February 11, 2013

వైఎస్.. ఓ కబంధుడు!
అదే దారిలో కిరణ్.. తిరుమల కొండపై స్మగ్లింగ్‌కు అండ
వీళ్ల పని ఎలా పట్టాలో ఆ దేవుడికి తెలుసు
గుంటూరు పాదయాత్రలో చంద్రబాబు హెచ్చరిక

  "పూర్వం కబంధుడనే రాక్షసుడు ఉండేవాడు. అతడికి పెద్ద చేతులు, పొట్ట, నోరు ఉండేది. దేనినైనా మింగేయడమే పని. అలాంటి కబంధ రాక్షసుడే చనిపోయిన ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి. కొడుకు జగన్‌మోహన్‌రెడ్డికి రూ. లక్ష కోట్లు దోచి పెట్టాడు. అల్లుడు అనిల్‌కుమార్‌కు బయ్యారంలో లక్షా 45 వేల ఎకరాల ఖనిజ సంపదను వరకట్నంగా ఇచ్చాడు. హైదరాబాద్‌లో ఎనిమిది వేల ఎకరాల భూమిని 53 కంపెనీలకు ఇచ్చి వాటి నుంచి ముడుపులు పొందాడు. వాటిని దొంగ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టించాడు. ఓబులాపురంలో ముడి ఖనిజ సంపదనంతా కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దనరెడ్డికి అప్పగించాడు'' అని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

తిరుమల వెంకన్నతో పెట్టుకోవద్దని నాడే వైఎస్‌ను హెచ్చరించానని గుర్తుచేశారు. గుంటూరు పట్టణం రింగురోడ్డులోని సిద్ధార్థ గార్డెన్స్ నుంచి సోమవారం ఆయన పాదయాత్ర ప్రారంభించారు. నాడు వైఎస్, నేడు కిరణ్ ఒకే తప్పు చేస్తున్నారని ఈ సందర్భంగా ఆయన గట్టిగా హెచ్చరించారు. "తిరుపతి కొండల్లో విశాలమైన భూమి ఉండటంతో నేను ఆనాడు ఎర్రచందనం మొక్కలు నాటించాను. కాంగ్రెస్ దొంగలు ఆ ఎర్ర చందనాన్ని స్మగ్లింగ్ చేస్తున్నారు. స్మగ్లర్లకు సీఎం కిరణ్ కొమ్ము కాస్తున్నారు.

తిరుపతి వెంకటేశ్వరస్వామికి అపకారం చేస్తే వాళ్ల భరతం పట్టే పని ఆయనే చూసుకొంటారు. అసెంబ్లీ సాక్షిగా నేను వైఎస్‌కు కూడా చెప్పారు. ఎవరి జోలికి పోయినా ఫర్వాలేదు కాని వెంకటేశ్వరస్వామి జోలికి వెళ్ళొద్దన్నాను. ఆయన నా మాట వినలేదు. నేను చిన్నప్పటి నుంచి ఆ వెంకన్న స్వామి పాదాల చెంతన ఉన్నాను. ఆయన పవర్ ఏమిటో నాకు తెలుసు'' అని వివరించారు. వైఎస్ పుణ్యాన గాలి జనార్దనరెడ్డి మొత్తం ఖనిజాన్ని దోచేశారని, కంచం, మంచం, కుర్చీతో పాటు తాను వినియోగించే వస్తువులన్నింటిని బంగారంతో చేయించుకొని.. ఆడబిడ్డలు బంగారు తాళిబొట్టులూ కొనలేని పరిస్థితి కల్పించాడని దుయ్యబట్టారు.

కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రజల ఎన్నుకొన్న ముఖ్యమంత్రి కాదని, సోనియాగాంధీ పంపిన సీల్డ్‌కవర్ సీఎం అని చంద్రబాబు ఎద్దేవా చేశారు. ఢిల్లీకి వెళ్లి రెండు ఇంగ్లీషు ముక్కలు మాట్లాడటంతో కాంగ్రెస్ పెద్దలు ఆయన ఏదో సాధిస్తాడని పదవి కట్టబెట్టారని ఎద్దేవా చేశారు. తన పీఠం కాపాడుకొనేందుకు ఏదైనా చేస్తారని దుయ్యబట్టారు. దొంగ మంత్రులను కాపాడుతున్న కిరణ్ కూడా నేరస్థుడేనని మండిపడ్డారు. అనంతరం 100 మంది చర్మకారులకు మాదిగ అభివృద్ధి సంస్థ, లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో చంద్రబాబు గొడుగులు పంపిణీ చేశారు. నీట్ పరీక్ష రద్దుకు సీఎం కిరణ్‌కు లేఖ రాయడంతో పాటు పోరాటం చేస్తానని..విద్యార్థులకు హామీ ఇచ్చారు.

జగన్ పేపర్, టీవీ చూడొద్దు
విషకన్య లాంటి జగన్ టీవీని చూడొద్దని, పేపర్‌ను చదవొద్దని చంద్రబాబు పిలుపునిచ్చారు. జగన్ తన నేరాలను ఆ టీవీ, పేపర్‌తో కప్పి పెట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. కాగా,పాదయాత్రపై వ్యతిరేక వార్తలు రాస్తోందంటూ గుంటూరులోని జగన్ పత్రిక కార్యాలయంపై టీడీపీ కార్యకర్తలు రాళ్లు వేశారు. పాదయాత్ర బ్రాడీపేట దాటుతుండగా జరిగిన ఈ ఘటనలో కార్యాలయం అద్దాలు పగిలాయి.

