February 6, 2013

తాడేపల్లి: తెలుగుదేశం అధికారంలోకి రాగానే తొలి సంతకం రైతుల రుణమాఫీలపైనే పెడతానని నారా చంద్రబాబు నాయుడు ప్రజల హర్షధ్వానాల మధ్య ప్రకటించారు. బుధవారం వస్తున్నా.. మీకోసం పాదయాత్రకు జిల్లా విచ్చేసిన చంద్రబాబు తాడేపల్లి ప్రాంతంలోని నులకపేట, ప్రకాష్‌నగర్, ఉండవల్లి ప్రాంతాల్లో ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. తెలుగుదేశం హయాంలో డ్వాక్రా గ్రూపులు ఏర్పాటు చేశామని, విద్యార్థినులకు సైకిళ్లు ఇచ్చామని, ఆడపిల్ల పుడితే రూ.5 వేలు ఇచ్చామని, పెన్షన్లు ఇచ్చామని, టెక్నాలజీ పెంచామని చెప్పారు.

రైతాంగం పరిస్థితి కాంగ్రెస్ పార్టీ హయాంలో దుర్భరంగా మారిందని, తన హయాంలో పరిస్థితులు అనుకూలంగా లేకపోయినప్పటికీ రైతాంగానికి నిరాటంకంగా నీరు, తొమ్మిది గంటల విద్యుత్తు ఇచ్చామని చెప్పారు. గ్యాస్ సిలెండర్లపై సైతం పాలకులు కోతపెట్టారని, ఇంతకంటే దౌర్భాగ్యమేముందన్నారు. ఎరువుల ధరలు ఇబ్బడిముబ్బడిగా పెరిగాయని, కాంగ్రెస్ కార్యకర్తలే గ్రామాల్లో ఆదర్శరైతులుగా చెలామణి అవుతున్నారని చెప్పారు. మద్యం బెల్టు షాపులు రద్దు చేస్తామని చెప్పారు. నిత్యావసర వస్తువులు, కూరగాయల ధరలు పెరిగిపోవడంతో పేదలు, మధ్యతరగతి ప్రజలు పడుతున్న ఇబ్బందులు వర్ణనాతీతమన్నారు. కార్యకర్తల కోలాహలం, తోపులాటల మధ్య ప్రకాశం బ్యారేజీ నుంచి ఉండవల్లి సెంటరుకు (రెండు కిలోమీటర్లు) రావడానికి బాబుకు రెండు గంటలు పట్టింది.

తొలి సంతకం రుణమాఫీ పైనే...


పాదయాత్రతో తాడేపల్లి వచ్చిన చంద్రబాబుకు కేఎల్ రావు కాలనీ, మార్కెట్ సెం టరు, రన్నింగ్ రూమ్, ముగ్గురోడ్డు, నులకపేట, ప్రకాష్‌నగర్ ప్రాంత వాసులు తమ సమస్యలు వివరించారు. తాడేపల్లిలో అధికంగా రైల్వే సమస్యలు వివరించారు. రన్నింగ్ రూమ్, ముగ్గురోడ్డు ప్రాంతాల్లో ఏనాటి నుంచో నివసిస్తున్న తమను రైల్వే అధికారులు ఖాళీ చేయ మని నోటీసులు ఇచ్చారని, తాము ఎక్కడికి వెళ్లాలంటూ గొల్లుమన్నారు.

పలువురితో స్వయంగా చంద్రబాబు సమస్యలు చెప్పించుకున్నారు. ఆయన మాట్లాడుతూ రైల్వే స్థలాల నిర్వాసితులు భయపడాల్సిన అవసరం లేదని, తాను అండగా వుంటానని, మీరు ఖాళీ చేయాల్సిన అవసరం లేదని, అధికారులు వస్తే నేనున్నా.. ఎదురు తిరగండంటూ వారికి మనోధైర్యం చెప్పడంతో మహిళలు హర్షధ్వానాలు చేశారు. ఇది కేంద్రం చేయాల్సిన పని, స్థానిక అధికారులకు సంబంధం లేదని, ఖాళీ చేయనవసరం లేదని చెప్పారు. నులకపేట వాసులు తాము ఏనాటి నుంచో ఫారెస్టు ఏరియాలో నివసిస్తున్నామని, తమను ఖాళీ చేయాలని ఆ శాఖ వారు బెదిరిస్తున్నారని చెప్పారు. చంద్రబాబు మాట్లాడుతూ మీరు బెదరాల్సిన పనిలేదని, కాంగ్రెస్ పాలకులు ప్రజలను ఇబ్బందులు పెడుతున్నారని, తాము మరల అవిశ్వాసం పెట్టేందుకు కూడా సిద్ధంగా వున్నామని, కాంగ్రెస్ ప్రభుత్వం బొటాబొటీ మెజార్టీతో వుందని చెప్పారు.

నేనున్నా.. ఎదురు తిరగండి

గుంటూ రు, విజయవాడలను జంట నగరాలుగా అభివృద్ధి చేస్తానని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు హామి ఇచ్చారు. ఇక్కడే ఐటీ హబ్ నెలకొల్పి యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. రెండు నగరాలకు అవుటర్ రింగురోడ్డు ఏర్పాటు చేసి మెగా సిటీలుగా తీర్చిదిద్దుతామని చెప్పారు. అభివృద్ధి అనేది తన హయాంలోనే జరిగిందని చంద్రబాబు స్పష్టం చేశారు. చినకాకానిలో ఎన్ఆర్ఐ వైద్య కళాశాల అయినా, చిలకలూరిపేట రోడ్డులో కాటూరి మెడికల్ కళాశాల అయినా తన హయాంలో ఏర్పాటు చేసినవేనన్నారు. విద్యా అవకాశాలు మెరుగుపరిచి ఇంజనీరింగ్, మెడికల్ కళాశాలల ఏర్పాటు చేయడం వలన ఆనాడు చదువుకొన్న ప్రతీ ఒక్కరికి ఉద్యోగాలు వచ్చాయన్నారు. విద్యా వ్యవస్థను కూడా కాంగ్రెస్ పార్టీ అవినీతిమయం చేసిందన్నారు.

ఎంఎస్ఎస్‌ను గుర్తు పెట్టుకోవాలి

తెలుగుదేశం పార్టీ మంగళగిరి ప్రాంత దివంగత నాయకుడు ఎంఎస్ఎస్ కోటేశ్వరరావును అందరూ జ్ఞాప కం చేసుకోవాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. తన సేవా కార్యక్రమాల ద్వా రా ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారనని కీర్తించారు. ఆయన తనయుడు మాదల రాజేంద్ర ఆరో గ్యం బాగోలేకపోవడం వలన పాదయాత్రకు హాజరు కాలేకపోతున్నారని, త్వరగా కోలుకొని ప్రజాసేవకు అంకి తం కావాలని ఆకాంక్షించారు.

కోడెల, యరపతినేనిపై

తప్పుడు కేసులు


సహకార ఎన్నికల్లో అక్రమాలను ప్రశ్నించేందుకు వెళ్లిన మాజీ మంత్రి డాక్టర్ కోడెల శివప్రసాదరావుపై కాంగ్రెస్ పార్టీ తప్పుడు కేసు బనాయిం చి జైలుకు పంపిందన్నారు. గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావుపై కూడా తప్పుడు కేసు పెట్టి అరెస్టు చేసిందన్నారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి దొంగలను కాపాడుతూ ప్రజల కోసం పోరాటం చేస్తున్న తమ పార్టీ నేతలను ఇబ్బందులు పెడుతున్నారని ఆగ్రహించారు.

