February 3, 2013

పేరుకే ఇది నగరం. పొట్టవిప్పి చూస్తే పేట నుంచి వాడ దాకా మురుగుకాసారం. గూడు చెదిరిన పేదలు, కప్పుకూ నోచుకొని అభాగ్యులు అడుగడుగునా కనిపించారు. తమ నరక ప్రాయ జీవితాలను వినిపించి నా గుండె కరిగించారు. వీళ్లంతా వైఎస్ మాయాజాలంలో చిత్త యిన బడుగులు. ఇందిరమ్మ ఇళ్ల నుంచి రాజీవ్ స్వగృహ దాకా.. పావలా వడ్డీ నుంచి లక్షాధికారణి ప్రకటనల దాకా.. జోలపాడి తొడ గిల్లే ఆ మహానుభావుడి పథకాల వలకు చిక్కి శల్యమయ్యారు. ఆయన చూపించిన అరచేతి వైకుంఠంలో దారీతెన్నూ తెలియక బిక్కముఖం వేశారు. అప్పటి పాలన తీరది. అడగనివారే పాపాత్ములన్నట్టు లక్షల ఇళ్లు కట్టిస్తున్నామని బీరాలు పలికాడు.

రాష్ట్రంలో ఇళ్లు లేని పేదవాడే లేకుండా చేస్తామని ఊదరగొట్టాడు. ఒక చేత్తో ఇచ్చి.. మరో చేత్తో లాక్కున్నా, అది తెలియకుండా పాలనకు ముసుగేశాడు. సెజ్‌ల నుంచి కారిడార్ల దాకా దోచుకొని ప్రజలకు విద్యుదాఘాతాలు, బూడిదకుప్పలు మిగిలించిపోయాడు. తెల్లకార్డు లేదు. ఇళ్లు గానీ జాగా గానీ లేవు. వరదల్లో కొట్టుకుపోతున్నా కన్నెత్తి చూసే నేత లేడు. మా వాళ్లు చేద్దామన్నా.. కలిసిరావడం అటుంచి కేసులు పెట్టి అరెస్టులు చేస్తున్నారు.

మురికిపేట అనగానే గుర్తుకువచ్చేది విజయవాడలోని రాజరాజేశ్వరి పేట. అక్కడ ఉండేవారంతా బీదాబిక్కే. ఆ పేటలో ఓ భవన సముదాయం నన్ను ఆకర్షించింది. కట్టుబడి, నిర్మాణ పద్ధతి బాగున్నాయి. ఆరాతీయగా, రాజీవ్ స్వగృహ నివాస సముదాయం అని తెలిసింది. కొంతలో కొంత నయమనిపించింది. కానీ, బస్తీవాసుల మాటలు విన్నాక, ఆ అభిప్రాయాన్ని వెనువెంటనే మార్చేసుకున్నాను. ఈ 'మధ్యతరగతి కల' కాంగ్రెస్ నేతల నివాస స్థలిగా మారిందట. ఒక్కొక్కరు ఐదారు ఇళ్లు కేటాయించు కున్నారట. కొన్ని ఇళ్లయితే అసాంఘిక శక్తులకు అడ్డాలుగా మారాయని, నేరాలూ పెరిగిపోయాయట. ఎంత దారుణం! ఎవరి పుండు ఎవడికి పండు!

ఉందర్రా మురికిపేటా

కిరణ్‌పై పెట్టినప్పుడు ఏం చేశారు?
రాష్ట్రపతి ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపించారుగా?
ఐదు సీట్లకే కేసుల ఎత్తివేతకు యత్నమా?
వైసీపీ నేతలపై చంద్రబాబు ధ్వజం
రాజకీయాల్లో 'మెరిట్' కోసం పాటుపడుతున్నట్టు వెల్లడి

  "రాష్ట్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని పిల్ల కాంగ్రెస్ (వైసీపీ) అంటోంది. మేం పెడితే అది అమ్ముకుంటుంది. మమ్మల్ని డిమాండ్ చేసేవాళ్లు.. రాష్ట్రపతి ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిని ఎందుకు గెలిపించారు?'' అని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఘాటుగా ప్రశ్నించారు. ఒకరు చెబితే చెప్పించుకునే పరిస్థితుల్లో లేమని, వారికి సమాధానాలు చెప్పాల్సిన అవసరం తమకు లేదని తేల్చిచెప్పారు.

ఎప్పుడు అవిశ్వాస తీర్మానం పెట్టాలో తమకు తెలుసునని వ్యాఖ్యానించారు. కృష్ణా జిల్లా విజయవాడ నగరంలో ఆదివారం ఆయన పాదయాత్ర సాగించారు. సెంట్రల్ నియోజకవర్గంలోని పలు పేటల మీదుగా 6.6 కిలోమీటర్లు నడిచారు. యాత్రలో భాగంగా, డాబా కొట్ల సెంటర్‌లో ఎంతో భావోద్వేగంతో చంద్రబాబు ప్రసంగించారు. వైసీపీపై నిప్పులు చెరిగారు.

"పిల్ల కాంగ్రెస్ పార్టీకి చెందిన కొంతమంది రానున్న ఎన్నికలలో తమ పార్టీకి అత్యధిక సీట్లు వస్తాయని చెప్పుకుంటున్నారు. ప్రధానమంత్రి ఎంపికలో కీలక పాత్ర పోషిస్తామని ప్రకటిస్తున్నారు. రాష్ట్రంలో ఐదు సీట్లు వస్తేనే కేసులు మాఫీ చేసుకోవటానికి ప్రయత్నిస్తున్నారు'' అని కాంగ్రెస్ ఎంపీ సబ్బంహరి వ్యాఖ్యలను ఎద్దేవా చేశారు. రాజకీయాలతో మతాన్ని కలపడం సరికాదని అభిప్రాయపడ్డారు. "కులం అన్నది యాదృచ్ఛికం. మతం ఒక విశ్వాసం.

