December 15, 2012

వస్తున్నా మీకోసం పాదయాత్రలో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కరీంనగర్ జిల్లాలో శనివా రం పాదయాత్రను చేపట్టారు. కాళ్ల నొ ప్పులు, నడుము నొప్పులతో బాధపడుతున్న చంద్రబాబు శరీరంలో షుగర్ లెవల్స్‌లో హెచ్చుతగ్గులు ఉంటుండడంతో వైద్యుల సూచన మేరకు ఆయన ఉదయం, మధ్యాహ్నం, రాత్రి తీసుకుంటున్న భోజన వివరాలివి.. ఉద యం పూట రాగిజావతో పాటు ఓట్స్ తీసుకుంటున్నారు. మధ్యాహ్నం రెం డు కప్పుల కర్రీలతో మూడు లేదా నాలుగు పుల్కాలు తింటారు. రాత్రిపూట గోధుమపిండితో చేసిన పొంగలి కానీ, ఉప్మా రవ్వతో చేసిన పొంగిలిని తీ సుకుంటున్నారు. మధ్య మధ్యలో కీరా జ్యూస్, కాఫీ తీసుకుంటున్నారు. ఆదివారం మినహా మిగతా రోజుల్లో 12 నుంచి 18కిలోమీటర్ల వరకు, ఆదివారం 8 నుంచి 10 కిలోమీటర్ల వరకు పాదయాత్ర చేస్తున్నారు.

దినచర్య : చంద్రబాబు నాయుడు తాను బస చేసిన ప్రాంతంలో ఉదయం 5 గంటలకే లేచి కాలకృత్యాలు తీర్చుకొ ని, స్నానం చేసి పార్టీ నేతలతో సంభాషిస్తారు. అనంతరం దినపత్రికలను చది వి కాసేపు టీవీ ఛానళ్లలో వచ్చే వార్తల ను చూస్తున్నారు. గంటసేపు రాష్ట్రంలో ని పార్టీ ముఖ్యనేతలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో టెలీకాన్ఫరెన్స్ ని ర్వహిస్తున్నారు. పాదయాత్ర చేపట్టే జి ల్లాల్లోని ఒకటి లేదా రెండు నియోజకవర్గాల నాయకులతో ప్రత్యేక సమావే శం నిర్వహించి ఆ నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితిని, ఇతర పార్టీల పరిస్థితి, సమస్యల గురించి చర్చించి వారికి తీసుకోబోయే చర్యల గురించి వివరిస్తారు. ఆ తదనంతరం పాదయాత్రను ప్రారంభిస్తారు.

పాదయాత్రలో చంద్రబాబు మెనూ ఇదే..

మెట్‌పల్లి/మల్లాపూర్/ఇబ్రహీంపట్నం: 'వస్తున్నా మీకోసం' పాదయాత్రలో భాగంగా శనివారం మల్లాపూర్ మండలం లో పర్యటించిన మాజీ ముఖ్యమంత్రి నా రా చంద్రబాబు నాయుడుకు ప్రజలు తమ సమస్యలపై అనేక రకాల వినతిపత్రాలు అందించారు. గీత కార్మికులు తమ సమస్యలు పరిష్కరిచాలంటూ వినతిపత్రాలు అందించారు. గీత కార్మిక సొసైటీలకు ప్ర భుత్వం స్థలం కేటాయించాలని, చెట్ల పెం పకానికి స్థలం ఇవ్వాలని, కార్మికులకు పింఛన్లు అందించాలని కోరుతూ నియోజకవర్గంలోని పలు గ్రామాలకు చెందిన గీత కార్మికులు చంద్రబాబును కలిసి వినతిప త్రం అందించారు. చెరుకుకు మద్దతు ధ రను రూ. 3 వేలు కేటాయించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొని రావాలని కోరుతూ పలు రైతు సంఘాల నాయకులు, బీజేపీ నాయకులు బాబుకు వినతిపత్రం అందించారు.

కేంద్ర హోం శాఖ పిలుపు మేరకు జ రగనున్న అఖిలపక్ష సమావేశంలో తెలంగాణపై తెలుగుదేశం పార్టీ స్పష్టమైన వైఖరిని ప్రకటించాలని కోరుతూ నియోజకవర్గ బీజేపీ ఇంచార్జీ ఏలేటి ముత్తయ్యరెడ్డి, నాయకులు వర్థినేని సత్యనారాయణరావు, బాజోజి భాస్కర్, ఇందూరి సత్యం, వాకిటి ఆనంద్‌రెడ్డి, సదబత్తుల వేణు తదితరులు వినతిపత్రం అందించారు.ఎస్సారెస్పీ పునరావాస గ్రామాల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సంగెం శ్రీరాంపూర్ వాసులు చంద్రబాబును కలిసి తమ గోడును వెల్లబోసుకున్నారు. సమస్యలను వివరించుకున్న ప్రజలకు పరిష్కరానికి చంద్రబాబు భరోసా ఇస్తూ తగిన హామీనిచ్చారు.

బాబుకు వినతుల వెల్లువ

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు 'వస్తున్నా మీ కోసం...' పాదయాత్రకు జిల్లాలో ప్రజల నుంచి సానుకూల స్పందన లభించింది. బలీయంగా ఉన్న తెలంగాణవాదం, ఎస్‌సీల వర్గీకరణ అంశాలు పాదయాత్రలో బాబుకు ప్రతిబంధకంగా మారే అవకాశం లేకపోలేదనే అంచనాలు తలకిందులయ్యాయి. భారీ సంఖ్యలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు కదలిరాగా గ్రామీణ ప్రాం తాల మహిళలు చంద్రబాబుకు మంగళహారతులు పట్టి స్వాగతం పలికారు. దారిపొడవునా ఆయనతో కలిసి నడుస్తూ తొలి రోజు పాదయాత్రను విజయవంతం చేశా రు. బాదనకుర్తి వంతెన మీదుగా అదిలాబాద్ నుంచి కరీంనగర్ జిల్లాలో ప్రవేశించి న చంద్రబాబునాయుడు ఓబులాపూర్ గ్రామం నుంచి తన పాదయాత్రను శనివా రం ఉదయం ప్రారంభించారు.

తొలిరోజు ఓబులాపూర్, సంగెం శ్రీరాంపూర్, కొత్తదామరాజుపల్లి, పాతదామరాజుపల్లి, మ ల్లాపూర్, గొర్రెపల్లి గ్రామాలలో యాత్రను కొనసాగించి గొర్రెపల్లి, రేగుంట గ్రామాల మధ్య బస చేశారు. 16 కి.మీ. పొడవునా చంద్రబాబు పాదయాత్ర ఉత్సాహంగా సాగింది. ఓగులాపూర్‌లో మహిళల స్వాగతాన్ని అందుకున్న చంద్రబాబునాయుడు వారిని ఉద్దేశించి ప్రసంగించి ముందుకు సాగగా ... సంగెం శ్రీరాంపూర్ గ్రామం త ర్వాత వికలాంగులను కలుసుకున్నారు. దారి పక్కన చెట్ల కింద కూర్చుని ఉన్న వికలాంగుల వద్దకు వెళ్ళి వారి సమస్యలు తె లుసుకుని వాటి పరిష్కారానికి హామీ ఇచ్చారు. తాము అధికారంలోకి వస్తే 18 అంశాలతో కూడిన వికలాంగుల పాలసీని అమలు చేస్తామని, వికలాంగుల్లో ఆత్మస్థైర్యాన్ని నింపుతామని హామి ఇచ్చారు. వికలాంగుల సమస్యలు తీరేంత వరకు టీడీపీ వారికి అండగా ఉండి పోరాటం చేస్తుందని భరోసా ఇచ్చారు.

