December 21, 2012

అంగన్‌వాడీ వర్కర్లు..గ్రామీణ ప్రాంతాలకు అక్షయపాత్రలు. పేదలు, కూలీల పిల్లలకు పౌష్టికాహారం అందించడంలో వీళ్ల పాత్రే కీలకం. అలాంటివాళ్లు ఇవాళ గొల్లుమంటున్నారు. వాళ్ల 'పాత్ర' దాదాపు ఖాళీగా కనిపిస్తోంది. వాళ్లు ఇన్ని కష్టాలు పడుతున్నారనే విషయం గోలి రామయ్యపల్లెలో అడుగు పెట్టే వరకు నాకూ తెలియదు. వాళ్ల మాటల్లో పరిస్థితిని విన్నప్పుడు బాధనిపించింది. భావి పౌరులందరికీ పౌష్టికాహారం ఇచ్చి శారీరకంగానూ మానసికంగానూ దోహదపడే ఇంత మంచి వ్యవస్థను ఎంత నిర్లక్ష్యం చేస్తున్నారనిపించింది.

"జీతం,భత్యం లేకుండా పనిచేస్తున్నాం సార్. ఇచ్చే ఆ అరకొర జీతం కూడా ఐదు నెలలుగా రావడం లేదు. రేషన్ ఇవ్వడమూ అంతే. మా దగ్గర లేకుండా పిల్లలకు ఏమి పెట్టాలి? గట్టిగా వాన పడితే మేమూ పిల్లలూ ముద్దముద్దే. సొంత భవనాల గురించి ఎంత కొట్లాడినా సర్కారులో సోయే లేదు'' అని కొందరు మహిళలు వాపోయారు. వాళ్ల ఆవేదనలో నిజం ఉన్నదనిపించింది. బండెడు చాకిరీ చేసినా చిటికెడు గుర్తింపునకు వాళ్లు నోచుకోవడం లేదు.

వీళ్లకేదో కొత్తగా ఒరగబెడతారని కాదు గానీ, ఇచ్చేదైనా సరిగ్గా ఇవ్వాలని కోరుతున్నారు. కేంద్ర తాజా బడ్జెట్‌లో అంగన్ వాడీ వర్కర్ల గౌరవ వేతనం దాదాపు నాలుగు వేలకు పెరిగినా వారికి పూర్తిగా అందిందే లేదు. ఆ వేతనంలో ఏడు వందలు రాష్ట్రం వాటా. మిగతాది కేంద్రం విడుదల చేస్తుంది. తన వాటా ఇవ్వకపోగా కేంద్రం ఇస్తున్న నిధులనూ మన ప్రభుత్వం వేరే కార్యక్రమాలకు దారి మళ్లిస్తున్నది. దీనిపై అంగన్‌వాడీ వర్కర్లు రోడ్డెక్కినా పట్టించుకోవడం లేదు. చివరకు సుప్రీంకోర్టు మార్గదర్శకాలూ పాటించడం లేదు. ఎంత ఘోరం?

నీళ్లు వస్తున్నాయంటే ఊళ్లు కళకళలాడాలి. ప్రాజెక్టు కడుతున్నారంటే కొత్త ఆయకట్టు సాగులోకి రావాలి. కానీ, కోరటపల్లిలో రైతులు మాత్రం మోతె ప్రాజెక్టు అంటేనే బెదిరిపోతుండటం కనిపించింది. "సార్ అది మోతె ప్రాజెక్టు కాదు.. మా ప్రాణాలకు ఉరి బిగించే ప్రాజెక్టు. దానివల్ల మా భూములన్నీ ముంపులో పడతాయి. మరే ప్రాజెక్టూ మాకొద్దు. శ్రీరాంసాగర్ నీళ్లు సక్రమంగా విడుదల చేస్తే అదే మాకు పది వేలు'' అని రైతులు చెబుతుంటే, ఇదేమి అభివృద్ధి, ఎందుకీ జలయజ్ఞం అనిపించింది.

గొల్లుమంటున్న అంగన్‌వాడీ వర్కర్లు
ముఖ్యమంత్రి.. నేరస్తులకు కొమ్ముకాస్తున్నాడు!
ధర్మాన ప్రాసిక్యూషన్‌కు అనుమతి ఇవ్వడు
అవినీతి జీవోలపై మంత్రులకు మద్దతిస్తాడు
కానీ, రైతులు చస్తున్నా పట్టించుకోడు
సీఎం కిరణ్‌పై చంద్రబాబు నిప్పులు
బంగారం రేట్లు పెంచిన గాలి పసిడి దాహం
కరీంనగర్ పాదయాత్రలో టీడీపీ అధినేత


"అవినీతి మంత్రులకు, నేరస్తులకు ఈ ముఖ్యమంత్రి కొమ్ము కాస్తున్నారు. శిక్షించాల్సింది పోయి కాపాడుతున్నారు. అవినీతిపరులు మంత్రులైనా, ఎవరైనా సరే, వారు ఎక్కడున్నా నిర్ధాక్షిణ్యంగా శిక్షించాల్సిందే''నని టీడీపీ అధినేత చంద్రబాబు డిమాండ్ చేశారు. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం చిప్పకుర్తి నుంచి శుక్రవారం ఆయన పాదయా త్ర ప్రారంభించారు. రామడుగు, షానగర్ క్రాస్ రోడ్, గోలి రామయ్యపల్లి, మోతె క్రాస్ రోడ్, కోరటపల్లి, కొక్కెరకుంట «గ్రామ శివారు వరకు 14.4 కిలోమీటర్లు నడిచా రు.

