడంతో తెలుగుదేశం పార్టీ నగర శ్రేణుల్లో ఉత్సాహం తొణికిసలాడుతోంది. చంద్రబాబు పాదయాత్ర శనివారం ఎన్‌టీఆర్ నగర్‌లో అడుగు పెట్టినప్ప టి నుంచి మంగళవారం సాయంత్రం మానససరోవరం వద్ద నగరం దాటేంత వరకు వీధులన్ని జనంతో నిండిపోయాయి. సోమవారం సిద్ధార్థ గార్డెన్స్ నుంచి బృందావన్‌గార్డెన్స్, దేవాపురం, అశోక్‌నగర్, బ్రాడీపేట, ఏటీ అగ్రహారం, శ్రీనివాసరావుతో ట, నల్లచెరువు, ఏటుకూరు రోడ్డు ప్రాంతాలు చం ద్రబాబు పాదయాత్రతో జనసంద్రంగా మారా యి. గుంటూరు తూర్పు నియోజకవర్గంలోనూ చంద్రబాబు యాత్రకు అదే స్పందన లభించడం తో నగర నేతలు మంచి జోష్‌తో ఉన్నారు. పార్టీ నగర అధ్యక్షుడు బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, ఇన్‌చార్జ్‌లు యాగంటి దుర్గారావు, ఎస్ ఎం జియావుద్దీన్ తమ నాయకులు, కార్యకర్తల ను సమన్వయం చేసుకొన్న తీరు జిల్లా నేతలను ఆకర్షించింది. పాదయాత్ర పొడవునా నగర నాయకులు వేములపల్లి శ్రీరామ్‌ప్రసాద్, ముత్తినేని రాజేష్, మ్యానీ, ఎలుకా వీరాంజనేయులు, సుకవాసి శ్రీనివాసరావు, ముప్పాళ్ల మురళీకృష్ణ, శివప్రసాద్, నాగేశ్వరరావు, ఎలుకా వీరాంజనేయులు, గోళ్ళ ప్రభాకర్, చిట్టిబాబు, కొంపల్లి మాలకొండయ్య, జాగర్లమూడి శ్రీనివాసరావు, వజ్జా రామకృష్ణ, విజయలక్ష్మి, పానకాల వెంకటమహాలక్ష్మి, ములకా సత్యవాణి, ఉమాదేవి కార్యకర్తలను సమన్వయం చేసుకొంటూ చంద్రబాబుకు సమస్యలు వివరి స్తూ నడిచారు. ఈ సందర్భంగా బోనబోయిన మాట్లాడుతూ నగరంలో టీడీపీకి పూర్వవైభవం తీసుకొచ్చి తూర్పు, పశ్చిమ నియోజకవర్గాలతో పాటు మేయర్ పీఠాన్ని గెలుపొందడమే తమ లక్ష్యమన్నారు.

మైనార్టీలకు మేలు చే సింది టీడీపీనే..

పాదయాత్రలో మరో మైలురాయి దాటాను. ఈ సుదీర్ఘ ప్రయాణంలో మజిలీలు లేవు. అడుగులోనే ఆనందం వెతుక్కున్నాను. నడకలోనే నా వాళ్లను కలుసుకున్నాను. పాదపాదాన ప్రజల దీవెనలు పొందాను. యాత్ర అంతటా యాతనల బతుకు ఈడుస్తున్న బడుగుల కన్నీటి మడుగులో తడిశాను. నేనూ కన్నీళ్లు పెట్టాను. నేనూ గాయపడ్డాను. నేనూ భుజం కోసం వెతుక్కున్నాను. ఎర్రన్నాయుడు లేని లోటు మరింతగా బాధిస్తోందిప్పుడు. హిందూపురంలో ఉత్సాహంగా పడిన ఎర్రన్న అడుగు, చివరిదాకా అండగా ఉంటుందనుకున్నాను.

