December 18, 2012

జగిత్యాల జనసాగరమయ్యింది. వీ ధులన్నీ కిక్కిరిసిపోయాయి. పాదయాత్రగా వస్తున్న చంద్రబాబుపై బంగాళా ల మీద నుంచి బంతి పూల వర్షం కురిపించారు. మహిళలు మంగళహారతు లు, బతుకమ్మలు. బోనాలతో.. దారి పొడవునా విద్యార్థులు పూలు చల్లు తూ.. కుల సంఘాలు తమ వృత్తులతో ఘన స్వాగతం పలికి చంద్రబాబును పు లకింప చేశారు. మీకు అండగా ఉ న్నాం.. ముందుకు సాగండి.. అంటూ ఆశీర్వదించారు. వస్తున్నా మీ కోసం పా దయాత్రలో భాగంగా మంగళవారం జగిత్యాల మండలం కండ్లపల్లి, జగిత్యా ల పట్టణంలోని హనుమాన్ వాడ, టవ ర్ సర్కిల్, అంబేద్కర్ చౌరస్తా, బస్టాండ్ చౌరస్తా మీదుగా ధరూర్, రాజారం, నూకపల్లి శివారు వరకు 14 కిలోమీటర్ల పొడవునా పాదయాత్ర సాగింది.

కిష్టంపేట ధాటిన తర్వాత రాత్రి బస చేసిన చంద్రబాబు నాయుడు ధర్మపురి అసెం బ్లీ నియోజకవర్గ నాయకులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం పాదయాత్రను సాగించారు. కొద్ది దూ రం చేరుకున్నాక రేణుకా ఎల్లమ్మ దేవాలయంలో పూజలు నిర్వహించారు. మార్గమధ్యంలో డ్వాక్రా సంఘాలకు చెందిన మహిళలు పడాల లక్ష్మినర్సు, లక్ష్మి మరికొందరిని బాబు పలకరించా రు. పావలా వడ్డీ రుణాల పేరిట ఎక్కు వ వడ్డీని వసూలు చేస్తున్నారు. కొంత మందికే రుణాలు ఇస్తున్నారు. పెన్షన్లు ఇవ్వడం లేదని మీరైనా మమ్మల్ని ఆదుకోవాలన్నారు. డ్వాక్రా సంఘాలను నేనే పెట్టి మిమ్మల్ని చైతన్యపర్చానని మీ సమస్యలు తీరుస్తానని చంద్రబాబు చెప్పారు.

బోరు బావుల వద్ద ఉన్న రైతు లు రామిడి నర్సయ్య, మల్లయ్య వద్దకు రోడ్డు దిగి వెళ్లగా వారు సమస్యలను ఏకరువు పెట్టారు. వ్యవసాయానికి క రెంట్ సరిపడా రావడం లేదని.. పంట లు ఎండిపోతున్నాయని చెప్పారు. నాడు టీడీపీ హయాంలో 9 గంటల కరెంట్ ఇచ్చానని ఈ ప్రభుత్వానికి ప్రజా సమస్యలు పట్టవన్నారు. అధికారంలోకి రాగానే 9 గంటల పాటు నా ణ్యమైన విద్యుత్తును సరఫరా చేస్తామని హామీ ఇచ్చారు. అక్కడి నుంచి కండ్లపల్లి గ్రామానికి చేరుకుని ఆంజనేయ స్వామి దేవాలయాన్ని సందర్శించారు. అక్కడ ఆయనకు డప్పుల చప్పుళ్లతో స్వాగతం పలికారు. గల్ఫ్ బాధితులు టెంట్ వేసుకుని కూర్చున్న చోటికి వెళ్లి వారి గాధలను విన్నారు.

వారు పడుతున్న కష్టాలను తెలుసుకున్నారు. దీం తో చలించిపోయిన చంద్రబాబు ఈ ప్రభుత్వానికి మానవత్వం లేదని, పొట్ట చేత పట్టుకుని ఉపాధి కోసం గల్ఫ్‌కు పో యి అష్టకష్టాలు పడుతుంటే వారి గు రించి పట్టించుకోరని అన్నారు. ఏజెం ట్లు మోసాలు చేసినా వారిపై కఠిన చర్య లు తీసుకోవడం లేదన్నారు. గల్ఫ్ బాధితులను ఆదుకునేందుకు ప్రత్యేక మం త్రిత్వ శాఖను ఏర్పాటు చేసి గల్ఫ్ నుం చి వచ్చిన వారికి స్థానికంగానే ఉపాధి అవకాశాలు కల్పిస్తామని, అక్కడున్న వారి యోగ, క్షేమాలు తెలుసుకుని తగి న చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అక్కడి నుంచి జగిత్యాల పట్టణానికి బయలుదేరిన చంద్రబాబుకు హనుమాన్ వాడలో పార్టీ నాయకులు, కార్యకర్తలు మహిళలు, రైతులు, యువకులు, విద్యార్థులు, గుస్సాడీ నృత్యాలు, ఒగ్గు కళాకారుల డోలు నృత్యాలతో ఘ న స్వాగతం పలికారు.