రామడుగు, షానగర్ సభల్లో మాట్లాడిన ఆయన.. సీఎం కిరణ్‌కుమార్ రెడ్డిపై నిప్పులు చెరిగారు. 'వాన్‌పిక్' మంత్రిని వెనకేసుకు వస్తున్నారని దుయ్యబట్టారు. "వాన్‌పిక్ వ్యవహారంలో ఏ1, ఏ2, ఏ3, ఏ4, ఏ6, ఏ7ను సీబీ ఐ అరెస్టు చేసింది. ఏ5గా ఉన్న మంత్రి ధర్మాన ప్రసాదరావును ప్రాసిక్యూట్ చేసేందుకు వెళితే, ఆయనను అరె స్టు చేయకుండా ఈ ప్రభుత్వం అడ్డు పడింది. 26 అవినీ తి జీవోలను జారీ చేసిన మంత్రులు సుప్రీంకోర్టుకు వెళితే వారికి ప్రభుత్వం నుంచి సహాయం అందిస్తామనడం సిగ్గుచేటు''అని మండిపడ్డారు.

రైతులు మద్దతు ధర రాక ఆందోళనలు చేస్తుంటే సఎం పట్టించుకోకపోవడ తగదని విమర్శించారు. "ప్రజలందరూ ఇబ్బందులు పడుతున్నా రు. గిట్టుబాటు ధరలు దక్కక రైతులు ఆందోళన చెందుతున్నారు. పత్తికి మద్దతు ధర లేదు. ఎరువుల ధరలను నాలుగింతలు పెంచేసి ప్రభుత్వం.. రైతుల నడ్డీ విరుస్తున్న''దన్నారు.

అనేక మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, ఒక్క కరీంనగర్ జిల్లాలోనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి గడిచిన ఏడాది వర కు 817 మంది ఆత్మహత్య చేసుకున్నారని వివరించారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ఉపాధి హామీ పథకంతో వ్యవసాయాన్ని అనుసంధానం చేస్తామన్నారు. సర్‌చార్జి వసూళ్లను నిలిపి వేయాలని ప్రభుత్వాన్ని డి మాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో దేశంలో 10 లక్షల కోట్ల అవినీతి జరగగా, రాష్ట్రంలో 86 వేల కోట్ల తో జలయజ్ఞం చేపట్టి పేదవాళ్ల సొమ్మును దోపిడీ చేశార ని దుయ్యబట్టారు. ఒకేసారి అన్ని పనులూ ప్రారంభించి మొబిలైజేషన్ అడ్వాన్సుల పేరిట దోచుకున్నారని ఆరోపించారు. కిరణ్ ప్రభుత్వం దివాలా తీసిందన్నారు.

113 సెజ్‌ల పేరిట 2 లక్షల 75 వేల ఎకరాల భూములను వైఎస్ ఆయా కంపెనీలకు పంచి పెట్టారని చెప్పారు. భూగర్భ గనులు గల 8 వేల ఎకరాల భూములను ఇచ్చి 16 లక్షల కోట్ల విలువ చేసే ఖనిజ సంపదను గాలి జనార్దన్ రెడ్డికి కట్టబెట్టారని విమర్శించారు. దేశంలో ఉన్న బంగారన్నంతా కొనేసిన గాలి బంగారు మంచం, కంచం, గ్లాసు, కుర్చీ చివరికి బంగారు మరుగుదొడ్డి ని కూడా ఏర్పాటు చే సుకున్నాడని, దానివల్ల ఆడపడుచులకు బం గారు మంగళ సూత్రం, ఆడపిల్లలకు ముక్కు పోగు లేకుండా పోయే పరిస్థితి ఏర్పడిందని అన్నారు.

భూగర్భ సం పదనంతా కొల్లగొట్టార ని, అదే ఉంటే వృద్ధుల కు వెయ్యి రూపాయల పింఛను, పేదలకు ఇళ్లు, రోడ్లు, ప్రాజెక్టుల నిర్మాణాలు చేపట్టవచ్చని పేర్కొన్నారు. గుండె లు గుబేల్‌మనేలా కరెంట్ బిల్లులు వస్తున్నాయని, వ్యవసాయానికి రోజుకు 4 గంటలైనా విద్యుత్తు ఇవ్వడం లేదని విమర్శించారు. టీడీపీ హయాంలో మహిళలకు 35 లక్షల గ్యాస్ కనెక్షన్లు ఇచ్చామని గుర్తు చేశారు. కానీ, ఇప్పుడు పెరిగిన ధరల వల్ల గ్యాస్ కొనే పరిస్థితి లేదన్నా రు. దేశంలో డబ్బుల్లేక కాదని, ఆ డబ్బును దోచుకుని వాళ్ల ఖజానాలు నింపుకుంటున్నారని పరోక్షంగా జగన్‌పై నిప్పులు చెరిగారు.

మార్గమధ్యలో పత్తి రైతులు, వివిధ వృత్తులపై ఆధారపడి జీవిస్తున్న వారితో చంద్రబాబు సంభాషించారు. కాగా, రామడుగు సభలో కొందరు యువకులు జై తెలంగాణ నినాదాలు చేయడంతో వారిని పోలీసులు పక్కకు వెళ్లగొట్టారు. చంద్రబాబు వెంట శాసన మండలి సభా పక్ష నేత దాడి వీరభద్ర రావు, టీ-టీడీపీ ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్యేలు సుద్దాల దేవయ్య, సీహెచ్ విజయరమణారావు, మాజీ మంత్రి పెద్దిరెడ్డి తదితరులు ఉన్నారు.

