May 27, 2013

‘దేశం’ లోకి పవన్‌?నారా చంద్రబాబు నాయుడుతో చర్చలురాయభారం నడిపిన బాలకృష్ణ
తెలుగుదేశంలో చేరికకు సుముఖం
బందర్‌ నుంచి పోటీకి అవకాశం
తగ్గునున్న జూ ఎన్టీఆర్‌ ప్రాధాన్యం
చిరుకు, పవన్‌కు మధ్య పెరిగిన దూరం
పీఆర్సీ విలీనాన్ని వ్యతిరేకించిన పవన్‌
రాజకీయ, సినీ వర్గాల్లో చర్చలు


సినీ స్టార్‌, కేంద్రమంత్రి చిరంజీవి తమ్ముడు పవన్‌ కల్యాణ్‌ తెలుగుదేశం పార్టీలో చేరను న్నారా? ఆయన మచిలీపట్నం నుంచి పోటీ చేయనున్నారా? ప్రస్తుతం రాజకీయ, సినీ వర్గాల్లో జరుగుతున్న హాట్‌ టాపిక్‌ ఇది. దీనిపై ఈ రెండు వర్గాల్లోనూ చర్చ జరుగుతోంది. చిరంజీవి సోదరుడు పవన్‌కల్యాణ్‌ తెలుగు దేశం పార్టీలో చేరేందుకు రంగం సిద్ధమవు తున్నట్లు తెలుస్తోంది. చిరంజీవి ప్రజారాజ్యం స్థాపించిన సమయంలో సినిమాలకు దూరంగా ఉండి, ఎక్కువ సమయం రాజకీయాలకే కేటా యించిన పవన్‌, అప్పట్లో దూకుడుగా వ్యవహ రించిన విషయం తెలిసిందే. కాంగ్రెస్‌ నేతలను పంచెలు ఊడదీసి తరిమికొట్టాలని పిలుపు నిచ్చారు. కాంగ్రెస్‌పై చండ్రనిప్పులు కక్కారు. ఆ తర్వాత చిరంజీవి తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయాలని నిర్ణయించారు. దానిని పవన్‌ తీవ్రంగా వ్యతిరేకించినట్లు అప్పట్లో ప్రచారం జరిగిన విషయం తెలిసిందే.

ముక్కుసూటిగా మాట్లాడటం, కల్మషం లేకుండా మనసులో ఉన్నదే వ్యక్తీకరించడం, వామపక్ష భావజాలంతో పాటు, ఇతర హీరోలకు భిన్నంగా మనుషులకు విలువ-గౌరవం ఇచ్చే మానవీయ విలువలున్న వ్యక్తిగా పవన్‌కల్యాణ్‌ కు సినీ పరిశ్రమలో మంచి పేరుంది. పేదవర్గా లకు ఏదో చేయాలన్న తపన, అవినీతిపై కసి దండిగా ఉన్న పవన్‌ ఖాళీగా ఉన్న సమయాల్లో వామపక్ష భావజాల పుస్తకాలను ఎక్కువగా చదువుతుంటారు. ఇటీవలి కాలంలో చిరంజీవి తో పాటు, ఆ కుటుంబసభ్యుల సినిమా ఫంక్షన్ల కు దూరంగా ఉంటున్న పవన్‌ దృష్టి తాజాగా రాజకీయాలపై మళ్లిందని చెబుతున్నారు.

అందులో భాగంగానే తెలుగుదేశం పార్టీ వైపు చూస్తున్నారన్న ప్రచారం సినీ- రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. బాలకృష్ణ ఆ మేరకు రాయబారం నిర్వ హించినట్లు తెలుస్తోంది. స్వయంగా బాలకృష్ణ పవన్‌ను వెంటబెట్టుకుని చంద్ర బాబుతో చర్చలు జరిపారని, ఆ మేరకు టీడీపీలో చేరేందుకు పవన్‌ కల్యాణ్‌ సుముఖత వ్యక్తం చేశారన్న వార్తలు వెలువడుతున్నాయి. పవన్‌కు మచిలీ పట్నం సీటు ఇస్తే బాగుంటుందని బాలయ్య సిఫారసు చేసినట్లు తెలుస్తోంది.

ఒకవేళ పవన్‌ కల్యాణ్‌ టీడీపీలో చేరితే ఆయనకు మచిలీపట్నం సీటు ఖాయంగా ఇవ్వవచ్చంటు న్నారు. కాపు సామాజికవర్గం సంఖ్య ఎక్కువగా ఉన్న మచిలీపట్నం నియోజకవర్గాన్ని ఎంచుకోవడం వ్యూహాత్మకమేనంటున్నారు. పవన్‌ టీడీపీలో చేరితే పార్టీకి మరో స్టార్‌ అదనపు ప్రయోజనంగా మారతారని, పవన్‌ సినీ గ్లామర్‌తో పాటు, కాపు సామాజికవర్గం కూడా మళ్లీ టీడీపీకి చేరువ య్యే అవకాశం లేకపోలేదన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి. పవన్‌ పార్టీలో చేరితే అప్పుడు జూనియర్‌ ఎన్టీఆర్‌ మీద ఆశలు పెట్టు కోవల సిన అవసరం లేదన్న అంచనా వ్యక్తమవుతోంది. ప్రస్తుతం అంతా జూని యర్‌ ఎన్టీఆర్‌ రాక మీదనే చర్చిస్తున్నారని, పవన్‌ కల్యాణ్‌ పార్టీలో చేరితే జూని యర్‌ ఎన్టీఆర్‌ గురించి మాట్లాడేవారి సంఖ్య తగ్గుతుందని పలువురు నేతలు వ్యాఖ్యా నిస్తున్నారు. ఒకవేళ జూనియర్‌ ఎన్నికల సమయానికి పార్టీలో చేరితే అప్పుడు ముగ్గురూ మూడు ప్రాంతాల్లో ప్రచారం చేస్తే పార్టీకి ప్రయోజనంగా ఉంటుంద ని విశ్లేషిస్తున్నారు.

చిరంజీవి కుటుంబానికి చెందిన పవన్‌ టీడీపీలో చేరడంపై విస్మయం చెందా ల్సిన అవసరమేమీలేదని, ఇది కొత్తేమీ కాదని రాజకీయ వర్గాలు వ్యాఖ్యా నిస్తు న్నాయి. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా టీడీపీని స్థాపించిన ఎన్టీఆర్‌ కూతురు కాంగ్ర ెస్‌లో చేరి కేంద్రమంత్రిగా పనిచేస్తున్నారు. టీడీపీ ఎమ్మెల్సీ నన్నపనేని రాజ కుమారి కూతురు సుధ వినుకొండ వైఎస్సార్‌ సీపీ అభ్యర్ధిగా రంగంలో ఉన్నా రు. జాతీయ స్థాయిలో ఇందిరాగాంధీ కోడలు మేనకాగాంధీ, ఆమె తన యుడు వరుణ్‌గాంధీ బీజేపీలో ఉండగా, ఆమె తోడికోడలు సోనియాగాంధీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలిగాఉన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం కాంగ్రెస్‌లోఉన్న చాలా మంది సీనియర్ల తనయులు జగన్‌ పార్టీలో ఉన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు.