January 24, 2013

కిరణ్‌కుమార్‌రెడ్డిది చేతగాని ప్రభుత్వం అని టీడీ పీ అధినేత చంద్రబాబునాయుడు విమర్శించారు. ప్రజల సొమ్మును కాంగ్రెస్ దొంగలు దోచుకున్నారని ఆరోపించారు. ఈ ప్రభుత్వం ప్రజల కష్టాలను దోచుకోవడమే తప్ప ఆదుకోవడానికి లేదని చంద్రబాబు వ్యాఖ్యానించారు. గురువారం ఉదయం మాగల్లు నుంచి 115వ రోజు పాత్రయాత్రను బాబు ప్రారంభించారు. పల్లగరి మీదుగా నందిగామకు పాదయాత్ర సాగనుంది. ఈ రోజు మొత్తం 15.6 కి.మీ మేర చంద్రబాబు నడవనున్నారు

కిరణ్‌ది చేతగాని ప్రభుత్వం : చంద్రబాబు

ఈ ఫ్రభుత్వం తీరింతే ! మిమ్మల్ని నిలువునా మోసం చేస్తోంది! అసలు ఇది ఒక ప్రభుత్వమేనా? చేతగాని ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నాడు. మీరంతా అన్నీ కష్టాలే చవిచూస్తున్నారు. ఏ ఒక్కరూ సుఖంగా లేరు ! నేను పదేపదే చెబుతున్నదొకటే! ఒక్కసారి టీడీపీ హయాంలో జరిగిన పాలనకు, ఇప్పటి పాలనకు బేరీజు వేసుకోండి. దాని ప్రకారం నిర్ణయం తీసుకోండి ! మీ చింతలు తీర్చే పాలన ఇస్తా'' అని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. బహిరంగ సభల్లో ప్రజలకు ఇచ్చిన హామీ ఇది. రెండు రోజులుగా పాదయాత్రను కొనసాగిస్తూ బహిరంగ సభల్లో మాట్లాడుతూ, అక్కడికక్కడే ముఖాముఖి నిర్వహిస్తున్నారు. బుధవారం అనిగండ్లపాడు, గుమ్మడిదుర్రు, జొన్నలగడ్డ క్రాస్ రోడ్స్, వెల్దుర్తిపాడు గ్రామాల్లో పర్యటించిన సందర్భంలో ముఖాముఖిలో చంద్రబాబుతో స్థానికులు ప్రస్తావించిన అంశాలపై స్పందన ఈ విధంగా ఉంది.

* అయ్యా.. ఏమని చెప్పుకోను నా బాధ. నీకు ఇంటి స్థలం లేదు పో అని అధికారులు అన్నారు. అవినీతి మా ఊళ్ళో కూడా ఉంది. నేను ఒక్కటే నిర్ణయానికి వచ్చా.. ఈ సారి మిమ్మల్ని ముఖ్యమంత్రిగా చూడాలని అనుకుంటున్నా.:- యాదగిరి, లారీ డ్రైవర్ చంద్రబాబు : తమ్ముడూ.. నీ ఆవేదనను అర్థం చేసుకున్నాను. నువ్వు చెప్పింది నిజమే! కాంగ్రెస్ ప్రభుత్వం పేదలను పట్టించుకోవటం లేదు. పెద్దలకు దోచి పెడుతున్నారు. ఉపాధి హామీ పథకం నుంచి అనేకం టీడీపీ హయాంలో నెలకొల్పినవన్నీ ప్రస్తుత ప్రభుత్వం పక్కదారి పట్టిస్తోంది * మీరు సీఎంగా ఉన్న సమయంలో చేసిన అభివృద్ధిని సినిమాల్లో చూపించేవారు. ఇప్పుడు జరుగుతున ్న అవినీతి వ్యవహరాలపై సినిమాల్లో చూపిస్తున్నారు. ఈ సారి తప్పకుండా టీడీపీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉంది. లక్ష కోట్లు పారేస్తే గెలుస్తాం అన్న అభి ప్రా యంలో వైసీపీ నాయకులు ఉన్నారు.

:- ప్రసాద్, స్థానికుడు చంద్రబాబు : తమ్ముడూ నేను ధర్మ పోరాటం చేస్తున్నాను. ఎవరెన్ని అధర్మ మార్గాల్లో వెళ్ళినా అంతిమ విజయం మాత్రం ధర్మానిదే! నేను చేసే పోరాటానికి మీరు సహకరించండి! మీ సెల్‌ఫోన్స్ ద్వారా అవినీతిపై వ్యతిరేకంగా ఒక్కొక్కరూ 10 ఎస్ఎంఎస్‌లు పంపించండి చాలు. ఏం జరుగుతుందో చూడండి.* సార్.. నేనొక్కడినే లోటస్ పాండ్‌కు వెళ్ళాలనుకుంటున్నాను. పాండ్ కింద దాచిన లక్ష కోట్లు మన సొమ్మే కదా! నాతో పాటు ఎవ్వరు వచ్చినా సరే..తవ్వి తీస్తాం .

:- నరేంద్ర, యువకుడు చంద్రబాబు: తమ్ముడు నువ్వు చెప్పింది వాస్తవం. రాజశేఖరరెడ్డి పరిపానలో రాష్ట్రాన్ని దోచేశారు. రౌడీ రాజకీయాలతో అరాచక పాలన సాగించారు. వారు దిగమింగిన లక్ష కోట్లను బయటకు తీస్తే రాష్ట్రంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమలు చేపట్టవచ్చు.

నేనిప్పుడు చేసే పోరాటం అదే.* అయ్యా.. నా ఇంటి గోడ పడిపోయింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన వాడిని కాదని నాకు ఎలాంటి సహాయం చేయడంలేదు. అదే వారి పార్టీకి చెందిన వారికైతే.. పనిచేసుకుంటున్నారు.:- అప్పన్న రమాదేవి , మేస్త్రీ చంద్రబాబు : చూడు తల్లీ.. టీడీపీ అధికారంలోకి వస్తే ప్రతి పేదవాడికి రూ. లక్షతో ఇంటిని కట్టిస్తాం. అలాగే ఇళ్ళ స్థలాలు లేని వారికి వాటిని కూడా అందిస్తాం. మీ జీవితాలు బాగు పడటానికి పంట రుణాలను మాఫీ చేస్తాం. ప్రతి ఇంట్లో ఉన్న యువకులకు ఉద్యోగాలు, ఉపాధి కల్పిస్తాం.

