September 8, 2013

వైఎస్ మరణంపై బాబు లేవనెత్తిన ప్రశ్నలు ప్రజల్ని మరోమారు ఆలోచింపజేస్తున్నాయి.

వైఎస్ మరణంపై బాబు సంచలన వ్యాఖ్యలు

దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్‌రెడ్డి మరణంపై టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు కొత్త చర్చకు తెరలేపిన ట్లయింది. రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. వైఎస్ మరణంపై బాబు లేవనెత్తిన ప్రశ్నలు ప్రజల్ని మరోమారు ఆలోచింపజేస్తున్నాయి. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల్ని ముఖ్యంగా జగన్మోహన్‌రెడ్డి కుటుంబ సభ్యుల్ని ఇరకాటంలో పడేసే సూచనలు కొ్టచ్చినట్లు అగుపిస్తున్నాయి. సెప్టెంబర్ 2, 2009న రాజశేఖర్‌రెడ్డి సీఎం ె దాలో హైదరాబాద్ నుంచి చిత్తూరు జిల్లాలో ఏర్పా టు చేసిన రచ్చబండలో పా్గనేందుకు వెళ్లిన వైఎస్ ెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణం చెందిన విషయం విధితమే. వైఎస్ మరణంపై అప్పట్లో అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. వైఎస్ మరణం వెనక కుట్ర దాగి ఉందనీ వైఎస్ కుటుంబ సభ్యులతో పాటు ఆయన అభిమానులు, సన్నిహిత ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు బహిరంగంగానే తమ అనుమానాన్ని వ్యక్తం చేశారు. రిలయన్స్ హస్తం ఉందంటూ కూడా రాష్ర్ట వ్యాప్తంగా ఉన్న రిలయన్స్ కంపెనీలపై దాడులు కూడా జరిగాయి. వైఎస్ కుమారుడు జగన్‌తో పాటు కుటుంబ సభ్యులు కూడా వైఎస్ ెలికాప్టర్ ప్రమాదంపై తమకు కూ డా అనుమానాలున్నాయనీ విచారణ చేయాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాకు, కేంద్రంలోని సంబంధిత మంత్రిత్వ శాఖలకు లేఖలు కూడా రాశారు. ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్‌రెడ్డి మధ్య ఆగాధం పెరగడం...జగన్ పార్టీకి దూరం కావడం...ఆయనపై సిబిఐ కేసులు నమోదు చేయడం...అరెస్టు చేయడం చకచకా జరిగిపోయాయి.

