March 31, 2013

హైదరాబాద్ : వెస్ట్‌లండన్‌లో టీడీపీ ఆవిర్భావ వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. పార్టీ యూకే/యూరప్ ఎన్ఆర్ఐ విభాగం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమాలకు ఎన్ఆర్ఐ విభాగం కోర్ టీం సభ్యులు సహా పార్టీ శ్రేణులు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

ఈ సందర్భంగా టీడీపీ రాష్ట్ర నేతలు ఎల్వీఎస్సార్కే ప్రసాద్, పంచుమర్తి అనురాధ, మోత్కుపల్లి నర్సింహులు, కోడెల శివప్రసాద్, వర్ల రామయ్య, గరికపాటి మోహన్‌రావు, కంభంపాటి రామ్మోహన్, టీడీ జనార్దన్, సింగిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, టీఎల్ ప్రసాద్ తదితరులు టెలికాన్ఫరెన్స్ ద్వారా తమ సందేశాలను వినిపించారు. టీడీపీ మళ్లీ అధికారంలోకి రావాలని టీడీపీ యూకే/యూరప్ విభాగం అధ్యక్షుడు గుంటుపల్లి జయకుమార్ ఆకాంక్షించారు. టీడీపీ యువత విభాగం పగ్గాలను నారా లోకేష్ చేపట్టాలని వేడుకల్లో పాల్గొన్న టీడీపీ అభిమానులు నినాదాలు చేశారు.

లండన్‌లో ఘనంగా టీడీపీ ఆవిర్భావ వేడుకలు

హైదరాబాద్: విద్యుత్ చార్జీల పెంపునకు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ కదనరంగంలోకి దూ కింది. సర్కారుపై సమరం ప్రకటించింది. విద్యుత్తు చార్జీలను తగ్గించేంతవరకు పోరాడతామని ఆ పార్టీ నేతలు దేవేందర్ గౌడ్, గాలి ముద్దుకృష్ణమనాయుడు, మోత్కుపల్లి నర్సింహులు, పరిటాల సునీత, సండ్ర వెంకటవీరయ్య, శమంతకమణి ప్రకటించారు. ధర్నాలు, నిరసనలు, బంద్‌లతో ప్రభుత్వం మెడలు వంచుతామని వారు హెచ్చరించారు.

కొత్త విద్యుత్తు ధరల ప్రతులను టీడీఎల్పీ కార్యాలయం వద్ద దహనం చేశారు. ఏప్రిల్ 2 నుంచి 7 వ తేదీ వరకు గ్రామాల్లో సంతకాల సేకరణను నిర్వహిస్తామని నేతలు వెల్లడించారు. వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో రాష్ట్రం చీకటిమయమైందని, రోశయ్య, కిరణ్ అదే పరిస్థితిని కొనసాగిస్తున్నారని ధ్వజమెత్తారు. దేశంలో ఏ ముఖ్యమంత్రీ ఇంత అడ్డగోలుగా చార్జీలు పెంచలేదని ముద్దుకృష్ణమనాయుడు ధ్వజమెత్తారు.

కాగా, తెలుగు మహిళలు సోమవారం నిరాహార దీక్షకు సిద్ధమవు తున్నారు. తెలుగుమహిళ అధ్యక్షురాలు శోభా హైమావతి ఆధ్వర్యంలో ఎన్టీఆర్ భవన్ వద్ద పలువురు మహిళా నేతలు, కార్యకర్తలు దీక్షలో పాల్గొంటారని ఆ పార్టీ మీడియా కమిటీ చైర్మన్ ఎల్వీఎస్సార్కే ప్రసాద్ ఒక ప్రకటనలో వెల్లడించారు. ఇదిలా ఉండగా, ప్రతి పక్షాల పిలుపు మేరకు వచ్చేనెల తొమ్మిదో తేదీన జరగనున్న రాష్ట్ర బంద్‌ను విజయవంతం చేయాలని టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి పీఎల్ శ్రీనివాస్ కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయని హెచ్చరించారు.

చార్జీలపై సమరమే: టీడీపీ


పాదయాత్రగా కాకినాడ సబ్‌స్టేషన్ వద్దకు
సాయంత్రం వరకు రోడ్డుపై బైఠాయింపు
'విద్యుత్' ఉద్యమానికి ఊపు తెచ్చే యత్నం

కాకినాడ : పాదయాత్ర.. పోరుయాత్రగా మారనుంది. ఇప్పటిదాకా జనంలోకి నడిచిన పాదాలు సర్కారుపై కదం తొక్కనున్నాయి. సమస్యలు వింటూ ముందుకు సాగిన ప్రయాణం.. నిలబడి కలబడే రణంలోకి మళ్లనుంది. వాతలు పెడుతున్న కోతలు, వీపు వాయగొడుతున్న చార్జీల మోతలకు వ్యతిరేకంగా తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు సోమవారం ఒక రోజు దీక్షకు సిద్ధమవుతున్నారు. గ్యాస్‌బండ నుంచి వంటింటి సరుకుల దాకా కొండెక్కి కూర్చున్న వేళ సామాన్యుడిపై ఆరు వేల కోట్ల విద్యుత్ చార్జీల భారం మోపడంపై ఆయన నిరాహారంగా నిరసన తెలపనున్నారు. కోతలతో మూతపడుతున్న పరిశ్రమలు; సాగర్ నీళ్లూ, మోటార్ నీళ్లూ లేక నోళ్లు వెళ్లబెడుతున్న పంట పొలాల పరిస్థితిపై ప్రభుత్వం కళ్లు తెరిపించేందుకు సన్నద్ధమవుతున్నారు.

పాదయాత్రకు ఆదివారం విరామం కావడంతో ఆయన ఆనందభారతి గ్రౌండ్స్‌లో బస చేశారు. సోమవారం ఉదయం 8:30 గంటల ప్రాంతంలో తన బస నుంచి ఆయన పాదయాత్రగా బయలుదేరతారు. అక్కడకు 2.7 కిలోమీటర్ల దూరంలోని కాకినాడ జేఎన్‌టీయూ వద్ద గల నాగమల్లితోట సబ్‌స్టేషన్ వద్దకు 11 గంటలకు చేరుకుంటారు. విద్యుత్ చార్జీల పెంపు-కోతలకు వ్యతిరేకంగా రోడ్డుపై బైఠాయిస్తారు. సాయంత్రం ఐదు గంటల వరకు దీక్ష చేసి.. ఆ తర్వాత పాదయాత్రను కొనసాగిస్తారు.

విద్యుత్ సమస్యపై ఇప్పటికే తెలుగుదేశం పార్టీ రాష్ట్రమంతటా ఉద్యమాన్ని రాజేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జరగనున్న చంద్రబాబు దీక్ష.. కరెంటు ఉద్యమానికి మరింత ఊపునిస్తుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. నిజానికి.. చార్జీలు పెంచుతూ ప్రభుత్వం ప్రకటన చేసిన సమయంలో బాబు పాదయాత్రలో ఉన్నారని.. ఆ క్షణానే 'దీక్ష'కు నిర్ణయం తీసుకున్నారని ఈ వర్గాలు చెబుతున్నాయి.

బాబును కలిసిన కుటుంబ సభ్యులు
పాదయాత్రకు ఒకరోజు విరామం ఇచ్చి బసలో విశ్రాంతి తీసుకుంటున్న చంద్రబాబును ఆదివారం ఆయన భార్య భువనేశ్వరి, కుమారుడు లోకేశ్, కోడలు బ్రాహ్మణి కలిశారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం మూడున్నర వరకు వారు చంద్రబాబుతో గడిపారు. అంతకుముందు..లోకేశ్, బ్రాహ్మణిలు హైదరాబాద్ నుంచి విశాఖకు విమానంలో వచ్చారు. చంద్రబాబు కుటుంబానికి సన్నిహితులైన కొందరు లోకేశ్ దంపతులకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా విలేకరులు ఆయనను కలవగా మాట్లాడేందుకు నిరాకరించారు. అనంతరం కారులో చంద్రబాబు వద్దకు వెళ్లారు.

బాబు దీక్ష నిరాహారంగా ఒకరోజు నిరసన

తెలుగుదేశం పార్టీలో అనేక పదవులు అనుభవించి ప్రలోభాలకు లొంగి, రియల్ ఎస్టేట్ దందాలకు ఆశపడి పిల్ల కాంగ్రెస్‌లో చేరిన నేతలకు బుద్ధి చెప్పాలని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు కార్యకర్తలకు పిలపునిచ్చారు. 'వస్తున్నా మీ కోసం' పాదయాత్రలో భాగంగా కాకినాడ రూరల్ మండలం కొవ్వాడలో శనివారం పెద్దాపురం నియోజకవర్గ సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ముప్పయ్యేళ్లు పార్టీలో ఉండి పదవులు అనుభవించి విలువల్లేకుండా జైలుకెళ్లి మరీ పిల్ల కాంగ్రెస్‌లో చేరారని బొడ్డు భాస్కరరామారావుపై దుమ్మెత్తిపోశారు. నీతి, నియమాలు లేని నాయకులు ఎక్కడా రాణించలేరన్నారు.

ప్రలోభాలకు లొంగి, రియల్ ఎస్టేట్ దందాలకోసం ఆశపడి వెళ్లిన వారికి బుద్ధి చెప్పాలన్నారు. నాయకులు వెళ్లిపోతున్నా కార్యకర్తలు మాత్రం చెక్కుచెదరకుండా అండదండలు అందించడం తనకెంతో ఆనందాన్నిచ్చిందన్నారు. 'ఆ నేత చెంచలగూడ జైలుకెళ్లి కొబ్బరికాయ కొట్టి జైలు పార్టీలో చేరాకా.. మీ అందరికీ స్వేచ్ఛ వచ్చినట్లు కన్పిస్తున్నారు. అందుకే ఇంత పెద్ద సంఖ్యలో కార్యకర్తలు వచ్చి ఉత్సాహంగా ఉన్నారు' అని చంద్రబాబు ఆనందం వ్యక్తం చేశారు.

టీడీపీని వదిలి బయటకు వెళ్లిన వాళ్లెవరైనా రాణించారా? తమ్ముళ్లూ? అన్న చంద్రబాబు ప్రశ్నకు.. లేదు.. లేదు.. వీళ్లకూ జైలే గతి.. అని కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

ఎండుకొమ్మల్ని తీసేస్తేనే కొత్త చిగుళ్లు వస్తాయని ఒక కార్యకర్త చంద్రబాబు దృష్టికి తీసుకువచ్చారు. ఔను తమ్ముడూ.. ఎండుకొమ్మల్ని మనం తీయకుండానే పోతున్నాయి. కలుపుమొక్కల్ని పీకిపడేస్తేనే పంట బాగా పండుతుంది.. అని చంద్రబాబు చెప్పుకొచ్చారు.వీళ్లంతా టీడీపీలో ఉంటేనే హీరోలు.. బయటకు పోతే జీరోలే. మీరంతా పార్టీ వెంటే ఉన్నారు. ఇపుడు ఆ నాయకులకు తమ వెంట వస్తారన్న భ్రమలు కూడా తొలగిపోయాయి.. అని చంద్రబాబు బొడ్డును ఉద్దేశించి ఆక్షేపించారు.

పెద్దాపురం నియోజకవర్గం చరిత్ర సృష్టించాలి వచ్చే ఎన్నికల్లో పెద్దాపురం నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థి ఎవరైనా అఖండ మెజార్టీతో గెలిపించి కా ర్యకర్తలు చరిత్ర సృష్టించాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. మీ ఉత్సాహం చూస్తుంటే ఇపుడే ఎన్నికలు వచ్చినట్లు కన్పిస్తోంది.. అన్నారు.

వెకిలి చేష్టలు ఎందుకు?

పిల్ల కాంగ్రెస్‌లో చేరిన ఆ నేత నేను పాదయాత్ర చేస్తున్న దారిలో ఉగాది శుభాకాంక్షల పేరుతో ఫ్లెక్సీలు పెట్టుకున్నాడు. ఉగాది ఎప్పుడు తమ్ముళ్లూ? తొందరపడి ముందే కూసింది ఓ కోడి.. అన్నట్లు తయారయ్యారు ఈ నేత. మ న కార్యకర్తల్ని తన వెంట జైలు పార్టీలోకి రమ్మంటున్నా వెళ్లడంలేదని దౌర్జన్యాలు చేస్తున్నారట.. అని చంద్రబా బు అన్నారు. టీడీపీ కార్యకర్తలపై దౌర్జన్యాలు చేయాలని చూసినా బెదిరించినా ఖబడ్తార్.. అని హెచ్చరించారు.

ఐదు వందల అనపర్తి ఎమ్మెల్యే ప్రలోభాలకు లొంగకుండా నీతి, ని జాయితీలతో కూడిన టీడీపీని గెలిపించాలన్నారు. ఏదైనా పని కోసం వెళ్తే అ నపర్తి ఎమ్మెల్యే డబ్బిచ్చి ఓట్లేయించుకున్నానని పని ఎలా చేస్తానని చెప్తున్నార ట. ప్రలోభాలకు లొంగితే అలాగే ఉం టుంది.. ఈ కాంగ్రెస్ వాళ్లు దోచుకోవ డం మళ్లీ ఆ సొమ్ముతో ప్రలోభాలకు గురిచేయడం వైఎస్ నుంచి నేర్చుకున్నారు.. అని అనపర్తి ఎమ్మెల్యేని ఉద్దేశించి చంద్రబాబు వ్యాఖ్యానించారు. అనపర్తి నియోజకవర్గంలో పాదయా త్ర ప్రారంభమైనప్పటి నుంచీ చాలా సభల్లో చంద్రబాబు ఈ ఐదు వందల విషయాన్ని ప్రస్తావిస్తూ వస్తున్నారు.

కార్యకర్తల సూచనలు విన్న బాబు శనివారం జరిగిన పెద్దాపురం ని యోజకవర్గ సమీక్షలో చంద్రబాబు కా ర్యకర్తల ప్రసంగాలను ఆసక్తిగా విన్నా రు. పలువురు కార్యకర్తలు చేసిన సూచనలను బాబు రాసుకున్నారు. జట్ల మో హన్ అనే కార్యర్త మాట్లాడుతూ.. 1995లో మీరు సీఎంగా ఉన్నపుడు పు ట్టిన పిల్లలకు ఇపుడు ఓటు హక్కు వచ్చింది. వాళ్లలో చాలామందికి మీ పాలన గురించి, పరిపాలనా దక్షత గురించి తెలియదు. డాక్యుమెంటరీలు రూపొందించి అలాంటివారికి అవగాహన కల్పించాలి.. అని చంద్రబాబుకు సూచించారు. ఆర్‌బీ పట్నానికి చెందిన చిన్న, రవికుమార్ (వేట్లపాలెం), గోలి సత్తిరాజు (సామర్లకోట), నున్న రాంబాబు, సిద్ధా త్రిమూర్తులు, జిలా నీ, రెడ్డి లక్ష్మి పెద్దాపురం ఇన్‌ఛార్జిగా సమర్ధుడైన నేతను ఎంపిక చేయాలని చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు.

రలోభాలకు లొంగి, రియల్ ఎస్టేట్ దందాలకోసం ఆశపడి వెళ్లిన వారికి బుద్ధి చెప్పాలి.........

కొవ్వొత్తులు ఆత్మశాంతికి ప్రతీకలు. గుండెల్లో గూడుకట్టుకున్న దుఃఖాన్ని కొవ్వొత్తి వెలుగు కొంతైనా తగ్గించి ఓదారుస్తుంది. కానీ, ఈ పల్లెల ఆవేదన తీరాలంటే, ఎన్ని కొవ్వొత్తులు వెలిగించాలో! ఈ చీకటి చింత తొలగాలంటే ఎంత వెలుగు ప్రసరించాలో! చీకట్లోనే కాకినాడలో అడుగుపెట్టాను.



ఆడపడుచులకు విలువనిచ్చిన పార్టీ, ప్రభుత్వం మాది. ఇప్పుడు వాళ్లు అన్నివిధాల చీకట్లోనే మగ్గుతున్నారు. రూపాయిని పొదుపు చేయడం నేర్పి వారిని మహాలక్ష్ములను చేద్దామని నాడు నేను చూస్తే, లక్షాధికారులను చేస్తామంటూ ఆ పెద్ద మనిషి వాళ్లను భిక్షాధికారులను చేసి పోయాడు. ఇంద్రపాలెంలో జరిగిన ఆత్మీయ సమా వేశంలో మహిళల గోడు ఇదే. డ్వాక్రా మహిళలుగా..ఇప్పుడు ఆర్థిక లబ్ధినే కాదు,

కనీసం ఆత్మగౌరవాన్ని కూడా నిలుపుకోలేకపోతున్నామని వాపోయారు. ఆడపిల్ల మైనస్ కాదు, ప్లస్ అని చాటాలన్న తాపత్రయం వారి కోసం ఎన్నో కార్యక్రమాలు తీసుకునేలా చేసింది. కానీ, ఇప్పుడు ఆ కార్యక్రమాలూ లేవు.. ఆ కళా లేదు. చాలీచాలని కూలీ, మొగుడి తాగుడు కోసం తాకట్టుకు పోయే తాళి.. గ్యాస్‌బండ నుంచి ధరలకొండ వరకు వాళ్ల జీవితమే ఒక ఎగతాళి..!
ఎప్పుడో పోయిందో తెలియదు.. ఏ గడపలో చూసినా కొవ్వొత్తులూ..కిరోసిన్ బుడ్లే! దుకాణాల్లోనూ వాటి వెలుగులోనే బేరాలు చేస్తున్నారు. ఉక్కపోసి గుక్కపెట్టిన చిన్నారులను భుజాన వేసుకొని ఆడపడుచులు వాకిట కునికిపాట్లు పడుతున్నారు. సందడిగా ఉండాల్సిన వీధులు రాత్రి తొమ్మిదయ్యేసరికి దుప్పటి తన్నేసినట్టు నిర్మానుష్యంగా కనిపించాయి. ఏ ఇంట్లోనూ మగమనిషి లేడు. అడిగితే.. మోటార్ వేయడానికి పొలం పోయాడనేదే జవాబు! ఈ పాపం ఎవరిది?

చీకటి చింతల్లో పల్లెలు!

గాలికీ పన్నేస్తారేమో!
సీఎం ఆరిపోయిన అవినీతి కిరణం
దళిత క్రైస్తవులను ఎస్సీలుగా గుర్తిస్తాం: చంద్రబాబు



కాకినాడ, మార్చి 30 : "ఇదో చేతగాని దద్దమ్మ ప్రభుత్వం. మనం పీల్చుకునే గాలికి కూడా పన్ను వేసేలా ఉంది'' అని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ రూరల్‌లోని కొవ్వాడలో శనివారం ఆయన పాదయాత్ర ప్రారంభించారు. గంగన్నపల్లి, చీడిగ, ఇంద్రపాలెం మీదుగా నడక సాగించారు. ఈస్టర్‌ను పురస్కరించుకొని చీడిగలో జరిగిన క్రైస్తవ సదస్సులో పాల్గొన్నారు. "పేదల సొమ్ము దోచుకోవడం పాపమని బైబిల్ చెప్పింది. వైఎస్ కుటుంబం మాత్రం మతాన్ని అడ్డంపెట్టుకుని దోపిడీకి పాల్పడింది'' అని ఆక్షేపించారు.

