January 15, 2013తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు వస్తున్నా... మీ కోసం పాదయాత్ర 17వ తేదీ ఉదయం నల్లగొండ జిల్లాలోకి ప్రవేశించి 18,19, 20,21 ఐదురోజుల పాటు పాదయా త్ర కొనసాగుతుందని టీడీపీ నల్లగొండ జిల్లా అ ధ్యక్షుడు బీల్యానాయక్, కోదాడ ఎమ్మె ల్యే వేనేపల్లి చందర్‌రావు తెలిపారు. చందర్‌రావు నివాసం లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు పర్యటన వివరాలను వెల్లడించారు. 16 రాత్రికి ఖమ్మం జిల్లా పై నంపల్లి బ్రిడ్జివద్దకు పాదయాత్ర చేరుకుని పైనంపల్లి వద్ద బస చేస్తారు.

17 ఉదయం ఖమ్మం జిల్లాలోనే 3కిలోమీటర్ల పాదయాత్ర కొనసాగి 10 గంటల సమయంలో నల్లగొండ జిల్లాలోకి ప్రవేశించి పాదయాత్ర శాంతినగ ర్ మీదుగా ప్రారంభమవుతుంది. మొ దటిరోజు శాంతినగర్, మొగలాయి కో ట,అనంతగిరి, అనురాగ్ కళాశాల, ఖా నాపురం నుంచి 10కిలోమీటర్ల పాదయాత్రతో కోదాడ సమీపంలోని కిట్స్ ఇంజనీరింగ్ కళాశాలకు చేరుకుని రా త్రి అక్కడ బస చేస్తారు.

18వ తేదీ ఉదయం కోదాడకు చే రుకుని మేకల అభినవ్ రోడ్ మీదుగా సబ్‌స్టేషన్ నుంచి ఖమ్మం క్రాస్‌రోడ్‌లో ఏర్పాటుచేసిన ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు.

అదేరోజు ఎన్టీఆర్ వర్ధంతి కావడంతో ఆయన అక్కడే నివాళులర్పి ంచి సంతాపసభ ని ర్వహిస్తారు. అనంతరం పట్టణంలో నాగార్జున సెంటర్ మీదుగా హరిజన వాడ నుంచి వ్యవసాయ మార్కెట్ కార్యాలయం వరకు చేరుకుని అక్కడి నుంచి బాలాజీనగర్, చిలుకూరు, దూదియాతండా వరకు యాత్ర కొనసాగుతుంది. రాత్రి చిలుకూరు మండలంలోని దూదియాతం డా- సీతల్‌తండాల మధ్య 16 కిలోమీ టర్లు పూర్తి చేసి బస చేస్తారు.

19వ తేదీ ఉదయం సీతారామపురం, నారాయణపురం మీదుగా కో దాడ మండలంలోని భీక్యాతండా, రా మలక్ష్మిపురం, గణపవరం, తొగర్రాయి స్టేజీల మీదుగా గుడిబండకు చేరుకుని అక్కడ ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరిం చి వెనుతిరిగి కాపుగల్లు క్రాస్‌రోడ్డు వర కు 16కి.మీ. పూర్తి చేసి బస చేస్తారు.

20వ తేదీ ఉదయం క్రాస్‌రోడ్డు నుంచి కాపుగల్లుకు చేరుకుని ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్మించిన ఎన్టీఆర్ సృజల శ్రవంతి రక్షిత మంచినీటి పథ కం, ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తా రు. అనంతరం రెడ్లకుంట, నల్లబండగూడెం మధ్య 8కిలోమీటర్లు పాదయా త్ర పూర్తి చేసి అక్కడే ఉన్న రిక్విన్ పరిశ్రమ వద్ద బస చేస్తారు.

21వ తేదీ సోమవారం ఉదయం గరికపాడు బ్రిడ్జి వరకు సాగి కృష్ణా జి ల్లాలోకి పాదయాత్ర ప్రవేశిస్తుంది.

చద్రబాబు పాదయాత్ర నల్లగొండ జిల్లా మొ త్తంమీద కోదాడ నియోజకవర్గంలోని రెండు మండలాలకే పరిమితమై కృష్ణా జిల్లాకు చేరుకుంటుంది.

