December 16, 2012

తెలంగాణపై కాంగ్రెస్ పార్టీ తమ అభిప్రాయాన్ని చెప్పదు..కానీ అన్ని పార్టీలను చెప్పమంటారు.. ఇదెక్కడి న్యాయం.. కాంగ్రెస్ పార్టీకీ బాధ్యత లేదా.. అధికారంలో ఉన్నది మీరు కాదా.. సమస్యను ఎందుకు పరిష్కరించరూ.. తెలుగుదేశం పార్టీని ఏదో ఒక ప్రాంతంలో భూస్థాపితం చేయాలని కుట్ర పన్నుతున్నారు.. ఈ పార్టీని కా పాడాల్సిన బాధ్యత నాపై ఉంది.. లేకుంటే పెత్తందారులు, భూస్వాముల పాలన వస్తుంది.. అని చంద్రబాబు నా యుడు అన్నారు. మీ కోసం వస్తున్నా పాదయాత్రలో భాగంగా రెండో రోజు ఆదివారం ఆయన గొర్రెపల్లి నుంచి రేగుంట, ఇటిక్యాల వరకు 8.7 కిలోమీటర్ల వరకు పాదయాత్ర నిర్వహించా రు.

గొర్రెపల్లి పాఠశాలలో శనివారం రాత్రి బస చేసిన చంద్రబాబు మధ్యా హ్నాం 3 గంటల తర్వాత పాదయాత్రను ఆరంభించారు. మార్గమధ్యంలో రైతులు, గొర్రె కాపరులు, మహిళలు, విద్యార్థులను పలకరించి వారి సమస్య లు తెలుసుకున్నారు. రేగుంట, ఇటిక్యా ల సభల్లో ఆయన రైతులు, విద్యార్థు లు, బీడీ కార్మికులు, ఆయా వర్గాలు ఎదుర్కొంటున్న వారి సమస్యలను అడిగి తెలుసుకుని నేనేమి చేయాలో చెప్పండి అంటూ సలహాలు స్వీకరించారు. తెలంగాణపై కాంగ్రెస్ పార్టీ తమ అభిప్రాయాన్ని చెప్పకుండా తమను చెప్పాలనడం ఇదెక్కడి న్యా యమని అన్నారు. తెలుగుదేశం పార్టీని ఈ ప్రాంతంలో భూస్థాపితం చేయాలని కుట్ర పన్నుతున్నారు.. ఎఫ్‌డీఐల విషయంలో కాంగ్రెస్ ఎంపీలను బుజ్జగించడానికే అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు తప్ప తెలంగాణ సమస్య పరిష్కారానికి కాదని ఆయన అన్నారు. అందరి అభిప్రాయాలు తెలుసుకుంటారట కానీ, తమ అభిప్రాయం మాత్రం చెప్పరు. సమస్య పరిష్కారానికి బాధ్యత తీసుకోరు. అని ఆయన కాంగ్రెస్‌ను విమర్శించారు.

తెలంగాణ అమరవీరుల కుటుంబాలను ఆదుకునే బాధ్యతను తెలుగుదేశం తీసుకుంటుందని ఆయన చెప్పారు. తానెప్పుడూ తె లంగాణకు వ్యతిరేకంగా మాట్లాడలేదని, భవిష్యత్తులోనూ మాట్లాడనని చంద్రబాబు నాయుడు మరోసారి స్ప ష్టం చేశారు. సామాజిక తెలంగాణ జేఏసీ నాయకులు జెండాలు పట్టుకుని ఆయనకు మద్దతుగా పాదయాత్ర చే శారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో కి రాగానే వ్యవసాయానికి 9 గంటల నాణ్యమైన విద్యుత్‌ను అందించి కరెం ట్ ఛార్జీలను తగ్గిస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. వస్తున్నా మీ కోసం పాదయాత్రలో భాగంగా మల్లాపూర్ మండలం రేగుంట సభలో మాట్లాడు తూ వ్యవసాయానికి 7 గంటల విద్యు త్తు సరఫరా లేక పంటలు ఎండి పో యి రైతులు నష్ట పోతున్నారని అన్నా రు. టీడీపీ అధికారంలోకి రాగానే వి ద్యుత్తును మెరుగు పరిచి ఆ శాఖ పనితీరు మారుస్తానని అన్నారు.