ఆట్రోడైవర్‌లా చైతన్యవంతులు కండి

'నేను విజయవాడ పర్యటనలో ఉన్న సమయంలో ఓ ఆట్రోడైవర్ వచ్చి ఆవేశంగా ప్రసంగించారు. జగన్ పార్టీ వాళ్లు ఆ యన్ని సంతకం చేయాలని అడిగారట. అందుకు ఆ ఆట్రోడైవర్ దేని కోసం సం తకం చేయాలని ప్రశ్నించగా జగన్ విడుదల కోసమని ఆ పార్టీ వాళ్లు చెప్పారట. దాంతో ఆ ఆట్రోడైవర్ రూ. లక్ష కోట్లు దోచుకొన్న వ్యక్తి జైలు నుంచి విడుదల కావాలని నేను సంతకం పెట్టాలా? పెట్టను పోం డి అని ఎదురుతిరిగాడు. ఆ ఆట్రోడైవర్‌ను వైసీపీ నాయకులు హెచ్చరించినా మీకు చేతనైంది చేసుకోండి పోండి అని నిజాయితీ పక్షాన నిలబడ్డాడు. ఆ ఆట్రోడైవర్‌కు ఉన్న చైతన్యంలో 10 శాతం కమిట్‌మెంట్ వైఎస్ కు ఉంటే ర్రాష్టానికి ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు.

జంట నగరాలుగా గుంటూరు -విజయవాడ

' వస్తున్నా మీ కోసం' అంటూ చంద్రబాబు చేపట్టిన పాదయాత్రకు 'అండగా మేమున్నాం' అంటూ గుంటూరు జిల్లా తెలుగు తమ్ముళ్లు ఆత్మీయ స్వాగతం పలికారు. వస్తున్నా మీ కోసం 127వ రోజు పాదయాత్ర కృష్ణా జిల్లా విజయవాడ బస్టాండ్ నుంచి బుధవారం ఉదయం ప్రారంభమైంది. 10:30కు అక్కడ నుంచి మొదలైన పాదయాత్ర, రాజీవ్ గాంధీ పార్కు మీదుగా ప్రకాశం బ్యారేజ్ వద్దకు మధ్యాహ్నం 12 గంటలకు చేరుకుంది. పాదయాత్ర బ్యారేజి మీదకు వచ్చేసరికి అటు కృష్ణాజిల్లా నాయకులు, కార్యకర్తలు, ఇటు గుంటూరు జిల్లా నాయకులు, కార్యకర్తలతో పోటెత్తింది. ఈ సమయంలో బ్యారేజ్ పరిసర ప్రాంతాలు తెలుగు తమ్ముళ్ల చేతిలో ఉన్న పసుపు రంగు జెండాలతో ఎటు చూసినా పచ్చదనం కనిపించింది. బ్యారేజ్ వద్ద ఇసుక వేస్తే రాలనంతగా జనం కనిపించారు.

ప్రకాశం బ్యారేజి వద్దకు చంద్రబాబుకు స్వాగతం పలికేందుకు ఎమ్మెల్యేలు ప్రత్తిపాటి పుల్లారావు, ధూళిపాళ్ల నరేంద్రకుమార్, యరపతినేని శ్రీనివాసరావు, జివి ఆంజనేయులు, మాజీ మంత్రి కోడెల శివప్రసాద్, ఎంపీ మోదుగుల వేణుగోపాలరెడ్డి, మన్నవ సుబ్బారావు, పుష్పరాజ్ తదితరులు ఎదురువెళ్లారు. రాష్ట్ర తెలుగు యువత ప్రధాన కార్యదర్శి కొమ్మినేని సాంబశివరావు, జిల్లా అధ్యక్షులు నాగమల్లేశ్వరావు(మల్లి) ఆధ్వర్యంలో చంద్రబాబు కృష్ణమ్మ తల్లికి పూజాదికాలు నిర్వహించారు. నదీమ్మ తల్లికి పట్టు వ్రస్తాలు బహుకరించారు. వేదపండితుల ఆశీర్వచనాలు, మేళతాళాలు, తీన్‌మార్, మహిళల మంగళహారతులతో బాబు గుంటూరు జిల్లా ఆగమనం ఓ వేడుకలా జరిగింది. తొలుత బ్యారేజీ ఆరవ నెంబరు ఖానా వద్ద ఎమ్మార్పియస్ కార్యకర్తలు బాబుకు ఎదురెళ్లి ఘనస్వాగతం పలుకగా, నాలుగో నెంబరు ఖానా వద్ద మంగళగిరి దేశం నాయకులు కొల్లి లక్ష్మయ్య చౌదరి తన సతీమణితో మంగళహరతి ఇప్పిస్తూ సాదర స్వాగతం పలికారు.

తెలుగు తమ్ముళ్లు చంద్రబాబు చేతికి కాగడా ఇచ్చి జిల్లాలో పాదయాత్రను ప్రారంభింపజేశారు. అక్కడి నుంచి యాత్ర సీతానగరంలోకి ప్రవేశించింది. చంద్రబాబుకు సంఘీభావంగా సీపీఐ జిల్లా కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు, ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు పరిశపోగు శ్రీనివాసరావు, మానుకొండ శివప్రసాద్ చంద్రబాబును కలిసి తమ మద్దతు తెలిపారు. కార్యకర్తలతో కలసి వచ్చిన వారు 'తోడుగా మేముంటామంటూ' పాదరక్షలను బహూకరించారు.

సీతానగరం నుంచి పాదయాత్ర ఉండవల్లి సెంటర్‌కు చేరుకుంది. అక్కడ ప్రజలను ఉద్దేశించి చంద్రబాబు ప్రసంగించారు. ప్రసంగం ముగిసే సరికి మధ్యాహ్నం 2:30 కావడంతో నాయకులు భోజన విరామం ప్రకటించారు. సాయంత్రం 4:30కు పాదయాత్ర ప్రారంభమైంది. ఉండవల్లి సెంటర్ నుండి యాత్ర 5:30కు తాడేపల్లి సెంటర్‌కు చేరుకుంది. మార్గ మధ్యలో చంద్రబాబును చూసేందుకు, ఆయన్ను కలిసేందుకు, మహిళలు, చిన్నా, పెద్దా అందరూ బారులు తీరారు. చేతులూ ఊపుతూ, అభివాదాలు చేస్తూ బాబు ముందుకు సాగారు. పాదయాత్ర రూట్‌లో ఉన్న ఎన్టీఆర్ విగ్రహాలకు పూల మాలలు వేస్తూ, కొన్ని చోట్ల పార్టీ జెండాలను ఆవిష్కరిస్తూ చంద్రబాబు ఉత్సాహంగా ముందుకు సాగారు. తాడేపల్లిలో అనారోగ్యంతో ఉన్న ఓ మహిళకు ఆర్థిక సాయం అందించారు.