రాష్ట్రాన్ని భోంచేశాడు.. వెంకన్నతో పెట్టుకోవద్దని చెప్పా

జనాదరణతో అడుగు ముందుకు పడడం లేదు. గుంటూరు పట్టణంలో అడుగడుగునా ఆడపడుచులు చూపిన అభిమానం నన్ను ముందుకు కదలనీయలేదు. ఇది ఏ జన్మ సుకృతమో! ఇన్ని లక్షలమంది అభిమానానికి నోచుకుంటున్నా. నా పాదయాత్ర జరుగుతున్న ప్రాంతంలో ఏ ఒక్క ఆడపడుచు ఇళ్లల్లో లేరు. రోడ్డుకు ఇరువైపులా నా రాక కోసం బారులు తీరి కనిపించారు.

కష్టాల్లో ఉన్నవాళ్లకు అండగా నిలవడం కోసం నేను వచ్చాను. కానీ, నా రాక వాళ్లలో పండుగ వాతావరణాన్ని నింపింది. అడుగడుగునా పూలతో స్వాగతం పలుకుతున్నారు. సొంత అన్న కంటే మిన్నగా నన్ను ఆదరిస్తున్నారు. కొందరైతే, రోజుల బిడ్డలను చేతుల్లో పొదివి పట్టుకుని పేరు పెట్టాలంటూ నన్ను అడుగుతున్నారు. అందరి ముఖాల్లో చిరునవ్వులు కనిపిస్తున్నాయి. కానీ, కళ్లల్లో మాత్రం దిగులు కదలాడుతోంది. కదిలిస్తే పాలకులపై భగ్గుమంటున్నారు.

శివనాగరాజు కాలనీలో కష్టాలు చెప్పాలని మైకు ఇవ్వగానే, మహిళలంతా ఈ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. సర్టిఫికెట్లో పేరు మార్చుకోవడానికి ఎమ్మార్వో కార్యాలయానికి వెళితే రూ.5000 లంచం అడిగారని ఓ సోదరి ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నో ఏళ్లుగా ఇళ్లు కట్టుకుని ఉంటున్న తమను పట్టాలు లేవని బెదిరించి, స్థలాలు లాక్కుంటున్నారని మరో మహిళ ఆందోళన చెందింది. పింఛను కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ చెప్పులరిగేలా తిరుగుతున్నానని మరో అవ్వ కన్నీళ్లపర్యంతమైంది. బహిరంగ సభల్లో సైతం కష్టాల్లో ఉన్నవాళ్లు చేతులు ఎత్తండి అని కోరితే, అక్కడున్న వేల మంది ముక్తకంఠంతో తాము కష్టాల్లో ఉన్నామని చెబుతున్నారు. ఈ ప్రభుత్వానికి కళ్లు, చెవులు ఉంటే ముందు వాళ్ల గోడు వినాలి.

ఏ జన్మ సుకృతమో..!

కిరణ్ దుకాణం తెరిచాడు
ఉద్యోగాలను సొమ్ము చేసుకుంటున్నాడు
లోటస్‌పాండ్‌లో దెయ్యాల కాపురం
లోక కల్యాణం కోసమే పాదయాత్ర: చంద్రబాబు

ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కిరాణా కొట్టు తెరిచి ఉద్యోగాలిస్తూ డబ్బులు కొట్టేస్తున్నాడని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. హైదరాబాద్‌లో ఒక సోదరుడిని, చిత్తూరులో మరో సోదరుడిని పెట్టి అందినకాడికి దోచేస్తున్నాడని ఆరోపించారు. సమాచార కమిషనర్లుగా ఆదర్శవంతులైన వ్యక్తులను నియమించాల్సిందిపోయి తన మనుషులను నియమించుకొన్నాడని.. ఇంత తప్పుడు, పనికిమాలిన ముఖ్యమంత్రిని తన జీవితంలో చూడలేదని చంద్రబాబు తీవ్రంగా మండిపడ్డారు.

జగన్ లోటస్‌పాండ్‌లో 72 గదుల్లో ప్యాలెస్ నిర్మించాడని, అందులో దయ్యాలు కాపురాలు చేస్తాయి తప్ప మనుషులు కాదన్నారు. చంద్రబాబు 'వస్తున్నా మీ కోసం' పాదయాత్ర  అగతవరప్పాడు నుంచి ప్రారంభమైంది. ప్రజల సమస్యలు తెలుసుకొంటూ, వాటిపై స్పందిస్తూ చంద్రబాబు ముందుకు సాగిపోయారు. గుంటూరు రింగ్‌రోడ్డు సెంటర్‌లో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ముఖ్యమంత్రి కిరణ్, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, ఆయన కుమారుడు జగన్, అల్లుడు అనిల్‌పై అవినీతి ఆరోపణలతో చంద్రబాబు విరుచుకుపడ్డారు. అధికారంలోకి వస్తే బెల్టు షాపులను మూసేస్తానని మరోసారి హామీ ఇచ్చారు.

జలయజ్ఞంలో అవినీతి బట్టబయలు
టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు అవినీతిపరుల గుండెల్లో నిద్రపోయారని.. తాను అధికారంలోకి వచ్చాక అదే బాటలో పయనించానని చంద్రబాబు చెప్పారు. అయితే, వైఎస్ అధికారంలోకి రావడంతోనే జలయజ్ఞం పేరుతో అవినీతి గేట్లు బార్లా తెరిచారని తెలిపారు. "జలయజ్ఞం పేరుతో ధనయజ్ఞం చేస్తున్నాడని నేను ఆనాడే చెప్పాను. నా ఆరోపణలను నిజం చేస్తూ.. నేడు కాగ్ జలయజ్ఞంలో రూ.30 వేల కోట్లు దారి మళ్లాయని కుండబద్దలు కొట్టింది'' అని వివరించారు. ఎద్దును పట్టుకోకుండా తాడును కొన్నట్టుగా సాగునీటి ప్రాజెక్టులకు కేంద్రం అనుమతులు తీసుకోకుండా, జలాశయాలు నిర్మించకుండా కాలువలు తవ్వేశారని చెప్పారు. వాటికి కూడా దొంగ లెక్కలు రాసి డబ్బులు కొట్టేశారని ఆరోపించారు.