9 గం టల పాటు నాణ్యమైన విద్యుత్తు సరఫరా చేయడంతో పాటు కరెంట్ చార్జీ లు తగ్గిస్తానని హామీ ఇచ్చారు. తెలుగుదేశం హయాంలో అనేక మందికి ఉద్యోగాలు కల్పించామని 11 సార్లు డీఎస్సీ నిర్వహించి లక్షా 65 వేల మం దికి ఉద్యోగాలిచ్చామన్నారు. బీఇడీ అభ్యర్థులకు ఎస్జీటీలుగా తాము అవకాశం కల్పిస్తే ఈ ప్రభుత్వం ఎస్జీటీగా అవకాశం లేకుండా చేసిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 6 లక్షల మంది బీఇడీ అభ్యర్థులున్నారని వారందరికీ పాత పద్ధతిలోనే డీఎస్సీ నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. ఉపాధి హామీని వ్యవసాయంతో అనుసంధానం చేస్తానని చె ప్పారు. బీడీ కార్మికులకు నెలకు 1500 పెన్షన్ ఇప్పించేందుకు పోరాటం చేస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు.

రేగుంట గ్రామంలో సామాజిక తెలంగాణ జేఏసీ నాయకులు జెండాలు పట్టుకుని సామాజిక తెలంగాణ కావాలని నినాదాలు చేశారు. మాకు దొరల తెలంగాణ వద్దని, సామాజిక తెలంగాణ కావాలని, చంద్రబాబు ద్వారానే అది సాధ్యమవుతుందని సామాజిక తె లంగాణ జేఏసీ నాయకులు కోరారు. అక్కడే తెలంగాణ రావాలే అనే పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఆయన వెంట ఎమ్మెల్యేలు సీహెచ్ విజయరమణారావు, సుద్దాల దేవయ్య, ఎల్ రమణ, మాజీ ఎమ్మెల్యేలు శికారి విశ్వనాథం, వేం నరేందర్ రెడ్డి, నియోజకవర్గాల ఇన్‌చార్జీలు పి రవీందర్ రావు, కర్రు నాగయ్య, పుట్ట కిశోర్, గండ్ర నళిని, డాక్టర్ కవ్వంపెల్లి సత్యనారాయణ, గోపు అయిలయ్య యాదవ్, ముద్దసాని కశ్యప్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి వాసాల రమేష్, రాష్ట్ర కార్యదర్శులు బోనాల రాజేశం, అన్నమనేని నర్సింగరావు, తెలుగు యువత అధ్యక్షులు గౌతం కృష్ణ, టీడీపీ బీసీ విభా గం అధ్యక్షులు అడ్లగట్ల లక్ష్మినారాయ ణ, నాయకులు సంకు సుధాకర్, ఎస్ ప్రభాకర్ రెడ్డి, ఒంటెల సత్యనారాయ ణ రెడ్డి, అమీనా బేగం పాల్గొన్నారు.

టీడీపీని భూస్థాపితం చేయాలనే కుట్ర

ఇప్పటికి కొన్ని లక్షలమందిని కలిశాను. ఈ రోజుదాకా 1220 కిలోమీటర్ల వరకు తిరిగాను. అందరి సమస్యలూ ఓపికతో వింటున్నాను. చెప్పాలనుకున్నది ప్రసంగాల ద్వారా కాదు.. వాళ్ల మాటల్లోనే చెప్పిస్తున్నాను. వాళ్లేమనుకుంటున్నారో కూడా వాళ్లనే అడిగి తెలుసుకుంటున్నాను. రేగుంట లాంటి వందల గ్రామాల్లో జనాలను పలకరించాను. ప్రతి ఊళ్లోనూ వాళ్లకే మైకు ఇచ్చి వాళ్ల కష్టాలు చెప్పమంటున్నాను. వాళ్లు ఏది చెబితే అదే నా పాదయాత్రకు ఎజెండా.