అవినీతిపరులెవరైనా శిక్షించాల్సిందే:చంద్రబాబు

ఏమ్మా అంతా బాగేనా? అని చంద్రబాబు పలకరింపు..మహిళ: ఏం బాగున్నాం. పిల్లకు మొన్ననే లగ్గం చేసిన. 4 లచ్చల కట్నం ఇయ్యాలే. పంటచ్చినంక కట్నం పైసలిత్తనని జెప్పి బువ్వ, బట్టలు పెట్టి లగ్గం చేసిన. కరంటు లేక పంట ఎండిపోయింది. పైసలియ్యందే పిల్లను మా ఇం టి తోలడట. ఎగబెడితే లంగ, దొంగ అంటరు. నా కష్టం.. నా నష్టం ఎవలు సూత్తన్నరూ.. నువ్వయితే అచ్చినవు.. కరంట్ బిల్లులయితే బాగా అత్తన్నయి.. ఒక్క రోజు ఆగితే ఫైన్ ఏస్తండ్రు. క రంటు లేదు, నీళ్లు లేవు.. మాకు అన్నం పెడతవో, మన్నే పెడతవో.. అందరం బతకాలి అని బూర్గుపల్లి గ్రామానికి చెందిన మహిళా రైతు ఈరవేని వెంకవ్వ తన పొలం వద్దకు వచ్చిన చంద్రబాబు తో వాపోయింది.

వస్తున్నా మీ కోసం పాదయాత్రలో భాగంగా గురువారం జిల్లాలోని గంగాధర మండలం ర్యాలపల్లి గ్రామ శివారు నుంచి లింగంపల్లి, బూర్గుపల్లి, రామడుగు మండలం తిరుమలాపూర్, మర్రి గడ్డ, సర్వారెడ్డిపల్లి, పెండలోనిపల్లి, గో పాల్‌రావు పేట, గుండి, రాంచంద్రాపూ ర్ గ్రామాల మీదుగా 14.9 కిలోమీట ర్లు పాదయాత్ర సాగింది. 12 గంటలకు బయలు దేరిన ఆయన మల్లాపూర్ మండలం ఓబులాపూర్ గ్రామంలో వి కలాంగులు బేలుపు మల్లేశం, జల్ల పోశన్నలకు ట్రైసైకిళ్లు ఇస్తానని ఇచ్చిన హా మీ మేరకు వారిని పిలిపించి ట్రై సైకిళ్ల ను పంపిణీ చేశారు.

ట్రాన్స్‌ఫార్మర్ ఫీజు వేస్తుండగా మా నాన్న చనిపోయాడని రెండేళ్లయినా ఎలాంటి పరిహారం ఇవ్వడం లేదని మ మ్మల్ని పరిహారం ఇప్పించాలని ర్యాలపల్లికి చెందిన వేమల నిర్మల, పత్తికి మ ద్దతు ధర ఇవ్వడం లేదని, వరద కా లువ లోతు చేయడం వల్ల భూగర్భ జ లాలు ఎండి పోతున్నాయని, అక్కడక్కడ చెక్‌డ్యామ్‌లు కట్టి 5 టీఎంసీల నీటిని నిల్వ చేయాలని రైతు కె శ్రీపతిరావు. లింగంపల్లిలో గ్రామ పంచాయ తీ ఏర్పాటు చేసేందుకు చొరవ చూపాలని యంగ్ స్టార్ యూత్ క్లబ్ సభ్యులు. భర్త మృతి చెంది నాలుగు సంవత్సరాలయ్యింది. వితంతు పెన్షన్ ఇస్తలేరు. అంత్యోదయ కార్డు ఇస్తలేరని వెంగమనేని శ్రీలత. గోర్లను మేపడానికి గడ్డి లే దు. మేపుకునేందుకు ఐదెకరాల భూమి ఇయ్యాలే. అని గొర్రె కాపరులు పోచ య్య, గంగయ్య. మాకు చెట్లు పెంచుకునేందుకు జాగ లేదు. పెన్షన్లు ఇవ్వాలని, చెట్టు మీద నుం చి పడిపోయి చనిపోతే పరిహారం ఇవ్వడం లేదు.

మీరైనా ఇ ప్పించాలని బూర్గుపల్లి గీత కార్మికులు..ఇలా ఆయా వర్గాల ప్రజలు దారి పొ డవునా చంద్రబాబు నాయుడుకు బాధలు విన్నివించుకున్నారు. ఈ సందర్భంగా ఆయా సభల్లో ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం హయాంలో 8 కోట్ల రూపాయల బడ్జెట్ ఉంటే ఇప్పుడు 1,55,000 కోట్ల బడ్జెట్ ఉందని, కానీ ఈ ప్రభుత్వం ప్రజలకు ఏమి చేయడం లేదని విమర్శించారు. స్వర్గీయ ఎన్‌టీ రామారావు సింగిల్ విండో వ్యవస్థను తీసుకు వచ్చారని గుర్తు చేశారు. మండలాలు ఏర్పాటు చేశారని, ప్రజల వద్దకు పాలని నిర్వహించారని ఆ తర్వాత జన్మభూమి నిర్వహించి అన్ని సమస్యలు ప రిష్కరించామన్నారు. సాగునీటి సం ఘాలను పెట్టి సాగునీటి రంగాన్ని ప టిష్టం చేశామన్నారు. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు డ్వాక్రా సంఘాలు పెట్టి పొదుపు చేయించామన్నారు. వ్యవసాయానికి 9 గంటల పా టు విద్యుత్తు ఇచ్చామని గుర్తు చేశారు.

