January 2, 2013



 
వరంగల్ జిల్లాలో కాకతీయుల కాలంలో చెరువులు నిర్మిస్తే తెలుగుదేశం ప్రభు త్వ హయాంలో కాలువలను నిర్మించామని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. నాలుగో రోజు పాదయాత్రలో భా గంగా బుధవారం రాత్రి దుగ్గొండి మండలం గిర్నిబావిలో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ కాకతీయులు చెరువులు తవ్వించి ఈ ప్రాంతాన్ని ధాన్యాగారంగా మారిస్తే, టీడీపీ ప్రభుత్వం కాల్వలు తవ్వించి రైతులకు సాగునీ రు అందించిందన్నారు. 1994 నుంచి 2004 వరకు టీడీపీ ప్రభుత్వం వ్యవసాయానికి ప్రత్యేక ప్రాధాన్యతనిచ్చిందన్నారు.15వందల కోట్ల రూ పాయలతో శ్రీరాంసాగర్ కాల్వలు తవ్వించి తె లంగాణ రైతులకు సాగునీరు అందిస్తే కాం గ్రెస్ ప్రభుత్వంలో చుక్కనీరు లేక ఎండిపోయి కాల్వ ల్లో పిచ్చిమొక్కలు పెరిగాయని, పిచ్చి మొక్క లు తొలగించలేని పరిస్థితి ఏర్పడిందన్నారు.

పాకాల సరస్సులో పందిపంపుల వాగు మళ్లీంపు ఎన్నికల నినాదంగానే మారిందన్నా రు. నల్లబెల్లి మండలంలోని రంగాయచెరువు రిజర్వాయర్ నిర్మాణం భూ సేకరణ లేక నిలిచిపోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దే వాదుల 3వ దఫా నిధులు లేక నిలిచిపోయిందన్నారు. కాంగ్రెస్ పాలనలో పెరిగిన ఆదాయం ఆ పార్టీ నాయకులు దోచుకోవడానికే సరిపోయిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో 29 సార్లు పెట్రోల్, డీజిల్ బస్సు చార్జిలు పెరిగాయన్నారు. హైదరాబాద్‌ను అభివృద్ది చెయడం వల్లనే ఆదాయం పెరిగిందని, భూమి విలువలు నేడు 300 రేట్లు పెరిగాయన్నారు. అయితే పెరగనిది పేదవాళ్ల ఆదాయమేనని ఆవేదన వ్యక్తం చేశారు.

రాష్ట్రంలో తుగ్లక్ పాలన కొనసాగుతుందన్నారు. రాష్ట్ర అభివృద్దిలో 80ఏళ్లు వెనక్కి వెళ్లిందన్నారు. వేలాది మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్న రాష్ట్రం మనేదనని చెప్పారు. ప్రాణత్యాగాలతో తెలంగాణ సమస్య పరిష్కా రం కాదని, వారి కుటుంబాలను టీడీపీ పూర్తిగా ఆదుకుంటుందని చెప్పారు. మాకోసం కాదు, నేను మీకోసం వచ్చాను నిండు మనస్సుతో ఆశీర్వదించండి. ఇంటి పెద్దగా ఉంటాను. ఎన్నికల రోజు నాకివ్వండి. ఐదే«ళ్లు సేవకుడిగా ఉంటాను. అంటూ బాబు ప్రజలను కోరారు.

2009లో స్థానిక ఎన్నికల్లో టీడీపీతో పొత్తు పెట్టుకున్న టీఆర్ఎస్ సీట్లు అమ్ముకొని చెడ్డపే రు తెచ్చుకుందని ఆయన విమర్శించారు. పెత్తందార్లు, భూస్వాములు తప్ప క్యాడర్ లేని దివాలకోరు రాజకీయ పార్టీ టీఆర్ఎస్ అని అభివర్ణించారు. టీడీపీ తెలంగాణకు వ్యతిరేకం కాదని, అఖిల పక్షంలో పార్టీ వెల్లడించిన వైఖరిని అన్ని రాజకీయ పార్టీలు హర్షించి, అభినందిచారన్నా రు. పార్టీ మీటింగ్‌లకు వచ్చి గొడవలు చేస్తే మా పార్టీ కార్యకర్తలు కన్నెర్ర చేయాల్సి వస్తుందని ఆయన సభలో అలజడి చేసిన వారిని ఉద్దేశించి హెచ్చరించారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తిరుగుబాటు చేస్తే టీఆర్ఎస్ కార్యకర్తలు గ్రామాలను వదిలి పారిపోక తప్పదన్నారు.

వికలాంగుల కోసం ప్రత్యేకంగా ఒక మంత్రి త్వ శాఖను ఏర్పాటు చేస్తానని వాగ్దానం చేశా రు. కాంగ్రెస్‌తో పాటు వైఎస్ఆర్ సీపీ పార్టీపై కూడా చంద్రబాబు నిప్పులు చెరిగారు. టీడీపీ హయాంలోనే నర్సంపేట నియోజకవర్గం అభివృద్ధి చెందిందన్నారు.

ఐదేళ్ళ కాలంలో రూ.360 కోట్ల మేర అభివృద్ధి పనులు చేసినట్టు తెలిపారు. నర్సంపేట ప్రజలకు క్లోరిన్ రహిత మంచినీటిని అందచేసేందుకు నిర్మించిన డీఫ్లోరైడ్ ప్రాజెక్టు కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల నిరుపయోగంగా మారిందన్నారు.

ఈ సభలో నర్సంపేట ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి, టీ-టీడీపీ ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర్‌రావు, టీడీపీ జిల్లా అధ్యక్షుడు బస్వారె డ్డి, రాజ్యసభ సభ్యురాలు గుండు సుధారాణి, ములుగు ఎమ్మెల్యే సీతక్క, డోర్నకల్ ఎమ్మెల్యే సత్యవతిరా«థోడ్, మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్‌రెడ్డి, వివిధ మండలాల పార్టీ అధ్యక్షులు, తెలు గు యువసేన కార్యకర్తలు, ఎమ్మార్పిఎస్ నాయకులు పాల్గొన్నారు.

మా హయాంలోనే రైతులకు సాగునీరు



 
దుగ్గొండి : 'అందినకాడల్లా అప్పు లు తెచ్చిన.. రెండెకరాల భూమిలో పత్తి పంటను సాగు చేసిన.. నీలం తుఫాన్, అధిక వర్షాలతో పంట దెబ్బతిన్నది.. 12 క్వింటాళ్లు వస్తదనుకున్న.. పెట్టుబడి కూడా రాలె..' ఇదీ కేశపురం గ్రామానికి చెందిన కోరెడ్డి మల్లారెడ్డి నే రైతు ఆవేదన.. పాదయాత్రలో చంద్రబాబుకు తన గోడు వినిపించాడు. అం దుకు స్పందించిన చంద్రబాబు, కాం గ్రెస్ ప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని విస్మరించిందని విమర్శించారు. పంట లు దెబ్బతిని నష్టపోయిన రైతు లను ఆదుకోలేదని, కష్టాల్లోకి నెట్టిన కాంగ్రెస్ కు గుణపాఠం చెప్పాలని బాబు రైతులను కోరారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రైతుల సంక్షేమం కోసం ప్రాధ్యానతనిస్తామని హామీనిచ్చారు. కాగా, ఇదే గ్రామంలోని లక్ష్మి అనే మహిళ కుమారుడైన చిన్నారిని ఎత్తుకొని చంద్ర బాబు ముద్దాడారు.