ఇటిక్యాల దారిలో ఒక రైతును కదిలిస్తే గిట్టుబాటు ధర లేదని గోడు వెళ్లబోసు కుంటున్నాడు. ఒక మహిళను మాట్లాడిస్తే పావలా వడ్డీ పేరుతో రెండు రూపాయలు పిండుతున్నారని ఏకరువు పెడుతోంది. ఒక విద్యార్థిని అడిగితే..స్కాలర్‌షిప్పులు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఒక అవ్వను పలకరిస్తే పింఛను చాలడం లేదని బాధపడుతోంది. కూలీ గిట్టుబాటు కావడం లేదని బీడీ కార్మికులు, ఉద్యోగాలు దొరకడం లేదని నిరుద్యోగులు, స్కూళ్లలో కనీసం మరుగుదొడ్లు కూడా లేవని చిన్నచిన్నపిల్లలు సైతం.. కష్టాలు కలబోసుకుంటున్నారు. ఒక లక్షా యాభైవేల కోట్ల రూపాయల బడ్జెట్ ఎటు పోతుంది? అదంతా అవినీతిపరుల ఖాతాలోకి చేరిపోతోంది. ఎంత తిన్నా ఈ కాంగ్రెస్ నేతలకు సంతృప్తనేదే ఉండటం లేదు. నిజానికి, అంత బడ్జెట్ డబ్బు పేదలకు చేరితే పేదరికం ఇంకెక్కడ?

అన్ని కష్టాలకు మూల కారణం అవినీతే. ఆ విషయం వాళ్లకు అర్థమయ్యేలా చెప్పే ప్రయ త్నం చేస్తున్నాను. నా యాత్రలో అవినీతిపై చర్చకే పెద్దపీట వేస్తున్నాను. అభివృద్ధికి అవినీతి గొడ్డలిపెట్టనే సంగతి అరటిపండు ఒలిచినట్టు వారికి చెప్పాలని ప్రయత్నిస్తున్నాను. అందుకే 'ఒక్క అవినీతిపరుడూ లేకపోతే ఒక్క పేదవాడూ' ఉండడు అనే నినాదాన్ని పదేపదే చెబు తున్నాను. నా ప్రయత్నం ఫలించి పేదల కష్టాలు తీరే రోజు దగ్గర్లోనే ఉందని నమ్ముతున్నాను.

జన వాక్కే నాకు ఎజెండా!

"పాదయాత్రలో మీ కష్టాలు నేరుగా చూశాను. సమస్యలన్నీ తెలుసుకున్నా. కష్టాల్లో, నష్టాల్లో మీతో ఉండాలని, వాటిని మీతో పంచుకోవాలని మీ వద్దకు వచ్చాను. నేనెలా ఉండాలో.. నేనేం చేయాలో మీరే చెప్పండి. మల్లాపూర్ వరకు ప్రతి రోజు నేనే మాట్లాడుతూ వచ్చాను. ఇప్పుడు మీ నుంచి సమస్యలు, వాటి పరిష్కారాన్ని వినాలనుకుంటున్నా'' పాదయాత్రలో భాగంగా కరీంనగర్ జిల్లా మల్లాపూర్ మండలం రేగుంట గ్రామంలో స్థానిక ప్రజలతో టీడీపీ అధినేత చంద్రబాబు వ్యాఖ్యలివి. అనడమే కాదు.. ప్రజలకు మైకును అందించి వారి సమస్యలు విన్నారు.

ఈ సందర్భంగా ఒక రైతు మాట్లాడుతూ ఒక ఫ్యాక్టరీలో తయారయ్యే వస్తువుకు వారే ధర నిర్ణయిస్తారు. రైతు పండించే ధాన్యానికి మాత్రం ఆ అవకాశం లేదు. రైతు పండించిన పంటకు రైతే ధర నిర్ణయించాలి. ఈ ప్రభుత్వంలో వ్యవసాయ శాఖ ఉండి ఉపయోగం లేదు. పంటలకు సలహాలు ఇచ్చే వాళ్లు లేరు. కాబోయే ముఖ్యమంత్రి మీరే.. ఈ దళారీ వ్యవస్థను తొలగించి ఆదుకోవాలి అని కోరారు. పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని, తమ పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలని మరో రైతు కోరారు. మాదిగ విద్యార్థి ఫెడరేషన్ కార్యకర్త మాట్లాడుతూ మాదిగ జాతికి మీ వల్లే లాభం జరిగిందని చెప్పారు.