మొత్తం 5రోజుల పర్యటనలో 2 మ ండలాల్లో 22 గ్రామాలతో పాటు మరో 3 శివారు గ్రామాలతో 50కి.మీ. పాదయాత్ర కొనసాగుతుందని బీల్యానాయక్, వేనేపల్లి తెలిపారు. ఈ పర్యటన పూర్తిగా సమాలోచనలు జరిపి పార్టీ రాష్ట్ర నాయకత్వ అనుమతితో ఖరారు చేసినట్లు తెలిపారు. ఈ రూట్‌మ్యాప్ ను పాదయాత్ర ఆర్గనైజర్, పార్టీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి కమ్మంపాటి రామ్మోహన్‌రావు, మొద్దులూరి వెంకటేశ్వరరా వు  పరిశీలించి ఖరారు చేసిన ట్లు వారు తెలిపారు. సమావేశంలో టీ డీపీ నల్లగొండ జిల్లా నాయకులు ఐలయ్యయాద వ్, పార సీతయ్య, తొండపు భాస్కర్‌రా వు, ఓరుగంటి ప్రభాకర్, బొల్లం మల్లయ్యయాదవ్, అజేయ్‌కుమార్, అచ్చ య్య, ఆదినారాయణ, కృష్ణయ్య, బ్ర హ్మం, సైదానాయక్ పాల్గొన్నారు.చంద్రబాబు నిర్వహించనున్న వ స్తున్నా....మీకోసం పాదయాత్ర రూట్ ను పాదయాత్ర ఆర్గనైజర్, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కంభంపాటి రామ్మోహన్‌రావు, మొద్దులూరి వెంకటేశ్వరరా వు, టీడీపీ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు బీల్యానాయక్, ఎమ్మెల్యే వేనేపల్లి చందర్‌రావు లు శనివారం పరిశీలించారు. శాంతినగర్ నుంచి అనంతగిరి, ఖానాపురం, కోదాడ, చిలుకూరు మండలంలోని ఆ యా గ్రామాల రహదారులను వారు ఈ సందర్భంగా పరిశీలించి రూట్‌మ్యాప్‌ను రూపొందించారు.

17 నుంచి 21 వరకు నల్లగొండ జిల్లాలో బాబుయాత్ర

రాష్ట్రప్రభుత్వం విద్యుత్ చార్జీలు పెంచడాన్ని నిరసిస్తూ హనుమాన్ జంక్షన్ విద్యుత్ సబ్‌స్టేషన్ వద్ద భోగిమంటలు వేసి టీడీపీ నేతలు వినూత్న నిరసన తెలియజేశారు.కృష్ణా జిల్లా తెలుగు రైతు అధ్యక్షుడు చలసాని ఆంజనేయులు నాయకత్వంలో నాయకులు, కార్యకర్తలు హనుమాన్ జంక్షన్ విద్యుత్‌సబ్‌స్టేషన్ వద్దకు చేరుకుని ధర్నా నిర్వహించారు. ప్రభుత్వం పెంచిన విద్యుత్ చార్జీలు తగ్గించాలని, సర్‌చార్జీ పూర్తిగా ఎత్తివేయాలని నినాదాలు చేశారు. అనంతరం టీడీపీ నేత లు భోగి మంటలు వేసి అందులో ముఖ్యమంత్రి దిష్టిబొమ్మను పడేసి దహనం చేశారు. భోగిమంటల్లో విద్యుత్ మంటలు చెలరేగుతున్నాయని, విద్యుత్ చార్జీల విషయంలో దిగిరాకపోతే ప్రభుత్వ పతనం తప్పదని టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

టీడీపీ మహిళా కార్యకర్తలు కూడా పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొనటం విశేషం.కృష్ణా జిల్లా తెలుగురైతు నేత చలసాని మాట్లాడు తూ 13 వేల కోట్ల భారాన్ని సామాన్య ప్రజలపై మోపాలని చూస్తున్న రాష్ట్రప్రభుత్వం ఆ భారాన్ని తానే మోయాలని డిమాండ్ చేశారు.పేదవర్గాల పై పెనుభారం మోపే పరిస్థితి కల్పించటం ప్రభుత్వానికి తగదని చలసాని అన్నారు. కరెంటు బిల్లులు కట్టకుండా ప్రభుత్వం పై పోరాడాలని చలసాని పిలుపు నిచ్చారు. టీడీపీ నేతలు కలపా ల జగన్‌మోహన్‌రావు, శివయ్య, చల్లపల్లి జగదీష్, చొదిమెళ్ళ ఏసుపాదం, మజ్జిగ నాగరాజు, కొతనం చిన్ని, నిమ్మకూరి మేరిమ్మ తదితరులు పాల్గొన్నారు.
హనుమాన్ జంక్షన్ : రాష్ట్రప్రభుత్వం విద్యుత్ చార్జీలు పెంచడాన్ని నిరసిస్తూ హనుమాన్ జంక్షన్ విద్యుత్ సబ్‌స్టేషన్ వద్ద భోగిమంటలు వేసి టీడీపీ నేతలు వినూత్న నిరసన తెలియజేశారు. జిల్లా తెలుగు రైతు అధ్యక్షుడు చలసాని ఆంజనేయులు నాయకత్వంలో నాయకులు, కార్యకర్తలు హనుమాన్ జంక్షన్ విద్యుత్‌సబ్‌స్టేషన్ వద్దకు చేరుకుని ధర్నా నిర్వహించారు. ప్రభుత్వం పెంచిన విద్యుత్ చార్జీలు తగ్గించాలని, సర్‌చార్జీ పూర్తిగా ఎత్తివేయాలని నినాదాలు చేశారు. అనంతరం టీడీపీ నేత లు భోగి మంటలు వేసి అందులో ముఖ్యమంత్రి దిష్టిబొమ్మను పడేసి దహనం చేశారు. భోగిమంటల్లో విద్యుత్ మంటలు చెలరేగుతున్నాయని, విద్యుత్ చార్జీల విషయంలో దిగిరాకపోతే ప్రభుత్వ పతనం తప్పదని టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