పాదయాత్రలో పలకరింపులు..: లక్ష్మిపురం గ్రామానికి చెందిన రమే ష్ అనే వికలాంగుడు తనకు ప్రభుత్వం నుంచి పింఛన్ అందడం లేదని చంద్రబాబుకు మొర పెట్టుకున్నాడు. విక లాంగుల సంక్షేమాన్ని పట్టించుకోవాల ని కోరుతూ వినతి పత్రాన్ని అందజేశా డు. ఇదే గ్రామంలో చంద్రబాబు వృద్ద మహిళలను యోగక్షేమాలను అడిగి తె లుసుకున్నారు. అనారోగ్యంతో మృతి చెందిన సకినాల లక్ష్మయ్య కుటుంబా న్ని చంద్రబాబు పరామర్శించి, ఐదు వే ల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు.నాచినపల్లి గ్రామంలో సాంబయ్యకు చెందిన లాండ్రీషాపు వద్దకు వెళ్లి ఆయన ను పలకరించారు. బాబు బట్టలను ఇస్త్రీ చేశారు. లక్ష్మిపురం గ్రామంలో యువకుల కోలాటం వేడుకల మధ్యకు వెళ్లి కంజీర పట్టారు. కోలాటం చేసేవారితో మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడ ఇలాంటి కోలాటాలను తాను చూడలేదన్నారు. గీత కార్మికులు ఆయన వద్దకు రాగా మోకును వేసుకుని గీతా కార్మికులు సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

సారూ.. పెట్టుబడి కూడా రాలె..



గ్రామీణ ప్రజల కష్టసుఖాలు తెలుసుకుని సేవకుడిగా పని చేసి అభివృద్ధి చేస్తానని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. ఆత్మకూరు మండలం కామారం గ్రా మ శివారులో బుధవారం ఉదయం 9.45 నిమిషాలకు లోకేష్ కుటుంబ సభ్యులు భువనేశ్వరి, కోడలు బ్రహ్మిణి తో గంటపాటు ముచ్చటించారు. అనంతరం చంద్రబాబు ఉదయం 11.10 ని మిషాలకు బాబు పాత్ర ప్రారంభమైం ది. బస స్థలం నుంచి 5 కిలోమీటర్ల వరకు పరకాల నియోజకవర్గ ఇన్‌చార్జ్ చల్లా ధర్మారెడ్డి అనుచరులు కన్నయ్య, తోట కుమారస్వామి స్వాగతం పలికారు.

కామారం గ్రామంలో ఆంజనేయస్వామి దేవాలయంలో పూజలు చేశా రు. అక్కడ నుంచి గ్రామ సమీపంలో ని పత్తి చేనులో పనులు చేస్తున్న కూలీలను వారి కష్ట సుఖాలు అడిగి తెలుసుకున్నారు. మళ్లీ అధికారం ఇస్తే మీ సే వకుడిగా, మీ కష్టసుఖాలు తీరుస్తానని వారికి భరోసా ఇచ్చారు. కామారం గ్రామ సమీపంలోని ముదిరాజుల ఆరాధ్య దైవం పెద్దమ్మగుడిని పరిశీలించారు. అక్కడ నుంచి పెంచికలపేట శివారుకు రాగానే అక్కడి కంది చేను ను పరిశీలించారు.నష్టపోయిన మహి ళా రైతులు ముదిగిరి మల్లమ్మ, మంగ అయిలమ్మ, గిద్దె ఎల్లమ్మ, రాజక్కలను పంట నష్టాల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇందిరమ్మ ఇళ్ల పేరుతో కాం గ్రెస్, వైఎస్సార్ సీపీ నాయకులు దోచుకున్నారని మహిళలు చంద్రబాబుకు వివరించారు.