చొప్పదండిలో లిడ్ క్యాప్‌కు కేటాయించిన స్థలాన్ని ఏపీఎస్పీ బెటాలియన్‌కు ఇచ్చారని దీనిపై మీరు పోరాడాలని కోరారు. "తెలంగాణ కోసం శ్రీకాంత్‌చారి ఆత్మ బలిదానం చేశారు. అలా వెయ్యి మంది వరకు చనిపోయారు. మాపై 30 నుంచి 40 వరకు కేసులున్నాయి. తెలంగాణకు మీరు అనుకూలంగా ఉండి, కేసులను ఎత్తివేయించాలి'' అని ఓ విద్యార్థి విజ్ఞప్తి చేశారు. కనీస వేతనాల కోసం తాము పోరాడితే మద్దతు ఇచ్చారని, కానీ అవి అమలు కాకుండా జీవోను అబయన్స్‌లో పెట్టిందని, దానిని సరిచేయాలని కోరారు.

పెన్షన్ 1500 రూపాయలు ఇప్పించాలని బీడీ కార్మికుల సంఘం ప్రతినిధి విజ్ఞప్తి చేశారు. "అవినీతి చాలా పెరిగింది. తెలంగాణ ప్రజలను అన్నింట్లో అణగ దొక్కుతున్నారు. ఉద్యోగాలు ఇస్తలేరు. మా బడిలో నీళ్లు లేవు. మరుగు దొడ్లు లేవు. అవినీతిని నిర్మూలించి మాకు మంచి చదువులు చదివించి ఉద్యోగాలు ఇప్పించాలి'' అని మరో విద్యార్థిని కోరింది. రాష్ట్రంలో అవినీతి పరుల ఆట కట్టించేందుకు మీరు రహస్యంగా విచారణలు జరిపించి వారిపై కేసులు పెట్టి ఆ డబ్బును రికవరీ చేయాలని సూచించింది. ఉద్యోగులకు సరిపడా వేతనాలు పెంచితే వాళ్లు లంచాలు తీసుకోరని సలహా ఇచ్చింది.

"మీరే అధికారంలోకి రావాలి. మీరు వస్తేనే మాకు న్యాయం జరుగుతుంది. తెలుగుదేశం పార్టీకే ఓట్లు వేస్తాం'' అని మరో రైతు స్పష్టం చేశారు. మార్గమధ్యలో రైతులు, గొర్రెల కాపరులు, మహిళలు, విద్యార్థులు, వివిధ కుల వృత్తుల వారిని పలకరించి వారి సమస్యలను తెలుసుకుని ఏమి చేస్తే బాగుంటుందని సలహాలు కోరారు. ప్రజలతోనే మాట్లాడించి వారి సమస్యలను విని, ఏం చేయాలో వారి నుంచే చంద్రబాబు సలహాలు తీసుకోవడం ఆయన పాదయాత్రలో కొత్త కోణం.

నేనేం చేయాలో చెప్పండి పాదయాత్రలో ప్రజలతో చంద్రబాబు

జడ్జీలనూ మేనేజ్ చేశాడు!
మా పార్టీ వాళ్లను జైలుకు పంపాలనుకున్నాడు
కాల్పులు సాకుగా సతీశ్‌రెడ్డిని ఇరికించాలనుకున్నాడు
వాంగ్మూలం మార్పించాడు.. జడ్జీపై ఒత్తిడి తెచ్చాడు
పులివెందులలో ఆయనదంతా రౌడీయిజమే
అదంతా కోర్టు ఇప్పుడు తేల్చేసింది
వైఎస్‌పై చంద్రబాబు నిప్పులు
'ఆంధ్రజ్యోతి' సంచిక చదివి వినిపించిన టీడీపీ అధినేత

రాష్ట్ర ప్రజలను దారుణమైన 'షాక్'లకు గురిచేస్తున్న కరెంటు చార్జీలను అధికారంలోకి వచ్చిన వెంటనే తగ్గిస్తానని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. జడ్జీలను సైతం ప్రలోభపెట్టి అప్పటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి అనేకమందిని జైళ్లకు పంపించారని దుయ్యబట్టారు. బీఎడ్ అభ్యర్థులనూ ఎస్‌జీటీ (సెకండరీ గ్రేడ్ టీచర్స్)కి అర్హులను చేస్తానని, ప్రభుత్వంలోకి రాగానే వారికోసం డీఎస్సీ పరీక్ష నిర్వహిస్తానని హామీ ఇచ్చారు. అవినీతి కాంగ్రెస్ దొంగల్ని తరిమికొట్టాలని పిలుపునిచ్చారు.