23 లక్షల ఎకరాలకు సాగునీరు ఇస్తామని చెప్పి చివరికి 23 వేల ఎకరాలకు కూడా ఇవ్వలేదన్నారు. వైఎస్ హైదరాబాద్‌లో 8 వేల ఎకరాలను తన సన్నిహితులకు ధారాదత్తం చేశాడని.. ఒక్కో ఎకరం విలువ రూ. 20 కోట్ల వరకు ఉంటుందని చెప్పారు. బ్రదర్ అనిల్ చేసేవన్నీ దొంగ ప్రార్థనలేనన్నారు. అతని మాటలు నమ్మవద్దని ప్రజలకు సూచించారు.

అవినీతి విషయంలో ప్రజల ఆలోచనా విధానంలో మార్పు రావాలని, మన సంపద, కష్టాన్ని దోచుకొన్న వారిపై రాజీలేని పోరాటం చేయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. అధికారంలోకి వస్తే అవినీతి సొమ్మును తిరిగి రాబడతానని చెప్పారు. తల్లి కాంగ్రెస్ కన్నా పిల్ల కాంగ్రెస్‌తోనే భవిష్యత్‌లో ప్రమాదం పొంచి ఉందన్నారు. అవినీతిపై తాను చేస్తున్న పోరాటానికి యువత మద్దతు ఇవ్వాలని, తనతో కలసి నడవాలని కోరారు. పాదయాత్రకు కోరికలతో రాలేదని, లోక కల్యాణం కోసమే వచ్చానన్నారు.

పేపర్ పెట్టను
"జగన్ పత్రిక, టీవీకి కళ్లు లేవు. నా పాదయాత్రకు జనం నుంచి విశేష స్పందన లభిస్తున్నా ఫ్లాప్ అని విషపు రాతలు రాస్తోంది. ఆ పత్రికకు విలువలు లేవు. ఎన్‌టీఆర్, నేను సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా పని చేశాం. మేం తలుచుకొంటే పేపర్ పెట్టలేమా?'' అని చంద్రబాబు ప్రశ్నించారు. విలువలతో కూడిన రాజకీయాలు చేయాలన్నదే తమ ఆకాంక్ష అని, ఎవరెన్ని చెప్పినా పత్రిక పెట్టనని చంద్రబాబు స్పష్టం చేశారు.

తల్లి, పిల్ల కాంగ్రెస్‌తో ప్రమాదం

వైసీపీ పీకేసేదే!
ఎక్కువ కాలం రాజకీయాల్లో మనలేదు
ఇన్‌చార్జీలకు బాబు చురక

  " సహకార ఎన్నికలకు ముందు ఏడుసార్లు మీతో టెలీకాన్ఫరెన్స్‌లో మాట్లాడాను. ప్రతి చోటా పోటీ పెట్టాలని స్పష్టంగా చెప్పాను. ఓటరు చేర్పు లు మొదలుకొని పోలింగ్ తేదీ ముగిసేరోజు వరకు కష్టపడాలని సూచించాను. కానీ, మీరు 30 శాతమే కష్టపడ్డారు. అయినప్పటికీ మనకు, కాంగ్రెస్‌కు మధ్య సొసైటీ ఫలితాల్లో వ్యత్యాసం 10 శాతం మాత్రమే. గట్టిగా పని చేసి ఉంటే ఆప్కాబ్ పదవి కూడా మన దక్కే''దని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర బాబు గుంటూరు జిల్లా పార్టీ నేతలకు క్లాస్ తీసుకొన్నారు. వైసీపీ పీకేసే పార్టీయే అనేది సహకార ఎన్నికల్లో తేలిపోయిం దంటూ శ్రేణులను ఉత్సాహపరిచారు.

ప్రతి ఆదివారం పాదయాత్రకు విరామం ప్రకటించాలని నిర్ణయించిన చంద్రబాబు.. మధ్యాహ్నం గుంటూరు జిల్లాలో ఇటీవల జరిగిన సహకార సొసైటీల్లో గెలిచిన అధ్యక్షులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లాలోని 17 నియోజకవర్గాల ఇన్‌చార్జ్‌లను ఆహ్వానించారు. ఎన్ని సొసైటీలు గెలిచారు..ఓటమికి కారణాలు తదితర వివరాలను నియోజకవర్గం వారీ సమీక్షించారు. ఇతర పార్టీల కంటే ఎక్కువ స్థానాలు సాధించిన ఇన్‌చార్జ్‌లను అభినందించారు. ఎక్కడైతే పార్టీ వెనకబడిపోయిందో సంబంధిత నియోజక వర్గాల ఇన్‌చార్జ్‌లకు మెత్తగా చురకలంటించారు.

" సహకార ఎన్నికల ఫలితాలు రెండు విషయాలను స్పష్టం చేస్తున్నాయి. రాష్ట్ర రాజకీయాల్లో నిలబడేది టీడీపీ, కాంగ్రెస్‌లే. వైసీపీ కొనసాగబోదని తేలిపోయింది.తెలంగాణలోనూ టీఆర్ఎస్ ఎక్కడా గెలవలేకపోయింది. మనవాళ్లు సీరియస్‌గా తీసుకొని ఉంటే ఫలితాలు మరోలా ఉండేవి. కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో బరి తెగించి అక్రమాలకు పాల్పడింది. టీడీపీ పటిష్ఠంగా ఉన్న చోట ఎన్నికలు జరపకుండా స్టే విధించింది. దీని వలన మనవాళ్లు కొంత డల్ అయ్యారు. నాయకులు బేషజాలు వీడి ఒకతాటి పైకి వచ్చి జిల్లా సహకార కేంద్ర బ్యాంకు, డీసీఎంఎస్‌లను కైవసం చేసుకోవాలని చంద్రబాబు సూచించారు. ఈ సమావేశానికి టీడీపీ జిల్లా అధ్యక్షుడు పుల్లారావు, మాజీ మంత్రులు కోడెల శివప్రసాదరావు, పుష్పరాజ్, ఆలపాటి, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు హాజరయ్యారు.

