February 10, 2013

వస్తు న్నా మీ కోసం యాత్రలో చంద్రబాబుకు గుంటూరు జిల్లా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని తెలుగు దేశం పార్టీ జిల్లా అధ్యక్షులు ప్రత్తిపాటి పుల్లారావు పేర్కొన్నారు. నేడు గుంటూ రులో జరగనున్న వస్తున్నా మీ కో సం రూట్ మ్యాప్‌ను ఆదివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పా టు చేసిన విలేకరుల సమావేశంలో ప్ర త్తిపాటి మాట్లాడుతూ పాదయాత్రలో చంద్రబాబుకు ప్రజలు అపూర్వ స్వాగ తం పలుకుతున్నారన్నారు. ముఖ్యం గా మహిళలు దారిపొడవునా హారతులు పడుతూ పూల వర్షం కురిపిస్తున్నారన్నారు.

ఇది కాంగ్రెస్ ప్రభుత్వ వ్యతిరేకతకు అద్దం పడుతుందన్నారు. నేడు గుంటూరులో చంద్రబాబు వస్తున్నా మీ కోసం పాదయాత్ర సిద్దార్థ గార్డెన్స్ నుంచి ప్రారంభమవుతుందన్నారు. అక్కడి నుంచి యాత్ర బృందావన్ గార్డెన్స్ మీదుగా సీతారామయ్య స్కూల్, అశోక్‌నగర్, దేవాపురం, కోబాల్డ్‌పేట, బ్రాడీపేట 4/14 వంతె న కింద నుంచి ఏటి అగ్రహారం చేరుకుంటుందన్నారు. అక్కడి నుంచి చుట్టుగుంట సెంటర్, శ్రీనివాసరావుతోట 60 అడుగుల రోడ్డు, పీర్లచావిడి, రామనామ క్షేత్రం నుంచి నల్లచెరువు వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం వద్దకు చేరుకుంటుందన్నారు.

అక్కడి నుండి దామోదర సంజీవయ్య నగర్ (డీయస్ నగర్) చేరుకుంటుందన్నా రు. అక్కడి బృందావన్ ఎన్‌క్లేవ్‌లో రా త్రికి బస చేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు జియా వుద్దీన్, బోనబోయిన శ్రీనివాస యాదవ్, మ న్నవ సుబ్బారావు, యాగంటి దుర్గారావు, ముత్తినేని రాజేష్, కొంపల్లి మా లకొండయ్య, చిట్టాబత్తిన చిట్టిబాబు, నర్రా బాలకృష్ణ, బొల్లా నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

చంద్రబాబు పాదయాత్రకు బ్రహ్మరథం

తెలుగు దేశం పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేపట్టిన వస్తున్నా మీ కోసం పాదయాత్రకు ప్రవాస భారతీయులు సంఘీభావం తెలుపుతున్నట్లు అట్లాంటా ఎన్ఆర్ఐ శాఖ అధ్యక్షులు మేదరమెట్ల మల్లిక్ తెలిపారు. ఈ మేరకు జిల్లాకు చెందిన ప్రవాస భారతీయులు అమెరికాలోని అట్లాంటాలో ఆదివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అక్కడి నుంచి మల్లిక్ మాట్లాడుతూ చంద్రబాబు చేపట్టిన పాదయాత్రను అమెరికాలోని ప్రవాస భారతీయులు స్వాగతిస్తున్నారన్నారు.

దేశ చరిత్రలో ఏ రాజకీయ నాయకుడు స్పందించని విధంగా ప్రజా సమస్యల పరిష్కారానికి నభూతో నభవిష్యతి అన్న రీతిలో చంద్రబాబు వస్తున్నా మీ కోసం పాదయాత్ర చేపట్టి ముందుకు సాగుతున్నారన్నారు. ఇది రాజకీయాల్లో ఒక మైలు రాయిగా నిలుస్తుందన్నారు. రాష్ట్రమంతా చంద్రబాబు పర్యటించడాన్ని ఎన్ఆర్ఐలు నిశితంగా పరిశీలిస్తూ ఆకర్షితులవుతున్నారన్నారు. పేద, బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసం అహర్నిశలూ పాటుపడే చంద్రబాబు అవసరం ర్రాష్టానికి ఉందన్న నిర్ణయాన్ని వారు వెలిబుచ్చుతున్నట్లు చెప్పారు.