అధికారంలోకి వస్తే క్రైస్తవ దళితులకు ఎస్సీ హోదా కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని క్రైస్తవ పాస్టర్లు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అంతకుముందు.. విద్యుత్ చార్జీలు పెంచుతూ తీసుకున్న నిర్ణయాన్ని కొవ్వాడ సభలో తీవ్రంగా గర్హించారు. " వైఎస్, కాంగ్రెస్ దొంగలు కమీషన్లకు ఆశపడి ప్రైవేటు విద్యుత్ కంపెనీల నుంచి అధిక ధరలకు విద్యుత్ కొన్నారు. ఇప్పుడా భారాన్నంతా సర్‌చార్జీల రూపంలో పేదలపై వేస్తున్నార''ని విమర్శించారు. సీఎం యువ కిరణం కాదు..ఆరిపోయిన అవినీతి కిరణం అని, ఆయన పాలన ప్రజల పాలిట శాపమని తూర్పారబట్టారు. అన్ని వ్యవస్థలను ధ్వంసం చేసిన ఘనత వైఎస్‌దేనని దుయ్యబట్టారు.

"రాజశేఖరరెడ్డి ఓ మేకవన్నె పులి. ఎమ్మెల్యేలను పాడుచేశారు. అధికారులను జైలుకు పంపారు. బతికుండగా వైఎస్ ప్రతిసారీ విశ్వసనీయత గురించి మాట్లాడేవారు. విశ్వసనీయత అంటే దోచుకోవడమా?' అన్నారు. ఆయన హ యాంలో టీడీపీ కార్యకర్తలు 200 మంది ప్రాణాలు కోల్పోయారన్నారు. చివరకు వైఎస్ పత్రికల్నీ వదిలిపెట్టలేదని, కొడుకు పత్రిక, టీవీ కోసం ఇతర పత్రికల విశ్వసనీయతను దెబ్బతీసేందుకు ప్రయత్నించారని గుర్తుచేశారు. తాత రాజారెడ్డి హత్యా రాజకీయ వారసత్వాన్ని జగన్ పుణికిపుచ్చుకున్నారని ధ్వజమెత్తారు. "జగన్ నన్నూ బెదిరించారు.

'మీ నాన్నే నన్నేమీ చేయలేకపోయాడు. నువ్వేం చేస్తావ్' అని అడిగాను'' అని చెప్పుకొన్నారు. కాగా, తల్లి కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్‌లు ఎన్ని కుయుక్తులు పన్నినా అంతిమ విజయం టీడీపీదేనని ధీమా వ్యక్తం చేశారు. పాదయాత్రకు ముందుగా కొవ్వాడలో పెద్దాపురం నియోజకవర్గం కార్యకర్తల సమావేశంలో బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 1984 సంక్షోభాన్ని గుర్తు చేశారు. "కొంతమందికి కొన్ని విషయాలు ముందే తెలిసిపోతాయి. 1984 ఆగస్టు సంక్షోభం గురించి నా మనసు ఎందుకో శంకించింది. నాదెండ్ల వెన్నుపోటు పొడుస్తున్నారని ముందే అనిపించింది. సంకల్పాన్ని బట్టి బుద్ధి పనిచేస్తుంది'' అని చెప్పుకొచ్చారు.

గతంలో పెళ్లి చేయాలంటే రెండు తరాలు చూసేవారని, అభ్యర్థుల్ని ఎంపిక చేయాలంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏడు తరాలు చూడాలేమోనని చమత్కరించారు. ఈ సమయంలో జిలానీ అనే కార్యకర్త వైఎస్ సమాధి అంశం లేవనెత్తడంతో చర్చ ఆసక్తిదాయకంగా మారింది. "సార్! ఇడుపులపాయలో రాజశేఖరరెడ్డి సమాధి చాలా పెద్దదిగా కట్టారు. చుట్టూ కరెంటు పెట్టారు. ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ సమాధులు కూడా ఇంత పెద్దగా లేవు. అసలు ఆ సమాధిలో వైఎస్ శవం ఉందో.. మరేముందో?' అని అనగా "బంగారం దాచిపెట్టారేమో?'' అని చంద్రబాబు సరదాగా అన్నారు.

వైఎస్ పాపాల వల్లే మనకీ 'షాక్‌లు'

March 30, 2013


నిమ్స్‌కు వచ్చి 'దేశం' ఎమ్మెల్యేలకు
నిమ్మరసం ఇచ్చిన భువనేశ్వరి

హైదరాబాద్ : విద్యుత్ సమస్యలపై నిరవధిక దీక్ష చేపట్టిన టీడీపీ ఎమ్మెల్యేలు శనివారం ఉదయం దీక్షలను విరమించారు. పార్టీ అధినేత చంద్రబాబునాయుడు సతీమణి భువనేశ్వరి నిమ్స్ ఆస్పత్రికి చేరుకుని ఎమ్మెల్యేలకు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. అనారోగ్యం క్షీణించిన ఎమ్మెల్యేలకు నిమ్స్ వైద్యులు చికిత్స అందజేస్తున్నారు.

నిమ్స్ ఆస్పత్రి వద్ద ఎర్రబెల్లి దయాకర్‌రావు మాట్లాడుతూ దీక్షల భగ్నంతో ఉద్యమాన్ని ఆపలేరని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ప్రభుత్వం దిగివచ్చే వరకు పోరాటం కొనసాగిస్తామని ఆయన ప్రకటించారు. మధ్యాహ్నం టీడీఎల్పీ సమావేశం ఏర్పాటు చేసి, భవిష్యత్ కార్యాచరణపై ప్రకటన చేయనున్నట్లు ఎర్రబెల్లి తెలిపారు.

'వస్తున్నా మీకోసం' పాదయాత్రలో భాగంగా తూ.గో జిల్లాలో పర్యటిస్తున్న చంద్రబాబునాయుడు టెలీకాన్ఫరెన్స్ ద్వారా దీక్ష విరమించిన ఎమ్మెల్యేలను పరామర్శించారు.

విద్యుత్ సమస్యలపై నాలుగు రోజులుగా ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో టీడీపీ ఎమ్మెల్యేలు దీక్ష చేస్తున్న విషయం తెలిసిందే. ఎమ్మెల్యేల ఆరోగ్య పరిస్థితి క్షీణించిందన్న కారణంపై పోలీసులు దేశం ఎమ్మెల్యేల దీక్షను భగ్నం చేశారు. గత అర్ధరాత్రి దీక్ష శిబిరం వద్దకు చేరుకుని ఎమ్మెల్యేలను వివిధ ఆస్పత్రుల నుంచి తెప్పించిన అంబులెన్స్‌లలో నిమ్స్‌కు తరలించారు.

టీడీపీ ఎమ్మెల్యేల దీక్ష విరమణ

హైదరాబాద్ : టీడీపీ ఆవిర్భావ వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి. ఇటు పార్టీ కార్యాలయంలోను, ఎమ్మెల్యేలు దీక్ష చేస్తున్న పాత ఎమ్మెల్యే క్వార్టర్స్‌లోనూ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా జరుపుకొన్నారు. ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో పొలిట్‌బ్యూరో సభ్యుడు అశోక్ గజపతిరాజు పార్టీ పతాకావిష్కరణ చేశారు. దేశంలో కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ప్రజలను మొదట జయప్రకాష్ నారాయణ కూడగడితే ఆ తర్వాత ఆ పనిని ఎన్టీ రామారావు మాత్రమే చేయగలిగారని అశోక్ గజపతిరాజు ప్రశంసించారు.

టీడీపీ ప్రభుత్వం పేదవాడి కోసమే పనిచేసిందని ఆ పార్టీ శాసనసభాపక్ష ఉపనేత మోత్కుపల్లి నర్సింహులు వ్యాఖ్యానించారు. కాంగ్రెస్, వైసీపీలను తన్ని తరిమేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. "జగన్ పార్టీ నేతలు ఊరికే టీడీపీపై నోరు పారేసుకోవడం కాదు. జగన్ జైలులో ఎందుకు ఉన్నాడు? ఆయన ఏమైనా ప్రజల సమస్యలపై పోరాటం చేసి జైలుకు వెళ్లాడా? జైలులో పెట్టింది ప్రభుత్వ సొమ్ము దిగమింగినందుకు కాదా? ఆ పార్టీ నేతలు ముందు దీనికి సమాధానం చెప్పాలి'' అని మోత్కుపల్లి డిమాండ్ చేశారు.

కాగా, జానపద కళాకారులు ఎన్టీఆర్‌పై పాటలు పాడినప్పుడు టీడీపీ ఎమ్మెల్యేలు ఉత్సాహం ఆపుకోలేక నిరాహార దీక్షా శిబిరం వేదికపై నృత్యాలు చేశారు. మోత్కుపల్లి నర్సింహులు, జైపాల్ యాదవ్, పి. రాములు, కేఎస్ రత్నం వీరిలో ఉన్నారు. మిగిలిన ఎమ్మెల్యేలు చప్పట్లతో వారిని ప్రోత్సహించారు.

మరోవైపు ఎన్టీఆర్ భవన్‌లోనూ ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించారు. రాష్ట్రం నలుమూలలనుంచి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఎన్టీఆర్ విగ్రహానికి నేతలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. తెలుగు ప్రజలు ఉన్నంత కాలం టీడీపీ ఉంటుందని కోడెల శివప్రసాదరావు పేర్కొన్నారు. పార్టీ సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో సహకరించిన శ్రేణులకు మరో నేత పెద్దిరెడ్డికృతఙ్ఞతలు తెలిపారు.

ఘనంగా టీడీపీ ఆవిర్భావ వేడుకలు

మాకు రుణమాఫీ
చిన్న, మధ్యతరహా పరిశ్రమల సంఘం అధ్యక్షుడు ఏపీకే రెడ్డి

హైదరాబాద్ : విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్‌సీ) ప్రభుత్వానికి భజన మండలిగా మారిపోయిందని చిన్న, మధ్యతరహా పరిశ్రమల సంఘం అధ్యక్షుడు ఏపీకే రెడ్డి ధ్వజమెత్తారు. వినియోగదారుల అవసరాలను పట్టించుకోకుండా ట్రాన్స్‌కో, డిస్కంలు ఏది చెబితే దానికి తలూపుతోందని దుయ్యబట్టారు. "టీడీపీ హయాంలో మేం అసలు విద్యుత్ గురించి ఆలోచించాల్సిన అవసరం ఉండేది కాదు. ఆనాడు విద్యుత్ నిర్వహణ చాలా బాగుండేది.

ఇప్పుడు పరిశ్రమలకు కేటాయించిన విద్యుత్తు లోడులో 65 శాతానికి మించి వాడుకొంటే ఐదు నుంచి పది రెట్లు జరిమా నా విధిస్తామని హెచ్చరిస్తున్నారు'' అని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ ఖర్చు పెరిగిపోయి పొరుగు రాష్ట్రాల్లోని ఉత్పత్తిదారులతో పోటీ పడలేకపోతున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. " నష్టాల్లో కూరుకుపోయాం. రైతుల మాదిరిగా మాకూ రుణ మాఫీ పథకం ప్రకటించా లి. పరిశ్రమలకు ప్రత్యేక బడ్జెట్ పెట్టాలి'' అని విజ్ఞప్తి చేశారు.

టీడీపీ హయాంలో విద్యుత్తు నిర్వహణ భేష్


రాఘవులు సవాల్..తులసిరెడ్డి వ్యాఖ్యలకు స్పందన

హైదరాబాద్: 'ప్రజలు ఏభై పైసలు భారం భరించలేరా అని కాంగ్రెస్ అధికార ప్రతినిధి తులసిరెడ్డి అంటున్నారు. ఆయన కరేపాకు వంటివారు. ఆయన ఏం మాట్లాడినా పట్టించుకొనేవాళ్లు లేరు. అదే మాటను చేతనైతే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్‌రెడ్డి, పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణను అనమనండి చూద్దాం. అప్పుడు మా సమాధానమేమిటో చెబుతాం' అని సిీపీఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీవీ రాఘవులు సవాల్ విసిరారు. పాత ఎ మ్మెల్యే క్వార్టర్లలోని టీడీపీ ఎమ్మెల్యేల దీక్షా శిబిరాన్ని శుక్రవారం సందర్శించిన ఆయన మాట్లాడారు.

ముఖ్యమంత్రి, మంత్రులు, అధికారులను కూర్చోబెట్టుకొని కసరత్తు చేస్తే ఉపయోగం లేదని, విద్యుత్ నిపుణులతో చర్చించి ప్రజలపై భారం తగ్గించే మార్గాలు అన్వేషించాలని కోరారు. ప్రభుత్వం రూ.3700 కోట్ల భారం మోయాలని విద్యుత్ నియంత్రణ మండలి సూచించిందని, దానిని ప్రభుత్వం పాటించాలని డిమాండ్ చేశారు. "వంద యూనిట్లు లోపు కరెంటు వాడేవారి బిల్లులో ఏభై శాతం రాయితీ ఇస్తామని ప్రభుత్వంలోని పెద్దలు చెబుతున్నారు. సంతోషం. ఆ పని చేయమనండి. కానీ ఆ ఖర్చు ఎస్సీ ఎస్టీ నిధుల నుంచి భరిస్తామనడం సరికాదు. ఈ రాయితీల కోసం వాటిని దారి మళ్లిస్తామంటే ఊరుకొనేది లేదు'' అని హెచ్చరించారు. విద్యుత్ చార్జీలు, కోతలకు నిరసనగా దీక్ష చే స్తున్న ఎమ్మెల్యేల ఆరోగ్యం క్షీణిస్తున్నా ప్రభుత్వంలో కదలిక లేదని, కాంగ్రెస్ నాయకులు రాక్షసుల మాదిరిగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.

టీడీపీ దీక్షకు నాగం సంఘీభావం: విద్యుత్ సమస్యపై టీడీపీ ఎమ్మెల్యేలు చేపట్టిన నిరవధిక నిరాహార దీక్షకు తెలంగాణ నగారా సమితి అధ్యక్షుడు, ఎమ్మెల్యే నాగం జనార్దనరెడ్డి సంఘీభావం ప్రకటించారు. శుక్రవారం రాత్రి ఆయన ఎమ్మెల్యేల దీక్షా శిబిరానికి వచ్చి వారిని పరామర్శించారు. 'టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు నేనూ మంత్రినే. కరెంటు సమయాలను బట్టి రైతులు గడియారాలను సరిచేసుకునేంత కచ్చితంగా వేళలు పాటించాం. కాంగ్రెస్ వచ్చి ఈ వ్యవస్థను నాశనం చేసింది. టీడీపీ ఎమ్మెల్యేల దీక్ష కాంగ్రెస్ కళ్లు తెరిపిస్తుందని ఆశిస్తున్నా' అని అన్నారు.

ఆ మాట కిరణ్,బొత్స అనగలరా?

'దేశం' దీక్ష భగ్నం!

హైదరాబాద్ : తెలుగుదేశం ప్రజా ప్రతినిధులపై ప్రభుత్వం పోలీసులను ప్రయోగించింది. కరెంటు చార్జీల పెంపు, కోతలను నిరసిస్తూ చేపట్టిన నిరవధిక నిరాహార దీక్షలను అర్ధరాత్రి భగ్నం చేసింది. దీక్ష నాలుగో రోజుకు చేరడం, పలువురు ఎమ్మెల్యేల ఆరోగ్యం ఆందోళనకరంగా మారడంతో ఇక 'భగ్నం' చేయడమే మేలని భావించింది. శుక్రవారం అర్ధరాత్రి ఒంటి గంట దాటిన తర్వాత దీక్ష వేదిక వద్దకు భారీగా పోలీసులు చేరుకున్నారు.

ఇది ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో ఉండటంతో... నిబంధనల ప్రకారం అంతకుముందే స్పీకర్ అనుమతి తీసుకున్నారు. సుమారు 150 మంది పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అటు... టీడీపీ కార్యకర్తలు కూడా పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. పోలీసులను ప్రతిఘటించేందుకు ప్రయత్నించారు. వీరిని పక్కకు తప్పించిన పోలీసులు... దీక్షలో ఎమ్మెల్యేలను అదుపులోకి తీసుకున్నారు. అప్పటికే వివిధ ఆస్పత్రుల నుంచి తెప్పించిన అంబులెన్సుల్లో వారిని నిమ్స్ ఆస్పత్రికి తరలించారు.

ప్రభుత్వ తీరును ఎర్రబెల్లి దయాకర్‌రావు, మోత్కుపల్లి నరసింహులు తీవ్రంగా ఖండించారు. ప్రజా సమస్యపై దీక్షకు దిగిన తమను అర్ధరాత్రి వేళ అమానుషంగా అరెస్టు చేశారని మండిపడ్డారు. "కరెంటు సమస్యపై మేం అడిగిన ప్రశ్నలకు శాసనసభలో సరైన సమాధానమే లేదు. వ్యవసాయానికి రెండు మూడు గంటలు కూడా కరెంటు ఇవ్వడంలేదు. సమస్యలు వస్తే ఫోన్ చేయండి అని సభలోనే చెప్పిన మంత్రి పొన్నాల లక్ష్మయ్య తన ఫోన్లు ఆఫ్ చేసి పెట్టుకున్నారు.

ప్రజలపై వేలకోట్ల భారం మోపుతున్నారు'' అని విమర్శించారు. ఆస్పత్రిలో కూడా దీక్షలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. శనివారం అన్ని మండల కేంద్రాల్లో నిరాహార దీక్షలు చేస్తామన్నారు. స్పీకర్ నుంచి అనుమతి రావడంలో ఆలస్యమైనందునే అర్ధరాత్రి అరెస్టు చేయాల్సి వచ్చిందని ఎమ్మెల్యేలు తెలిపారు. ప్రజా ప్రతినిధుల ఆరోగ్యం ఆందోళనకరంగా ఉన్నందునే ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఆందోళనకరంగా సత్యవతి, సీతక్క పరిస్థితి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఒక రాజ్యసభ సభ్యుడితో సహా మొత్తం 29 మంది ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో దీక్షకు దిగిన సంగతి తెలిసిందే. వీరిలో 25 మంది ఎమ్మెల్యేలు, ఎంపీ సీఎం రమేశ్ నాలుగు రోజులుగా దీక్ష చేస్తున్నారు. వీరిలో మహిళా ఎమ్మెల్యేలు సత్యవతి రాథోడ్, సీతక్కల పరిస్థితి శుక్రవారం ఆందోళనకరంగా మారింది. కూర్చునే ఓపిక కూడా లేక వీరిద్దరూ పూర్తిగా పడుకొనే ఉంటున్నారు. సత్యవతి పలుమార్లు వాంతులు చేసుకొన్నారు.

