January 20, 2013

వస్తున్నా... మీకోసం పాదయాత్రకు నియోజకవర్గంలో ఆదివా రం నాలుగో రోజు జనం నీరాజనం పలికారు. మధ్యాహ్నం బస ప్రాంతం నుంచి 2.30 గంటలకు ప్రారంభమైన పాదయాత్ర 2కి.మీ.లు సాగి గుడిబండ గ్రామానికి చేరుకుంది. మార్గమధ్యలో కూరగాయల వ్యాపారులు, ఇటుక బట్టీల్లో పనిచేసే కార్మికులతో ఆయన మాట్లాడి వారి యోగక్షేమాల ను తెలుసుకుని కొంత ఆర్థికసహాయం చేశారు. గుడిబండ గ్రామశివారులో వృద్ధులను పలకరించారు. వారికి పింఛన్లు వస్తున్నాయా.. లేదా అని తెలుసుకొని ఒకరికే వస్తుందని చెప్పడంతో తమ ప్రభుత్వం వస్తే ఇద్దరికీ అందజేస్తామని బాబు హామీ ఇచ్చారు.

అనంతరం గుడిబండ గ్రామ సెంటర్‌లో రోడ్డుపై ఏర్పాటుచేసిన ఎన్టీఆర్ విగ్రహాన్ని బాబు ఆవిష్కరించి అనంతరం జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాలపై నిప్పులు చెరుగుతూ ప్రజలు కష్టాల్లో ఉంటే వాటిపై చర్చించకుండా కాంగ్రెస్ చింతన్‌బేటక్‌లో వారసత్వ పదవులు కట్టబెట్టేందుకే పరిమితమైందని ఆరోపించారు. గ్రామంలోని పాఠశాల వద్ద ఏర్పాటు చేసిన పల్స్‌పోలియో కేంద్రంలోకి వెళ్లిన బా బు చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. సంపూర్ణ ఆరోగ్యంతో కలకాలం ఉండాలని ఆశీస్సులు అందించి ముద్దాడి ముందుకు సాగారు. గ్రామం లో మసీదు వద్ద ముస్లింలు యాత్రకు ఎదురెళ్లి టోపీ పెట్టి స్వాగతం పలుకారు.

సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇస్తూ ముందుకు సాగిన బాబు వికలాంగులు, వృద్ధులను పలకరించా రు. వారికి ప్రభుత్వం నుంచి వృద్ధాప్య, వితంతు పింఛన్లు ఏ మేరకు అందుతున్నాయో అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మహిళలు యాత్రకు మంగళహారతులతో స్వాగతం పలికారు. అనంతరం సాగిన పాదయాత్ర ముదిగొండ దళితవాడకు చేరుకుంది. అక్కడ రోడ్లు, ఇళ్లు, మౌలిక సదుపాయాలను పరిశీలించారు. సోమపంగు కనకరత్నం ఇంట్లో మంచంపై కూర్చు ని వారితో ముచ్చటించారు. దళితవాడ నుంచి తిరిగి కాపుగల్లు రోడ్డుకు చేరుకున్న పాదయాత్రకు గ్రామానికి 3 కి.మీ.ల ముందే గ్రామస్థులు, వివిధ జిల్లాల నుంచి వచ్చిన కార్యకర్తలు, నా యకులు డప్పు వాయిద్యాలు, కోలాట ప్రదర్శనలతో యాత్రకు స్వాగతం పలికారు. తెలుగుదేశం పార్టీకి చెందిన తెలంగాణ ముఖ్యనేతలు సీఎం రమేష్, యర్రబెల్లి దయాకర్‌రావు, ఉమామాధవరెడ్డి, మోత్కుపల్లి నర్సింహులు, రేవంత్‌రెడ్డి, సీతక్క, సునీత, లతో పాటు జిల్లా నాయకులు కోదాడ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్‌రావు, జిల్లా అధ్యక్షుడు బిల్యానాయక్, రజనీకుమారి, కిరణ్మయి, బండ్రు శోభారాణి, లింగయ్యయాదవ్, బొల్లం మల్లయ్యయాదవ్, పార సీతయ్య, అజయ్‌కుమార్, ఓరుగంటి ప్రభాకర్, ఓరుగంటి బ్రహ్మం తదితరులు వెంట సాగారు.

అనంతరం గ్రామంలో చంద్రబాబు ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్మించిన సుజల స్రవంతి మంచినీటి ప్లాంట్‌ను ప్రారంభించారు. గ్రామసెంటర్‌లో ఏర్పాటు చేసిన ఎన్టీరామారావు విగ్రహాన్ని ఆవిష్కరించి పార్టీ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా బహిరంగ సభలో ప్రసంగించిన బాబు అవినీతిపై మాట్లాడాలని కొంతమంది ప్రజలకు మైకు ఇచ్చి అవకాశం కల్పించారు. రాష్ట్రంలో అవినీతి పేరుకుపోయిందని, అవినీతిపరులకు శిక్షలేకుండా పోయిందని అన్నా రు.