ఆయన ఊరికి నా పాదయాత్ర వెళితే.. ఎవరు ఎదురొస్తారు? గుంటూరు పట్టణంలో యుగపురుషుడు ఎన్టీఆర్ విగ్రహం సమక్షంలో 2000 కిలో మీటర్ల నడక పూర్తి చేసుకోవడం నా అదృష్టం. ఆయన స్ఫూర్తితోనే ప్రజా సమస్యలపై నా యాత్ర నిర్విఘ్నంగా సాగుతోంది. అవినీతి సమస్యపై ప్రజల్లో గొప్ప చైతన్యం రగిలించింది. ఈ ప్రజా ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలన్న సంకల్పంతోనే అడుగేస్తున్నాను.

ఇక్కడ కోటీశ్వరులను చూశాను. ఒక రోజు కూలికి పోకపోతే పస్తులుండాల్సిన పేదల బతుకూ చూశాను. పేద, ధనికుల మధ్య ఇంతటి వ్యత్యాసమా? ఇది క్షేమం కాదు. ఒక్క ఈ పట్టణంలోనే వందకుపైగా మురికివాడలున్నాయి. వాటి రూపురేఖలు మారాలి. పట్నం బజారు గుండా పోతున్నప్పుడు చిరు వ్యాపారుల చింతలు విన్నాను. పొద్దున్నే నిద్ర లేచిన దగ్గరనుంచికనిపించిన దేవుడికల్లా మొక్కుకుంటున్నారట.

రకరకాల అనుమతుల పేరుతో తమను వేధింపులకు గురిచేయకుండా చూడాలని కోరుకోని రోజు లేదట. "ఒక చిన్న వ్యాపారం చేసుకునేందుకు ఇన్ని అనుమతులు అవసరమా సార్..?''. వాళ్లడిగిన ఈ ప్రశ్న అర్థవంతమైనదే అనిపించింది. కార్లలోనో, హెలికాప్టర్లలోనో వచ్చి హామీలిచ్చిన వాళ్లను చూశారు. గాయపడ్డ పాదాలతో నడిచొచ్చిన నన్నూ చూశారు. ఇక ముందూ నా ధీమా ఇదే!

యాతనల బతుకుల్లోకి యాత్రగా..!

ఈ చర్చను పల్లెలకు చేర్చండి

"తొమ్మిదేళ్ల తెలుగుదేశం ప్రభుత్వం సమర్థవంతమైన పాలన, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ అస్తవ్యస్థ పరిపాలనపై డిబేట్ ప్రారంభమైంది. ఈ చర్చను మారుమూల పల్లెలకూ విస్తరింపజేయండి'' అని శ్రేణులకు చంద్రబాబు పిలుపునిచ్చారు. ్ఖగుంటూరు పట్టణంలో తాను బస చేసిన ప్రాంతం నుంచి పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇతర బాధ్యులతో ఆయన టెలికాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు.

సహకార సంఘాల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేసిన నేతలను ఆయన అభినందించారు. సభ్యత్వ నమోదు నుంచి ఎన్నికల వరకు ప్రభుత్వం అడుగడుగునా అడ్డంకులు కల్పించినప్పటికీ తెలుగుదేశం పార్టీ తన పట్టును నిరూపించుకుందని చంద్రబాబు పేర్కొన్నారు. పాదయాత్ర తీరుపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నెల 15 నుంచి 'పల్లెపల్లెకు తెలుగుదేశం' కార్యక్రమాన్ని పునప్రారంభించాలని పిలుపునిచ్చారు.

మండలికి పట్టభద్రుల నియోజకవర్గాలనుంచి పోటీ చేస్తున్న చిగురుపాటి వరప్రసాద్, కాసుమిల్లి వెంకటసూర్యనారాయణ (చినబాబు), జే. చంద్రశేఖర్ గెలుపుకోసం రెట్టించిన ఉత్సాహంతో పనిచేయాలని కోరారు. ఈ నెల 19, 21, 23, 25 తేదీల్లో విజయవాడ, విశాఖపట్నం, వరంగల్, హైదరాబాద్ జిల్లాల్లోని వివిధ డిస్కంల పరిధుల్లో నిర్వహించే పబ్లిక్ హియరింగ్‌లకు ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇన్‌చార్జ్‌లు, కో ఆర్డినేటర్లు పార్టీ శ్రేణులతో కలిసి హాజరు కావాలని కోరారు.

