December 13, 2012

(నిర్మల్/మామడ/నిర్మల్అర్బన్/సారంగపూర్/ఖానాపూర్/కడెం): టీ ఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రజా సమస్యలను పట్టించుకోకుండా ఫాంహౌస్‌లో కుంభ కరుణుడిలా నిద్రపోతున్నారని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. గురువారం పాదయాత్రలో భాగంగా మామడ మండలం కోర్టికల్ గ్రామంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. రైతుల బాధలు చూస్తే కన్నీళ్లు వస్తున్నాయని, వారి స మస్యలను పరిష్కారించడానికి పసుపు బోర్డ్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. టీఆర్ఎస్, వైఎస్సాఆర్‌సీపీలు అవినీతి సొమ్ముతో టీవీ ఛానల్‌లు, దినపత్రిక లు స్థాపించి ప్రజలను మభ్యపెడుతూ తమ పై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారన్నారు.

గల్ఫ్ బాధితుల సమస్యలు తీర్చడానికి ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తుందని అన్నారు. వీరి సమస్యల పరిష్కారం కోసం తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఒక మంత్రిత్వ శాఖని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. రుణా మాఫీని ఎలా మాఫీ చేస్తారని యువకుడు ప్రశ్నించగా. అమెరికా తరహాలో రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తానని, అమెరికాలో 40సంవత్సరాల పై బడ్డ వారికి ప్రభుత్వమే పింఛన్ సౌకర్యం కల్పించి అన్ని విధాలుగా ఆదుకుంటుందన్నారు.

ప్రభుత్వం కాంట్రాక్ట్ లెక్చరర్‌లకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం రూపాయికి కిలో బియ్యం ఇచ్చి, గ్యాస్ కనెక్షన్ పేరుతో రూ.100 తీసుకుంటుందన్నారు. తెలంగాణ కోసం తాము కట్టుబడి ఉన్నామని అన్నారు. రైతులకు సబ్సిడీ పై రుణాలు ఇచ్చి యువతకు పరిశ్రమలు ఏర్పాటు చేస్తామన్నా రు. అవినీతిని అంతమొందించనప్పు డే దేశం అభివృద్ధి చెందుతుందన్నారు. రాష్ట్రంలో మొండిఎద్దు పరిపాలన కొనసాగుతుందని, కిరణ్‌కుమార్‌రెడ్డి కిరికిరి ముఖ్యమంత్రి అని చంద్రబాబు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీ రాథోడ్‌రమేష్, పార్టీ జిల్లా అధ్యక్షుడు గెడం నగేష్, జిల్లా ప్రధాన కార్యదర్శు లు లోలం శ్యాంసుందర్, అబ్దుల్‌క లాం, నిర్మల్ నియోజక వర్గ ఇన్‌చార్జి బాబర్, తెలుగు రాష్ట్ర కార్యదర్శి భూషణ్‌రెడ్డి, నాయకులు కిషన్, రమేష్, కోర్టికల్ గంగారెడ్డి పాల్గొన్నారు.

గ్రామస్థుల బ్రహ్మరథం: పాదయాత్రలో భాగంగా కోర్టికల్ గ్రామానికి వచ్చిన టీడీపీ అధినేత చం ద్రబాబు నాయుడికి గ్రామస్థులు బ్రహ్మరథం పట్టారు. ఊరి పొలిమేర నుంచి మహిళలు మంగళ హారతులతో స్వాగతం పలకడంతో పాటు బంతిపూలు చల్లి రోడ్డు పై నడిపించారు.

కేసీఆర్ ఫాంహైజ్‌లో నిద్రపోతున్నారు

(నిర్మల్/ఖానాపూర్/మామడ): గ్రామ స్థాయిలో పాదయాత్రలు నిర్వహిస్తూ సమస్యల పరిష్కారం కో సం కృషి చేయాలని, పార్టీని మరింత పటిష్టపర్చే విధంగా నాయకులు, కార్యకర్తలు శ్రమించాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. మా మడ మండల తిర్పెల్లి వద్ద చెన్నూర్ నియోజక వర్గ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు పలు విషయాలను ఆయన దృషి ్టకి తీసుకెళ్లారు. నియోజక వర్గ ఇన్‌చార్జిల నియమించాలని పలువురు సీనియర్ నేతలు కోరగా బస్సులో కర్చీప్ వేసినంత సులభంగా కాదని, తగిన సమయం వచ్చినప్పుడే నియమించడం జరుగుతుందని పేర్కొన్నారు. సింగరే ణి లాభాల్లో నడవడానికి తెలుగుదేశం పార్టీ చేసిన కృషేనని ఈ విషయాన్ని నాయకులు ప్రజల్లో తీసుకెళ్లి వివరించాలని సూచించారు.