అమెరికాలో ఒబామాను ఆయన మెరిట్ చూసి గెలిపించారు. ఈరకమైన సంస్కృతిని తీసుకు రావాలన్నదే మా అభిమతం'' అని చెప్పుకొచ్చారు. తాము పుట్టించిన పిల్ల కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుంటామని ఢిల్లీలో కాం గ్రెస్ పార్టీ నాయకులు అంటున్నారని, ఆ రెండూ ఎప్పుడైనా కలిసిపోయేవేనన్నారు. కాంగ్రెస్ పార్టీది ధృతరాష్ట్ర కౌగిలి అని దుయ్యబట్టారు. ఎక్కడికక్కడ బ్లాక్‌మెయిలింగ్ చేయటం ఆ పార్టీ విధానమన్నారు.

"ఎన్టీఆర్‌పై కేసులు పెట్టారు. నాపై వైఎస్ 35 కేసులు పెట్టించారు. 25 కమిషన్లు వేయించారు. నేను ఎక్కడా తప్పు చేయలేదు. లేదంటే నన్ను సైతం ఈ కాం గ్రెస్ నాయకులు బెదరగొట్టేవార''ని వివరించారు. సీల్డ్ కవర్ల ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్ళి పైరవీలు చేసుకుంటున్నాడని కిరణ్‌పై నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో దుష్టులు, దుర్మార్గులు పరిపాలన సాగిస్తున్నారని వారిని అంతమొందించటానికి రామరాజ్యాన్ని తీసుకురావాలని అన్నారు. సహకార సంఘాల ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఓటుకు నోటు పెట్టి ఓట్లను కొంటే తెలుగుదేశం పార్టీ పోరాడిందన్నారు. వైసీపీకి డిపాజిట్లు రాలేదని, టీఆర్ఎస్‌కు అడ్రస్ గల్లంతు అయిందని చెప్పుకొచ్చారు.

బాబు నిర్వచనాలు
విజయవాడ: పామరులు సైతం అర్థం చేసుకునే భాషలో ప్రసంగిస్తున్న చంద్రబాబు, ప్రభుత్వ పథకాలకు కొత్త నిర్వచనాలు ఇచ్చారు.

నగదు బదిలీ పథకం - నకిలీ బదిలీ పథకం
రాజీవ్ స్వగృహ - కాంగ్రెస్ నేతల నివాస గృహ

అవిశ్వాసం అమ్ముకోడానికా?

విజయవాడలో అడుగుపెట్టగానే కష్టాల పుట్ట పగిలిందా అనిపించింది. వినతిపత్రాల వెల్లువలో కొట్టుకుపోతున్నట్టనిపించింది. ఒక్కో వర్గానిది ఒక్కో సమస్య. ఒక్కో బస్తీది ఒక్కో బాధల గాథ. అయినా ఈ నగరవాసులకు ఇంత నరకయాతనా? పగబట్టినట్టు అభివృద్ధిని అడ్డుకుంటున్నారట! కుళాయి నుంచి రోడ్డు దాకా ప్రతిదానికీ కొర్రీలేనట! కుటుంబం పనో, ఇంటి పనో, బంధువుల పనో చేసిపెట్టమంటే తప్పుగానీ.. పేటను బాగు చేయాలని కోరడం నేరమెలా అవుతుంది? విజయవాడ ఫ్లైఓవర్ కోసం ఉద్యమించిన మా వాళ్లను అరెస్టు చేయడం ఎంత అన్యాయం! ఎవరిపైన వీళ్ల పగ? ప్రగతి రథచక్రాలను అడ్డుకుంటే..

ఆ చక్రాల కింద పడి చావక తప్పదు! ఆటో మొబైల్ ఇండస్ట్రీ.. విజయవాడలో ప్రధాన ఉపాధి కేంద్రం.. దాదాపు రెండు లక్షల మంది ఆధారపడిన పరిశ్రమ. ఒక బస్తీ బస్తీయే ఆ పనిలో ఉంది. కానీ, వాళ్లకు పనులు చేసేవారే లేరు. కనీసం ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రం కూడా తమవద్ద లేదని ఆటో నగర్‌నుంచి వచ్చిన బృందం వాపోయింది.

వారంలో నాలుగు రోజులు కరెంటే ఉండటం లేదట. ఇలాగైతే వర్క్‌షాపులు ఎలా నడుపుకోవాలని ఆటో మొబైల్ ఇండస్ట్రీ ప్రతినిధులు దీనంగా ప్రశ్నించారు. ఎలాంటి పరిశ్రమ ఎలాగయిపోయింది! స్వాతి థియేటర్ సెంటర్‌లో రోడ్డు పక్కన ఇద్దరమ్మాయిలు కనిపించారు. తోపుడు బండి పెట్టుకొని కిచిడీ అమ్ముతున్నారు.

దగ్గరకెళ్లి పలకరించాను. సమస్యలు ఆరా తీశాను. ఈ క్రమంలో వాళ్లు చెప్పినది విన్నప్పుడు ఏకకాలంలో గర్వమూ అంతులేని బాధా కలిగాయి. వారిలో ఒకరు ఎంబీఏ పూర్తి చేయగా, మరొకరు బీఎస్సీ చదువుతున్నారట. మంచి విద్యావంతులై కూడా స్వశక్తిని నమ్ముకోవడం ముచ్చటగొలిపింది. అయితే, చదువుకోవడం కోసం ఇంతలా కష్టపడుతున్నారని తెలిసి బాధపడ్డాను. వీళ్ల కష్టం ఊరికే పోదు. వీళ్లను ఇంత కష్టపెడుతున్న పాలకుల పాపమూ ఊరికే పోదు.