టీడీపీ అనుకూల గాలులపై శ్రేణులకు బాబు పిలుపు

వాళ్లు నీతిమంతులా?
అలా అంటే మల మూత్రాలు పడేలా తంతారు!
నా ఇల్లు, జగన్ ఇల్లు చూసి..
అవినీతిపరులెవరో తేల్చండి
అసలు ఈయనేం ముఖ్యమంత్రో?
రాష్ట్రానికి 'కాంగ్రెస్' చెదలు వదిలించాలి
తొలి రోజే వస్త్ర వ్యాపారాలపై వ్యాట్ ఎత్తివేస్తా
రెండు వేల కిలోమీటర్ల నడక పూర్తి

" దేశ స్వాత్రంత్యం కోసం మహాత్మాగాంధీ, రాజ్యాంగం కోసం అంబేద్కర్, తెలుగుజాతి ఆత్మగౌరవం కోసం ఎన్‌టీఆర్ చేసిన త్యాగాల గుర్తుగా వారి విగ్రహాలు పెట్టుకొని పూజించుకుంటున్నాం. కానీ, రూ.లక్ష కోట్లు కొడుక్కి దోచి పెట్టిన వైఎస్‌కు లక్ష విగ్రహాలు పెట్టడం ఇదెక్కడి నీచం? వైఎస్‌ను ఎవరూ ఆదర్శంగా తీసుకోకూడదు. నేను నీతిగా ఉంటూ నిప్పులా బతుకుతున్నాను. తల్లి, పిల్ల కాంగ్రెస్‌లు నీతిగా ఉన్నామని చెబితే వాళ్ల బట్టలూడతాయి. బట్టల్లోనే మలమూత్రాలు వదిలేలా ప్రజలు తరిమి కొడతారు''
- గుంటూరు జిల్లా పాదయాత్రలో చంద్రబాబు

మహాత్మాగాంధీ, అంబేద్కర్, ఎన్టీఆర్ వంటి ఎందరో చేసిన త్యాగాల గుర్తుగా వారి విగ్రహాలు పెట్టుకొని పూజించుకుంటున్నాం. అలాంటిది రూ.లక్ష కోట్లు కొడుక్కి దోచిపెట్టిన వైఎస్‌కు లక్ష విగ్రహాలు పెట్టడం ఇదెక్కడి నీచం?'' అని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. వైఎస్‌ను ఎవరూ ఆదర్శంగా తీసుకోరాదని కోరారు. కాంగ్రెస్ పార్టీ తొమ్మిదేళ్ల పాలనలో ర్రాష్టానికి చెదలు పట్టిందని, సర్వనాశనం చేస్తున్న ఆ పార్టీని పూర్తిగా వదిలించుకోవాలని పిలుపునిచ్చారు. గుంటూరు పట్టణం ఏటుకూరు రోడ్డు డీఎస్ నగర్‌లో మంగళవారం ఆయన పాదయాత్ర ప్రారంభించారు. పట్టణంలోని ఎన్టీఆర్ ఐలాండ్ వద్ద 2000 కిలోమీటర్ల మైలురాయిని అధిగమించారు.