మీ ప్రభుత్వ కాలంలో అవినీతి పరులను దండించారని, ఒకే ఒక్కడు సినిమాను ఆదర్శంగా తీసుకుని వచ్చేఎన్నికల్లో అధికారం చేపట్టి అవినీతిపరుల భరతం పట్టాలని ప్రజలు కోరారు. దీనిపై స్పందించిన బాబు ఒకేఒక్కడు దర్శకుడు శంకర్ మనల్ని ఆదర్శంగా తీసుకుని సినిమా తీశారని, ఆయనే తనతో స్వయంగా చెప్పారని పేర్కొన్నారు. అధికారంలోకి వస్తే అవినీతిని అంతమొందించేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని హామీ ఇచ్చారు .

'మాదిగల అభివృద్ధికి కృషి' రాష్ట్రంలో మాదిగలు ఇంకా దారిద్య్రాన్ని అనుభవిస్తున్నారని, దీనికి కాంగ్రెస్ ప్రభుత్వాల విధానాలే కారణమని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. మాదిగల అభి వృద్ధికి కృషి చేస్తానన్నారు. పాదయాత్రలో భాగంగా ఆదివారం కోదాడ మండలంలోని గుడిబండ శివారులో ఉన్న దళితవాడకు చేరుకున్నారు. అక్కడ దళిత మహిళలతో ముచ్చటించారు. మీకు ఆదాయం ఏవిధంగా వస్తుంది? గేదెలు ఉన్నాయి, వాటి ద్వా రా ఆదాయం వస్తుందా? పొలం ఉం దా..? అని ప్రశ్నించారు. పొలం లేదని మహిళ సమాధానం చెప్పడంతో గడ్డి ఎక్కడి నుంచి తీసుకొస్తారని ప్రశ్నించారు.

కొనుగోలు చేస్తామని, రోజు కూ లీతో వచ్చే ఆదాయంతో తమ కుటుంబాలను వెల్లదీసుకుంటున్నామని అ న్నారు. ఇళ్లు లేక ఒక్కొక్క ఇంట్లో నాలుగు జంటలు సహజీవనం చేయాల్సి వస్తుందని సమస్యలను దళిత కాలనీ మాజీ ఎంపీటీసీ బాబుకు వివరించింది. అంతేకాకుండా కాలనీలోని సమస్యలను బాబు దృష్టికి తీసుకొచ్చారు. విద్యుత్ సరఫరా సరిగా లేకపోవడంతో విషసర్పాల కాటుకు మృత్యువాత పడాల్సి వస్తుందని ఏకరువు పెట్టారు. దీనిపై స్పందించిన బాబు మాట్లాడుతూ ఎస్సీల అభ్యున్నతికి ఏబీసీడీ వర్గీకరణ అవసరమని, వర్గీకరణకు తను కట్టుబడి ఉన్నానని పేర్కొన్నారు. అధికారంలోకి వస్తే ఏబీసీడీ వర్గీకరణకు శక్తి వంచనలేకుండా కృషి చేస్తానని అన్నారు

. మాదిగల అభ్యున్నతికి ప్రత్యేక ప్యాకేజీ కింద ప్రతి కుటుంబానికి ఎకరం పొలంతో పాటు ఇల్లు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు. పిల్లలను కూలికి పంపకుండా చదివించాలని, తమ ప్రభుత్వం వస్తే మాదిగ పిల్లలకు ఉచితవిద్యతో పాటు చదువుకున్న యువతకు ఉద్యోగం కల్పిస్తానని హామీ ఇచ్చారు. ఇంటి ఆవరణలో ఉన్న సీమచింతకాయ (గుబ్బ) చెట్లను చూసి దీని కాయలు మీరు తింటారా.. లేక పశువులకు వేస్తారా అంటూ హాస్యోక్తంగా ప్రశ్నించారు. దీంతో తాము తింటామని, ఆకులను గొర్రెలకు, మేకలకు ఉపయోగిస్తామని సమాధానం ఇవ్వడంతో బాబు అక్కడి నుంచి నిష్క్రమించి తిరిగి పాదయాత్రకు ఉపక్రమించారు.

'మూతపడిన పరిశ్రమలు' కోదాడరూరల్: రాష్ట్రంలో విద్యుత్ కోతల వలన పంటలు ఎండిపోయి రైతులు, పరిశ్రమలు సైతం మూతపడ్డాయని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. రెడ్లకుంట గ్రామంలో పార్టీ పతాకాన్ని ఆవిష్కరించి మాట్లాడారు. రాష్ట్రంలో దాదాపు 40వేల పరిశ్రమలు ఉండగా విద్యుత్ కోత కారణంగా 10వేలకు పైగా మూతపడ్డాయని అన్నారు. రెడ్లకుంట ప్రాంతంలో అనేక చిన్నతరహా పరిశ్రమలు ఉన్నాయని అవికూడా విద్యుత్ కోతతో నడపలేక మూసివేశారన్నారు.