వీళ్ల కష్టం ఊరికే పోదు!

సాగును చంపేశారు!
భగవంతుడెంత ఇస్తే అంత శక్తితో సేవ చేస్తా: చంద్రబాబు

  భగవంతుడు ఎంత శక్తి ఇస్తే అంతగా వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు ప్రయత్నిస్తానని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. చరిత్రలో ఎన్నడూ చూడనంతగా రాష్ట్రంలో రైతులకు కష్టాలు వచ్చాయని, కాంగ్రెస్ దిక్కుమాలిన విధానాలే ఈ దుర్గతికి కారణమని దుయ్యబట్టారు. వ్యవసాయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం చంపేస్తోందని ఆరోపించారు. కృష్ణాజిల్లా మైలవరం నియోజకవర్గం నల్లగుంట వద్ద శనివారం ఆయన పాదయాత్ర ప్రారంభించారు. గొల్లపూడి వద్ద 1900 కిలోమీటర్లు పూర్తి చేసుకున్నారు. విజయవాడలో చంద్రబాబుకు అఖండ స్వాగతం లభించింది. హీరో కళ్యాణ్‌రామ్ కూడా సదస్సులో పాల్గొన్నారు.

ముందుగా రైతులు తాము ఎదుర్కొంటున్న సమస్యల గురించి చంద్రబాబు దగ్గర ప్రస్తావించారు. వ్యవసాయ సహకార పరపతి సంఘాలను కాంగ్రెస్ ప్రభుత్వం భ్రష్టు పట్టించిందని ఈ సందర్భంగా చంద్రబాబు దుయ్యబట్టారు. సహకార సంఘాలలో దొడ్డి దారిలో అధికారంలోకి రావటానికి ఓటుకు రూ. 20 వేల నుంచి రూ.50 వేల వరకు ఖర్చు చేశారని దుయ్యబట్టారు. దేశం మొత్తం మీద ఏ పంట వేస్తే ఎంత ఆదాయం వస్తుంది? వాణిజ్య పంటల అవసరం ఎంత ఉందన్న దానిపై ఈ ప్రభుత్వానికి ప్లానింగ్ లేదన్నారు.

ప్రభుత్వ విధానాల వల్ల వ్యవసాయంతో పాటు, వ్యవసాయానుబంధ పరిశ్రమలు సైతం మూతపడే పరిస్థితి దాపురించిందని ఆందోళన వ్యక్తం చేశారు. అనంతరం ఆయన పాదయాత్ర విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోకి ప్రవేశించింది. కనకదుర్గమ్మ గుడి వద్ద ట్రాఫిక్ కష్టాలు తీర్చేందుకు ఫ్లైఓవర్ నిర్మాణ ం చేపట్టాలన్నందుకు తమ పార్టీ నేతలపై తప్పుడు కేసులు పెట్టారని చంద్రబాబు మండిపడ్డారు.

నగరాభివృద్ధికి ఆటంకాలు కల్పిస్తున్న కాంగ్రెస్ నాయకులకు గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. భవానీపురంలో దర్గాలోకి వెళ్లి ముస్లిం సోదరులతో కలిసి ప్రార్థనలు చేశారు. స్వాతి సెంటర్‌లో ఏర్పాటు చేసిన సభలో పాల్గొన్నారు. నగరం పక్కనే కృష్ణా నది ఉన్నా అందరికీ గుక్కెడు తాగునీరు కూడా సరఫరా చేయలేని దుస్థితి చూస్తుంటే బాధేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.

సామాన్యుడు రోజంతా కష్టపడి రూ.100 సంపాదిస్తుంటే అది నూనెప్యాకెట్ కొనుక్కోవడానికి క్కూడా సరిపోవడం లేదన్నారు. రాష్ట్రంలో పెరిగిపోయిన అవినీతిని తుదముట్టించేందుకు యువత కొండవీటి సింహాలుగా మారాలని ఉత్సాహపరిచారు. ఈ సమయంలో కలిసిన విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. అధికారంలోకి రాగానే విద్యార్థినులకు కరాటే శిక్షణ ఇప్పిస్తానని, వారి చదువులకు ఉపయోగపడేలా సైకిళ్లు అందిస్తానని ఆయన చెప్పారు.

అన్నదాతకు ఇన్ని కష్టాలు చరిత్రలోనే లేవు

ఎన్టీఆర్ హయాంలో ఆ తర్వాత తన ఆధ్వర్యంలో జరిగిన అభివృద్ధి మినహా విజయవాడ నగరానికి ఎలాంటి శాశ్వత అభివృద్ధి పనులు జరగలేదని, దక్షిణ భారతదేశానికి ముఖద్వారంగా ఉన్న 'బెజవాడ'ను తాను అధికారంలోకి వచ్చాక ఏ విధంగా అభివృద్ధి చేస్తానో ఆర్నెళ్లల్లో చేసి చూపిస్తానని టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు ప్రకటించారు. 'వస్తున్నా..మీకోసం' పాదయాత్రలో భాగంగా శనివారం రాత్రి పొద్దుపోయాక రథం సెంటర్‌లో జరిగిన భారీ బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగించారు. ఎప్పుడో నిర్మించిన బస్టాండ్, దుర్గగుడి అభివృద్ధి పనులు, నగరంలో అవే రహదారులు ఇప్పటికీ దర్శనమిస్తున్నాయని, కాం గ్రెస్ హయాంలో నగరానికి వీసమెత్తు అభివృద్ధి జరగలేదని చంద్రబాబు ధ్వజమెత్తారు