సత్తెనపల్లి చరిత్ర తెలుసా?
"రాజనారాయణా! నీకు సత్తెనపల్లి చరిత్ర తెలుసా? కమ్యూనిస్టులు ఉన్నప్పటి నుంచి అక్కడ ఎన్నికలు ఏకపక్షంగా జరుగుతున్నాయి. అక్కడ పార్టీ ఎందుకు వెనకబడిపోయింద''ంటూ సత్తెనపల్లి ఇన్‌చార్జీని చంద్రబాబు ప్రశ్నించారు. ఎన్నికల్లో గెలిచిన అధ్యక్షులు సమీక్షకు ఎందు కు రాలేదని ప్రశ్నించారు.రాజకీయాలు నాకు చెప్పొద్దు

బాపట్ల నియోజకవర్గంలో 11 సొసైటీలకు గాను టీడీపీ నాలుగు మాత్రమే కైవసం చేసుకోవడంపై చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. నియోజకవర్గ ఇన్‌చార్జ్ గోవర్థన్‌రెడ్డిని వివరణ అడిగారు. నాలుగు స్థానాల్లో ఇండిపెండెంట్లకు మద్దతిచ్చామని ఆయన చెప్పడంతో.. "నాకు రాజకీయాలు వినిపించొద్ద''ని బాబు చురకేశారు

కష్టపడకుండా కుంటిసాకులు చెప్పొద్దు

డీసీసీబీ ఎన్నికల్లో టీడీపీ విధానం

జిల్లా సహకార బ్యాంకుల అధ్యక్ష పదవులకు జరగనున్న ఎన్నికల్లో ఏ పార్టీకి మద్దతు ఇవ్వొద్దని, ఒంటరిగానే పోటీచేయాలని టీడీపీ నిర్ణయించింది. గెలిచినా, ఓడినా ఇదే నిర్ణయానికి కట్టుబడి ఉండాలని పార్టీ నిర్ణయించింది. గుంటూరు జిల్లాలో పాదయాత్రలో ఉన్న పార్టీ అధినేత చంద్రబాబు ఆదివారం పార్టీ రాష్ట్ర కార్యాలయ నేతలతో గుంటూరులో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా మూడు అంశాలపై నిర్ణయాలు తీసుకున్నారు. డీసీసీబీల అధ్యక్ష పదవులకు జరిగే ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేయాలన్నది వాటిలో ఒకటి. మరోవైపు సహకార ఎన్నికల కారణంగా మధ్యలో నిలిచిపోయిన 'పల్లెపల్లెకు తెలుగుదేశం పార్టీ' కార్యక్రమాన్ని ఈనెల 15 నుంచి పునప్రారంభించాలని నిర్ణయించారు. ఇక విద్యుత్తుచార్జీల పెంపు నేపధ్యంలో డిస్కంల వారీగా జరగనున్న సమావేశంలో ఆయా ప్రాంతాల నేతలందరూ తప్పనిసరిగా పాల్గొనాలని, తద్వారా పార్టీ వాణిని వినిపించాలని సమావేశం నిర్ణయించింది.

గెలిచినా, ఓడినా.. ఒంటరిగానే పోటీ


తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కుమారుడు నారా లోకేష్ సోమవారం కదిరికి వస్తున్నట్లు ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ తెలిపారు. ఆదివారం సాయంత్రం తన స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో లోకేష్ కదిరి పర్యటన వివరాలను వెల్లడించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ హైదరాబాదు నుంచి రోడ్డు మార్గాన ఉదయం 11.30 గంటలకు కుటాగుళ్ళ వద్దకు చేరుకుంటారన్నా రు.

స్వాగతం పలికి అక్కడి నుంచి ద్విచక్ర వాహనాలతో ర్యాలీగా పట్టణంలోకి వస్తారన్నారు. శ్రీమత్ ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకుంటారన్నారు. ఎక్బాల్‌రోడ్డు, జీవిమాను సర్కిల్ మీదుగా అంబేద్కర్ సర్కిల్‌కు ర్యాలీగా చేరుకుంటారు. తెలుగుదేశం పార్టీ మైనార్టీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అత్తార్‌చాంద్‌బాషా నూతనంగా నిర్మించిన అత్తార్ రెసిడెన్సీ భవనంలో జరిగే ప్రత్యేక ప్రార్థనలలో పాల్గొని అ త్తార్ రెసిడెన్సీని ప్రారంభిస్తారన్నారు.

అనంతరం అక్కడి నుంచి స్థానిక ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల మైదానంలో టీఎన్ఎస్ఎఫ్ నాయకులు ఏర్పాటు చేసిన మేలుకొలుపు కార్యక్రమంలో పాల్గొంటారన్నారు. చాంద్‌బాషా మాట్లాడుతూ తాము అంబేద్కర్ సర్కిల్‌లో నిర్మించిన అ త్తార్ రెసిడెన్సీ, ఏసీ బెన్‌క్విట్ హాల్ భ వనం ప్రారంభోత్సవానికి నారా లో కేష్ వస్తున్నారని, ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి నియోజక వర్గంలోని ప్రజలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తరలిరావాలని విజ్ఞప్తి చేశారు.

సమయాభావం వల్ల అం దర్నీ కలవలేక పోయానని , ఇదే మా ఆహ్వానంగా భావించి కార్యక్రమానికి హాజరై జయప్రదం చేయాలన్నారు. సమావేశంలో టీడీపీ మహిళా నాయకురాలు ఎన్. పర్వీన్ భానూ, జిల్లా ఉపాధ్యక్షుడు టి. అరవిందబాబు, జి. దేవానంద్ పాల్గొన్నారు.