అలుపెనుగని బాటసారికి ఘన స్వాగతం

తాను అలిసిపోలేదని జిల్లా ప్రజానీకానికి చంద్రబాబు చాటి చెప్పారు. ప్రజలు చూపిస్తోన్న ప్రేమ, అభిమానంతో ఉద్యమస్ఫూర్తిగా పాదయాత్రను కొనసాగిస్తున్నానని స్పష్టం చేశారు. ప్రజా సమస్యలు తెలుసుకొంటూ తాను గతంలో ఏ విధం గా నీతివంతమైన పాలనను అందించిం ది, నేడు కాంగ్రెస్ అసమర్థత, అవినీతి పాలనతో ర్రాష్టాన్ని ఎలా అధోగతి పాలు చేసిందో బేరీజు వేసుకోమంటూ పిలుపునిచ్చారు. 'వస్తున్నా... మీకోసం' కార్యక్రమాన్ని కొనసాగిస్తోన్న చంద్రబాబు బుధవారం మధ్యాహ్నం జిల్లాలో 150 కిలోమీటర్ల పాదయాత్రను పూర్తిచేసే క్రమంలో తొలి అడుగు వేశారు.
కృష్ణా జిల్లా పర్యటన ముగించుకొని బుధవారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో చంద్రబాబు ప్రకాశం బ్యారేజ్ మీదుగా జిల్లాలోకి ప్రవేశించారు. ఆయనకు టీడీపీ జిల్లా అధ్యక్షుడు ప్రత్తిపాటి పుల్లారావు, మాజీ మంత్రి డాక్టర్ కోడెల శివప్రసాద్, నరసరావుపేట ఎంపీ మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి ఇతర నాయకులు ఎదురెళ్లి ఘనంగా స్వాగతం పలికారు. మేళతాళాలు, కనకతప్పెట్లతో ప్రకాశం బ్యారేజ్ పరిసరాలు హోరెత్తాయి. మాజీ మంత్రి డాక్టర్ శనక్కాయల అరుణ నేతృత్వంలో తెలుగు మహిళలు హారతి ఇచ్చి చంద్రబాబును స్వాగతించారు. అక్కడి నుంచి చంద్రబాబు ఉండవల్లి సెంటర్‌కు చేరుకొని బహిరంగ సభలో సుదీర్ఘ ప్రసంగం చేశారు.
'నేను తాడేపల్లి మండలం ఉండవల్లికి చేరుకొన్నప్పుడు ఇక్కడికి వచ్చిన అక్కలు, చెల్లెళ్లు, అన్నలు, తమ్ముళ్లు, ప్రాణ సమానులైన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు అభినందలం టూ..' చంద్రబాబు ప్రసంగం ప్రారంభించగానే ఉండవల్లి సెంటర్ హర్షధ్వానాలతో మారుమోగింది. పాదయాత్ర 127వ రో జు కృష్ణా జిల్లాలో పూర్తి చేసుకొని గుం టూరులోకి వచ్చానని, ఇప్పటివరకు 11 జిల్లా పూర్తయి 12వ జిల్లాలోకి ప్రవేశించిందన్నారు. మీ ఉత్సాహం నాలో ఉద్యమ స్ఫూర్తిని నింపుతోందన్నారు.
గుంటూరు అనగానే...
గుంటూరు అనగానే నాకు ఇక్కడి రాజకీయ చైతన్యం గుర్తుకొస్తుంది. ఎన్నో ఉద్యమాలు చేసిన గడ్డ ఇది. మీరు చూపిస్తోన్న ఉత్సాహం పల్నాటి పౌరుషాన్ని ప్రదర్శిస్తోంది. వాణిజ్య పంటలు, ఆదర్శరైతులకు నెలవైన ప్రదేశమిది. నాగార్జునసాగర్, అమరావతి ఇక్కడే ఉన్నాయి. మీరు గోంగూర పచ్చడి బ్రహ్మాండంగా చేస్తారు. మీ అభిమానం మరిచిపోలేనిదంటూ ఉండవల్లి సభకు హాజరైన ప్రజల్లో ఉత్సాహం నింపారు. కాళ్లు నొప్పి పెడుతున్నా తాను ఒక ఆశయం కోసం వచ్చానని స్పష్టం చేశారు.
రాక్షస పాలన
రాష్ట్రంలో గత తొమ్మిదేళ్లుగా రాక్షస పాలన, అవినీతి పాలన, దూరదృష్టి లేని పాలన, అసలు పరిపాలన అంటే తెలియని పాలన జరగడం వలనే దుర్భర పరిస్థితులు ఏర్పడ్డాయని చంద్రబాబు అన్నారు. రైతులకు నీళ్లు లేవు. శ్రీశైలం, నాగార్జునసాగర్‌లలో ప్రస్తుతం ఉన్న నీటి కంటే తక్కువ ఉన్న రోజుల్లో డెల్టా, సాగర్ కాల్వలకు నీరు ఇచ్చిన ఘనత తనదన్నారు. 1994లో కరెంటు కష్టాలు ర్రాష్టాన్ని చుట్టుముట్టగా పదేళ్ల పాటు సంస్కరణలు అమలు చేసి విద్యుత్ రంగాన్ని గాడిలో పెట్టాం. మిగులు కరెంటు, బడ్జెట్ స్థితికి తీసుకొచ్చి వ్యవసాయానికి విద్యుత్ అందించామన్నారు. అలాంటిది నేడు కరెంటు లేదు. విద్యుత్ బిల్లులు ప్రజలు గుండెలు ఆగేలా చేస్తున్నాయి. కాంగ్రెస్ అవినీతి, దోపిడి వలనే విద్యుత్ చార్జీలు పెరిగాయి. దేశంలో దొంగలు పడ్డారు. మహాగజనీల్లా దోచుకొన్నారని ధ్వజమెత్తారు.
మహిళలకు ఎన్నో చేశా
మహిళల కోసం నాడు పొదుపు సంఘాలు ఏర్పాటు చేయించి రివాల్వింగ్ ఫండ్ ఇప్పించాను. విద్యార్థినులకు ఉచితంగా సైకిళ్లు పంపిణీ చేశాం. ఉద్యోగాల్లో 33 శాతం రిజర్వేషన్ కల్పించాం. 35 లక్షల వంట గ్యాస్ సిలిండర్లను స్టౌలతో సహా రూ. 200 చొప్పున కడితే ఇప్పించాను. తొమ్మిదేళ్ల పాటు గ్యాస్ ధర పెరగలేదు. పెరగనీయలేదు. ఈ రోజు రూ. 475 చేశారు. తొలుత రూ. 1175 పెట్టి సిలిండర్ కొటే ఆ తర్వాత ఎప్పటికో ఆధార్ చూసి సబ్సిడీ మొత్తం వాపసు చేస్తారట. కొత్త గ్యాస్ కనెక్షన్ రూ. ఏడు వేలు దాటింది. ఈ పరిస్థితుల్లో ఏడాదికి 10 సిలిండర్లు ఇప్పించే బాధ్యత తాను తీసుకొంటానని చంద్రబాబు హామి ఇచ్చారు.
ఏమి తినేట్లు... ఏమి కొనేట్టు
సన్నబియ్యం నాడు రూ.14 ఉంటే నేడు రూ. 50కి చేరాయి. చక్కెర రూ. 13 నుంచిర రూ.46, కందిపప్పు రూ.20 నుంచి రూ.80, మరోవైపు వంట గ్యాస్ తో ఎవరూ వంట చేసే పరిస్థితి లేకుండా కాంగ్రెస్‌పార్టీ చేసిందన్నారు. సభకు హాజరైన ప్రజలను ఉద్దేశించి ఏమి తమ్ముళ్లు మీ ఇంట్లో మీకు వంటచేసి పె డుతున్నారా అంటూ ప్రశ్నించారు. నాడు జేబులో డబ్బులు తీసుకెళితే సంచితో స రుకులు తెచ్చుకొనే పరిస్థితి, నేడు సం చితో డబ్బులు తీసుకెళితే జేబు నిండా స రుకులు రాని దుస్థితి అంటూ బేరీజు వేసి చెబుతూ ప్రసంగం కొనసాగించారు. ఆర్‌టీసీ, ఆటో చార్జీలు పెరిగిపోయాయని, పెట్రోల్, డీజిల్ రేట్లను 29 సార్లు పెంచారు. ఇంకా సిగ్గు లేకుండా ప్రతి నెలా డీజిల్ ధర పెంచుతామని చెబుతున్నారని కేంద్రంపై మండిపడ్డారు. ఇది బాదుడు ప్రభుత్వమని, ప్రజలు చైతన్యవంతులు కాకపోతే బతకనీయరన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడించడమే ప్రజల ముందున్న మార్గమని సూచించారు.

