December 19, 2012

కరీంనగర్ టౌన్/రూరల్ : తెలుగుదే శం పార్టీ అధినేత నారా చంద్రబాబు నా యుడు చేపట్టిన వస్తున్నా మీ కోసం పా దయాత్ర ఈ నెల 21న రాత్రి కరీంనగర్ మండలం కొత్తపల్లి శివారుకు చేరనున్న ది. అక్కడే రాత్రి బస చేయనున్నారు. 22న ఉదయం కొత్తపల్లి అంబేద్కర్ వి గ్రహం వద్ద బహిరంగసభ జరగనున్న ది. రెండు రోజుల పాటు కరీంనగర్ అ సెంబ్లీ నియోజకవర్గ పరిధిలో చంద్రబాబు పాదయాత్ర కొనసాగుతుంది. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే గంగు ల కమలాకర్ మంగళవారం రూట్‌మ్యాప్‌ను పరిశీలించారు. పార్టీ మండల అ ధ్యక్షుడు కాసెట్టి శ్రీనివాస్, నగర అధ్యక్షుడు గుగ్గిళ్లపు రమేశ్, జిల్లా ప్రధాన కా ర్యదర్శి వాసాల రమేశ్‌తో కలిసి ఆయా మార్గాల మీదుగా పరిశీలించారు. అలా గే చంద్రబాబు పాదయాత్రను విజయవంతం చేసేందుకు 19వ తేదీ ఉదయం నగరంలోని మినీ వరలక్ష్మి గార్డెన్సులో నియోజకవర్గస్థాయి సమావేశం ఏర్పా టు చేశారు.

ఈ సందర్భంగా గ్రామాల వారీగా నేతలకు పాదయాత్ర విజయవంతం చేసే బాధ్యతలను అప్పగించ డం జరుగుతుందని తెలిపారు. 21వ తే ది పదిగంటల ప్రాతంలో కరీంనగర్ ని యోజకవర్గంలోకి చేరుకుంటుందని, అక్కడే బస చేసకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. 22వ తేది ఉదయం 10.30నిమిషాలకు పాదయాత్ర ప్రారంభమై గ్రామంలోని పద్శశాలి సంఘం చౌరస్తా నుంచి బస్టాండ్, చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహం వద్ద బహిరంగ స భ ఉంటుందని తెలిపారు. సభ అనంత రం గ్రామపరిధిలోని అల్ఫోర్స్ ఈటె క్నో పాఠశాలలో సివి రామన్ జ యంతి ఉత్సవా ల్లో పరిచయ కా ర్యక్రమాన్ని ము గించుకుని రేకుర్తి మీదుగా సీరాంపూర్ నుంచి ఆరపెల్లి గ్రామం తీగలగుట్టపల్లి గ్రా మానికి చేరుకుని బస్‌స్టేజ్ వద్ద రో డ్‌షోలో పాల్గొంటాడు.

రోడ్ షో అనంతరం సాయంత్రం పాదయాత్రలో పా ల్గొంటరని, తీగటగుట్ట పల్లె మీదుగా వ ల్లంపహాడ్, ఎలబోతారం క్రాస్ రోడ్డు నుంచి నగునూర్ గ్రామంలోని ప్రతిమ ఆసుపత్రి మీదుగా జూబ్లీనగర్ ప్రజల తో కలుస్తూ చామనపెల్లి శివారులో ఏ ర్పాటు చేసిన బస చేసూ ప్రాంతానికి చే రుకుని రాత్రి విశ్రాంతి తీసుకుంటారు. 23న ఉదయం 10.30గంటలకు 28వ తేదిన తెలంగాణ కోసం జరిగే అఖిలప క్ష సమావేశంలో తీసుకునే నిర్ణయం కోసం టీడీపీ పొలిట్‌బ్యూరో సమావేశం ఉంటుందని తెలిపారు. సమావేశం అనంతరం పాదయాత్ర చామనపెల్లి, దుబ్బపల్లి, చెర్లబూత్కూర్ మీదుగా మొగ్దుంపూర్ ఆతరువాత గర్రెపల్లి గ్రా మానికి పాదయాత్ర సాగుతుందని తెలిపారు.

ఈ పాదయాత్రలో కొత్తపల్లి గ్రామంలోని చేనేత కార్మికులకు భరోసా ఇస్తాడని, వారి కోసం చేపట్టిన కార్యక్రమాల వివరాలపై డిక్లరేషన్ ఇస్తాడని తెలిపా రు. ఈ యాత్రను విజయవంతం చే యాలని కోరారు. కరీంనగర్ నియోజక వర్గంలో జరిగే పాదయాత్రకు టీడీపీ తెలంగాణ పోరం అధ్యక్షుడు ఎర్రబెల్లి దయాకర్‌రావు పాల్గొంటారని ఆయన తెలిపారు.