నేడు ఎంపీ, ఎమ్మెల్యేల రాక

సోమవారం కదిరికి నారా లోకేష్ కదిరికి వస్తున్న సందర్భంగా హిందూపురం ఎంపీ నిమ్మల కిష్టప్ప, పొలిట్ బ్యూరో సభ్యులు కాల్వ శ్రీనివాసులు, మైనార్టీ సెల్ రాష్ట్ర నాయకులు లాల్‌జాన్‌బాషా, ఎమ్మెల్యేలు పరిటా ల సునీత , పయ్యావుల కేశవ్, బి.కె.పార్థసారథి, అబ్ధుల్‌ఘనీ, పల్లెరఘునాథరెడ్డి, ఎమ్మెల్సీ మెట్టు గోవిందరెడ్డి, ఇతర నాయకులు హనుమంతరాయ చౌదరి, మహాలక్ష్మీ శ్రీనివాస్, శమంతకమణి, హాజరు కానున్నట్లు మైనార్టీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అత్తార్‌చాంద్‌బాషా వివరించారు.

కదిరికి నేడు నారా లోకేష్ రాక

వస్తు న్నా మీ కోసం యాత్రలో చంద్రబాబుకు గుంటూరు జిల్లా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని తెలుగు దేశం పార్టీ జిల్లా అధ్యక్షులు ప్రత్తిపాటి పుల్లారావు పేర్కొన్నారు. నేడు గుంటూ రులో జరగనున్న వస్తున్నా మీ కో సం రూట్ మ్యాప్‌ను ఆదివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పా టు చేసిన విలేకరుల సమావేశంలో ప్ర త్తిపాటి మాట్లాడుతూ పాదయాత్రలో చంద్రబాబుకు ప్రజలు అపూర్వ స్వాగ తం పలుకుతున్నారన్నారు. ముఖ్యం గా మహిళలు దారిపొడవునా హారతులు పడుతూ పూల వర్షం కురిపిస్తున్నారన్నారు.

ఇది కాంగ్రెస్ ప్రభుత్వ వ్యతిరేకతకు అద్దం పడుతుందన్నారు. నేడు గుంటూరులో చంద్రబాబు వస్తున్నా మీ కోసం పాదయాత్ర సిద్దార్థ గార్డెన్స్ నుంచి ప్రారంభమవుతుందన్నారు. అక్కడి నుంచి యాత్ర బృందావన్ గార్డెన్స్ మీదుగా సీతారామయ్య స్కూల్, అశోక్‌నగర్, దేవాపురం, కోబాల్డ్‌పేట, బ్రాడీపేట 4/14 వంతె న కింద నుంచి ఏటి అగ్రహారం చేరుకుంటుందన్నారు. అక్కడి నుంచి చుట్టుగుంట సెంటర్, శ్రీనివాసరావుతోట 60 అడుగుల రోడ్డు, పీర్లచావిడి, రామనామ క్షేత్రం నుంచి నల్లచెరువు వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం వద్దకు చేరుకుంటుందన్నారు.

అక్కడి నుండి దామోదర సంజీవయ్య నగర్ (డీయస్ నగర్) చేరుకుంటుందన్నా రు. అక్కడి బృందావన్ ఎన్‌క్లేవ్‌లో రా త్రికి బస చేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు జియా వుద్దీన్, బోనబోయిన శ్రీనివాస యాదవ్, మ న్నవ సుబ్బారావు, యాగంటి దుర్గారావు, ముత్తినేని రాజేష్, కొంపల్లి మా లకొండయ్య, చిట్టాబత్తిన చిట్టిబాబు, నర్రా బాలకృష్ణ, బొల్లా నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

చంద్రబాబు పాదయాత్రకు బ్రహ్మరథం

'వస్తున్నా...మీకోసం' కార్యక్రమంలో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేపట్టిన పాదయాత్ర 133వ రోజు కొనసాగుతోంది. సోమవారం ఉదయం సిద్దార్థ గార్డెన్స్ నుంచి బాబు పాదయాత్రను ప్రారంభించారు.

133వ రోజు చంద్రబాబు పాదయాత్ర ప్రారంభం

'నీట్' పరీక్ష రద్దుపై సీఎంకు లేఖ రాస్తా
రుణ మాఫీ చేసి చూపిస్తా : చంద్రబాబు నాయుడు

'నీట్' పరీక్ష రద్దుపై విద్యార్థులతో కలిసి పోరాడుతానని, దీనిపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి లేఖ రాస్తానని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు తెలిపారు. భవిష్యత్తులో డిమాండ్ కోర్సులకు తగిన విధంగా విద్యార్థులకు శిక్షణ ఇప్పిస్తామని బాబు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా లెదర్ పార్కులు ఏర్పాటు చేసి, 7 లక్షల మందికి ఉపాధి కల్పిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు.

'వస్తున్నా...మీకోసం' యాత్రను సోమవారం ఉదయం జిల్లాలోని సిద్దార్థ గార్డెన్స్ నుంచి చంద్రబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వివాదాస్పనదమైన 26 జీవోల విషయంలో అవినీతి మంత్రులకు ముఖ్యమంత్రి అండగా ఉంటూ కాపాడుతున్నారని, కాంగ్రెసు పార్టీ నేతలు దోచుకోవడంలో ఇప్పుడు బిజీగా ఉన్నారన్నారని, కాంగ్రెసు నేతల కబంద హస్తాల నుండి రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరి పైనా ఉందని చంద్రబాబు పేర్కొన్నారు.