అంతే.. ఒక్కసారిగా రాష్ట్రమంతటా టీడీపీ శ్రేణులు, అభిమానులు ఆనందోత్సాహాల్లో తేలిపోయా రు. పసుపురంగు బెలూన్లు, ఆకాశదీపాలను గాలిలోకి వదిలారు. భారీ కేక్‌ను చంద్రబాబుతో కట్ చేయించి సం బరాలు చేసుకొన్నారు. అధినేత ఆరోగ్యం కోసం ప్రత్యేక పూజలు చేయించారు. పార్టీ ప్రధాన కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌లోనూ పండగ వాతావరణం నెలకొంది. యాత్రలో భాగంగా ప్రజల కష్టసుఖాలు విచారించారు. జగన్, సీఎం కిరణ్‌లపై విరుచుకుపడ్డారు. "హైదరాబాద్ లోటస్‌పాండ్‌లో జగన్ ఇల్లు, జూబ్లీహిల్స్‌లో నా ఇల్లు చూడండి. ఎవరు అవినీతిపరులో మీరే తేల్చండి. ఏటా నా కుటుంబ ఆస్తులు ప్రకటిస్తున్నాను. కానీ, నాకు సింగపూర్‌లో హోటల్ ఉందన్నారు. ఎక్కడుందో చూపిస్తే రాసిస్తానని సవాలు విసిరితే తోక ముడిచారు'' అని ఎద్దే వాచేశారు. ఈయనేమి ముఖ్యమంత్రో అర్థం కావడం లేదని కిరణ్‌ను దుయ్యబట్టారు.

"ఈ కిరికిరి సీఎం రూపాయికి కేజీ బియ్యం అన్నాడు. మొన్న సన్నబియ్యం రూపాయికే అన్నాడు. మరునాడే మాటమార్చి మంచి బియ్యం అని చెప్పాడు. అంటే ఇప్పటిదాకా ఇచ్చింది చెడ్డబియ్యమేకదా?'' అన్నారు. ఆడపిల్లల హ క్కులు, రక్షణ బాధ్యత తీసుకొంటానని వాగ్దానం చేశారు. కామాంధులకు ఉరి శిక్ష వేయిస్తానని పునరుద్ఘాటించారు. బెల్టుషాపులకు తలుపులు తెరిచి ఆడబిడ్డల మంగళసూత్రాలతో ఈ ప్రభుత్వం ఆడుకొంటోందని ఆగ్ర హం వ్యక్తం చేశారు. కరెంటు బాంబులేసి 10 లక్షల చిన్న పరిశ్రమలను దివాలా తీయించిం దన్నారు.

లక్షలమంది పొట్ట కొట్టిందని ఆవేదన వ్యక్తం చేశా రు. తాను నీతిమంతమైన పాల నతో జవాబుదారీగా నిలిస్తే వైఎ స్ రాక్షసపాలనగా మార్చేశాడని నిప్పులుచెరిగారు. బెంగళూరు, లోటస్‌పాండ్, ఇడుపులపాయ, పులివెందుల, కడప, చెన్నైలో ప్యాలెస్‌లు నిర్మించి, వాటిని దె య్యాలు కాపురం ఉండే కొంపలుగా తయారుచేశారన్నారు. వస్త్ర వ్యాపారంపై వ్యాట్‌ను అధికారంలోకి వచ్చిన తొలిరోజే ఎత్తివేస్తానని హామీ ఇచ్చారు. అలాగే రూ.20-30 లక్షల మధ్య టర్నోవర్ ఉన్నవారికి సెల్ఫ్ అసెస్‌మెంట్ అమలు చేస్తానన్నారు. ఎఫ్‌డీఐలతో 4కోట్ల మంది చిరు వ్యాపారుల జీవితాలు చితికిపోయే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తంచేశారు.

19న విరామం
గుంటూరు, కృష్ణాజిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్ని కల నేపథ్యంలో కోడ్ కారణంగా 19న సాయంత్రం ఐదు గంటలకు చంద్రబాబు పాదయాత్రను వేమూరు నియో జకవర్గంలో నిలిపేస్తారు. తిరిగి 21 సాయంత్రం 5 గంటలకు ప్రారంభిస్తారు. దీంతో 17న ఆదివారం విరా మం ఉండదని టీడీపీ జిల్లా అధ్యక్షుడు ప్రత్తిపాటి పుల్లా రావు తెలిపారు. కాగా, చంద్రబాబు ఇచ్చిన ప్రతి హామీ ని అధికారంలోకి వస్తే అమలు చేస్తామని పార్టీ నేత దాడి వీరభద్ర రావు హైదరాబాద్‌లో ప్రకటించారు.

లక్ష కోట్లు దోచాడనా.. వైఎస్‌కు లక్ష విగ్రహాలు?