ఈ ప్రభుత్వం 4 గంటలు కూడా కరెం ట్ ఇవ్వకపోవడంతో రైతులు నష్టాల పాలవుతున్నారని అన్నారు. ఈ సీజన్ కు కరెంట్ ఇవ్వలేమని చేతులెత్తేశారని, ఎస్సారెస్పీ నీటిని కూడా ఇవ్వడం లేద ని మండిపడ్డారు. కరెంట్ బిల్లులు చూ స్తుంటే గుండె గుభేలు మంటున్నాయ ని చార్జీల మీద చార్జీలు పెంచి, సర్‌చార్జీ లు వేసి బాదుతున్నారని అన్నారు. ఇదేమిటని ప్రశ్నించిన వారిపై తప్పుడు కేసులు పెడుతున్నారని పేర్కొన్నారు. ఇదేమి పరిపాలన అని ప్రశ్నించారు. వ్య వస్థలన్నీ కుప్ప కూలిపోయాయని, వీఇఓలను తొలగించిన వైఎస్ఆర్, 50 వేల మంది కాంగ్రెస్ కార్యకర్తలను, బెల్టు షాపుల నిర్వాహకులను ఆదర్శ రైతులుగా పెట్టారని వారి వల్ల రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ అందడం లేదన్నారు. అధికారంలోకి రాగానే రైతులకు 9 గంటల కరెంట్ ఇస్తానని, రైతుల రుణాలు మా ఫీ చేస్తానన్నారు. బీసీల కోసం 10 వేల కోట్లతో సబ్ ప్లాన్‌ను ఏర్పాటు చేసి కులవృత్తులకు ఆదరణ కల్పిస్తామన్నారు.

మైనార్టీలకు విద్య, ఉద్యోగాల పరంగా 8 శాతం రిజర్వేషన్లు ఇస్తామన్నారు. అ సెంబ్లీ ఎన్నికల్లో 100 మందికి టిక్కెట్లు ఇస్తానని, స్థానిక సంస్థల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని హా మీ ఇచ్చారు. గొర్రె కాపరులకు 5 ఎకరా ల భూమిని కేటాయించి, మందులను ఉచితంగా అందజేస్తామన్నారు. గీత కా ర్మికులకు 1000 రూపాయల పెన్షన్ ఇ స్తామని, చెట్టుపై నుంచి పడి మృతి చెం దే వారికి 5 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియో ఇస్తామని హామీ ఇచ్చారు. చేనే త, కుమ్మరి, కమ్మరి అన్ని వర్గాల ప్రజలను ఆదుకుంటానని, ఎస్సీ వర్గీకరణ చేపడతానని చెప్పారు. బాగా చదువుకునే విద్యార్థులకు కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లను ఇస్తామన్నారు. త్వరలోనే మంచి రోజులు వస్తాయని, మీ కష్టాలు తీరతాయని, అందరినీ ఆదుకుంటానని చంద్రబాబునాయుడు హామీ ఇచ్చారు.

ఈ సందర్భంగా చంద్రబాబుకు ఆ యన వెంట మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి, చొప్పదండి, కరీంనగర్, జగిత్యాల ఎమ్మెల్యేలు సుద్దాల దేవయ్య, గంగుల కమలాకర్, ఎల్ రమణ, జిల్లా ప్రధాన కార్యదర్శి వాసాల రమేష్, ని యోజకవర్గాల ఇన్‌చార్జీలు కర్రు నాగ య్య, పి రవీందర్‌రావు, ముద్దసాని కశ్య ప్ రెడ్డి, గండ్ర నళిని, శికారి విశ్వనాథం, రాష్ట్ర కార్యదర్శులు అన్నమనేని నర్సింగరావు, బోనాల రాజేశం, జిల్లా నాయకులు కర్ర విద్యాసాగర్ రెడ్డి, రేండ్ల రాజిరెడ్డి, పుల్కం నర్సయ్య, కర్ర సుమ, ఒం టెల మురళీకృష్ణారెడ్డి, అమిరిశెట్టి భూం రెడ్డి, కళ్యాడపు ఆగయ్య, సత్యనారాయ ణరెడ్డి, పన్యాల శ్యాంసుందర్‌రెడ్డి, పొ ల్సాని రామారావు, మాచర్ల ఎల్లగౌడ్, మహిళా నాయకులు అమీనాబేగం, దూలం రాధిక, తెలుగు యువత జిల్లా అధ్యక్షులు సుద్దాల వెంకట గౌతంకృష్ణ, తెలుగు రైతు జిల్లా అధ్యక్షులు వెల్ముల రాంరెడ్డి, ప్రధాన కార్యదర్శి మంద రా జమల్లు, బీసీ సెల్ అధ్యక్షులు లక్ష్మినారాయణ, టీఎన్ఎస్ఎఫ్ ప్రతినిధి బుర్ర సంజయ్, తదితరులు పాల్గొన్నారు.