దీంతో కార్మికులు పనికోసం వలస వెళ్తున్నారని అన్నారు. రెడ్లకుంట గ్రామానికి పాలేరు జలాలు టీడీపీ హయాంలో తీసుకువచ్చామని చెప్పారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే చందర్‌రావుతో పాటు పార్టీ మండలాధ్యక్షుడు మల్లెల ఆదినారాయణ, నాయకులు మల్లెల పుల్లయ్య, మల్లెల బ్రహ్మయ్య, భాస్కర్‌రావు, వెంకన్నగౌడ్ పాల్గొన్నారు.

అడుగడుగునా.. ఆత్మీయ పలకరింపు

రాబోయే 2014అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధిస్తుందని తుంగతుర్తి ఎమ్మెల్యే మోత్కుపల్లి నర్సింహులు ఆశాభావం వ్యక్తంచేశారు. ఆదివారం సూర్యాపేటలో మునిసిపల్ మాజీ చైర్మన్ జుట్టుకొండ సత్యనారాయణ నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కోదాడ నియోజకవర్గంలో చంద్రబాబు పర్యటనకు జనప్రభంజనం కనిపించిందన్నారు. అడుగడుగునా ప్రజల ఆశీర్వాదాలు, మహిళలు మంగళహారతులతో స్వాగతం పలుకుతున్నారని పేర్కొన్నారు.

రానున్న ఎన్నికల్లో జిల్లాలో 12అసెంబ్లీ సీట్లు గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. సూర్యాపేట నియోజకవర్గ ఇన్‌చార్జి పటేల్ రమేష్‌రెడ్డి మాట్లాడుతూ అవినీతి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో విసిరివేయాలని అన్నారు. సీఎంనుంచి ఆదర్శరైతుల వరకు పెద్దఎత్తున అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. మోత్కుపల్లి ఆధ్వర్యంలో పాలేరు జలాల కోసం పాదయాత్ర చేస్తే ప్రభుత్వం నిధులు కేటాయించిందని చెప్పారు. అవినీతి కాంగ్రెస్‌ను చిత్తుగా ఓడించడానికి ప్రజలు సంసిద్దమయ్యారన్నారు. సమావేశంలో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బడుగుల లింగయ్యయాదవ్, మునిసిపల్ మాజీచైర్మన్ జుట్టుకొండ సత్యనారాయణ, డాక్టర్లు రాంమూర్తియాదవ్, రాం చందర్‌నాయక్, టీడీపీ నాయకులు నెమ్మాది బిక్షం, దారోజు జానకిరాములు, వెంకటేశ్వర్‌రావు, మన్మథరెడ్డి, సుధాకర్‌యాదవ్, శ్రీరాములు, రాజా, నర్సయ్యయాదవ్, మోహినోద్దీన్, రమేష్, బాలాజీనాయక్ పాల్గొన్నారు.

రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీదే విజయం

టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు పాదయాత్రకు తెలంగాణ ప్రాంతంలో ప్రజల నుంచి విశేష స్పందన లభించిందని, అడుగడుగునా ప్రజలు నీరాజనం పలుకుతున్నారని టీడీపీ రాష్ట్ర నాయకుడు కంచర్ల భూపాల్‌రెడ్డి అన్నారు. ఆదివారం నల్లగొండ నియోజకవర్గం నుంచి కోదాడలో చంద్రబాబు పాదయాత్రకు టీడీపీ శ్రేణులు, ప్రజలు పెద్ద ఎత్తున తరలివెళ్లారు. ఈ సందర్భంగా జరిగిన భారీ ర్యాలీలో ఆయన మాట్లాడుతూ 2014ఎన్నికల్లో తెలుగుదేశంపార్టీ అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు. తమ అధినేత చంద్రబాబునాయుడు మరోసారి ముఖ్యమంత్రి కావాలని ప్రజలంతా కోరుకుంటున్నారన్నారు.

జిల్లాలో చంద్రబాబు పాదయాత్రకు ప్రజలు తండోపతండాలుగా తరలి వస్తుండటం చూసి ఇతర పార్టీల నేతల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయని పేర్కొన్నారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలతోపాటు అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో జిల్లాలో మెజారిటీ స్థానాలను సాధిస్తామన్నారు. చంద్రబాబు పాదయాత్రకు నల్లగొండ నియోజకవర్గం నుంచి బస్సులు, డీసీఎంలు, సుమోలు, పలు వాహనాల్లో కార్యకర్తలు తరలివెళ్లారు. కార్యక్రమంలో టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి బోయపల్లి కృష్ణారెడ్డి, జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి రేగట్టె మల్లికార్జున్‌రెడ్డి, బొర్రా సుధాకర్, కంచనపల్లి రవీందర్‌రావు పాల్గొన్నారు.