ఆయన వెంట నాయకులు జంగిలి సాగర్, వాడె మధుసూదన్‌రెడ్డి, రుద్ర రాజు, బూస రాములు, జేరిపోతుల మొండయ్య, బోగ రవీందర్, శ్రీ«ధర్, ఆర్ఐ ఎండి ఖాజ, కార్యదర్శి సత్యనారాయణ, రూరల్ సీఐ కమలాకర్‌రెడ్డిలు ఉన్నారు.

21న కరీంనగర్‌కు బాబు పాదయాత్ర.....

జగిత్యాల/జగిత్యాల రూరల్ : ఈ ప్రభుత్వానికి మానవత్వం లేదు.. అసమర్థ ప్రభుత్వం...అవగాహన లేకుండా బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారు.. బాధితుల క ష్టాలు చూస్తుంటే గుండె తరుక్కుపోతుంది.. పొట్టకూటి కోసం లక్షలాది రూపాయలు అప్పులుచేసి గల్ఫ్ వెళ్తే అక్కడే కుటుంబ పెద్ద చనిపోవటం తో భార్యాపిల్లలు కడసారి చూపుకు కూడా నోచుకోలేక పోతున్నారు. కనీ సం శవాన్ని కూడా తెప్పించలేకపోతున్నారు. ప్రజల కష్టాలు తీర్చడం లో ప్రభుత్వం విఫలమైందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అ న్నారు.

వస్తున్నా మీకోసం పాదయాత్రలో భాగంగా మంగళవారం జగిత్యాల మండలంలోని కండ్లపెల్లి లో గల్ఫ్ బాధితులతో ఆయన ద ర్బార్ నిర్వహించారు. ఈ సందర్భం గా గల్ఫ్ బాధితులు తాము పడుతు న్న ఇబ్బందులను వివరించారు. అ నంతరం చంద్రబాబు మాట్లాడు తూ గల్ఫ్ బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వం బడ్జెట్ లేదనడం సి గ్గుచేటన్నారు. బాధ్యతారహితంగా మాట్లాడటాన్ని ఖండిస్తున్నాను. ప్ర భుత్వం సహాయక చర్యలు చేపట్టాల్సిందిపోయి తప్పించుకునే ప్రయ త్నం చేస్తోంది. గల్ఫ్ బాధితులను ఆదుకునేందుకు మీకు అండగా ఉం డి పోరాటం చేస్తామన్నారు. కేరళ ప్రభుత్వం గల్ఫ్ బాధితుల కోసం రూ.100 కోట్ల బడ్జెట్ కేటాయించిందని, తాము అధికారంలోకి వస్తే అదే తరహాలో కేరళకు తమ ఎమ్మెల్యేను పంపి స్టడీ చేయించి ఆదుకుంటామన్నారు. ఏజెంట్ల మోసాల వల్ల విజిటింగ్ వీసాలపై వెళ్లి మనవారు ఇబ్బందులు పడుతున్నారని, అక్క డి ప్రభుత్వం ఇప్పుడు వెళ్లిపోవాలని ప్రకటించడంతో దేశంలోని 45 వేల మంది గల్ఫ్ బాధితులు బయటప డ్డారని, అందులో మన రాష్ట్రానికి చెందినవారే 18 వేల మంది మన తె లుగువారు ఉన్నారన్నారు.

ఇది అసమర్థ ప్రభుత్వమని, మానవత్వం లే దని, వీరి కష్టాలు చూస్తుంటే బాధేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. మోసాలు చేసి ఏజెంట్లు వీసాలు అ ప్పగిస్తే అవగాహన లేక వెళ్లినవారు ఇబ్బందులు పడుతున్నారు. ఒక క రీంనగర్ జిల్లా నుంచే 10లక్షల మం ది గల్ఫ్ వెళ్లారని అన్నారు. 2007 లో అక్కడి ప్రభుత్వం వెళ్లగొట్టడం తో చాలా మంది తిరిగి రాగా ఇప్పటివరకు 1200 మంది ఆత్మహత్య లు చేసుకున్నారని అన్నారు. 2007 లో 10 వేల మందికి టిక్కెట్లు ఇచ్చి ఇంటికి తెస్తామని ప్రకటించి 1200 మందికే ఇచ్చి చేతులు దులుపుకున్నారని ఆరోపించారు.