తాను అధికారంలోకి వచ్చిన ఆరు నెలలలోపు దుర్గగుడి వద్ద ఫ్లై ఓవర్ నిర్మించి కాంగ్రెస్ నాయకులు చేయలేని పనిని తాను చేసి చూపిస్తానని సవాల్ విసిరారు. ఓ మహిళను కుక్కకరిచింది..ఆమెను ఆదుకునేవారెవ్వరూ లేరు. కార్పొరేషన్ సిబ్బంది నిర్లక్ష్య వైఖరిని గుర్తుచేస్తూ తమ పార్టీ నాయకులు కొందరు ఆమెకు న్యాయం చేయాలంటూ ధర్నా చేస్తే పోలీసులు వారిపై అక్రమంగా కేసులు బనాయించారన్నారు. ఇంతకన్న దౌర్భాగ్యం ఏమైనా ఉంటుందా అని చంద్రబాబు ప్రశ్నించారు. పోలీసులు అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరించకూడదని, టీడీపీ హయాంలో వారి పరిస్థితి ఎలా ఉందో, ఇప్పుడు ఎలా ఉందో బేరీజు వేసుకుని చూసుకోవాలన్నారు. వ్యాట్‌ట్యాక్స్ భారంతో దుస్తుల వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చంద్రబాబు చెబుతున్న సమయంలో ఆ వర్గాల నుంచి మంచి స్పందన వచ్చింది.

పలువురు చిరువ్యాపారులతో చంద్రబాబు ముచ్చటించారు. వారి కష్టాలను అడిగి తెలుసుకున్నారు. ఇదే సమయంలో ఇద్దరు ముస్లిం యువతులు రోడ్డు పక్కగా తోపుడు బళ్లపై చిన్నపాటి వ్యాపారం చేస్తూ చంద్రబాబు కు కన్పించారు. వారి వద్దకెళ్లిన అధినేత వారి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఒకామె ఎంబీఏ చదువుతున్నానని, మరో యువతి బీఎస్సీ చదువుతున్నానని చెప్పడంతో వారి పరిస్థితి చూసి తెలుగుదేశం పార్టీ అధినేత చలించిపోయారు. ఈ ప్రభుత్వానికి సిగ్గు ఉందా అని ప్రశ్నించారు. ఉపాధి లేక యువతులు ఇంటి ఖర్చుల నిమిత్తం రోడ్డెక్కుతుంటే ఈ ప్రభుత్వం ఏ మాత్రం చలించడం లేదని ఇలాంటి ఆణిముత్యాలకు తమ ప్రభుత్వం వచ్చిన మరుక్షణమే సరైన ఉద్యోగాలు కల్పిస్తామని స్థానికుల హర్షధ్వానాల మధ్య చంద్రబాబు ప్రకటించారు.

రాష్ట్రంలో కరెంట్ పరిస్థితి దారుణంగా ఉండటంతో చాలామంది జనరేటర్లను కొనుగోలు చేయాల్సిన దుస్థితి వచ్చిందని, తీరా వాటిపై కూడా వ్యాట్‌ను విధించిన ఘనత కాంగ్రెస్‌కే చెల్లిందంటున్న తరుణంలో వ్యాపారుల నుంచి భారీ స్పందన కన్పించింది. జనం రానున్న ఎన్నికలలో ఓటును 'ప్రధానాస్త్రం'గా వాడాలని ఈ సందర్భంగా చంద్రబాబు పిలుపునిచ్చారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన క్షణమే విజయవాడను ఏ విధంగా అభివృద్ధి ఏమిటో ఆరు నెలల్లో చేసి చూపిస్తామన్నారు.

ఆదరిస్తే అభివృద్ధి చేస్తా

బహుదూరపు బాటసారి చంద్రబాబు పాదయాత్రతో తెలుగుదేశం పార్టీకి దశ తిరుగుతోంది. నిన్నటి వరకూ టీడీపీకి గట్టి పట్టులేని పాతబస్తీలో చంద్రబాబు పాత్రయాత్రకు జనం పోటెత్తింది. ఈ ప్రభావం విజయవాడ నగరంలో ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. జిల్లాలోకి అడుగు పెట్టిన రోజు పెనుగంచి ప్రోలుకు వచ్చిన జనం కూడా శనివారం విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో పోటెత్తిన జనవాహిని ముందు బలాదూరే అనిపించింది. అడుగడుగునా మహిళలు పూల జల్లులు కురిపిస్తూ, హారతులు పడుతూ బాబుకు స్వాగతం పలికారు. కుమ్మరిపాలెం కిక్కిరిసిపోగా, బ్రాహ్మణవీధి పసుపు సైన్యం కవాతు తొక్కినట్లుగా మారింది.

ఇక కెనాల్ రోడ్డు కాలి నడకకు కూడా దారి దొరకడం కషఫ్టమైపోయింది. బాబూ రావాలి జాబు ఇవ్వా లంటూ ఆయన నడక సాగినంత దూరం యవ కేరింతలు, నినాదాలతో మారు మోగిపోయింది. గడప గడపా ఇళ్ళు వదిలి బాబును చూడటానికి జనం బయటకు వచ్చి నిలబడ్డారు. మహిళలు, వృద్దులు సైతం బాబుకు స్వాగతం పలకడంలో పోటీ పడ్డారు. బేతాళ నృత్యాలు, హారతులతో వీర తిలకాలు దిద్దుతూ స్వాగతం పలికారు.