బాబు పాదయాత్రకు విశేష స్పందన :టీడీపీ రాష్ట్ర నాయకుడు కంచర్ల భూపాల్‌రెడ్డి

మనకిక చింత చెట్లే గతి!
కోతలతో ఉక్కపోతే
ఇంటికి వెయ్యి రూపాయల బిల్లా?
ఆర్సీసీ నుంచి డీజిల్ చార్జీల దాకా భగ్గు
నల్లగొండ పాదయాత్రలో చంద్రబాబు ఆవేదన
కల్లు పరిశ్రమ పౌర సరఫరాల పరిధిలోకి

  "ఆర్టీసీ టికెట్ల ధరలు పెంచారు. డీజిల్ ధరలు పెరిగాయి. కరెంటు చూ స్తే మండుతోంది. ఏ ఇంటికి చూసినా వెయ్యి రూపాయ లు తక్కువ రావడం లేదు. కోతలతో ఇంట్లో ఉండే పరిస్థి తి లేదు. ఇక మనకు చింత చెట్లే గతి'' అని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు వ్యాఖ్యానించారు. చదువుకున్న తమ్ముళ్లు ఫేస్‌బుక్, ట్విటర్ వాడాలని, సెల్‌ఫోన్‌ల ద్వారా ఎస్సెమ్మెస్ పంపి అవినీతిపై వీరోచిత పోరాటం చేయాలని సూచించారు.

నల్లగొండ జిల్లాలో మూడో రోజు పాదయాత్రలో భాగంగా శనివారం కోదాడ, చిలుకూరు మండలాల మీదుగా 14 కిలోమీటర్లు నడిచారు. ఈ సందర్భంగా పాల్గొన్న పలు సభల్లో సామాన్యుడి దయనీయ పరిస్థితిపై పదేపదే ఆవేదన వ్యక్తం చేశారు. "సాగుకు లేదు. తాగేందుకూ లేదు. కరెంట్ ఉండదు. పనులు లేవు. ప్రజాజీవనానికి హాలిడే ప్రకటించాల్సి వస్తోంది'' అంటూ రైతాంగ ఆత్మహత్యలను ప్రస్తావించా రు.

కాంగ్రెస్ మొండిచేయి చూపిందని, టీఆర్ఎస్ కారు పంక్చర్ అయ్యిందని, సైకిల్ ఎక్కితేనే జీవితం భద్రంగా సాగుతోందని అంతా భావిస్తున్నారని చెప్పారు. అధికారంలోకి వస్తే జిల్లాలవారీగా జనాభాను తీసుకుని ఉద్యోగాలు, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కల్పిస్తామని ప్రకటించారు. అసెంబ్లీ, పార్లమెంటులలో లంబాడాలకు సీట్లు వచ్చేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. గిరిజన పూజారులకు నెలకు ఐదు వేల రూపాయల గౌరవవేతనం వచ్చేలా ఏర్పాట్లు చేస్తానన్నారు. రైతుల పంపుసెట్లకు సోలార్ ఎనర్జీ ప్లేట్లను సబ్సిడీపై అందజేస్తానని తెలిపారు.

కల్లు పరిశ్రమను ఎక్సైజ్ శాఖనుంచి తప్పించి పౌర సరఫరాల శాఖ పరిధిలోకి తీసుకోస్తానని చెప్పారు. డబ్బులు లేక కాదు..అసమర్థుల మూలంగా రాష్ట్రంలో పనులు ఆగిపోయాయని పేర్కొన్నారు. యూరియా కోసం పోలీస్‌స్టేషన్లకు వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడిందని, ఐదారు లాఠీ దెబ్బలు తింటేనే ఒక బస్తా దొరికే దుస్థితి ఏర్పడిందని మండిపడ్డారు. "ఒక బల్బు, టీవీ, ఫ్యాన్ ఉన్న ఇంటికి కరెంట్ బిల్లు వెయ్యి రూపాయలు వస్తోంది.

మనం ఏమైనా వ్యాపారం చేస్తున్నామా.. తమ్ముళ్లూ...'' అని చంద్రబాబు ప్రశ్నించారు. అసమర్థ కాంగ్రెస్ పాలనలో అన్నింటికీ హాలిడేనేనని వ్యాఖ్యానించారు. కోమటిరెడ్డి బ్రదర్స్‌కు చెందిన సుశీ హైటెక్ కంపెనీకి అర్హత లేకున్నా.. వేలకోట్ల రూపాయల పనులు అప్పగించి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి వందల కోట్లలో ముడుపులు తీసుకున్నారని ఆరోపించారు. తొమ్మిదేళ్ల నరకాసుర పాలనలో రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి దాపురించిందని ఆయన పేర్కొన్నారు.

