December 14, 2012

ఆదిలాబాద్ జిల్లాలో తొమ్మిది రోజులూ తొమ్మిది గంటల్లా గడిచిపోయాయి. ప్రతి పట్టణం, పల్లె, గూడెం ఎంతో అభిమానంతో నన్ను ఆదరించాయి. నిర్మల్, ఖానాపూర్ నియోజకవర్గాల్లో ఎక్కువభాగం గిరిజన ఆవాసాలే. నా జీవితంలో మరవలేనంత ప్రేమను ఇక్కడి ఆదివాసీలు అందించారు. కల్లాకపటం లేని మనసు వీళ్లది. అది మరిచిపోలేను. ప్రతి చోటా సంప్రదాయ నృత్యాలు, సంగీత వాయిద్యాలతో నాకు ఎదురొచ్చి స్వాగతం పలికారు. ఆప్యాయంగా పలకరించి తమ గూడేలకు తోడ్కొని వెళ్లారు.

వారిలో నా పట్ల ఉన్న అభిమానం కదిలించేసింది. ఇంత ఆధునిక ప్రపంచంలోనూ కుళ్లూకుతంత్రాలూ లేకుండా జీవిస్తున్న జాతి వీళ్లది. కష్టపడి పొట్టపోసుకుంటారు. ఇవ్వడమే గానీ తీసుకోవడం, నోరు తెరిచి అడగడం తెలియని మనుషులు. పాలకుడిగా నేను ఆదివాసీల గురించి ఎక్కువగా పట్టించుకోవడానికి కారణమిదే. వాళ్ల జీవితాల్లో వెలుగు కోసం నా హయాంలో ఈ జిల్లా నుంచే 'వెలుగు' ప్రాజెక్టు ప్రారంభించాను.ఆదివాసీ గిరిజనుల కోసం ఐటీడీఏ పెట్టి సంప్రదాయ ఉత్పత్తులకు మార్కెట్ కల్పించాం. ఆదిలాబాద్‌లో తిరుగుతున్నప్పుడు..మైదాన ఆదివాసీల కోసమూ అలాంటి సంస్థ ఒకటి అవసరమనిపిస్తోంది.

డెంగ్యూ, మలేరియా వంటి విష జ్వరాలు వాళ్ల జీవితాలను కబళిస్తున్నాయి. ఆరోగ్యశ్రీ వారి అక్కరకు రావడం లేదు. నా హయాంలో ప్రారంభించిన ప్రాథమిక ఆ రోగ్య కేంద్రాలే దిక్కులా ఉన్నాయి.ఈ మనుషులనిలా అడవికి వదిలేసినవాళ్లు పాలకులా? రాక్షసులా? గిరిజనుల పిల్లలు మాణిక్యాలు. చదువుకునే అవకాశం కల్పిస్తే అద్భుతాలు చేయగల చురుకుదనం వాళ్లలో చూశాను. ఖానాపూర్ క్రాస్‌లో యువతతో మాట్లాడినప్పుడు..అవినీతిపై వారి అవగాహన ముచ్చటేసింది. అక్కడి నుంచి కొంచెం ముందుకు వచ్చాక డ్వాక్రా మహిళలు కలిశారు. "సార్. .నువ్వు మా కోసం పెడతానన్న పథకాలు, మాఫీ హామీలు, డిక్లరేషన్లే బతుకుపై తిరిగి తీపిని పుట్టిసు ్తన్నాయి'' అని ఆ మహిళలు చెబుతున్నప్పుడు, ఈ మాత్రం నమ్మకం ఇస్తే ఎన్ని వేల మైళ్లయినా నడిచేయొచ్చనిపించింది.

వారి నమ్మకమే నడిపిస్తోంది:చంద్రబాబు

కేసీఆర్.. ఓ కుంభకర్ణుడు
దొంగ నాటకాలాడుతున్నాడు
ఆదిలాబాద్‌లో ముగిసిన పాదయాత్రలో బాబు ధ్వజం

ఆదిలాబాద్, డిసెంబర్ 14"కుంభకర్ణుడిలా నిద్రపోతాడు. నిద్ర లేచిన తర్వాత మభ్యపెట్టేలా ప్రకటనలు చేస్తాడు. దొంగ నాటకాలాడతాడు'' అంటూ టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్‌పై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు మండి పడ్డారు. కాంగ్రెస్ రాక్షస పాలనలో రాష్ట్ర ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదిలాబాద్ జిల్లా విస్తీర్ణంలో చాలా పెద్దదని, జిల్లా వాసుల సౌకర్యార్థం మంచిర్యాలను ప్రత్యేక జిల్లాగా అభివృద్ధి చేస్తామని చెప్పారు.