పాదయాత్ర ప్రాంభం ఆదుర్స్


పెదకాకాని: వస్తున్నా మీకోసం అంటూ టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేపట్టిన పాదయాత్రకు పొన్నూరు నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో భారీ ఏర్పాట్లను చేపట్టారు. ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్ ఏర్పాట్లను పర్యవేక్షించారు. గురు, శుక్రవారాల్లో నంబూరు, పెదకాకాని, వెనిగండ్ల, ఏవీఎన్ కాలనీ, అగతవరప్పాడు గ్రామాల్లో జరిగే పాదయాత్రను విజయవంతం చేసేందుకు ఆయన విశేషంగా కృషి చేస్తున్నారు. బుధవారం తెల్లవారు జామున 5 గంటలకు అగతవరప్పాడు గ్రామానికి చేరుకున్న ఎమ్మెల్యే అక్కడ నాయకులతో సమావేశం నిర్వహించారు. ఇంటింటికి తిరిగి బాబుకు బ్రహ్మర«థం పట్టాలని ఆయన కోరారు. అనంతరం ఏవీఎన్, వెనిగండ్ల సుందరయ్య కాలనీల ప్రజలతో ప్రత్యేకంగా సమావేశమ య్యారు. అనంతరం వెనిగండ్లలోని చీడిపూడివారిపాలెం, యాదవపాలెం, దళితవాడ, సుగాలికాలనీ, ముస్లిం ప్రాంతం, పొలిమేర సెంటర్లలో పర్యటించి, కార్యకర్తలతో ఆయన సమా లోచనలు జరిపారు. అక్కడి నుంచి పెదకాకాని మీదుగా నంబూరు చేరుకున్నారు. నంబూరులో కృష్ణ పశ్చిమ డెల్టా ప్రాజెక్టు కమిటీ చైౖర్మన్ ఉయ్యూరు సతీష్‌రెడ్డి, కూసం బ్రహ్మారెడ్డి, పార్టీ నాయకులు మాకిరెడ్డి జయరామిరెడ్డి, నంబూరు రాజు, కనకరాజు, కూచిపూడి మోహన్ తదితరులతోపాటు పార్టీ నాయకులతో సమావేశం నిర్వహించారు.

వెనిగండ్లలో ద్విచక్ర వాహనంపై పర్యటన

ఎమ్మెల్యే నరేంద్రకుమార్ వెనిగండ్లలో ద్విచక్ర వాహనంపై పర్యటించారు. యాదవపాలెం వరకు వచ్చిన ఆయన అక్కడి నుంచి చంద్రబాబు రూట్‌ను పరిశీలించేందుకు దళిత వాడవైపు వెళ్ళారు. ఎన్టీఆర్ విగ్రహాల ప్రారంభోత్సవ ఏర్పాట్లపై అక్కడి కార్యకర్తలతో కొద్దిసేపు చర్చించారు. అనంతరం ఊరిలోని అనేక ప్రాంతాల్లో తిరిగారు.

నంబూరు వద్ద

ఘన స్వాగత ఏర్పాట్లు

చంద్రబాబు బుధవారం మధ్యాహ్నం నంబూరు చేరుకోనున్నారు. ఆయనకు స్వాగతం పలికేందుకు నంబూరు దేశం నాయకులు స్వాగత ఏర్పాట్లను భారీ ఎత్తున చేపట్టారు. ఇప్పటికే నంబూరులో అన్ని ప్రాంతాల్లో టీడీపీ జెండాలు రెపరెపలాడుతున్నాయి. ఊయ్యూరు సతీష్‌రెడ్డి, కూసం బ్రహ్మారెడ్డి, మాకిరెడ్డి జయరామిరెడ్డి తదితరులు ఈ ఏర్పాట్లను చేపట్టారు. నరేంద్ర కార్యకర్తల సమావేశంలో భారీ ఏర్పాట్లపై సుదీర్ఘంగా చర్చించారు. పెదకాకాని, వెనిగండ్ల తదితర గ్రామాలు పసుపుమయంగా మారాయి. అధినేతకు స్వాగతం పలికేందుకు అన్ని శ్రేణుల నుంచి జనాన్ని ఆహ్వానించేందుకు ఎమ్మెల్యే నరేంద్ర విస్తృతంగా పర్యటిస్తున్నారు.

పాదయాత్రకు భారీ ఏర్పాట్ల

కాంగ్రెస్ ప్రభుత్వం అట్టహాసంగా మొదలుపెట్టిన ప్రతి పథకమూ చివరకు అట్టర్‌ఫ్లాప్ అవుతోందని తెలుగుదేశం పార్టీ విమర్శించింది. ఆధార్ కార్డులు కూడా ఇవ్వలేక ప్రజలు రోడ్డెక్కే పరిస్థితిని తీసుకు రావడం దారుణమని, చేతగాని పనులు పెట్టుకొని ప్రజలను హింసించడం ఎందుకని తెలుగు మహిళ అధ్యక్షురాలు శోభా హైమావతి మండిపడ్డారు. ఎన్టీఆర్ భవన్‌లో మంగళవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. ఆధార్ కార్డులు సవ్యంగా ఇవ్వలేనప్పుడు.. చాలినన్ని కేంద్రాలను పెట్టలేనప్పుడు ప్రతి పథకాన్ని దానితో అనుసంధానించడం ఎందుకని ప్రశ్నించారు.

చేతకాని పనులు ఎందుకు!?: టీడీపీ

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పాదయాత్ర బుధవారం ఉదయం గుంటూరు జిల్లాలోకి ప్రవేశించింది. ఆయనకు టీడీపీ శ్రేణులు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఈ ఉదయం కృష్ణా జిల్లాలోని పద్మావతి ఘాట్ నుంచి 128వ రోజ పాదయాత్రను ప్రారంభించిన బాబు ప్రకాశం బ్యారేజీ దగ్గర గుంటూరులోకి ప్రవేశించారు.

గుంటూరు జిల్లాలోకి బాబు పాదయాత్ర

వస్తున్నా...మీకోసం కార్యక్రమంలో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేపట్టిన పాదయాత్ర 128వ రోజుకు చేరుకుంది. బుధవారం ఉదయం పద్మావతి ఘాట్ నుంచి బాబు పాదయాత్రను ప్రారంభించారు. ఆయన వెంట అభిమానులు, కార్యకర్తలు తరలివస్తున్నారు.

128వ రోజు చంద్రబాబు పాదయాత్ర

గుంటూరు  బిరబిరా కృష్ణమ్మ పరుగులెడుతూ వచ్చి అక్కడ సేదతీరుతూ నాలుగు జిల్లాల్లో పంటలను సస్యశ్యామలం చేసే పవిత్ర ప్రదేశమది. తెల్లదొరల తుపాకులకు ఎదురెళ్లి రొమ్ము చూపించి కాల్చమంటూ ఎదిరించిన ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు పేరుతో నిర్మించిన వారధి అది. ఇటు గుంటూరు, అటు కృష్ణా జిల్లాలను కలిపిన ఆ వారధే పకాశం బ్యారేజ్. సరిగ్గా అక్కడి నుంచే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు కొనసాగిస్తోన్న 'వస్తున్నా... మీకోసం' పాదయాత్ర గుంటూరు జిల్లాలో నేడు(బుధవారం) తొలి అడుగు పడనుంది.

విజయవాడ నగరంలో పాదయా త్ర నిర్వహిస్తోన్న చంద్రబాబు నేటి ఉదయం 11 గంటల సమయంలో ప్రకాశం బ్యారేజ్ మీదుగా జిల్లాలోకి ప్రవేశిస్తారు. ఈ నేపథ్యంలో అధినేతకు ఘనంగా స్వాగతం పలికేందుకు టీడీపీ జిల్లా నాయకులు, శ్రేణులు పూర్తిస్థాయిలో సమయాత్తమయ్యాయి.