అయ్యా! కరెంటు లేదు.. కొలువులూ లేవు
" అయ్యా! మా ఊరికి రోడ్డులేదు. ఊళ్లో కరెంటు లేదు. ఎండాకాలం తాగు నీరు దొరకదు. చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు లేవు. మీరైనా మా కష్టాలు తీర్చండి'' అని చిలుకూరు మండలం సీత్లాతండాకు చెందిన ప్రజలు చంద్రబాబుకు తమ గోడు విన్నవించారు. కరెంట్ లేక నారు ఎండిపోయిందని బదావత్ హచ్చు వాపోయాడు. చంద్రబాబు ఆ నారుని పీకి పరిశీలించారు.

అటుగా వస్తూ గీతకార్మికుల సమస్యలు తెలుసుకున్నారు. స్థానిక మహిళ భీమ్లి ఊరి కష్టాలను, ఇంటి కష్టాలనూ కలిపేసి గొల్లుమంది ఊరికి రోడ్డు, కొడుకులకు జాబులేదని ఆవేదన వ్యక్తం చేసింది. డీఎస్సీ ద్వారా ఎస్జీటీ పోస్టులు కల్పించాలని కృష్ణమూర్తి అనే నిరుద్యోగి వేడుకున్నారు. బీఎడ్‌లకు ఎస్జీటీలుగా ఉద్యోగ అవకాశం కల్పిస్తామని, ఉద్యోగం వచ్చేవరకు నిరుద్యోగ భృతి అందిస్తామని ఆయనను చంద్రబాబు ఊరడించారు.

అవినీతిపై 'ఫేస్‌బుక్' పోరాటం.. యువతకు పిలుపు

ఫ్లోరైడ్ మహమ్మారి పేరు వింటే మొదట వణికిపోయేది నల్లగొండ ప్రజలే. ఎంతోమంది అ మాయకులు అంగవైకల్యం కోరల్లో చిక్కుకుపోయిన జిల్లా ఇది. చినబొక్యాతండా సమీ పం లో కొందరు ఆడపడుచులు కనిపించారు. చూస్తే వాళ్లంతా వికలాంగులు. వారిని చూ డగానే ఫ్లోరైడ్ దారుణాలు కళ్లముందు కదలాడాయి. కష్ణమ్మ తలాటునే ఉన్నా ఇదేం దుర్గ తో! సాగర్ ఎడమకాలువ ఒడ్డునే ఉన్నా, సాగునీటికి కటకటమంటున్న ప్రాంతాలెన్నింటినో నా యాత్రలో పలకరించాను.

కొన్ని గ్రామాలకు పొలిమేర వరకు కృష్ణాజలాలు చేరినా పంపిణీ వ్యవస్థ లేక ప్రజల గొంతుక తడవడం లేదు. నా హయాంలో జిల్లాలోని ప్రతి పల్లెకూ కృష్ణా జలాలను అందించాలని, ఫ్లోరైడ్ సమస్యను శాశ్వతంగా నిర్మూలించాలని తపించాను. కొంతమేర సఫలమయ్యాను కూడా. ఆ తరువాత తొమ్మిదేళ్లు గడిచాయి. నా తరువాత వచ్చినవాళ్ల్ల నిర్వాకంతో చిన్నపుండు కాస్తా ఇప్పుడు రాచపుండైంది.

సీత్లాతండా సమీపంలో ఓ పొలంలోకి వెళ్లాను. రెండో పంట కోసం నారుమడి పోశానంటూ పొలమంతా తిప్పి చూపించాడు కోటయ్య. అదంతా ఎండిపోయి కనిపించింది. కృష్ణా ఎడమ కాలువ పాదాల చెంత ఉన్న భూములకూ ఈ గతేమిటో? అదే విషయాన్ని అడిగాను.

" సార్..గత ఏడాది సాగర్ కాలువ లైనింగ్ పనులన్నారు. నీళ్లు ఇవ్వలేదు. ఇప్పుడేమో సాగర్‌లో నీళ్లేం లేవంటున్నారు. ఈసారీ నీళ్లూ లేనట్టేనని చెబుతున్నారు. ఇక కాలువలపై ఆశలు వదులుకొని బోరుబావులపై ఆధారపడదామని చూశాం. కానీ, కరెంటేదీ? బోరు కోసం లక్ష రూపాయల దాకా ఖర్చుచేశాను. మరింకెంత పెట్టాలో?'' అని కోటయ్య వాపోయాడు.

పొలం గట్లమీదగా నడిచి రోడ్డెక్కిన నాకు ఒక ఉపాధ్యాయ బృందం ఎదురుపడింది. పీఆర్సీని వేయించాలని వేడుకుంది. టీచర్ బదిలీలు సైతం పలుకుబడి ఉన్నవారికే జరుగుతున్నాయట. నా హయాంలో కౌన్సెలింగ్ పెట్టి ఒక పద్ధతి లో బదిలీ చేసిన విధానాన్ని వారంతా గుర్తుచేశారు. పలుకుబడి లేదంటే పైసలు ఉంటేనే ఇప్పుడు పనులవుతున్నాయని వాపోయారు. మడి నుంచి బడిదాకా కష్టమొక్కటే కదా!

బడి నుంచి మడి దాకా ఒకటే కష్టం!