ఆర్థిక సహాయం చేస్తూ..జిల్లాలో పాదయాత్ర నిర్వహిస్తున్న టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు మార్గమధ్యంలో, గ్రామాల్లో త నను కలిసే వృద్ధులకు, వికలాంగులకు రెండు వేల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం చేస్తూ వస్తున్నారు. ఇలా రో జుకు పది నుంచి 15 మందికి కవర్లలో 2 వేల రూపాయలు పెట్టి ఇస్తున్నారు. కాగా, గురువారం రాత్రి రాంచంద్రా పూర్‌లో చంద్రబాబుతో పాటు ఆయన సతీమణి భువనేశ్వరి బస చేశారు.

ఎట్ల బతకాలో..చెప్పు బాబూ..!

టీడీపీ అధినేత చం ద్రబాబు నాయుడు 63 సంవత్సరాల వయస్సులో ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు పాదయాత్ర చేస్తుంటే.. కొందరు నాయకులు విమర్శిస్తున్నార ని, ఆ నాయకులకు జగిత్యాలలో వచ్చి న జనమే జవాబు అని జగిత్యాల ఎమ్మెల్యే ఎల్.రమణ అన్నారు. గురువారం జగిత్యాలలోని ఆయన ఇంట్లో ఏర్పాటు చేసిన సమావేశంలో రమణ మాట్లాడుతూ చంద్రబాబు పాదయాత్రపై కాంగ్రెస్, టీఆర్ఎస్ నాయకులు విమర్శలు చేయడంపై తీవ్ర స్థాయిలో విమర్శించారు. చంద్రబాబు నాయు డు 75 రోజులుగా పాదయాత్ర చే స్తుంటే.. అశేష జనం ఆయన వెంట ఉంటూ సమస్యలు వివరిస్తూ కంటతడి పెట్టుకుంటున్నారని, జీర్ణించుకోలే ని రాజకీయ పార్టీలు విమర్శించడం స్వార్థపూరితంతో కూడుకున్నదన్నారు. ఈర్ష్య, అసూయలతో మాట్లాడటం స రైంది కాదన్నారు. బడుగు, బలహీన వర్గాలు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల కోసం పార్టీ ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ పెత్తందారుల చేతిలో ఉండే రాజ్యాధికారాన్ని బలహీన వర్గాలకు అందింపజేశాడన్నారు.

చంద్రబాబు నాయుడు చేపట్టిన సంస్కరణల ఫలితంగా ఆదా యం పెరుగుతున్న సమయంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజా సంక్షేమం పేరిట అందినంత దోచుకుందని విమర్శించారు. అధికారంలో ఉం ది అని ఆ పార్టీలో ఉంటూ పనులు చే యించుకుంటూ, మరో పార్టీ నాయకుడు సీఎం అవుతాడంటూ జగన్ జ పం చేస్తున్న జీవన్ రెడ్డికి బాబును వి మర్శించే అర్హత లేదన్నారు. ఎవరి పరిస్థితి ఏమిటో ప్రజలకు తెలుసని.. అవినీతి, అక్రమాలు లేకుండా పని చేస్తున్నానని, ఎవరి కోసం పనులు మం జూరీ చేయించారో, ఎవరికి కాంట్రాక్ట్‌లు ఇచ్చారో మాట్లాడుకుందామని సవాల్ విసిరారు. వరద కాలువ నిర్మాణంలో టీడీపీ కి.మీ.కు 6 కోట్లు కేటాయిస్తే, వైఎస్ఆర్ కి.మీ. 13 కోట్లకు పెంచారని, వరద కాలువ నిర్మాణం త ర్వాత ఎవరికి ఏ వాహనాలు వచ్చా యి.. ఎవరి ఆస్తులు పెరిగాయో జగిత్యాల టవర్ వద్ద చర్చించి అక్రమ ఆ స్తులు ఉంటే ప్రజలకు రాసిద్దామని డిమాండ్ చేశారు.

ఆర్డీఓ కార్యాలయం ముందు ప్రజా సమస్యలను వివరించేందుకు వచ్చినవారితో వచ్చి ఫోటో లు దిగే నీవా చంద్రబాబు గురించి మాట్లాడటం అంటూ విమర్శించారు. బాబులాంటి వ్యక్తిని విమర్శించే ముందు ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. బాబ్రీ ప్రాజెక్ట్ నిర్మిస్తున్నప్పుడు తాను, టీడీపీ ఎమ్మెల్యేలంతా ఆందోళన వ్యక్తం చేస్తే అప్పుడు అధికారంలో ఉన్న జీవన్ రెడ్డి, శ్రీధర్ బాబులాంటివారు తప్పు పట్టారని ఆరోపించారు. 18 గ్యారేజీలు నిర్మించడంతో ఉత్తర తెలంగాణ ఎడారిగా మారబోతుందని అన్నారు. టీఆర్ఎస్ నాయకులు కూడా రోడ్లను శుభ్రం చేయడం సరైంది కాదన్నారు. రాయికల్‌లో టీఆర్ఎస్ బంద్‌కు పిలుపునిస్తే ప్రజలు స్వచ్ఛందంగా దుకాణాలు తెరిచి బాబుకు సంఘీభావం తెలిపారని అన్నారు. ప్రజా సమస్యలపై అక్రమాలు తెలుసుకునేందుకు తప్పకుండా డిబెట్ చేద్దాం.. తప్పేమీ లేదని అన్నారు. ఈ సమావేశంలో టీడీపీ జిల్లా నాయకులు గట్టు సతీష్, రాంచందర్ రావు, సత్యనారాయణ రావు, బాలె శంకర్, వొల్లం మల్లేశం తదితరులు పాల్గొన్నారు.