అక్కడి నుంచి టవర్ సర్కిల్ మీదుగా బస్టాండ్ చౌర స్తా వరకు సాగింది. అడుగడుగునా ఆ యనకు జగిత్యాల పట్టణ ప్రజలు నీరాజనాలు పలికారు. కుల వృత్తుల వాళ్లు బ్యానర్లు కట్టి స్వాగతం పలకగా వారి వద్దకు వెళ్లిన చంద్రబాబు వారి సమస్య లు తెలుసుకుని వినతి పత్రాలు స్వీకరించారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమా ల వేసి ముందుకు కదిలారు. చేనేత అం గడి బజారుకు వెళ్లి రాట్నం వడికాడు. చౌరస్తాలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ వరాల జల్లులు కురిపించారు. 'నేను జగిత్యాలకు వచ్చినప్పుడు మీరు నన్ను మీ కుటుంబ స భ్యుడిగా నాకు పెద్ద ఎత్తున స్వాగతం పలికి నన్ను ఆశీర్వదించినందుకు కృతజ్ఞతలు.

కాళ్ల నొప్పులు వచ్చి ఇబ్బందు లు పడుతున్నా.. మీ ఇబ్బందులు చూ శాక వాటిని మరచిపోయాను. 74 రో జులుగా మీకు అండగా, తోడుగా ఉం డాలని మీ కష్టాల్లో పాలు పంచుకోవాలని పాదయాత్ర చేస్తున్నాను' అని ప్ర సంగం ఆరంభించారు. కాంగ్రెస్ ప్రభు త్వపాలన తీరుపై నిప్పులు చెరిగిన ఆ యన సామాజాన్ని పట్టి పీడుస్తున్న అ వినీతిని పారద్రోలాలన్నారు. ఎఫ్‌డీఐల వల్ల దేశంలో 16 కోట్ల మంది బజారున పడే ప్రమాదముందన్నారు. ఇందుకు నేనేమి చేయాలి, మీరేమీ చేస్తారో అం టూ పలువురికి మైకు ఇచ్చి వారి సూచనలను స్వీకరించారు. తెలంగాణకు నేను వ్యతిరేకం కాదని స్పష్టం చేసిన ఆయన సకల జనుల సమ్మెలో ఉద్యోగులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని డి మాండ్ చేశారు.

బీసీలకు రాజ్యాధికారం కల్పించేందుకు అసెంబ్లీ ఎన్నికల్లో 100 సీట్లు ఇస్తామని, మైనార్టీలకు 15 శాతం సీట్లు ఇస్తామని హామీ ఇచ్చారు.