కరీంనగర్ జిల్లా మల్లాపూర్ మండలం గొర్రెపల్లి వద్ద ఆదివారం ఆయన పాదయాత్ర ప్రారంభించారు. రేగుంట, ఇటిక్యాల గ్రామం వరకు 8.7 కిలోమీటర్లు నడిచారు. భార్య భువనేశ్వరితో మాట్లాడి, కార్యకర్తలను పలకరించి పాదయాత్ర కోసం బస్సు దిగేసరికి మధ్యాహ్నం మూడు గంటలయింది. మార్గమధ్యలో పసుపు, మామిడి రైతులు, గొర్రెల కాపరులు, మహిళలను పలకరించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కరెంటు కష్టాలు తీర్చుతానని రేగుంట సభలో హామీ ఇచ్చారు. "వ్యవసాయానికి 7 గంటల విద్యుత్తు సరఫరా లేక పంటలు ఎండి పోతున్నాయి.

టీడీపీ అధికారంలోకి రాగానే విద్యుత్తును మెరుగు పరిచి ఆ శాఖ పనితీరు మారుస్తాం. తొమ్మిది గంటల పాటు నాణ్యమైన విద్యుత్తు సరఫరా చేస్తాం. కరెంట్ చార్జీలు తగ్గిస్తా'మని హామీ ఇచ్చారు. తన అక్రమాలకు చివరకు జడ్జీలను సైతం వైఎస్ వదిలిపెట్టలేదని దుయ్యబట్టారు. "వైఎస్ హయాంలో పులివెందులలో ప్రజాస్వామ్యం లేదు. రౌడీయిజం, ముఠా కక్షలు తప్ప అక్కడ ఏ న్యాయమూ లేదు. ప్రత్యర్థులను జైళ్లలో పెట్టించి ఎవరూ రాజకీయాల్లో తనకు వ్యతిరేకంగా ఉండవద్దని చూశారు.

2004లో వైఎస్‌కి వ్యతిరేకంగా పోరాడిన వ్యక్తి సతీశ్ రెడ్డి. అప్పుడు కో ఆపరేటివ్ ఎన్నికల్లో నిలబడడానికి సతీశ్ రెడ్డి పులివెందుల వెళ్లారు. ప్రచారంలో ఉండగా, ఒక ఊరులో ఆయనపై దాడి జరిగింది. రక్షణ కోసం గన్‌మెన్ కాల్పులు జరపగా ఒకరికి గాయమైంది. రాజశేఖరరెడ్డి ఫోన్ చేసి మెజిస్ట్రేట్‌ను రప్పించాడు. సతీశ్ రెడ్డే నేరుగా తుపాకీ తీసుకుని కాల్చారని తప్పుడు వాంగ్మూలం రాయించారు. ఆయనను శాశ్వతంగా జైలుకు పంపించే కుట్ర పన్నారు. నాటి సీఎంతో జడ్జి లాలూచీ పడినట్టు తర్వాత కోర్టు తేల్చింది''అంటూ ఆదివారం 'ఆంధ్రజ్యోతి'లో వచ్చిన 'రాజుగారి సేవల చెరుపు' వార్తను ప్రజలకు చదివి వినిపించారు.