జీవన్‌రెడ్డికి బాబును విమర్శించే అర్హత లేదు

రైతుల కష్టాలు.. కన్నీళ్లు చూస్తున్నా ను.. వారిని చూస్తే గుండె తరుక్కు పో తున్నది. ఆరుగాలం శ్రమించి చెమటో డ్చి పండించిన పంటకు గిట్టుబాటు ధ ర లేదు.. రైతు కష్టం దళారులు, వ్యాపారుల పాలవుతున్నది.. సాగుకు కరెంట్ లేక.. పంటలు ఎండి పోయి నష్ట పోతున్నారు.. రాత్రి కరెంట్‌తో విద్యుత్తు షాక్ కు గురై రైతులు మృత్యువాత పడుతున్నారు.. ఆదుకోవాల్సిన ప్రభుత్వం మొ ద్దు నిద్దరపోతున్నది, కాంగ్రెస్ దొంగలు దోచుకోవడమే పనిగా పెట్టుకున్నారు.. ప్రజల కష్టాలు పట్టడంలేదు..అధికారం లోకి వచ్చిన వెంటనే పంటరుణాల మా ఫీపై తొలి సంతకం చేస్తానని, గిట్టుబా టు ధరలు కల్పిస్తానని, వ్యవసాయానికి 9 గంటల విద్యుత్తు సరఫరా చేస్తానని టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు హామీ ఇచ్చారు.

వస్తున్నా మీ కోసం పాదయాత్రలో భాగంగా బుధవారం జిల్లాలోని జగిత్యాల మండలం రాజారం నుంచి బయలు దేరిన చంద్రబాబు మల్యాల మండలం నూకపల్లి క్రాస్ రోడ్, మల్యాల క్రాస్ రోడ్, గ్రామ పంచాయతీ, తాటిపల్లి, గంగాధర మం డలం ర్యాలపల్లి గ్రామ శివారు వరకు 15.9 కిలోమీటర్ల దూరంలో పాదయా త్ర సాగింది. ఆయనకు పార్టీ కార్యకర్త లు, ఆయా గ్రామాల ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆ యన మార్గమధ్యంలో గీత కార్మికులు, బీఇడీ విద్యార్థులు, కూరగాయలు విక్రయించే మహిళలు, ఇటుక బట్టీల్లో పని చేసే కూలీల కష్టాలు తెలుసుకున్నారు. వరద కాలువను పరిశీలించారు. పెట్రో ల్ బంక్‌లో పెట్రోల్ పోసి పెట్రోల్, డీ జిల్ ధరలు ఎలా ఉన్నాయంటూ ఓ వా హనదారుడిని ప్రశ్నించారు.

ధరలు చా లా పెరిగి పోయాయని భారంగా మా రాయని చెప్పారు. ఇప్పటివరకు ఈ ప్ర భుత్వం 24 సార్లు పెట్రోల్, డీజిల్ ధరలను పెంచిందని బాబు అన్నారు. కొద్ది దూరంవచ్చాక తడాకా హన్మంతు యా దవ్ బాబుకు వినతిపత్రం ఇచ్చారు. ఎ న్టీఆర్ ప్రభుత్వం చేపట్టాక మా యాద వ సంఘానికి గొర్రెలు మేపడానికి 12 ఎకరాల భూమిని ఇచ్చారని ఇప్పుడు దానిని తీసుకునే పరిస్థితి ఉందన్నారు. ఆ భూమిని కాపాడాలని కోరారు. అం దుకు బాబు మాట్లాడుతూ ప్రతి గ్రా మంలో గొర్రెలను మేపుకునేందుకు భూమి కేటాయిస్తానని, ఇదివరకే కేటాయించిన భూమిని తిరిగి ఇప్పిస్తానని తెలిపారు. అనంతరం వరి పంటను పరిశీలించి అక్కడున్న ఓ బైకుపై తీరిగ్గా కూర్చోని ముత్యంపేట రైతులు బద్దం రాంరెడ్డి, మార్పు రాజిరెడ్డిలతో ముచ్చడించారు. వ్యవసాయం ఎలా ఉందని అడిగారు.

స్పందించిన రాంరెడ్డి 7 గం టలు ఇస్తామన్న కరెంట్ ఇవ్వకపోవడం తో పంటలు ఎండిపోయాయని, మద్ద తు ధరలు దక్కడం లేదన్నారు. ఎన్టీఆర్ అధికారంలోకి వచ్చి రాజకీయ చైత న్యం తెచ్చారని కరెంట్ చార్జీలు మాఫీ చేసి, సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి రా మరాజ్యం తెచ్చాడని, ఆ తర్వాత మీ పాలన కూడా బాగుందన్నారు. మళ్లీ రా మరాజ్యం రావాలని ఆశించారు. మీరు ఆ ధైర్యపడవద్దు.. మీరు కోరుకుంటున్న పాలనను అందిస్తాను. పంట రుణాల మాఫీ ఫైలుపై తొలి సంతకం చేస్తానని, గిట్టుబాటు ధరలు కల్పించి, 9 గంటల కరెంట్ ఇస్తానని చెప్పారు. కొద్ది దూరం వెళ్లాక కాటిపెల్లి రాధ అనే మహిళా రై తు బాబు దగ్గరికి రాగానే కన్నీళ్ల పర్యంతమయ్యింది.

