January 3, 2013

కేసీఆర్ పచ్చకామెర్ల రోగి. ఆయనకు లోకమంతా పచ్చగానే కనిపిస్తోంది. వాస్తవా న్ని గ్రహించలేక పోతున్నాడు. టీడీపీ తెలంగాణకు వ్యతిరేకం అఖిల పక్ష సమావేశంలో స్పష్టం గా చెప్పినా వినడం లేదు అని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ద్వజమెత్తారు. పాదయాత్రలో భాగంగా గురువారం సంగెం మండల కేంద్రానికి చేరుకున్నారు. బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ టీఆర్ఎస్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కేసీఆర్ పార్టీ 12 ఏళ్ళవుతోంది. ఇప్పటి వరకు క్యాడర్‌నే పెంచుకోలేనివాడు రేపు ప్రజలకేం సేవచేస్తాడని ప్రశ్నించారు.

టీఆర్ఎస్ ఇప్పటి వరకు ప్రజలను ఎమి ఉద్దరించింది? దే ని మీద పోరాడింది? అని నిలదీసారు. కేసీఆర్ నిజంగా సమర్ధుడైతే తెలంగాణ ఇచ్చేది... తెచ్చే ది తామే అంటున్న కాంగ్రెస్‌పై పోరాడాలి. కానీ ఇందుకు భిన్నంగా తెలంగాణకు అడ్డుచెప్పమని స్పష్టంగా చెబుతున్న టీడీపీనీ టార్గెట్ చేయడం ఎందుకు? అన్నారు.

ప్రజల్లో టీడీపీకి బలం ఉంది. పార్టీకి పటిష్టమైన క్యాడర్ ఉంది. అఖిల పక్ష సమావేశంలో తెలంగాణకు అనుకూలంగా మాట్లాడింది. దీని తో టీఆర్ఎస్ గుండెళ్ళో రైళ్ళు పరుగెడుతున్నా యి అన్నారు. పుట్టగతులు ఉండవని భయపడుతోంది. టీడీపీ సభలకు వచ్చి గొడవలు సృష్టిస్తున్నారని చంద్రబాబు అన్నారు. కేసీఆర్‌కు తెలంగాణపై ఎలాంటి ప్రేమ లేదు. సెంటిమెంట్‌ను అడ్డంపెట్టుకొని రాజకీయం చేస్తున్నాడు. ఆయనకు సీట్లు, ఓట్లు, నోట్లు కావాలి. అది తప్పా వేరే వ్యాపకమే లేద అని విమర్శించారు.

నా రికార్డును బ్రేక్ చేయలేరు...: ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నాయకుడిగా నా ది 20 ఏళ్ళ చరిత్ర. దీనిని ఎవరూ రికార్డు చేయలేదరన్నారు. నా పాదయాత్ర రికార్డును కూడా ఎవరూ అధిగమించలేదరన్నారు. పాదయాత్ర సందర్భంగా చేతి వృత్తులపై ప్రధానంగా దృష్టి సారించారు. వారితో ఎక్కువగా మమేకం అయ్యారు. సమస్యలను అడిగి తెలుసుకున్నా రు. ఉదారంగా వరాలు కురిపించారు. నీరాను పానీయంగా విక్రయించే ఏర్పాటు చేస్తానని చెప్పారు. గీత కార్మికులకు తాడిచెట్ల పెంపకాని కి అయిదు ఎకరాలు ఇస్తానని హామీ ఇచ్చారు. చేతి వృత్తులను కాపాడేందుకు రూ 5వేల కోట్ల ను కేటాయిస్తానన్నారు.

ముదిరాజ్‌ల సంక్షేమానికి రూ 500కోట్లు ప్రత్యేకిస్తానని చెప్పారు. అంతకు ముందు పల్లారిగూడలో కూడా చంద్రబాబు నాయుడు ప్రసంగించారు. సంగెం బహిరంగ సభ తర్వాత తిమ్మాపూర్ వరకు పాదయాత్ర చేశారు. రాత్రి అక్కడే బస చేశారు. టీడీపీ తెలంగాణ ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర్‌రావు, పబ్లిక్ ఎకౌం ట్స్ కమిటీ చైర్మెన్ రేవూరి ప్రశాశ్‌రెడ్డి, ఎమ్మెల్యే సీతక్క, నియోజకవర్గ ఇన్‌చార్జీలు ఈగ మల్లే శం, చల్లాధర్మారెడ్డి బాబు వెంట ఉన్నారు.