మల్యాల మండలం బోగ గంగాధర్ సౌదీలో చనిపోయాడని, ఆయ న తండ్రి కూడా ఇక్కడ చనిపోయాడని, శవాన్ని తెప్పించకపోవటంతో వెబ్ కెమెరాలో చూడాల్సిన దుస్థితి ఉందని, కనీసం కడసారి చూపుకు కూడా నోచుకోలేకపోతున్నారని అన్నారు.

కొత్తకొండ బుచ్చయ్య 12 సంవత్సరాలుగా జై లులో మగ్గుతున్నాడని, ఇలా గల్ఫ్ కష్టాలు చెప్పనలవి కాదు. అందుకే తాము అధికారంలోకి వస్తే గల్ఫ్ బాధితులను ఆదుకునేందుకు ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసి ఆదుకుంటామన్నారు. విజిటింగ్ వీసాలతో మోసాలు చేస్తున్నవారిపై కఠినంగా చర్యలు తీసుకుంటామన్నారు. గల్ఫ్ బాధితుల కోసం ప్రత్యేక జీఓ తీసుకువచ్చి చనిపోయిన వారి కుటుంబసభ్యులకు ఆర్థిక సహాయం అందిస్తామన్నారు. గతంలో పెద్దిరెడ్డి ఆధ్వర్యంలో బృందం కేరళ వెళ్లి వచ్చిందని, 2007లో నిరుపేదలైన బాధితులను గుర్తించి 100 మందికి ఉచితంగా టిక్కెట్లు అందించామని గుర్తు చేశారు.

బాధితుల కంటతడి..

గల్ఫ్ బాధితుల సమావేశంలో ప లువురు బాధితులు పాల్గొని కంటత డి పెట్టుకున్నారు. అక్కడికి వచ్చినవారంతా బాధితులు చెబుతున్న గో డును విని చిన్నబోయారు. కొంద రు ఆదుకోవాలని వేడుకుంటే.. ఇం కొందరు మేము బతకడమెట్లా అం టూ విలపించారు.

గల్ఫ్ బాధితుల కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖ

వేములవాడ : టిడిపి అధినేత నారా చంద్రబాబునాయుడు కరీంనగర్ జిల్లాలో చేపట్టిన వస్తున్నా మీ కోసం పాదయాత్ర విజయవంతం కావడంతో పాటు ఆయన ఆరోగ్యం బాగుండాలని వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయంలో టిడిపి నేతలు ప్రత్యేక పూజలు చేశారు. జగిత్యాల మండలం కిష్టంపేట గ్రామంలో చేపట్టిన పాదయాత్రలో స్వామివారి ప్రసాదం, కండువా, మెమోంటోను చంద్రబాబుకు అందజేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇంచార్జ్ గండ్ర నళిని, జిల్లా ఉపాధ్యక్షుడు ఎంఏ.నసీర్, తూపుకారి సత్తయ్య జిల్లా కమిటీ మెంబర్ నందిపేట సుదర్శన్‌యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

పాదయాత్రకు తరలిన నేతలు

వేములవాడ : టిడిపి అధినేత నారా చంద్రబాబునాయుడు జిల్లాలో చేపట్టిన వస్తున్నా మీ కోసం పాదయాత్రకు వేములవాడ నుండి టిడిపి నేతలు తరలివెళ్లారు. జగిత్యాల మండలం కిష్టంపేట నుండి జగిత్యాల, సుమారు 12 కిలోమీటర్ల వరకు చంద్రబాబుతో పాదయాత్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. పాదయాత్ర విజయ వంతానికి కృష చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు పొలాస నరేందర్, పీర్ మహ్మద్, సుదర్శన్‌యాదవ్, పులి రాంబాబుగౌడ్, ఉమేందర్, రమణయాదవ్, నాగుల కృష్ణమూర్తి, శ్రీనివాస్ పాల్గొన్నారు.

రాజన్న సన్నిధిలో టీడీపీ నాయకుల పూజలు

జగిత్యాల : టీడీపీ అధినేత చంద్రబా బు నాయుడు చేపట్టిన పాదయాత్ర నే టికి 75 రోజులకు చేరనున్నది. అక్టోబర్ 2 గాంధీ జయంతిని పురస్కరించుకుని చంద్రబాబు నాయుడు వస్తున్నా మీకో సం పాదయాత్రను అనంతపూర్ జిల్లా హిందూపూర్ సమీపంలోని సూగురు ఆంజనేయ స్వామి దేవాలయంలో పూ జలు చేసి ప్రారంభించారు. ఇప్పటివర కు ఆయన అనంతపూర్, కర్నూలు, మ హబూబ్‌నగర్, రంగారెడ్డి, మెదక్, ని జామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలను పూర్తి చేసుకుని కరీంనగర్ జిల్లాలో ప ర్యటిస్తున్నారు. బాబు పాదయాత్ర మొ దలు పెట్టిన నాటి నుంచి మధ్యలో 4 రోజులు మాత్రమే విశ్రాంతి తీసుకోగా, నేటికి 75 రోజులకు చేరుకుంది.