రెండేళ్ల క్రితం తన భర్త తి రుపతిరెడ్డి తెల్లవారుజాము చీకట్లో బా వివద్ద కరెంట్ పెట్టబోయి షాక్ కొట్టి చ నిపోయాడని, తనకు ఇద్దరు ఆడపిల్లల ని ప్రభుత్వం ఆదుకోవడం లేదని చె ప్పింది. ప్రభుత్వం పనితీరు సరిగ్గా లేక మనకు ఇబ్బందులు వచ్చాయని, మేం అధికారంలోకి రాగానే మీకు ఆ కష్టాలు ఉండవని మిమ్మల్ని ఆదుకుంటామని చెప్పారు. ఇలా.. ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు ఈ కళాశాలలో కంపౌండ్ వాల్ నిర్మించాలని, డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేయాలని బాబుకు వినతిపత్రం ఇచ్చి కోరారు. మల్యాలలో ఆయా కులవృత్తుల వారిని పరామర్శిం చి, బీడీల కార్ఖానను సందర్శించి వారి సమస్యలు తెలుసుకున్నారు. వెయ్యికి 150 రూపాయలు, నెలకు 1500 పెన్షన్ కోసం పోరాటం చేస్తానని వారికి హామీ లు ఇచ్చారు. పవర్‌లూం యూనిట్‌ను పరిశీలించారు. సబ్సిడీపై నూలు ఇచ్చి, కరెంట్ సబ్సిడీని పెంచి న్యాయం చే యాలని ఇప్పుడున్న పరిస్థితుల్లో గిట్టుబాటు కావడంలేదని కొప్పుల పుష్పనా థం అనే చేనేత కార్మికుడు వాపోయా రు.

అనంతరం మల్యాల, తాటిపల్లిలో జరిగిన సభల్లో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలను నమ్మవద్దని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్‌లో కలిసే పార్టీ అన్నారు. ఈ పార్టీలకు ప్రజా సమస్యలు పట్టవని విమర్శించారు. కాంగ్రెస్, వైఎస్ఆర్ పా ర్టీలు తల్లి, పిల్ల పార్టీలని ఎద్దేవా చేశా రు. 'కాంగ్రెస్ ఐ, కాంగ్రెస్ వై.. అభివృద్ధికి నై.. అవినీతికి సై..' అని చమత్కరించారు. అవినీతి సొమ్మును కాపాడుకునేందుకే జగన్ వైఎస్ఆర్ పార్టీని పె ట్టారన్నారు. ఆయనపై పెట్టిన కేసులను ఎత్తివేస్తే ఆ పార్టీని కాంగ్రెస్‌లో కలుపుతారన్నారు. బీడీ కట్టలపై పుర్రె, శవం గుర్తు పాపం కేసీఆర్‌దేనన్నారు. ప్రజా సమస్యలు పట్టించుకోని కేసీఆర్ 6 నెల లు ఫామ్‌హౌస్‌లో కుంభకర్ణుడిలా ని ద్రించి ఆ తర్వాత లేచి మాయమాటలు చెబుతారని ఆయన మాటలను నమ్మవద్దన్నారు.

ఆనాడు వరద కాలువ నిర్మాణానికి కిలోమీటర్ కోటి రూపాయలతో అంచనాలు తయారుచేస్తే, కాంగ్రెస్ ప్ర భుత్వం కిలోమీటర్‌కు 7,8 కోట్ల రూపాయలతో అంచనాలు వేసి దోచుకున్నదన్నారు. మల్యాల వద్ద కాలువను లోతు చేయడం వల్ల చుట్టు పక్కల గ్రామాల్లో భూగర్భ జలాలు అడుగంటిపోయే పరిస్థితి ఏర్పడిందని ఈ సమస్యలను వెం టనే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని ఆ యన డిమాండ్ చేశారు. బాధితులు, బీ డీ కార్మికులు, ఎస్సీ, ఎస్టీ, బీసీలను ఆ దుకునేందుకు టీడీపీ అండగా ఉంటుందని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఆ యన వెంట తెలంగాణ టీడీపీ కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎమ్మెల్యేలు సుద్దాల దేవయ్య, ఎల్ రమణ, మాఐ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి, తెలుగు మ హిళా రాష్ట్ర అధ్యక్షురాలు శోభా హైమావతి, రాష్ట్ర పరిశీలకులు ఎ విద్యాసాగర్ రావు, జిల్లా ప్రధాన కార్యదర్శి వాసాల రమేష్, నియోజకవర్గాల ఇన్‌చార్జీలు గండ్ర నళిని, డాక్టర్ కవ్వంపెల్లి సత్యనారాయణరావు, పి రవీందర్‌రావు, తెలు గు రైతు జిల్లా అధ్యక్షులు వెల్ముల రాంరె డ్డి, అధికార ప్రతినిధులు అయిల్నేని సా గర్‌రావు, దామెర సత్యం,సత్యనారాయ ణరెడ్డి, చల్లోజు రాజు,బీసీ సెల్ జిల్లా అ ధ్యక్షులు లక్ష్మినారాయణ, కార్యదర్శి ల క్ష్మణ్‌గౌడ్, అంజలీగౌడ్, నాయకులు వ కుళాభరణం శ్రీనివాస్, రాంలింగారెడ్డి, మ్యాక లక్ష్మన్, తెలుగు యువత జిల్లా అధ్యక్షుడు సుద్దాల వెంకట గౌతంకృష్ణ, టీఎన్ఎస్ఎఫ్ రెండు జిల్లాల కన్వీనర్ బుర్ర సంజయ్ తదితరులు ఉన్నారు.