మహిళలు మంగళహారతులు, బో నాలతో ఘనస్వాగతం పలకగా పెంచికలపేటకు వెళ్లారు. హౌజింగ్ ఫెడరేష న్ మాజీ చైర్మన్ కడారి రఘునాథరా వు, మండల పార్టీ అధ్యక్షుడు ఎన్కతా ళ్ల రవీందర్, మాజీ జడ్పీటీసీ అంబటి రాజస్వామి, జిల్లా లీగల్ సెల్ కార్యదర్శి పొలుసాని అనిల్‌రెడ్డి తదితరులు భారీ పూలమాలలతో చంద్రబాబును ఘనంగా సన్మానించారు. గీత కార్మికు లు చంద్రబాబుకు మోకు లొట్టిని బ హుకరించారు. పద్మశాలి కుల సంఘా ల వారు ఘనంగా సన్మానించారు. ఆత్మకూరు మండలంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి తప్ప కొత్తగా ఏమీ కనిపించడం లేదని అన్నారు. ఇందిర మ్మ ఇళ్ల పేరుతో కాంగ్రెస్, వైఎస్సార్ సీపీ నాయకులు దోపిడీ దొంగల్లా దోచుకున్నారని దుయ్యబట్టారు.

ఈ పాదయాత్రలో టీడీపీ పరకాల నియోజకవర్గ ఇన్‌చార్జ్ చల్లా ధర్మారెడ్డి, హౌజింగ్ ఫెడరేషన్ రాష్ట్ర మాజీ చైర్మ న్ కడారి రఘునాథరావు, ములుగు ఎమ్మెల్యే సీతక్క, టీడీపీ జిల్లా ఉపాధ్యక్షులు పూజారి సుదర్శన్‌గౌడ్, జిల్లా కా ర్యదర్శి జన్ను మల్లయ్య, మండల పా ర్టీ అధ్యక్ష కార్యదర్శులు ఎన్కతాళ్ల ర వీందర్, దుంపలపల్లి బుచ్చిరెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు గండు రామకృష్ణగౌ డ్, అర్షం భిక్షపతి, నత్తిసాంబయ్య, ఎం డి.అంకూస్, బరుపట్ల కిరీటి, నేరేళ్ల క మలాకర్,గోల్కొండ శ్రీనివాస్ ఉన్నారు.

అధికారం ఇవ్వండి.. సేవకుడిగా పనిచేస్తా



 తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తన పాదయాత్రలో తెలంగాణా వాదులకు మరింత దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. వారిని ఆకట్టుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. మనుసులు గెలుచుకునేందుకు తనదైన పం«థాను అనుసరిస్తున్నారు. బు ధవారం ఐదో రోజు పాదయాత్రలో ఇది స్పష్టంగా కనిపించిం ది. కాంగ్రెస్‌పై విమర్శల దాడిని మరింత పెంచారు. వైఎస్ఆర్ సీపీపై కూడా నిప్పులు చెరుగుతూనే ఉన్నారు. మొదటి నాలుగు రోజుల పాదయాత్రలో రైతుల సమస్యలపై ప్రధానంగా దృష్టి సారించారు. వ్యవసాయ కూలీలు, గ్రామీణ మహిళలు, పేద వర్గాలు పడుతున్న ఇబ్బందులను తన ప్రసంగాల్లో ప్రధానంగా ప్రస్తావించారు. తెలుగు దేశం పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తే అన్నీ పరిష్కారం అవుతాయని భరోసా ఇచ్చారు.

తెలంగాణపై..: ప్రతీ సభలో తెలంగాణకు తాను వ్యతిరేకిని కాని ముక్తసరిగా చెప్పే చంద్రబాబు గురువారం ఒక అడుగు ముందుకు వేశారు.తెలంగాణ కోసం ఆత్మహత్యలు చేసుకున్నవారి గు రించి తన ప్రసంగంలో మొదటి సారిగా ప్రస్తావించారు. ఆ త్మహత్యలు చేసుకోవద్దని అభ్యర్ధించారు. ఆత్మహత్యలు చేసుకోవడం వల్ల వారిపై ఆధారపడిన కుటుంబాలు అండను కో ల్పోతాయని, ఇబ్బందులను ఎదుర్కొంటాయని చెప్పారు. తె లంగాణ కోసం పోరాడాలి తప్ప బలవన్మరణాలకు పాల్పడరాదని ఉద్బోధించారు. ఇదొక కొత్త పరిణామం. తెలంగాణవాదులకు దగ్గరయ్యేందుకు చేస్తున్న ప్రయత్నంగా కనిపిస్తోంది.