తాను ప్రసంగించిన అన్ని గ్రామాల్లో ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతులకు గుండెధైర్యం నింపేందు కు ప్రయత్నించారు. తెలంగాణ ప్రాం తంలో ముఖ్యంగా కరీంనగర్ జిల్లాలో తె లుగుదేశం ప్రభుత్వ హయాంలో అభివృ ద్ధి జరిగిందని, తన హయాంలో ఈ ప్రాం తంలో చేసిన పనులను ఏకరువు పెట్టారు. పసుపు, చెరకు అధికంగా సాగు చేసే ప్రాంతాల్లో పర్యటించిన చంద్రబాబునాయుడు ఆ రైతుల సమస్యలను తెలుసుకొని పసుపుకు 15 వేల రూపాయలు, చెరకుకు 3,500 రూపాయల ధర చెల్లించాల ని, పసుపు బోర్డును ఏర్పాటు చేసి రైతుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని డిమాండ్ చేశారు. తాము అధికారంలోకి వస్తే వీటన్నింటినీ నెరవేర్చడంతో పాటు రైతులు తీసుకున్న అప్పులను రద్దు చేస్తామని, ఆ ఫైల్‌పైనే తొలి సంతకం చేస్తానని ప్రకటించి రైతుల మద్దతును కూడగట్టుకు నే ప్రయత్నం చేశారు.

జిల్లాలో ప్రధానమై న పత్తికి కనీస మద్దతు ధర లభించకపోవడంపై చంద్రబాబు ఆందోళన వ్యక్తం చే శారు. పత్తికి మద్దతు ధర లభించేలా చూ డాలని ప్రభుత్వానికి వారం రోజుల గ డువు ఇచ్చిన చంద్రబాబు లేని పక్షంలో జ మ్మికుంటలో ధర్నా చేసి ప్రభుత్వం అంతుతేలుస్తామని హెచ్చరించారు. పత్తికి ధర లభించకపోవడంపై చంద్రబాబు అంతకు ముందే జిల్లా నేతలతో చర్చించారు. ఇప్పటికే పత్తి రైతుల కోసం దీక్ష చేయాలని నిర్ణయించుకున్న చంద్రబాబు వారంలోగా ప్రభుత్వంలో చలనం లేకపోతే కరీంనగర్ జిల్లాలోని జమ్మికుంటలోనే దీక్షకు పూనుకోవాలని నిర్ణయించారు. అలాగే మెట్‌పల్లి ప్రాంత భూములను సస్యశ్యామలం చేసే గంగనాల ప్రాజెక్టును నిర్మించేందుకు చ ర్యలు తీసుకుంటామని హామి ఇచ్చారు.

ఈ సందర్భంగా డ్వాక్రా మహిళలు చంద్రబాబుతో భేటీ అయ్యారు. పావలా వడ్డీకే రుణాలు అని చెబుతున్న ఆచరణ లో మాత్రం ఐదు రూపాయల వరకు వసూలు చేస్తున్నారని చంద్రబాబు దృష్టికి తీసుకువచ్చారు. ఇచ్చిన రుణాల్లోనూ లక్ష రూపాయల వరకు డిపాజిట్ చేసుకుంటున్నారని, టీడీపీ అధికారంలోకి వస్తేనే త మకు మేలు జరుగుతుందని మహిళలు చె ప్పగా చంద్రబాబు స్పందించారు. టీడీపీ ప్రభుత్వ హయాంలోనే మహిళా సంఘా లు ఆర్థికంగా బలోపేతమయ్యాయని గు ర్తు చేశారు. అధికారంలోకి రాగానే మహిళలకు మరింత ప్రాధాన్యత కల్పిస్తామని హామి ఇచ్చి వారిని ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. అలాగే అదే ప్రాంతానికి చెందిన ఒక సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ చంద్రబాబును కలి సి కృతజ్ఞతలు తెలిపారు. చంద్రబాబు ఐటీ రంగాన్ని ప్రోత్సహించడం వల్లే తనకు ఉ ద్యోగం లభించిందని, పూణేలో ఉద్యోగం చేస్తున్న తాను చంద్రబాబును కలిసేందు కే ఇక్కడకు వచ్చానని చెప్పగా పలువురు అతడిని అభినందించారు.

కొనసాగిన తెలం'గానం'...తెలంగాణ ప్రాంతంలో పాదయాత్ర ప్రారంభమైన నాటి నుంచి చంద్రబాబు తెలంగాణకు తాను వ్యతిరేకం కాదంటూ ప్రకటిస్తూనే ఉన్నారు. ఈ నెల 28న అఖిలపక్ష సమావేశం జరగనున్న నేపథ్యంలో చంద్రబాబు మరోమారు తెలంగాణకు వ్యతిరేకం కాదని విస్పష్టంగా చెప్పారు. కేవలం తెలుగుదేశం పార్టీని బలహీనపరచడం కోసమే కాంగ్రెస్ పార్టీ కుట్రలు, కు తంత్రాలు పన్నుతుందంటూ విరుచుకుపడిన చంద్రబాబు మరోవైపు టీఆర్ఎస్‌పై కూడా ధ్వజమెత్తారు. కరీంనగర్ ఎంపీగా కేసీఆర్ ఈ ప్రాంత అభివృద్ధికి చేసిందేమీ లేదన్నారు. ఖమ్మం జిల్లా బయ్యారం గనులను వైఎస్ తన అల్లుడికి అప్పగించేందుకు కుట్ర చేస్తే టీడీపీ అడ్డుకోగా ఆ సమయంలో కేసీఆర్ నోరు మెదపలేదంటూ విమర్శించారు. బాబ్లీ ప్రాజెక్టును అడ్డుకునేందుకు తాము ఉద్యమం నిర్వహిస్తే కేసీఆర్ కనీసం స్పందించకపోగా ఎ గతాళిగా మాట్లాడారని చంద్రబాబు మండిపడ్డారు. బీడీ కార్మికులకు కేంద్ర మంత్రిగా సాయం చేయాల్సి ఉండగా బీడీ కట్టలపై పుర్రె గుర్తును ముద్రించేలా చేశారంటూ కార్మికులను ఆకర్షించే ప్ర యత్నం చేశారు.

టీడీపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహంజిల్లాలో చంద్రబాబు తొలిరోజు పాదయాత్రకు అన్ని చోట్ల మంచి స్పందన ల భించింది. చంద్రబాబు ప్రసంగాలకు ప్ర జలు సానుకూలంగా స్పందించారు. రైతు లు, మహిళలు, వికలాంగుల సమస్యలను ప్రస్తావించిన చంద్రబాబు టీడీపీ అధికారంలోకి రాగానే వాటిని పరిష్కరిస్తామని హామి ఇచ్చారు. విద్యుత్ సమస్యను కూ డా చంద్రబాబు ప్రధానంగా ప్రస్తావించారు. సంస్కరణల ద్వారా విద్యుత్ సరఫరాను తాము మెరుగుపరిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం విద్యుత్ వ్యవస్థను నిర్వీర్యం చేసిందని మండిపడ్డారు. టీడీపీ అధికారంలోకి రాగానే వ్యవసాయ రంగానికి తొ మ్మిది గంటల పాటు నాణ్యమైన విద్యుత్ ను సరఫరా చేస్తామంటూ రైతుల్లో భ రోసా నింపే ప్రయత్నం చేశారు.

16 కి. మీ. పాటు తొలిరోజు సాగిన పాదయాత్ర విజయవంతం కావడం తెలుగుదేశం పార్టీ వర్గాల్లో ఉత్సాహాన్ని నింపింది. ఏడాది తర్వాత చంద్రబాబు జిల్లాలో పర్యటిస్తుండటంతో పకడ్బందీగా ఏర్పాట్లు చేపట్టినా తెలంగాణవాదం నేపథ్యంలో ఏం జరుగుతుందోనని ఒకింత ఆందోళనతోనే ఉన్నా రు. అయితే ఊహించిన దాని కంటే అధికంగా చంద్రబాబు పాదయాత్రకు స్పం దన రావడంతో మిగిలిన రోజుల్లో యా త్రను మరింత విజయవంతం చేసేందుకు జిల్లా నేతలు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు.