టీడీపీ మహిళా కార్యకర్తలు కూడా పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొనటం విశేషం. కృష్ణా జిల్లా తెలుగురైతు నేత చలసాని మాట్లాడు తూ 13 వేల కోట్ల భారాన్ని సామాన్య ప్రజలపై మోపాలని చూస్తున్న రాష్ట్రప్రభుత్వం ఆ భారాన్ని తానే మోయాలని డిమాండ్ చేశారు.పేదవర్గాల పై పెనుభారం మోపే పరిస్థితి కల్పించటం ప్రభుత్వానికి తగదని చలసాని అన్నారు. కరెంటు బిల్లులు కట్టకుండా ప్రభుత్వం పై పోరాడాలని చలసాని పిలుపు నిచ్చారు. టీడీపీ నేతలు కలపా ల జగన్‌మోహన్‌రావు, శివయ్య, చల్లపల్లి జగదీష్, చొదిమెళ్ళ ఏసుపాదం, మజ్జిగ నాగరాజు, కొతనం చిన్ని, నిమ్మకూరి మేరిమ్మ తదితరులు పాల్గొన్నారు.

విద్యుత్ చార్జీల పెంపుపై టీడీపీ వినూత్న నిరసన కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్ సబ్ స్టేషన్ వద్ద భోగి మంట 

'వస్తున్నా .. మీకోసం'లో భాగంగా ఈ నెల 21వ తేదీన కృష్ణా జిల్లాకు చంద్రబాబు పాదయాత్ర చేరుకుంటుంది. ఈ సందర్భంగా విజయవాడ పరిధిలోని మూడు నియోజకవర్గాలనూ చుట్టేలా రూట్ మ్యాప్ తయారు చేసే పనిలో అర్బన్ నాయకులు ఉన్నారు. ఖమ్మంలో వచ్చిన స్పందన చూసి చంద్రబాబు యాత్రను ప్రజలకు మరింత చేరువుగా తీసుకువెళ్ళాలన్న ఆలోచనలు స్థానిక నాయకులు ఉన్నారు. ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం చంద్రబాబు ఒక్కరోజు ఉండటమే గగనం అనుకుంటున్న తరుణంలో రెండు రోజుల పాటు పాదయాత్ర చేయాలని నిర్ణయానికి నాయకులు వచ్చారు. ఈ విషయాన్ని కంబంపాటి రామమోహనరావు పార్టీ వర్గాలకు స్పష్టం చేసినట్టు విశ్వసనీయ సమాచారం. చంద్రబాబు రెండ విడతలుగా కృష్ణా జిల్లాలో పాదయాత్రను నిర్వహించటానికి వీలుగా కృష్ణా జిల్లా పార్టీ సన్నాహాలు చేస్తుంది. తొలి విడతలో జగ్గయ్యపేట, ఇబ్రహీంపట్నం మీదుగా నగరంలోకి బాబు ప్రవేశిస్తారు.