సమకాలీన సంఘటనలపై..: బాబు పాదయాద్రలో ప్రజలు ఎదుర్కొంటున్న మౌలిక సమస్యలపై దృష్టి సారిస్తూనే సమకాలీన పరిణామాలపై కూ డా వెంటనే స్పందిస్తున్నారు. నర్సంపేటలో వైఎస్ఆర్‌సీపీ కార్యకర్తలు జగన్‌కు బెయిల్ ఇవ్వాలని కోరుతూ కోటి సంతకాల సేకరణను చేపట్టడాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ ఆ పార్టీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తప్పులు కప్పిపుచ్చుకోవడానికి, కోర్టులపై ఒత్తిడి తీసుకురావడానికే ఇదంతా అన్నారు. ఎమ్మెల్యే పరిటాల సునీత కుమారుడిపై పోలీసు లు కేసు పెట్టడాన్ని ఖండిస్తూ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిపై నిప్పులు చెరిగారు. సీఎం హత్యారాజకీయాలను ప్రోత్సహిస్తున్నారంటూ విమర్శనాస్త్రాలను సంధించారు.

కంది పంట పరిశీలన: కంది పంట పూర్తిగా దెబ్బతినండంపై ఆవేదన వ్యక్తం చేశారు. చేనులోకి వెళ్ళి స్వయంగా పరిశీలించారు. రైతులతో మాట్లాడారు. కరెంట్ లేక నీళ్ళు పారక పంట పూర్తిగా పాడైపోయిందని రైతులు వాపోయారు. కం ది సాగుపై రైతులు ఎంత పెట్టుబడి పెట్టింది, ఎంత నష్టపోయింది బాబు వివరంగా అడిగి తెలుసుకున్నారు. ప్రకృతి వైపరీత్రాల వల్ల పంటలకు జరిగిన నష్టాన్ని అంచనా వేయడంలో వ్యవసాయాధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు.

అదే పకలరింపు: పాదయాత్రలో బాబుది అదే పలకరింపు. ఆత్మీయ స్పర్శ, ఓదార్పు. నేనున్నాన్న భరోసా. ఐదో రోజు కూడా అదే పం థాలో సాగింది. అన్ని వర్గాల ప్రజలను కలుసుకున్నారు. తనను చూడడానికి వచ్చిన వారి నుంచి అభినందనలు స్వీకరించారు. డాబాలపైకి ఎక్కి తన రాకకోసం ఎదురుచూస్తున్న వారికి అభివాదం చేస్తూ ముందుకు కదిలారు. మార్గంమధ్య లో అనేక మంది నుంచి వినతులను స్వీకరించారు. పసిపిల్లలను అప్యాయంగా ఎత్తుకున్నారు. యువకులతో కరచాలనం చేశారు.మంగళహారతులతో ఎదురేగిన మహిళలను చిరునవ్వుతో పలకరించారు. కేశవాపురంలో 20 మంది వికలాంగులకు ట్రైసైకిళ్ళను పంపిణీ చేశారు. వృద్ధులను పరామర్శించా రు.బాబుకు దారి పొడవునా టీడీపీ కార్యర్తలు పూలు చల్లారు.

16.2 కి.మీ....: కామారం నుంచి బుధవారం బయలు దేరిన చంద్రబాబు పెంచికల్‌పేట, కేశవాపురం, లక్ష్మీపురం, పొనకల్, నాచినపల్లి, గిర్నిబావి వరకు 16.2 కిమీ దూరం పాదయాత్రసాగించారు. పాదయాత్ర ప్రశాంతంగా సాగింది. కాలు నొప్పి బాధపెడుతుండడంతో బాబు నడక వేగాన్ని తగ్గించారు. మార్గం మధ్యలో అక్కడక్కడ కొద్ది సేపు కూర్చొని విశ్రాంతి తీసుకున్నారు. పెంచికల్ పేట, లక్ష్మిపురం, గిర్నిబావి గ్రామాల్లో బహిరంగ సభల్లో మాట్లాడారు. పాదయాత్రలో వేలాది మంది కార్యకర్తలు బాబు వెంట నడిచారు. గిర్నిబావి వద్ద రాత్రి బస చేశారు. పాదయాత్ర ప్రారంభం కావడానికి ముందు చంద్రబాబును ఆయన సతీమణి భువనేశ్వరి, కుమారుడు లోకేశ్, కోడలు బ్రహ్మణి వచ్చి కలిసారు. వారు బస్సులోనే బాబుతో రెండు గంటల పాటు గడిపారు.