నీరా 'జనం'..............

మెట్‌పల్లి/మల్లాపూర్: ఆదిలాబాద్-కరీంనగర్ జిల్లాల సరిహద్దులోని బాదనకుర్తి వంతెన వద్ద మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నా యుడు పాదయాత్రకు ఘన స్వాగతం లభించింది. వస్తున్నా...మీకోసం కా ర్యక్రమంలో భాగంగా ఆదిలాబాద్ జిల్లాలో పర్యటనను ముగించుకొని గోదావరి నదిపై నిర్మించిన బాదనకుర్తి వంతెన మీదుగా శుక్రవారం రా త్రి 11 గంటలకు చంద్రబాబు నాయు డు కరీంనగర్ జిల్లాలోని కోరుట్ల ని యోజకవర్గం మల్లాపూర్ మండలం ఒబులాపూర్ వద్దకు చేరుకున్నారు. జిల్లాకు చేరుకున్న చంద్రబాబుకు అ పూర్వ స్వాగతం లభించింది. పార్టీ జిల్లా అధ్యక్షుడు విజయరమణారావు, ఎమ్మెల్యే గంగుల కమలాకర్, ఇనుగాల పెద్దిరెడ్డి, ఎల్ రమణ, వెంకటేశ్వర్‌రావు, గండ్ర నళిని, ఎమ్మెల్సీ నర్సారెడ్డి, మాజీ ఎమ్మెల్యే శికారి విశ్వనాథంలతో పాటు పలువురు నాయకులు పుష్పగుచ్చాలు అందించి స్వాగతం ప లికారు.

వేద పండితులు అర్చకులు మంత్రోచ్ఛారణలు చేస్తూ పూర్ణకుంభ స్వాగతం పలికి జిల్లాలోకి ఆహ్వానించారు. డప్పువాయిద్యాలు, మంగళహారతులతో బాబును ఊరేగింపుగా ఎదుర్కొన్నారు. అక్కడి నుంచి సు మారు అరకిలో మీటరు దూరం గల ఒబులాపూర్ వరకు బాబు పాదయా త్ర జరిపారు. టీడీపీ నాయకులు, కా ర్యకర్తలు, అనుబంధ సంఘాల నా యకులు, కార్యకర్తలు జేజేలు పలుకుతూ పాదయాత్రలో పాల్గొన్నారు. దారిపొడవునా పాటలు పాడుతూ...నృత్యాలు చేస్తూ పాదయాత్రలో కార్యకర్తలు హుషారుగా గడిపారు. చంద్రబాబు నాయుడు నాయకులు, కార్యకర్తలకు అభివాదాలు చేస్తూ పాదయా త్ర జరిపారు.

కార్యక్రమంలో ముద్దసాని కశ్యప్‌రెడ్డి, బుగ్గారం మాజీ ఎమ్మెల్యే శికారి విశ్వనాథం, టీడీపీ నాయకులు, టీడీపీ వేములవాడ ని యోజకవర్గ నాయకురాలు గండ్ర నళి ని, రమేశ్, రవీందర్ రావు, సాంబారి ప్రభాకర్, రఫీ, ఆర్మూర్ కిష్ట య్య, సత్యనారాయణ గౌడ్ పాల్గొన్నారు.

ఒబులాపూర్‌లో రాత్రి బస....మల్లాపూర్ మండలంలోని ఒబులాపూర్‌లో టీడీపీ అధినేత చంద్రబా బునాయుడు రాత్రి బసకు వచ్చారు. గ్రామ పంచాయతీ శివారులో గల మై దానంలో టీడీపీ నాయకులు బాబు బసకు ఏర్పాట్లు చేశారు.

మైదానంలో ఏర్పరిచిన ప్రత్యేక వాహనంలో చంద్రబాబు రాత్రి బస జరిపారు. మారుమూల మండలంలోని అటవీ ప్రాం తంలో గోదావరి సమీపాన చంద్రబా బు నాయకుడు రాత్రి బస చేయడం విశేషం. రాత్రి బసకు పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. జిల్లా ఎస్పీ రవీందర్ ఆద్వర్యంలో జగిత్యాల ఏఎస్పీ రమారాజేశ్వరీ, సీఐ దేవందర్ రెడ్డిల పర్యవేక్షణలో పోలీసులు బందోబస్తు చేశారు

బాబుకు ఘన స్వాగతం

వస్తున్నా మీ కోసం...' పాదయాత్రలో భాగంగా తెలుగుదేశం పార్టీ అ ధినేత నారా చంద్రబాబునాయుడు శుక్రవారం రాత్రి బాదనకుర్తి వంతెన మీదుగా ఆదిలాబాద్ నుంచి జిల్లాలో ప్రవేశించారు. ఓబులాపూర్ గ్రామం లో చంద్రబాబునాయుడుకు జిల్లా నేతలు ఘనంగా స్వాగతం పలికారు. 2011 డిసెంబర్ 27న రైతు పోరుబాటలో పాల్గొనేందుకు జిల్లాకు వచ్చిన చంద్రబాబునాయుడు సరిగ్గా ఏడాది తర్వాత మళ్ళీ జిల్లాకు వచ్చారు. గత సంవత్సరం డిసెంబర్‌లో చిగురుమామిడి నుంచి తిమ్మాపూర్ మండలం వరకు రైతన్నలకు మద్దతుగా పాదయాత్ర చేసిన చంద్రబాబు ఇప్పుడు జిల్లాలోని ఆరు నియోజకవర్గాల్లోని 96 గ్రామాల్లో 157 కిలోమీటర ్ల పాదయాత్ర నిర్వహించనున్నారు. పాదయాత్రలో భాగంగా జిల్లాలో పత్తిరైతులకు మద్దతుగా ఒకరోజు దీక్షను చేపట్టనున్నారు.

ఈ నెల 28న కేంద్ర హోం శాఖ మంత్రి సుశీల్‌కుమార్ షిండే స మక్షంలో జరగనున్న అఖిలపక్ష సమావేశంలో తెలుగుదేశం పార్టీ అనుసరించనున్న విధానాన్ని ఖరారు చేసేందు కు ఈ నెల 23న బాబు బస చేసిన చోటనే పొలిట్‌బ్యూరో సమావేశం కూడా జరగనున్నది. శనివారం ఉద యం మల్లాపూర్ మండలం ఓబులాపూర్ గ్రామం నుంచి పాదయాత్ర ప్రా రంభం కానున్నది. సంగెం శ్రీరాంపూర్ మీదుగా కొత్త దామ్‌రాజ్ పల్లె గ్రామానికి చేరుకొని గోదావరి నది ఒడ్డున ఉన్న ఆలయంలో నిర్వహిస్తున్న చండీ హవనంలో సతీమణి భువనేశ్వరి, కు మారుడు లోకేష్‌తో కలిసి పాల్గొంటా రు. మధ్యాహ్నం భోజన అనంతరం అక్కడ నుంచి పాతదామరాజ్‌పల్లి, మ ల్లాపూర్, గొర్రెపల్లి వరకు 16 కి.మీ. పాదయాత్ర కొనసాగిస్తారు.

మల్లాపూ ర్ మండల కేంద్రంలో బహిరంగ సభ లో చంద్రబాబునాయుడు ప్రసంగిస్తా రు. చంద్రబాబునాయుడు ఈ నెల 27వ తేదీ వరకు 12 రోజుల పాటు జిల్లాలో పర్యటిస్తారు. 15 నుంచి 18వ తేదీ వరకు చంద్రబాబునాయుడు పా దయాత్ర కార్యక్ర మ రూట్‌మ్యాప్‌ను ప్రకటించారు. పొలిట్‌బ్యూరో సమావేశం, రైతులకు మద్దతుగా దీక్ష ఏ తేదీ ల్లో ఎక్కడ నిర్వహించేది ఖరారైన తర్వాత మిగతా షెడ్యూల్‌ను ప్రకటిస్తారు.