కలెక్టర్‌కు లేఖలు..

మల్యాల మండలం రాజారం, గొల్లపల్లి, రామన్నపేటలో భూగర్భ జలాలు అడుగంటి పోయాయని వరద కాలువ నీటిని పోతారం చెరువులో నింపేందు కు లింక్ ఏర్పాటు చేయాలని మల్యాల, రామన్నపేటల చెరువులకు కూడా లిం కు ఏర్పాటు చేయాలని చంద్రబాబు క లెక్టర్ రాసిన లేఖలో పేర్కొన్నారు.తాటి పల్లి ఏపీ బాలికల గురుకుల పాఠశాల లో 5నుంచి 10వ తరగతి వరకే ఉందని దీనిని ఇంటర్మీడియెట్ వరకు అప్‌గ్రేడ్ చేయాలని మరో లేఖ రాశారు.

ర్యాలపల్లిలో బస..

జగిత్యాల : టీడీపీ అధినేత చంద్రబా బు నాయుడు బుధవారం రాత్రి గంగాధర మండలం ర్యాలపల్లిలో బస చేశా రు. బుధవారం ఉదయం 11.35 నిమిషాలకు పాదయాత్ర నూకపెల్లి సమీపం లో చంద్రబాబు పాదయాత్ర మొదలు కాగా.. నూకపెల్లి ఎక్స్ రోడ్, మల్యాల ఎక్స్‌రోడ్, మల్యాల బ్లాక్‌చౌరస్తా, గ్రామ పంచాయతీ మీదుగా వ్యవసాయ మా ర్కెట్ నుంచి తాటిపెల్లి వరకు సాగింది. అటు నుంచి గంగాధర మండలంలోకి ప్రవేశించి ర్యాలపల్లి వరకు15.8 కి.మీ. సాగింది. రాత్రి 11.15 గంటలకు ర్యాలపల్లి శివారు ప్రాంతంలోకి బాబు చేరుకుని అక్కడే బస చేశారు.

అన్నదాతలకు అండగా నిలుస్తాం.....

ఓదెల: ప్రజల కోసం నిర్వహిస్తున్న వస్తున్నా మీకోసం.. పాదయాత్రలో పార్టీలకతీతంగా ప్రజలు పాల్గొనాలని టీడీపీ జిల్లా అధ్యక్షుడు విజయరమణారావు కోరారు. మండలంలోని పొత్కపల్లిలో బుధవారం టీడీపీ మండల కమి టీ నాయకులు, కార్యకర్తలతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఏడు గంటలపా టు విద్యుత్ సరఫరా అని పేరుకే ప్రకటిస్తుండగా, జిల్లాలో ఎక్కడ కూడా ఏడు గంటల విద్యుత్ సరఫరా లేదని ఆరోపించారు. 63 ఏటలో ఎవరూ కూడా రాష్ట్రంలో పాదయాత్ర చేసిన సందర్భా లు లేవని, ప్రస్తుతం చంద్రబాబునాయుడు వస్తున్నా మీకోసం.. పాదయాత్రను నిర్వహించడం అందరికి గర్వకారణమన్నారు. ప్రస్తుతం 1300 కిలో మీ టర్ల పాటు పాదయాత్ర కొనసాగిందని చెప్పారు.

టీడీపీ పాలనలో జరిగిన అభివృద్ధి ప్రస్తుత కాంగ్రెస్ పరిపాలనకు బేరీజు వేసుకోవాలన్నారు. సుల్తానాబాద్ మండలంలో ఈ నెల 23న ఐతరాజ్‌పల్లి నుంచి పాదయాత్ర ప్రారంభమవుతుందని తెలిపారు. 24న కొనసాగి, 25న ఓదెల మండలం గోపరపల్లి, కొలనూర్, కాల్వశ్రీరాంపూర్ మం డలం పెగడపల్లి, గంగారం మీదుగా, 26న ఊశన్నపల్లి, పందిల్ల, కొమిర, జీలకుంట, పొత్కపల్లికి చంద్రబాబునాయుడు పాదయాత్ర కొనసాగుతుందని తెలిపారు.

ఈ సమావేశంలో మాజీ ఎంపీపీ గంట రాములు, మండల అధ్యక్షుడు మూల ప్రేంసాగర్‌రెడ్డి, బీసీ సెల్ రాష్ట్ర కార్యదర్శి రెడ్డి శ్రీనివాస్ గౌడ్, సింగిల్ విండో చైర్మన్ గోపు నారాయణరెడ్డి, ఎస్సీ సెల్ రాష్ట్ర నాయకులు పల్లె రాంరాజు, చీకట్ల మొం డయ్య, మండల అధికార ప్రతినిధి పడాల రాజు, మాజీ ఎంపీటీసీ సభ్యు లు నీర్ల శ్రీనివాస్, రాచర్ల రాజు, బీసీసెల్ మండల నాయకులు పెండం సమ్మ య్య, గోలి చంద్రమౌళి, పందెన నర్సిం గ్, చొప్పరి రాజయ్య, ఢిల్లీ శంకర్‌తోపాటు పలువురు పాల్గొన్నారు.

పాదయాత్రలో పార్టీలకతీతంగా పాల్గొనాలి