పోలీసులు శుక్రవారం మధ్యాహ్నం అపోలో ఆస్పత్రికి చెందిన వైద్యులను పిలిపించి ఈ ఇద్దరు ఎమ్మెల్యేలను పరీక్షించారు. వారిని ఆస్పత్రికి తరలించాలని వైద్యులు సిఫార్సు చేశారు. కానీ, వారు శిబిరం వీడి వెళ్లడానికి నిరాకరించారు. పోలీసులు ముందు జాగ్రత్తగా ఒక అంబులెన్స్‌ను దీక్షా శిబిరం ఉన్న పాత ఎమ్మెల్యే క్వార్టర్స్ ఆవరణలో ఉంచారు. పురుష ఎమ్మెల్యేల్లో జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ పరిస్థితి ఇబ్బందికరంగా ఉందని టీడీపీ వర్గాలు తెలిపాయి. వైద్య వర్గాలు ఉదయం, సాయంత్రం దీక్షలో ఉన్నవారి ఆరోగ్య పరిస్థితిని పరీక్షించి నివేదిక తయారు చేస్తున్నారు.

ఎమ్మెల్యేలు పరీక్షలకు సహకరించడం లేదని రాయాలని కోరిన ఒక పోలీసు అధికారిపై టీడీపీ ఎమ్మెల్సీ నన్నపనేని రాజకుమారి విరుచుకుపడ్డారు. అందరూ సహకరిస్తుంటే అలా ఎలా రాయాలని వైద్యులకు చెబుతారని ఆమె ఆ అధికారిని నిలదీశారు. మీడియా అక్కడ నుంచి వెళ్లిపోవాలని ఆ అధికారి కోరడంపెనా ఆమె వాగ్వివాదానికి దిగారు. శుక్రవారం హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, వరంగల్, ఖమ్మం జిల్లాలకు చెందిన కార్యకర్తలు శిబిరం వద్దకు తరలివచ్చారు.

నేడు మండల కేంద్రాల్లో దీక్షలు:టీడీపీ

రాయదుర్గంటౌన్: పేదల అభివృద్ధి కోసం తెలుగుదేశం పార్టీని నందమూ రి తారకరామరావు స్థాపించారని టీ డీపీ నాయకులు పేర్కొన్నారు. టీడీపీ 32 వ ఆవిర్భావ దినోత్సవాన్ని శుక్రవా రం పట్టణంలోని పార్టీ కార్యాలయం లో ఘనంగా నిర్వహించారు. ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కణేకల్లు రో డ్డు, లక్ష్మీబజార్, పాతబస్టాండ్, గాంధీ సర్కిల్, వినాయక సర్కిల్, బళ్లారిరోడ్డు మీదుగా శాంతినగర్‌లోని ఎన్టీఆర్ వి గ్రహం వరకు ద్విచక్రవాహనాల్లో ర్యా లీ నిర్వహించారు.

ప్రభుత్వాస్పత్రిలోని రోగులకు బ్రెడ్లు, పండ్లు పంపిణీ చే శారు. ఈ సందర్భంగా టీడీపీ సీనియర్ నాయకులు ఈ రామాంజినేయు లు మాట్లాడుతూ ప్రజల సంక్షేమం కో సమే తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిందన్నారు. కాంగ్రెస్ పార్టీ సామాన్యుల సంక్షేమాన్ని విస్మరించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ వైఫల్యాలను ప్రజలకు వివరించి చైతన్యవంతులను చేసి రాబోయే రోజుల్లో టీడీపీ అధికారంలోకి తెచ్చేందుకు నాయకులు, కా ర్యకర్తలు శక్తివంచన లేకుండా కృషి చే యాలని కోరారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు పసుపులేటి రాజు, పొరాళ్లు శ్రీనివాసులు, సంపత్ కు మా రి, వెంకటేశులు, పురుషోత్తమ్, వెంకటస్వామి నాయుడు పాల్గొన్నారు.

కణేకల్లులో : మండలంలో టీడీపీ 32 వ ఆవిర్భావ దినోత్సవం శుక్రవారం ఘనంగా జరిగింది. హనకనహాళ్ గ్రా మంలో టీడీపీ నాయకుడు ఎస్‌కే మల్లికార్జున ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు ఘనంగా జరుపుకున్నారు. ఎన్టీఆర్ చి త్రపటానికి పూలమాలలు వేసి రాష్ట్ర ప్రజలకు టీడీపీ పార్టీ చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. అనంతరం 2500 కిలోమీటర్లు పాదయాత్ర చేసిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆ రోగ్యం బాగుండాలని మారెమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకు లు యోగీశ్వరరెడ్డి, హనుమంతరెడ్డి, శేషప్ప, నాగార్జున, ప్రసాద్, వెంకటేశులు, బసిరెడ్డి, ఆదెప్ప పాల్గొన్నారు.

డీ హీరేహాళ్‌లో : తెలుగుదేశం పార్టీ 32వ ఆవిర్భావ దినోత్సవాన్ని డీ హీరేహాళ్‌లో శుక్రవారం ఆ పార్టీ కార్యకర్తలు ఘనంగా జరుపుకున్నారు. మండలంలోని వివిధ గ్రామాల నుంచి వేలాది మంది టీడీపీ కార్యకర్తలు మండల కేంద్రానికి తరలి వచ్చారు. ముందుగా డీ హీరేహాళ్ లోని ఎన్టీఆర్ విగ్రహానికి పుష్పమాల వేసి నివాళులర్పించారు. అనంతరం పార్టీ నాయకులు చంద్ర, న ర సింహులు, దేవా, కల్యం తిప్పేస్వా మి, ఓబుళాపురం తిప్పేస్వామి, భూషన్, అలివేలు ప్రహళ్లాద తదితరు లు మాట్లాడారు. పేదప్రజల రక్తం నుంచి, శ్రామికుల ఆవేశంనుంచి, అ ణగారిన ప్రజల గుండెల్లోనుంచి టీడీపీ పుట్టుకొచ్చిందని టీడీపీ కార్యకర్తలు ఉద్వేగభరితంగా ప్రసంగించారు.

పేదల అభివృద్ధే ధ్యేయం

ఊసరవెల్లులు వాళ్లు!
'తూర్పు'లో చంద్రబాబు

కాకినాడ : "మా వాళ్ల జోలికి వస్తే ఊరుకోను''అని ప్రభుత్వాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు హెచ్చరించారు. కొంతమంది చొక్కా మార్చినంత సులువుగా పార్టీలు మారుస్తున్నారంటూ ఇటీవల వైసీపీలోకి వెళ్లిన బొడ్డు భాస్కరరామారావును ఉద్దేశించి పరోక్షంగా మండిపడ్డారు. తూర్పుగోదావరి జిల్లా పెదపూడి మండల కేంద్రంలో శుక్రవారం ఆయన పాదయాత్ర ప్రారంభించారు. దోమాడ, కర్రకుదురు, అచ్యుతాపుర త్రయం వరకు నడక సాగించారు. అంతకుముందు.. పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని పెదపూడిలో జిల్లా పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్నారు. పార్టీ జెండాను ఎగరవేసి శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.

"ఎన్టీఆర్ ఒక చరిత్ర. తెలుగు జాతి ఉన్నంత కాలం ఆయన కీర్తి దేదీప్యమానం. అణగారిన వర్గాలను పైకి తీసుకురావడం కోసమే ఆయన పార్టీ పెట్టారు. సమాజమే దేవాలయం...పేదలే దేవుళ్లు.. అన్న నినాదంతో పుట్టిన తెలుగుదేశం పార్టీకి మళ్లీ మంచిరోజులు వస్తున్నాయి. నిస్వార్థంగా పనిచేసే కార్యకర్తల బలమే టీడీపీకి కొండంత అండ. 2014 ఎన్నికలలో మళ్లీ మనం చరిత్ర సృష్టించబోతున్నాం..'' అని కార్యకర్తలను ఉత్సాహపరిచారు. 32వ పార్టీ ఆవిర్భావ వేడుకలను ఢిల్లీ రామ్‌లీలా మైదానంలో జరుపుతామని లాల్‌జాన్ బాషా తెలిపారు. కాగా, దారిలో కలిసిన మహిళలు, యువకులను పలకరిస్తూ చంద్రబాబు ముందుకు సాగారు.

ఈ సందర్భంగా జరిగిన సభల్లో జంప్‌జిలానీ నేతలను తూర్పారబట్టారు. అధికారంలోకి వచ్చిన తరువాత బీసీల సంక్షేమానికి ఏటా రూ వెయ్యి కోట్లు చొప్పున ఐదేళ్లలో రూ.ఐదు వేల కోట్లు వెచ్చిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. జగ్గంపేట, రామచంద్రపురం నియోజకవర్గాలకు చెందిన పార్టీ శ్రేణులతో ఆయన సమావేశమయ్యారు. ఇదిలాఉండగా, ఆరునెలల కాల వ్యవధిలో 2,500 కిలోమీటర్లకు పైగా నడిచిన చంద్రబాబు..బుక్ ఆఫ్ స్టేట్ రికార్డ్స్‌లోకి ఎక్కారు. 'రికార్డ్సు' ప్రతినిధులు శుక్రవారం ఆయనకు 'ఏకవీర' బిరుదు ఇచ్చి సత్కరించారు.

పర్చూరు ఇన్‌చార్జి సాంబశివరావు : టీడీపీ హైదరాబాద్: ప్రకాశం జిల్లా పర్చూరు నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి ఏలూరి సాంబశివరావని తెలుగుదేశం పార్టీ మీడియా విభాగం ఇన్‌చార్జి ఎల్‌వీఎస్ఆర్‌కె ప్రసాద్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. తూర్పు గోదావరి జిల్లా బిక్కవోలులో పార్టీ కార్యకర్తల సమీక్షా సమావేశం నిర్వహించిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు బాగా పనిచేస్తున్నారంటూ పర్చూరు ఇన్‌ఛార్జిగా గోపాలకృష్ణ అనే పేరు ఆయన చెప్పారని మీడియాలో పొరపాటుగా వచ్చిందని, ఆ నియోజకవర్గ ఇన్‌చార్జి సాంబశివరావని ప్రసాద్ వివరణలో పేర్కొన్నారు.

కాంగ్రెస్,వైసీపీ దొంగల్ని తరిమికొట్టండి...

March 29, 2013

ఉండి : సమయం వచ్చినపుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షరాలు తోట సీతారామలక్ష్మి పేర్కొన్నారు. హైదరాబాద్‌లో టీడీపీ ఎమ్మెల్యేలు చేపట్టిన దీక్షకు మద్దతుగా ఉండిలో గురువారం దీక్షలను కొనసాగించారు. ఈ దీక్షలను టీడీపీ జిల్లా అధ్యక్షరాలు తోట సీతారామలక్ష్మి ప్రారంభించారు.అనంతరం ఆమె మాట్లాడుతూ ప్రజల సమస్యల ను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైయిందని విమర్శించారు. మండ ల టీడీపీ అధ్యక్ష, కార్యదర్శులు జుత్తుగ శ్రీను, మోపిదేవి శ్రీను మా ట్లాడుతూ పెంచిన విద్యుత్ చార్జీలను తగ్గించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో దవిళి శ్రీను, పోలుబోతు రాము, వనిమ శ్రీనివాస్, యిర్రింకి సత్యనారాయణ, కాగిత సత్యనారాయణ, కొల్లి మహంకాళి, దండు సు బ్బరాజు,బి.రమేష్, పాలకోడేరు మం డల టీడీపీ అధ్యక్షుడు కొత్తపల్లి గోపా ల కృష్ణంరాజు,చలమలశెట్టి సత్యనారాయణ,కాగిత మహంకాళి, కట్టా గంగాధరరావు, కైలా రాజు పాల్గొన్నారు.

కాంగ్రెస్‌కు ప్రజలే బుద్ధి చెబుతారు..

హన్మకొండ:కరెంట్ కోతలు, చార్జీల పెంపునకు నిరసనగా గురువారం జిల్లా వ్యాప్తం గా తెలుగు దేశం పార్టీ శ్రేణులు నిరాహార దీక్షలు చేపట్టారు. కరెంట్ బిల్లుల ను దహనం చేశారు. 9 నియోజకవర్గా ల్లో ఆందోళన కార్యక్రమాలుజరిగాయి. మిగతా మూడింట్లో శుక్రవారం నిర్వహిస్తారు. జనగామ నియోజవకర్గం పరిధిలో జనగామ, బచ్చన్నపేట మం డలాల్లో టీడీపీ కార్యకర్తలు నిరాహార దీక్షలు చేశారు.

పాలకుర్తి నియోజకవర్గంలో తొర్రూరు, రాయపర్తి, దేవరుప్పుల మండలాల్లో, మహబూబాబా ద్‌నియోజకవర్గంలోని గూడూరు మం డలంలో, నర్సంపేట నియోజవకర్గంలోని చెన్నారావుపేట, నల్లబెల్లి మండలాల్లో, వర్దన్నపేట నియోజకవర్గంలో వర్ధన్నపేటలో, భూపాలపల్లి నియోజకవర్గంలో భూపాలపల్లి మండల కేంద్రంలో, ములుగు నియోజకవర్గం లో ములుగు, ఏటూరునాగారం, కొత్తగూడ మండలాల్లో నిరాహార దీక్షలు జరిగాయి. కరెంట్ కోతలను ఎత్తివేయాలని, చార్జీల పెంపును ఉపసంహరించాలని కోరుతూ నినాదాలు చేశా రు.

దీక్షా శిబిరాల వద్ద ప్లకార్డులను ప్రదర్శించారు. వరంగల్ తూర్పు నియోజకర్గంలో హెడ్‌పోస్టాఫీసు వద్ద టీడీపీ బీసీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యద ర్శి గుండు ప్రభాకర్ నేతృత్వంలో కార్యకర్తలు రాస్తారోకో జరిపారు. విద్యుత్ బిల్లులను దహనం చేశారు. కరెంట్‌ను సక్రమంగా సరఫరా చేయడంలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాన్ని ఎం డగడుతూ నినాదాలు చేశారు. హన్మకొండ చౌరస్తా వద్ద టీడీపీ అర్బన్ అధ్యక్షుడు అనిశెట్టి మురళీ నాయకత్వంలో కార్యకర్తలు రాస్తారోకో చేశా రు. కరెంట్ బిల్లులను దహనం చేశా రు.

కొందరు నియోజకవర్గ ఇన్‌చార్జీ లు, ముఖ్య నేతలు హైదరాబాద్‌లోని ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్ వద్ద సాగుతున్న నిరవధిక నిరాహార దీక్షా శిబిరంలో పా ల్గొంటున్నందున తమజిల్లాలోని వారి నియోజకవర్గంలో నిరాహారదీక్ష శిబిరంలో దీక్షలను వాయిదా వేసుకున్నా రు. స్టేషన్‌ఘనపూర్, డోర్నకల్ నియోజకవర్గంలో శుక్రవారం జరుగుతాయి. పరకాల నియోజకవర్గంలో ప్రస్తుతం గ్రామ కమిటీల సమావేశాలు జరుగుతున్నందు వల్ల అవి పూర్తయిన తర్వా త దీక్షలను చేపడతారు.

సంతకాల సేకరణ

కరెంట్ కోతలకు, చార్జీల హెచ్చింపుపై ప్రజలను చైతన్యవంతులను చేయడానికి, తద్వారా రాష్ట్ర ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకురావడానికి ఏప్రిల్ 2 నుంచి 7 వరకు సంతకాల సేకరణను చేపట్టాలని పారీ అధిష్ఠానం పిలుపునిచ్చింది. గ్రామ స్థాయిలో కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి సంతకాలు సేకరిస్తా రు. వీటిని ఏప్రిల్ 9న మండల కేంద్రాలకు ఊరేగింపుగా తీసుకువస్తారు. 11 న నియోజకవర్గాల ఇన్‌చార్జీలకు అప్పగిస్తారు. 18న జిల్లా పార్టీకి అందచేస్తారు. 19న రాష్ట్ర పార్టీకి పంపిస్తారు. 21న హైదరాబాద్‌లో టీడీఎల్‌పీ సమావేశంలో సంతకాల సేకరణపై చర్చిస్తారు. 22న ర్యాలీగా వెళ్ళి గవర్నర్‌కు అందచేస్తారు.

కొత్త భవనంలోకి పార్టీ కార్యాలయం

ప్రస్తుతం హన్మకొండలో ఎన్‌జీవోస్ కాలనీ రోడ్డులో ఉన్న ఈ కార్యాలయా న్ని శుక్రవారం హన్మకొండ హంటర్‌రోడ్‌లో వనవిజ్ఞాన్‌ను ఆనుకొని ఉన్న కొత్త భవనంలోకి మార్చుతున్నారు. ఉదయం 9గంటలకు కార్యాలయ ప్రారంభోత్సవం ఉంటుంది. అనంత రం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల ను నిర్వహిస్తారు. ఆ తర్వాత పార్టీ ముఖ్యనేతల ఇష్టాగోష్ఠి కార్యక్రమం ఉంటుంది. అవిర్భాదినోత్సవం సందర్భంగా శుక్రవారం జిల్లాలోని అన్ని నియోజకవర్గ కేంద్రాలు, మండల కేం ద్రాల్లో, గ్రామాల్లోని పార్టీ కార్యాలయాల్లో ఆవిర్భావ వేడుకలను ఘనం గా నిర్వహించాలని పార్టీ పిలుపునిచ్చింది.

'విద్యుత్' మంటలు

గజపతినగరం: విద్యుత్ సంక్షోభానికి కారణమైన కాంగ్రెస్ ప్రభుత్వం వెం టనే గద్దె దిగాలని మాజీమంత్రి పడా ల అరుణ డిమాండ్ చేశారు. విద్యుత్ కోతలు, చార్జీల పెంపునకు నిరసనగా గురువారం టీడీపీ ఆధ్వర్యంలో స్థానిక నాలుగు రోడ్ల జంక్షన్‌లో రహదారి పక్కన రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యు త్ సర్‌చార్జీల పేరుతో చార్జీలు పెంచు తూ వినియోగదారులపై తీవ్ర భారా న్ని మోపడంతోపాటు నాణ్యమైన వి ద్యుత్‌ను అందించడం లేదని అన్నారు. కరెంటు ఎప్పుడు ఉంటుందో , ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి నెలకొందన్నారు.

గంట్యాడ మాజీ ఎంపీపీ కె. కొండలరావు, ఎస్.పైడిరాజు, గండ్రే డి అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు. విద్యుత్ సర్‌చార్జీలు వెంటనే తొ లగించాలని టీడీపీ నియోజకవర్గ నా యకులు కరణం శివరామకృష్ణ డిమాం డ్ చేశారు. పార్టీ కార్యాలయం ఎదుట కార్యకర్తలు, నాయకులతో రిలే నిరాహా ర దీక్ష చేపట్టారు. మాజీ ఎంపీపీ కం ది తిరుపతినాయుడు, త్రినాధరావు,గద్దె రవి. మండల లక్ష్ముంనాయుడు, తదితరులు పాల్గొన్నారు.