భవానీపురం, కుమ్మరిపాలెం సెంటర్, అమ్మవారి కొండ దాటాక బ్రాహ్మణవీధి, కెనాల్ రోడ్డు కాళేశ్వరరావు మార్కెట్ ప్రాంతాల్లో పోగయిన జన సందోహం శివరాత్రి సందడిని తలపించింది. వస్త్ర వ్యాపారులు, తోపుడు బళ్ళ వ్యాపారులు, ఎదురొచ్చి బాబును కలసి తమ సమస్యలను ఆయనకు విన్నవించుకున్నారు. రాత్రి బస చేసే ప్రాంతమైన రాజరాజేశ్వరిపేట వీధులన్నీ జనంతో నిండిపోయాయి.

పశ్చిమం పసుపుమయం


చంద్రబాబు దృష్టికి రైతులు తీసుకువచ్చిన అంశాలు

నాగార్జున సాగర్ 2, 3 వ జోన్లకు నీళ్లివ్వటం లేదు. సాగర్‌లో నీరున్నా.. నీ ళ్లు ఇవ్వటం లేదు. వ్యవసాయం తీ వ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది ? - ఆళ్ళ గోపాలకృష్ణ, హనుమాన్ జంక్షన్

రెండేళ్ళ నుంచి రైతాంగం పంట నష్టపోవాల్సి వస్తోంది. ఆధునికీకరణ పనులు ఇప్పటి వరకు 10 శాతం కూడా పూర్తి కాలేదు. - గుడిసే బాలస్వామి, ఉంగుటూరు

ఎన్నో కష్టాల కోర్చి వరి పంటను పండిస్తున్నాం. పండించిన ధాన్యానికి గిట్టుబాటు కావటం లేదు. ఏం చేయాలో అర్థం కావటం లేదు. - పాతూరి బాపూజీ, గన్నవరం

పత్తి పంట లాభంగా ఉండటం లేదు. ఎకరాకు రూ. 50 వేలు ఖర్చు పెడుతున్నాం. క్వింటాకు రూ. 10 వేలు అయినా గిట్టుబాటు ఉండాలి. - గింజుపల్లి రమేష్ , జగ్గయ్యపేట

జిల్లాలో పొగాకు రైతులందరికీ నష్టం వచ్చింది. ఒకప్పుడు వరితో పా టు ప్రధానంగా పొగాకును సాగు చేసేవారు. నేడు ఆ పరిస్థితి లేదు. పూర్తిగా పొగాకు కనుమరుగయ్యే పరిస్థితి దాపురించింది. ఇరవై సిగరెట్లు ఉన్న ప్యాకెట్ రూ. 60 ధర పలుకుతోంది. ఒక కేజీ పొగాకు మాత్రం రూ.20 కూడా పలకటం లేదు. - జె.వేణుగోపాల్ రెడ్డి, మైలవరం

జిల్లాలో పండించిన మిర్చిని కోల్డ్ స్టోరేజ్‌లలో పెట్టాల్సి వస్తోంది. వడ్డీ ని పూర్తిగా ప్రభుత్వం మాఫీ చేసే విధంగా చర్యలు తీసుకోవాలి. - కోటి వీరబాబు, చందర్లపాడు

చంద్రబాబు ప్రతిస్పందన సమగ్ర వ్యవసాయాభివృద్ధికి.. స్వామినాధన్ కమిటీ సిఫార్సులను అమలు చేయటంతో పాటు, వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్ కేటాయిస్తాం. వ్యవసాయంపై ప్రభుత్వ పెత్తనం లేకుండా నేరుగా లాభసాటిగా ఉండాలని టీడీపీ కృషి చేస్తే కాంగ్రెస్ దానిని పూర్తిగా విస్మరించి వ్యవసాయాన్ని చంపేసింది. ఈ ప్రభుత్వానికి ఒక ప్లానింగ్ లేదు. పామాయిల్‌కు మిని మం గిట్టుబాటు కల్పించాలి. చెరకు, మినుము, పత్తి దెబ్బతిన్నాయి. వ్యవసాయం లాభసాటిగా ఉండి, రైతులకు గిట్టుబాటు ఉంటే తప్ప రైతులు వ్యవసాయం చేయలేరని స్వామినాధన్ కమిటీ సిఫార్సు చేసింది. ఈ ప్రభుత్వం స్వామినాధన్ కమిటీ ఊసెత్తటం లేదు.

ఒక ఇంట్లో ఐటీ చదువుతున్న వ్యక్తి ఉంటే.. పిల్లనివ్వటానికి వస్తున్నారు. అదే వ్యవసాయం చేస్తే పిల్లనివ్వటానికి కూడా రావటం లేదు. ప్రభుత్వం పాలసీలు చేసేటప్పుడు ఆలోచనలు చేయాలి. ఎరువులు, కూలి రేట్లు పెరిగాయి. పండించే పంటకు మాత్రం గిట్టుబాటు లేదు. ఉల్లిపాయలకు గోడౌన్లు పెట్టి రేటు పెరగకుండా చూశాం. చరిత్రలో చూడనంతగా కరెంట్ సమస్యలను చూస్తున్నాం. వైఎస్ రాజేశేఖరరెడ్డి అధిక రేటు పెట్టి కరెంటును కొనుగోలు చేశాడు. అది కూడా అప్పులు పెట్టారు. ఇప్పుడీ భారం అంతా.. చార్జీలు, సర్‌ఛార్జీల రూపంలో మీపై పడుతోంది. పత్తి రూ.7 వేలు పలుకుతున్న సందర్భంలో ఎగుమతులు నిలిపివేశారు. ఫలితంగా ఇప్పుడు రూ. 3 వేలకు పడిపోయింది. కౌలు రైతుల సమస్యలను కూడా పరిష్కరించి వారికి కూడా లాభం చేకూర్చే విధంగా కృషి చేస్తాం.

సమగ్ర వ్యవసాయాభివృద్ధికి కృషి

గొల్లపూడిలో శనివారం జరిగిన టీడీపీ అధినేత చంద్రబాబు పాదయాత్రకు విశేష స్పందన లభించింది. పార్టీ కార్యకర్తలు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని బాబుకు బ్రహ్మరథం పట్టారు. అభిమానులు ఆయనను పూలపై నడిపించారు. మహిళలు ఎదురేగి దారి పొడవునా ఆయనకు అడుగడుగునా హారతులిచ్చారు. పాదయాత్ర విజయవంతం కావాలని ఆయనను దీవించారు. గొల్లపూడిలో జనస్పందన చూసి బాబు సంతోషించారు. కాగా పాదయాత్రలో డప్పు విన్యాసాలు, విచిత్ర వేషధారణలు, కోయదొరల పలకరింపులు, జంగం దేవరల స్వాగ త సుమాంజలులు, అభిమానుల కో లాహలం, సందడి వాతావరణంలో బాణసంచా కాల్పులు, చిన్నపిల్లల కేరింతలు, యువకుల ఈలలు, కేకలతో ఆప్రాంతం మారుమోగింది.

పాదయాత్ర చేస్తున్న చంద్రబాబును చూసేందుకు పెద్దలంతా అడ్డుగా ఉండడంతో చంద్రబాబు కనబడటంలేదని చెట్టులు ఎక్కి చూస్తూ చేతులు ఊపుతూ అభివాదం చేశారు. చంద్రబాబు కూడా వారికి ప్రతిగా చేతులు ఊపారు. జాతీయ రహదారి నుంచి వెళ్ళే ప్రతి కాన్వెంట్ బస్సుల్లోని విద్యార్థులు చంద్రబాబును చూడగానే ఒక్కసారిగా చేతులు బయటపెట్టి పెద్దయెత్తున అరుస్తూ అభివాదం చేస్తున్నారు. భారీ వామనాలపై వెళ్లేవారు సెల్‌లో ఫొటోలు తీసుకున్నారు. పొలాల్లో పనులు చేసుకునే మహిళలతో సహా చిన్నారులను ఎత్తుకుని చంద్రబాబును చూసేందుకు ఎగబడ్డారు. మహిళలు పూలు జల్లి, హారతులు ఇచ్చి బ్రహ్మర«థం పట్టారు.

అడుగడుగునా బ్రహ్మ

ప్రజల ఆదాయాన్ని పెంచకుండా వారిపై పన్నుల భారాన్ని పెంచి వారి నడ్డివిరగ్గొట్టే రాష్ట్ర ప్రభుత్వానికి రాబోయే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు ప్రజలకు పిలుపు నిచ్చారు. పాదయాత్రలో భాగంగా శనివారం గొల్లపూడి సెంటర్‌లో జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ త్వరలో రాష్ట్రంలో కిలో బియ్యం ధర 60 నుంచి రూ.70 వరకూ పెరిగే సూచనలు కనిపిస్తున్నాయన్నారు. ఇకపై ప్రతి నెల డీజిల్ ధర పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు.

ముఖ్యంగా రాష్ట్రంలో రాక్షస పాలన ఉందని, దీని నుంచి ప్రజలు ఎంత త్వరగా బయట పడితే అంత మంచిదన్నారు. పేదవాడికి మూడు సెంట్ల స్థలాన్ని ఇస్తే ఆనందంగా ఇల్లు నిర్మించుకుని బతుకుతాడు. ఆ పని చేయడానికి చేతులురాని కాంగ్రెస్ నాయకులు మాత్రం వేలాది ఎకరాల భూములను కబ్జా చేస్తున్నారని చంద్రబాబు దుయ్యబట్టారు. బయ్యారం గనులే అందుకు నిదర్శనమన్నారు. సుమారు 1.36 లక్షల ఎకరాల భూములను తన అల్లుడికి వరకట్నంగా సమర్పించిన ఘనత మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డిదేనన్నారు.

పేద వాళ్ళకు గ్యాస్ బండ.. గుదిబండగా మారిందన్నారు. రాష్ట్రంలో నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరిగిపోయినా ముఖ్యమంత్రి ఏమా త్రం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మహాదోపిడీ జరుగుతోందన్నారు. విజయవాడలోని థర్మల్ పవర్ స్టేషన్ పరిస్థితి దీనంగా మారిందన్నారు. ఉత్పాదన బాగా తగ్గిందని దీనికి కారణం కాంగ్రెస్ ప్రభుత్వం నాసిరకం బొగ్గు సరఫరా చేయడమే అని చంద్రబాబు విమిర్శించారు. ఈ సందర్భంగా స్థానికులు చంద్రబాబును పలు ప్రశ్నలు అడిగారు.

పలువురు ప్రశ్నలు.. బాబు సమా«ధానాలు వల్లూరు భరణి: మీ హయాంలో ఐటీ బాగా అభివృద్ధి చేశారు. తిరిగి అధికారంలోకి వస్తే మా అందరికీ ఉద్యోగాలు వస్తాయి.