అక్టోబ ర్ 2న మొదలైన పాదయాత్ర 24 రోజులపాటు సజావుగా సాగగా, మహబూబ్‌నగర్ జిల్లా గద్వాలలో అక్టోబర్ 26న వేదిక కూలడంతో బాబు స్వల్ప అస్వస్థతకు లోనయ్యారు. దీంతో అక్టోబర్ 26, 27 రెండు రోజులపాటు పాదయాత్ర జ రుగలేదు. అయితే 27న సాయంత్రం కొంత దూరం మాత్రమే నడిచి ముగించేశారు. ఆ తర్వాత నవంబర్ 2న టీడీ పీ అధినేత ఎర్రంన్నాయుడు మరణించడంతో హుటాహుటిన పాదయాత్రను ముగించుకుని శ్రీకాకుళం వెళ్లిపోయా రు.

దీంతో బాబు పాదయాత్ర మొత్తం రోజుల్లో 4 రోజులు జరుగకపోగా, నేటి కి 75రోజులకు చేరుకుంది. అక్టోబర్ 2న ప్రారంభమైన పాదయాత్ర ఆ నెలలో 28 రోజులపాటు సాగగా, నవంబర్‌లో 2 రోజులు జరుగకపోగా 28 రోజులపాటే సాగింది. డిసెంబర్ నెలలో 19వ రోజుకు నేడు చేరుకుంది. దీంతో మొ త్తం బాబు పాదయాత్ర 75 రోజులుగా చేరుకున్నట్లైంది.

చంద్రబాబు పాదయాత్ర మంగళవారంతో మొత్తం 74రోజులలో 1,249.07 కిలోమీటర్లు పూర్తి చేసుకున్నారు.

నేటితో బాబు పాదయాత్రకు 75 రోజులు...

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు చేపట్టిన 'వస్తు న్నా ... మీకోసం' పాదయాత్ర లభిస్తు న్న స్పందన ఆ పార్టీ శ్రేణులకు కొత్త ఉత్సాహాన్నిస్తోంది. తెలంగాణ ఉద్య మం నేపథ్యంలో మూడేళ్ళుగా టీడీపీ అనేక ఆటుపోట్లను చవిచూస్తున్న విష యం తెలిసిందే. పార్టీ కార్యకలాపాలు కూడా గణనీయంగా తగ్గుముఖం ప ట్టిన నేపథ్యంలో అధినేత చంద్రబాబునాయుడు చేపట్టిన పాదయాత్ర కొత్త ఊపిరినిస్తోంది.

పాదయాత్ర ద్వారా ప్రజల్లోకి వెడుతున్న తెలుగుదేశం పార్టీ నేతల కు జిల్లాలో లభిస్తున్న మద్దతు పార్టీ భవితవ్యంపై కొత్త ఆశలను చిగురింపజేస్తున్నది. పార్టీ ప్రాతినిధ్యం లేని కోరుట్ల నియోజకవర్గంలో జరిగిన పా దయాత్రకు అడుగడుగునా చంద్రబాబుకు ప్రజలు ముఖ్యంగా మహిళలు నీరాజనాలు పట్టడం, జగిత్యాల పరిధిలోనూ అదే స్పందన లభిస్తుండటం శ్రేణులకు మరింత ఉత్సాహాన్నిస్తోంది. చంద్రబాబు పాదయాత్రకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కూడా తరలివచ్చి ఆయనతో మాట్లాడేందుకు ఆసక్తిని కనబరుస్తున్నారు. స్థానికంగా తా ము ఎదుర్కొంటున్న సమస్యలను చం ద్రబాబు దృష్టికి తీసుకువస్తూ 'మళ్ళీ చంద్రబాబు ముఖ్యమంత్రి అయితేనే తమ కష్టాలు తీరుతాయి...' అంటూ చె బుతుండ గా .. చంద్రబాబు కూడా అదే విధంగా స్పందిస్తున్నారు.