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు కోమటిరెడ్డి బద్రర్స్‌పై విమర్శనాస్త్రాలు సంధించారు. వారి వ్యవహారశైలిని ఎండగట్టారు... వైఎస్ జమానాలో అవినీతికి వారు మచ్చుతునకలు గా పేర్కొన్నారు. వారి ముగ్గురి అవినీతిని విక్రమార్కుడు, భేతాళుడు కథ రూపంలో పలు సభల్లో వివరించి ప్ర జలను ఆకట్టుకున్నారు. పాదయాత్ర మూడోరోజు, శనివారం ఆయన పలుసభల్లో మాట్లాడుతూ 'ఈ ఇద్దరు సో దరుల్లో ఒకరు మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే. మరొకరు ఎంపీ... వారికి సు శీ హైటెక్ అనే అర్హతలేని కంపెనీ ఉం ది.

రాజావారు తలుచుకుంటే కొరడా దెబ్బలకు కరవా..! అన్నట్టు వైఎస్ రా జశేఖర్‌రెడ్డి అర్హత, గిర్హత పక్కనపెట్టి సుశీ కంపెనీకి రూ. 2,600కోట్ల విలువై న పనులు కట్టబెట్టారు. అందులో రా జావారికి రూ.200 కోట్లు ముడుపులు ముట్టాయి. రూ.300 కోట్లకు మిడ్‌మానేరు డ్యాం మట్టిపని చేపట్టి రూ.100 కోట్లు మిగుల్చుకున్నారు. రూ. 750 కో ట్ల విలువైన చేవెళ్ల - ప్రాణహిత ప్రాజె క్టు పనులకు సంబంధించి అడ్వాన్సు లు తీసుకుని పనిచేయడం లేదు' చం ద్రబాబు ఆరోపించారు. తమ అవినీతి సంపాదనలో 10 శాతం ఖర్చు పెడితే గెలుస్తామని కోమటిరెడ్డి బ్రదర్స్ అనుకుంటున్నారని చంద్రబాబు చెప్పారు. వైఎస్ జమానాలో పెంచి పోషించిన అవినీతికి కోమటిరెడ్డి బ్రదర్స్ ఒక మ చ్చుతునకగా ఆయన అభివర్ణించారు.

సాగర్ ప్రాజెక్టు నుంచి నీళ్లు ఇవ్వడంలేదని, ఏమైనా తమాషాగా ఉం దా... అంటూ నీరు ఇవ్వకపోతే ప్రభుత్వాన్ని స్తంభింపజేస్తామని చంద్రబా బు హెచ్చరించారు. నీరు, విద్యుత్ ఇ వ్వలేని ప్రభుత్వం పక్కకు తప్పుకోవాలని డిమాండ్ చేశారు. మనం మౌనం గా ఉంటే ప్రభుత్వాలు ధరలు పెంచుకుంటూ పోతాయని హెచ్చరించారు. లంబాడ భాష నేర్చుకోవాలని ఉందని, నెలరోజులు మీ మధ్య ఉంటే ఆ భాష నేర్చుకుంటానని సీత్లాతండా వాసుల తో చంద్రబాబు అన్నారు. ఒక పక్క సా గర్ నీళ్లు రాక, మరోపక్క కరెంట్‌లేక పంటలన్నీ ఎండిపోయాయని, ఆత్మహత్యలు తప్ప మరోమార్గం లేదని రై తులు అంటుంటే గుండె కదిలిపోతోందని టీడీపీ అధినేత వాపోయారు.

రా ష్ట్రంలో తొమ్మిది సంవత్సరాలుగా నరకాసుర పాలన సాగుతోందనిన్నారు. యూరియా కోసం పోలీస్‌స్టేషన్‌కు వె ళ్లాల్సిన దుస్థితని, గట్టిగా డిమాండ్ చే స్తే లాఠీ దెబ్బలు రుచిచూపిస్తున్నారని దుయ్యబట్టారు. కరెంట్ ఎప్పుడు వ స్తుందో, ఎప్పుడు పోతుందో కాంగ్రెస్ దొంగలకే తెలుసని వ్యాఖ్యానించారు. 'కొత్తగ్యాస్ కనెక్షన్ తీసుకోవాలంటే రూ. ఏడువేలు చెల్లించాల్సిన దౌర్భా గ్యం. కేంద్రం పెన్షన్‌ల కింద రూ. 400 ఇస్తే కిరికిరి రెడ్డి రూ. 200 ఇస్తూ మరో రూ. 200నొక్కేస్తున్నారు' అని ఆరోపించారు. తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి గా ఉన్న సమయంలో నారాయణపు రం గ్రామానికి వచ్చి పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించడం, అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించడం తనకు ఇం కా గుర్తుందన్నారు.

నారాయణపురం గ్రామం టీడీపీకి కంచుకోటని కితాబిచ్చారు.