ఈ ప్రభుత్వ తీరింతే..మార్పును కోరుకోండి

  పెనుగంచిప్రోలులో బస చేసిన చంద్రబాబు బుధవారం 10.35 గంటలకు తన పాదయాత్ర ప్రారంభించారు. సత్యసాయి ఫంక్షన్ హాల్ అండ్ గార్డెన్స్ నుంచి బయలు దేరిన ఆయనకు గార్డెన్ యజమానులు పోలేపల్లి పూర్ణచంద్రబాబు, మోహన్ పుష్పగుచ్ఛం ఇచ్చి ఘనంగా వీడ్కోలు పలికారు. తొలుత జిల్లా అధ్యక్షులు దేవినేని ఉమామహేశ్వరరావు, మాజీ మంత్రి నెట్టెం రఘురామ్, బందరు ఎంపీ కొనకళ్ల నారాయణరావు, జగ్గయ్యపేట, నందిగామ ఎమ్మెల్యేలు శ్రీరాం రాజగోపాల్, తంగిరాల ప్రభాకరరావు, ఎమ్మెల్సీ వై.వి.బి.రాజేంద్రప్రసాద్, కేశినేని నానిలు బాబు బస చేసిన వాహనంలోనే చర్చలు జరిపి పాదయాత్రను ప్రారంభించారు.

దున్నపోతుకు మేత వేసి ఆవును పాలివ్వమంటే ఎలా... పాదయాత్రలో చంద్రబాబు జనంతో సరదాగా మాట్లాడుతూ ముందుకు సాగారు. పెనుగంచిప్రోలు - అనిగండ్లపాడు మధ్యలో యాత్రకు ఎదురైన బస్సులోని ప్రయాణికులు ఆయనకు అభివాదం చేశారు. అందులోని కొందరితో ముచ్చడించారు. నిత్యావసర వస్తువుల ధరలు, కరెంటు బిల్లులు, ఆర్టీసీ చార్జీలు భారీగా పెరిగాయని, మీరే మమ్ముల్ని కాపాడాలని బాబును కోరారు. అధికారంలోకి రాగానే సమస్యలన్నీ పరిస్కరిస్తానని హామీ ఇచ్చారు. కాదు ఇప్పడే ఏదో ఒకటి చేయండని బతిమాలాడారు. స్పందించిన బాబు, 'దున్నపోతుకు మేత వేసి ఆవును పాలివ్వమని' అడగడం న్యాయమా అంటూ నవ్వారు.

ఈ సారి నాకు ఓట్లు వేసి గెలిపించండి మీ బాధలు తీరుస్తానని చెప్పి ముందుకు సాగారు. విద్యార్థినితో మాటా మంతి అనిగండ్లపాడు సమీపంలో భవ్య అనే ఎంబీఏ విద్యార్థిని బాబును కలసి నమస్కరించింది. ఆమెను కుటుంబ ఆర్థిక పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఏర్పాటు చేసిన హయ్యర్ ఎడ్యుకేషన్ కళాశాలలే ప్రస్తుతం మీ అందరికీ ఆసరా అయ్యాయన్నారు. ఎంబీఏ చదువుతున్నా ఉద్యోగ వస్తుందన్న భరోసా కనిపించడంలేదు. తన కన్నా ముందు చదివిన వారికే ఉద్యోగాలు లేక ఖాళీగా ఉన్నారని చంద్రబాబుకు విన్నవిచ్చింది. స్పందించిన ఆయన అధైర్య పడవద్దని తాను అధికారంలోకి రాగానే చదువుకున్న వారందరికీ ఉపాధి కల్పిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం అనిగండ్లపాడు ఎలిమెంటరీ పాఠశాలలోకి వెళ్లి చిన్నారులతో ముచ్చటించి, అవినీతిపై విద్యార్థులకు అవగాహన కల్పించే ప్రయత్నం చంద్రబాబు చేశారు.

సమస్యలు వింటూ..హామీలస్తూ..

లక్ష కోట్లు దోచిన వైఎస్ఆర్ వైఎస్ఆర్ కుటుంబం లక్ష కోట్లు దోచేసింది. రూ. వెయ్యి నోట్లు అయితే ఒక్కో గోనె సంచిలో రూ.కోటి పడుతుంది. మీరు ధాన్యం గోనె సంచులను చూసి ఉంటారు కానీ, డబ్బుల సంచులు చూసి ఉండరు. ఒక్కో లారీకి 100 గోనె సంచులు పడతాయి. అంటే లక్ష కోట్లకు 1000 లారీలు పడతాయన్నమాట ! అంటూ పిట్టకథ రూపంలో ప్రతి గ్రామంలో వల్లెవేస్తున్నారు. రెండు లారీలు ఇస్తే అందరి కష్టాలుతీరతాయి. అనడంతో ప్రజల నుంచి స్పందన లభించింది.బెల్ట్‌షాప్ తీసేస్తే తాగుడు తగ్గుతుంది తమ్ముళ్ళూ... కొంతమంది మిట్ట మధ్యాహ్నం ఫుటుగా తాగేస్తున్నారు. అప్పుల బాధల నుంచి తట్టుకోవటానికి ఒక పెగ్గుతో మొదలై.. క్వార్టర్, ఆ తర్వాత ఫుల్ వరకూ వెళ్ళింది. చీప్ లిక్కర్ రూ.20 ఉండేదానిని ప్రభుత్వం రూ. 100 విక్రయిస్తోంది. ఇంతకంటే దారుణం ఏమైనా ఉంటుందా ? నేనో సభలో తాగి వచ్చిన ఒకరిని ప్రశ్నించా. తాగావా అని అడిగా? తాగానన్నాడు.

భార్య ను కొడుతున్నావా? తాగినప్పుడే అన్నాడు. తాగకుంటే చక్కగా చూసుకుంటున్నానన్నాడు. మరి తాగడం మానుకోవచ్చు కాదా? అంటే బెల్టు షాపులను కనుక రద్దు చేస్తే మీరు కోరినట్టు మద్యం తాగటం మానివేస్తాను అన్నాడు. అందుకే అధికారంలోకి వచ్చిన తర్వాత సంతకం చేసే రెండో ఫైల్ బెల్ట్ షాపుల రద్దే..కొంగ జపం.. ఒక చేపల చెరువులో కొంగ తలదించుకుని జపం చేస్తోంది. అందులోని చేపలు కొంగా.. కొంగా.. ఎందుకు జపం చేస్తున్నావు అని అడిగాయి. అందుకు సమాధానం ఇస్తూ నా బాధ అంతా మీ మీదనే అంటూ దీనంగా పలికింది. అయ్యో.. కొంగ గారు మా మీద ఎంత ప్రేమ చూపిస్తున్నాయో? అంటూ జాలి పడ్డాయి.