టీడీపీ అధికారంలోకి రాగానే ఆయా వర్గాల కష్టాలను తీర్చేందుకు కృషి చేస్తానని హామీలను కురిపించడం ద్వారా వారి ని ఆకట్టుకుంటూ ముందుకు సాగుతున్నారు. తెలంగాణ ఉద్యమానికి పురిటిగడ్డగా నిలిచిన కరీంనగర్ జిల్లాలో చంద్రబాబు పాదయాత్రపై మొదటి నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. తెలంగాణవాదుల నుంచి ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉం టుందని అనుమానించారు. ఇదే సమయంలో 28న అఖిలపక్ష సమావేశం ఖరారు కావడంతో టీడీపీపై మరింత ఒత్తిడి పెరుగుతుందని అందరూ భా వించారు. అయితే చంద్రబాబు మా త్రం జిల్లాలో ప్రసంగించినప్రతీ చోట తెలంగాణకు తాను వ్యతిరేకం కాదని, తెలంగాణను ఎన్నడూ వ్యతిరేకించలేదని, భవిష్యత్‌లో కూడా వ్యతిరేకించబోనని స్పష్టం చేస్తూ ప్రజలను ఆకర్షించడానికి తెలుగుదేశం పార్టీ తెలంగాణకు వ్యతిరేకం కాదనే భావాన్ని ప్రజ ల్లో నాటడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.

ఈ నెల 28న అఖిలపక్ష సమావేశం ఉన్నందున టీడీపీ ఆ స మావేశంలో అనుసరించనున్న విధానాన్ని జిల్లాలోనే ఖరారు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక్కడే అందుకోసం పొలిట్‌బ్యూరో సమావేశం ఏర్పాటు చేస్తారని, లేక ముఖ్య నేతలతో చర్చించి ఒక అభిప్రాయానికి వస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇక్కడ తీసుకోనున్ననిర్ణయమే తెలంగాణలో తెలుగుదేశం పార్టీ భవితవ్యా న్ని నిర్ణయించేదిగా మారి కరీంనగర్ టీడీపీ చరిత్రలో కీలక జిల్లాగా మిగిలిపోతుందని భావిస్తున్నారు. అయితే చంద్రబాబునాయుడు తీసుకోనున్న నిర్ణయం ఎలా ఉంటుందోననే ఆసక్తి అటు తెలుగుదేశం పార్టీలోనూ, ఇటు ఇతర రాజకీయ పార్టీల్లోనూ వ్యక్తమవుతున్నది.

తెలంగాణకు తాను వ్యతిరేకం కాదని చెబుతూనే కాంగ్రెస్ పార్టీ కుట్రలు, కుతంత్రాలు పన్నే పార్టీ అని, తెలుగుదేశం పార్టీని ఇబ్బందులపాలు చేయడానికే ఏదో ఒక ప్రాంతంలో దెబ్బతీయాలనే ఆలోచనతో ఆ పార్టీ వ్యూహరచన చేస్తున్నదని, ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీని కాపాడుకోవల్సిన అవసరం తనపై ఉన్నదని, ఈ విషయాన్ని ప్రజలు అర్థం చేసుకొని సహకరించాలని టీడీపీ అధినేత తన ప్రసంగాల్లో చెబుతుండటంపై విభిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీనికి కొందరు తెలంగాణపై నిర్ణయం తీసుకుంటే సీమాంధ్రలో త మ పార్టీకి దెబ్బ తగులుతుందని చెప్పడమేనని ఆయన తెలంగాణపై కర్ర విరగకుండా పాము చావకుండా అభిప్రాయం చెబుతారని భాష్యం చెబుతుండగా ... తెలుగుదేశం పార్టీ శ్రేణు లు మాత్రం తెలంగాణకు తాను వ్యతిరేకం కాదనిప్రసంగాల్లో ప్రకటిస్తున్న మాదిరిగానే అదే అంశాన్ని అఖిలపక్ష సమావేశంలో చెబితే తెలంగాణలో తమ పార్టీ బలమైన పార్టీగా మిగిలిపోయి గత వైభవాన్ని పొందవచ్చని ఆశిస్తున్నాయి. ఏదేమైనా ... చంద్రబాబునాయుడు తెలంగాణపై ఏ నిర్ణ యం తీసుకుంటారన్న దానిపైనే ఇప్పు డు జిల్లాలో ప్రధాన చర్చనీయాంశం గా మారింది. జిల్లాలో ఇప్పటికే నా లుగు రోజుల పాదయాత్ర పూర్తి కాగా మరో పది రోజుల పాటు పాదయాత్ర సాగనున్నది. జమ్మికుంటలో పత్తిరైతు ల సమస్యల పరిష్కారం కోసం చంద్రబాబునాయుడు దీక్ష చేస్తారని ప్రకటించడంతో అందుకోసం కూడా ఒక పూట కేటాయించే అవకాశం ఉన్నది.

చంద్రబాబుకు ప్రజలు ముఖ్యంగా మహిళలు నీరాజనాలు