ఇంచుమించు 10 వేల మంది కార్యకర్తలతో చంద్రబాబుకు ఎదురెళ్లి స్వాగతం పలకాలని నాయకులు భావిస్తున్నారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల నుంచి కార్యకర్తలు పాదయాత్రకు తరలివచ్చేలా ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇన్‌చార్జ్‌లు ఏర్పాట్లు చేశారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు ప్రత్తిపాటి పుల్లారావు నేతృత్వంలో నరసరావుపేట ఎంపీ మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి, మాజీ మంత్రి డాక్టర్ కోడెల శివప్రసాదరావు, ఎమ్మెల్సీ నన్నపనేని రాజకుమారి, ఎమ్మెల్యేలు ధూళిపాళ్ల నరేంద్రకుమార్, యరపతినేని శ్రీనివాసరావు, కొమ్మాలపాటి శ్రీధర్, జీవీ ఆంజనేయులు, నక్కా ఆనందబాబు, మాజీ మంత్రులు ఆలపాటి రాజేంద్రప్రసాద్, జే ఆర్ పుష్పరాజ్ తదితరులు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.

సహకార ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్, వైకాపాపై స్పష్టమైన ఆధిక్యం సాధించడంతో పార్టీ జిల్లాలో పూర్వవైభవం దిశగా దూసుకుపోతోందని నాయకులు విశ్లేషిస్తున్నారు. సహకార గెలుపు ఇచ్చిన ఊపుతో చంద్రబాబు పాదయాత్రను రెట్టింపు ఉత్సాహంతో విజయవంతం చేసేందుకు సన్నద్ధమయ్యారు. జిల్లాలో ప్రజలు ఎదుర్కొంటున్న సాగు, తాగునీరు, విద్యుత్ కోతలతో మూతబడుతోన్న పరిశ్రమలు, పంటలకు గిట్టుబాటు ధర లేకపోవడం తదితర సమస్యలను ఇప్పటికే చంద్రబాబుకు నాయకులు నివేదించారు. పాదయాత్రలో భాగంగా రైతులు, మహిళలు, కార్మికులు, కూలీ లు, విద్యార్థులతో చంద్రబాబు సంభాషించి వారి సమస్యలు తెలుసుకొనేలా ప్రణాళిక రూపొందించారు. పార్టీ రాష్ట్ర నాయకత్వం ఆదేశాల మేరకు ప్రతీ నియోజకవర్గంలో ఒక బహిరంగ సభను ఏర్పాటు చేయనున్నారు.

చంద్రబాబు పాదయాత్ర రెండు వేల కిలోమీటర్ల మైలురాయిని గుం టూరులోనే చేరుకోనున్న నేపథ్యంలో అందుకు గుర్తుగా భారీ పైలాన్‌ను ఆవిష్కరింప చేసేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నారు. ప్రకటించిన షెడ్యూల్‌కు రెండు, మూడు రోజులు ఆలస్యమైనా సరే మంగళగిరి, పొన్నూరు, గుంటూ రు తూర్పు, పశ్చిమ, ప్రత్తిపాడు, తెనాలి, వేమూరు, రేపల్లె నియోజకవర్గాల్లో చంద్రబాబు పర్యటిస్తారని పార్టీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. నాయకులు తమ సత్తా చాటుతూ ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా ఫ్లెక్సీలు, స్వాగత తోరణాలు వంటివి ఏర్పాటు చేశారు.

నేటి షెడ్యూల్ ప్రకాశం బ్యారేజ్ నుంచి చంద్రబాబు పాదయాత్ర ప్రారంభించి సీతానగరం, ఉండవల్లి సెంటర్, తాడేపల్లి మునిసిపాలిటీ మీదుగా సాయిబాబా దేవాలయం, నులకపేట చేరుకొని మధ్యాహ్నం భోజన విరామానికి ఆగుతారు. అనంతరం డోలాస్‌నగర్, డాన్‌బాస్కో స్కూల్ మీదుగా మంగళగిరి టౌన్‌లోని అంబేద్కర్ సర్కిల్‌కు చేరుకొని అక్కడ ఎన్‌టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించి బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అనంతరం లక్ష్మీనృసింహస్వా మి ఆలయం మీదుగా చినకాకాని ఎన్ఆర్ఐ ఆసుపత్రికి చేరుకొని రాత్రికి బస చేస్తారు.

అలు పెరగని బాటసారి ఆగమనం నేడు

గుంటూరు : వస్తున్నా మీకోసం పాదయాత్రకు అనూహ్య స్పందన వచ్చిందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. మంగళవారం మధ్యాహ్నం ఒంటిగంటకు జిల్లా పార్టీనాయకులతో ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ఆరోగ్యం సహకరించకపోయినా, గొంతునొప్పి భాధిస్తున్నప్పటికీ ప్రజలందిస్తున్న ఆదరాభిమానాలు ఉత్సాహం నింపుతున్నాయన్నారు. కానీ వారి కష్టాలు తనను బాగా కుంగదీసాయన్నారు. జిల్లాలో సొసైటీల్లో టీడీపీ ఆధిక్యత చాటటం శుభసూచికమన్నారు. జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ చైర్మన్ టీడీపీ కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు.

ప్రజలు, కార్యకర్తలు అండదండలతోనే తనకీ గుర్తింపు లభించదన్నారు. చివరి రక్తపు బొట్టు వరకు ప్రజలు, పార్టీ శ్రేణుల పక్షానే ఉండి పోరాడతానని స్పష్టం చేశారు. ప్రభుత్వంపై వ్యతిరేకత నివురుగప్పిన నిప్పులా ఉందన్నారు.టిడీపీ జిల్లా అధ్యక్షులు ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ పాదయాత్ర విజయవంతం కావటానికి కావల్సిన అన్నిరకాల చర్యలు చేపట్టినట్లు తెలిపారు. పాదయాత్ర కొనసాగుతున్న అన్ని ప్రాంతాలను పరిశీలించి ముఖ్య నేతలతో అనేక దఫాలు సమావేశం ఏర్పాటయ్యామని తెలిపా రు. పాదయాత్ర ఎనిమిది నియోజక వర్గ పరిధిలో 150 కిలోమీటర్లు రూపొందించినట్లు తెలిపారు. జిల్లా ప్రజానీకం తమ రాకకోసం ఎదురుచూస్తుందని పుల్లారావు అన్నారు.

కార్యక్రమంలో నరసరావుపేట ఎంపీ మోదుగుల వేణుగోపాలరెడ్డి, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్, ఎమ్మెల్యేలు యరపతినేని శ్రీనివాసరావు, కొమ్మాలపాటి శ్రీధర్, జివివి ఎస్ ఆర్ ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్యే ముమ్మనేని వెంకటసుబ్బ య్య, పార్టీనాయకులు తెనాలి శ్రావణ్‌కుమార్, మన్నవ సు బ్బారావు, బోనబోయిన శ్రీనివాస్‌యాదవ్, యాగంటి దుర్గారావు, నిమ్మకాయల రాజనారాయణ, షేక్ లాల్ వజీర్, మా నుకొండ శివ ప్రసాద్; కోవెలమూడి రవీంద్ర (నాని), చిట్టాబత్తిన చిట్టిబాబు, తదితరులు పాల్గొన్నారు.

మీ కోసం పాదయాత్రకు అనూహ్య స్పందన

సరిగ్గా 30 ఏళ్ల క్రితం ఎన్టీఆర్... నేడు చంద్రబాబు తాడేపల్లిలోని సాయిబాబా గుడి ఎదుటి ప్రాంతంలో భోజనానికి ఉపక్రమించడం విశేషం. 1983లో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీ రామారావు గుంటూరు జిల్లాకు వచ్చినప్పుడు తాడేపల్లి మీదుగా వస్తూ సాయిబాబా గుడి ఎదురు ఖాళీ స్థలంలో ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించారు. అనంతరం అక్కడే కొద్దిసేపు విశ్రమించి భోజనం చేశారు. 30 ఏళ్ల అనంతరం దేశం అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు జిల్లా పర్యటనలో భాగంగా తాడేపల్లి సాయిబాబా గుడి ఎదురు ఖాళీ స్థలంలో భోజనం చేసి విశ్రాంతి తీసుకోనున్నారు.