పాదయాత్రకు జనం నుంచి వస్తున్న స్పందన చూస్తే ప్రజలకు ప్రభుత్వంపై ఎంత వ్యతిరేకత ఉందో అవగతమవుతుందన్నారు. ఇది ప్రభుత్వ అసమర్థ, అవినీతి విధానాలకు అద్దం పడుతుందన్నారు. ఈ సమావేశంలో ప్రవాసాంధ్రులు వెంకట్ అక్కినేని, సుమన్ కాట్రగడ్డ, అజయ్ ఘంటమనేని తదితరులు పాల్గొన్నారు.

బాబుకు ప్రవాసాంద్రుల సంఘీభావం


చంద్రబాబు పాదయాత్రకు అనూహ్యంగా మహిళల నుంచి స్పందన పెరిగింది. మండుటెండను సైతం లెక్క చేయకుండా గంటల తరబడి వీధుల వెంట చంద్రబాబు రాక కోసం నిరీక్షిస్తున్నారు. హారతులు ఇస్తూ... నుదుటిన తిలకం దిద్దుతూ... పూలవర్షం కురిపిస్తూ స్వాగతిస్తున్నారు. కష్టాల కడలిలో జీవనసాగరం ఈదుతున్నామంటూ సమస్యలు ఏకరువు పెడుతున్నారు. ఉప్పు నుంచి గ్యాస్ వరకు అన్ని ధరలు పెరిగిపోయాయని, తామెలా బతికేదంటూ కన్నీళ్లు పెట్టుకొంటుకుంటున్నారు. తాము కచ్ఛితంగా ఓటేస్తామని హామీ ఇస్తూ చంద్రబాబును సాగనంపుతున్నారు.

పెదకాకాని మండలం అగతవరప్పాడు నుంచి శనివారం చంద్రబాబు పాదయాత్ర ప్రారంభం కాగా దారి పొడవునా మహిళలు బారులుదీరి తమ సమస్యలను నివేదించారు. గుంటూరుపట్టణ శివారు ఇన్నర్‌రింగురోడ్డు, ఎన్‌టీఆర్ కాలనీ, శివనాగరాజు కాలనీ, రాజీవ్‌గాంధీనగర్, సంజీవయ్యనగర్, వసంతరాయపురం, శారదాకాలనీలో చంద్రబాబు పాదయాత్ర కొనసాగిన వీధులన్నీ మహిళలతో నిండిపోయాయి. మహిళలు ప్రధానంగా బియ్యం, వంటనూనె, గ్యాస్ సిలిండర్, విద్యుత్ బిల్లులు మోయలేనంత భారంగా పరిణమించాయని నివేదిస్తున్నారు. బియ్యం కిలో రూపాయికి ఇచ్చి మిగతా వంట సరుకుల ధరలన్నీ అందుబాటులో లేకుండా చేశారని చెప్పారు. రోగం వచ్చి ఆస్పత్రికి వెళితే మందులు ఇవ్వకుండా పంపేస్తున్నారని వాపోయారు.

ఇలా చంద్రబాబుకు దారి పొడవునా మహిళలు తమ కష్టాలను చెప్పుకొంటూ కన్నీళ్లు పెట్టుకొంటున్నారు. చంద్రబాబు వారి బాధలు చూసి చలించిపోతున్నారు. తలపై చేయి వేసి ఓదారుస్తూ తానునున్నాని భరోసా కల్పిస్తున్నారు. ఎన్నికల ఒక్క రోజు తనకు ఇస్తే ఐదేళ్లు సేవకుడిగా మీ బాగోగులు చూసుకొంటానని ఇస్తున్న హామీకి మంచి స్పందన కనిపిస్తోంది. గ్యాస్, విద్యుత్ చార్జీలు తగ్గిస్తానని చంద్రబాబు హామీ ఇస్తున్నారు. మద్యం బెల్టుషాపుల వలన తమ బతుకులు చిన్నాభిన్నం అవుతున్నాయని మహిళలు నివేదిస్తుండగా బెల్టుషాపులు రద్దు చేసి ఆడబిడ్డల మంగళసూత్రాలు కాపాడతానని చెబుతున్నారు.

డ్వాక్రా గ్రూపుల మహిళలు కూడా చంద్రబాబు పాదయాత్రలో పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు. తాము సక్రమంగానే పొదుపు పాటిస్తున్నా రివాల్వింగ్ ఫండ్ రావడం లేదని బాబు దృష్టికి తీసుకొస్తున్నారు. వీటిపైనా స్పందిస్తూ తాను అధికారంలోకి రాగానే పొదుపు సంఘాల మహిళలు చెల్లించిన వడ్డీని తిరిగి బ్యాంకు ఖాతాల్లో జమ చేయిస్తానని బాబు ఇస్తోన్న హామీకి డ్వాక్రా మహిళలు నీరాజనం పలుకుతున్నారు. పాదయాత్రకు వస్తోన్న స్పందన చూస్తూ జనంలో నిశ్శబ్ధ విప్లవం ప్రారంభమైందని తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు చెబుతున్నారు. ఇది ఎన్నికల నాటికి మరింత పెరిగి తమ పార్టీని గెలుపు దిశగా తీసుకెళ్తుందని ఆశిస్తున్నారు.