అందులో 15శాతం లాభాల వాటా ఇవ్వడం కార్మికులకు తెలియజేయాల్సిన అవసరం ఉందన్నా రు. సంజయ్‌కుమార్ నాయకుడు మా ట్లాడుతూ పని చేసే నాయకులకు పదవులు ఇచ్చి గుర్తించాలని కోరగా, త్వర లో మంచి నిర్ణయం తీసుకుంటామని, కష్టపడిన వారికి తగిన ప్రాధాన్యత ఉం టుందన్నారు. బి. నర్సింగ్‌రావు మాట్లాడుతూ చెన్నూర్ నియోజక వర్గంలో అండర్ గ్రౌండ్ మైన్స్ అభివృద్ధికి పా టుపడాలని, సింగరేణిలో పని చేసిన వారికి వారసత్వపు ఉద్యోగాలు కల్పించాలని కోరగా, సింగరేణి అభివృద్ధి కృషి తెలుగుదేశం పార్టే కారణమని పు నర్ఘటించారు.

జగదల్‌పూర్ హైవే లైన్ పూర్తి చేస్తే నాలుగు వందల కిలో మీటర్ల దూరభారం తగ్గుతుందని చెప్ప గా, ఈ విషయం పరిశీలిస్తామని హా మీ ఇచ్చారు. ఎండి అబ్బస్ మాట్లాడు తూ మందమర్రి పట్టణంలో నాలుగు సంవత్సరాలుగా పార్టీ పటిష్టత కోసం పని చేస్తున్నామని, అయినా తమకు ఎ లాంటి గుర్తింపు లేదని చెప్పగా, ఈ విషయమై జిల్లా అధ్యక్షుడు నగేష్, ఎంపీ రాథోడ్ రమేశ్ దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారికి కృషి చేయాలని సూచించారు. ఈ సమావేశంలో చెన్నూ ర్ నియోజక వర్గ నాయకులు చీర్ల రాజేశ్వర్‌రెడ్డి, శ్యాందాస్, పెద్దపెల్లి తిరుపతి, నర్సింగ్‌రావు, శ్రీనివాస్, సురేష్, నాయిని మధునయ్య పాల్గొన్నారు.

గ్రామ స్థాయిలో పాదయాత్రలు నిర్వహించండి

(నిర్మల్/ మామడ/ కడెం/ సారంగాపూర్): మీ కష్టాలు కడతర్చేందుకే వస్తున్నా మీ కోసం పాదయాత్ర చేపట్టానని, స్వయంగా మీ బాధలు తెలుసుకునేందుకే వచ్చానని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. లక్ష్మణచాంద మండలం తిర్పెల్లి నుంచి మామడ మండలం కోర్టికల్ వరకు దాదాపు 4 కి.మీటర్ల పాదయాత్ర చేయగా మధ్య లో పలువురు రైతులు, మహిళలు కలిసి తమ గోడును చెప్పుకున్నారు. లక్ష్మణచాంద గ్రామానికి చెందిన బు చ్చవ్వ అనే వృద్ధురాలు మాట్లాడుతూ పొట్టగడవడం కష్టంగా ఉందని వాపోయింది. కొడుకులు ఉన్నారా.. సరిగ్గా చూసుకుంటున్నారా అని బాబు ప్ర శ్నించగా వృద్ధురాలు మాట్లాడుతూ కొడుకులు పట్టించుకోవడం లేదని, రూ.200 పింఛన్ వస్తుందని, చాలా కష్టంగా ఉందని ఆవేదనతో తెలిపింది.

స్పందించిన బాబు అధికారంలోకి రా గానే రూ. 600 పింఛన్ ఇస్తామని చె ప్పారు. అనంతరం రూ.2వేల నగదును బుచ్చవ్వకు అందించారు. మరో రైతు సాయన్న ఆయన మాట్లాడుతూ గి ట్టుబాటు ధరలు రావడం లేదని, పంట పండించాలంటే కష్టంగా ఉంద ని వాపోయారు. మీ కష్టాలు గట్టెక్కేంచించేందుకు వచ్చానని, పంట రుణాల ను మాఫీ చేస్తామని బాబు చెప్పారు. రాచాపూర్‌కు చెందిన నడి పి పోసాలు (మాజీ సర్పంచ్) మాట్లాడుతూ మీ కోసం నేను ఇక్కడ వేచి ఉన్నానని, గతంలో ఉపాధ్యాయులు మోసం చేశారని, అందు వల్లనే ఒడిపోయామని,ఈ సారి మాత్రం టీచర్లను నమ్మవద్దని పోలింగ్ బూత్‌లో నిరుద్యోగులను నియమించాలని సూచించారు.

సరే అలాగే చేద్దామని చంద్రబా బు అన్నారు. లక్ష్మణచాందకు చెందిన భార్యభర్తలు రాజేశ్వర్, విజయలక్ష్మీలను బాబు పలుకరించారు. ఏ పంట వేశారా... దిగుబడి వస్తుందా... కరెంట్ వస్తుందా.. అప్పు ఎంత ఉంది అని అ డిగారు. సరైన దిగుబడి రాలేదని, మూడు గంటలు మాత్రమే కరెంట్ ఇచ్చారని, మక్కపంట ఎండిపోయిందని, రూ.లక్ష50వేలు అప్పు ఉందని, ఇద్దరు పిల్లలు చదువుకుంటున్నారని చెప్పగా, అప్పులు మాఫీ చేయిస్తాం. పిల్లలను చదివిస్తాం. కాంగ్రెస్ ప్రభు త్వం వల్లనే ఈ కష్టాలు వచ్చాయని చంద్రబాబు అన్నారు. కోర్టికల్‌కు చెందిన గంగవ్వను పలుకరించగా, ఒక బల్బుకే రూ.600 వచ్చిందని, నాయకులు దోచుక తింటున్నారని, మీ వెంట ఉన్నా నాయకులే మోసం చేస్తున్నారని ఆవేశంతో అనగా, నిజాయితీ పరులు ముందుకు వచ్చి పార్టీలో కొనసాగాలని గంగవ్వనుకు చెప్పారు.