త న హయాంలో చక్కెర ధర రూ.20 ఉండగా ప్రస్తుతం అది 80కు చేరిందని, అన్ని రేట్లు హెచ్చడంతో పండుగలకు పిండి వంటలు చేసే పరిస్థితి లే కుండాపోయిందన్నారు. ఒక్క కుటు ంబంలో పెద్ద కొడుకు స్థిరపడితే ఆ కు టుంబం అంతా ఎంతో ఆనందంగా ఉ ంటుందని, అదే రీతిలో మీరు ఆదరిం చి గెలిపిస్తే పెద్ద కొడుకుగా ఉండి మీ రుణం తీర్చుకుంటానని చంద్రబాబు చెప్పారు. తమ హయాంలో 11సార్లు డీఎస్సీ వేసి వేల ఉద్యోగాలు ఇస్తే, కాం గ్రెస్ హయాంలో రెండు సార్లు మాత్ర మే డీఎస్సీ నిర్వహించారని విమర్శించారు.

'వైఎస్ అవినీతికి కోమటిరెడ్డి బ్రదర్స్ మచ్చుతునక'

కోదాడ, వస్తున్నా ... మీకోసం పా దయాత్ర కోదాడ మండలంలో శనివారం ప్రజల నీరాజనం మధ్య కొనసాగింది. మండలంలోని పంతుల్‌తండా, బీక్యాతండా, రామలక్ష్మీపురం, యర్రవరం, గణపవరం, తొగర్రాయిల నుంచి బసవరకు సాగిన పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పలికారు. డప్పు వాయిద్యాలు, కోలాటా లు, గిరిజన సంప్రదాయ నృత్యాలు, మేళతాళాలు, మంగ ళహారతులతో పల్లెవాసులు బాబును ఆదరించి సాదరస్వాగతం పలికారు. నారాయణపురం, బీక్యాతండా మధ్య వివిధ జిల్లాల, ని యోజకవర్గాల నుంచి వచ్చిన వందలా ది మంది కార్యకర్తలు, నాయకులు బా బును కలిసి తమ సంఘీభావం ప్రకటించారు.

మిర్యాలగూడకు చెందిన ప లువురు టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు గార్లపాటి నిరంజన్‌రెడ్డి ఆధ్వర్యం లో టీడీపీలోకి చేరారు. వారికి బాబు కండువాలను కప్పి పార్టీలోకి ఆహ్వాని ంచారు. హుజూర్‌నగర్ నియోజకవర్గానికి చెందిన అయిదు వందల మంది సాఫ్ట్‌వేర్ విద్యార్థులు పార్టీ రాష్ట్ర కార్యదర్శి చావా కిరణ్మయి ఆధ్వర్యంలో బా బు మాస్క్‌లతో రోడ్డు వెంట నిలబడి సాదరస్వాగం పలికారు. ప్రస్తుత పాలనలో సాఫ్ట్‌వేర్‌రంగం నిర్వీర్యమై ఉపా ధి లేకుండా పోయిందని బాబు దృష్టికి తీసుకెళ్లారు. బాబు 2.30గంటలకు పా దయాత్రకు బ్రేక్ ఇచ్చి 2గంటల పాటు విశ్రాంతి తీసుకున్నారు. విశ్రాంతి తీ సుకున్న అనంతరం పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన నాయకులతో సమీక్ష నిర్వహించారు.

మఠంపల్లి మండలం మేరీమాతా బృందం కోలాటం వేస్తుండగా కోదాడ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్‌రావు, పాల్వాయి రజనీకుమారి, చావా కిరణ్మయి, బండ్రు శోభారాణి బృందం తో కలిసి వేసిన కోలాటం కార్యకర్తలు, అభిమానులను ఆకట్టుకుంది. విశ్రాం తి అనంతరం సాగిన పాదయాత్రలో బాబుకు హైద్రాబాద్‌కు చెందిన అస్లా మ్ దట్టి కట్టారు. విజయవాడకు చెం దిన కొందరు ముస్లింలు రోడ్డుపైన బా బుకు టోపీ ధరింపచేసి ఖురాన్ చదివి ఆశీర్వదించారు. అనంతరం 4.30 గం టలకు ప్రారంభమైన పాదయాత్ర గిరిజన తండాలైన పంతుల్‌తండాకు చేరుకోగానే గిరిజన సంప్రదాయ గీతాలతో బాబుకు స్వాగతం పలికి కోడిపుంజును బహూకరించారు. అక్కడ వారితో ము చ్చటించి ముందుకు సాగిన బాబు బీ క్యాతండా వద్ద గిరిజన స్వాగతాన్ని స్వీ కరించారు.