జిల్లాలోని ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా చంద్రబాబు పాదయాత్ర నిర్వహించేందుకు వీలుగా రూట్‌మ్యాప్‌ను సిద్ధం చేస్తున్నారు. కోరుట్ల నియోజకవర్గంలో అడుగుపెట్టి జగిత్యాల, పెద్దపల్లి, చొప్పదండి, కరీంనగర్, హుజురాబాద్ సెగ్మెంట్ల మీదు గా పాదయాత్ర సాగనున్నది. టీడీపీ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నాలుగు నియోజకవర్గాల్లో పాదయాత్రను విజయవంతం చేసేందుకు స్థాని క ఎమ్మెల్యేలు ఎల్. రమణ, విజయరమణారావు, సుద్దాల దేవయ్య, గం గుల కమలాకర్, కోరుట్లలో మాజీ ఎమ్మెల్యే శికారి విశ్వనాథం, హుజురాబాద్‌లో ముద్దసాని కశ్యప్‌రెడ్డి బాధ్యతలు తీసుకున్నారు.

సాఫీగా సాగేనా...?చంద్రబాబు పాదయాత్రను అడ్డుకోవాలని టీఆర్ఎస్ నేత హరీష్‌రావు పిలుపునివ్వడం, వర్గీకరణకు అనుకూలంగా టీడీపీ నిర్ణయాన్ని నిరసిస్తూ మాలమహానాడు పలుచోట్ల చంద్రబాబును అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్న నేపథ్యంలో కరీంనగర్ జిల్లాలో పాదయాత్ర సాఫీగా సాగేనా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి ఈ నెల 28న ఢిల్లీలో అఖిలపక్ష సమావేశం జరగనుండటంతో టీడీపీ నిర్ణయం కీ లకం గా మారింది. దీంతో టీడీపీపై ఒత్తిడి పెంచేందుకు తెలంగాణవాదుల నుం చి పాదయాత్రకు ఆటంకాలు ఎదురయ్యే అవకాశం లేకపోలేదని భావిస్తున్నారు. మరోవైపు నిరసనలు ఎదురైతే దీటుగా అడ్డుకునేందుకు టీడీపీ నాయకులు కూడా సన్నాహాలు చేసుకుంటున్నారు. దీంతో చంద్రబాబు పాదయా త్ర నిర్వహణపై జిల్లాలో ఉత్కంఠ నెలకొన్నది.

భారీ బందోబస్తు ...చంద్రబాబునాయుడు పాదయా త్ర నేపథ్యంలో జిల్లాలో భారీ బందోబస్తు ఏర్పాటు చేపట్టారు. పాదయాత్రలో చంద్రబాబు వెంట బందోబస్తు బాధ్యతలను అదనపు ఎస్‌పీ జనార్ధన్‌రెడ్డికి అప్పగించారు. జగిత్యాల సబ్ డి విజన్ మీదుగా సాగే పాదయాత్ర సం దర్భంగా ఎలాంటి అవాంఛనీయ సం ఘటనలు చోటుచేసుకోకుండా చూసేందుకు జగిత్యాల ఎఎస్‌పీ రమారాజేశ్వరి ప్రత్యేక చర్యలు చేపట్టారు. మాజీ ముఖ్యమంత్రిగా చంద్రబాబుకు కేంద్ర ప్రభుత్వం జడ్ ప్లస్ కేటగిరి భద్రత క ల్పించింది. దీనితో పాటు జిల్లా పోలీ సు యంత్రాంగం నాలుగు అంచెల భద్రతను కల్పిస్తోంది.

ఆర్మ్‌డ్ రిజర్వ్ పోలీసులతో పాటు సివిల్ పోలీసులచే యాత్ర దారి పొడవునా బందోబస్తు చర్యలు చేపడుతున్నారు. పాదయాత్ర వెంట ఎప్పుడూ నాలుగు రోప్ పార్టీ లు, మూడు రోడ్ ఓపెనింగ్ పార్టీలు, చంద్రబాబు రాత్రి బస వద్ద రెండు గార్డ్స్, దారి వెంట బాంబు డిస్పోజల్, డాగ్ స్వ్కాడ్ బృందాలను నియమించారు. సుమారు 500 మంది పోలీసులను చంద్రబాబు పాదయాత్ర సందర్భంగా బందోబస్తు కోసం వినియోగిస్తున్నారు.

వస్తున్నా..మీ కోసం...

నిర్మల్/ఖానాపూర్/కడెం/మామడ/సారంగాపూర్/నిర్మల్అర్బన్: గిరిజన అసెంబ్లీ స్థానమైన ఖానాపూర్‌లో వస్తున్నా... మీకోసం చంద్రబాబు పాదయాత్రకు అడుగడుగునా జనం నీరాజనం పలికారు. జిల్లాలో బాసర వద్ద ప్రారంభమైన ఈ పాదయాత్రకు ఖానాపూర్‌లో ప్రభంజనం సృష్టించా రు. రాథోడ్ ఇలాకాగా పేరు పొందిన ఖానాపూర్ నియోజక వర్గంలో చంద్రబాబుకు ఘనస్వాగతం లభించింది. ఇప్పటి వరకు ముథోల్, నిర్మల్ నియోజక వర్గాల్లో కొనసాగిన పాదయాత్రకంటే భారీ సంఖ్యలోనే జనం తరలివచ్చి బాబుకు బ్రహ్మరథం పట్టారు. శుక్రవారం ఎక్బాల్‌పూర్ నుంచి ప్రారంభమైన చంద్రబాబు యాత్రకు గిరిజనులు, లంబాడాలు, గోండులు, మథురలు, స్థానిక యువకులు తరలివచ్చి ఘనస్వాగతం పలికారు. ఈ పాదయాత్రలో గుస్సాడీ, కోలాటం, మథురల నృత్యాలు మరింత ఆకట్టుకున్నాయి. ఎంపీ రాథోడ్ రమేష్, ఆ యన సతీమణి సుమన్‌రాథోడ్‌లు తీవ్రకృషితో దాదాపు 40 వేల మంది బహిరంగ సభకు తరలివచ్చారు. గిరిజన మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు.

జై చంద్రబాబు అంటూ యువత విక్టరీ మార్కును చూపిస్తూ చంద్రబాబును స్వాగతించారు. ఈ సందర్భంగా చంద్రబాబు గిరిజనులకు వరాల జల్లులు కురిపించారు. మైదాన ప్రాంత గిరిజనులకు సైతం ప్రత్యేక ప్యాకేజీని ప్రకటిస్తామన్నారు. రూ. 1.50 లక్షలతో గిరిజనులందరికి పక్కా గృహాలు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. అలాగే ప్రతి 500 జనాభా కలిగిన తండాలను పంచాయతీలుగా ఏర్పాటు చేస్తామని పునరుద్ఘాటించారు. దీంతో గిరిజనులు చ ప్పట్లతో చంద్రబాబుకు మద్దతు ప్రకటించారు. కనీవినీ ఎరుగని రీతిలో జిల్లాలో కొనసాగిన ఈ పాదయాత్రకు కేవలం ఖానాపూర్ నియోజక వర్గంలోనే అత్యంత ఆదరణ, ఆప్యాయత లభించినట్లు స్పష్టమవుతోంది.