చంద్రబాబు చెప్పిందే జరిగింది

సాలూరు : కాంగ్రెస్ ప్రభుత్వ చేతగానితనం వలన ఏర్పడిన విద్యుత్ సం క్షోభంపై చంద్రబాబు చెప్పిందే జరిగిందని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ సం ధ్యారాణి అన్నారు. గురువారం స్థానిక జాతీయ రహదారి పక్కన దేశం నాయకులు నిరాహార దీక్షలు నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే భంజ్‌దేవ్, ఇన్‌చార్జ్ సంధ్యారాణి మాట్లాడారు. విద్యుత్ సమస్యపై చర్చించాలని ప్రతిపక్షనాయకులు, ఇతర పార్టీల నాయకులు, ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తున్నా ప్రభుత్వం చర్చ జరగనివ్వలేదని అన్నారు. ప్రభు త్వ చర్యలకు నిరసిస్తూ ఎమ్మెల్యేలు, నాయకులు నిరాహార దీక్షలు చేపట్టారన్నారు. వారికి సంఘీభావంగా తాము దీక్షలు చేపట్టామని చెప్పారు. శిబిరంలో పట్టణ టీడీపీ అధ్యక్షులు నిమ్మాది చిట్టి, గిరిచిన్నిదొర, బి విశ్వేశ్వరరావు, బలగ పైడిరాజు, డబ్బి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం గద్దె దిగాలి

అనకాపల్లి: విద్యుత్ కోతలు, ఇంధన సర్దుబాటు చార్జీలపేరుతో అదనపు బాదుడు, వచ్చే నెల నుంచి పెంచనున్న విద్యుత్ చార్జీలకు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో గురువారం రాత్రి అనకాపల్లిలో భారీ ఎత్తున నిరసన కార్యక్రమాలు జరిగాయి. పార్టీ జిల్లా అధ్యక్షుడు దాడి రత్నాకర్ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు కాగడాలతో నెహ్రూచౌక్‌లో మానవహారంగా ఏర్పడి నిరసన తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పూర్వకాలంలో ప్రజలు కాగడాలతో కాలం వెళ్లదీసేవారని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం నాటి రోజులను పునరావత్తం చేస్తున్నదని ఎద్దేవా చేశారు. విద్యుత్ సమస్యలపై తాము చేపట్టిన ఆందోళన ఆరంభం మాత్రమేనని, ముందు ముందు రిలే నిరాహార దీక్షలు, ఆందోళనలు, బంద్‌లు చేస్తామని హెచ్చరించారు.

వచ్చే నెల నుంచి పెరగనున్న విద్యుత్ చార్జీల వల్ల ప్రస్తుతం ఐదు వందల రూపాయల బిల్లు వచ్చేవారికి ఎనిమిది వందల రూపాయలు, వెయ్యి రూపాయలు వచ్చే వారికి 1600 రూపాయల బిల్లు వస్తుందన్నారు. విద్యుత్ బిల్లులు కట్టలేక పేదలు చీకట్లో మగ్గాల్సిన దుస్థితి రాబోతున్నదన్నారు. గ్యాస్ ధర పెంచడం, సబ్సిడీ సిలిండర్లపై కోత విధించడం వల్ల ప్రజలు మళ్లీ కట్టెలపొయ్యిలను ఆశ్రయించాల్సి వస్తుందన్నారు. విద్యుత్‌చార్జీల పెంపు ప్రతిపాదన విరమించుకునేంత వరకు ఉద్యమం ఆగదని ఆయన స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు బుద్ద నాగజగదీశ్వరరావు, మద్దాల రమణబాబు, బొడ్డపాటి చినరాజారావు, బొలిశెట్టి శ్రీనివాసరావు, పొలమరశెట్టి గిరినాయుడు, అక్కిరెడ్డి రమణబాబు, దొడ్డి సూరిబాబు తదితరులు పాల్గొన్నారు.

అచ్యుతాపురం: రాష్ట్రంలో కోతల ప్రభుత్వం నడుస్తోందని టీడీపీ రూరల్ జిల్లా అధ్యక్షుడు దాడి రత్నాకర్ అన్నారు. కోతలకు నిరసనగా గురువారం స్థానిక విద్యుత్ ఉపకేంద్రాన్ని ముట్టడించారు.

ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు తొమ్మిది గంటల పాటు నిరంతరాయంగా ఉచిత కరెంటు అందిస్తామని ప్రకటించిన కాంగ్రెస్ ప్రస్తుతం ర్రాష్టాన్ని అంధకారంలోకి నెట్టేసిందన్నారు. సక్రమంగా విద్యుత్ సరఫరా చేయకపోగా ఏప్రిల్ ఒకటి నుంచి గృహవసరాలకు వినియోగించే విద్యుత్ బిల్లులను 60 శాతం పెంచుతుండడం దారుణమన్నారు.

రాజీవ్ యువకిరణాలంటూ లక్షమందికి ఉద్యోగాలిచ్చేస్తామని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి ఆర్భాటంగా ప్రకటించారని, ప్రస్తుతం విద్యుత్ కొరతకారణంగా ఉన్న ఉద్యోగాలు వూడిపోతున్నాయని ఎద్దేవా చేశారు. కొన్ని కర్మాగారాలు వారానికి మూడు రోజులు పవర్ హాలిడే పేరిట మూసివేస్తున్నాయన్నారు. దీంతో సిబ్బందిని తగ్గించేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

అంతకు ముందు పార్టీకార్యాలయంనుంచి ర్యాలీగా విద్యుత్ ఉపకేంద్రం వరకు వచ్చి ముట్టడించారు. విద్యుత్ బిల్లులను తగులబెట్టారు. కార్యక్రమంలో ఎలమంచిలి నియోజకవర్గం టీడీపీ కన్వీనర్ లాలంభాస్కరరావు, అచ్యుతాపురం, మునగపాక మండల టీడీపీ అధ్యక్షుడు రాజాన రమేష్‌కుమార్, దాడి ముసిలినాయుడు, కాండ్రేగుల జోగినాయుడు, కె.వెంకటరావు, పి.చిన్నయ్యనాయుడు, మేరుగు అప్పలనాయుడు, ఉమ్మిడి అప్పారావు, గూడేల కనక, రొంగలి అప్పారావు తదితరులు పాల్గొన్నారు.

'విద్యుత్'పై తెలుగుదేశం నిరసన

శంకర్‌పల్లి: విద్యుత్ సమస్య పరిష్కరించటంతో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని టీడీపీ మండల పార్టీ అధ్యక్షుడు వెంకట్‌రాంరెడ్డి అన్నారు. గురువారం రాత్రి శంకర్‌పల్లిలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఏడు గంటల నాణ్యమైన విద్యుత్‌ను ఇస్తామని మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ రైతులను మోసం చేసిందని ఆరోపించారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌కు తగిన బుద్ధి చెప్పాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు వెంకట్‌రెడ్డి, జనార్దన్‌రెడ్డి, నర్సింహులుగౌడ్, శ్రీధర్, శ్రీశైలం, పాండు, గోవిందరెడ్డి, శ్రీశైలం, ఆనందం, మహమూద్ తదితరులు పాల్గొన్నారు.

మొయినాబాద్‌లో... మొయినాబాద్: కాంగ్రెస్ పాలనలో గ్రామాలు అంధకారమయ్యాయని టీడీపీ మండల పార్టీ అధ్యక్షుడు హన్మంత్‌రెడ్డి అన్నారు. విద్యుత్ సమస్యను పరిష్కరించాలని టీడీపీ ఎమ్మెల్యేలు చేపడుతున్న దీక్షకు సంఘీభావంగా గురువారం రాత్రి మొయినాబాద్‌లో కొవ్వొత్తుల ప్రదర్శన చేశారు. విద్యుత్ కోత కారణంగా గ్రామాలు అంధకారమయ్యాయని రైతులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. విద్యుత్ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు ఉద్యమం కొనసాగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా కార్యదర్శి హన్మంత్‌యాదవ్, నాయకులు గడ్డం వెంకట్‌రెడ్డి, నీలకంఠం, రమేష్, రవియాదవ్, కిషన్, జైపాల్‌రెడ్డి, రంగారెడ్డి, జనార్ధన్‌రెడ్డి, కృపాకర్, మధుయాదవ్, మోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో... శంషాబాద్: విద్యుత్ సరఫరా చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని నిరసిస్తూ టీఎన్ఎస్ఎఫ్ నాయకులు గురువారం మండల కేంద్రం శంషాబాద్‌లోని అంబేద్కర్ చౌరస్తాలో ప్రభుత్వం దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా టీఎన్ఎస్ఎఫ్ నాయకులు అజయ్, సిద్దేశ్వర్ మాట్లాడుతూ విద్యుత్ సరఫరా సరిగాలేక పంటలు ఎండిపోయి రాష్ట్ర రైతాంగం పూర్తిగా నష్టాలకు గురవుతున్నారన్నారు. రైతులను పూర్తిస్థాయిలో ఆదుకుంటామని ఉచితకరెంటు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం ఉన్న కరెంటు తీసివేస్తుందని ధ్వజమెత్తారు. .

విద్యుత్ సరఫరాను ప్రభుత్వం మెరుగుపర్చేవరకు తాము ఆందోళన చేస్తుంటామని హెచ్చరించారు. వెంటనే సరఫరాను మెరుగుపర్చాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమానికి ముందు ప్రభుత్వం దిష్టిబొమ్మను దహనం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆంజనేయులు, సాయి, ప్రేం, శ్రీను, కృష్ణ, మహేందర్ తదితరులు పాల్గొన్నారు.

విద్యుత్ సమస్యలపై టీడీపీ ఆందోళన

ఆర్మూర్ అర్బన్: విద్యుత్ కోతలకు నిరసనగా టీడీపీ ఎమ్మెల్యేలు చేపట్టిన దీక్షకు మద్దతుగా ఆర్మూ ర్ తెలుగుదేశం ఆధ్వర్యంలో గురువారం డీఈ కార్యాలయం ఎదుట కొవ్వొత్తులతో ప్రదర్శన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యుత్ కోతలతో పంట పొలాలు బీడు భూములుగా మారిపోతున్నాయని విమర్శించారు. ఎన్నికలకు ముందు నిరంతరాయంగా కరెంటు సరఫరా చేస్తామన్న ప్రభుత్వం హామీలను విస్మరించిందని విమర్శించారు.

కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నిరంతరాయంగా కరెంటు సరఫరా చేయకుంటే ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షులు జీవీ.నర్సింహరెడ్డి, తెలుగు యువత పట్ట ణ అధ్యక్షులు జక్కుల రాజేశ్వర్, గాండ్లసాగర్, చేత న్, పోహర్‌కిరణ్, నూకల ప్రభాకర్‌లు పాల్గొన్నారు.

'కాంగ్రెస్‌కు రైతులే గుణపాఠం చెబుతారు'

భీమ్‌గల్: రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటున్న కాంగ్రెస్ రైతు సమస్యల్ని విస్మరించి రైతులకు ఇవ్వాల్సిన ఉచిత విద్యుత్ 9 గంటలు నాలుగు గంటలకు కుదించిందని, అయిన విద్యుత్ సరఫరా చేయడం లేదన్నారు. భీమ్‌గల్ మండల కేంద్రంలోని టీడీపీ కార్యాలయంలో మండల కన్వీనర్ గంగాధర్‌గౌడ్ వి లేకరులతో మాట్లాడారు.

నాలుగు రోజులుగా విద్యుత్ సమస్యపై హైదరాబాద్‌లోని ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్‌లో టీడీపీ ఎమ్మెల్యేలు విద్యుత్ సమస్యలు ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పటికీ ప్రభు త్వం ఏ మాత్రం స్పందించకపోవడం ఎంత వరకు సబబని అన్నారు. కరెంటు సమస్యపై కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని అన్నారు. ఏడు గంటల విద్యుత్‌ను అందజేస్తామని ప్రకటనలు చేస్తూ నే కనీసం నాలుగు గంటలు కూడా ఇవ్వకపోవడం ఎంత వరకు సమంజస మన్నారు. విద్యుత్ సమస్యపై ప్రభుత్వం దిగిరాకపోతే 1నుంచి ఆందోళన కార్యక్రమాలను ఉదృతం చేస్తామని అన్నారు వీరితో పాటు మండల టీడీపీ నాయకులు పతాని లింబాద్రి, నాగుల భూమన్న, వీరాచారి, హకీం, ఖలీం ఉన్నారు.

ఎమ్మెల్యేల దీక్ష కు మద్దతుగా కొవ్వొత్తులతో ప్రదర్శన

(నెల్లూరుతెలుగుదేశం పార్టీ (టీడీపీ) ఆవిర్భవించి నేటికి 30 సంవత్సరాలు పూర్త యి 31వ వసంతంలోకి అడుగిడుతోంది. ఈ ప్రస్థానంలో ఆ పార్టీ ఎన్నో ఒడిదుడుకులు చవి చూసింది. చేదు, తీపి జ్ఞాపకాలను పంచింది. పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్‌తో జిల్లాకు విడదీయరాని అనుబంధం ఉంది. గ తంలో సినిమా చిత్రీకరణతోపాటు ఎన్నికల ప్రచారం కోసం రథ యా త్రలు నిర్వహించారు. నేటి రాజకీయ ప్రముఖులు అనేక మంది టీడీపీ నుంచే ఓనమాలు దిద్దారు. ముఖ్యంగా ఎన్టీఆర్ మానస పుత్రిక తెలుగుగంగ ప్రాజెక్టు, సోమశిల విస్తరణ పనులు ఎన్టీఆర్ హయాంలోనే మొదలయ్యాయి. బీసీ, బలహీన వర్గాలను ఆకట్టుకుని ప్రతిసారి ఎన్నికల్లో విజయం సాధిస్తూ వచ్చారు.

కానీ, రెండు సార్లు అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీకి బోణి కాలే దు. ఈ నేపథ్యంలో శుక్రవారం టీడీపీ ఆవిర్భావ దినోత్సవం జరిపేందుకు పార్టీ శ్రేణులు సన్నాహాలు చేస్తున్నారు. ఎందరికో రాజకీయ ఓనమాలు 1982 మార్చి 29న ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పేరును ప్రకటించి ప్రచారం సాగించారు. రథయాత్ర చేపట్టి జిల్లా నలుమూలలు సుడిగాలి పర్యటన జరిపారు. 1983 ఎన్నికల్లో జిల్లాలో టీడీపీ ప్రభంజనం సృష్టించింది. బడుగు, బలహీన వర్గాలు, సాధారణ కుటుంబాల నుంచి వచ్చిన వారికి పార్టీ టికెట్లు ఇచ్చి రాజకీయ నేతలుగా తీర్చిదిద్దారు.తొలి నుంచి రాజకీయ కుటుంబంగా ఉన్న ఆనం రామనారాయణరెడ్డి, టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా అయి మంత్రిగా పని చేశారు. ఇక నల్లపరెడ్డి శ్రీనివాసులురెడ్డి పార్టీలో ప్రముఖ వ్యక్తిగా వ్యవహరించేవారు.

ఆ తరువాత ఆయన తనయుడు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి గత ఉప ఎన్నికల వరకు పార్టీలోనే కొనసాగారు. సర్వేపల్లి ఎమ్మెల్యే ఆదాల ప్రభాకర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కొమ్మి లక్ష్మయ్యనాయుడు, ఎల్లసిరి శ్రీనివాసులురెడ్డి, వంటేరు వేణుగోపాల్‌రెడ్డి తదితరులు కూడా టీడీపీ నుంచి వచ్చిన వారే. జిల్లా పార్టీ అధ్యక్షులుగా డేగా నరసింహారెడ్డి, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, కంభం విజయరామిరెడ్డి పని చేశారు. సుదీర్ఘకాలం జిల్లా అధ్యక్షుడిగా పని చేసి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఓ రికార్డు సాధించారు.

జిల్లాతో విడదీయరాని అనుబంధం సినీ నటుడిగా ఉన్నప్పుడు ఎన్టీఆర్ ఎన్నో చిత్రాలను నెల్లూరు జిల్లాలో చిత్రీకరించారు. జిల్లాకు చెందిన పలువురు సినీ ప్రముఖులుగా వ్యవహరించడంతో ఎన్టీఆర్‌తో వ్యక్తిగత పరిచయాలు ఉండేవి. ముఖ్యంగా అభిమానులంటేనే ప్రాణపథంగా చూసే ఆయన పార్టీ పెట్టిన తరువాత ఎన్టీఆర్ అభిమానిగా ఉన్న సన్నారెడ్డి పెంచలరెడ్డికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి గెలిపించారు. అలాగే నెల్లూరుకి చెందిన తాళ్లూరి రమేష్‌రెడ్డి ఎన్టీఆర్ అభిమానిగా వ్యవహరిస్తుండడంతో ఏకంగా మంత్రిని చేశారు.

తెలుగుగంగ ప్రాజెక్టు రూపకల్పనలో జిల్లాకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు. సోమశిల విస్తరణ పనులకు పెద్ద ఎత్తున నిధులు కేటాయించారు. జిల్లాలో మొదలైన సారా ఉద్యమానికి సంఘీభావం తెలిపారు.1983లో జరిగిన మహిళా సదస్సుకు స్వయంగా ఎన్టీఆర్ హాజరయ్యారు. నెల్లూరులోనే మద్యపాన నిషేధంపై ఎన్టీఆర్ ప్రకటన చేశారు. ఆయన తరువాత పార్టీ బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు రైతు పోరు బాటను జిల్లాలోనే ముగించారు. పలు సార్లు కార్యకర్తలతో సమావేశాలు, ఉప ఎన్నికల ప్రచారాలకు చంద్రబాబు విచ్చేసి రోడ్‌షోలు జరిపారు. ఈ 31 ఏళ్ల కాలంలో టీడీపీ ఎన్నో తీపి, చేదు జ్ఞాపకాలను పంచింది.

నేడు కష్టాల్లో పార్టీ ప్రస్తుతం జిల్లాలో టీడీపీకి కష్టాలు మొదలయ్యాయి. 2004 ఎన్నికల్లో బోణి కాకపోయినా 2009లో జరిగిన ఎన్నికల్లో సగానికి సగం ఐదు స్థానాలను జిల్లా ప్రజలు టీడీపీకి కట్టబెట్టారు. వీరిలో కోవూరు ఎమ్మెల్యే పార్టీని వీడి వైసీపీలో కొనసాగుతున్నారు. మిగిలిన నలుగురు ఎమ్మెల్యేలు పార్టీలో ఉన్నారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడుగా ఉన్న సోమిరెడ్డి తప్పుకుని బీద రవిచంద్రకు ఆ బాధ్యతలు అప్పగించారు. పార్టీ కేడర్‌ను గ్రామ స్థాయిలోకి తీసుకుపోవడంలో పార్టీ శ్రేణులు విఫలమయ్యారు. ఒకరిద్దరు ఎమ్మెల్యేలు వ్యవహరిస్తున్న తీరును పార్టీ కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు.

సహకార ఎన్నికల్లో కొందరు పరోక్షంగా అధికార పార్టీకి సహకరించారన్న అపవాదు పార్టీపై పడింది. ఇక రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పట్టు సా ధించే దిశగా చేస్తున్న ప్రయత్నాలు కొన్ని నియోజకవర్గాల్లో కొందరు నేతలు వ్యవహరిస్తున్న తీరుతో ఇబ్బందులు తప్పడం లేదు. తెలుగుయువత కార్యవర్గాన్ని ఇంకా నియమించలేదు. కొన్ని అనుబంధ సంఘాల నియామకంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. మ రో ఏడాదిలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. పార్టీకి దూరమైన వారికి దగ్గరకు చేర్చుకుని గ్రామ స్థాయిలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పార్టీ శ్రేణులు, నేతలు కోరుతున్నారు.