పూలదండలతో ఆయనకు స్వాగతం పలికిన గిరిజనులు తమకు సాగర్ నీరు రాక తీవ్రంగా ఇబ్బంది ప డుతున్నామని తెలిపారు. టీడీపీ ప్రభు త్వం అధికారంలోకి వస్తే అన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుందని, త మ పార్టీని ఆశీర్వదించాలని ఆయన పే ర్కొన్నారు. అనంతరం రామలక్ష్మీపు రం క్రాస్‌రోడ్డు వరకు యాత్ర కొనసాగ గా రామలక్ష్మీపురానికి చెందిన వందలాది మంది ఎదురెళ్లి ఆయనకు మంగళహారతులతో స్వాగతం పలికారు. అ క్కడ పార్టీ జెండాను ఆవిష్కరించిన అ నంతరం జరిగిన బహిరంగ సభలో బాబు ప్రసంగించారు. సాగర్‌నీరు ఇ వ్వలేని ప్రభుత్వాన్ని తరిమికొట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. అనంతరం గణపవరం వరకు సాగినయాత్రతో ఎ ర్రవరం క్రాస్‌రోడ్డు వద్ద ముదిరాజ్‌లు ఆయన్ని సన్మానించారు. ముదిరాజ్‌ల ను బీసీ 'ఏ'లో చేర్చాలని వారు విజ్ఞప్తి చేయగా వారికి హామీ ఇచ్చి ముందుకు సాగారు.

గణపరం క్రాస్‌రోడ్డుకు చేరుకున్న బాబు బహిరంగ సభలో ప్రసంగిస్తూ సాగునీటి విషయంలో కిరణ్ స ర్కారు అవలంబిస్తున్న వైఖరిపై నిప్పు లు చెరిగారు. ఈ పాదయాత్రలో ఆ యనవెంట టీడీపీ నాయకులు మో త్కుపల్లి నర్సింహులు, వేనేపల్లి చందర్‌రావు, బీల్యానాయక్, రజనీకుమారి, సత్తయ్యగౌడ్, చావా కిరణ్మయి, నిరంజన్‌రెడ్డి, బండ్రు శోభారాణి, బొల్లం మల్లయ్యయాదవ్, పార సీతయ్య, పు ల్లూరి అచ్చయ్య, ఓరుగంటి బ్రహ్మం, పొలిశెట్టి బ్రహ్మం, పాలూరి, షఫీ, గం ధం పాండు, స్థానిక, స్థానికేతర, వివిధ జిల్లాల నాయకులు పాల్గొన్నారు.

అడుగడుగునామ అపూర్వ స్వాగతం

టీడీపీ అధినేత చం ద్రబాబునాయుడు చేపట్టిన మీకోసం పాదయాత్ర కోదాడ చేరుకున్న సందర్భంగా దేవరకొండ మండలం నుంచి టీడీపీ నాయకులు, కార్యకర్తలు శనివా రం భారీగా వాహనాల్లో తరలి వెళ్లా రు. పట్టణంలో భారీ వాహనాలతో ర్యాలీ నిర్వహించి ఊరేగింపుగా వె ళ్లారు. ఈ సందర్భంగా టీడీపీ జిల్లా నాయకుడు కడారి అంజయ్యయాదవ్, మండల పార్టీ అధ్యక్షుడు హన్మంతు వెంకటేష్‌గౌడ్ మాట్లాడారు. బాబు పాదయాత్రకు కోదాడ నియోజకవర్గం లో మంచి స్పందన ఉందన్నారు. త రలి వెళ్లిన వారిలో టీడీపీ నాయకులు వశ్యానాయక్, గాజుల రాజేష్, జానీబాబా, కొలుకులపల్లి గెల్వయ్య, ఇ మ్రాన్, ఎన్ఎన్.చారి, అబ్ధుల్లా పాల్గొన్నారు.

డిండి మండలం నుంచి చంద్రబాబు యాత్రకు కోదాడకు శనివారం వాహనాలతో భారీగా తరలి వెళ్లారు. టీడీపీ జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి గుర్రం రాములు, మండల పార్టీ అధ్యక్షుడు దొంతినేని భగవంతరావు ఆధ్వర్యంలో మండలంలోని నాయకులు, కార్యకర్తలు మండల కేంద్రంతో పాటు దేవరకొండలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం కోదాడకు తరలి వెళ్లిన వారిలోపోలం శ్రీను, ఖలీల్, సుధాకర్, కోటయ్య, కుక్కడాల శ్రీను, పురుషోత్తం పాల్గొన్నారు.

పాదయాత్రలో అరుణ్‌కుమార్

హాలియా : మీ కోసం పాద యాత్రలో మూడో రోజు నాగార్జున సాగర్ నియోజకవర్గానికి చెంది న రాష్ట్ర లీగల్ సెల్ కార్యదర్శి మువ్వా అరుణ్‌కుమార్ పాదయాత్రలో పా ల్గొని సంఘీభావం తెలిపారు. శుక్ర వారం తేరా చిన్నపరెడ్డి ఆధ్వ ర్యంలో నాగార్జునసాగర్ నియోజ కవర్గం నుం చి భారీ ర్యాలీతో వాహనాల్లో కార్య కర్తలు తరలి వెళ్లారు.

పాదయాత్రకు తరలిన టీడీపీ నేతలు