సిద్ధం చేస్తున్న ప్రాంగణం చంద్రబాబునాయుడు జిల్లా పర్యట నకు సంబంధించి ఉదయం 10:30 గంటల సమయంలో ప్రకాశం బ్యారేజీ వద్దకు రాగానే దేశం జిల్లా నేతలు భారీ గా స్వాగతం పలకనున్నారు. బాబు సీతానగరం, ఉండవల్లి సెంటరు, తాడేపల్లి పట్టణం, సాయిబాబా మందిరం ఏర్పాటు చేస్తున్న భోజన వసతి ప్రాంగణానికి వచ్చి విశ్రాంతి తీసుకోనున్నారు. అనంతరం నులకపేట, డోలాస్‌నగర్ మీదుగా డా న్‌బోస్కో హైస్కూల్, మంగళగిరి చేరుకుంటారు. తాడేపల్లి పట్టణ, మండల దేశం నేతలు సాయిబాబా మందిర ఎదుట ఉన్న ప్రాంగణాన్ని జేసీబీలతో చదును చేయిస్తున్నారు. కాగా, చంద్రబాబు పాదయాత్రను విజయవంతం చేయాలని మండల దేశం అధ్యక్షులు పఠాన్ ఖాశీంఖాన్, పట్టణ దేశం అధ్యక్ష, కార్యదర్శులు మేకా పుల్లారెడ్డి, కొర్రపాటి రమణ కోరారు.

నాడు ఎన్టీఆర్..నేడు చంద్రబాబు

చంద్రబాబు ్‌వస్తున్నా .. మీ కోసం* పాదయాత్ర జిల్లాలో గ్రాండ్ సక్సెస్ అయింది. మంగళవారం తూర్పు నియోజకవర్గంలోని కృష్ణలంక, రామలింగేశ్వరనగర్ తదితర ప్రాంతాలలో జరిగిన యాత్రకు ప్రజలు భారీగా తరలి వచ్చారు. మొదటి విడత పాదయాత్ర బుధవారం ఉదయం జిల్లాలో పూర్తికానుంది. విజయవాడ బస్‌స్టేషన్ సమీపంలో ఉదయం తొమ్మిది గంటలకు జరిగే బహిరంగ సభలో పాల్గొన్న అనంతరం ప్రకాశం బ్యారేజి మీదుగా చంద్రబాబు గుంటూరు చేరుకుంటారు. ప్రకాశం బ్యారేజి ఆవల చంద్రబాబుకు పెద్ద ఎత్తున స్వాగతం పలకటానికి గుంటూరు జిల్లా నాయకులు ఏర్పాట్లు చేస్తున్నారు. కృష్ణా జిల్లాలో జనవరి 21వ తేదీన చంద్రబాబు నల్గొండ జిల్లా మీదుగా జగ్గయ్యపేట సరిహద్దులోకి అడుగు పెట్టారు. ముందుగా నిర్ణయించిన ప్రకారం అయితే తొలివిడతగా చంద్రబాబు జిల్లాలో 9 రోజుల పాటు 136 కిలోమీటర్ల మేర పాదయాత్ర నిర్వహించాల్సి ఉంది.

కానీ, పాదయాత్ర 17 రోజుల పాటు కొనసాగింది. మధ్యలో కాలి గాయం, ఇతర సమస్యలతో బాధపడుతున్న చంద్రబాబు నాలుగు రోజుల పాటు విశ్రాంతి తీసుకున్నారు. తిరిగి జిల్లాలోని జగ్గయ్యపేట, నందిగామ, మైలవరం నియోజకవర్గాలతో పాటు, విజయవాడ నగరం పరిధిలోని పశ్చిమ, మధ్య, తూర్పు నియోజకవర్గాలలో ఆయన నాలుగు రోజుల పాటు పాదయాత్ర నిర్వహించారు. ఈ పాదయాత్రలో మొదటి రెండు మూడు రోజులుమినహా చివరి వరకూ ఆరోగ్య సమస్యలతో ఆయన ఇబ్బందులు పడ్డారు. ముందుగా ఎడమకాలి చిటికెన వేలుకు గాయం అయింది. దానికి ఇన్ఫెక్షన్ రావటంతో వాపు మరింత పెరిగింది.

రెండు రోజుల పాటు చంద్రబాబు కుంటుకుంటూ ఓపిగ్గా నడిచారు. పాదయాత్రను ఏ దశలోనూ ఆపటానికి చంద్రబాబు అంగీకరించలేదు. వైద్యులు చెప్పినా వినలేదు. ఆఖరుకు ఆయన సతీమణి భువనేశ్వరి, తనయుడు లోకేష్‌లు కూడా వచ్చి వత్తిడి చేశారు. పరిటాల దగ్గర 117 రోజుల పాదయాత్ర పూర్తి చేసుకున్న సందర్భంగా 117 అడుగుల పైలాన్ ప్రారంభోత్సవ సభలో చంద్రబాబు పాల్గొన్న సందర్భంగా కార్యకర్తలు, అభిమానులు చంద్రబాబును విశ్రాంతి తీసుకోవాలని ఒత్తిడి చేశారు. దాంతో ఆయన వైద్య పరీక్షల కోసం ఒక్క రోజు విశ్రాంతి తీసుకున్నారు.

తర్వాత వైద్య పరీక్షల అనంతరం మరో మూడు రోజులు విశ్రాంతి తీసుకుని తిరిగి పాదయాత్రను ప్రారంభించారు. ఆ తర్వాత ఆయనకు విజయవాడలో గొంతు బాధ పెట్టింది. బహిరంగ సభలలో ఆయన మాట్లాడటానికి గొంతు సహకరించలేదు. అయినా సభకు వచ్చిన భారీ ప్రజానీకాన్ని చూసి గొంతు అతికష్టమ్మీద కూడదీసుకుని ప్రసంగించారు. జిల్లాలో అడుగు పెట్టినది మొదలు చివరి వరకూ బాబుకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. జగ్గయ్యపేట, నందిగామ నియోజకవర్గాలలో బాబు పాదయాత్రలో పల్లెల నుంచి జనం తరలి వచ్చారు. జగ్గయ్యపేట నియోజకవర్గంలోని పెనుగంచిప్రోలు బహిరంగ సభకు రికార్డు స్థాయిలో జనాలు వచ్చారు.

ఆ తర్వాత నందిగామ నియోజకవర్గంలో అంతటి స్పందన కనిపించింది. మైలవరం నియోజకవర్గంలో ప్రధానంగా ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్‌లో చంద్రబాబు సభ అత్యంత భారీగా జరిగింది. ఆ తర్వాత విజయవాడ నగరంలోకి అడుగు పెట్టిన చంద్రబాబుకు ఊహించని విధంగా ప్రజాదరణ లభించింది. గ్రామాల్లో కిలోమీటరు దూరం ఎదురేగి మహిళలు హారతులు ఇచ్చారు. చంద్రబాబు తన ప్రసంగాలలో కరెంటు చార్జీలు, నిత్యావసరాలు, వ్యవసాయం గిట్టుబాటు ధరలు, రైతుల ఇబ్బందుల గురించి ప్రధానంగా ప్రస్తావించారు. నగరంలో కార్పొరేషన్ సంబంధిత సమస్యలు, నగరాభివృద్ధికి ఆటంకం వంటి సమస్యలపై ప్రధానంగా స్పందించారు. అటు రూరల్ , ఇటు నగరంలో కామన్‌గా అవినీతిపై చంద్రబాబు విల్లు ఎక్కుపెట్టారు. జిల్లాలో బాబు పాదయాత్రతో పాటు ముఖాముఖి కార్యక్రమాలు జరిగాయి.