కాంగ్రెస్ దొంగలు అడవి పందుల్లా రాష్ట్రాన్ని మెక్కుతున్నారని అన్నారు. రాష్ట్రం నష్టం పోవడానికి వైఎస్ పాలన కారణమైతే, రోశయ్య పాలన చతికిల పడిందని, కిరణ్ పాలన కిరికిరిగా సాగుతున్నదని అన్నారు. కాగా, తెలంగాణపై కాంగ్రెస్ పార్టీ తమ అభిప్రాయాన్ని చెప్పదు గానీ అన్ని పార్టీలను చెప్పమనడం ఎక్కడి న్యాయమని చంద్రబాబు ప్రశ్నించారు. ఎఫ్‌డీఐల విషయంలో కాంగ్రెస్ ఎంపీలను బుజ్జగించడానికే అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు తప్ప తెలంగాణ సమస్య పరిష్కారానికి కాదని విమర్శించారు. తెలంగాణ అమరవీరుల కుటుంబాలను ఆదుకునే బాధ్యతను టీడీపీ తీసుకుంటుందని హామీ ఇచ్చారు.
కోటి రూపాయలు చూశారా?
రేగుంట సభలో చంద్రబాబు వైఎస్ కుటుంబం అవినీతి భాగోతాన్ని పిట్టకథలా చెప్పుకొచ్చారు. మీరెప్పుడైనా కోటి రూపాయలు చూశారా?అన్ని ప్రశ్నించారు. లేదు అని ప్రజల నుంచి బదులొచ్చింది. దానికి చంద్రబాబు ఇలా వివరించారు. 100 రూపాయల నోట్లు 100 కట్టగా కడితే 10 వేలు. ఐదు వేలు, 10 వేల రూపాయల కట్టలను ఒక సంచిలో నింపితే 50 లక్షలు. అలాంటి సంచులు 200 అయితే లారీ నిండుతుంది. వాటి విలువ వెయ్యి కోట్లు. అలాంటి వెయ్యి లారీల డబ్బును లెక్కిస్తే లక్ష కోట్ల రూపాయలు. ఇదీ జగన్ దోచిన డబ్బు. అందులో ఒక లారీ మీ ఊరికి పంపినా మీ కష్టాలు తీరుతాయి.

అధికారంలోకి వస్తే కరెంటు చార్జీలు తగ్గిస్తానని హామీ

వికలాంగుల పట్ల దేవుడు చిన్నచూపు చూశాడు. దానికి ప్రభుత్వ నిర్లక్ష్యమూ తోడై వారిని కుంగదీస్తోంది. వారిలో చాలామంది పుట్టుకతో వికలాంగులు కాదు. మనందరిలాగే వాళ్లకూ భగవంతుడు సకల అంగాలను ప్రసాదించాడు. తాగునీటి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వైఖరే వారికి ఉరి బిగించింది. సలక్షణంగా ఉన్నవారిని వికలాంగులుగా మార్చింది. అలాంటివారిలో కొందరిని ఓబులాపూర్‌లో కలుసుకున్నాను. వారిలో కొందరు మానసిక వికలాంగులు కాగా, మిగతా వారంతా శారీరక వైకల్యంతో బాధపడుతున్నవారు. అందరివీ పేద కుటుంబాలే.

తల్లిదండ్రుల రెక్కాడితేగానీ వీళ్ల డొక్క నిండదు. చెట్టంత కొడుకు చేతికిందకు రాలేదనే దిగులు ఒకవైపు, సేవలు చేస్తూనే పోషణకు ఆ పనీ ఈ పనీ చేయాల్సి రావడం మరోవైపు.. పాపం ఆ కుటుంబాలను కోలుకోలేకుండా చేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో వాళ్లకు ప్రభుత్వమే దిక్కు. ఆ ప్రభుత్వం మాత్రం సాయం మరిచి దిక్కులు చూస్తోంది. మిగిలిన విషయాలెలాఉన్నా వీళ్లపట్ల ఎవరికైనా కనీస మానవత్వం ఉండాలి. ఈ విధి వంచితులపై ఎక్కువ శ్రద్ధపెట్టి పనిచేయా లి. అప్పట్లో నేను చేసిందిదే. వీళ్లకు జీవితంపై ఆశ కల్పించడం కోసం ఇప్పుడు ప్రత్యేక పాలసీ తెచ్చాను. ఇంకా ఏం చేయాలనే దానిపై ఇతర వర్గాల నుంచీ సలహాలు తీసుకుంటున్నాను. ఏమైనా వీరి కష్టాలు తీరే రోజొకటి ఉందనే ఆశతోనే నడుస్తున్నాను.