ఎంపీ తనయుడు రితీష్ రాథోడ్ సైతం యువత సమీకరణలో కీలక భూమిక పోషించారు. అలాగే ఖానాపూర్‌లో పెద్దఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ ఏర్పాట్లను మాజీ సర్పంచ్ ఆకుల శ్రీనివాస్ పర్యవేక్షించారు. చివరి రోజు బాదనకుర్తి వద్ద ఘనంగా వీడ్కోలు తెలిపి బాబు పాదయాత్రను విజయవంతం చేస్తామని ఎంపీ రాథోడ్ రమేష్, ఎమ్మెల్యే సుమన్‌రాథోడ్‌లు పేర్కొన్నారు.

చంద్రబాబుకు నీరాజనం..

నిర్మల్/ఖానాపూర్/కడెం/మామడ/సారంగాపూర్/నిర్మల్అర్బన్: ఆదిలాబాద్ జిల్లాలో తొమ్మిది రోజుల పా టు కొనసాగిన చంద్రబాబు పాదయా త్ర శుక్రవారం ఖానాపూర్ నియోజక వ ర్గంలోని బాదనకుర్తి వద్ద ముగిసింది. మన జిల్లా టీడీపీ నేతలు చంద్రబాబు కు ఘనమైన వీడ్కోలును పలకగా శుక్రవారం రాత్రి కరీంనగర్ జిల్లాలో యా త్ర ప్రారంభమైన దృష్ట్యా అక్కడి నా యకులు సైతం చంద్రబాబుకు ఘనస్వాగతం పలికారు. బాసర నుంచి బా దనకుర్తి వరకు అన్నిచోట్ల చంద్రబాబు కు ప్రజలు ఘన నీరాజనం పలికారు. ఆదిలాబాద్ జిల్లా ఎంపీ రాథోడ్ రమే ష్, పార్టీ అధ్యక్షులు నగేష్, ప్రధాన కా ర్యదర్శి లోలం శ్యామ్‌సుందర్, ముథో ల్ నియోజక వర్గ ఇన్‌చార్జి నారాయణరెడ్డి, నిర్మల్ నియోజక వర్గ ఇన్‌చార్జి బా బర్, ఆదిలాబాద్ నియోజక వర్గ ఇన్‌చార్జి పాయల శంకర్ తదితరులు బా సర నుంచి బాబు వెన్నంటే ఉండి బాదనకుర్తి వరకు పాదయాత్రను జయప్ర దం చేసి శుక్రవారం రాత్రి వీడ్కోలు ప లికారు.

కాగా భాజా భజంత్రీల మధ్య, టపాసుల మోతలో జై తెలుగుదేశం అంటూ స్వాగత నినాదాలతో కరీంనగర్ జిల్లా సరిహద్దులో కరీంనగర్ ఎ మ్మెల్యే గంగుల కమలాకర్, జగిత్యాల ఎమ్మెల్యే ఎల్.రమణల ఆధ్వర్యంలో భారీ సంఖ్యలో టీడీపీ కార్యకర్తలు తరలివచ్చి చంద్రబాబుకు ఘన స్వాగతం పలికారు.వస్తున్నా మీకోసం పాదయాత్రను విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరు తాము కృషి చేస్తామన్న దృఢ సంకల్పంతో టీడీపీ అధినేత చంద్రబా బు నాయుడికి ఎదురేగి స్వాగతం పలికారు. ఆదిలాబాద్ జిల్లాలో చంద్రబాబు పాదయాత్ర విజయవంతమైనందుకు జిల్లా నేతలు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు.

సదర్‌మాట్‌పై మినీ బ్యారేజీ నిర్మిస్తాం.. ఖానాపూర్ మండలంలోని సదర్‌మాట్‌పై మినీ బ్యారేజి నిర్మించేందుకు కృషి చేస్తానని, ఇది చాలా చిన్న పని అని, బార్యేజి మంజూరైన పని చేయించలేకపోతున్నారని టీడీపీ అధినేత చం ద్రబాబునాయుడు అన్నారు. ఖా నాపూర్ మండలం బాదనకుర్తి గ్రామం లో జరిగిన కార్యక్రమంలో రాత్రి 10 గంటలకు జరిగిన కార్యక్రమంలో మా ట్లాడారు. బ్యారేజి నిర్మించడం వలన రైతుల కష్టాలు గట్టెక్కుతాయిని, రెండు మండలాల రైతులకు మేలు చేకూరుతుందని అన్నారు.

కాంగ్రెస్ హయం లో చేయలేని పని బాదనకుర్తి వద్ద వం తెన నిర్మింపచేయించిన ఘనత టీడీపీదేనన్నారు. ఎంపీ రాథోడ్ రమేష్ బాదనకుర్తి బాధల గురించి తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చెప్పడం జరిగిందని, బాదనకుర్తి గ్రామం గోదావరి న ది రెండు పాయల మధ్య ఉండడంతో బాహ్యప్రపంచానికి దూరంగా ఉన్నార ని, వంతెన కావడం వల్ల ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాలు దగ్గరవ్వడమే కా కుండా రవాణ సౌకర్యం పెరిగి అభివృ ద్ధి త్వరితగతిన జరిగిందని చెప్పారు. గ్రామస్థుల కోరిక మేరకు పదవ తరగ తి అప్‌గ్రేడ్ అయ్యే విధంగా చూస్తానని హామీ ఇచ్చారు. పాదయాత్ర లో తాను చేసిన పనులను గుర్తుపెట్టుకొని మహిళలు స్వాగతించడం జీవితంలో మర్చిపోనని గుర్తు పెట్టుకుంటానని చెప్పా రు. గ్రామాలకు రహదారి ఏర్పడితే నా గరికత పెరుగుతుందని, ప్రజల్లో చైత న్యం వస్తుందని అన్నారు. కార్యక్రమం లో ఎంపీ రాథోడ్ రమేష్, బాదనకుర్తి మాజీ ఎంపీటీసీ గుడాల రాజన్న, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

మృతుడి కుటుంబానికి రూ. 2 లక్షలు ఇస్తా.. వస్తున్న మీకోసం పాదయాత్రలో భాగంగా ఖానాపూర్ పట్టణంలో నిర్వహించే పాదయాత్రకు వస్తున్న జాదవ్ విలాస్ నాయక్ మృతిచెందిన బాధిత కుటుంబానికి రూ. 2 లక్షలు ఇస్తానని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. ఈ సందర్భంగా బాదనకుర్తి లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆ యన మాట్లాడుతూ తన పాదయాత్ర కు వస్తూ ప్రైవేట్ బస్సు ఢీకొని మృతిచెందిన మృతుడికి కుటుంబానికి ప్ర గాఢ సంతాపం వ్యక్తం చేశారు. రాథోడ్‌ను అభినందించిన లోకేష్ ఖానాపూర్ మండలంలో శుక్రవా రం జరిగిన వస్తున్నా... మీకోసం పాదయాత్రలో చంద్రబాబునాయుడు శుక్రవారం రోజు దిగ్విజయంగా కొనసాగడంతో బాబు తనయుడు లోకేష్ ఎంపీ రాథోడ్ రమేష్‌ను అభినందించారు. మండలంలో, జిల్లాలో పాదయాత్ర ఎ లాంటి ఆటంకాలు లేకుండా కొనసాగ డం అభినందనీయమన్నారు. చివరగా బాదనకుర్తి నుంచి కరీంనగర్ జిల్లా ఓ బుళపురంకు ప్రవేశించిన పాదయాత్ర రాత్రి 10.30 గంటలకు లోకేష్‌బాబు రాథోడ్ రమేష్‌ను కలిసి అభినందించి ఆనందం వ్యక్తం చేశారు.

చంద్రబాబుకు ఘనంగా వీడ్కోలు.