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి అవినీతి సొమ్ముతో పెట్టిన 'సాక్షి' పత్రిక, తనపై, టీడీపీపై కక్ష కట్టిందని, సాక్షి దిన పత్రికను ఎవరూ చదువవద్దని చంద్రబాబు నాయుడు సోమవారం పిలుపునిచ్చారు. దివంగత వైయస్ తన తనయుడు జగన్మోహన్ రెడ్డికి లక్ష కోట్లు దోచిపెట్టారని మండిపడ్డారు. రాష్ట్రం తరఫున పది మంది కేంద్రమంత్రులు ఉన్నా నిధులు తీసుకు రావడంలో విఫలమవుతున్నారని బాబు ఆరోపించారు. టిడిపి అధికారంలోకి వస్తే రుణ మాఫీ చేసి చూపిస్తామన్నారు. రాష్ట్రాన్ని కాంగ్రెసు పార్టీ అతలాకుతలం చేసిందని దుయ్యబట్టారు.

కాంగ్రెసు కబ్జాల పార్టీ అని, కరెంట్ రాదు కానీ, నడ్డివిరిచేలా బిల్లులు మాత్రం వస్తాయని చంద్రబాబు నాయుడు ధ్వజమెత్తారు. టిడిపి హయాంలో ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇచ్చామన్నారు. టిడిపి హయాంలో అభివృద్ధితో పాటు ఆదాయం పెరిగిందని చెప్పారు. పెరిగిన ఆదాయం కాంగ్రెసు నేతల జేబుల్లోకి వెళ్తోందన్నారు. మనదేం పోయిందని ఎవరూ అనుకోవద్దని, పోయింది ప్రజల సొమ్మే అన్నారు. మహిళలకు సమాన హక్కుల కోసం ఎన్టీఆర్ ఆనాడే చట్టాలు తీసుకువచ్చారని, మహిళలు హక్కుల కోసం పోరాడాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.

అవినీతి మంత్రులకు కొమ్ముకాస్తున్న కిరణ్

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తనయుడు లోకేష్ నాయుడు సోమవారం జిల్లాలోని కదిరిలో పర్యటించారు. ఆయన పర్యటన సందర్భంగా టీడీపీ నేతలు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో లోకేష్ నాయుడు పాల్గొన్నారు.

లోకేష్ ఉత్సాహంగా పాల్గొనడంతో పార్టీ కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం కనిపించింది. ఈ బైక్ ర్యాలీలో లోకేష్‌తో పాటు పార్లమెంటు సభ్యుడు నిమ్మల కిష్టప్ప, ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. పార్టీపై దృష్టి మరికొద్ది రోజుల్లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి నారా లోకేష్ అడుగు పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.

టీడీపీ బైక్ ర్యాలీలో పాల్గొన్న లోకేష్ నాయుడు

'జిల్లాలో క్యాడర్ పట్టుదలతో కసిగా ఉంది. నాయకుల ఐక్యతే ఇప్పుడు ముఖ్యం. నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు బేషజాలు వీడి సమష్టిగా పని చేయాల్సిన కీలక తరుణమిదేనని' తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. 'వస్తున్నా... మీ కోసం' పాదయాత్రలో భాగంగా గుంటూరులోని సిద్ధార్థ గార్డెన్స్‌లో బస చేసిన ఆయన నూతనంగా ఎన్నికైన సహకార సంఘ అధ్యక్షులతో ఆదివారం మధ్యాహ్నం సమీక్షించారు. జిల్లాలో అత్యధికంగా 67 స్థానాల్లో తెలుగుదేశం పార్టీ విజయకేతనం ఎగుర వేయడం ఆనందంగా ఉందన్నారు.

ఇదే ఉత్సాహంతో ముందుకు సాగి డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్ పదవులను దక్కించుకోవాలని సూచించారు. ప్రత్యర్థులు కుట్రపూరిత విధానాలతో ఛైర్మన్ పదవిని దక్కించుకునే ప్రయత్నం చేసే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.

సహకార సంఘాల ఎన్నికల ఫలితాలను ఆయన విశ్లేషించారు. కాంగ్రెస్ పార్టీ మోసపూరిత విధానంతో సభ్యుల చేర్పుల సమయంలోనే అక్రమాలకు పాల్పడిందన్నారు. దీని వల్ల కొన్ని స్థానాల్లో స్వల్ప తేడాతో పరాజయం పాలైనట్లు గుర్తించామన్నారు. మరి కొన్ని చోట్ల నాయకులు గెలుస్తామన్న ధీమాతో, ఇంకొన్ని చోట్ల ఓటమి తప్పదని భావించి నిర్లక్ష్యంగా ఉండటంతో చేజారిపోయాయన్నారు. ఇలాంటి చోట్ల కష్టపడి పని చేసి ఉంటే గెలుపు సాధ్యమయ్యేదని చెప్పారు. ఎన్నికల తర్వాత అభ్యర్థులను కాపాడుకోవడంపై గత విషయాలను చంద్రబాబు సమావేశంలో వివరించారు.

* పార్టీ వ్యవస్థాపకుడు ఎన్‌టీఆర్ శస్త్రచికిత్స కోసం వెళ్లిన సమయంలో జరిగిన ఓ సంఘటనను ఉదహరించారు. అప్పట్లో ఎన్‌టీఆర్ పదవిని కాపాడేందుకు 163 మంది ఎమ్మెల్యేలను ఐక్యంగా ఉంచి, నెల రోజుల పాటు క్యాంపు నిర్వహించి పార్టీని కాపాడిన విషయాన్ని గుర్తు చేశారు. ఆ రోజుల్లోనే ఇందిరాగాంధీ తనకు కేంద్ర మంత్రి పదవిని ఇస్తానని చెప్పినా లొంగకుండా పార్టీ కోసం నిలబడ్డానన్నారు.

* 1991లో చిత్తూరులో 19 మంది సహకార సంఘ ఛైర్మన్లను ఆరు నెలల పాటు క్యాంపులో ఉంచి అక్కడ ఛైర్మన్, ఉపాధ్యక్ష పదవితో పాటు అన్ని డైరెక్టర్ల స్థానాలను కైవశం చేసుకున్న సంగతిని వివరించారు.

పార్టీలో 98 శాతం మంది మంచి వారు ఉన్నారని, అయితే మిగిలిన ఇద్దరిని కాపాడుకునేందుకే ఇలాంటి క్యాంపులు అవసరమవుతున్నాయన్నారు. దీనిపై ఎవ్వరూ ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని చంద్రబాబు సూచించారు. అనంతరం నియోజకవర్గాల వారీగా ఫలితాల వివరాలు అడిగి తెలుసుకున్నారు. చిలకలూరిపేట, పొన్నూరు, వినుకొండ, పెద్దకూరపాడులో అత్యధిక స్థానాలు కైవసం చేసుకున్నందున ఆ నియోజకవర్గ బాధ్యతలు చూస్తున్న ఎమ్మెల్యేలను, ఇన్‌ఛార్జ్‌లను అభినందించారు. ఫలితాల సాధనలో వెనకబడిన నియోజకవర్గ బాధ్యులకు సున్నితంగా చురకలంటించారు.

ఇలా అయితే కష్టమని, భవిష్యత్తులో మంచి ఫలితాలు సాధించేలా కృషి చేయాలని సూచించారు. సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి ఎన్నికైన సహకార సంఘ అధ్యక్షులు హాజరు కాకపోవడంపై బాబు నవ్వుతూనే చురకలేశారు. అంత అలసిపోయారా అంటూ ఇన్‌చార్జ్ నిమ్మకాయల రాజనారాయణను ప్రశ్నించారు. గత చరిత్రలో ఎల్లప్పుడూ సత్తెనపల్లి ఫలితం ఎకపక్షంగా వస్తున్న విషయాన్ని గుర్తించాలని నియోజకవర్గ బాధ్యునికి సూచించారు.

దీన్ని దృష్టిలో పెట్టుకుని అప్రమత్తంగా ఉండాలన్నారు. తాడికొండ, మంగళగిరి, రేపల్లె, ప్రత్తిపాడు నియోజకవర్గాల్లో పార్టీని మరింత బలోపేతం అయ్యేలా ఆయా నియోజకవర్గ బాధ్యులు చర్యలు తీసుకోవాలన్నారు.

ఈ సమావేశంలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు ప్రత్తిపాటి పుల్లారావు, నరసరావుపేట ఎంపీ మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి, మాజీ మంత్రి డాక్టర్ కోడెల శివప్రసాదరావు, ఎమ్మెల్యేలు ధూళిపాళ్ల నరేంద్రకుమార్, యరపతినేని శ్రీనివాసరావు, జీవీవీ ఆంజనేయులు, కొమ్మాలపాటి శ్రీధర్, నక్కా ఆనందబాబు, ఎమ్మెల్సీ నన్నపనేని రాజకుమారి, మాజీ మంత్రులు జె ఆర్ పుష్పరాజ్, ఆలపాటి రాజేంద్రప్రసాద్, మాజీ ఎంపీ లాల్‌జాన్ భాషా, మాజీ ఎమ్మెల్యే ఎస్ ఎం జియావుద్దీన్, పార్టీ రాష్ట్ర కార్యదర్శి మన్నవ సుబ్బారావు, నియోజకవర్గాల ఇన్‌చార్జ్‌లు చీరాల గోవర్థన్‌రెడ్డి, ముమ్మనేని వెంకట సుబ్బయ్య, అనగాని సత్యప్రసాద్‌గౌడ్, నిమ్మకాయల రాజనారాయణ, కందుకూరి వీరయ్య, చిరుమామిళ్ల మధుబాబు, రాష్ట్ర పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి దాసరి రాజామాష్టారు, రాష్ట్ర కార్యదర్శి వెన్నా సాంబశివారెడ్డి, బోనబోయిన శ్రీనివాస్‌యాదవ్, యాగంటి దుర్గారావు, మల్లి, దామచర్ల శ్రీనివాస్, కోవెలమూడి రవీంద్ర, వాసిరెడ్డి జయరామయ్య, ఎన్‌వీవీఎస్ వరప్రసాద్, ఇక్కుర్తి సాంబశివరావు, పలు సహకార సంఘాల అధ్యక్షులు పాల్గొన్నారు.

ఐక్యతే కీలకం

వస్తున్నా మీ కోసం పాదయాత్రలో భాగంగా గుంటూరు నగరంలోని సిద్దార్థ గార్డెన్స్‌లో బస చేసిన చంద్రబాబు ఆదివారం మధ్నాహ్నం నుండి సాయంత్రం వరకు అభిమానులతో గడిపారు. డాక్టర్ సలహా మేరకు ఆదివారం పాదయాత్ర నిలిపిన ఆయన మధ్నాహ్నం కొంత సేపు సహకార సంఘ అధ్యక్షులతో సమీక్ష నిర్వహించారు. సమీక్షకు ముందు, తరువాత అభిమానులతో ముచ్చటించారు. వారితో కలసి ఫొటోలు దిగారు.

అనేక మంది తెలుగు దేశం ద్వితియ శ్రేణి నాయకులు, విద్యార్థులు, అభిమానులు పెద్ద సంఖ్యలో గార్డెన్ వద్దకు చేరుకున్నారు. ఉదయం పది గంటల నుండి అక్కడ కార్యకర్తల, నాయకుల సందడి ప్రారంభమైంది. మధ్నాహ్నం సమయానికి జిల్లా నాయకులు, తెలుగు దేశం పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జిలు చంద్రబాబు బస వద్దకు చేరుకున్నారు.

మధ్నాహ్నం ఒంటి గంట సమయంలో బస్సులో నుండి బయటకు వచ్చిన బాబు కార్యకర్తలతో, అభిమానులతో కలసి ఫొటోలు దిగారు. ఈ సమయంలో వారు ఇచ్చిన వినతిపత్రాలు స్వీకరించారు. పలు సమస్యలపై వారితో మాట్లాడారు. వారి కష్టసుఖాలు తెలుసుకున్నారు.