పల్లారు గూడలో శిలాపలకం: 1500 కిమీ పాదయాత్ర పూర్తి చేసిన సందర్భంగా బాబు పల్లారుగూడలో శిలాపలకాన్ని ఆవిష్కరించారు. గుర్తుగా మొక్క నాటారు. ఈ సందర్భంగా ఇక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. పల్లారుగూడ సమస్యను ప్రస్తావించారు. వాటి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

కేసీఆర్‌తో ఒరిగేది శూన్యం
వై.ఎస్. రికార్డు బ్రేక్
ఇది చేతకాని ప్రభుత్వం : బాబు

వస్తున్నా మీకోసం పాదయాత్రలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సరికొత్త రికార్డును నమోదు చేశారు. గతంలో 53 ఏళ్ల వయసులో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి చేసిన 1468 కి.మీ పాదయాత్రను చంద్రబాబు బ్రేక్ చేశారు. జిల్లాలో ఏడో రోజు పాదయాత్రలో ఉన్న బాబు దస్రూనాయక్ తండాలో 1500 మైలు రాయిని దాటి ఆ రికార్డును బద్దలు కొట్టారు. దీంతో టీడీపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది.

వస్తున్నా మీకోసం కార్యక్రమంలో భాగంగా బాబు పాదయాత్ర 90 రోజు కొనసాగుతోంది. జిల్లాలో ఏడో రోజు నడకసాగిస్తున్నారు. ఈ సందర్భంగా కిరణ్ సర్కార్‌పై బాబు విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ ఓ చేతగాని ప్రభుత్వమన్నారు. కరెంట్ సరిగా ఇవ్వలేని ప్రభుత్వం సర్‌చార్జీల పేరుతో ప్రజలపై భారం మోపుతోందని వ్యాఖ్యానించారు. రూ.10 వేల కోట్ల భారం వేసేందుకు రంగం సిద్ధమైందని చంద్రబాబు విమర్శించారు.

చంద్రబాబు రికార్డు పాదయాత్రతెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు చేపట్టిన పాదయాత్ర ఈ నెల తొమ్మిదో తేదీ నాటికి వంద రోజులు పూర్తి చేసుకోనుంది. అక్టోబర్ రెండో తేదీన చంద్రబాబు అనంతపురం జిల్లా హిందూపురంలో పాదయాత్ర మొదలు పెట్టిన విషయం తెలిసిందే. ఈ నెల ఎనిమిదో తేదీతో ఆయన వరంగల్ జిల్లాలో తన పర్యటన పూర్తి చేసుకొని ఖమ్మం జిల్లాలో అడుగు పెట్టనున్నారు. ఆ జిల్లాలోని పాలేరు నియోజకవర్గం తిరుమలాయ పాలెం మండలంలో చంద్రబాబు వందో రోజు పాదయాత్ర సాగనుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఉత్సవాలు నిర్వహించాలని టీడీపీ వర్గాలు యోచిస్తున్నాయి.

పాదయాత్ర వంద రోజులకు చేరుకున్న సందర్భాన్ని స్ఫురింపచేస్తూ రాష్ట్రమంతటా వివిధ కార్యక్రమాలు నిర్వహించాలని పార్టీ నేతలు భావిస్తున్నారు. దీనికోసం ఎక్కడికక్కడ స్థానిక నేతలు ముందుకు వస్తున్నారని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. దాంతోపాటు.. ఈ నెల 11న పార్టీ రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. కాగా.. 'పల్లె పల్లెకూ తెలుగుదేశం' నిర్వహణలో వెనకబడి పోయిన ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌ఛార్జులను పిలిపించి మాట్లాడాలని చంద్రబాబు నిర్ణయించారు. సుమారు వంద నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమం చురుకుగా సాగడం లేదని పార్టీ రాష్ట్ర కార్యాలయం ఆయనకు నివేదించింది.

9 నాటికి యాత్రకు వంద రోజులు!
కోర్టుల కోసమే కోటి సంతకాలా?
వీళ్లను చూసి ఢిల్లీ రేపిస్టులూ సంతకాలు సేకరిస్తారు
వరంగల్ జిల్లా పాదయాత్రలో చంద్రబాబు


వైఎస్ జగన్ జైల్లో ఉండి, కోర్టులను ప్రభావితం చేసేందుకు కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టారని టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రంగా ధ్వజమెత్తారు. బెయిల్ కోసం నానా తంటాలు పడి ఇప్పుడు సంతకాల కార్యక్రమాన్ని మొదలుపెట్టారని ఆయన ఎద్దేవా చేశారు.