పాత దామరాజుపల్లెకు వచ్చినప్పుడు నడ్డి విరుస్తున్న 'పావలా వడ్డీ' దారుణాలను డ్వాక్రా మహిళలు కళ్లకు కట్టారు. ఆ మహిళల్లో చాలామందికి చదువు లేదు. ఆదిలాబాద్ జిల్లా డ్వాక్రా సంఘాల అధ్యక్షురాలి పరిస్థితీ ఇంతే. చదువు లేకపోయినా సంఘాలను సమర్థంగా నడుపుతోంది. నిజానికి, ఇలాంటి మహిళామణులను మరింతగా ఉత్సాహపరచాలి. కానీ, వీళ్ల పరిస్థితి చూస్తుంటే ప్రాణం ఉసూరుమంటోంది. "ఏది అసలో, ఏది వడ్డీయో తెలియడం లేదు సార్. మేము తీసుకునే దానిపై ఎంత వడ్డీ వేస్తున్నదీ చెప్పరు. మూడు లక్షల రూపాయల లోనులో 50 వేలు ముందే కోతపెట్టి ఇస్తున్నారు'' అని ఆ మహిళలు వాపోయారు. ఆడపడుచులతో కన్నీరు పెట్టించిన ఏ ప్రభుత్వమూ బాగుపడదని వాళ్లకు ధైర్యం చెప్పి అక్కడ నుంచి కదిలాను.

విధి వంచితులతో ఆటలా?

పత్తి కొనకపోతే తిత్తి తీస్తా!
వారంలోగా బేళ్లన్నీ కొనుగోలు చేయాలి
లేదంటే.. దీక్ష చేసి నేలకు దించుతాం
సీఎం కిరణ్‌కు చంద్రబాబు ఘాటు హెచ్చరిక

వారం రోజుల్లోగా పత్తి కొనుగోలు చేసి రైతులకు న్యాయం చేయకపోతే సీఎం కిరణ్ అంతు తేలుస్తామని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు హెచ్చరించారు. అప్పటికీ స్పందించకుంటే పత్తి రైతు కోసం జమ్మికుంటలో ధర్నాచేసి సర్కారును నేలకు దించుతామని వెల్లడించారు. కరీంనగర్ జిల్లా మల్లాపూర్ మండలం ఓబులాపూర్ వద్ద శనివారం ఆయన పాదయాత్ర ప్రారంభించారు. జిల్లాలో అడుగుపెట్టిన తొలిరోజే ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతూ ముందుకు మహాఉత్సాహంగా సాగిపోయారు. సంగెం శ్రీరాంపూర్, కొత్త దామరాజుపల్లి, పాతదామరాజుపల్లి, మల్లాపూర్, గొర్రెపల్లి మీదుగా 16 కిలోమీటర్లు నడిచారు.

ఓబులాపూర్ నుంచి బయలుదేరిన చంద్రబాబుకు మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు. దారి పొడవునా వివిధ వర్గాల వారితో మాట్లాడుతూ వారి సమస్యలు తెలుసుకుంటూ పరిష్కారానికి హామీలిస్తూ ముందుకు సాగారు. సంగెం శ్రీరాంపూర్ దాటిన తర్వాత రోడ్డు పక్కన చెట్టు కింద కూర్చుని ఉన్న వికలాంగుల వద్దకు వెళ్లి బాగోగులు తెలుసుకున్నారు. 18 అంశాలతో వికలాంగుల పాలసీని సిద్ధం చేశామని, తెలుగుదేశం అధికారంలోకి రాగానే అమలు చేస్తామని హామీ ఇచ్చారు. అక్కడ నుంచి కొత్తదామరాజుపల్లి గ్రామానికి వచ్చి ఉమామహేశ్వరాలయంలో కుమారుడు లోకేశ్‌తో కలిసి చండీహవనంలో పాల్గొన్నారు.

అనంతరం ఓబులాపూర్, కొత్తదామరాజుపల్లి, పాత దాంరాజుపల్లి, మల్లాపూర్ గ్రామాల్లో డ్వాక్రా మహిళలను కలిశారు. పావలా వడ్డీ అని పేరుచెప్పి రెండు రూపాయలు పిండుతున్నారని కొందరు.. అసలు ఎంత వడ్డీ వేస్తున్నదీచెప్పడం లేదని మరికొందరు.. ఇచ్చే అరకొర రుణంలోనూ కోతలు పెడుతున్నారని ఇంకొందరు గోడు వెళ్లబోసుకున్నారు. " గీ మహిళ సంఘాలను నువ్వే పెట్టించినవు. గీళ్లేమో పావలా వడ్డీ అంటన్నరు.. ఐదు రూపాయలు తీసుకుంటన్నరు. మేం ఎట్ల కట్టేది, ఎట్ల బతికేది'' అని సామల కిష్ట్టమ్మ మొత్తుకోగా, "మా కోసం మీరు కేంద్రంలో కొట్లాడాలి. ఇప్పటి నుంచి మీకు మద్దతునిస్తాం. మాగురించి ఆలోచించండి'' అని కొత్తూరి నారాయణరెడ్డి అనే పసుపు రైతు వాపోయాడు.