2012 జూన్ నెలలో వచ్చిన ఉప ఎన్నికల్లో మరోమారు వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మరణం ప్రస్తావనకు వచ్చింది. ఎన్నికల ప్రచారంలో పా్గన్న వైఎస్. విజయమ్మ, షర్మిల తన ఎన్నికల ప్రచారంలో ప్రధానంగా వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మరణం వెనక తమకు ఇప్పటికీ అనుమానం ఉందనీ, దీని వెనక సోనియాగాంధీ హస్తం ఉందంటూ ప్రచారం కూడా చేశారు. అయితే, ఎన్నికల్లో రాజకీయంగా లబ్ది పొందడం కోసమే వైఎస్ విజయమ్మ ప్రచారం చేసిందన్న వాళ్లూ లేకపోలేదు. అయితే, తాజాగా వైఎస్ మరణంపై టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. వైఎస్ మర ణం ఇప్పటి వరకు ఎలాంటి కామెంటు చేయని చం ద్రబాబు ‘తెలుగువారి ఆత్మగౌరవం’ పేరిట నిర్వహి స్తున్న బస్సుయాత్రలో ఆదివారం నాడు కృష్ణాజిల్లా లో పర్యటిస్తున్న బాబు వైఎస్ మరణంపై చేసిన వ్యా ఖ్యలు ఆసక్తికరంగా మారాయి. బాబు సంధించిన ప్రశ్నలకు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీని ఉక్కిరిబిక్కిరి చేయడం ఖాయంగా కనిపిస్తోంది. గతంలో వైఎస్ ఆర్ మరణం వెనక కుట్ర దాగి ఉందనీ, వైఎస్ మరణానికి కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ హస్తం ఉందనీ మాట్లాడిన వైఎస్‌ఆర్ పార్టీ నేతలు ఇప్పుడెందుకు నోరు మెదపడం లేదనీ ప్రశ్నించారు. వైఎస్ మరణంపై అనుమానాలున్నప్పుడు, ఈ కుట్ర వెనక సోనియాగాంధీ ఉందన్నప్పుడు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కోర్టును ఎందుకు ఆశ్ర యించడం లేదనీ బాబు మాట్లాడిన మాటలు ఇప్పు డు అంతటా చర్చనీయాంశంగా మారాయి. కాంగ్రెస్ పార్టీతో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు లాలూచీపడ్డారా? లాలూచీ పడటంతోనే కోర్టుకు వెళ్లడం లేదా? అని బాబు సూటిగా ప్రశ్నించారు. వైఎస్ మరణంపై అనుమానాలున్నప్పుడు ఆయన కుటుంబ సభ్యులు న్యాయపోరాటం చేయకపోవడా న్ని ఏమనుకోవాలో తనకు అర్థం కావడం లేదన్నారు. న్యాయస్థానాన్ని ఆశయ్రిస్తే అన్ని వాస్తవాలు వెలుగులోకి వస్తాయన్నారు. కోర్టుకు వెళ్లడం ద్వారా వైఎస్ మరణం వెనక కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా ఉందనీ తేలితే ఆమెకు శిక్ష పడుతుందనీ, లేదని తేలితే రాజకీయంగా లబ్ది పొందాలని చూసిన వారికి శిక్ష పడుతుందన్నారు. వైఎస్ మరణంపై కుట్ర దాగి ఉంటే ఆయన కుటుంబ సభ్యులు కోర్టును ఆశ్రయించాల్సిందేననీ అన్నారు. బాబు చేసిన వ్యాఖ్యలు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల్ని డిఫెన్స్‌లో పడేసే విధంగా ఉన్నాయనీ రాజకీయ పరిశీలకులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

బాబు చేసిన వ్యాఖ్యలపై వైఎస్‌ఆర్ పార్టీ నేతల స్పందన ఎలా ఉంటుందనే దానిపై అంతటా వాడి వేడిగా చర్చ సాగుతున్నది. దీనికి కారణం లేకపోలేదు. వైఎస్ మరణంపై మొదటి నుంచీ ఆయన కుటుంబ సభ్యులు, అభిమానులు, అనుచరులు, శ్రేయోభిలాషులలలో అనుమానం వుంది. ఎందుకంటే, ప్రమాదానికి గురైన ెలికాప్టర్‌లో ఉండే వాక్‌పిక్ రికార్డర్‌లో ఏముందో ఇప్పటి వరకు వెల్లడి కాలేదు. దీనితో వైఎస్ మరణంపై విచారణ చేపట్టాలనీ ఆ పార్టీ, వైఎస్ కుటుంబ సభ్యులు కోరడంలో ఎలాంటి తప్పుబట్టాల్సింది లేదు. మధ్య మధ్యలో రిలయన్స్ కంపెనీ యజమానులపై, సోనియాగాంధీపై కూడా అనుమానాలను వ్యక్తం చేశారు. కానీ, చంద్రబాబు చెప్పినట్లుగా న్యాయస్థానాన్ని మాత్రం ఆశయ్రించ లేకపోయారు. బాబు చెప్పినట్లుగా న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే వాస్తవాలు ఏమిటో బయటపడతాయి. బాబు చెప్పినట్లుగా న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే సరేసరి. లేదంటే భవిష్యత్ రాజకీయ ‘అవసరాల’ కోసమే వైఎస్‌ఆర్ పార్టీ నేతలు కాంగ్రెస్ పార్టీలో లాలూచీ పడ్డారనీ అందరూ అనుకునే అవకాశం ఉంది. చూడాలి మరి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఏం చేస్తారో?!