బుధవారం వరంగల్ జిల్లాలో చంద్రబాబు 'వస్తున్నా... మీ కోసం' పాదయాత్ర ఐదోరోజూ ప్రశాంతంగా సాగింది. పాదయాత్రలో భాగంగా కామారం, పెంచికలపేట, లక్ష్మీపురం గ్రామాల్లో ఆయన ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. "ప్రజాధనాన్ని లూటీ చేసి ఇప్పుడు తమకు అన్యాయం జరిగిందని గగ్గోలు పెడుతున్నారు.. వీరిని చూసి సామూహిక అత్యాచారం చేసిన దుర్మార్గులు కూడా రేపు సంతకాల సేకరణ చేస్తారేమో''నని వ్యాఖ్యానించారు.

హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తున్న సీఎం
ముఖ్యమంత్రి హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని, అవినీతి పరులకు కొమ్ముకాస్తున్నారని చంద్రబాబు విరుచుకుపడ్డారు. టీడీపీ కార్యకర్తలను జైలుకు పంపేందుకు కుట్ర పన్నుతున్నారన్నారు. ఎమ్మెల్యే పరిటాల సునీత కుటుంబాన్ని సోదాల పేరుతో ఇబ్బందులు పెట్టారన్నారు. ఆమె కుమారుడు శ్రీరామ్‌పై తప్పుడుకేసు పెట్టి వేధింపులకు గురిచేస్తున్నారని విమర్శించారు.

మంత్రి ధర్మాన అవినీతిని సీబీఐ నిగ్గుతేల్చినా ఆయన అరెస్టు కాకుండా అడ్డుకుంటున్న ముఖ్యమంత్రి, అన్యాయంగా ఓ ఆడబిడ్డను వేధిస్తున్నారని ధ్వజమెత్తారు. టీడీపీ నేత కోడెల శివప్రసాద్ నాయకత్వంలో ర్యాలీ తీస్తున్న కార్యకర్తలను అన్యాయంగా పోలీసులు చితకబాదారన్నారు. వరంగల్ జిల్లాలో రౌడీ రాజకీయం చేస్తున్న మహిళా ఎమ్మెల్యే భర్తకు రాజశేఖర్‌రెడ్డి గన్‌మెన్‌ను ఇచ్చి భద్రత కల్పిస్తే.. తమ కార్యకర్త ప్రతాప్‌రెడ్డిని హత్య చేశారని అన్నారు. ఆరు గ్రామాల మీదుగా 16.2 కిలోమీటర్ల దూరం మేర చంద్రబాబు పాదయాత్రను కొనసాగించారు.

కాలు నొప్పితో బాబు నడక వేగాన్ని తగ్గించారు. గిర్నిబావి వద్ద రాత్రి బస చేశారు. పాదయాత్ర ప్రారంభం కావడానికి ముందు ఆయన భార్య భువనేశ్వరి, కుమారుడు లోకేశ్, కోడలు బ్రాహ్మణి వచ్చి ఆయనతో రెండు గంటల పాటు గడిపారు. పాదయాత్రలో బాబు వెంట పార్టీ రాష్ట్ర కార్యాలయ కార్యదర్శి తొండెపు దశరథ జనార్దనరావు, అనంతపురం జిల్లా పార్టీ నేత ఎన్‌టీ చౌదరి తదితరులు పాల్గొన్నారు.

ఆత్మహత్యలు వద్దు..
తెలంగాణకు తాను వ్యతిరేకిని కానని ఇన్నాళ్లూ చెబుతున్న చంద్రబాబు.. బుధవారం ఒక అడుగు ముందుకువేశారు. ప్రత్యేక తెలంగాణ కోసం ఎవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని అభ్యర్థించారు. ఆత్మహత్యలు చేసుకోవడం వల్ల వారిపై ఆధారపడిన కుటుంబాలు అండను కోల్పోతాయని, ఇబ్బందులు పడతాయని చెప్పారు. రాష్ట్రం కోసం పోరాడాలి తప్ప బలవన్మరణాలకు పాల్పడరాదని ఉద్బోధించారు. ఆత్మహత్య చేసుకున్న వారి కుటుంబాలను పార్టీ పరంగా ఆదుకుంటామన్నారు.

పోలీసుల ఓవర్ యాక్షన్: పాదయాత్రలో పోలీసుల ఓవర్‌యాక్షన్ వల్ల ప్రజలు, పార్టీ కార్యకర్తలు, పాత్రికేయులు తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నారు. రోప్ పార్టీ అత్యుత్సాహం వల్ల సామాన్య జనం బాబు దరిదాపుల్లోకి వెళ్లలేకపోతున్నారు. కేశవాపురంలో బాబును కలవడానికి బోనాలు ఎత్తుకొచ్చిన మహిళలను పోలీసులు అడ్డుకోవడంతో నిరసనగా భైఠాయించారు.