వస్త్రాలపై విధిస్తున్న వ్యాట్ పన్నును ఎత్తివేస్తామన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల రుణాల మాఫీపై తొలి సంతకం చేస్తానని చెప్పారు. ఎస్సీ వర్గీకరణ చేపడతానని, మాదిగలకు టుంబాల్లో పెద్ద మాదిగగా ఉంటానని అన్నారు. లీడ్‌క్యాప్ ద్వారా లెదర్ పార్క్‌ను ఏర్పాటు చేస్తానని అన్నారు. ఉద్యోగులకు త్వరలోనే ఒక పాలసీని ప్రకటిస్తానని, ఆర్టీసీ కార్మికులను ఆదుకుంటామని, ఎస్సీలకు 10 వేల కోట్లతో, బీసీలకు 50 వేల కోట్లతో ప్రత్యేక బడ్జెట్ ఏర్పాటు చేస్తానని అన్నారు. ఎస్సారెస్పీ నీటిని విడుదల చేయాలని చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ టీడీపీ ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర్ రావు, మాఐ మంత్రులు ఇనుగాల పెద్దిరెడ్డి, కోడెల శివప్రసాదరావు, బాబుమోహన్, ఎమ్మెల్యేలు ఎల్ రమణ, సీహెచ్ విజయరమణారావు, సుద్దాల దేవయ్య, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు హైమావతి, జిల్లా ప్రధాన కార్యదర్శి వాసాల రమేష్, నియోజకవర్గ ఇన్‌చార్జీలు డాక్టర్ కవ్వంపెల్లి సత్యనారాయణ, ముద్దసాని కశ్యప్‌రెడ్డి, గోపు అయిలయ్య యాదవ్, డాక్టర్ రవీందర్‌రావు, గండ్ర నళిని రాష్ట్ర, జిల్లా నాయకులు బోనాల రాజేశం, అన్నమనేని నర్సింగరావు, కె ఆగయ్య, దామెర సత్యం, అంజలీ దేవి, జి తిరుపతి, గుం టి జగదీశ్వర్, కల్లెడ సత్యనారాయణ రావు, రాంచందర్ రావు, గట్టు సతీష్, బాల శంకర్, గుమ్మడి సత్యం, రవీందర్ రెడ్డి, వొల్లం మల్లేశం, దామోదర్ రావు, తెలుగు యువత జిల్లా అధ్యక్షులు గౌతంకృష్ణ, జిల్లా బీసీ సెల్ అధ్యక్షులు లక్ష్మినారాయణ, కార్యకర్తలు, తదితరు లు పాల్గొన్నారు.

బాబు పాదయాత్రలో జన జాతర

ఎడారి దేశంలో తనువు చాలించింది ఒకరు! చనిపోయి కొన్ని నెలలైనా ఇప్పటికీ స్వగ్రామానికి కట్టె చేరని దైన్యం మరొకరిది! జీవించి ఉన్నా.. జీవచ్ఛవాలుగా బతుకుతున్న కష్టం మరెందరిదో! పిడికెడు బువ్వ కోసం పొట్ట చేతపట్టుకుని దేశం కాని దేశం వెళ్లి నానా అవస్థలు పడుతున్న మనవాళ్ల బాధలు వర్ణనాతీతం. పాదయాత్రలో భాగంగా కరీంనగర్ జిల్లా కండ్లపల్లి వచ్చినప్పుడు చాలామంది గల్ఫ్ బాధితులు వచ్చి కలిశారు. వారందరితో కలిసి నేనూ సమావేశమయ్యా.

తమ కష్టాలను చెబుతూ వారంతా కన్నీళ్లపర్యంతమయ్యారు. వాళ్ల బాధలు వింటే నా గుండె కూడా తరుక్కుపోయింది. వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నవారికి జరగరానిది జరిగితే ఇక్కడ వారి కుటుంబ సభ్యులు పడే బాధ వర్ణనాతీతం. ఒకవేళ, అక్కడే మరణిస్తే వారి శవాలు నెలల తరబడి రావడం లేదని, కనీసం కడసారి చూపునకు కూడా నోచుకోలేకుండాపోతున్నామని వారంతా ఆందోళన వ్యక్తం చేశారు. ఇక, ఉపాధి కోసం గల్ఫ్‌కు వెళ్లే క్రమంలో మోసాలకు అంతే లేదు. నకిలీ వీసాలతో బ్రోకర్లు వాళ్ల జీవితాలతో ఆటాడుకుంటున్నారు.

ఇక్కడ ఉన్న కొద్దిపాటి పొలాన్నో, ఆస్తినో అమ్ముకుని లేదా.. వడ్డీకి అప్పులు చేసి గల్ఫ్ దేశాలకు వెళుతున్నారు. అక్కడ దొరికే ఉపాధితో పొట్ట పోసుకోవచ్చని, నెమ్మది నెమ్మదిగా అప్పులు కూడా తీర్చేసుకోవచ్చని ఆశ పడుతున్నారు. కానీ, నకిలీ వీసాల కారణంగా అక్కడికి వెళ్లిన తర్వాత ప్రభుత్వాలు అక్కడి నుంచి వారిని గెంటేస్తున్నాయి. ఇంటికి తిరిగి రాలేని పరిస్థితి! అక్కడే ఉండలేని దైన్యం! ఈ సంఘర్షణలోనే వారు ఉసురు కూడా తీసుకుంటున్నారు.

గల్ఫ్ బాధితులను తిరిగి తీసుకొచ్చేందుకు తమ వద్ద నిధుల్లేవని కేంద్రం చేతులు ఎత్తేస్తే.. వారిని పట్టించుకునే స్థితిలో మన ముఖ్యమంత్రి లేరు. అందుకే ఒక నిర్ణయానికి వచ్చా. అధికారంలోకి వస్తే, గల్ఫ్ బాధితుల కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేస్తా. వారి సమస్యలన్నిటినీ పరిష్కరించేందుకు ప్రయత్నిస్తా.

జగిత్యాలలో ఎక్కడ చూసినా తోరణాలు! స్వాగత బ్యానర్లు! పార్టీలతో సంబంధం లేకుండా వివిధ వర్గాల నుంచి వచ్చిన మద్దతు నాకెంతో నైతిక బలాన్ని ఇచ్చింది.

గల్ఫ్ బాధితులకు ప్రత్యేక శాఖ

నిర్ణయం తీసుకోవాల్సింది కేంద్ర ప్రభుత్వమే
టీడీపీపై బురదచల్లే ప్రయత్నం చేయొద్దు
పనికిమాలిన సీఎం.. ఎక్కడా కనపడడు
జమ్మికుంటలో దీక్ష చేసి తాడో పేడో తేలుస్తాం
గల్ఫ్ బాధితుల కోసం ప్రత్యేక శాఖ
కరీంనగర్ జిల్లా పాదయాత్రలో చంద్రబాబు

  "తెలంగాణపై నేనిచ్చిన లేఖ కేంద్రప్రభుత్వం వద్దే ఉంది. నిర్ణయం తీసుకోవాల్సింది వాళ్లే. దీన్ని రాజకీయం చేయొద్దు.. ప్రజల జీవితాలతో చెలగాటమాడొద్దు.. తెలుగుదేశంపై బురదజల్లే ప్రయ త్నం చేయొద్దు.. మమ్మల్ని దెబ్బతీయాలని కుట్రపన్నుతున్నారు.. మేం తెలంగాణకు వ్యతిరేకం కాదు.. భవిష్యత్తులో నూ వ్యతిరేకం కాము'' అని టీడీపీ అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. 'వస్తున్నా.. మీ కోసం' పాదయాత్రలో భాగంగా మంగళవారం కరీంనగర్ జిల్లా కిష్టంపేట శివారు నుంచి కండ్లపెల్లి, జగిత్యాల, ధరూర్, రాజారం, నూకపల్లి శివారు వరకు 14 కిలోమీటర్ల పొడవున ఆయన నడిచారు.

కండ్లపెల్లిలో గల్ఫ్ బాధితుల బాధల ను తెలుసుకుని చలించిపోయారు. వారికోసం ఒక మంత్రిత్వ శాఖను ఏర్పా టు చేసి అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. జగిత్యాల బస్టాండ్ చౌరస్తాలో జరిగిన సభలో మాట్లాడుతూ "నేను తెలంగాణకు వ్యతిరేకం కాదు.. 2008లోనే తెలంగాణపై ప్రణబ్ ముఖర్జీకి లేఖ ఇచ్చాం. 2009లో తెలంగాణ జిల్లాల్లో మొదటి విడత పోలింగ్ పూర్తికాకముందే వైఎస్ రాజశేఖర్ రెడ్డి నంద్యాలలో.. టీడీపీకి ఓటేస్తే హైదరాబాద్‌కు వెళ్లడానికి పాస్‌పోర్టు తీసుకోవాలన్నారు. అక్కడ ఆయన మాటలతో, ఇక్కడ టీఆర్ఎస్‌తో పొత్తు పెట్టుకోవడం వల్ల ఓటమి చెందాల్సి వచ్చింది'' అన్నారు. కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ తెలంగాణ సమస్య తేల్చడం లేదన్నారు.

పనికిమాలిన సీఎం ఎక్కడా కనపడడని.. పత్తి, పసుపు, వరి, చెరుకు రైతులు మద్దతు ధరలు లభించక ఇబ్బందులు పడుతుంటే విశాఖకు వెళ్లి ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ధైర్యముంటే జగిత్యాలకు వచ్చి సమస్యలను పరిష్కరించాల ని, జమ్మికుంటలో దీక్ష పెట్టి తాడోపేడో తేల్చుకుంటాం.. ఖబడ్దార్ అంటూ ఆయన ముఖ్యమంత్రిని హెచ్చరించారు. టీఆర్ఎస్ కిరికిరి పార్టీ అని, అది వాస్తవాలు చెప్పదని, రాజకీయ లబ్ధి గురించే ఆలోచిస్తుందని విమర్శించారు. అతి త్వరలోనే ఉద్యోగుల కోసం ఒక పాలసీని ప్రకటిస్తామని చెప్పారు.

ఎస్సీలకు 10 వేల కోట్లు, బీసీలకు 50 వేల కోట్లు, మైనార్టీల సంక్షేమం కోసం 12,500 కోట్ల బడ్జెట్ పెడతానని అన్నారు. సామాజిక న్యాయం జరగాలని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీసీలకు 100 సీట్లు, మైనార్టీలకు 15 శాతం సీట్లు కేటాయిస్తానని.. టీడీపీకి ఓట్లేసి రాజ్యాధికారం పొందాలని పిలుపునిచ్చారు. ఇస్లామిక్ బ్యాంకు ఏర్పాటుచేసి ష్యూరిటీ లేకుండా రుణాలు ఇప్పిస్తానని, ఇమామ్‌లు, మౌజంలకు నెలకు రూ. 5,300 వేతనం ఇప్పిస్తానని, వస్త్రాలపై విధించిన వ్యాట్‌ను పూర్తిగా ఎత్తివేస్తామని హామీ ఇ చ్చారు. నష్టాల్లో ఉన్న పౌల్ట్రీ, డెయిరీ రైతులకు న్యా యం చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశా రు.

2003-04లో తలసరి పన్ను రూ. 2,493 ఉండేదని, ఇప్పుడది రూ. 8,650 అయ్యిందని చెప్పారు. అంటే ఒక్కో కుటుంబంపై రూ. 35 వేల పన్నుల భారం పడుతున్నదన్నారు. బాబు పాదయాత్రతో జగిత్యాల వీధులు జనంతో కిక్కిరిసిపోయాయి. ఈ కార్యక్రమంలో తెలంగాణ టీడీపీ కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర్ రావు, మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి, జగిత్యాల, పెద్దపల్లి, చొప్పదండి, కరీంనగర్ ఎమ్మెల్యేలు ఎల్ రమణ, విజయరమణారావు, సుద్దాల దేవయ్య, గంగుల కమలాకర్, తెలుగుమహిళ రాష్ట్ర అధ్యక్షురాలు శోభాహైమావతి, బాబూమోహన్ తదితరులు పాల్గొన్నారు.

పొట్టకూటి కోసం లక్షలు అప్పుచేసి గల్ఫ్ దేశాలకు వెళ్తే, అక్కడ కుటుంబ పెద్ద చనిపోయినప్పుడు కనీసం శవాన్ని కూడా ఈ ప్రభుత్వం తెప్పించడంలేదని చంద్రబాబు మండిపడ్డారు. కండ్లపెల్లిలో గల్ఫ్ బాధితులతో ఆయన దర్బార్ నిర్వహించారు. తాము అధికారంలోకి వస్తే గల్ఫ్ బాధితుల కోసం ప్రత్యేక మంత్రిత్వశాఖను ఏర్పాటుచేసి ఆదుకుంటామన్నారు.

పాదయాత్రకు నేటితో 75 రోజులు
జగిత్యాల: ప్రజల కష్టాలు తెలుసుకుని, వారి కన్నీళ్లు తుడిచి, ఆ బాధ ల్లో భాగస్వామి కావాలనే ఉద్దేశంతో సరిగ్గా గాంధీ జయంతి రోజున టీడీపీ అధినేత చంద్రబాబు ప్రారంభించిన 'వస్తున్నా.. మీకోసం' పాదయాత్ర బుధవారంతో 75రోజులు పూర్తిచేసుకోనుంది.

అక్టోబర్ 2వ తేదీన అనంతపురం జిల్లా హిందూపూర్ సమీపంలోని సూగురు ఆంజనేయ స్వామి దేవాలయంలో మొదలైన ఈ పాదయాత్రలో భాగంగా ఇప్పటివరకు ఆయన అనంతపురం, కర్నూలు, మహబూబ్‌నగర్, రంగారెడ్డి, మెద క్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల పర్యటన పూర్తి చేసుకుని కరీంనగ ర్ జిల్లాలో నడుస్తున్నారు. వాస్తవానికి బాబు పాదయాత్ర మొదలై ఇప్పటికి 79 రోజులు గడిచినా, మధ్యలో 4 రోజులు విరామం ఇవ్వడంతో బుధవారం నాటి యాత్రతో 75 రోజులు పూర్తికానున్నాయి.

అక్టోబర్ 26న గద్వాలలో వేదిక కూలడంతో బాబు స్వల్పంగా గాయపడ్డారు. దీంతో 26, 27 రెండు రోజులు, తర్వాత నవంబర్ 2న టీడీపీ నేత ఎర్రన్నాయుడు మరణించడంతో పాదయాత్రకు బ్రేక్ పడింది.

తెలంగాణపై మా లేఖ కేంద్రం వద్దే ఉంది

జగిత్యాల/రాయికల్ : మీరు చూపించిన అభిమానం మరిచిపోలేను. ఈ గ్రామంలో ఇంత పెద్ద మనస్సుతో నన్ను చూడటానికి వచ్చారు. ఓటేసి దీవించండి. మీకు తోడుగా నేనుంటానని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. వస్తున్నా మీకోసం యాత్రలో భాగంగా సోమవారం రాయికల్ మండలం ఇటిక్యాల శివారు నుంచి రాయికల్, కుమ్మరిపెల్లి, ఉప్పుమడుగు, అల్లీపూర్, కిష్టంపేట వరకు 14.7 కి.మీ. పాదయాత్ర సాగింది. ఈ సందర్భంగా రాయికల్ మండల కేంద్రంలోని ప్రధాన కూడలి వద్ద చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ టీడీపీ అధికారంలోకి వస్తే రాయికల్ మండల ప్రజల సమస్యలను పరిష్కరిస్తామన్నారు. రాయికల్‌లో డిగ్రీ కళాశాల కోసం కృషి చేస్తానని, మినీ స్టేడియం నిర్మిస్తామని అన్నారు. చెన్నకేశవ ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. బోర్నపెల్లి వద్ద వంతెన నిర్మాణం కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామన్నారు. బస్ షెల్టర్‌లో షెడ్డుల నిర్మాణానికి కృషి చేస్తామని, శివారు ప్రాంతంలో విద్యుత్ సౌకర్యం మెరుగుపరిచేందుకు ప్రయత్నిస్తామన్నారు. బైపాస్ రోడ్‌లో మురికి కాలువల కోసం ప్రయత్నిస్తామని చెప్పుకొచ్చారు. ఇందిరమ్మ కాలనీలో వర్షపు నీరు రాకుండా మురికి కాలువల నిర్మాణానికి మా ప్రభుత్వం వస్తే కృషి చేస్తామన్నారు.

కళాశాల సమస్యలు తీరుస్తా..: వస్తున్నా మీకోసం యాత్రలో భాగంగా చంద్రబాబు నాయుడు ఆదివారం రాత్రి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బస చేశారు. ఈ సందర్భంగా ఉదయం కళాశాల విద్యార్థులతో ఆయన మాట్లాడారు. తమ హాయాంలోనే కళాశాలలు, పాఠశాలలు నిర్మించామని, ఈ రాష్ట్ర ప్రభుత్వం దోచుకుంటుందే తప్ప విద్యాభివృద్ధికి కృషి చేయడం లేదన్నారు.

తాము గతంలో 24 డీఎస్సీలు పెట్టి ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేశామన్నారు. ఈ సందర్భంగా పాఠశాల చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని, ఫ్లోరైడ్ నీటితో ఇబ్బందులు పడుతున్నారని, నీటి వసతి కల్పించాలని, విద్యుత్ సౌకర్యం లేకపోవటంతో ఇబ్బందిగా ఉందని విద్యార్థులు చంద్రబాబుకు విన్నవించారు. దీంతో స్పందించిన చంద్రబాబు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామంటూనే తాము అధికారంలోకి వస్తే కళాశాలలో అన్ని సౌకర్యాలు కల్పిస్తామన్నారు.

ఓటేసి దీవించండి.. మీకు తోడుంటా..

రైతులు వరినార్లు పోసుకున్నారు.. శ్రీ రాంసాగర్ ప్రాజెక్టు నీటిని విడుదల చేయమంటే చేయడం లేదు. మీనమేషా లు లెక్కించకుండా.. తక్షణమే నీటిని వి డుదల చేసి సీజన్ పోకుండా చూడాల ని టీడీపీ అధినేత చంద్రబాబునాయు డు సీఎంను హెచ్చరిస్తూనే ప్రజల సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరిస్తానని హామీఇచ్చారు. వస్తున్నా మీ కోసం పాదయాత్రలో భాగంగా చంద్రబాబు నాయుడు సోమవారం జిల్లాలోని రా యికల్ జూనియర్ కళాశాల నుంచి రా యికల్, కుమ్మరిపల్లి, ఉప్పుమడుగు, అ ల్లీపూర్, కిష్టంపేట వర కు 14.4 కిలోమీటర్ల దూరం పాదయాత్ర నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయనకు అడుగడుగునా ప్రజలు నీరాజనాలు పలికా రు. విద్యార్థులు, మహిళలు మంగళహా రతులు పట్టారు. గుస్సాడీ నృత్యాలు, డప్పుల చప్పుళ్లతో స్వాగతం పలికారు. ఆ యా గ్రామాల్లో జరిగిన సభల్లో నేనే మి చేయాలి.. మీరేం చేస్తారో.. చెప్పాల ని ప్రజల చేతికి మైకు ఇచ్చి చర్చ పెట్ట డం ఆసక్తిని రేకెత్తించింది. అల్లీపూర్ గ్రా మంలో 'ఎస్సారెస్పీ నీళ్లు విడుదల చే యడంలేదు. వరి నార్లు పోసుకున్నాం. ఆ నీటితో మా ఊరి చెరువులు నింపే ప్రయత్నం చేయాలని రైతు ఎంబళ్ల నర్సయ్య. కరెంట్ బిల్లు లు బాగా వస్తున్నాయని, డెవలప్‌మెంట్ చార్జీలు వేస్తున్నారని తట్టుకోలేకపోతున్నామని బిల్లు లు తగ్గించేందుకు చొరవ చూపాలని సతీష్. 500 రూపాయల బిల్లుకు 1400 వచ్చిందని, వాటిని తగ్గించాలని గుండవేని చిన్నక్క వాపోయింది. అలాగే దారి పొడవునా... నా భర్త గల్ఫ్‌లో చనిపోయి ఏడాదిన్నరయ్యింది. ఇంత వర కు శవం రాలేదు. ఈ మధ్యనే కొడుకు ప్రమాదంలో చనిపోయాడు. పట్టించుకునే వాళ్లులేరు.

నా భర్త ముఖం చూసుకునేందుకైనా శవాన్ని తెప్పించండని దండుగుల చిన్నక్క... మా కాలనీలో రోడ్లు లేవు, మురికి కాలువలు లేవు. మీ రైనా పట్టించుకోవాలని ఒడ్డెర కాలనీ వాసులు మొర పెట్టుకున్నారు. మాకు బడికి పోయేందుకు సైకిళ్లు లేవు. సైకిళ్లు ఇప్పించాలని ఓ విద్యార్థిని..మాకు శిక్ష ణ, గుర్తింపు ఇస్తామన్న ప్రభుత్వం దాని గురించి పట్టించుకోవడం లేదు. మీరైనా మాకు ఉండి పోరాటం చేయాలని ఆర్ఎంపీ, పీఎంపీ డాక్టర్లు. రాయికల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలకు కంపౌండ్ వాల్ లేదని, కరెంట్ లేదని, మరుగుదొడ్లు లేవని వీటిని పరిష్కరించాలని విద్యార్థులు.. ప్రభుత్వం ఇచ్చే పెన్షన్ సరిపోవడం లేదని రెండు, మూ డుసార్లు ధర్నాలు చేశామని పెన్షన్ పెం చాలని ఓ వికలాంగుడు.. కుల వృత్తి గి ట్టుబాటు కావడం లేదని, ఎక్సైజ్ పన్ను రద్దు చేయాలని, ప్రమాదవశాత్తు మరణించిన వారికి 5 లక్షల ఎక్స్‌గ్రేషియో ఇప్పించాలని గీత కార్మికులు.. మాకు ఇస్త్రీ పెట్టెలు ఇవ్వాలని, దోబీఘాట్ల ని ర్మాణం చేపట్టాలని ఓ రజకుడు.. సబ్సిడీపై నూలు ఇవ్వాలని చేనేత కార్మికు లు.. చెరువులను అభివృద్ధి చేసి, స బ్సిడీపై చేప పిల్లలను ఇవ్వాలని గంగపుత్రులు.. స్థానిక ఎన్నికల్లో మహిళలకు 50 శాతం సీట్లు కేటాయించాలని మ హిళా రాజ్యాధికార సంఘం సభ్యులు.. ఇలా దారి పొడవునా రైతులు, విద్యార్థులు, మహిళలు, కులవృత్తుల వాళ్లు చంద్రబాబునాయుడికి తాము ఎదుర్కొంటున్న సమస్యలపై ఏకరువు పెట్టా రు.

వీటిపై ఆయన మాట్లాడుతూ ఎ స్సారెస్పీ నీటిని తక్షణమే విడుదల చే యాలని సీఎంను హెచ్చరించారు. తన హయాంలో ఎస్సారెస్పీ కాలువలను ఆధునీకీకరించి లైనింగ్ చేశానని 3 లక్ష ల ఆయకట్టును 9 లక్షల ఆయకట్టుకు పెంచానని చెప్పారు. ఆదరణ పథకం పెట్టి కులవృత్తులు చేసుకునే వారికి పనిముట్లు ఇప్పించానని అధికారంలోకి వ చ్చాక ఆదుకుంటామని హామీ ఇచ్చా రు. అసెంబ్లీ ఎన్నికల్లో బీసీలకు 100 సీట్లు ఇస్తానని, స్థానిక సంస్థల్లో మహిళలకు 50 శాతం సీట్లు ఇస్తామన్నారు. గల్ఫ్ బాధితులను ఆదుకునేందుకు ప్ర త్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసి వారి సమస్యలను పరిష్కరిస్తానన్నారు. బీడీ కార్మికుల కు వెయ్యి బీడీలకు 150 రూపాయలు, నెలకు 1500 పెన్షన్ ఇ ప్పించే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతానని అన్నారు.

వృద్ధాప్య, వికలాంగుల పెన్షన్‌ను 600కు పెంచుతామని, వికలాంగులకు వెయ్యికి తగ్గకుం డా పర్సంటేజీ ప్రకారం ఇస్తామని, క రెంట్ చార్జీలు తగ్గించే ఆలోచన చేస్తున్నానని ఎరువుల ధరలు తగ్గించకుంటే సబ్సిడీ కల్పిస్తానని, రైతు రుణాలను మాఫీ చేస్తానని చంద్రబాబు నాయుడు రైతులకు హామీ ఇచ్చారు. రాయికల్, అ ల్లీపూర్‌లో జరిగిన సభలకు జనం పెద్ద ఎత్తున తరలి రావడంతో చంద్రబాబు ఉత్సాహంగా వరాలు గుప్పించారు. ప్ర జలు ఎదుర్కొంటున్న సమస్యలను ఆ యా వర్గాల ద్వారా తెలుసుకుని ఆయ న వెంట మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి, ఎమ్మెల్యేలు ఎల్ రమణ, సీహెచ్ విజయరమణారావు, సుద్దాల దేవ య్య, ఎమ్మెల్సీ నర్సారెడ్డి, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి వాసాల రమేష్, ని యోజకవర్గాల ఇన్‌చార్జీలు గండ్ర నళి ని, ముద్దసాని కశ్యప్‌రెడ్డి, కర్రు నాగ య్య, గోపు అయిలయ్య యాదవ్, పార్టీ రాష్ట్ర, జిల్లా నాయకులు బోనాల రాజే శం, అన్నమనేని నర్సింగరావు, కళ్యాడ పు ఆగయ్య, గండ్ర రమాదేవి, పన్యాల శ్యాంసుందర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, సత్యనారాయణరెడ్డి, అమీనాబేగం, జవ్వాజి తిరుపతి, సింగిరి సాహితీ కుమారి, సం కు సుధాకర్, తెలుగు యువత అధ్యక్షు డు గౌతంకృష్ణ, ప్రధాన కార్యదర్శి విజయేందర్ రెడ్డి, జిల్లా బీసీ సెల్ అధ్యక్షు లు లక్ష్మినారాయణ ఉన్నారు.

మీ ఆరోగ్యం బాగుంటే..మేం బాగుంటాం..: సార్. నాకు ఫ్రీగా బుక్స్ కొనివ్వాలి. మాసార్లు చదువు బాగా చెబుతున్నా రు. పెన్నులు కొనివ్వాలి. మీ ఆరోగ్యం బాగుండాలి.. మీరు బాగుంటే మేం బా గుంటాం.. అని 6వ తరగతి చదువుతు న్న విద్యార్థి అజ్మత్ అన్న మాటలకు చంద్రబాబునాయుడు చలించిపోయా రు. ఆ మాటలకు కొన్ని క్షణాల వరకు మాటలురాలేదు. పిల్లలు మట్టిలో మా ణిక్యాలు బాగా చదివిస్తే ప్రపంచాన్ని జయిస్తారు. వారికి ఉచితంగా పుస్తకా లు, నోట్ బుక్కులు ఇప్పిస్తానని బాబు హామీ ఇచ్చారు.

ఎస్సారెస్పీ నీటిని విడుదల చేయండి