అవినీతిపై ఇంజనీరింగ్, సాధారణ కళాశాలల విద్యార్థులతో మీట్‌లు జరిగాయి. రైతులతో రైతు సదస్సు, ఆటోమొబైల్ - రవాణారంగ ప్రతినిధులతో మీట్ జరిగింది. పట్టభద్రులతో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. గుంటూరులో చంద్రబాబు దాదాపుగా 14 రోజుల పాటు పాదయాత్రను కొనసాగిస్తారు. ఆ తర్వాత మలివిడతగా రెండవ దఫా చంద్రబాబు మళ్ళీ జిల్లాకు రానున్నాను. రెండవ దఫాలో అవనిగడ్డ, మచిలీపట్నం తదితర ప్రాంతాల మీదుగా పాదయాత్ర జరుగుతుంది.

అదే జోరు..జిల్లాలో బాబు యాత్ర గ్రాండ్ సక్సెస్


సహకార ఎన్నికలపై కాంగ్రెస్ నాయకులు కాకి లెక్కలు చెపుతున్నారని తెలుగుదేశం నాయకులు విమర్శించారు. దీనిపై మంగళవారం మచిలీపట్నం ఎంపీ కొనకళ్ళ నారాయణరావు స్వగృహంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆ పార్టీ నాయకులు సి.ఎల్.వెంకట్రావు, కొనకళ్ళ బుల్లయ్య, బచ్చుల అర్జునుడు, ఈడ్పుగంటి వెంకట్రామయ్య ఎన్నికల ఫలితాలు వివరించారు. బచ్చుల అర్జునుడు మాట్లాడుతూ తమ పార్టీ బలపర్చిన అభ్యర్థులు 193 సొసైటీలలో గెలుపొందారన్నారు. మంగళవారం జరిగిన డ్రాలో మరో రెండు సొసైటీలు తమ అభ్యర్థులు కైవసం చేసుకోవడం జరిగిందన్నారు. స్వతంత్రులుగా ఉన్న 18 మందిలో 15 మంది తమకే మద్దతిస్తారన్నారు. మొత్తంగా 215 మందితో కేడీసీసీని కైవసం చేసుకుంటామన్నారు. కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థిని ప్రకటించలేని స్థితిలో ఉందన్నారు. పిన్నమనేని వెంకటేశ్వరరావు, కంచి రామారావులమధ్య పోటీ నెలకొందన్నారు.

ఇంటి పోరుతో సతమతమవుతున్న కాంగ్రెస్ తమకు పోటీనే కాదన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్‌కు సహకార వ్యవస్థలో ఇంకా లెక్కలు తెలియలేదన్నారు. ఆ రెండు పార్టీల నాయకులు ఎంపీ లగడపాటి రాజగోపాల్, మంత్రి కె.పి.సార«థి, సామినేని ఉదయభానులు ఏసీ రూమ్‌లలో కూర్చుని కాకమ్మ కబుర్లు చెపుతున్నారన్నారు. నిజాలు చెప్పే ధైర్యం లేని నాయకులు వాస్తవాలు ఒప్పుకోలేక పోతున్నారన్నారు. సీఎల్ వెంకట్రావు మాట్లాడుతూ అధికార కాంగ్రెస్ పార్టీ కుయిక్తులతో సహకార రంగాన్ని కైవసం చేసుకోవాలనుకుంటోందన్నారు. రాష్ట్రంలోనే అత్యధిక సొసైటీలున్న కృష్ణా జిల్లాలో టీడీపీ ఆధిపత్యం కాంగ్రెస్‌కు మింగుడు పడటం లేదన్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని కేడీసీసీని దక్కించుకోవాలని కుట్ర పన్నుతోందన్నారు.

ఎన్నికల షెడ్యూల్‌లో విడుదల చేయాల్సిన అంశాలను ఇప్పుడు విడుదల చేసి సహకార వ్యవస్థను భ్రష్టు పటిస్తున్నారన్నారు. సహకార శాఖ కమిషనర్ తాజా ఉత్తర్వులు ఇందుకు అద్దం పడుతోందన్నారు. అడ్డగోలు నిబంధనలతో సన్న, చిన్న కారు రైతులకు సొసైటీ ఎన్నికలలో ఓటు లేకుండా కాంగ్రెస్ నాయకులు చేశారన్నారు. ఫలితంగా 2005 లో 6.80 లక్షల మంది సభ్యులు ఓటర్లుగా ఉండగా ఈ ఎన్నికల్లో ఆ సంఖ్య 2.16 లక్షలకు పడిపోయిందన్నారు. అదేవిధంగా తమకు మద్దతు పలకని సొసైటీ అధ్యక్షులకు ఓటు లేకుండా చేయాలని చూస్తున్నారన్నారు. దానిలో భాగంగానే ఓవర్ డ్యూ ఉన్న సొసైటీ అధ్యక్షులను అనర్హులుగా ప్రకటించారన్నారు.

కొనకళ్ళ జగన్నాధరావు (బుల్లయ్య) మాట్లాడుతూ రైతులు తెలుగుదేశం బలపర్చిన అభ్యర్థులను గెలిపించి చంద్రబాబు పాలన కోరుకుంటున్నారన్నారు. ఓటమి భయంతోనే కాంగ్రెస్ కొత్త కొత్త చట్టాలను బయటకు తెస్తోందన్నారు. అభ్యుదయ భావాలు గల తమ పార్టీ అభ్యర్థి ఈడ్పుగంటి వెంకట్రామయ్యకు కాంగ్రెస్ నుంచి సైతం మద్దతు లభిస్తోందన్నారు.

అవన్నీ కాకి లెక్కలే:టీడీపీ


తమ్ముళ్లూ... రాజకీయ చైతన్యానికి మారుపేరు బెజవాడ... రాష్ట్రాన్ని, దేశాన్ని పట్టి పీడిస్తున్న అవినీతి మహమ్మారిని తరిమి కొట్టాల్సిన సమయం ఆసన్నమైంది...అదీ ఇక్కడి నుంచే ప్రారంభం కావాలి...మీ విద్యార్థులతోనే ప్రారంభం కావాలి...అంటూ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నగరంలో పలుచోట్ల చేసిన ప్రసంగానికి విద్యార్థి లోకం స్పందించింది. శనివారం నుంచి మూడు రోజుల పాటు నగరంలో పాదయాత్ర చేస్తూ యువతను ఉద్దేశించి చేసిన ప్రసంగాలకు అనూహ్య స్పందన లభించిందని చెప్పవచ్చు. తూర్పు నియోజకవర్గంలోని పటమటలంకలో బసచేసిన చంద్రబాబును కలిసేందుకు మంగళవారం వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థులు పెద్దయెత్తున తరలివచ్చారు. అక్కడకు వచ్చిన విజయ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ విద్యార్థులను 'ఆంధ్రజ్యోతి' పలకరించగా, అవినీతి అంతానికి తమ వంతు పోరాటం చేస్తామని, చంద్రబాబు పిలుపుతో ఎస్ఎంఎస్‌ల పోరాటానికి ఈ రోజు నుంచే శ్రీకారం చుడతామని స్పష్టం చేశారు.

దేశం, రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య, పేదరికం పెరగడానికి లక్షలాది కోట్ల రూపాయల ప్రజాధనం ప్రజాప్రతినిధుల ముసుగులో అవినీతి పరులు దండుకోవడమే కారణమని ఆగ్రహం వ్యక్తం చేశారు.

నేటి నుంచే అవినీతిపై పోరాటం అవినీతిపై చంద్రబాబు చేసిన ప్ర సంగం ఎంతగానో ఆలోచింపచేసింది. నేటి నుంచే నా వంతుగా అవినీతిపై పోరాటం సలుపుతాను. ఈ విషయంలో నా మిత్రులు, బంధువులకు కూడా ఎస్ఎంఎస్‌లు పంపిస్తాను - సుమలత ఆంధ్రా అన్నా హజారే చంద్రబాబు అవినీతి ప్రక్షాళనకు న్యూఢిల్లీలో అన్నా హజారే చేపట్టిన ఉ ద్యమం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అన్నా హజారే స్పూ ర్తితో రా ష్ట్రంలో చంద్రబాబు పోరాటం చేసి యువత దృష్టిలో ఆంధ్రా అన్నా హజారేగా మారారు.