పత్తి, పసుపు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా సీఎం కిరణ్‌కు చీమ కుట్టినట్టయినా లేదని, నీరో చక్రవర్తిలా ఏసీ రూంలలో పడుకుంటున్నారని ్ఘిచంద్రబాబు విమర్శించారు. 'మార్కెట్లలో మద్దతు ధరకు పత్తిని కొనడం లేదు . వారి నుంచి వ్యాపారులు, దళారులు కొని అధిక లాభాలకు సీసీఐకి విక్రయిస్తున్నారు. వీళ్లతో కాంగ్రెస్ నేతలు కుమ్మక్కవుతున్నారు''అని దుయ్యబట్టారు. కరీంనగర్ జిల్లాలో ఆరున్నర లక్షల ఎకరాల్లో పత్తి సాగు జరిగిందని, వారం రోజుల్లోగా ఆ పత్తి నిల్వలను కొనుగోలు చేయకపోతే ఈ ప్రభుత్వం అంతు తేలుస్తామని హెచ్చరించారు. గత సంవత్సరం 15 వేల రూపాయల ధర పలికిన పసుపు మూడు వేలయినా పలికేవారు లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

15 వేల రూపాయల చొప్పున కొని పసుపు రైతును ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్, వైసీపీ నాయకులు దోచుకున్న డబ్బును రికవరీ చేస్తే రైతు అప్పులను ఐదేసి సార్లు మాఫీ చేయొచ్చునని చెప్పుకొచ్చారు. టీడీపీ అధికారంలోకి వస్తే తొమ్మిది గంటల ఉచిత కరెంట్ ఇస్తుందని చెప్పారు. కాంగ్రెస్ అమలు చేస్తానంటున్న నగదు బదిలీ పథకం తమ పార్టీ కాపీ పథకమేనన్నారు. "కిలో బియ్యానికి బదులు ఐదు రూపాయలు బ్యాంకులో వేసి మీ పొట్టకొట్టాలని చూస్తున్నార''ని చంద్రబాబు చెప్పారు. కరీంనగర్ ఎంపీగా ఉండగా టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ జిల్లాకు ఏం చేశారో చెప్పాలని సవాల్ చేశారు.

జిల్లాను ఎడారి చేసే బాబ్లీ ప్రాజెక్టుపై పోరాడి తాము జైలులో ఉంటే ఒక్క టీఎంసీ నీరు మహారాష్ట్రకు ఇస్తే ఏమిటని కేసీఆర్ ప్రశ్నించారని గుర్తు చేశారు. కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా ఉండి బీడికట్టలపై పుర్రె గుర్తును పెట్టి బీడీకార్మికుల పొట్టగొట్టారని దుయ్యబట్టారు. "వైఎస్ బయ్యారం గనుల పేరిట లక్షా 56 వేల ఎకరాలను అల్లునికి (బ్రదర్ అనిల్) దానం చేస్తే తెలుగుదేశం గట్టిగా పోరాడింది. అప్పుడు టీఆర్ఎస్ ఎక్కడ ఉంది?'' అని ఘాటుగా ప్రశ్నించారు.

తెలుగుదేశం పార్టీ తెలంగాణకు వ్యతిరేకం కాదని, తానెప్పుడూ తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడలేదని, భవిష్యత్‌లో కూడా మాట్లాడనని చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. తెలంగాణ సమస్యపై అఖిలపక్షం ఏర్పాటు చేయాలని డిమాండ్‌చేసింది టీడీపీయేనని గుర్తుచేశారు. కాళ్లు బొబ్బలెక్కినా, మెడ నొప్పులు వస్తున్నా పాదయాత్ర చేస్తున్నానని చెప్పుకొచ్చారు.

జమ్మికుంటలో దీక్ష చేసి రైతును ఆదుకుంటా