31 వసంతాల టీడీపీ ఎన్నో చేదు..తీపి జ్ఞాపకాలు

విద్యుత్ సమస్యలపై హైదరాబాద్‌లోని పాతఎమ్మెల్యే క్వార్టర్లలో టీడీపీ ఎమ్మెల్యేలు చేపట్టిన దీక్షకు పార్టీ రాష్ట్ర, జిల్లా నాయకులు గురువారం సంఘీభావం ప్రకటించారు. టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వంగాల స్వామిగౌడ్, నాయకులు కంచర్ల భూపాల్‌రెడ్డి, బడుగుల లింగయ్యయాదవ్, చిలువేరు కాశీనాథ్, పాల్వాయి రజనీకుమారి మాదగోని శ్రీనివాస్‌గౌడ్, వేనేపల్లి వెంకటేశ్వర్లు, తుమ్మల మధుసూదన్‌రెడ్డి, రియాజ్అలీ, కసిరెడ్డి శేఖర్‌రెడ్డి సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం విద్యుత్ చార్జీలను తగ్గించకపోతే వచ్చే ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెబుతారన్నారు. దీక్షకు మద్దతుగా జిల్లాలో కూడా ఆందోళన కార్యక్రమాలు చేపడతామన్నారు.

టీడీపీ ఎమ్మెల్యేల దీక్షకు నల్లగొండ జిల్లా నేతల సంఘీభావం

విస్సన్నపేట: నీతివంతమైన రాజకీయాలకు రోల్‌మోడల్‌గా దేశంలో ఒక్క చంద్రబాబు నాయుడే ఉన్నారని జిల్లా తెలుగుదేశం ప్రధానకార్యదర్శి బచ్చులఅర్జునుడు అన్నారు. బుధవారం విస్సన్నపేటలో జరిగిన తెలుగుదేశం పార్టీ సర్వసభ్యసమావేశంలో బచ్చుల అర్జునుడు మాట్లాడుతూ నేడు కాంగ్రెస్, వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ అవినీతిలో పూర్తిగా మునిగిపోయి ప్రజలను కూడా అవినీతి పరులుగా మార్చేప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు.

ప్రజలు ఎంతో అప్రమత్తంగా ఉండాలని కోరారు. నేటి రాజకీయాల్లో మచ్చలేని నాయకుడిగా నీతివంతమైన రాజకీయాలకు రోల్‌మోడల్‌గా చంద్రబాబు నాయుడే ఉన్నారని అన్నారు. 63ఏళ్ల వయస్సులో పాదయాత్ర చేస్తూ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు చంద్రబాబు చేస్తున్న కృషిని, అలాగే కాంగ్రెస్, వై.ఎస్్.ఆర్ కాంగ్రెస్‌పార్టీల అవినీతిని, నేడు రాష్ట్రంలో ఉన్న దుర్భర పాలనను ప్రజలకు వివరించాల్సిన బాధ్యత ప్రతి టీడీపీ నాయకులు, కార్యకర్తల పై ఉందని అర్జునుడు అన్నారు. చిన్నచిన్న విభేదాలు పక్కన పెట్టి నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో ముందడుగు వేయాల్సిన కీలక తరుణం ఇదేనని ఆయన అన్నారు.

ఈ కార్యక్రమంలో నియోజక వర్గ ఇన్‌ఛార్జి నల్లగట్లస్వామిదాసు, జిల్లా తెలుగురైతు అధ్యక్షుడు చలసాని ఆంజనేయులు,రాష్ట్ర తెలుగురైతు కార్యనిర్వాహక కార్యదర్శి నెక్కళపు వెంకటేశ్వరరావు, నూజివీడు పట్టణ పార్టీ అధ్యక్షుడు నూతక్కివేణుగోపాల రావు, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి మట్టావేణుగోపాల రావు, మాజీ ఎంపీపీ ముత్తంశెట్టి వెంకటేశ్వరరావు,జిల్లా తెలుగుమహిళా నాయకురాలు నాదెండ్ల నాగమ ణి, వీరమాచనేని అమరేంద్ర ప్రసాద్, ఎన్టీ వెంకటేశ్వరరావు,డాబా శ్రీను, నెక్కళపు శంకర్‌రావు పాల్గొన్నారు.

నీతివంతమైన రాజకీయాలకు చంద్రబాబు రోల్ మోడల్

కోహెడ: హైదరాబాద్‌లో టీడీపీ ప్ర జా ప్రతినిధుల నిరవధిక నిరాహార దీక్షకు మద్దతుగా కోహెడ టీడీపీ ఆధ్వర్యంలో సబ్‌స్టేషన్ ఎదుట ధర్నా గురువారం నిర్వహించారు. విద్యుత్ కోత లు, సర్‌చార్జీల పెంపు సబ్‌స్టేషన్ ఎదు ట టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. హుస్నాబాద్ కోహెడ ప్ర ధాన రహదారిపై రాస్తారోకో చేశారు. సుమారు రెండు గంటలకుపైగా రోడ్డు పై బైఠాయించయడంతో వాహనాదారులు ఇబ్బందులు పడ్డారు. కరెంట్ కో తల ప్రభుత్వ మాకోద్దంటూ నినాదా లు చేశారు.

సక్రమంగా విద్యుత్ సరఫ రా చేసి రైతులను ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి ఖమ్మం వెంకటే శం, మండల పార్టీ అధ్యక్షుడు సంధి శ్రీనివాస్‌రెడ్డి, తిప్పారపు నాగరాజు, అన్నబోయిన సంపత్, బిట్ల రాజమ ల్లు, అంతటి రాజు, గూళ్ల సతీష్, ఎం కి రణ్, నవీన్‌కుమార్, విక్రమ్, ఆర్ రవీందర్, ఏ రమేష్, కొంరెల్లి, మల్లేశ్‌యాదవ్, సంతోష్‌రెడ్డి, శ్రీధర్‌లున్నారు.

భీమదేవరపల్లిలో...

విద్యుత్ కోతలు, సర్‌ఛార్జిలు పెం పుకు నిరసనగా మండల తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ధర్నా రాస్తారోకో నిర్వహించారు. అధికార దుర్వినియో గం ప్రజలను, రైతులను మోసపుచ్చుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే గద్దె దిగాలని డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా టీడీపీ నాయకులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు వంగ సత్తయ్యగౌడ్, జిల్లా కార్యదర్శు లు గూడ రాజయ్య, బోనగిరి రాం బా బు, రేణ బాపన్న, కొదురుపాక సార య్య, రామ్‌సింగ్, రాంగోపాల్‌రావు, నాగరాజు, దేవరాజు శంకర్, ఆశీర్వాదం, సంగ అయిలయ్యలున్నారు.

విద్యుత్ కోతలను నిరసిస్తూ టీడీపీ ధర్నా


బద్వేలు : కిరణ్ సర్కార్ అసమర్థ పాలన వలనే ప్రజలు అనేక సమస్యలతో సతమతమవు తున్నారని జిల్లా తెలుగు యువత ఉపాధ్యక్షుడు కె.రాంబాబు, తెదేపా పట్టణ అధ్యక్షుడు నరసింహనాయుడు పేర్కొన్నారు. విద్యుత్ ఛార్జీలను విపరీతంగా పెంచి ప్రజల పై మోయలేని భారం మోపడం దారుణమన్నారు. విద్యుత్ ఛార్జీలను అదుపు చేయాలని, విద్యుత్ సర్ ఛార్జీలను తక్షణం ఉప సంహరించుకోవాలంటూ టిడిపి ఆధ్వర్యంలో ఆందోళనలు చేస్తున్నప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. గతంలో వైఎస్ఆర్ చేసిన తప్పిదాల వలనే విద్యుత్ కష్టాలకు దారి తీస్తున్నాయని వారు పేర్కొన్నారు.

రాష్ట్రంలో ప్రజలు అనేక సమస్యలతో సతమత మవుతున్నా వాటిని పరిష్కరించేందుకు చొరవ చూపకుండా కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులు వర్గ రాజకీయాలతో కుర్చీలను కాపాడుకొనేందుకు సమయం సరిపోతుందే తప్ప ప్రజల సమస్యలను గాలికి వదిలేశారని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా అన్న సందేహం తలెత్తుతుందని ఆయన పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా వున్న సమయంలో తీవ్ర కరువు పరిస్థితులు వున్నప్పటికీ ప్రజలకు ఎలాంటి సమస్య లేకుండా విద్యుత్‌ను అందించిన ఘనత తెదేపాకే దక్కుతుందని ఆయన పేర్కొన్నారు. ప్రజలు చంద్రబాబు నాయుడు నాయకత్వం కోసం ఎదురుచూస్తున్నారని, ఎన్నికలు ఎప్పుడు జరిగినా టిడిపినే అధికారం చేజిక్కించుకుంటుందని ఆయన పేర్కొన్నారు. టిడిపి పరిపాలనలోనే అన్ని వర్గాల ప్రజలు అభివృద్ధి చెందుతారని ఆయన పేర్కొన్నారు. శుక్రవారం తెదేపా ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా స్థానికి టిడిపి కార్యాలయంలో పార్టీ జెండాను ఆవిష్కరించనున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమానికి తెదేపా నాయకులు, కార్యకర్తలు, పార్టీ అభిమానులు అందరూ పాల్గొనాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు యల్లారెడ్డి, మునిరెడ్డి, జయరామిరెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

అసమర్థ ప్రభుత్వంతో ఇక్కట్లు


గుంటూరు: విద్యుత్ సంక్షోభాన్ని ప్రభు త్వం పరిష్కరించేంత వరకు తమ నిరవధిక నిరాహార దీక్ష కొనసాగుతుందని జిల్లా టీడీపీ అధ్యక్షుడు ప్రత్తిపాటి పుల్లారావు స్పష్టం చేశారు. రాష్ట్రంలో నెలకొన్న విద్యుత్ సంక్షోభం పరిష్కారం కోసం హైదరాబాద్ న్యూఎమ్మెల్యే క్వార్టర్స్ వద్ద టీడీపీ ఎమ్మెల్యేలు చేపట్టిన నిరవధిక దీక్ష గురువారం మూడో రోజుకు చేరుకొన్నది. దీక్షలో పుల్లారావుతో పాటు పాల్గొన్న ఎమ్మెల్యేలు నరేంద్రకుమార్, కొమ్మాలపాటి శ్రీధర్, జీవీవీఎస్ ఆంజనేయులు నీరసించిపోయారు. వారి శరీర చక్కెర స్థాయి గణనీయంగా పడిపోయింది. ఎమ్మెల్యే శ్రీధర్ ఇటీవలే పచ్చకామెర్లకు గురయ్యారు. ఇంకా పూర్తిగా కోలుకోకముందే దీక్షలో పాల్గొనడం వల్ల ఆయన ఆరోగ్యపరంగా ఇబ్బంది పడుతున్న ట్లు సహచర ఎమ్మెల్యేలు తెలిపారు.

విద్యుత్ సంక్షోభాన్ని పరిష్కరించాలని శాసనసభ లోపల, వెలుపల టీడీపీ ఎన్ని ఆందోళనలు చేసినా ప్రభుత్వం స్పందించనందుకే తాము దీక్షకు దిగామని పుల్లారావు స్పష్టం చేశారు. గతంలో తమ పార్టీ అధినేత చంద్రబాబు ర్రాష్టానికి ఎంతో పేరు తీసుకొచ్చారని గుర్తు చేశారు. ఎమ్మెల్యే నరేంద్రకుమార్ మాట్లాడుతూ వ్యవసాయం, పరిశ్రమలు, రవాణ, ఆరోగ్యం, విద్య తదితర రంగాలన్నింటిని విద్యుత్ ప్రభావితం చేస్తోందన్నారు. ఈ సంక్షోభానికి వైఎస్ నాంది పలికితే రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి కొనసాగించారని చెప్పారు.

వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు మాట్లాడుతూ టీడీపీ దూరదృష్టితో రాష్ట్రంలో 2770 మెగావాట్ల సామర్థ్యంతో గ్యాస్ ఆధారిత విద్యుత్ ప్లాంట్లను నిర్మించామన్నారు. ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ మాట్లాడుతూ టీడీపీ హయాంలో చివరి నాలుగు సంవత్సరాల్లో కరువు వచ్చినప్పటికీ విద్యుత్ రంగాన్ని సమర్థవంతంగా నిర్వహించి రైతులకు 9 గంటల పాటు విద్యుత్ సరఫరా చేయడం జరిగిందన్నారు.

ప్రభుత్వం దిగి వచ్చేంత వరకు నిరవధిక దీక్ష

 ఏ పార్టీకైనా పునాదే కీలకం. రాష్ట్ర స్థాయిలో పార్టీ పటిష్టత కోసం ముందు నుంచీ పని చేసిన వారెందరో ఈ జిల్లాకు చెందిన వారున్నారు. పార్టీ ఆవిర్భావంలో ఎన్టీ రామారావు విలువైన సూచనలు, సలహాలు ఇచ్చి దశదిశలా వ్యాపించడంలోనూ ఈ జిల్లా ప్రధాన భూమిక పోషించింది. టీడీపీ ఏర్పాటుచేశాక పార్టీలో చేరి పని చేయడమే కాదు... పార్టీ ఆవిర్భావం కంటే ముందు నుంచీ ఈ జిల్లాలో ఎన్టీఆర్‌కి సలహాలు ఇచ్చిన రాజకీయ దురంధరులు ఉన్నారు. ఎన్టీఆర్ పార్టీ స్థాపిస్తారని తెలుసుకుని ఆయన అభిమాన సంఘం నాయకుడు గోరంట్ల రాజేంద్రప్రసాద్ రాజమండ్రిలో పెద్ద సభ నిర్వహించారు. అశోక థియేటర్‌లో జరిగిన ఈ సభకు రిక్షా, జట్టు కార్మికులు వేలాదిమందిగా హాజరయ్యారు.

అన్నగారు పెట్టే పార్టీకి మనం అండగా ఉండాలంటూ పాతికేళ్ల యువకుడిగా ఉన్న రాజేంద్రప్రసాద్ ఇచ్చిన

మూడు దశాబ్దాలుగా అదే పార్టీలో... ప్రస్తుత పరిస్థితుల్లో ఏడాదికి మూడు, నాలుగు పార్టీలు మారే నేతలు ఉన్నారు. కానీ టీడీపీ ఆవిర్భావం నుంచీ ఆ పార్టీలోనే కొనసాగుతున్న నేతలు అనేక మంది ఇక్కడ ఉన్నారు. యనమల, చిక్కాల, గోరంట్ల, గన్ని తదితర నేతలు ఇప్పటికీ తెలుగుదేశం పార్టీలోనే కొనసాగుతున్నారు. నాయకులకంటే పార్టీ ఆవిర్భావం నుంచీ వేలాది మంది కార్యకర్తలు టీడీపీకి అండగా ఉన్నారు.
పిలుపునకు వేలాదిమంది స్పందించారు. రంగంపేట సమితి మాజీ అధ్యక్షుడు ఉండవల్లి లక్ష్మీపతి, ఆయన సోదరుడు ఉండవల్లి శ్రీహరిరావు లాంటి రాజకీయ వేత్తలను ఆహ్వానించి వారి రాజకీయ అనుభవాలు, సూచనలు తీసుకుని అమలు చేసినట్టు చెప్తారు. ఇంకా జిల్లా నుంచి బాలయోగి, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, యనమల రామకృష్ణుడు, మెట్ల సత్యనారాయణరావు, చిక్కాల రామచంద్రరావు, నల్లమిల్లి మూలారెడ్డి, గన్ని కృష్ణ, ఎంవీఎస్ తాతాజీరావు, తాళ్లూరి లీలా భాస్కర నారాయణ, కుదప సురేంద్ర, నెక్కంటి బాలకృష్ణ తదితరులు టీడీపీ తొలి రోజుల్లో క్రియాశీలక పాత్ర పోషించారు.

తూర్పు'నుంచి పునాది రాళ్లు

కాకినాడ: ప్రజల్లోకి వెళ్లి సమస్యలు తెలుసుకునేందుకు చంద్రబాబు చేపట్టిన పాదయాత్ర జిల్లాలో పదో రోజుకి చేరుకుంది. ఈ నెల 20న పశ్చిమ గోదావరి జిల్లా నుంచి రాజమండ్రి చేరుకున్న చంద్రబాబు యాత్ర జిల్లాలో ఉత్సాహంగా సాగుతోంది. జిల్లాకు వచ్చిన తొలి ఐదారు రోజులూ రోజూ 14 నుంచి 16 కిలోమీటర్ల మేర నడిచిన చంద్రబాబు మూడు రోజుల నుంచి దూరం తగ్గించారు. ఈ తొమ్మిది రోజుల్లోనూ చంద్రబాబు 107.5 కిలోమీటర్ల మేర పాదయాత్ర నిర్వహించారు. రాజమండ్రి సిటీ, రాజమండ్రి రూరల్, మండపేట, అనపర్తి అసెంబ్లీ నియోజకవర్గాలలో యాత్ర చేశారు. 29వ తేదీ నాటికి అనపర్తి నియోజకవర్గంలో పాదయాత్ర పూర్తవుతుంది.అక్కడి నుంచి కాకినాడ రూరల్, పిఠాపురం, ప్రత్తిపాడు, తుని నియోజవవర్గాలలో బాబు పాదయాత్ర చేపడతారు.

కాపు సామాజికవర్గంపైనే ప్రధాన గురి... జిల్లాలో బీసీ, మాదిగ ఉప కులాలు టీడీపీకి అనుకూలంగా ఉన్నాయి. ఇక జిల్లా రాజకీయాల్లో కీ లక సామాజికవర్గమైన కాపులను తమవైపు తిప్పుకోవడంపై చంద్రబాబు సీరియస్‌గా దృష్టి సారించారు. ఇందులో భాగంగానే జిల్లాలో అడుగుపెట్టింది మొదలు... ప్రతి సభలోనూ అగ్రవర్ణాల్లో కాపులలో పేదలు ఎక్కువగా ఉన్నారని ప్రస్తావిస్తున్నారు. కాపుల్లో పేదలకు రిజర్వేషన్లు, కాపులకు రాజకీ
యంగా ప్రాధాన్యత ఇస్తానని పదేపదే ప్రస్తావిస్తున్నారు. మండపేటలో రాష్ట్ర కాపునేతలతో ప్రత్యేక సమావేశం నిర్వహించిన చంద్రబాబు వారి నుంచి సలహాలు, సూచనలు స్వీకరించారు.

పెదపూడిలో పార్టీ ఆవిర్భావ దినోత్సవం..అనపర్తి నియోజకవర్గం పెదపూడిలో టీడీపీ ఆవిర్భావ దినోత్సవం నిర్వహిస్తున్నారు. ఈ మేరకు ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేశారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో పాల్గొని అక్కడి నుంచి చంద్రబాబు కాకినాడ రూరల్ నియోజకవర్గానికి చేరుకోనున్నారు.