అది గ్రహించిన కొంగ.. ఈ చెరువులో నీళ్లు ఎండిపోతున్నాయి. పక్కనే సమృద్ధిగా ఉన్న చెరువులో మిమ్మల్ని వేస్తాను అంటూ నమ్మబలికి చేపలను తన ముక్కుతో పట్టుకుని పక్కకు తీసుకెళ్లి చంపి తినేది. తమ్ముళ్ళూ.. మీ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇదే చేస్తుంది. మీకు భ్రమలు కలిగిస్తూ గుది బండలు మోపుతోంది. అది గ్రహించండి అన్నారు. తొమ్మిదేళ్ల తన పాలనలో మిగులు విద్యుత్తు సాధిస్తే.. ఈ ప్రభుత్వం కరెంటు చార్జీల మోత మోగిస్తుంది. త్వరలో మరో రూ. 17 వేల కోట్లకు పెద్ద బాంబు వేయబోతున్నారు. ఇప్పటికైనా భ్రమలను వీడండి. మీరు ఎదుర్కొంటున్న పరిస్థితుల నుంచి బయటపడే మార్గం ఉంది. టీడీపీకి అధికారం కట్టబెట్టండి.

చంద్రబాబు విసుర్లు

63 ఏళ్ళ వయసులో విసుగు, విరామం, అలుపు లేకుండా 1800 కిలోమీటర్లు కాలి నడకన తమ చెంతకు వచ్చిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు జనం అడుగడుగునా నీరాజనాలు పలికారు. అభిమానంతోనో, తమ కష్టాలకు ముగింపు పలకగలరన్న ఆశతోనో ఏ వూరు వెళ్ళినా.. ఊరు ఊరంతా ఆయనను చూడటానికి కదలి వస్తోంది. చంద్రబాబు ప్రసంగాలలో కొత్తగా చెప్పే అంశాలు తక్కువుగానే ఉంటున్నప్పటికీ, శ్రద్ధగా వింటున్నారు. పాదయాత్రలో ఆయన మరో 13 కిలోమీటర్లు తనఖాతాలో వేసుకున్నారు. చిల్లకల్లు ఆల్ సెయింట్స్ ఇంగ్లీషు మీడియం స్కూల్‌లో సోమవారం రాత్రి బస చేసిన బాబు మంగళవారం ఉదయం తొమ్మిది గంటలకు కొద్దిసేపు పాఠశాల విద్యార్థులతో ముఖాముఖిలో పాల్గొన్నారు. వారి సందేహాలను తీర్చారు. అనంతరం ఉదయం 11.45 గంటలకు పాదయాత్రను ప్రారంభించారు. తనకు సంఘీభావంగా తరలి వచ్చిన వేలాదిమంది గ్రామీణ ప్రజలతో కలిసి నడిచారు.

మధ్యమధ్యలో ఎండిన పొలాలను పరిశీలించారు. దారేపోయిన వారిని పలకరించారు. మార్గమధ్యంలో చుక్కనీరు లేక ఎండిపోయిన సాగర్ కాల్వను చూశారు. రైతుల కష్ట నష్టాలను అడిగి తెలుసుకున్నారు. కరెంటు కథలు విన్నారు. పండిన పంటకు గిట్టుబాటు ధర లేక పడుతున్న ఇబ్బందుల గురించి ఆలకించారు. నేనున్నానని, అధైర్య పడవద్దని, తెలుగుదేశం అధికారంలోకి వస్తే... మీ కష్టాలన్నీ తీరతాయని భరోసా ఇచ్చారు. నాలుగు కిలోమీటర్లు నడిచి, సుమారు రెండున్నర గంటలకు మక్కపేట చేరారు. అక్కడ జరిగిన సభలో ప్రసంగించారు.భోజన విరామం తర్వాత కొద్దిసేపు భోజనానికి ఆగారు. బస్సులోనే కొద్దిసేపు విశ్రాంతి తీసుకుని సాయంత్రం 4.30 గంటలకు మళ్ళీ నడక ప్రారంభించారు. మక్కపేట నుంచి ఐదు కిలోమీటర్లు ఉన్న పెనుగంచిప్రోలుకు పాదయాత్ర సాగింది. దారి పొడువునా ఎండిపోయి కనిపిస్తున్న పత్తి, మిరప చేలను చూసి, తెగుళ్ళు ఆశించి, పంటలు పోయి దిగాలుతో ఉన్న రైతన్నలకు ధైర్యం చెబుతూ, సాయం త్రం 7.30 గంటలకు పెనుగంచిప్రోలుకు చేరుకున్నారు. అక్కడ ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు.

అనంతరం తరలివచ్చిన అశేష జనవాహినిని ఉద్దేశించి ఉత్సాహంగా ప్రసంగించారు. మేడలు, మిద్దెలు, పిట్టగోడలు ఎక్కి కూర్చున్న ప్రజలతో సంభాషించారు. విద్యుత్ సమస్యను ప్రజలు చంద్రబాబు దృష్టికి తీసుకువచ్చారు. టీడీపీ హయాంలో విద్యుత్ పోయిన సమయాన్ని చూసి గడియారాలు మార్చుకునేంత నిక్కచ్చిగా కరెంటు తొమ్మిది గంటలు ఇచ్చేవాళ్ళమని ప్రస్తుత అసమర్థ ప్రభుత్వం రెండు గంటలు కూడా కరెంటు ఇవ్వటం లేదని విమర్శించారు. భరించలేని విద్యుత్ బిల్లులను ప్రజల చేతిలో పెడుతున్నారని అన్నారు. అవినీతిపై ప్రజల నేరుగా చర్చించారు. బ్యాంకు రుణాలు చెల్లించవద్దని, తమ ప్రభుత్వం రాగానే రుణాలను మాఫీ చేస్తుందని మరోమారు హామీ ఇచ్చారు.

కిరణ్‌పైనా, కాంగ్రెస్‌పైనా నిప్పులు సీఎం కిరణ్‌కుమార్ రెడ్డిపైనా, కాంగ్రెస్ ప్రభుత్వంపైనా చంద్రబాబు ఘాటైన విమర్శలు చేశారు. కిరణ్ కిరికిరి ముఖ్యమంత్రి అని, అసమర్ధుడని, చేతకాని దద్దమ్మ అని, దొంగలను కాపాడటానికే ఉన్నాడని ఆయన చేసిన విమర్శలకు ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. అలాగే జగన్ అవినీతిని, వైఎస్ కాలంలో జరిగిన తప్పులను ఎత్తిచూపారు. నా వెంట వ స్తారా ? చివరగా పెనుగంచిప్రోలు సభలో ఈ వయసులో పాదయాత్రతో తాను పడుతున్న కష్టాలను గురించి చెబుతూ, మీరు పడుతున్న ఇబ్బందులు చూస్తుంటే.. ఇవేమీ నాకు పెద్ద కష్టంగా అనిపించటం లేదని చెప్పి వారిని ఆకట్టుకున్నారు. సభ ముగియగానే.. మీరంతా హాయిగా ఇళ ్ళకు వెళ్ళిపోతారు. నేను మూడు కిలోమీటర్ల పాదయాత్ర చేయాలి.

మీకోసం వచ్చిన నాకు మద్దతుగా, సంఘీభావం తెలుపుతూ మీరంతా నా వెంట వస్తారా? అయితే చేతులు ఎత్తండి.. అంటూ వారిని ఉత్సాహ పరిచారు. వేలాది చేతులు పైకి లేవటంతో ఇనుమడించిన ఉత్సాహంతో ముందుకు కదిలారు. అనంతరం పెనుగంచిప్రోలులో తిరుపతమ్మ అమ్మవారిని దర్శించుకుని, సత్యసాయి ఫంక్షన్ హాల్‌లో రాత్రి బస చేసేందుకు వెళ్ళారు.

మీ కోసం నేనున్నా..

పాదయాత్ర పూర్తిగా రైతు సమస్యలపై దృష్టి సారించారు. చిల్లకల్లు నుంచి మక్కపేట వరకూ మార్గ మ«ధ్యంలో పలు చోట్ల రైతులు బాబును పొలాల్లోకి తీసుకుని వెళ్లి పంటల పరిస్థితిని వివరించారు. చిల్లకల్లు, మక్కపేట గ్రామాల మధ్య చుక్క నీరు లేక ఎండిపోయి ఉన్న ఎన్ఎస్సీ కాల్వను గమనించారు. నాయకులు, కార్యకర్తలతో కలసి కాల్వలోపలికి దిగి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. నాగార్జున సాగర్‌లో నీరు ఉన్నప్పటికీ ప్రభుత్వం నీటిని విడుదల చేయకుండా రైతులను ఇబ్బందుకలు గురిచేస్తుంన్నారు. చేతగాని సీఎం వల్లే రైతులకు కష్టకాలం వచ్చిందని ఆరోపించారు. పక్కనే ఉన్న పత్తి, మిర్చి పంట పొలాలలోకి వెళ్లి పంటలను పరిశీలించారు. పార పట్టుకుని పంట కాల్వలను చెక్కారు. కొందరు మహిళలు చంద్రబాబు చేతులు పట్టుకుని రోదిస్తూ సమస్యలను ఏకరువు పెట్టారు. పాదయాత్ర సమయంలో కళాశాల విద్యార్థినులతో సమస్యలు తెలుసుకుంటూ వారితో కలసి పాదయాత్ర కొనసాగించారు.

అనంతరం మక్కపేటలో జరిగిన బహిరంగ సభలో ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. సారా తయారి, బెల్టుషాపులు, విద్యుత్ సర్‌చార్జీలు, నిత్యావసర ధరలపై ప్రభుత్వాన్ని ఎండగట్టారు. తల్లి కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్ నాయకుల మాయమాటలకు లొంగిపోకుండా కార్యకర్తలు, అభిమానులు సైనికుల వలే పనిచేయాలని పిలుపు నిచ్చారు. ప్రతి కుటుంబానికి పెద్ద కొడుకులా తాను నిలబడతానని హామీ ఇచ్చారు.

సమస్యలపై రైతులు ఏకరువు మొక్కజొన్న, పత్తి, మిర్చి పరిశీలించారు. సాగు వ్యయం పెరిగిందని, గిట్టుబాటు ధర లేక అల్లాడుతున్నామని రైతులు వివరించారు. టీడీపీ ప్రభుత్వ హాయాంలో పది వేల రూపాయలు ఉన్న మిర్చి ధర, ప్రస్తుతం నాలుగు వేలకు పడిపోయిందని, పత్తి, మొక్కజొన్న, ధాన్యం ధరలు కూడా దారుణంగా పడిపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు ఎరువుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయని సాగు కష్టమేనని రైలులు నిట్టూర్చారు.

విద్యుత్ సరఫరా కూడా సకాలంలో అధికారులుఅందించలేక పోతున్నారన్నారు. సమస్యలను శ్రద్ధగా విన్న చంద్రబాబు మాట్లాడుతూ ప్రస్తుత పాలకులకు ఏరంగంలోనూ సరైన అవగాహన లేదని విమర్శించారు. అధికారంలోకి రాగానే రైతులను కాపాడేందుకు రుణమాఫీపైనే తొలి సంతకం చేస్తా. నిరంతరాయ విద్యుత్ సరఫరా చేస్తానన్నారు. అన్ని రకాల పంటలకూ గిట్టుబాటు ధరలు కల్పించే విధంగా ప్రణాళిక సిద్ధం చేస్తామని చంద్రబాబు భరోసా ఇచ్చారు. కూలీల సమస్యలు అడిగి తెలుసుకున్నారు.

మక్కపేటలో ఘన స్వాగతం వస్తున్నా- మీకోసం యాత్రలో భాగంగా మంగళవారం మధ్యాహ్నం మక్కపేట చేరుకున్న చంద్రబాబు ఘన స్వాగతం లభించింది. మహిళలు, యువకులు పెద్దయెత్తున ఎదురేగి గ్రామంలోని తీసుకువచ్చారు. బాణసంచా, డప్పువాయిద్యాల నడుమ బాబు ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు కదిలారు. రోడ్లన్నీ జన సంద్రంగా మారాయి. అర కిలోమీటరు దూరం నడిచేందుకు సుమారు అరగంట సమయం పట్టింది. బాబును చూసేందుకు మహిళలు, యువకులు భవనాలు, చెట్లపైకి ఎక్కారు. అడుగడుగునా మహిళలు హారతులిచ్చారు.

జనాన్ని చూసి బాబు ఒకింత ఆనందంగా కనిపించారు. ఈ కార్యక్రమంలో మండల తెలుగుయువత అధ్యక్షులు మల్లెల శివప్రసాద్, నాయకులు మల్లెల గాంధీ, తొండపు జగన్మోహనరావు, మండల పార్టీ అధ్యక్షులు జొన్నలగడ్డ రాధాకృష్ణమూర్తి, జిల్లా కార్యవర్గ సభ్యులు వడ్లమూడి రాంబాబు, నీటి సంఘం అధ్యక్షులు పెద్ది రామారావు, ఆవుల రామారావు, పెంట్యాల శ్రీనివాసరావు, కట్టా కోటయ్య, సత్తి బేతవోలు పాల్గొన్నారు.