ఎలా బతికేది..?

ప్రత్తిపాడు: జిల్లాలో చంద్రబాబు నిర్వహిస్తున్న పాదయాత్రకు ప్రత్తిపాడు నుంచి బారీగా కార్యకర్తలు తరలి వెళ్లారు.

మూడు రోజులుగా జిల్లాలో పర్యటిస్తున్న చంద్రబాబు పాదయాత్రకు నాయకులు వెలుతున్నారు. శనివారం తెలుగుయువత జిల్లా నాయకుడు గింజుపల్లి వెంకటేశ్వరరావు నాయకత్వంలో భారీగా పార్టీ కార్యకర్తలు, నాయకులు తరలి వెళ్లారు. ద్విచక్ర వాహనాలపై తెలుగుదేశం పార్టీ జండాలను కట్టుకుని సుమారు 200 వాహనాలతో ప్రత్తిపాడు నుంచి ప్రారంభమైన ర్యాలీలో గుంటూరు వరకు పార్టీ కార్యకర్తలు ర్యాలీలో కలుస్తూనే వచ్చారు. ప్రత్తిపాడు మండలంలోని నిమ్మగడ్డవారిపాలెం, మల్లాయపాలెం సొసైటీలను తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకోవడం ఆ పార్టీ నేతలలో ఉత్సాహాన్ని ఇచ్చింది. దీంతో మల్లాయపాలెం నుంచి అధిక సంఖ్యలో పార్టీ కార్యకర్తలు చంద్రబాబు సభకు వెళ్లారు.

ఇలాగే బాగా పనిచేయండి

మీరు ఇదే స్ఫూర్తితో ఇలాగే పనిచేయండి మంచి భవిష్యత్ వుం టుంది అంటూ మల్లాయపాలెం సొసైటీ అధ్యక్షుడు కుర్రి సుబ్బారెడ్డిని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు బుజం తట్టి ప్రోత్సహించారు.

ఇటీవల జరిగిన సొసైటీ ఎన్నికల్లో రెడ్డి సామాజిక వర్గం ఎక్కువగా వున్న మల్లాయపాలెం సొసైటీలో తెలుగుదేశం పార్టీ తరుపున అదే సామాజిక వర్గం పోటీచేసి ఘన విజయం సాధించిన విషయాన్ని నియోజకవర్గ ఇన్‌చార్జి కందుకూరి వీరయ్య, జిల్లా అధ్యక్షుడు ప్రత్తిపాటి పుల్లారావులు చంద్రబాబు దృష్టికి తీసుకుళ్లారు.

ఆ గ్రామానికి చెందిన పార్టీ కార్యకర్తలతో పాటు కుర్రి సుబ్బారెడ్డిని చంద్రబాబుకు పరిచయం చేశారు. రెండు చోట్లా పార్టీని గెలిపించినందుకు స్థానిక నాయకులను చంద్రబాబు ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు గింజుపల్లి శివరామప్రసాద్, యడ్ల బాలాజీ, తెలుగుయువత నాయకుడు శెట్టి వెంకటశివ పాల్గొన్నారు.

వట్టిచెరుకూరు నుంచి

వట్టిచెరుకూరు : టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గుంటూరులో నిర్వహిస్తున్న పాదయాత్రలో పాల్గొనటానికి వట్టిచెరుకూరు మండలం నుంచి ఆ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వెళ్లారు. వస్తున్నా మీకోసం పేరుతో చంద్రబాబు నాయుడు నాలుగు నెలలుగా చేస్తున్న పాదయాత్ర మూడు రోజుల క్రితం గుంటూరు చేరింది. ప్రతిపక్ష నేత చంద్రబాబు శనివారం గుంటూరు తూర్పు, పశ్చిమ నియోజక వర్గాల్లో పాదయాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సంఘీభావం తెలపడానికి వట్టిచెరుకూరు మండలంలోని అన్ని గ్రామాల నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు ద్విచక్ర వాహనాలు, జీపులు, కార్లతో ర్యాలీగా గుంటూరు వెళ్లారు.

చంద్రబాబు పాదయాత్రకు భారీగా జనం