పెదపూడిలో నేడు పార్టీ ఆవిర్భావ దినోత్సవం

బిక్కవోలు: తెలుగుదేశంపార్టీలో కొంతమంది లీడర్లు మోసం చేస్తున్నా రు, కానీ కార్యకర్తలు మోసం చేయకుం డా ఏళ్ల తరబడి తమవెంటే ఉన్నారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. మీకోసం వస్తున్నా పాదయాత్రలో గురువారం ఆయన బిక్కవోలు మండలంలో రామచంద్రపురం, జగ్గంపేట నియోజకవర్గాలలోని దేశం కార్యకర్తలతో సమీక్ష సమావేశం నిర్వహించా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక లీడరు పోతే 50 మంది లీడర్లను తయారుచేసే శక్తి టీడీపీకి ఉందన్నారు. తమ కార్యకర్తలు చూసి రమ్మం టే కాల్చి వస్తారని కితాబునిచ్చారు. తాను కార్యకర్తలను కుటుంబసభ్యులు గా బావిస్తున్నానన్నారు.

గతంలో తా ను ప్రజల వద్దకు పాలన, జన్మభూమి వంటి కార్యక్రమాలు చేపట్టినా 294 నియోజకవర్గాలలోని కార్యకర్తల మనోభావాలు తెలుసుకోవడానికి వీలులేకుండా పోయిందని అందువల్లే ఈ కార్యక్రమాన్ని చేపట్టడం నాకు ఎంతో సంతృప్తినిస్తుందన్నారు. ఇప్పటివరకు కృష్ణా, పశ్చిమగోదావరి, తూర్పులో 10 నియోజకవర్గాలలోని కార్యకర్తలతో సమీక్షలు జరిపానన్నారు. వైఎస్ 200 మంది కార్యకర్తలను పొట్టన పెట్టుకున్నా కార్యకర్తలు దేశం వెంటే ఉన్నారన్నారు. నిరాశ పడకుండా తమ పార్టీచేసిన పనులను ప్రజలకు వివరించి ఎదుటి పార్టీ వాళ్లను ఢీకొట్టినపుడే తిరిగి అధికారం లోకి వస్తామన్నారు. కార్యకర్తలకు మరింత చేరువ కావడానికి నియోజకవర్గ ఇన్‌చార్జిలు, బూత్ స్థాయి అధికారులను నియమించామన్నారు. మీ సమస్యలను తెలపాలని నియోజకవర్గాలవారీగా కార్యకర్తల నుంచి తెలుసుకుని నోట్ చేసుకున్నారు.

రామచంద్రపురం నుంచి యనమదల రవి, జగ్గంపేట నుంచి అల్లు విజయకుమార్ ఆధ్వర్యంలో 50 మంది బాబు సమక్షంలో పార్టీలో చేరారు. సమావేశంలో మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావు, ఎమ్మెల్సీ నిమ్మకాయల చినరాజప్ప, జగ్గంపేట టీడీపీ ఇన్‌చార్జి జ్యోతుల చంటిబాబు, కొండయ్యదొర, అప్పలరాజు, జగ్గంపేట, రామచంద్రపురం కార్యకర్తలు పాల్గొన్నారు.

జగ్గంపేట: కృషి, పట్టుదల ఉంటే మనిషి సాధించలేదని ఏదీలేదని తెలుగుదేశంపార్టీ అధినేత చంద్రబాబు అన్నారు. వస్తున్నా మీకోస పాదయాత్ర లో భాగంగా ఆయన బిక్కవోలులో జగ్గంపేట నియోజకవర్గ కార్యకర్తలతో సమీక్ష నిర్వహించారు. జగ్గంపేటలో పార్టీకి పూర్వవైభవం తీసుకురావడానికి నాయకులు, కార్యకర్తలు ఇప్పటి నుంచే కృషి చేయాలని యువకుడు, ఉత్సాహవంతుడు అయిన చంటిబాబును ముం దుకు తీసుకువెళ్లాలని సూచించారు. రెండుగంటలపాటు సుదీర్ఘంగా చర్చించారు. చంద్రబాబు పార్టీ స్థితిగతులపై పార్టీకార్యకర్తలు తమ అభిప్రాయాలు తెలియజేయాలని సూచించగా పలువు రు కార్యకర్తలు అభిప్రాయాలను వ్యక్తం చేశారు.

గోకవరం మండలానికి పలువురు కార్యకర్తలు మాట్లాడుతూ పార్టీ వెనుకబడి ఉందని సహాకార సంఘ ఎన్నికల్లో తామంతా కష్టించి పనిచేసి పిల్ల కాంగ్రెస్‌కు గట్టిపోటీనిచ్చామని ఒ క్కఓటు మెజార్టీతో సొసైటీని కోల్పోయామని వాపోయారు. పార్టీతో సం బంధం లేకుండా 14లక్షలు రూపాయ లు ఖర్చుపెట్టి ఓడిపోయిన తమను పా ర్టీపరంగా నాయకులు ఎవరూ కనీసం పరామర్శకు రాలేదని ఆవేశంగా ప్రసంగించారు. చంద్రబాబు సైతం అదే స్థాయిలో ప్రతిస్పందించి నాయకులను సరిదిద్దే బాద్యతలను తాను చేపడతానని నిరుత్సాహపడవద్దని భరోసా ఇ చ్చారు.

చంద్రబాబు నేరుగా కార్యకర్తలతో సంప్రదింపులు జరిపి వారి అభిప్రాయాలను సేకరించడంతోపాటు
రా నున్న ఎన్నికల్లో ప్రణాళికాపరంగా పార్టీకి ఏవిధంగా పనిచేస్తే విజయం సాధించగలమనే అంశాన్ని సూటిగా కార్యకర్తలకు అర్ధమయ్యే రీతిలో విశదపరిచారు. మరో వైపు పార్టీశ్రేణులను ఇంకో వైపు పార్టీ నాయకులను సైతం ఆయన సుతిమెత్తగా తనదైన శైలిలో చురకలు వేస్తూ సమీక్షను కొనసాగించారు. గతంలో మాదిరి హెచ్చరికలు, హూంకరింపులు లేకుండా ముఖంపై చిరునవ్వు చెరగనీయకుండా ఆద్యం తం చంద్రబాబు సమీక్షను కొనసాగించడంతో కార్యకర్తలు, నాయకుల్లో ఆనందాలు వ్యక్తమవుతున్నాయి.

నాయకులు మోసం చేస్తున్నారు.. కార్యకర్తలు మా వెంటే ఉన్నారు..


కాకినాడ సిటీ: టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు తనయు డు లోకేష్ ఈ నెల 31న కాకినాడ రా నున్నారు. ఆనందభారతి గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేయబోయే బహిరంగ సభ లో ఆయన ముఖ్యవక్తగా పాల్గొని మా ట్లాడనున్నారు. సభలో జిల్లా తెలుగునాడు స్టూడెంట్ ఫెడరేషన్(టీఎన్ఎస్ఎఫ్), తెలుగునాడు సాంకేతిక విభాగం(టీఎన్ఎస్‌వీ), జిల్లా సాంస్కృతిక విభాగం, జిల్లా యువత ఆధ్వర్యంలో జరగనుంది.

సమన్వయకర్తలుగా కాకినాడ సిటీ నియోజకవర్గ టీడీపీ ఇన్‌చా ర్జ్ వనమాడి కొండబాబు, రూరల్ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ పిల్లి సత్తిబాబు, టీడీపీ యువనేత ముత్తా శశిధర్, రా జానగరం ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్ సమన్వయకర్తలుగా వ్యవహరిస్తారని పార్టీ పోలిట్‌బ్యూరో సభ్యుడు యనమ ల రామకృష్ణుడు తెలిపారు. చంద్రబా బు పాదయాత్రలో భాగంగా శనివా రం రాత్రి చంద్రబాబు కాకినాడ చేరుకుంటారు. కాకినాడలోనే బస చేస్తారు.

లోకేష్ పర్యటన మూడురోజులు లోకేష్ పర్యటన మూడురోజులపాటు ఉంటుందని పార్టీ వర్గాలు చెబుతున్

రా ష్ట్రంలో లోకే ష్ వివిధ జిల్లాలో పర్యటించగా జనాల్లో భారీస్పందన వచ్చిం ది. ముఖ్యంగా కుప్పంలో మాట్లాడిన ప్రసంగాలు ఆకట్టుకున్నాయి. దాంతో రాష్ట్రవ్యాప్తంగా లోకేష్ పర్యటనలు ప్రా ధాన్యత సంతరించుకున్నాయి. కాకినాడలో తొలిసారిగా భారీ బహిరంగసభ లో ఆయన పాల్గొనడం ఇక్కడ యువనాయకత్వానికి అదనపు ఉత్సాహం ఉరకలేస్తుందని చెప్పవచ్చు.
నాయి. 31న జరిగే బహిరంగ సభతోపాటు ఏప్రిల్ 1,2 తేదీల్లో జిల్లాలోనే ఉంటారని చెబుతున్నారు. ఆనందభారతిలో జరిగే బహిరంగసభకు జిల్లాపార్టీ శ్రేణులు, అనుబంధ సంఘాలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. టీఎన్ఎస్ఎప్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సంజీవ్, కార్తీక్‌తోపాటు టీఎన్ఎస్వీ జిల్లా అధ్యక్షుడు కోర్పు సాయితేజ, యువత నాయకులు, సాంస్కృతి క విభాగం నాయకులు సభ విజయవంతానికి ఏర్పాట్లు చేస్తున్నారు.

31న కాకినాడకు లోకేష్ రాక

కాకినాడ: అవినీతి, అ సమర్ధ కాంగ్రెస్ దొంగల్ని తరిమికొట్టాలని టీడీపీ అధినేత చంద్రబాబు నా యుడు పిలుపునిచ్చారు. గురువారం వస్తున్నా మీ కోసం పాదయాత్ర 178వ రోజు బిక్కవోలు, జి.మామిడాడ, పె ద్దాడ, పెదపూడిల్లో సాగింది. చంద్రబా బు మాట్లాడుతూ ఇందిరమ్మ పేరుతో పేదలకు ఇవ్వాల్సిన ఇళ్లలోనూ కాంగ్రె స్ దొంగలు దోచుకుతింటున్నారని చం ద్రబాబు ఆక్షేపించారు. గ్రామాలకు తా గునీరు, కరెంటు ఇవ్వలేని అసమర్ధ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇంటికి సాగనం పి టీడీపీకి అధికారం కట్టబెట్టాలని చంద్రబాబు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. టీడీపీ హయాంలో ట్యాంకర్లతో తాగునీరు సరఫరాచేశామని గుర్తుచేశారు.

అన్నదాతను ఆదుకుంటాం! టీడీపీ అధికారంలోకి వస్తే వ్యవసాయాన్ని లాభసాటిగా మారుస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. వ్యవసాయ పెట్టుబడులు 300 శాతం పెరిగితే ధాన్యం, ఇతర పంటలు కేవలం 30 శాతం మాత్రమే పెరిగాయన్నారు. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని బాబు ఆవేదన వ్యక్తం చేశారు.

జలయజ్ఞంలోనూ దోపిడీ ఈ తొమ్మిదేళ్లలో కాంగ్రెస్ రూ.80 వేల కోట్లు జలయజ్ఞంలో ఖర్చుచేస్తే అందులో రూ.20 వేల కోట్లు నిరర్ధకం గా పోయాయని, రూ.30 వేల కోట్లు దోచుకున్నారని సాక్షాత్తూ కాగ్ నివేదిక తేటతెల్లం చేసిందని గుర్తుచేశారు.

అది వైఎస్సార్ చార్జి కరెంటు సర్‌ఛార్జీల భారంపై ఎక్కడికక్కడ చంద్రబాబు దృష్టికి తీసుకువ
స్తున్నారు. బిక్కవోలులో ఒక మహిళ మా ట్లాడుతూ.. విద్యుత్ బిల్లులు వేలకు వేలు వస్తున్నాయని తెలిపింది. చంద్రబాబు స్పందిస్తూ.. అది వైఎస్సార్ అవినీతి ఛార్జి అంటూ ఎద్దేవా చేశారు.

టీడీపీ అధికారంలో ఉంటే రాజమం డ్రి, కాకినాడ కెనాల్‌రోడ్ నాలుగులైన్ల విస్తరణ జరిగేదని బిక్కవోలు సభలో చంద్రబాబు పేర్కొన్నారు. నాణ్యమైన రహదారులు నిర్మించిన ఘనత టీడీపీదేనన్నారు.

సమర్ధవంతమైన నాయకత్వం రావాలి చాలాచోట్ల కార్యకర్తలు బాగా పనిచేస్తున్నారు. నియోజకవర్గ ఇన్‌ఛార్జిలు మాత్రం మెతకగా ఉంటున్నారని పార్టీ సమీక్ష సమావేశంలో చంద్రబాబు అ న్నారు. ఈసందర్భంగా పలువురు కార్యకర్తలు పార్టీ స్థితి,గతులు, నేతల పనితీరును చంద్రబాబు దృష్టికి తీసుకువచ్చారు.

కాంగ్రెస్ దొంగలను తరిమికొట్టాలి

ఏదులాపురం:రాష్ట్రాన్ని విద్యుత్ కోతల పేరుతో అంధకారంలోకి నెడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి రాబో యే సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పాలని టీడీపీ ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జి పాయల శంకర్ పేర్కొన్నారు. విద్యుత్ కోతలకు నిరసనగా హైదరాబాద్‌లో టీడీపీ ఎమ్మెల్యేలు చేపడుతున్న దీక్షలకు మద్దతుగా గురువారం స్థానిక నాయకులు ఆదిలాబాద్ బస్టాండ్ ఎదుట జాతీయ రహదారి పై రాస్తారోకో నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోతల వల్ల విద్యార్థులు శ్రద్ధ పెట్టి చదువలేక పోతున్నారని అన్నారు. అలాగే మరోవైపు చిరు వ్యాపారులు నష్టపోతున్నారని ఆయన వాపోయారు. కోతల వల్ల రబీలో వేసిన పంటలు ఎండిపోయి రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి నెలకొందన్నారు. ప్రభుత్వం చిత్తశుద్ధితో విద్యుత్ సమస్యను పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. కార్యక్రమంలో టీడీపీ ఆదిలాబాద్ ప ట్టణ అధ్యక్షుడు మునిగెల నర్సింగ్, నాయకులు రాజారెడ్డి, గిమ్మ సంతోష్, మంచాల మల్లన్న, టి వెంకట్‌రెడ్డి, బాలాపూర్ విఠల్, యూనిస్అక్బానీ, లేఖర్‌వాడ వెంకన్నలతో పాటు కార్యకర్తలు పాల్గొన్నారు.

మంచిర్యాలలో...

గర్మిళ్ల: విద్యుత్ చార్జీల పెంపు, అ ప్రకటిత కోతలకు నిరసనగా గురువారం మంచిర్యాలలో తెలుగుదేశం పార్టీ, తెలుగుయువత ఆధ్వర్యంలో ప్ర జల నుంచి సంతకాలు సేకరించారు. పార్టీ మాజీ జిల్లా అధ్యక్షుడు గోనె హన్మంతరావు నాయకత్వంలో పట్టణంలోని బెల్లంపల్లి చౌరస్తా , అర్చన టెక్స్ సముదాయం, అంబేద్కర్ చౌరస్తాలోని జేఏసీ శిబిరం వద్ద నాయకులు సంతకాలు సేకరించారు. ఈ సందర్భంగా హన్మంతరావు మాట్లాడుతూ విద్యుత్ చార్జీల పెంపు భారాన్ని సా మాన్య ప్రజలు గురించి ఆలోచించకుండా ప్రభుత్వం ఏక పక్ష నిర్ణయం తీసుకోవడం విచారకరమన్నారు.

అప్రకటిత విద్యుత్ కోతలతో కాంగ్రెస్ ప్రభుత్వం సామాన్యులను ఇక్కట్లకు గురి చేస్తుందని విమర్శించారు. రా ష్ట్రంలోని ప్రజలకు సరిపడే విద్యుత్ ను అంచనా వేయడంలో రాష్ట్ర ప్రభుత్వం దారుణంగా విఫలమైందన్నారు. రైతులకు ఏడు గంటలు విద్యుత్ సరఫరా ఇ వ్వాలని డిమాండ్ చేశారు. ప్రజలకు భారంగా పరిణమించే చర్యలకు పాల్పడుతున్న ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయని ఆయనే పేర్కొన్నారు. కాంగ్రె స్ ప్రభుత్వానికి రాబోయే ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.

కార్యక్రమంలో తెలుగు యు వత జిల్లా అధ్యక్షుడు గాజుల ముఖేష్ గౌడ్, నాయకులు బెల్లంకొండ మురళీదర్, కొండేటి సత్యం, జిల్లా ఉపాధ్యక్షురాలు రైసాబాను, డాక్టర్ రఘునందన్, గాదె సత్యం, పూరేళ్ల పోచమల్లు, దుర్గం రాజేష్, మట్టల రమేష్, డాక్టర్ ఫరీద్ హుస్సేన్, డీఎస్ఎం లక్ష్మి, నాగేందర్, పొలసాని సత్యనారాయణరావు, కార్యకర్తలు పాల్గొన్నారు.

విద్యుత్ కోతలపై టీడీపీ నిరసనలు

హైదరాబాద్ : ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో శుక్రవారం ఉదయం టీడీపీ పార్టీ ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. పార్టీ సీనియర్‌నేత పెద్దిరెడ్డి జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో పార్టీ ఆవిర్భావ వేడుకలు

తూ.గో: వస్తున్నా...మీకోసం పాదయాత్రలో భాగంగా జిల్లాలో పర్యటిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పార్టీ ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్నారు. శుక్రవారం ఉదయం పెదపూడిలో చంద్రబాబు పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఎన్టీఆర్ విగ్రాహానికి పూలమాలలు వేసి నివాలులర్పించారు. 32 కేజీల కేక్‌ను బాబు కట్ చేశారు. రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన బాబు, వృద్ధులకు వస్త్రాలను పంపిణీ చేశారు.

తూ.గో : పార్టీ జెండాను ఆవిష్కరించిన చంద్రబాబు

హైదరాబాద్: విద్యుత్ సమస్యలపై తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు చేస్తున్న నిరాహార దీక్ష శుక్రవారం నాటికి నాలుగోరోజుకు చేరింది. దీక్షలో పాల్గొన్న ఎమ్మెల్యే సత్యవతి రాథోడ్ అస్వస్థతకు గురయ్యారు. ఆమె రెండు రోజులుగా జ్వరంతో బాధపడుతున్నారు. పార్లమెంటు సభ్యుడు సిఎం రమేష్ ఆరోగ్యం కూడా ఆందోళనకరంగా ఉంది.

పాత ఎమ్మెల్యే క్వార్టర్సులో కూర్చున్న ఇరవై ఐదు మంది ఎమ్మెల్యేలు, ఎంపీల ఆరోగ్యాన్ని వైద్యులు ఈ రోజు ఉదయం పరీక్షించారు. వారిలో తొమ్మిది మంది ఎమ్మెల్యేల ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పారు. అయితే, ప్రభుత్వం దిగి వచ్చి విద్యుత్ సమస్యను పరిష్కరించే వరకు ఆందోళన కొనసాగుతుం
దని నేతలు చెప్పారు.