మల్లెల గాంధీ, మల్లెల శివలకు కితాబు... చంద్రబాబుకు అపూర్వ స్వాగతం లభించడంతో గ్రామ పార్టీ నాయకులు మల్లెల గాంధీ, మల్లెల శివలను ఆయన అభినందించారు. గ్రామాన్ని ప్రత్యేకంగా గుర్తుంచుకుని అభవృద్ధికి సహకరిస్తానని హామీ ఇచ్చారు. ఏడు సంవత్సరాల క్రితం దారుణ హత్యకు గురైన తెలుగుదేశం నాయకులు మారెళ్ల సీతారామిరెడ్డి భార్య లలిత, కుటుంబ సభ్యులు చంద్రబాబును కలిసి పరామర్శించారు. వారి కుటుంబానికి అండగా ఉంటానన్నారు.

తారాజువ్వ పడి వరిగడ్డివాము దగ్థం.. మీ కోసం వస్తున్నా చంద్రబాబు పాదయాత్ర సందర్భంగా మక్కపేట లో భారీస్థాయిలో బాణసంచా కాల్చా రు. తారాజువ్వా ఒకటి మల్లెబోయిన సత్యనారాయణ వరిగడ్డివాముపై పడి కొంతవరకు దగ్ధమైంది. కార్యకర్తలు వెంటనే మంటలను అదుపు చేశారు.

రైతు సమస్యలు తెలుసుకుంటూ...

స్థానిక సమస్యలను ప్రస్తావిస్తూ... చలోక్తులు విసురుతూ చంద్రబాబు జనాన్ని ఆకట్టుకుంటున్నారు. ఆయన ప్రసంగ సరళిలో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. గతంలో కేవలం రాష్ట్రస్థాయి అంశాలపై మాట్లాడిన బాబు ఇపుడు స్థానిక సమస్యలనుస్పృశిస్తున్నారు. ప్రసంగం చివరలో తాను వెళ్లిన గ్రామాల్లో గుర్తించిన సమస్యలతో పాటు స్థానిక నాయకత్వం ద్వారా సేకరించిన సమాచారాన్ని క్రోడీకరించి సభలో ప్రస్తావించి ప్రజలను ఆకర్షిస్తున్నారు. సోమవారం రాత్రి జగ్గయ్యపేటలో నిర్వహించిన బహిరంగసభలోను,  మక్కపేట బహిరంగ సభలోను ఆయన స్థానిక సమస్యలను ప్రస్తావించారు. జగ్గయ్యపేట సభలో చంద్రబాబు మాట్లాడుతూ పాస్‌పుస్తకాల పక్కదోవ పట్టిన వ్యవహారాన్ని ప్రస్తావించి అవినీతిని సహించరాదని సూచించారు.

జగ్గయ్యపేటకు నేరుగా కృష్ణా జలాల అంశాన్ని ప్రస్తావిస్తూ కృష్ణా జిల్లాకు కృష్ణా నదినీటిని ఎన్టీఆర్ సుజల పథకం ద్వారా ప్రతి గ్రామానికి అందచేస్తానని హామి ఇచ్చారు. మక్కపేటలో జరిగిన సభలో సమస్యల జాబితానే చదివారు. తెలుగుదేశం హయాంలో పూడిక తీసిన గ్రామంలోని చెరువుల పరిస్థితిని, ఇప్పటి పరిస్థితిని గుర్తు చేశారు. గ్రామంలో అంతర్గత రోడ్ల దుస్థితిని ప్రస్తావించారు.

మాస్ మషాలా... బాబు ప్రసంగం అంతా మాస్‌ను టార్గెట్ చేసుకొని సాగుతోంది. వైఎస్ తనయుడికి కట్టబెట్టిన లక్ష కోట్ల సొమ్ము గురించి అర్థమయ్యేరీతిలో వివరిస్తున్నారు. గ్రామంలో కోటి రూపాయలు చూసిన వారుండరని, వంద వందరూపాయల నోట్లు కట్టకడితే పదివేలు అవుతుందని, అలాంటివి పదైతే లక్ష అని, వంద అయితే కోటి అని, వాటిని గోనెసంచుల్లో కుడితే వెయ్యి లారీల అవుతుందంటూ వివరిస్తున్నారు.

ధాన్యం మూటలు తప్పితే డబ్బు సంచులు చూడని ప్రజలకు, జగన్ దోచుకొన్న డబ్బులో 2 లారీలు మీ గ్రామానికి పంపితే ఊరే మారిపోతుందంటూ ఆలోచనలో పడవేస్తున్నారు. కోటి సంతకాల సేకరణను ఎద్దేవా చేస్తూ గ్రామంలో ఎవరో హత్యచేస్తారని, అతను చేయలేదని వందమంది సంతకం చేస్తే నిర్ధోషి అవుతాడా అంటూ ఆకట్టు కొంటున్నారు. ఎవరైన మంచిపని చేయాలంటే ముందు తమకు నచ్చిన ప్రార్థన మందిరానికి వెళ్లి ప్రార్థిస్తారని, జగన్ పార్టీలో చేరేవారు మాత్రం జైలులో కొబ్బరికాయ కొట్టి చేరుతున్నార ంటూ ఎద్దేవా చేశారు. ఇలా ప్రజలకు అర్థమయ్యేలా, ఆకట్టు కొనేలా బాబు ప్రసంగిస్తున్నారు. మక్కపేటలో ప్రసంగం ఆపుతుంటే ఇంకా మాట్లాడాలని కార్యకర్తలు కోరితే, మరోసారి అంటూ వేదిక దిగారు.

సమస్యలు...చటోక్తులు

నాది ధర్మ పోరాటం
వైఎస్‌ను నమ్ముకున్నవారు ఇప్పుడేమయ్యారు?
ఆయన కొడుకూ జైలు పాలయ్యాడు..
అవినీతి పట్ల ఉదాసీనత వద్దు
ఆడిన మాట తప్పను.. హామీలన్నీ అమలు చేస్తా..

"నాది ధర్మ పోరాటం. నీతి కోసం పోరాటం.. అధర్మంపై యుద్ధం చేస్తున్నాను. అంతిమంగా ధర్మమే విజయం సాధిస్తుందని నాకు తెలుసు. కొంతమంది నేను తినను.. మరెవరినీ తిననీయనన్న ఉద్దేశంతోనే అక్రమార్కులకు సహకరించి ఇప్పుడు జైళ్ల పాలయ్యారు. నా కొడుకును వాళ్ల అమ్మ బాగా చదివించింది. నాకెలాంటి స్వార్థం లేదు. నాపై విశ్వాసం ఉంచండి. ఈ రాష్ట్రాన్ని సమర్థవంతంగా ముందుకు తీసుకువెళతాను'' అని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు.