ఆదిలాబాద్ జిల్లాలో చివరి రోజైన శుక్రవారం ఖానాపూర్ నియోజక వర్గం పరిధిలోని ఎక్బాల్‌పూర్ నుంచి ఆయన పాదయాత్ర ప్రారంభించారు. ఖానాపూర్ క్రాస్ రోడ్, ఖానాపూర్, సుర్జాపూర్, బాదనకుర్తి వరకు 15.7 కిలో మీటర్లు నడిచి కరీంనగర్ సరిహద్దు గ్రామాలకు చేరుకున్నారు. అంతకుముందు.. వేలాది మంది జనం ఖానాపూర్ నియోజకవర్గంలో చంద్రబాబుకు ఘన స్వాగతం పలికారు. గుస్సాడీ, లంబాడి నృత్యాలతో, కోలాటాలు, మేళా వాయిద్యాలతో, డప్పు చప్పుళ్లతో బాణసంచా పేల్చి తమ సంతోషం ప్రకటించుకున్నారు.

అనంతరం పొలాల్లోని రైతులను, కూలీలను, కార్మికులను, పల్లె ప్రజలను పలకరించి వారి కష్టాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఖానాపూర్‌లో నిర్వహించిన భారీ బహిరంగ సభలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై చెలరేగిపోయారు. టీఆర్ఎస్‌తో ఏం కాదని, వారు ప్రజల గురించి ఏం పట్టించుకోరని దుయ్యబట్టారు. గతంలోగానీ, ప్రస్తుతం, భవిష్యత్‌లోగానీ తెలంగాణకు టీడీపీ వ్యతిరేకం కాదని, ప్రజల మనోభావాలకు అనుగుణంగానే పార్టీ నడుచుకుంటుందని పునరుద్ఘాటించారు. అయినా తమ పార్టీని దెబ్బతీసేందుకు కాంగ్రెస్ ఇతర పార్టీలతో కలిసి కుట్ర పన్నుతోందని ఆరోపించారు. జగన్ లక్ష కోట్ల రూపాయలు దోచుకున్నారని, ఆ సొమ్ముతో జైలు నుంచే రాజకీయాలు చేస్తున్నాడని విమర్శించారు. ఆయనపై కేసు ఎత్తివేస్తే కాంగ్రెస్‌లో వైసీపీ విలీనమవుతుందన్నారు.

"గిరిజనులు సాగు చేసుకుంటున్న అటవీ భూములపై వారికే హక్కు ఉండాలి. అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ పని చేస్తాం. అటవీ భూముల పట్టాలు గిరిజనులకు ఇస్తాం. మైదాన ప్రాంతంలో ఉన్న గిరిజనులకు ప్రత్యేకంగా ఐటీడీఏను ఏర్పాటు చేస్తాం. జిల్లాలో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటుచేస్తాం. విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పిస్తాం'' అని చెప్పారు. నిరుద్యోగులకు భృతి కల్పిస్తామని హామీ ఇచ్చారు.

ఇదిలాఉండగా, శుక్రవారం నాటి పాదయాత్రలో చంద్రబాబు తనయుడు లోకేశ్ ప్రధాన ఆకర్షణగా నిలిచారు. శుక్రవారంతో ఆదిలాబాద్ జిల్లాలో తొమ్మిదిరోజుల పాదయాత్ర ముగిసింది. జిల్లాలోని ముథోల్, నిర్మల్, ఖానాపూర్ నియోజక వర్గాల పరిధిలో వందలాది గ్రామాల మీదుగా యాత్ర సాగింది. జిల్లాలో 146.5 కిలో మీటర్ల మేర పాదయాత్ర నిర్వహించారు.

కరీంనగర్‌లోకి 'మీకోసం..'

కరీంనగర్: మల్లాపూర్ మండలం ఓబులాపూర్ గ్రామం నుంచి శనివారం ఉదయం కరీంనగర్ జిల్లాలో పాదయాత్ర మొదలు కానుంది. సంగెం శ్రీరాంపూర్ మీదుగా కొత్తదామ్‌రాజ్ పల్లె గ్రామానికి చేరుకొని గోదావరి నది ఒడ్డుకు చేరుకుంటారు.

భార్య భువనేశ్వరి, కుమారుడు లోకేశ్‌తో కలిసి ఉమా మహేశ్వరాలయంలో జరిగే చండీ యాగంలో పాల్గొంటారు. పాతదామరాజ్‌పల్లి, మల్లాపూర్, గొర్రెపల్లి వరకు 16 కి.మీ. నడుస్తారు. ఈ నెల 27వరకు జిల్లాలో యాత్ర సాగుతుంది.

నేటి నుంచి కరీంనగర్‌లో 'మీ కోసం'..