చంద్రబాబు: నిజమే తమ్ముడూ.. అందరికీ ఉద్యోగాలు రావాలి. ఆ పని చేయగలిగింది ఒక్క తెలుగుదేశం పార్టీ మాత్రమే. అప్పుడే రాష్ట్రంలో పేదరికం పోతుంది. ఆనాడు టీడీపీ హయాంలో వేసిన రోడ్లే ఇప్పటికీ ఉన్నాయి. కొత్తగా ఒక్క రోడ్డును ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి చేయలేదు. గతుకులకు కనీసం మరమ్మతులు కూడా చేయలేని దుస్థితి ఈ ప్రభుత్వానిది.

వంశీ: రాష్ట్రంలో రైతులందరూ చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. వారిని మీరు ఆదుకోవాలి.

చంద్రబాబు: తప్పకుండా.. నా పాదయాత్రలో ఆధిక ప్రాధాన్యం రైతు సమస్యల పరిష్కారానికే.

చిలుకూరి శ్రీలక్ష్మి: మా అబ్బాయిని బాగా చదివించాను. మంచి మార్కులతో పాసయ్యాడు. అగ్ర కులాలకు చెందిన వారం కావడంతో ఉద్యోగం రావడం లేదు.

చంద్రబాబు: అగ్రవర్ణాల్లోనూ అనేక మంది పేదలున్నారు. నేను అధికారంలోకి రాగానే వారికి కూడా ఉద్యోగ అవకాశాలు మెరుగయ్యేలా చూస్తా.

పన్నులతో బాదేస్తున్నారు

ఆంధ్రప్రదేశ్‌లో ఐటీ (ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ) అనగానే హైదరాబాద్‌లో హైటెక్ సిటీ చంద్రబాబు నాయుడే గుర్తుకు వస్తారు. అలాంటి బాబు పాదయాత్రలో ఐటీ ప్రత్యేకత కనిపించకపోతే ఎలా ?...అవును మరి ఈ పాదయాత్రలో ఐటీ విభాగం కీలకపాత్రే పోషిస్తుంది. హిందూపురంలో ఆయన పాద యాత్ర ప్రారంభమైన నాటి నుంచి నేటి వరకు ఈ విభాగం ప్రాధాన్యత అనుక్షణం కనిపిస్తుంది. హైదరాబాద్ ఎన్టీఆర్ భవన్‌లోని ఈ విభాగం ఇపుడు ఏకంగా బాబు నడకతో కలిసి పయనిస్తుంది. చంద్రబాబు స్నేహితులు, కుటుంబ సభ్యులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు చేసే ఫోన్ కాల్స్ ఈ విభాగం తీసుకుంటుంది.

అక్కడి నుంచి బాబుకు సమాచారం అందుతుంది. అలాగే బాబు ఇచ్చే ఏదైనా సమాచారం కూడా ఇక్కడి నుంచే బయటకు వెళుతుంది. కొన్ని సోషల్ నెట్ వర్క్‌కు అందించాల్సిన సమాచారం ఏమైనా ఉన్నా ఈ విభాగం ద్వారా వెంటనే వెళ్ళిపోతుంది. ఇదే సందర్భంలో ప్రపంచ, దేశ, రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమైన సమాచారం ఎప్పటికప్పుడు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ నుంచి ఇక్కడకు చేరుతుంది. దీని నుంచి ఆయా సమాచారాలు బాబుకు అందుతాయి. బాబు ఉదయం మేల్కొంది మొదలు రాత్రి విశ్రమించే వరకు ఈ విభాగం పనిచేస్తూనే ఉంటుంది. ఫోన్, ఎస్ఎంఎస్‌లు, ఇంటర్ నెట్ మెయిల్స్ ద్వారా ఈ సమాచారం రాక, పోకలు జరుగుతుంటాయి. ఇవే కాకుండా బాబు పాదయాత్రలో ప్రజలు ఇచ్చే విజ్ఞాపనలు, నాయకులు అందించే లేఖలన్నింటినీ స్వీకరించగానే అవి ఈ విభాగం తీసుకుంటుంది. వాటిని రికార్డు చేయడంతో పాటు విభజించి ఆయా విభాగాలకు ఇక్కడి నుంచి వెంటనే సమాచారం పంపుతారు.

విశేషం ఏమంటే ఎవరైనా సిగరెట్ పెట్టెపై సమాచారం రాసిచ్చినా దాన్ని కూడా స్వీకరించి చెత్తబుట్టలో వేయకుండా ఆ సమస్యకు సంబంధించిన విభాగానికి చేరవేస్తారు. ఇక బాబు పాదయాత్రలో ఎవరైనా అనాథలు, దీనులు విరాళాలు అడిగినపుడు వెం టనే ఆయన వారికి ప్రకటించినట్లైతే ఆ విరాళాన్ని కూడా ఈ విభాగం ద్వారా అక్కడికక్కడే అందజేస్తారు. పార్టీకి నేతలెవరైనా విరాళాలు ప్రకటించినా అవి కూడా ఈ విభాగమే స్వీకరిస్తుంది. ఈ నెట్ వర్క్ కోసం ఓ ప్రత్యేక వాహనాన్ని ఏర్పాటు చేశారు. ఇందులోనే అంతా ఏర్పాటు చేశారు. బాబుతో పాటే ఉంటూ కార్యక్రమాలన్నీ ఈ విభాగం చూసుకుంటూ అనుక్షణం కీలక విభాగంగా నిలుస్తుంది.