'వస్తున్నా.. మీకోసం'లో భాగంగా చంద్రబాబు బుధవారం కృష్ణా జిల్లాలోని జగ్గయ్యపేట నియోజకవర్గంలో 114వ రోజు తన పాదయాత్ర కొనసాగించారు. పెనుగంచిప్రోలులోని శ్రీ సత్యసాయి ఫంక్షన్‌హాల్‌లో రాత్రి బస ముగించుకుని బుధవారం పాదయాత్రను బాబు ప్రారంభించారు. అనిగండ్లపాడులో ప్రజలు చంద్రబాబుకు బ్రహ్మరథం పట్టారు. మహిళలు రెండు కిలోమీటర్ల దూరం ఎదురొచ్చి మరీ హారతులు ఇచ్చి తమ గ్రామంలోకి ఆహ్వానించారు. అక్కడ బహిరంగ సభలో ప్రసంగించిన బాబు.. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు.

రాష్ట్ర ప్రభుత్వం ఇసుక మాఫియాకు అండదండలు అందిస్తోందని విమర్శించారు. ప్రపంచ చరిత్రలోనే కాంగ్రెస్ ప్రభుత్వం మోపిన విధంగా విద్యుత్ భారాన్ని మరెవ్వరూ మోపలేదని మండిపడ్డారు. జలయజ్ఞం ధనయజ్ఞంగా మారిపోయిందని ఆరోపించారు. తమ ప్రభుత్వం వస్తే.. ఈ బాధలన్నింటిని తీర్చివేస్తానని హామీ ఇచ్చారు. ప్రతీ నియోజకవర్గానికి ఒక వృద్ధాశ్రమాన్ని ఏర్పాటు చేస్తానని చంద్రబాబు పేర్కొన్నారు. ఉద్యోగం - ఉపాధి అజెండాగా కృషి చేస్తానని అన్నారు. రుణమాఫీ అన్నది కష్టమని తెలిసినా.. మనసుంటే అనేక మార్గాలు ఉంటాయని, ఆడిన మాట తప్పేది లేదని చంద్రబాబు స్పష్టం చేశారు.

అనంతరం గుమ్మడిదుర్రులో జరిగిన మరో బహిరంగ సభలో అవినీతి అంశంపై మాట్లాడారు. తాను రాష్ట్రంలో తొమ్మిదేళ్లపాటు పాలన సాగించానని, ఆ సమయంలో ఎన్నో సంస్కరణలను తీసుకువచ్చి అన్ని వ్యవస్థలను సక్రమంగా పని చేయించానని చెప్పారు. అలాంటి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖరరెడ్డి అన్ని వ్యవస్థలను భ్రష్టు పట్టించాడని చంద్రబాబు ఆరోపించారు. "చంద్రబాబు తినడు.. మిమ్మల్ని తిననీయడు అంటూ వైఎస్ రాజశేఖరరెడ్డి పదే పదే చేసిన విషపు ప్రచారం వల్ల కొంతమంది ఆయనతో కలిసి వెళ్లారు.

ఫలితంగా నేడు అనుభవిస్తున్న పరిస్థితులను తలచుకుని వారు బాధపడుతున్నారు. సీఎంగా వైఎస్ రాజశేఖరరెడ్డి ఐదేళ్ల మూడు నెలల హయాంలో జరిగిన వ్యవహారాల వల్ల ఐఏఎస్ అధికారులు, మంత్రులు, పారిశ్రామికవేత్తలు జైళ్లకు వెళ్లారు. చరిత్రలో ఏ ముఖ్యమంత్రి హయాంలో కూడా అధికారులు జైలు ఊచలు లెక్కపెట్టిన ఉదంతాలు లేవు. ఆఖరుకు రాజశేఖరరెడ్డి కుమారుడు కూడా జైలుకు పోయాడు'' అని విమర్శించారు. పరిపాలన అంటే ఇష్టానుసారం దోచుకోవటమేనా? అని ప్రశ్నించారు.

వైఎస్ జలయజ్ఞం గురించి ప్రకటించినప్పడు ధనయజ్ఞంగా మార్చవద్దని తాము పదేపదే హెచ్చరించామని, చివరికి అదే జరిగిందని చంద్రబాబు చెప్పారు. ఎన్టీఆర్ ఒక స్ఫూర్తి అని, ఆయన యుగ పురుషుడని కొనియాడారు. అదే వైఎస్‌ను చూస్తే పిల్లలు అవినీతి తప్ప మరొకటి నేర్చుకోలేరని విమర్శించారు. అవినీతి పట్ల ఉదాసీనంగా ఉంటే భవిష్యత్తు తరాల జీవితాలు నాశనమౌతాయని బాబు హెచ్చరించారు.

అడుగడుగునా జననీరాజనం
చంద్రబాబుకు అడుగడుగునా జనం నీరాజనం పలికారు. పెనుగంచిప్రోలు నుంచి అనిగండ్లపాడు బయలుదేరిన బాబుకు మహిళలు రెండు కిలోమీటర్ల దూరం ఎదురేగి.. హారతులు పట్టి గ్రామంలోకి ఆహ్వానించారు. గుమ్మడిదుర్రు, రామిరెడ్డిపల్లి, కొండూరుల్లోనూ ప్రతి ఇంటిమీద, పిట్టగోడల మీద, రోడ ్ల కిరువైపులా నిలబడి అశేష జనవాహిని బాబుకు స్వాగతం పలికింది.

అధర్మంపై యద్ధం చేస్తున్నా.. సహకరించండి..

నిజం నిలకడ మీద తేలుతుందంటారు! ఇప్పుడు అదే జరుగుతోంది. మబ్బులు తొలగిపోతున్నాయి. వైఎస్ హయాంలో జరిగింది జలయజ్ఞం కాదని, ధనయజ్ఞమని మేము ఎప్పటి నుంచో చెబుతున్నాము. ప్రజలకు ఆ విషయం ఇప్పుడు అర్థమవుతోంది. ధనయజ్ఞానికి సజీవ సాక్ష్యాలు ఎన్నో నా పాదయాత్రలో కనిపిస్తున్నాయి. మున్నేరుపై పోలంపల్లి వద్ద ఎనిమిదేళ్ల క్రితం వైఎస్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. 30 వేల ఎకరాలకు నీళ్లు ఇస్తామన్నారు.

కానీ... ఆ రాయి ఇప్పటికీ అక్కడే, అలాగే ఉంది. తట్టెడు మట్టి ఎత్తి పోసిందిలేదు. కానీ, ఎనిమిది కోట్లు మాత్రం ఖర్చుపెట్టారు. అంటే, వారికి రావాల్సిన కమీషన్లు వారికి వచ్చేశాయి. రైతులకు మాత్రం నీళ్లు అందలేదు. మొత్తం జలయజ్ఞం పేరుమీద 80 వేల కోట్లు ఖర్చు పెట్టి ఎనిమిది వేల ఎకరాలకు కూడా నీరు ఇవ్వలేదు.