నిర్మల్/ఖానాపూర్/మామడ/కడెం/సారంగాపూర్/నిర్మల్అర్బన్: టీ డీపీ అధికారంలోకి వస్తే మంచిర్యాల ను జిల్లాగా ఏర్పాటు చేస్తానని ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నా రు. శుక్రవారం రాత్రి వస్తున్నా ... మీకో సం పాదయాత్రలో భాగంగా ఖానాపూర్ పట్టణంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. జి ల్లాను అంచలంచెలుగా అభివృద్ధి చేసి న ఘనత టీడీపీకే దక్కుతుందన్నారు. నిర్మల్ కొయ్యబొమ్మల కళాకారులకు ఆదరణ కరువైందని, నిర్మల్ కొయ్యబొమ్మల కళాకారులను అన్ని విధాల ఆదుకుంటామన్నారు. బీడీ కార్మికుల సమస్యల పరిష్కారిస్తూ, వారి సౌకర్యార్థం నిర్మల్ పట్టణంలో పీఎఫ్ కార్యాలయా న్ని ఏర్పాటు చేస్తామన్నారు. కేసీఆర్‌కు తెలంగాణలోని ప్రజల సమస్యలు పట్టవని, కేవలం ఫౌంహౌస్‌లో కుంభకర్ణుడిలా నిద్రపోవడానికే పరిమితమై ఆరు నెలలకోసారి లేస్తాడని విమర్శించారు. కేసీఆర్ కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా పనిచేసినప్పుడు బీడీ కార్మికుల పొట్ట లు కొట్టడానికి బీడీ కట్టలపై పుర్రె గు ర్తు, శవం గుర్తును ముద్రించి బీడీ కార్మికులకు తీరని అన్యాయం చేశాడని పే ర్కొన్నారు.

సామాజిక న్యాయం అం టూ సామాజిక ద్రోహం చేసి మంత్రి పదవి కోసమే చిరంజీవి కాంగ్రెస్‌లో వి లీనమయ్యారన్నారు. డ్వాక్రా మహిళలకు రుణాలు మాఫీ చేస్తామన్నారు. తె లంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం తాము ఎప్పుడూ కట్టుబడి ఉన్నామని, కేంద్ర ప్రభుత్వానికి లేఖను సైతం సమర్పించామని గుర్తుచేశారు. ఈ కార్యక్రమం లో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే మాండవ వెంకటేశ్వర్‌రావు, జిల్లా ఎం ప రాథోడ్ రమేష్, జిల్లా అధ్యక్షుడు గె డం నగేష్, జిల్లా ప్రధాన కార్యదర్శులు లోలం శ్యామ్‌సుందర్, అబ్దుల్‌కలాం, మాజీ జిల్లా అధ్యక్షుడు అరిగెల నాగేశ్వర్‌రావు, మాజీ ఎమ్మెల్యే పాటి సుభద్ర, చంద్రబాబు తనయుడు లోకేష్, నా యకులు భూషణ్‌రెడ్డి, రితీష్‌రాథోడ్ ని ర్మల్, ముథోల్, ఆదిలాబాద్ నియోజక వర్గ ఇన్‌చార్జిలు బాబర్, నగర్ నారాయణరెడ్డి, శంకర్, స్థానిక మాజీ స ర్పంచ్ శ్రీనివాస్, మాజీ జడ్పీటీసీ రా మునాయక్, మాజీ ఎంపీపీ సల్ల రామేశ్వర్‌రెడ్డి, నాయకులు రాజేంధర్, టీడీ పీ మండల పార్టీ అధ్యక్షులు వెంకగౌడ్, రాజు, గంగన్న, ప్రదీప్ ఉన్నారు.

పాదయాత్రకు తరలివచ్చిన ప్రజలు..ఖానాపూర్ పట్టణంలో శుక్రవారం నిర్వహించిన చంద్రబాబు పాదయాత్ర కు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఖానాపూర్ పట్టణంతో పాటు చుట్టు ప్రక్కల ప్రాంతాల నుంచి భారీగా ప్రజలు తరలివచ్చి చంద్రబాబుకు ఘన స్వాగతం పలికారు. జిల్లాను విడిచి వెళ్లాలంటే ాధగా ఉంది..ఆదిలాబాద్ జిల్లాను విడిచి వెళ్లాలంటే తనకు ఎంతో బాధగా ఉందని చంద్రబాబునాయుడు అన్నారు. శుక్రవారం రాత్రి నిర్వహించిన బహిరంగ సభలో ఆదిలాబాద్ జిల్లాలో మరో నా లు కిలో మీటర్లు దూరంలో పాదయాత్రను ముగించుకొని కరీంనగర్ వెళ్తున్న సందర్భంగా ఆయన ఈ విధంగా మా ట్లాడారు.

తాను తొమ్మిది రోజుల పాదయాత్రలో బాసర నుంచి మొదలైన పా దయాత్ర చివరన ఖానాపూర్ మం డలం బాదనకుర్తి వద్ద ముగుస్తుందని, ఈ జిల్లాను మరిచిపోనన్నారు. ముస్లింల సమస్యలపరిష్కారం కోసం కృషి చేస్తా...ముస్లిం మైనార్టీల సమస్యల పరిష్కారం కృషి చేస్తానని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. శుక్రవారం ఖానాపూర్ పట్టణంలోని మదర్సాలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చంద్ర బాబు నాయుడు మాట్లాడారు. ముస్లింలకు ప్రత్యేక బడ్జెట్ కేటాయించి ఆర్థిక, విద్య, రాజకీయంగా అన్నింట్లో ప్రాధాన్యత కల్పిస్తానన్నారు.

పార్టీకి ప్రాణం పోసిన 'బాబు' పాదయాత్ర..!నిర్మల్: వస్తున్నా... మీకోసం పేరిట చంద్రబాబునాయుడు నిర్వహించిన పాదయాత్ర తెలుగుదేశం పార్టీకి ప్రా ణం పోసింది. గత కొద్ది రోజుల నుం చి సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న తెలుగుదేశం పార్టీకి బాబు పాదయాత్ర ద్వా రా కొత్త జవసత్వాలు నిండాయంటున్నారు. నేటితో పాదయాత్ర ముగుస్తుండడంతో మొదటి నుంచి తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉన్న ఈ ప్రాంతం గత ఐదేళ్ల నుంచి ప్రతికూలతను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. 2009 ఎన్నికల్లో జిల్లాలోని 10 అసెంబ్లీ స్థా నాలకు గాను మిత్రపక్షాలతో కలిసి తొ మ్మిది స్థానాలు గెలుచుకున్న టీడీపీ క్ర మంగా తెలంగాణ వాదంతో పాటు పా ర్టీ నుంచి నేతల నిష్క్రమణలాంటి అం శాలతో సంక్షోభానికి గురవుతూ వస్తున్నది.

దీంతో పాటు ఆ పార్టీకి చెందిన ముథోల్ ఎమ్మెల్యే వేణుగోపాలచారి పా ర్టీని వీడి అధినేత చంద్రబాబును విమర్శించడం, ఈయనతో పాటు నిర్మల్ కు చెందిన సత్యనారాయణగౌడ్ తదితర సీనియర్ నేతలంతా టీఆర్ఎస్‌లో చేరడంలాంటి పరిణామాలన్ని టీడీపీ కొంత మేరకు బలహీనపడేందుకు దో హదపడ్డాయి. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో దేశం అధినేత చంద్రబాబు నాయుడు వస్తున్నా.. మీకోసం పేరిట నిర్వహించిన పాదయాత్రకు జనం బ్ర హ్మరథం పట్టారు. బాసర నుంచి బాదనకుర్తి వరకు ఆయా మూడు నియోజ క వర్గాల్లో పాదయాత్రలు నిర్వహించి పార్టీకి ప్రాణం పోశారు. జిల్లాలోని అ న్ని నియోజక వర్గాల నుంచి టీడీపీ కా ర్యకర్తలు పెద్ద సంఖ్యలో ఆయన పాదయాత్రలో పాల్గొన్నారు. ప్రతిపల్లెలో ప్రజలు చంద్రబాబునాయుడుకు ఘ నంగా స్వాగతం పలికి ఆయనను ఆదరించారు. తెలుగుదేశం అధికారంలోకి రాగానే అమలుచేసే కార్యక్రమాలను ఆయన హామీల రూపంలో వివరించా రు.