టిడిపి ఎమ్మెల్యే సత్యవతికి అస్వస్థత

హైదరాబాద్: తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావడమే తమ లక్ష్యమని నగర పార్టీ అధ్యక్షుడు తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. టీడీపీ 32వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శుక్రవారం తలసాని, పార్టీ శ్రేణులతో కలిసి ఎన్టీఆర్ ఘాట్‌కు వచ్చి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తీసుకు రావడమే తమ ముందున్న లక్ష్యమన్నారు.

ఎన్టీఆర్ ట్రస్టు భవనంలో టిడిపి నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అవినీతి అనే పదాన్ని ఉచ్చరించడానికి భయపడే విధంగా టిడిపి పాలన సాగిందన్నారు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లు అనే నినాదంతో స్వర్గీయ నందమూరి తారక రామారావు టిడిపిని స్థాపించారన్నారు.

టీడీపీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యం : తలసాని

తూ.గో.ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ సమాజమే దేవాలయం, పేదవాళ్ళే దేవుళ్లు అని చెప్పిన వ్యక్తి దివంగత ఎన్టీ రామారావని, ప్రజల కోసమే ఆయన పార్టీ పెట్టారని అన్నారు. ఎన్టీఆర్ ఏ కార్యక్రమం చేపట్టినా ఒక స్పష్టమైన ఆలోచనతో మొదలు పెట్టేవారన్నారు.
: రాజకీయాల్లో ఎన్టీ రామారావుకు సాటి మరెవరూ లేరని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. వస్తున్నా...మీకోసం పాదయాత్రలో భాగంగా జిల్లాలో పర్యటిస్తున్న చంద్రబాబు నాయుడు శుక్రవారం పెదపూడిలో పార్టీ ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్నారు. అక్కడ పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఎన్టీఆర్ విగ్రాహానికి పూలమాలలు వేసి నివాలులర్పించి. 32 కేజీల కేక్‌ను కట్ చేశారు. అనంతరం రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన బాబు, వృద్ధులకు వస్త్రాలను పంపిణీ చేశారు.

ఎన్టీఆర్‌కు సాటి మరెవరూ లేరు : చంద్రబాబు

హైదరాబాద్ : ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్ద నిరాహార దీక్ష చేస్తున్న టీడీపీ నేతలను తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు తనయుడు లోకేష్ నాయుడు శుక్రవారం సాయంత్రం శిబిరా

కాగా తొమ్మిది మంది నేతల ఆరోగ్యం పరిస్థితి విషమించిందని, వారికి తక్షణం వైద్య సహాయం అవసరమని వైద్యులు సూచించారు. తమ డిమాండ్లపై ప్రభుత్వం దిగివచ్చేవరకు దీక్ష విరమించేదిలేదని, వైద్య చికిత్స అవసరం లేదని నేతలు తేల్చి చెప్పారు.
న్ని సందర్శించి, పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

దీక్ష చేస్తున్న టీడీపీ ఎమ్మెల్యేలను పరామర్శించిన లోకేష్

సభ సరిగా జరపకుండా పారిపోయిన ప్రభుత్వం
ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్ధానాలు నిలబెట్టుకోవాలి

హైదరాబాద్ : రాష్ట్రంలోని విద్యుత్ సమస్యలపై తెలుగుదేశం పార్టీ నేతలు ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్ద చేపట్టిన నిరాహార దీక్షకు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బీవీ రాఘవులు సంఘీభావం ప్రకటించారు. ఎమ్మెల్యేల పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారణమని ఆయన అన్నారు. ఇది తలతిక్క, తెలివితక్కువ ప్రభుత్వం అని ఆయన మండిపడ్డారు.

సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బివి రాఘవులు టీడీపీ నేతలు చేపట్టిన దీక్షా శిబిరాన్ని శుక్రవారం ఉదయం సందర్శించి, నేతలను పరామర్శించి, వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ నేతల ప్రాణాల గురించి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆయన విమర్శించారు. ప్రభుత్వంపై పోరాటం చేసేందుకైనా నేతలు ప్రాణాలు నిలుపుకోవాలని, బదులుగా ఇతర నేతలు కూర్చోవాలని రాఘవులు సూచించారు.

శాసనసభ సమావేశాలు కూడా సరిగ్గా జరపకుండా ప్రభుత్వం పారిపోతోందని రాఘవులు ఎద్దేవా చేశారు. ఎన్నికల ముందు ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. లేదంటే తమకు నిజాయితీ లేదని ప్రభుత్వం ప్రకటించుకోవాలన్నారు. మలివిడత అసెంబ్లీ సమావేశాల నాటికి విద్యుత్ సమస్యలపై పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని రాఘవులు హెచ్చరించారు.

టీడీపీ నేతల దీక్షకు సంఘీభావం తెలిపిన బి.వి. రాఘవులు

రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
అధికారం కోసం కాదు, ప్రజలకోసమే పోరాటం : చంద్రబాబు

తూ.గో,/హైదరాబాద్: సమాజమే దేవాలయం, పేదవాళ్ళే దేవుళ్లు అని చెప్పిన వ్యక్తి దివంగత ఎన్టీ రామారావని, ప్రజల కోసమే ఆయన పార్టీ పెట్టారని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. ఈనాడు రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయని, అసమర్ధ ప్రభుత్వం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, కాంగ్రెస్‌ను ఎదుర్కొనే శక్తి ఒక్క టీడీపీకే ఉందని చంద్రబాబు పేర్కొన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ 32వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు శుక్రవారం ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా పార్టీ నేతలు, కార్యకర్తలు రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేసి రక్తదానం చేశారు. పేదలకు, వృద్ధులకు పండ్లు, వస్త్రాలను పంపిణీ చేశారు. వస్తున్నా...మీకోసం పాదయాత్రలో భాగంగా జిల్లాలో పర్యటిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పెదపూడిలో పార్టీ ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్నారు. అక్కడ పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఎన్టీఆర్ విగ్రాహానికి పూలమాలలు వేసి నివాలులర్పించి. 32 కేజీల కేక్‌ను కట్ చేశారు. అనంతరం రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన బాబు, వృద్ధులకు వస్త్రాలను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడుతూ తండ్రిని అడ్డం పెట్టుకుని కోట్లు సంపాదించి, పిల్ల కాంగ్రెస్ పార్టీ పెట్టిందని, రాజకీయ విలువలను నాశనం చేసిందని, ఈ పార్టీ అసెంబ్లీకి వస్తే దాన్ని కూడా దోచుకుంటారని చంద్రబాబు ఎద్దేవా చేశారు. ఇప్పుడు తెలుగుదేశంపార్టీకి రాష్ట్ర వ్యాప్తంగా మంచి స్పందన వస్తుదని, టీడీపీ కార్యకర్తలు బాగా పనిచేస్తున్నారని, వాళ్లు ఇంకా ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని ఆయన పిలుపునిచ్చారు.

తమకు అధికార కాంక్ష లేదని, టీడీపీ ప్రజలకోసమే పోరాటం చేస్తుందని, స్వార్ధం కోసంకాదని చంద్రబాబు పేర్కొన్నారు. విద్యుత్ సమస్యలపై నాలుగు రోజులుగా టీడీపీ ఎమ్మెల్యేలు దీక్షలు చేస్తున్నది ప్రజలకోసమేనని ఆయన అన్నారు. రాష్ట్రాన్ని పాలించే శక్తి ఒక్క టీడీపీకే ఉందని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమలో పాల్గొన్న ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటూ, పాదాలు నొప్పులు పెడుతున్నా ప్రజల కోసం పాద యాత్ర చేస్తున్నారని ఆయన మీడియా ముందు భావోద్వేగానికి లోనయ్యారు. టీడీపీ అధికారంలోకి వస్తే అన్ని సమస్యలు పరిష్కారమవుతాయిని యనమల అభిప్రాయపడ్డారు.

ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో శుక్రవారం ఉదయం టీడీపీ పార్టీ ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. పార్టీ సీనియర్‌నేత పెద్దిరెడ్డి జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అవినీతి అనే పదాన్ని ఉచ్చరించడానికి భయపడే విధంగా టిడిపి పాలన సాగిందన్నారు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లు అనే నినాదంతో స్వర్గీయ నందమూరి తారక రామారావు టిడిపిని స్థాపించారన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్ద విద్యుత్ సమస్యపై దీక్ష చేస్తున్న ఎమ్మెల్యేలు అక్కడే పార్టీ అవిర్భావ దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు.

తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నగర పార్టీ అధ్యక్షుడు తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇతర పార్టీ శ్రేణులు ఎన్టీఆర్ ఘాట్‌కు వచ్చి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తీసుకు రావడమే తమ ముందున్న లక్ష్యమన్నారు.

కార్యకర్తల సమావేశంలో భావోద్వేగానికి లోనైన యనమల

ప్రస్తుతం రాష్ట్రంలో వినిపిస్తున్న పేర్లు రెండే రెండు! కరెంటు కోతలు! కరెంటు షాకులు! కోతలతో విద్యార్థుల నుంచి పారిశ్రామికవేత్తల వరకు అన్ని వర్గాలూ ఇబ్బంది పడుతుంటే.. షాకులతో పదిమందికి అన్నం పెట్టే రైతన్న అర్థంతరంగా రాలిపోతున్నాడు! పొద్దు పొద్దున్నే రైతులు కరెంటు షాకులతో చనిపోయిన వార్త చూసి మనసు చిదిమేసినట్టు అయిపోయింది. రైతుల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. అన్నం పెట్టాల్సిన వాళ్ల బతుకులు గాలిలో దీపాలుగా మారాయి. దీనంతటికీ కారణం పాలకుల నిర్లక్ష్యమే. వీళ్లకు చిత్తశుద్ధి లేదు. స్పందించే హృదయం అంతకన్నా లేదు. కూడు పెట్టేవాడు వీళ్ల నిర్లక్ష్యానికి పాడెక్కే దుస్థితి వచ్చింది. కరెంటు షాకులకు రైతులు పిట్టల్లా రాలుతున్నా వీళ్లకు చీమ కుట్టినట్టు కూడా లేదు. ఈ పాపం ఊరికే పోదు!

బిక్కవోలు, జి.మామిడాడల్లో పదో తరగతి విద్యార్థులు వచ్చి కలిశారు. వాళ్లకు అసలు పరీక్ష వాళ్లు రాసే పదో తరగతి పరీక్ష కాదట. కరెంటు కోతలే వాళ్ల పాలిట అగ్ని పరీక్షగా మారాయి. పరీక్షల సమయంలో గుడ్డి దీపాల కింద చదువుకోవడం ఈ ప్రభుత్వం వాళ్లకు ఇచ్చిన బహుమతి. "లక్షల కోట్ల బడ్జెట్లు పెడుతున్నారు. అయినా, మాకు పైసా పనులు జరగడం లేదు. ఈ డబ్బంతా ఎటుపోతోంది సార్'' అంటూ ఓ యువకుడు వేసిన ప్రశ్న ఎంతో అర్థవంతమైనది. ప్రజలు రక్తం చిందించి కట్టిన సొమ్ములన్నీ కాంగ్రెస్ అవినీతి ఖజానాకే చేరుతున్నాయి.

బిక్కవోలులో రజక సోదరులు కలిశారు. ఆనాటి 'ఆదరణ' లాంటి ఆదరణ కావాలని కోరారు. త్వరలోనే ఆ కల నెరవేరుస్తానని హామీ ఇచ్చి ముందుకు కదిలా!!

కోతలు.. షాకులే సర్కారు ఘనతలు

March 28, 2013

హైదరాబాద్ : విద్యుత్ సమస్యపై నిరవధిక నిరాహార దీక్షలో ఉన్న టీడీపీ ఎమ్మెల్యేల్లో కొందరి ఆరోగ్యం గురువారం క్షీణించింది. దీక్షలో ఉన్నవారికి వైద్యపరీక్షలు నిర్వహించిన ప్రభుత్వ వైద్యబృందాలు 9 మంది పరిస్థితి బాగోలేదని, వారికి రక్తంలో చక్కెర స్థాయి, బీపీ బాగా హెచ్చుతగ్గులకు లోనవుతున్నట్లు గుర్తించాయి. వారిలో సీతక్క, సత్యవతి రాథోడ్, జైపాల్ యాదవ్, శివిరి సోమ, దేవినేని ఉమా మహేశ్వరరావు, శ్రీరాం రాజగోపాల్, కొమ్మాలపాటి శ్రీధర్, జివి ఆంజనేయులు, కె. నారాయణరెడ్డి ఉన్నారు.

రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ ఉన్నారు. దీనిపై పోలీసులు టీడీపీ నేతలతో మాట్లాడారు. పరిస్థితి అసలు బాగోలేదని వైద్యులు గట్టిగా చెబితే వారిని ఆస్పత్రికి తరలించడానికి అనుమతిస్తామని, లేనిపక్షంలో వారు దీక్షలోనే కొనసాగుతారని టీడీపీ నేతలు చెప్పారు. దాంతో ప్రస్తుతానికి వారిదీక్ష కొనసాగుతోంది. నగరంలోని వివిధ నియోజక వర్గాలకు చెందిన పార్టీ శ్రేణులు పెద్దసంఖ్యలో తరలిరావడంతో గురువారం దీక్షా శిబిరం కిటకిటలాడింది. గురువారం 28 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యుడు దీక్షలో పాల్గొన్నారు. ఎమ్మెల్సీ నన్నపనేని రాజకుమారి కొత్తగా దీక్షలో చేరారు. సాయంత్రానికి ఈ దీక్ష మూడో రోజుకు చేరింది.

గుమ్మడికాయల దొంగ
'విద్యుత్‌లో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతూ మేం బ్లాక్ పేపర్ విడుదల చేశాం. అధికార కాంగ్రెస్ పార్టీ దానికి కిక్కురుమనలేదు. వైసీపీ మాత్రం ఉలిక్కిపడి తానొక పత్రాన్ని మాపై విడుదల చేసింది. గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు తడుముకొన్నట్లుగా ఆ పార్టీ వైఖరి ఉంది' అని టీడీపీ ఎమ్మెల్యే రావుల చంద్రశేఖరరెడ్డి వ్యాఖ్యానించారు. గురువారం ఆయన ఇక్కడ తమ పార్టీ ఎమ్మెల్యేల నిరాహార దీక్షా శిబిరం వద్ద ఎమ్మెల్యేలు సండ్ర వెంకట వీరయ్య, కేఎస్ రత్నంలతో కలిసి విలేకరులతో మాట్లాడారు.

అబద్ధాలు, అర్ధ సత్యాలతో ఆ పార్టీ తన పత్రాన్ని విడుదల చేసిందని ఆయన విమర్శించారు. 'టీడీపీ అధికారంలో ఉండగా బడ్జెట్‌లో 7.8 శాతం నిధులు విద్యుత్ రంగానికి కేటాయించాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ కేటాయింపులను 3.9 శాతానికి తగ్గించింది. మొత్తం విద్యుత్‌లో మేం వ్యవసాయానికి 62% ఇచ్చాం. కాంగ్రెస్ హయాంలో అది 45%కు తగ్గిపోయింది. టీడీపీ హయాంలో వ్యవసాయానికి 9గంటలు ఇచ్చాం. వైఎస్ రాగానే దాన్ని 7 గంటలకు తగ్గించారు. దమ్ముంటే రండి.. ఇది నిజమో కాదో రైతుల వద్దకు వెళ్లి తెలుసుకొందాం' అని ఆయన సవాల్ విసిరారు.

దీక్షలో తొమ్మిది మందికి క్షీణించిన ఆరోగ్యం

హైదరాబాద్ : బాబ్లీకి సంబంధించి సుప్రీంతీర్పుపై రివ్యూ పిటిషన్ వేయాలని చెప్పామని కడియం శ్రీహరి చెప్పారు. గోదావరి జలాల వినియోగంపై ఏర్పాటయ్యే త్రిసభ్య కమిటీ కేంద్ర ప్రభుత్వ అధీనంలోనే పని చేయాలని, దాని

సుప్రీం తీర్పు రాష్ట్రానికి వ్యతిరేకమంటూ సీఎం కిరణ్‌ను ఒప్పించగలిగామని ఎర్రబెల్లి దయాకర్‌రావు చెప్పారు. ప్రభుత్వం కూడా ఆలోచనలో పడిందని, రివ్యూ పిటిషన్‌కు అంగీకరించిందని తెలిపారు. అఖిలపక్షాన్ని ప్రధాని వద్దకు తీసుకెళ్లాలని సూచించామని వైసీపీ నేత సంకినేని వెంకటేశ్వర్ రావు చెప్పారు. కంతానపల్లి ప్రాజెక్టును యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని కోరామన్నారు. బాబ్లీపై సర్కారుకు నిర్దిష్ట ప్రణాళిక లేదని, మళ్లీ న్యాయ సలహాకు వెళుతోందంటే తెలంగాణపై సర్కారు చిత్తశుద్ధిని అర్థం చేసుకోవచ్చని మహేందర్‌రెడ్డి ఆరోపించారు.

సుప్రీం తీర్పుపై రివిజన్ పిటిషన్ వేయాలని సూచించామని, అయితే ఇది ఎంతవరకు సాధ్యమో పరిశీలిస్తున్నారని విద్యాసాగర్‌రావు చెప్పారు. రివ్యూపిట్‌షన్ వేసినా.. జడ్జిమెంట్‌ను సుప్రీం మార్చుకోకపోతే ఏం చేయాలనే దానిపైనా ఆలోచన ఉండాలన్నారు. సుప్రీంతీర్పులో స్పష్టత లేదని, క్లారిఫికేషన్ పిటిషన్ వేయాలని సూచించామని వినోద్‌కుమార్ చెప్పారు. మహారాష్ట్ర 60 టీఎంసీల కంటే ఎక్కువ నీటిని వాడుతోందని ప్రధాని వద్దకు అఖిలపక్షంగా వెళ్లి చెబుదామని పోచారం శ్రీనివాస్‌రెడ్డి చెప్పారు.

అసలు సుప్రీం తీర్పులో ఏమి వచ్చిందో ప్రభుత్వానికి అవగాహన లేదని కిషన్ రెడ్డి విమర్శించారు. నిపుణులు, ఇంజనీర్ల సలహాలతో రివ్యూ పిటిషన్ వేయాలని, కేంద్రంపై ఒత్తిడి కూడా తేవాలని సూచించారు. రివ్యూ పిటిషన్ పరిధిని విస్తృతం చేయాలని శేషగిరిరావు సూచించారు. సుప్రీంలో ప్రభుత్వం సరైన వాదన వినిపించలేదని, అందుకే రాష్ట్రానికి అన్యాయం జరిగిందని గుండా మల్లేశ్, జూలకంటి రంగారెడ్డి విమర్శించారు. రివ్యూ పిటిషన్ వేయాలని, రాజకీయ పరిష్కారం చేయాలని, అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకువెళ్లాలని కోరామన్నారు.
ఖర్చులు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రలు భరించేలా ఉండాలని సూచించామన్నారు. బాబ్లీపై సుప్రీంలో ప్రభుత్వం పేలవమైన వాదనలు వినిపించిందని ధ్వజమెత్తారు. ఈ తీర్పుతో దేశవ్యాప్తంగా అనేక సమస్యలు, కొత్త చిక్కులు వచ్చే ప్రమాదం ఉందన్నారు. తెలంగాణలోని 18 లక్షల ఎకరాల ఆయకట్టును కాపాడుకునేందుకు ప్రభుత్వం మొద్దు నిద్ర వీడాలన్నారు. బాబ్లీ ప్రాజెక్టు టీడీపీ హయాంలోనే ప్రారంభమైందన్న విమర్శకు స్పందిస్తూ.. 2004 ఆగస్టులో భూమిపూజ నిర్వహించినప్పుడు, 2005లో పనులు ప్రారంభమైనప్పుడు టీడీపీ అధికారంలో లేదన్నారు.