మేం కాల్వలు నిర్మించాం
దుగ్గొండి: వరంగల్ జిల్లాలో కాకతీయు కాలంలో చెరువులు నిర్మిస్తే, తమ ప్రభుత్వ హయాంలో కాలువలను నిర్మించామని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. పాదయాత్రలో భాగంగా బుధవారం రాత్రి ఆయన వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం గిర్నిబావికి చేరుకున్నారు. బహిరంగ సభలో మాట్లాడుతూ తమ ప్రభుత్వ హయాంలో నీటిపారుదల రంగానికి పెద్ద పీట వేశామన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం జలయజ్ఞం పేరుతో వేల కోట్ల రూపాయలను దిగమిగింందని విమర్శించారు. వికలాంగుల కోసం ప్రత్యేకంగా ఒక మంత్రిత్వశాఖను ఏర్పాటు చేస్తానని వాగ్దానం చేశారు.vv

ప్రజాధనాన్ని లూటీ చేసి ఇప్పుడు గగ్గోలుపెంచికలపేట, కేశవపురం, లక్ష్మీపురం, పొనకల్, గిర్నిబావి.... పల్లె పల్లెనూ పలకరిస్తూ వెళ్తున్నా! ప్రతి చోటా ఓ దృశ్యం కనిపించింది. నా మనసును మెలితిప్పింది. అది.. వృద్ధులు, వికలాంగులు ఎదుర్కొంటున్న కష్టం. ఈ గ్రామాల్లో పాదయాత్ర సాగుతున్నప్పుడు చాలా మంది వృద్ధులు దారిపక్కన నాకోసం ఎదురు చూస్తూ కనిపించారు. లక్ష్మీపురం దాటిన తర్వాత దాదాపు 50 మంది వికలాంగులు శిబిరంలో నాకోసం ఎదురు చూస్తున్నారు. వారందరి చేతుల్లో వినతిపత్రాలు. వాటిని తీసుకుని పరిశీలించాను. అన్నింటిలోనూ ఒక్కటే విన్నపం. 'మాకు పెన్షన్ అందడంలేదు! పింఛను అందించండి. కష్టం తీర్చండి' అని వారు మొర పెట్టుకుంటున్నారు. వృద్ధుల్లో చాలామందికి కంటిచూపు సరిగాలేదు. దాదాపు అందరి నడుములు వంగిపోయాయి. అయినా... నా కోసం ఎదురు చూస్తూ నిల్చున్నారు.

పెన్షన్లను సంతృప్త స్థాయిలో ఇచ్చామంటున్న పాలకుల మాటలు ఒట్టి నీటిమూటలేనని తేలిపోయింది. కాంగ్రెస్ వాళ్ల మోసాలను కూడా స్థానికులు వివరించారు. 70 ఏళ్లు దాటిన ముదుసలులు పెన్షన్‌కు అర్హులుకారంటూ వారి దరఖాస్తులు పక్కన పడేశారట! 30 ఏళ్ల వయసున్న కాంగ్రెస్ కార్యకర్తలు మాత్రం వృద్ధాప్య పెన్షన్ పొందుతున్నారట! వృద్ధుల సొమ్ము కూడా మెక్కేందుకు వీరికి మనసు ఎలా ఒప్పుతోందో!? పైగా... పెన్షన్ల చెల్లింపులో కేంద్ర వాటాను కూడా పక్కదారి పట్టిస్తున్నారు.

రాజకీయ రంగులతో సంబంధం లేకుండా.. అర్హులైన వృద్ధులందరికీ ప్రతినెలా రూ.600 పెన్షన్ ఇవ్వాలని నేను నిర్ణయించుకున్నాను. కేంద్రంలో భావసారూప్య పార్టీ అధికారంలో ఉంటే... పెన్షన్ మరింత పెంచుతాను. వికలాంగులకు రూ.వెయ్యి నుంచి 1500 వరకు పెన్షన్ ఇవ్వాల్సిన అవసరముంది. వీరిలో కొందరు కేవలం పాలకుల నిర్లక్ష్యం వల్ల వికలాంగులైన వారే! వికలాంగులకు కేవలం పెన్షన్ ఇచ్చి సరిపెట్టడం సమంజసం కాదు. వారి సామర్థ్యాన్ని బట్టి తగిన ఉపాధి అవకాశాలూ కల్పించాలి. ఆ దిశగా ఆలోచిస్తూ ముందుకు కదులుతున్నాను.

ఈ వృద్ధుల ఉసురు తగలదా!