చివరి రోజైన శుక్రవారం ఆయన గి రిజన నియోజక వర్గమైన ఖానాపూర్ లో పాదయాత్ర నిర్వహించి ప్రజలతో మమేకమయ్యారు. పది రోజుల పాటు చంద్రబాబు నిర్వహించిన పాదయాత్ర తో తెలుగుదేశం పార్టీ నాయకులు, కా ర్యకర్తల్లో సమరోత్సాహం నెలకొంది. చంద్రబాబు నాయుడు ఖానాపూర్ నుంచి బాదనకుర్తి మీదుగా కరీంనగర్ జిల్లా మెట్‌పల్లి నియోజక వర్గంలోకి రాత్రి ప్రవేశించారు.

మంచిర్యాలను జిల్లాగా ఏర్పాటు చేస్తా

నిర్మల్/ఖానాపూర్: తండ్రులు చేస్తున్న పాదయాత్రకు తనయులు బాసటగా నిలిచి పాదయాత్రలో పాల్గొనడంతో చంద్రబాబు పాదయాత్రకు మరింత వన్నె తెచ్చింది. వస్తున్నా.. మీకోసం పాదయాత్రలో చంద్రబాబుతో పాటు ఎంపీ రాథోడ్ రమేష్ పాదయాత్రను నిర్వహిస్తున్నారు. కాగా శుక్రవారం చంద్రబాబు తనయుడు లోకేష్, ఎంపీ రాథోడ్ రమేష్ తనయుడు రితీష్‌లు పాదయాత్రలో పా ల్గొని ఆకర్షణగా నిలిచారు. గురువారం రాత్రి ఖానాపూర్ మండలంలోని ఎక్బాల్‌పూర్ వద్ద బస చేసిన చంద్రబాబును ఆయన తనయుడు లోకేష్ శుక్రవారం ఉదయమే వచ్చి కలిశారు. తండ్రి చేస్తున్న పాదయాత్ర, యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం తన తండ్రి చంద్రబాబు పాదయాత్ర ప్రారంభం కాగా తనయుడు లోకేష్ తండ్రి వెన్నంటే ఉండి పాదయాత్రను కొనసాగించాడు. టీడీపీ రాష్ట్ర యువ నేత లోకేష్ రావడంతో జిల్లా తెలుగు యువత మరింత ఉత్సాహంతో పాల్గొనడానికి తరలివచ్చారు.

దీంట్లో ఎంపీ రాథోడ్ రమేష్ తనయుడు రితీష్ నేతృత్వం వహిస్తూ యువతను పాదయాత్రలో కదిలించాడు. వీరిద్దరితో పాటు మరికొంత మంది యువకులు ఈ పాదయాత్రలో పాల్గొన్నారు. ం లోకేష్‌కు ఘనస్వాగతం... ఖానాపూర్ మండల కేంద్రంలో చంద్రబాబు నాయుడు బస చేసిన స్థలానికి ఉదయం 8.40కి లోకేష్ చేరుకున్నారు. అనంతరం మండల కేంద్రం నుంచి తరలివచ్చిన పార్టీ నాయకులు, యువకులు ఆయనను కలిసేందుకు పోటీ పడ్డారు. లోకేష్‌బాబు తన తండ్రితో పాటు పాదయాత్రలో పాల్గొన్నారు. యువకులు లోకేష్‌బాబు రాజకీయాల్లోకి రావాలని నినాదాలు చే శారు. ఎక్బాల్‌పూర్‌లో జరిగిన ఇష్టగోష్టి సభలో చంద్రబాబునాయుడు, మిగతా నాయకులు స్టేజిపై కూర్చోని మాట్లాడగా లోకేష్‌బాబు మాత్రం పక్కనే నిలబడి ఆసక్తిగా విన్నారు.

ఇటు తండ్రులు..అటు తనయులు

భారతదేశం అభివృద్ధి పథంలో పయనించాలంటే మొట్ట మొదటగా అవినీతి ని ర్మూలన జరుగాలని పాదయాత్రలో చంద్రబాబు పేర్కొన్నారు. ఖానాపూర్ మండలంలోని మంచిర్యాల చౌరస్తా వద్ద విద్యార్థులు, యువకులతో ముఖాముఖి నిర్వహించారు...
చంద్రబాబు: అవినీతి నిర్మూనల జ రగాలంటే మొట్టమొదలు ఏం చేయాలి చెప్పండి.

విద్యార్థి: ఎక్కడికెళ్లినా డబ్బులివ్వని దే అధికారులు పనిచేయటం లేదు. అ వినీతి బాగా పెరిగింది. అవినీతి తగ్గాలంటే మీరు అధికారంలోకి రావాలి.చంద్రబాబు: టీడీపీ హయంలో అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి చూపించాను. దేశం అవినీతి రహిత దేశమైతే పేదల జీవితాల్లో వెలుగులు నిండుతాయి. విద్యార్థులు, యువకులు అవినీతిని ప్రోత్సహించకుండా తిరగబడితే సాధ్యమవుతుంది.

సలీమ్‌ఖాన్ యువకుడు: సార్ ప్రస్తుతం రాష్ట్రం తండ్రిలేని బిడ్డగా ఉం ది. మాకు సుస్థిర పరిపాలన కావాలి.

చంద్రబాబు: నిజమే మనం కూడా కృషి చేయాల్సిన అవసరం ఉంది. మన దేశంలో యువకులు, పిల్లలు ఎక్కువ గా ఉన్నారు. 25.2 శాతం సరాసరి వ యస్సు భారతదేశంలో ఉండగా, చైనా దేశంలో 37 సంవత్సరాల సరాసరి వయస్సు ఉందని, మరో 20 ఏళ్లలో వారు మరింత అభివృద్ధి చెందుతారని, మనదేశం ముందుకు వెళ్లాలంటే ప్రమాదమైన అవినీతిని ఎదుర్కోవాలి.

విద్యార్థి: మీరు గెలిచిన తరువాత కాంగ్రెస్ వారిలాగా చేస్తే ఎలా మరీ.చంద్రబాబు: ఎన్నో అభివృద్ధి పనులు చేశాను. అప్పటికీ ఇంకా నువ్వు పుట్టలేదు. చెప్పింది చేసి చూపిస్తాను. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఇంటి పైకప్పులు కూడా ఉండవు. ఉద్యోగాలు రావు. రాజీవ్ యువశక్తి తుంగలో తొ క్కారు. ఒక్క వైఎస్.జగన్‌మోహన్ రెడ్డి వేయి లారీల డబ్బులు దోచుకు తి న్నా డు. అందులో ఒక్కలారీ ఖానాపూర్‌కు ఇస్తే అందరూ ధనవంతులవుతారు.విద్యార్థి: సార్ మీరు అధికారంలోకి వచ్చిన తరువాత విద్యార్థుల సమస్య లు పరిష్కరిస్తారా..స్కాలర్‌షిప్ ఇస్తారా.చంద్రాబు: గతంలో మాదిరిగానే కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యతో పాటు స్కాలర్ షిప్..రీఈంబర్స్‌మెంట్ ఇచ్చి చదివిస్తాం. ఉద్యోగాలు కల్పిస్తాం.

అవినీతిని రూపుమాపుతేనే పేదరికం అంతం..