ఈ సందర్భంలో కుమ్మరిపాలెం సెంటర్ నుంచి ప్రకాశం బ్యారేజి మీదుగా పాదయాత్రను చేసుకుంటూ గుంటూరు జిల్లా వెళతారు. అంటే ఒక్క పశ్చిమ నియోజకవర్గంలో మాత్రమే కవర్ అవుతుందన్న మాట. రెండో విడత షెడ్యూల్ నగరంలోకి ప్రవేశిస్తుందా ? లేదా ? అన్నదానిపై ఇంకా నిర్ణయం చేయాల్సి ఉంది. ఈ సమయంలో అర్బన్ పార్టీ మొదటిసారగా బాబు వస్తున్న సందర్భంలో కొద్ది గంటలు పాదయాత్ర నిర్వహించే కంటే కూడా ఒక రోజంతా నగరంలోనే పాదయాత్ర సాగేలా ప్రణాళికలు రూపొందించాలని నిర్ణయించారు. అందుకు మూడు నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నట్టు తెలుస్తోంది. అర్బన్ పార్టీ అధ్యక్షులు వల్లభనేని వంశీమోహన్ కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నారు. చంద్రబాబు ప్రసంగాన్ని నగర ప్రజల్లోకి తీసుకు వెళ్ళాలంటే మూడు నియోజకవర్గాలను కలుపుకుంటూ పాదయాత్ర జరగాలన్నది తమ అభిమతమని వంశీ చెప్పారు.

ఇంతలో చంద్రబాబు కూడా రెండు రోజుల పాటు అవకాశాన్ని చంద్రబాబు కల్పించటంతో అర్బన్ నాయకులు రూట్‌మ్యాప్‌ను ఖరారు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఎక్కడెక్కడ బహిరంగ సభలు నిర్వహించాలన్న దానిపై సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. పశ్చిమ నుంచి సెంట్రల్‌కు తిరిగి అక్కడి నుంచి తూర్పుకు ప్రవేశించిన తర్వాత ప్రకాశం బ్యారేజీ మీదుగా గుంటూరు చేరుకునేలా రూట్‌మ్యాప్ రూపొందిస్తున్నట్టు తెలుస్తోంది.

విజయవాడలో బాబు పాదయాత్ర ఇలా..?నగరంలో బాబు పాదయాత్రకు సంబంధించిన రూట్‌మ్యాప్ ఇలా ఉన్నట్టు తెలుస్తుంది.

గొల్లపూడి నుంచి బాబు నగరంలోకి ప్రవేశిస్తారు. అక్కడి నుంచి కుమ్మరి పాలెం, చిట్టినగర్, ఎర్రకట్ట మీదుగామధ్య నియోజకవర్గంలోకి ప్రవేశిస్తారు. 22 వ డివిజన్‌లోని న్యూ రాజరాజేశ్వరిపేట, సింగ్‌నగర్, బుడమేరు వంతెన, ప్రభుత్వ ముద్ర ణాలయం మీదుగా సత్యనారాయణపురంలోకి ప్రవేశిస్తారు.అక్కడ నుంచి చుట్టుగుంట మీదుగా తూర్పు నియోజకవర్గంలోకి బాబు పాదయాత్ర చేరుకుటుంది.

బాబు పాదయాత్ర బెజవాడలో రెండు రోజులు! 
వస్తున్నా మీకోసం పాదయాత్రలో భాగంగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కృష్ణా జిల్లా పర్యటన కొద్ది రోజులు ఆలస్యం కానున్నది. ఈ కార్యక్రమంలో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ నెల 21 నుంచి పాదయాత్ర ఉంటుందని చెపుతున్నారు.

 'వస్తున్నా మీకోసం' పాదయాత్రలో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కృష్ణా జిల్లా పర్యటన కొద్ది రోజులు ఆలస్యం కానున్నది. ఈ కార్యక్రమంలో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. ఇంకా పర్యటన రూట్ మ్యాప్ ఖరారు కాలేదు.కృష్ణా జిల్లాలో ఈ నెల 21 నుంచి పాదయాత్ర ఉంటుందని టీడీపీ నాయకులు చెపుతున్నారు. తొలుత చంద్రబాబు ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం వల్లభి నుంచి ఈ నెల 17న జగ్గయ్యపేట మండలం గండ్రాయి వద్ద కృష్ణా జిల్లాలో ప్రవేశిస్తారని భావించారు.

కానీ పర్యటనలో స్వల్ప మార్పులు జరిగి 21 న కృష్ణా జిల్లాలోకి ప్రవేశిస్తున్నారు. కృష్ణా జిల్లాలో ప్రవేశించే సమయంలో చంద్రబాబుకు భారీగా స్వాగతం పలకాలని టీడీపీ నాయకులు యోచిస్తున్నారు. వల్లభి, గండ్రాయి మార్గం ఇరుకుగా ఉండటంతో భారీ సంఖ్యలో పార్టీ శ్రేణులు తరలిరావటానికి ఇబ్బంది కలుగుతుంది. దీనిని దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు జాతీయ రహదారి మీదుగా కృష్ణా జిల్లాలో ప్రవేశించే విధంగా పర్యటన కార్యక్రమాన్ని నాయకులు ఖరారు చేస్తున్నారు.

బాబు పాదయాత్రలో స్వల్ప మార్పులు