ఈ నెట్ వర్క్‌కోసం బీఎస్ఎన్ఎల్, ఐడియా, ఎయిర్‌టెల్‌లతో పాటు 3జీ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నారు. బా బు పాదయాత్ర పూర్తయ్యే వరకు ఈ మొబైల్ ఐటీ విభాగం ఆయనతోనే కొనసాగుతుంది. అధికారులు, నేతలు, ప్రజలు, బాబు కుటుంబ సభ్యులు, స్నేహితులకు మధ్య ఈ విభాగం కో ఆర్డినేట్‌గా పనిచేస్తుందని చెప్పవచ్చు. అయితే ఈ వ్యవహారమంతా ఒకే ఒక వ్యక్తి నిర్వహించడం విశేషం కాగా ఆయన కృష్ణాజిల్లా వాసి కావడం మరో విశేషం. కైకలూరు నియోజకవర్గం కలిదిండి గ్రామానికి చెందిన పెరుమాళ్ళ నాగరాజు ఈ మొత్తం వ్యవహారం చూసుకుంటున్నారు. ఈయన ఎంబీఏ చదివి 2008లో హైదరాబాద్ టీడీపీ రాష్ట్ర కార్యాలయంలోని ఐటీ విభాగంలో ప్రవేశించారు. అప్పటి నుంచి అక్కడే పనిచేస్తూ ఇప్పుడు పాదయాత్రలో ఈ విభాగం మొత్తాన్ని తన చేతుల మీదుగా నడిపిస్తున్నారు. సాంకేతికపరమైన విభాగం అంతా నాగరాజు నిర్వహిస్తుండగా ఇతర వ్యవహారమంతా రాజగోపాల్ పర్యవేక్షిస్తుంటారు.

చంద్రబాబు పాదయాత్రలో కీలకపాత్ర ఐటీదే

టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పాద యాత్రలో భాగంగా శనివారం నల్లకుంటలో జరిగిన రైతు సదస్సులో తెలుగు రైతు జిల్లా అధ్యక్షులు చలసాని ఆంజనేయులు ఇక్కడి రైతుల సమస్యలతో కూడిన లేఖను అందజేశారు. ఆ లేఖలో జిల్లా రైతు సమస్యలు ఈ విధంగా ఉన్నాయి. నాగార్జున సాగర్ సాగునీటి సమస్యను వివరిస్తూ ఎన్ఎస్‌పీ 2 జోన్ లక్షా అరవై వేల ఎకరాలకు జగ్గయ్యపేట, నందిగామ నియోజకవర్గాలలో ఆగస్టుకు ఇవ్వాల్సిన నీరు ఇంత వరకు ఇవ్వలేదని తెలిపారు.

అలాగే ఎన్ఎస్‌పి 3వ జోన్ తిరువూరు, నూజివీడు, మైలవరం, నందిగామ, గన్నవరం నియోకవర్గాల్లో రెండు లక్షల ముప్పై వేల ఎకరాలకు నవంబరు 15వ తేదీకి నీరు అందక ఆయా ప్రాంతాల్లో వేసిన పత్తి, మొక్కజొన్న, పొగాకు, మామిడి పం టలు ఎండిపోతున్నాయని తెలిపారు. ప్రస్తుతం నాగార్జున సాగర్ డ్యా మ్‌లో 511లు అనగా 134 టీఎంసీలు శ్రీశై లం డ్యామ్‌లో 860లు అనగా 112 టీఎంసీలు మొత్తం 246 టీఎంసీల నీరు ఉందని తెలిపారు. నాగార్జున సాగర్‌లో 490 , శ్రీశైలంలో 850 అడుగుల నీరు ఉన్నపుడు కూడా టీడీపీ హయాంలో ఆదుకున్నట్లు పేర్కొన్నా రు. ఇక నాగార్జున సాగర్‌లో అవకతవకల గురించి కూడా ఈ లేఖలో ఆయ న పేర్కొన్నారు.

గతంలో ప్యాకేజీ నంబర్ 18 నాగార్జున సాగర్ ఆధునికీకరణలో రూ.10 కోట్ల పనికి రూ.23 కోట్లు అంచనాలు పెంచి బిల్లు చేయ డం, రాఘవ, బీవీఆర్ జాయింట్ వెం చర్ చేసిన ఈ పనిలో అవినీతి జరిగి రూ.8 కోట్ల రికవరీ చేయమని విచారణ కమిటీ చెప్పిందన్నారు. కానీ ప్రభుత్వం నజరానాగా రాఘవ కన్‌స్ట్రక్షన్స్ వారికి 10 కోట్లకు నూజివీడు మేజరు, బీవీఆర్‌కు వేంపాడు రూ.52 కోట్లకు పనులు ఇచ్చారన్నారు. కానీ రికవరీ మాత్రం ఇంత వరకు జరగలేదన్నారు. జగ్గయ్యపేటలో జల యజ్ఞం లో వైఎస్ మొదలు పెట్టిన మొదటి ప్రాజెక్టు మునేరుపై పోచంపల్లి నేటికీ పూర్తవలేదని, కనీసం సిల్టు కూడా తీయకపోవటం వల్ల ఒక పంట కూడా పండటం లేదన్నారు.

డెల్టా ఆధునికీకరణ కింద 2007లో రూ.2183 కోట్లతో ప్రారంభించిన పనులు నేటికి 8 శాతం కూడా పూర్తి కాలేదని, మోబిలైజేషన్ అడ్వాన్స్‌గా రూ.70 కోట్లు తీసుకున్నట్లు చెప్పారు. డ్రయినేజీ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమై కాలువలు బాగు చేయకపోవటంతో చివరి ప్రాంతాలకు నీరు వెళ్ళని పరిస్థితి ఉందన్నారు. పులిచింతల, తారక రామ ఎత్తిపోతల, పోలవరం పనులు పూర్తి కాలేదని, జిల్లాలో పోలవరం కాల్వలు తవ్వినా డ్యామ్ నిర్మాణం కాలేదన్నారు.

బాబు చేతికి జిల్లా రైతు సమస్యల చిట్టా