పిటిషన్ వేయాలి: కడియం

" రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెట్టగలిగిన శక్తి చంద్రబాబుకు ఉందని ప్రజలు అనుకొంటున్నారు. చంద్రబాబు సమర్థుడైన నేత. అలాంటి వారు రావాల్సిన అవసరం ఉంది. దీక్షా దక్షతలు కలిగినవాడు. ఆయన అధికారంలోకి వస్తేనే రాష్ట్రం బాగుపడుతుంది. విద్యుత్‌తో ప్రజలకు దూరమైన టీడీపీ ఇప్పుడు అదే విద్యుత్ఉద్యమంతో ప్రజలకు చేరువ అవుతోంది. వ్యవసాయం దండగంటూ చంద్రబాబు అన్నారని ప్రజలు నమ్మడంలేదు. వ్యవసాయాన్ని వదిలి లాభదాయక వృత్తులను చూసుకోవాలని వైఎస్, రోశయ్య కూడా చెప్పారు. మా జెండా నీడలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మేం ఉద్యమం చేస్తుంటే పట్టించుకోవడంలేదు. దీని ఫలితం ఆ పార్టీ అనుభవిస్తుంది''
-టీడీపీ ఎమ్మెల్యేల దీక్షాశిబిరం వద్ద సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు

బాబుతోనే రాష్ట్రం బాగు: కూనంనేని

ఎమ్మెల్యేలపై వేటు వేయండి

హైదరాబాద్ : శాసనసభలో అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ సందర్భంగా తమ పార్టీ విప్‌ను ఉల్లంఘించారంటూ 9 మంది ఎమ్మెల్యేలపై తెలుగుదేశం పార్టీ స్పీకర్‌కు ఫిర్యాదు చేసింది. వారిపై అనర్హత వేటు వేయాలని కోరింది. వీరిలో ఏడుగురు సీమాంధ్ర నేతలు, ఇద్దరు తెలంగాణ నేతలు ఉన్నారు. విప్ ఉల్లంఘనపై ఇచ్చిన ఎమ్మెల్యేల జాబితాలో పిరియా సాయిరాజ్(ఇచ్ఛాపురం), వనిత (గోపాలపురం), కొడాలి నాని (గుడివాడ), చిన్నం రామకోటయ్య (నూజివీడు), అమర్‌నాథరెడ్డి (పలమనేరు), ప్రవీణ్ కుమార్ రెడ్డి (తంబళ్లపల్లి), బాలనాగిరెడ్డి (మంత్రాలయం), హరీశ్వర్ రెడ్డి (పరిగి), సముద్రాల వేణుగోపాలాచారి (ముధోల్) ఉన్నారు.

అవిశ్వాసంపై రెండు దఫాల ఓటింగ్‌కు అందరూ హాజరైతటస్థంగా వ్యవహరించాలని టీడీపీ విప్ జారీచేసింది. అయితే... రామకోటయ్య, వేణుగోపాలాచారి, హరీశ్వర్ రెడ్డి ఓటింగ్‌కు రాలేదు. మిగిలిన వారు వచ్చినా ఓటింగ్‌లో పాల్గొన్నారు. అయితే, హరీశ్వర్ రెడ్డి అవిశ్వాసాన్ని చర్చకు తీసుకోవచ్చా లేదా అన్నదానిపై ఓటింగ్‌లో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో స్పీకర్ వీరికి నోటీసులు జారీచేసి, సమాధానం అందిన తర్వాత తుది నిర్ణయం తీసుకుంటారు.

విప్ ఉల్లంఘనపై స్పీకర్‌కు టీడీపీ ఫిర్యాదు

కాకినాడ  తెలుగుదేశం పార్టీ 31వ ఆవిర్భావ దినోత్సవాన్ని తూర్పు గోదావరి జిల్లా పెదపూడిలో శుక్రవారం ఘనంగా నిర్వహించనున్నారు. ఈ జిల్లాలో పాదయాత్రచేస్తున్న టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఈ ఉత్సవంలో పాల్గొననున్నారు. ఉదయం 9 గంటల నుంచీ పార్టీ ఆవిర్భావ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. పార్టీకి దీర్ఘకాలంగా సేవలు అందిస్తున్న నేతలను సత్కరించనున్నారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటుచేశారు.

తూర్పులో టీడీపీ ఆవిర్భావ దినోత్సవం నేడు

కాకినాడలోని సూర్యారావుపేట సాగర తీరంలో చంద్రబాబు సైకత శిల్పాన్ని ఆ పార్టీ నగర శాఖ మాజీ అధ్యక్షుడు దూసర్లపూడి రమణరాజు గురువారం రూపొందించారు. టీడీపీ 31వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలుగు జాతికి అండ నినాదంతో పార్టీ చిహ్నాన్ని తీర్చిదిద్దారు.

సాగర తీరంలో చంద్రబాబు సైకత శిల్పం

స్వామినాథన్ సిఫారసులు అమలు చేస్తాం
రజకులను ఎస్సీలుగా గుర్తించేందుకు కృషి
కాంగ్రెస్‌ను ఉతికి ఆరేయండి
రజకులకు చంద్రబాబు పిలుపు
కిరణ్ పనికిమాలిన సీఎం అంటూ ధ్వజం

కాకినాడ: వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపిస్తే వ్యవసాయరంగాన్ని సంక్షోభం నుంచి గట్టెక్కిస్తామని ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. రజకులను ఎస్సీలుగా గుర్తించే అంశాన్ని పరిగణనలోకి తీసుకుంటామని ఆయన చెప్పారు. తూర్పుగోదావరి జిల్లాలో 'వస్తున్నా మీకోసం' పాదయాత్రలో భాగంగా బిక్కవోలు, గొల్లలమామిడాడ, పెద్దాడ, పెదపూడిలలో చంద్రబాబు గురువారం పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పలుచోట్ల ప్రసంగించారు. నియోజకవర్గాల సమీక్షా సమావేశాలు నిర్వహించారు.

టీడీపీ అధికారంలోకి వస్తే ఎంఎస్ స్వామినాథన్ కమిటీ చేసిన సిఫారసులను అమలుచేసి వ్యవసాయరంగాన్ని ఆదుకుంటామని బాబు హామీ ఇచ్చారు. రైతుల ఆత్మహత్యలు అరికట్టేందుకు తాను రుణమాఫీ చేస్తానని చెబుతుంటే కాంగ్రెస్, పిల్లకాంగ్రెస్‌లు అసాధ్యమని చెబుతున్నాయని విమర్శించారు. వ్యవసాయ పెట్టుబడులు 300 శాతం పెరిగినా పంటల ధరలు 30 శాతం కూడా పెరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. బట్టలు ఉతికినట్లు కాంగ్రెస్‌ను ఉతికి ఆరేయాలని బిక్కవోలు మండలంలో ఏర్పాటు చేసిన జిల్లా రజకుల సమావేశంలో చంద్రబాబు పిలుపునిచ్చారు. రజక సంఘాలను బలోపేతం చేస్తామని, దోబీఘాట్‌లు పునరిద్ధరిస్తామని, రజకులను ఎస్సీల్లోకి చేర్చేందుకు కృషి చేస్తామని హర్షధ్వానాల మధ్య ఆయన ప్రకటించారు.

అన్నదాతను ఆదుకుంటాం

అనంతపురం రూరల్: వ్యవసాయానికి ఏడు గంటలు విద్యుత్ సరఫరా చేసి పంటలు ఎండకుండా చూడాలని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విద్యుత్ కోతలకు వ్యతిరేకంగా గురువారం సాయంత్రం కళ్యాణదుర్గం రోడ్డు రాజా హోటల్ దగ్గర టీడీపీ రూరల్ మండల కమిటీ ఆధ్వర్యంలో ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశా రు. టీడీపీ మండల కమిటీ కార్యాల యం నుంచి ఎమ్మెల్యే సునీత, నాయకులు, కార్యకర్తలు నల్లబ్యాడ్జీలు ధరిం చి రాజా హోటల్ వరకు ర్యాలీగా వచ్చి అక్కడ ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే పరిటాల సునీత మాట్లాడుతూ ఇష్టానుసారం విద్యుత్ కోతలు విధిస్తుండటంతో పంటలు ఎండిపోతున్నాయన్నారు. రైతులకు ఏడు గంటలు ఉచిత విద్యుత్ ఇస్తామన్న ప్రభుత్వం కనీసం గంట సేపు కూడా ఇవ్వడం లేదన్నారు. రైతులు, ప్రజల సమస్యలపై హైదరాబాద్‌లో 25 మంది టీడీపీ ఎమ్మెల్యేలు నిరాహార దీక్షలు చేస్తున్నారన్నారు. వీటిని రాజకీయ లబ్ధికోసం చేయడం లేదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి రైతులు, ప్రజల సమస్యలు పరిష్కారించాలని డిమాండ్ చేశారు. జిల్లాలో తాగునీటి సమస్య పరిష్కరం కోసం రూ.30 కోట్లు నిధులు విడుదల చేస్తే కొంతమేర నీటి ఎద్దడి తగ్గే అవకాశం ఉంటుందన్నారు.

కార్యక్రమంలో టీడీపీ జిల్లా నాయకులు పరిటాల మహీంద్ర, మాజీ జడ్పీటీసీ రామ్మూర్తినాయడు, ప్రచార కార్యదర్శి బీవీ వెంకటరాముడు, జిల్లా మైనార్టీ నాయకులు సైపుద్దీన్, టీడీపీ రూరల్ మండల కన్వీనర్ వేంకటేష్, మాజీ ఎంపీటీసీలు వీరాంజినేయులు, వేణుగోపాల్, సూర్యనారాయణ, నాయకులు మారినేని లక్ష్మీనారాయణ, కొం డయ్య, గంగాధర్‌నాయుడు, సొసైటీ డైరెక్టర్ వెంకటప్ప, నూర్‌బాషా, ము ఖేష్‌శీనా, సాంబశివుడు, షపీ, రఘు, మునిరెడ్డి, రుద్రయ్య, నారాయణరెడ్డి, శ్రీరామిరెడ్డి, శ్రీరాములు, బీసీ సెల్ బాబు, ఎస్సీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి అంకె చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

ఏడు గంటలు విద్యుత్ సరాఫరా చేయాలి : పరిటాల సునీత

కాకినాడ: ప్రజల్లోకి వెళ్లి సమస్యలు తెలుసుకునేందుకు చంద్రబాబు చేపట్టిన పాదయాత్ర జిల్లాలో పదో రోజుకి చేరుకుంది. ఈ నెల 20న పశ్చిమ గోదావరి జిల్లా నుంచి రాజమండ్రి చేరుకున్న చంద్రబాబు యాత్ర జిల్లాలో ఉత్సాహంగా సాగుతోంది. జిల్లాకు వచ్చిన తొలి ఐదారు రోజులూ రోజూ 14 నుంచి 16 కిలోమీటర్ల మేర నడిచిన చంద్రబాబు మూడు రోజుల నుంచి దూరం తగ్గించారు. ఈ తొమ్మిది రోజుల్లోనూ చంద్రబాబు 107.5 కిలోమీటర్ల మేర పాదయాత్ర నిర్వహించారు. రాజమండ్రి సిటీ, రాజమండ్రి రూరల్, మండపేట, అనపర్తి అసెంబ్లీ నియోజకవర్గాలలో యాత్ర చేశారు. 29వ తేదీ నాటికి అనపర్తి నియోజకవర్గంలో పాదయాత్ర పూర్తవుతుంది.అక్కడి నుంచి కాకినాడ రూరల్, పిఠాపురం, ప్రత్తిపాడు, తుని నియోజవవర్గాలలో బాబు పాదయాత్ర చేపడతారు.

కాపు సామాజికవర్గంపైనే ప్రధాన గురి... జిల్లాలో బీసీ, మాదిగ ఉప కులాలు టీడీపీకి అనుకూలంగా ఉన్నాయి. ఇక జిల్లా రాజకీయాల్లో కీ లక సామాజికవర్గమైన కాపులను తమవైపు తిప్పుకోవడంపై చంద్రబాబు సీరియస్‌గా దృష్టి సారించారు. ఇందులో భాగంగానే జిల్లాలో అడుగుపెట్టింది మొదలు... ప్రతి సభలోనూ అగ్రవర్ణాల్లో కాపులలో పేదలు ఎక్కువగా ఉన్నారని ప్రస్తావిస్తున్నారు. కాపుల్లో పేదలకు రిజర్వేషన్లు, కాపులకు రాజకీయంగా ప్రాధాన్యత ఇస్తానని పదేపదే ప్రస్తావిస్తున్నారు. మండపేటలో రాష్ట్ర కాపునేతలతో ప్రత్యేక సమావేశం నిర్వహించిన చంద్రబాబు వారి నుంచి సలహాలు, సూచనలు స్వీకరించారు.

పెదపూడిలో పార్టీ ఆవిర్భావ దినోత్సవం..అనపర్తి నియోజకవర్గం పెదపూడిలో టీడీపీ ఆవిర్భావ దినోత్సవం నిర్వహిస్తున్నారు. ఈ మేరకు ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేశారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో పాల్గొని అక్కడి నుంచి చంద్రబాబు కాకినాడ రూరల్ నియోజకవర్గానికి చేరుకోనున్నారు.

పెదపూడిలో నేడు పార్టీ ఆవిర్భావ దినోత్సవం


గుంటూరు : విద్యుత్ సంక్షోభాన్ని ప్రభు త్వం పరిష్కరించేంత వరకు తమ నిరవధిక నిరాహార దీక్ష కొనసాగుతుందని జిల్లా టీడీపీ అధ్యక్షుడు ప్రత్తిపాటి పుల్లారావు స్పష్టం చేశారు. రాష్ట్రంలో నెలకొన్న విద్యుత్ సంక్షోభం పరిష్కారం కోసం హైదరాబాద్ న్యూఎమ్మెల్యే క్వార్టర్స్ వద్ద టీడీపీ ఎమ్మెల్యేలు చేపట్టిన నిరవధిక దీక్ష గురువారం మూడో రోజుకు చేరుకొన్నది. దీక్షలో పుల్లారావుతో పాటు పాల్గొన్న ఎమ్మెల్యేలు నరేంద్రకుమార్, కొమ్మాలపాటి శ్రీధర్, జీవీవీఎస్ ఆంజనేయులు నీరసించిపోయారు. వారి శరీర చక్కెర స్థాయి గణనీయంగా పడిపోయింది. ఎమ్మెల్యే శ్రీధర్ ఇటీవలే పచ్చకామెర్లకు గురయ్యారు. ఇంకా పూర్తిగా కోలుకోకముందే దీక్షలో పాల్గొనడం వల్ల ఆయన ఆరోగ్యపరంగా ఇబ్బంది పడుతున్న ట్లు సహచర ఎమ్మెల్యేలు తెలిపారు.

విద్యుత్ సంక్షోభాన్ని పరిష్కరించాలని శాసనసభ లోపల, వెలుపల టీడీపీ ఎన్ని ఆందోళనలు చేసినా ప్రభుత్వం స్పందించనందుకే తాము దీక్షకు దిగామని పుల్లారావు స్పష్టం చేశారు. గతంలో తమ పార్టీ అధినేత చంద్రబాబు ర్రాష్టానికి ఎంతో పేరు తీసుకొచ్చారని గుర్తు చేశారు. ఎమ్మెల్యే నరేంద్రకుమార్ మాట్లాడుతూ వ్యవసాయం, పరిశ్రమలు, రవాణ, ఆరోగ్యం, విద్య తదితర రంగాలన్నింటిని విద్యుత్ ప్రభావితం చేస్తోందన్నారు. ఈ సంక్షోభానికి వైఎస్ నాంది పలికితే రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి కొనసాగించారని చెప్పారు.

వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు మాట్లాడుతూ టీడీపీ దూరదృష్టితో రాష్ట్రంలో 2770 మెగావాట్ల సామర్థ్యంతో గ్యాస్ ఆధారిత విద్యుత్ ప్లాంట్లను నిర్మించామన్నారు. ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ మాట్లాడుతూ టీడీపీ హయాంలో చివరి నాలుగు సంవత్సరాల్లో కరువు వచ్చినప్పటికీ విద్యుత్ రంగాన్ని సమర్థవంతంగా నిర్వహించి రైతులకు 9 గంటల పాటు విద్యుత్ సరఫరా చేయడం జరిగిందన్నారు.

ప్రభుత్వం దిగి వచ్చేంత వరకు నిరవధిక దీక్ష

  తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఈ నెల 29న గ్రామాగ్రామన, మండల, పట్ట ణ, జిల్లా కేంద్రాల్లో పార్టీ శ్రేణులంతా ఘనంగా నిర్వహించాలని ఎమ్మెల్సీ, జి ల్లా పార్టీ అధ్యక్షుడు వి.గంగాధర్ గౌడ్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

మంగళవారం ఆయన డిచ్‌పల్లిలో విలేఖరులతో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ స్థాపించిన ఎన్టీఆర్ ఆవిర్భా వ వేడుకలను ప్రతీ యేటా ఘనంగా నిర్వహించుకోవడం ఆనవాయితీగా వ స్తుందని పేర్కొన్నారు. అదేవిధంగా, గ్రామీణ ప్రాంతాల్లో రాజకీయాలంటే తెలిసే విధంగా చేసిన ఘనత ఎన్టీఆర్‌దేనని, ఎన్టీఆర్ ఆశయ సాధన కోసం ప్రతీఒక్కరు కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.

పార్టీ ఆవిర్భావించిన ఆరు నెలల్లోనే అధికారంలోకి తీసుకువచ్చిన ఘనత ఎన్టీఆర్‌కు ఒక్కరికే దక్కుతుందని, పే దల సంక్షేమం, బడుగు బలహీన వర్గా ల అభ్యున్నతే లక్ష్యంగా ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించి రాష్ట్ర స్థాయి లో చెరగని ముద్ర వేశారన్నారు. దీనిలోభాగంగా రెండు రూపాయలకు కిలో బియ్యం, మహిళా సంఘాలకు రుణాలు, పేదలకు పక్కా గృహాలు ఎ న్టీఆర్ చేసిన ఘనతేనని పేర్కొన్నారు. సమావేశంలో పార్టీ మండలాధ్యక్షుడు నీరడి పద్మరావు, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్‌గౌడ్, నాయకులు శ్యాంరావు, ఎర్రన్న, నడిపన్న, తదితరులున్నారు.

రేపు టీడీపీ ఆవిర్భావ వేడుకలు