తెలంగాణకు బాబు ఆత్మీయ స్పర్శ



డాక్టర్లు తమ పిల్లలను ఎంబీబీఎస్ చదివిస్తారు. రాజకీయ నాయకులు తమ సంతానానికి వారసత్వాన్ని అందిస్తారు. వ్యాపారి తన కుమారులకు వాణిజ్య మెళుకువలు నేర్పి రంగంలోకి దించుతాడు. కానీ, రైతు బిడ్డలు మాత్రం తండ్రి బాట తొక్కాలనుకోరు. ఎందుకు? పెద్దకోడెపాక గ్రామంలో ప్రవేశించగానే నన్ను కలవరపరిచిన ప్రశ్న ఇది. గ్రామంలోని ఒక ప్రభుత్వ పాఠశాలను సందర్శించాను. అక్కడ చదువుకుంటున్న పిల్లలంతా రైతులు, కూలీల పిల్లలే. "మీలో ఎంతమంది వ్యవసాయం చేయాలనుకుంటున్నా''రని వాళ్లను అడిగాను.



ఒక్కరంటే ఒక్కరూ చెయ్యి ఎత్తలేదు. వ్యవసాయం పరిస్థితి ఎంత దారుణంగా తయారయిందనేది ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు ఈ ఘటన నాకెంతగానో దోహదపడింది. వ్యవసాయం చేస్తున్నాడంటే 50 ఎకరాలు పొలమున్నా సరే పిల్లను ఇవ్వడానికి ఎవరూ ముందుకు రావడం లేదట. అన్నం పెట్టే అన్నదాతకు ఇంత దుస్థితా!

మైలారం వచ్చినప్పుడు కూడా ఇదే రకం అనుభవం నాకు ఎదురైంది. " మా కష్టాల గురించి అందరూ అడుగుతారు. కానీ, చేసేది మాత్రమేమీ ఉండదు'' అని గ్రామంలో ఓ రైతు నిష్ఠురమాడాడు. రైతులు పంటలు పండించకపోతే రూపాయలు తిని బతుకుతారా అని చాలా సూటిగానే ప్రశ్నించాడు. నన్నే కాదు.. ప్రతి ఒక్కరినీ పునరాలోచనలో పడేయగల ప్రశ్న అది. వ్యవసాయం లాభసాటిగా ఉండి ఉంటే ఈరోజున ఇలాంటి ప్రశ్నలు ఎదురు కాక పోవును కదా!

మైలారం వెళ్లేదారి పక్కన ఉన్న కోళ్లఫారం యజమానిని పలకరించాను. వ్యవసాయం నుంచి కోళ్ల ఫారానికి మారడం పెనం నుంచి పొయ్యిలో పడినట్టు ఉందని వాపోయాడు. "నేనూ ఒకప్పుడు రైతునే సార్. వ్యవసాయం గిట్టుబాటు కావడం లేదని ఈ వ్యాపారంలోకి దిగాను. కానీ, కరెంట్ కోతలతో ఫారం నడిచే పరిస్థితి కనిపించడం లేదు. పూర్తిగా జనరేటర్ల మీద నడపడానికి శక్తి చాలడం లేదు. ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి'' అంటూ బాధపడ్డాడు. వ్యవసాయానికే కాదు..వ్యవసాయ ఆధారిత పరిశ్రమలకూ ఇదెంత చేటు కాలం!

సాగుకు చేటు కాలం!