డబ్బులు దండుకునేందుకు కాలువలు మాత్రం తవ్వి వదిలేస్తారు. ప్రాజెక్టులు కట్టకుండా వదిలేశారు. ఈ విషయాలన్నీ ప్రజలకు ఇప్పుడు తెలుస్తున్నాయి. వైఎస్ అపర భగీరథుడు కాదని, కేవలం ధన యజ్ఞం చేసిన నాయకుడనీ అర్థం చేసుకుంటున్నారు. జలయజ్ఞంకంటే నా హయాంలో నిర్మించిన చెక్ డ్యాములే ఎంతో పనికివచ్చాయని రైతులు అడుగడుగునా చెబుతున్నారు. ఇప్పుడు వాళ్లు ఎదుర్కొంటున్న కష్టాలు చెప్పుకొంటున్నారు.

'సమస్యలున్న వారు చేతులు పైకి ఎత్తండి' అనిగండ్లపాడు బహిరంగ సభలో చెప్పగానే... అక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ చేతులు ఎత్తారు. ఒక్కొక్కరు ఒక్కొక్క సమస్యతోకాదు... ఐదారు రకాల సమస్యలతో బాధపడుతున్నారు. ఇన్ని సమస్యలు ఉండి కూడా ప్రతి గ్రామంలో నాకు ఆత్మీయంగా స్వాగతం పలుకుతున్నారు.

గుమ్మడిదుర్రు అనే గ్రామంలో అయితే... నేను వాళ్ల ఊరికి ఎప్పుడు వస్తే అప్పుడు నా చేత ఎన్టీఆర్ విగ్రహం ఆవిష్కరణ చేయించాలని ఆరేళ్లుగా ఎదురు చూస్తున్నారు. ఎన్టీఆర్ అన్నా, నేనన్నా, తెలుగుదేశం పార్టీ అన్నా వారికి ఉన్న అభిమానం నాకు చాలా ఆనందాన్ని ఇస్తోంది. పాదయాత్రలో నేను ఎన్ని ఇబ్బందులు, ఆరోగ్యపరమైన సమస్యలు ఎదుర్కొంటున్నా... ప్రజల అభిమానం, ఆదరణే నన్ను ముందుకు నడిపిస్తోంది.

అక్షరాలా ధనయజ్ఞమే..

కాంగ్రెస్‌ని కుళ్లబొడవండి!
సహకార ఎన్నికల్లో చిత్తుగా ఓడించండి
కాంగ్రెస్, వైసీపీలు 'మాఫీ'కి వ్యతిరేకం
మీ ఉద్యమం తిరుగుబాటు కావాలి
కృష్ణాజిల్లా పాదయాత్రలో బాబు పిలుపు

  రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని కుళ్లబొడవాలని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పిలుపు నిచ్చారు. రానున్న సహకార ఎన్నికలలో ఆ పార్టీని గెలిపిస్తే రుణమాఫీని కూడా మింగేస్తారని హెచ్చరించారు. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గం మక్కపేట వద్ద ఆయన పాదయాత్ర ప్రారంభించారు. మక్కపేట, పెనుగంచిప్రోలులో జరిగిన బహిరంగ సభలకు జనం పోటెత్తారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్నికలకు వెళ్ళే సత్తాలేదని ఈ సందర్భంగాచంద్రబాబు దుయ్యబట్టారు.

పంచాయతీల కాలపరిమితి ముగిసినా, మునిసిపాలిటీలు, కార్పొరేషన్లు, జడ్‌పీటీసీలకు ఎన్నికలు నిర్వహించకుండా తాత్సారం చే స్తూ వస్తోందన్నారు. కేంద్ర ప్రభుత్వం చొరవతోనే సహకార ఎన్నికలకు ప్రభుత్వం వెళుతోందని విమర్శించారు. ఈ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి ఎట్టిపరిస్థితులలోను అవకాశం కల్పించవద్దని పదేపదే కోరారు. కాంగ్రెస్, వైసీపీలు రెండూ రుణమాఫీకి వ్యతిరేకమని చెప్పారు. అవినీతి వ్యతిరేక ఉద్యమాన్ని ప్రతి ఒక్కరూ చేపట్టాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరు తమ ఫోన్ల నుంచి 5 ఎస్ఎంఎస్‌లు అవినీతి వ్యతిరేకత కోసం పంపిస్తే..ఒక ఉద్యమం ఊపందుకుంటుందని పేర్కొన్నారు.

తాము అధికారంలోకి వచ్చాక ప్రభుత్వం పెంచిన విద్యుత్ చార్జీలు తగ్గిస్తామని హామీ ఇచ్చారు. అలాగే.. దళిత క్రిస్టియన్లను ఎస్సీల జాబితాలో చేర్చి రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పారు. చంద్రబాబు ప్రసంగిస్తుండగా ఓ మహిళ లేచి, 'మీ హయాంలో ఆడ పిల్ల పుడితే డబ్బులు డిపాజిట్ చేసే పథకం పునరుద్ధరించండి సార్'' అని కోరగా సానుకూలంగా స్పందించారు. రెండు రోజులో దీనిపై ఆలోచించి ప్రస్తుత పరిస్థితులకు తగ్గట్టుగా ఎంత డిపాజిట్ (అప్పట్లో రూ. ఐదువేలు) చేయవచ్చు, ఏ సమయంలో ఆ డబ్బు వారికి అందించాలని తదితర అంశాలను నిర్ణయిస్తామని హామీ ఇచ్చారు.

సెల్‌తో అవినీతిపై సమరశంఖం పూరించండి

సాగర్ ఆయకట్టు పంటలను కాపాడండి

  నాగార్జునసాగర్ ప్రాజెక్టు ఆయకట్టులో ఎదుగుదల దశలో ఉన్న పంటలకు అవసరమైన నీటిని విడుదల చేసి కాపాడాలని ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డిని... తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు కోరారు.  ఈ సందర్భంగా రైతుల కష్టాలను గమనించిన చంద్రబాబు ఎండిపోతున్న పంటలకు తక్షణం సాగునీటిని విడుదల చేయని పక్షంలో రైతులు ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతారని సీఎంకు రాసిన లేఖలో పేర్కొన్నారు.

ఖమ్మం, నల్లగొండ, కృష్ణాజిల్లాల్లో సాగర్ ఎడమ కాల్వ కింద పత్తి, మిర్చి, మొక్కజొన్న పంటలను రైతులు సాగు చేశార న్నారు. పంటలు చేతికి వచ్చేలోగా పైర్లకు రెండు మూడు సార్లు నీటి తడులు పెట్టాల్సి ఉందని రైతులు తెలిపారన్నారు. రెండు మూడుసార్లు పంటలకు నీళ్లు అందించాల్సి ఉండగా, జగ్గయ్యపేట, నందిగామ, మైలవరం, తిరువూరు, నూజివీడు ప్రాంతాల్లోని పంటలు నీళ్లు ఎండిపోతున్నాయని చంద్రబాబు ఆవేదన వెలిబుచ్చారు.