14.12.2012 "vastunna meekosam" padayatra photos ( part-2)

అదిలాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరాలంటే అక్రమాస్తుల కేసులో అరెస్టై చంచల్‌గూడ జైలులో ఉన్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వద్దకు వెళ్లి దండం పెట్టుకోవాలని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం అన్నారు. చంద్రబాబు వస్తున్నా మీకోసం పాదయాత్ర అదిలాబాద్ జిల్లాలో కొనసాగుతోంది. యాత్రలో భాగంగా ఆయన పలు ప్రాంతాల్లో మాట్లాడారు. కాంగ్రెసు పార్టీ పార్లమెంటు సభ్యులు వట్టి దద్దమ్మలు అని, అందుకే కేంద్రం నుండి నిధులు తీసుకు రావడంలో విఫలమవుతున్నారని మండిపడ్డారు. తాను పరిపాలించినప్పుడు సమర్థవంతమైన పాలన అందించి ప్రపంచాన్ని ఆకర్షించానన్నారు. మరోసారి కాంగ్రెసు పార్టీ అధికారంలోకి వస్తే ఇంటిపై కప్పు కూడా మిగలదన్నారు. కాంగ్రెసుది దోపిడీ పాలన అన్నారు. టిడిపి అధికారంలోకి వస్తే ప్రత్యేక డిఎస్సీ, విశ్వవిద్యాలయం, ప్రతి జిల్లాలోనూ గిరిజన భవన్‌లను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. గిరిజనులకు రూ.5 లక్షల వరకు వడ్డీ లేకుండా, పూచీకత్తు లేకుండా రుణాలిస్తామని చెప్పారు. ఎస్టీలకు చట్టసభల్లో, స్థానిక సంస్థల్లో, ఉపాధిలో ఇరవై శాతం రిజర్వేషన్లు కల్పిస్తామన్నారు. గిరిజనులు సాగు చేసుకుంటున్న భూములకు పట్టాలిస్తామని హామీ ఇచ్చారు. అదిలాబాద్ జిల్లాలో చంద్రబాబు నాయుడు పాదయాత్ర నేటితో ముగిసి.. కరీంనగర్ జిల్లాలో ప్రవేశించనుంది. అదిలాబాదులో బాబు పాదయాత్ర నేడు తొమ్మిదో రోజు. ఖానాపూర్ మండలం దిమ్మదుర్తి నుంచి ప్రారంభమైంది. ఎక్లాస్‌పూర్, ఖానాపూర్ క్రాస్ రోడ్డు, సుల్జాపూర్, జదనాకృతి మీదుగా కరీంనగర్ జిల్లాలో ప్రవేశిస్తుంది.

చేరాలంటే జైలుకెళ్లి దండం పెట్టుకోవాలి

అన్ని విధాల వెనుకబడిన గిరిజనులు
పూచీకత్తు లేకుండా బ్యాంకు రుణాలు

అదిలాబాద్, డిసెంబర్ 14 : గిరిజనులు అన్నివిధాల వెనుకబడి ఉన్నారని తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే చదువుకున్న యువకులకు ప్రత్యేక డిఎస్సీ, విశ్వవిద్యాలయం, ప్రతి జిల్లాలోనూ గిరిజన భవనాలను ఏర్పాటు చేస్తామని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు హామీ ఇచ్చారు. అంతే కాకుండా గిరిజనులకు ఐదు లక్షల రూపాయల వరకు పూచీ కత్తు లేకుండా బ్యాంకు రుణాలు అందిస్తామని అన్నారు.

'వస్తున్నా మీకోసం' కార్యక్రమంలో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేపట్టిన పాదయాత్ర శుక్రవారం నాటికి 70వ రోజుకు చేరింది. కాగా జిల్లాలో తొమ్మిదో రోజు యాత్ర కొనసాగుతోంది. ఈరోజు ఉదయం ఖానాపూర్ మండలం ఇక్బాల్‌పూర్ నుంచి పాదయాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజనులకుఅన్ని సదుపాయాలతోబాటు చట్ట సభలు, స్థానిక సంస్థలు, ఉపాధిలో కూడా 20 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని చంద్రబాబు పేర్కొన్నారు. గిరిజనులు సాగు చేసుకుంటున్న భూములకు పట్టాలిస్తామన్నారు. 1/70 చట్టాన్ని పటిష్టంగా అమలు చేస్తామని ఆయన హామీ ఇస్తూ, గిరిజనులకు వరాలజట్లు కురిపించారు.

చంద్రబాబు చేస్తున్న వెంట భారీగా కార్యకర్తలు, ప్రజలు తరలివస్తున్నారు. నేటితో అదిలాబాద్ జిల్లాలో పాదయాత్ర ముగియనుంది. రేపటి (శనివారం) నుంచి కరీంనగర్ జిల్లాలోకి చంద్రబాబు ప్రవేశించనున్నారు.

కాగా ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్ మండలం ఎక్బాల్‌పూర్ సమీపంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బస చేసే స్థలంలో చిరుత పులి తిరుగుతున్నట్లు ప్రచారం జరిగింది. దీంతో పోలీసులు అప్రమత్తమై అటవీ ప్రాంతంలో గట్టిబందోస్తును ఏర్పాటు చేశారు. వస్తున్నా మీ కోసం పాదయాత్ర సందర్భంగా గురువారం రాత్రి మామడ మండలంలో పాదయాత్ర చేసిన అనంతరం రాత్రి 10.30 గంటల ప్రాంతంలో బస స్థలానికి చేరుకొని విశ్రాంతి తీసుకున్నారు.

గిరిజనుల సాగు భూములకు పట్టాలు : చంద్రబాబు

&

14.12.2012 "vastunna meekosam" padayatra photos ( part-1)