చంద్రబాబు స్పూర్తితో ఆయన ఇచ్చిన పిలుపుతో అవినీతిపై పోరాటానికి ముందుకు కదులుతాం - సుధారాణి బాబు పాలనలోనే మహిళలకు రక్షణ చంద్రబాబు పాలనలో మహిళలు, విద్యార్థినులకు పూర్తి రక్షణ ఉండేది. నేడు ఆ పరిస్థితి కనబడటం లేదు. అర్థరాత్రి కూ డా మహిళలు తిరగాలని గాంధీమహాత్ముడు కలలుగంటే నేడు పట్టపగలే ఆ పరిస్థితి లేదు. విద్యార్థినులు, యువతులు బయటకు రావాలంటేనే గుండెలరచేత పెట్టుకొనే పరిస్థితి దాపురించింది.

అవినీతి అంతంతో పాటు మహిళలకు రక్షణ చంద్రబాబుతోనే సాధ్యమవుతుంది. - స్రవంతి విద్యార్థులంతా స్పందిస్తున్నారు అవినీతిని అంతం చేయాలన్న చంద్రబాబు పిలుపు విద్యార్థి లోకా న్ని ఆలోచింపచేస్తోంది. నా స్నేహితులు అందరం దీని గురించే మాట్లాడుకుంటున్నాం. సమయం దొరికినప్పుడల్లా ఎస్ఎంఎస్‌ల ద్వారా అవినీతిపై యుద్ధం చేయడానికి సిద్ధంగా వున్నాం. 2014 ఎన్నికలలో చంద్రబాబు విద్యార్థులకు కూడా సీట్లు కేటాయిస్తే చాలా బాగుంటుంది

- రత్నకుమారి

అవినీతి అంతానికి కదిలిన విద్యార్థి లోకం

విజయవాడ కార్పొరేషన్ పేదలపై ఆస్తిపన్ను భారం మోపడం దారుణంగా ఉందని చంద్రబాబు నాయుడు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. పాదయాత్రలో భాగంగా మంగళవారం రాత్రి కృష్ణలంక, రాణిగారి తోట, సత్యంగారి హోటల్ సెంటర్లలో ఆయన ప్రజల నుద్దేశించి మాట్లాడుతూ నగరంలో నీళ్ళు సరిగారాడంలేదన్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో వాటర్ స్కీం ప్రవేశ పెడితే దాన్ని సరిచేసుకుని నడిపించడం కార్పొరేషన్ వల్ల కాలేదని విమర్శించారు. ఎందుకిలా చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. విజయవాడ కార్పొరేషన్ దివాలా తీసిందన్నారు. నాలుగు నెలలుగా జీతాలు చెల్లించడం లేదు, ఏ పనీ చేయాలన్నా డబ్బులు లేవని అన్నారు. నగరంలో సామాన్యుడి బతుకు భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. కరెంటు చార్జీలు భారీగా పెంచారుగాని పేదవాడికి కూలి మాత్రం పెరగలేదన్నారు.

పంపు, టీవీ, ఫ్యాన్ ఉంటే వెయ్యి రూపాయలు కరెంటు బిల్లు వస్తుంటే ఇక వారు ఎలా బతుకుతారన్నారు. అనుచితంగా కరెంటు భారం పెరిగింది. నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగాయి. దీనికి తోడు వ్యాట్ భారం మరొకటి. ఇక సామాన్యుడి బతుకు ఎలా సాగుతుందని ఆయన ప్రశ్నించారు. ఇలాంటి పరిస్థితుల్లో నగ ర ప్రజలపై ఆస్తి పన్ను మోపడం మోయలేని పరిస్థితిగా ఉందన్నారు. హైవే ఉన్న చోట కింద సబ్‌వే ఉండాలి. కాని ఇక్కడ కార్పొరేషన్ వాటిని నిర్మాణం చేపట్టాల్సిన బాధ్యత ఉన్నా, పట్టించుకోలేదన్నారు. కంకర కొట్టే కార్మికులకు తమ ప్రభుత్వం వచ్చాక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తానని ప్రకటించారు. నగరంలో సూపర్ స్పెషాలిటీ హాస్పటల్ ఏర్పాటు చేయడంతో పాటు విజయవాడను మెగా సిటీగా తీర్చి దిద్దుతానని చంద్రబాబు అన్నారు. చెప్పారు.

పేదలపై పన్నుల భారం

ఇదంతా నదీగర్భ ప్రాంతం. కృష్ణమ్మ కన్నెర్ర చేస్తే ఇక్కడి బతుకు చిగురుటాకులా వణికి పోతుంది. చిన్న చినుకుకే చింతిల్లుతుంది. ఎక్కడెక్కడి వాన నీళ్లకూ, మురుగుకూ లోగట్టున ఉన్న ఆ కాలనీలే కాలువ దారులు. రామలింగేశ్వర నగర్, కృష్ణలంక ప్రాంతంలో సాగు తున్నప్పుడు కన్న దృశ్యాలివి. విన్న సంగతులివి. ఇక్కడ నివసించే వారిలో లారీ డ్రైవర్లు, క్లీనర్లు ఎక్కువ. ఒక్క ట్రిప్పు పోయిరావడానికి నెల రోజుల పైనే పడుతుందట. కోల్‌కతా దాకా పోతామని చెప్పుకొచ్చారు. కృష్ణానదికి వరదలు రావడం, నిర్వాసితులు కావడం ఏడాదికి ఒకసారైనా జరుగుతుంది. వరద వచ్చినప్పుడల్లా బస్టాండ్లూ, పాఠశాలలే వీళ్లకు గతి. అలాంటప్పుడు కుటుంబంలోని మగవాళ్లు లారీ పనికి పోతే, ఆ ఇల్లాళ్ల అవస్థ అంతాఇంతా కాదు. చేతికి అందిన వంటపాత్రలను ఒకచేతితో, బిడ్డలను మరో చేతితో పట్టుకొని ఇంటి నుంచి బయటపడటం ఎంత కష్టం!

ఎన్ని వాగ్దానాలు.. ఎన్నెన్ని హామీలు. కృష్ణమ్మకు రిటైనింగ్ వాల్ కడతామని ఎంత నమ్మబలికారు? దానివల్ల వరద ప్రమాదాన్ని నివారించొచ్చునని చెబితే ఈ జనం నమ్మారు. బతుకును సురక్షితం చేసే చర్యలు తీసుకుంటామని చెప్పిన వాళ్లంతా ఇప్పుడు గాలికి వదిలేశారు. పన్నులు కట్టించుకునేప్పుడు, సర్‌చార్జీలు మోపేటప్పుడు తప్ప వీరికి పౌర ఉనికే లేదు. విజయవాడలోకి వచ్చి నాలుగు రోజులు. ఈ కాలమంతా ఇలాంటి వాళ్లే ఎదురయ్యారు. నా వెంట నడిచారు. చేతులు పట్టుకొని వెతలు వెళ్లబోసుకున్నారు.

నన్ను తమ తోబుట్టువులా ఆదరించారు. నగరంలోకి వచ్చినప్పటి నుంచి వీడిపోయే క్షణం వరకు ఈ జనం కనబరిచిన స్పందన అనేకసార్లు ఉద్వేగానికి గురిచేసింది. ఇదివరకు నేను అనేకసార్లు విజయవాడలో పర్యటించాను. కానీ, ఇలాంటి అభిమానం చవిచూడలేదు. ఆడపడుచు కంట్లో కసిని, కుతకుత ఉడుకుతున్న పేదోడి గుండెమంటని దగ్గరగా చూశాను. ఎప్పటికైనా ఈ కృష్ణలో మునిగేది మోసం.. పైకి లేచేది మంచితనమే!

మునిగేది మోసం.. మిగిలేది ముంచే!