సాగునీరు వెంటనే విడుదల చేయకపోతే దాదాపు 7.5 లక్షల ఎక రాల్లో పంటలు నిలువునా ఎండిపోతాయని పేర్కొన్నారు. ఇప్పటి వరకు ఈ పంటలను కాపాడటానికి ఒక్క వ్యవసాయాధికారి గాని, సాగునీటి అధికారి గాని ఆ ప్రాంతాల్లో పర్యటించిన దాఖలాలు లేవన్నారు. ఈ పరిస్థితుల్లో తక్షణమే ఆప్రాంతాలకు ప్రత్యేక బృందాలను పంపించి పరిస్థితిని అంచనా వేయించాల్సిందిగా నీటిపారుదల శాఖ ఛీప్ ఇంజనీరుతో పాటుగా వ్యవసాయ శాఖ కమిషన ర్‌ను ఆదేశించాల్సిందిగా ఆయన సీఎంకు సూచించారు.

సాగర్ ఆయకట్టు కింద సాగులో ఉన్న పంటలను కాపాడేందుకు అవసరమైన నీటిని విడుదల చేయాలని, అవసరమైతే నాగార్జునసాగర్ ప్రాజెక్టు డెడ్ స్టోరేజీ నీటిని కూడా వినియోగించాలని సూచించారు. కృష్ణా, ప్రకాశం, గుంటూరు, ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో ఆయకట్టు పంటలను కాపాడి రైతులను ఆదుకోవాలని సీఎం కిరణ్‌కు రాసిన లేఖలో చంద్రబాబు కోరారు.

బాబు లేఖకు ఖుర్షీద్ స్పందన
నార్వేలో శిక్షపడిన అనుపమ, చంద్రశేఖర్ దంపతుల విడుదలకు కృషి చేయాలంటూ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు రాసిన లేఖకు... భారత విదేశాంగ శాఖ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ స్పందించారు. ఈ విషయంలో విదేశాంగ శాఖ అందించిన సహాయ సహకారాలను బాబుకు... సల్మాన్ వివరించారు. నార్వే సుప్రీంకోర్టులో ఈ కేసు ఉన్నందున తదుపరి తీర్పు కోసం వేచి ఉన్నామని ఖుర్షీద్ వివరించారు. చంద్రశేఖర్ దంపతుల కేసు విషయంలో తాను రాసిన లేఖకు కేంద్ర మంత్రి ఖుర్షీద్ స్పందించడంపై చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు.

సీఎం కిరణ్‌కు చంద్రబాబు లేఖ

'ఢిల్లీ' దారుణంతోనైనా ఆడపడుచులకు అభయం దొరుకుతుందనుకున్నాను. ఆ రేపిస్టు లకు ఉరిపడి.. ఆడబిడ్డల ఆక్రందనలకు తెరపడుతుందని ఆశపడ్డాను. కానీ, పేపర్లు తిరగేస్తుంటే బాధనిపిస్తోంది. రోజూ ఏదో మూలన అబలలపై అఘాయిత్యాలు చేస్తూనే ఉన్నారు. అంత ఉద్యమం జరిగిన తరువాత కూడా వ్యవస్థలోనూ ప్రభుత్వంలోనూ ఏ మార్పూ లేదు. అదే ఆవేదన చిల్లకల్లులో ఉదయం నన్ను కలిసిన విద్యార్థినుల కళ్లలో సుళ్లు తిరిగింది. నిర్భయ ఉదంతం ఇంకా వారి మది నుంచి చెరిగిపోలేదు. ఆ ఘటన గుర్తుకొస్తేనే గుండెలు నీరయిపోతాయి.

"ఈ పాలనలో మాకు భద్రత ఎక్కడ సార్'' అని అడుగుతుంటే కళ్లలోని తడిని ప్రశ్నని చేసి సంధిస్తున్నారనిపించింది. అటువంటి వాళ్లెంతోమంది జగ్గయ్యపేట దారిలో నాకోసం ఎదురుచూడటం చూశాను. "అన్నా మీరు సీఎం కావాలి'' అని ఒకరు అభిమానం చూపితే, " మీరు మళ్లీ అధికారంలోకి వస్తే తలనీలాలు ఇస్తానని మొక్కుకున్నా అన్నా '' అని మరో యువతి చెప్పుకొచ్చింది. వీళ్లను చూస్తుంటే అభద్రతలో ఉన్న తమకు ఒక అన్న దొరికాడన్న ఊరట పొందుతున్నారనిపిస్తోంది. తమవద్దకు నడిచొస్తున్న నాపై వాళ్లకెంత నమ్మకం!

చిల్లకల్లు దాటిన తరువాత కలిసిన సుబాబుల్ రైతులను పలకరించారు. మధ్య దళారుల వ ల్ల దోపిడికి గురవుతున్నామని వాపోయారు. ఇదంతా వర్షాభావ ప్రాంతం. "సుబాబుల్ కలిసి వస్తుందని పెద్దఎత్తున నాటాం. ఇప్పుడు ఫరవాలేదు గానీ, గతేడాది చేసిన అప్పులు ఎంతవరకు తీరతాయో చూడాలి. కాగితపు పరిశ్రమకు కాగితం కొరత వచ్చి ఇప్పుడు కాస్త ధర పలికింది గానీ, అప్పుడయితే తోటలూ నరుక్కోవాల్సి వచ్చింది.

సుబాబులనే కాదు..మిర్చి రైతులు కూడా కష్టాల ఘాటుతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఏ మిర్చి పొలంలోకి వెళ్లినా తెగులున్న పంటే కంట పడుతోంది. మంచి దిగుబడి వస్తుందనుకున్న సమయంలో మాయదారి తెగులు తగులుకుందని ఆ రైతు కన్నీళ్లపర్యంతమయ్యాడు. ఆయన 15 ఎకరాల్లో పంట వేశాడట. ఇప్పటిదాకా ఎనిమిది లక్షలు పోశాడట. మూడో తడికి నీళ్లు రాకపోవడంతో పంటంతా పోయింది. కుటుంబం అప్పులపాలైంది. ఇక ఆత్మహత్య తప్ప మరో దారి లేదని ఆ రైతు వాపోయాడు. ఈ సర్కారు కంట్లో మిర్చి పడా!

ఈ సర్కారు కంట్లో మిర్చి పడా!