 ఆదివాసీల జిల్లా అయినా ఆదిలాబాద్‌ను అ న్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని టీడీపీ ఆధినేత నారాచంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. జిల్లాలోని ఎక్బాల్‌పూ ర్, ఖానాపూర్ క్రాస్ రోడ్, ఖానాపూర్, సుల్జాపూర్, బాదనకుర్తి వరకు 15.7 కి. మీటర్లు శుక్రవారం పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ జిల్లాలో గోండు, కో లాం, ప్రధాన్, లంబాడ, నాయక్‌పోడ్ తదితర గిరిజనులు 20శాతం ఉన్నారని, వీరి అభివృద్ధికి చర్యలు చేపడుతామన్నారు. జిల్లాను యూనిట్‌గా తీసుకొని కార్యక్రమాలు చేపడుతామని చంద్రబాబు పేర్కొన్నారు. గిరిజనుల కు ఉద్యోగాల్లో, స్థానిక సంస్థల్లో, చట్టసభల్లో 20శాతం రిజర్వేషన్లు ఇచ్చేలా చర్యలు చేపడుతానన్నారు. 5వందల మంది గిరిజనులు ఉన్న గూడాలు, తండాలను పంచాయతీలుగా ఏర్పా టు చేస్తామని ఆయన చెప్పారు. గిరిజ న విద్యార్థులకు కేజీ, పీజీ వరకు ఉచిత విద్యతో పాటు రూ.లక్ష50వేలతో ఉచితంగా ఇళ్లు నిర్మించి ఇస్తామన్నారు.

భూమి లేని ఆదివాసీలకు రెండు ఎకరాల భూమి ఇస్తానని, గిరిజనుల ఆడ పిల్ల పెళ్లికి రూ.50వేలు ఇస్తామన్నారు. జనాభా ప్రతిపాదికన నామినేటెడ్ పదవులను ఇవ్వడంతో పాటు గిరిజనులకు ప్రత్యేక యూనివర్సిటీని ఏర్పాటు చేయిస్తానన్నారు. గిరిజన ఆలయాల్లో పూజలు చేసే పూజారులకు రూ. 5వేల వేతనాన్ని ఇప్పిస్తామన్నారు. అడవులను నమ్ముకొని జీవిస్తున్న ఆదివాసీలకు అటవీ సంపద పై హక్కు కలిపించేలా కృషి చేస్తానన్నారు. గిరిజనులు సాగు చేసుకుంటున్న అటవీ భూముల కు పట్టాలు ఇప్పిస్తానని చెప్పారు. మైదాన ప్రాంతంలోని గిరిజనుల కోసం ప్రత్యేకంగా ఐటీడీఏ ఏర్పాటు చేసి విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు.

జిల్లాలోని గూడాలు, తండాల్లో నివసిస్తున్న గిరిజనులకు గోదావరి జలాల ను అందిస్తామన్నారు. కొమురంభీం పుట్టిన ఆదిలాబాద్ జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని ఆయన చెప్పారు. టీడీపీ పాలనలో గిరిజనుల కోసం పలు అభివృద్ధి కార్యక్రమాలు చే పట్టామన్నారు. అన్ని గ్రామాలకు కరెంట్ సౌకర్యంతో పాటు మండల కేం ద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ను ఏర్పాటు చేయించామని ఆయన చె ప్పారు. ప్ర«ధానంగా, విద్య, వైద్య, రోడ్లు ఇలాంటి సౌకర్యాలు కల్పించామన్నారు. టీడీపీ హయాంలోనే ఐటీడీఏలను ఏర్పాటు చేశామని ఆయన అన్నారు.ఆదిలాబాద్ జిల్లా వైశాల్యంలో పెద్దదని అందువల్ల మంచిర్యాలను జి ల్లా కేంద్రంగా ఏర్పాటు చేయిస్తానన్నా రు. జిల్లాలోని వ్యవసాయ ఆధార పరిశ్రమలను ఏర్పాటు చేసి, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు.

ఆదిలాబా ద్- అర్మూర్ రైల్వే లైన్ నిర్మాణానికి కృ షి చేస్తానన్నారు. నిర్మల్‌లో బీడీ కార్మికుల కోసం ఫీఎస్ కార్యాలయాన్ని, ఈఎస్ఐ ఆసుపత్రిని ఏర్పాటు చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. 9 రోజుల పా దయాత్రలో జిల్లాలో తనకు ప్రజలు అపూర్వస్వాగతం పలికారని అన్నారు. తన పాదయాత్రకు వచ్చిన జనాన్ని చూస్తే తనకు ఎంతో సంతోషం కలిగిందని, ఆదిలాబాద్ జిల్లా టీడీపీకి కంచుకోటగా ఉంది అనడంలో ఎలాంటి సం దేహం లేదన్నారు. టీడీపీని ఆదరించాలని, అధికారంలోకి వచ్చాక ప్రజల కష్టాలను తీరుస్తానన్నారు. సమావేశా ల్లో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు, ఆదిలాబాద్ ఎంపీ రాథోడ్ రమేశ్, టీడీ పీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే జి నగేష్, టీడీపీ నాయకులు పాయల శంకర్, రితీష్‌రాథోడ్, యూనిస్ అక్బానీ, గిమ్మ సంతోష్, లోలం శ్యాంసుందర్, బాబ ర్, రాష్ట్ర పరిశీలకుడు అర్షపల్లిత వి ద్యాసాగర్, శ్రీశైలం, కోటేశ్వర్‌రావు, గణే ష్‌రెడ్డి, రాజిరెడ్డిలు, కడెం మాజీ ఎం పీపీ రాజేశ్వర్‌గౌడ్ పాల్గొన్నార

బహిరంగ సభకుతరలివచ్చిన జనం..ఖానాపూర్‌లో నిర్వహించిన చంద్రబాబు బహిరంగ సభకు వేలాది మంది తరలివచ్చారు. ఆదిలాబాద్ ఎంపీ రా థోడ్ రమేశ్, ఎమ్మెల్యే సుమన్‌రాథోడ్, రితీష్ రాథోడ్‌లు భారీ జన సమీకరణ చేశారు. ఖానాపూర్ క్రాస్ రోడ్డు నుంచి ఖానాపూర్ వరకు రోడ్డంత జనంతో కిక్కిరిసి పోయింది. చంద్రబాబు నా యకుడుకు గుస్సాడీ, లంబాడా నృ త్యాలతో, బణా సంచా పేల్చి ఘనంగా స్వాగతం పలికారు. సభకు పెద్ద ఎత్తున జనం రావడంతో ఖానాపూర్‌లోని ప్ర ధాన కూడళ్ల కిక్కిరిసిపోయాయి.

ం ముగిసిన పాదయాత్ర..ఆదిలాబాద్ జిల్లాలో 6నప్రారంభమైన చంద్రబాబు పాదయాత్ర శుక్రవా రం రాత్రి ముగిసింది. ఈ నెల 5న రా త్రి నిజామాబాద్ జిల్లా నుంచి చంద్రబాబు పాదయాత్ర బాసరకు చేరుకుం ది. జిల్లాలోని ముథోల్, నిర్మల్, ఖానాపూర్ నియోజక వర్గాల మీదుగా వందలాది గ్రామాల మీదుగా 9రోజుల పా టు పాదయాత్ర సాగింది.

9 రోజుల పా టు పాదయాత్ర చేపట్టిన చంద్రబాబు నాయుడుకు ఆదిలాబాద్ ఎంపీ రమేశ్ రాథోడ్, బోథ్ ఎమ్మెల్యే నగేష్, ఖానాపూర్ ఎమ్మెల్యే సుమన్ రాథోడ్‌ల ఆధ్వర్యంలో వేలాది మంది కార్యకర్తలు ఘ నంగా స్వాగతం పలికారు. చంద్రబాబు నాయుడు జిల్లాలో 146.5 కి లో మీటర్లు పాదయాత్ర నిర్వహించి క రీంనగర్ జిల్లా ఓబులాపురానికి శుక్రవారం రాత్రి చేరుకున్నారు. శనివారం నుంచి కరీంనగర్ జిల్లాలో పాదయాత్ర నిర్వహించనున్నారు.

ఆదివాసీల అభివృద్ధికి కృషి,తండాలను పంచాయతీలుగా ఏర్పా టు