చంద్రబాబును కలసిన రాచకొండ లక్ష్మయ్య

సిద్దార్థ గార్డెన్స్‌లో బస చేసిన చంద్రబాబును ఆదివారం 103 బిసి కులాల ఐక్య వేదిక జిల్లా అధ్యక్షుడు రాచకొండ లక్ష్మయ్య మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా లక్ష్మయ్య మాట్లాడుతూ బిసిలకు రానున్న ఎన్నికల్లో 100 సీట్లు కేటాయిస్తానన్న చంద్రబాబును మ ర్యాద పూర్వకంగా కలిసేందుకు వచ్చినట్లు తెలిపారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో చంద్రబాబు జారీ చేసిన జీవో నెంబరు 802 అమలయ్యేలా చూడాలని కోరినట్లు తెలిపారు.

అభిమానులతో చంద్రబాబు

ఏమ్మా... మీ ఇంటికి కరెంటు బిల్లు ఎంత వచ్చింది? రూ. వెయ్యి వచ్చి ఉంటుంది. ఒక బల్బు, ఫ్యానుకే అది కూడా రాని కరెంటుకు బిల్లు వస్తోంది. దానిపై సర్‌చార్జ్ వేస్తున్నారు. ఇప్పటికి మీ మీద రెండు కరెంటు బాంబులే పడ్డాయి. మరో పెద్ద బాంబు పడబోతోంది.

తల్లీ... వంట గ్యాస్ ధర ఎంతమ్మా? రూ. 475 కడుతున్నారు కదా? మరి కొద్ది రోజుల్లో రూ. 1175 కడితే ఆ తర్వాత ఎప్పటికో మీకు ఆధార్ అకౌంట్ ఉంటే అందులో వేస్తారంట. అది కూడా సంవత్సరానికి ఆరు సిలిండర్లే ఇస్తారు.

ఆరో సిలిండర్ దాటితే రూ. 1175 కట్టాలి. నేను తొమ్మిదేళ్ల పాటు రూ. 235 గ్యాస్ సిలిండర్ ధర పెరగకుండా చేశాను. మా ఎంపీలను గెలిపిస్తే గ్యాస్ ధర తగ్గించేలా చేస్తా.

బియ్యం ధర ఎంత? రూ. 50 అయింది కదా. ఉల్లిపాయలు మీరు తలుచుకొంటేనే వాటి ధర(రూ.40) కన్నీళ్లు తెప్పించేలా చేస్తోంది. నూనె రూ. 100 దాటింది. ఉప్పు రూ. 10కి చేరుకొన్నది. కందిపప్పు రూ. 80 అయ్యింది. మీ సంపాదనేమో రోజంతా కష్టపడినా రూ. 100 దాటడం లేదు. మీరు ఏమి తింటున్నారు... ఏమి కొంటున్నారు. నాడు జేబులో డబ్బులు తీసుకెళితే సంచి నిండా సరుకులు వచ్చేవి. నేడు సంచిలో డబ్బులు తీసుకెళితే జేబు నిండా సరుకులు రాని పరిస్థితి. మీరే ఆరోజుకు, నేటికి మధ్య తేడాని ఆలోచించుకోండి.

ఇలా టీడీపీ అధినేత చంద్రబాబునాయు డు ప్రసంగిస్తూ మహిళలు స్పందించేలా చేస్తున్నారు. జిల్లాలో ఇప్పటివరకు నాలుగు రోజుల పాటు జరిగిన పాదయాత్రలో చంద్రబాబు ఏ వీధికి వెళ్లినా మహిళలతో సంభాషించేందుకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. మహిళలు తాము పడుతోన్న కష్టాలను ఆయన వద్ద వ్యక్తపరుస్తున్నారు.

రూపాయికి కేజీ బియ్యం ఇచ్చి మిగతా ధరలు అన్ని పెంచారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సన్నబియ్యం కేజీ రూ. 44 పెట్టి కొనలేకపోతున్నామని, కరెంటు బిల్లులపై మహిళలు ఆవేశంగా స్పందిస్తున్నారు. సిలిండర్ మరో రూ. 50 పెంచుతారా ంట. ఇక మేము మ ళ్లీ కట్టెల పొయ్యిలు పెట్టుకొంటామని పేర్కొంటున్నారు.

చినకాకాని మొదలుకొని జిల్లా కేంద్రం వర కు చంద్రబాబు పాదయాత్ర సాగిన మార్గమంతటా మహిళలు తమ సమస్యలను ఏకరువు పెట్టారు. ముఖ్యంగా దళిత వాడల్లో చంద్రబా బు పాదయాత్రకు లభిస్తోన్న స్పందన తెలుగుదేశం పార్టీ నాయకులనే ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది. ఎన్నికలు ఎప్పుడు జరిగినా కచ్చితంగా మహిళలు నిత్యవసర సరుకుల ధరలు, కరెంటు చార్జీలు, వంట గ్యాస్ ధరపై ఓటు రూపంలో చూపిస్తారని నాయకులు విశ్వసిస్తున్నారు.

ఎక్కడికెళ్లినా ఎంఆర్‌పీఎస్ కార్యకర్తలు సంఘీభావం తెలుపుతున్నారు. చంద్రబాబు కూడా తన పాదయాత్రకు మహిళల నుంచి వస్తోన్న స్పందనపై తొలిసారిగా ఆదివారం పెదవి విప్పారు. పబ్లిక్ లో విపరీతమైన స్పందన కనిపిస్తోందని, ఎవ రూ సమీకరించకుండానే స్వచ్ఛందంగా రోడ్లపైకి వస్తున్నారని, ప్రభుత్వ వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోందని వ్యాఖ్యానించారు.

మహిళల కష్టాలకే ప్రాధాన్యం