ఈ సందర్భంగా గాళ్ల గంగవ్వ తన భర్త గాళ్ల రాజారెడ్డిని చంద్రబాబు నాయుడికి పరిచయం చేయించారు. తొలుత గంగవ్వ బాబు దగ్గరికి వచ్చి తన మాటలతో ఆకట్టుకుంది. దీంతో నీవు ఏ పని చేస్తావు. నీ భర్త ఏం చేస్తా రు.. ఇలా చురుకుగా ఉంటేనే ప్రజలకు న్యాయం జరుగుతుందని, అవినీతిని నిలదీయాలని అన్నారు. గంగవ్వ భర్త పొలాల్లో ఎడ్లు మేపుతుండగా బాబు పిలిపించారు. భార్యభర్త భూజాల పై బాబు చేతులు వేసి ఆవులను పెంచేందుకు లోన్ ఇప్పిస్తాం. ఆదాయం వస్తుంది చేసుకోవాలని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.

మీ కష్టాలు తీర్చేందుకే పాదయాత్ర

ఆదిలాబాద్ : టీడీ పీని ఆదరించి, ఆశీర్వదించాలనీ, అధి కారంలోకి వచ్చిన తరువాత జిల్లా సమగ్రాభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపడుతానని ఆ పార్టీ అధ్యక్షుడు చం ద్రబాబు నాయుడు అన్నారు. 'వస్తు న్నా మీ కోసం' పాదయాత్రలో భాగం గా గురువారం కొరిటికల్ క్రాస్ రోడ్, కొరిటికల్, మామడ, పోనికల్ క్రాస్ రోడ్, డాంబర్ ప్లాంట్, దిమ్మదుర్తి వరకు 14.3 కిలో మీటర్లు పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా పలు గ్రామాల్లో ఏర్పాటు చేసిన సభల్లో ఆయన మాట్లాడారు. టీడీపీ హ యాంలోనే జిల్లాను అభివృద్ధిచేశా మని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం జిల్లా అభివృద్ధిని విస్మరించిందని విమర్శించారు. తమ హయాంలో జ రిగిన అభివృద్ధి పనులకు కాంగ్రెస్ సర్కార్ కనీసం మరమ్మతులు కూడా చేయించలేదని ఆయన ఆరోపించారు.

ప్రభుత్వం సక్రమంగా విద్యుత్ సరఫరా చేయకపోవడంతో జిల్లాలోని వేలాది హెక్టార్లలోని పసుపు, పత్తి, వరి పంటలు ఎండిపోయాయనీ, లక్షలాది ఎకరాల్లో దిగుబడి తగ్గిపోయిందన్నా రు. కరెంట్ సక్రమంగా సరఫరా చేయకపోవడంతో నీళ్లు లేక పంట దిగుబడి తగ్గిపోయిందని, పెట్టుబడులు పెరిగిపోయాయని, దాంతో జిల్లా రైతాంగం అప్పుల ఊబి లో కురుకపోయిందన్నారు. అప్పుల బాధ భరించలేక ఎంతో మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు ఆత్మహత్యలకు పాల్పడవద్దనీ, టీడీపీ అధికారంలోకి రాగానే రైతులు తీ సుకున్న అన్ని రుణాలను మాఫీ చేస్తాననీ, పత్తి, వరి, పసుపుతోపాటు ఇతర పంటలకు గిట్టుబాటు ధర చెల్లిస్తానని ఆయన పేర్కొన్నారు. ఎరువుల ధరలను తగ్గించి వ్యవసాయాన్ని లాభసా టి మారుస్తానన్నారు.

ఎరువుల కోసం రైతులు పోలీస్‌స్టేషన్ల వద్ద రోజుల తరబడి క్యూలో ని ల్చున్నప్పటికీ ఒక్క ఎరువుల బస్తా దొరకలేదనీ, ఐదు లాఠీ దెబ్బలు తిం టేనే ఒక యూరియా బస్తా ఇచ్చారని ఆయన చెప్పారు. పెట్రోల్, డీజిల్ ధరలతో నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయనీ, ధరలను నియంత్రించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. విద్యుత్ సక్రమంగా సరఫరా చేయని అధికారులు, బిల్లులు మాత్రం అధికంగా వేస్తున్నారని ఆయ న విమర్శించారు.

రాని కరెంట్‌కు బిల్లుల మోత మోగడంతో గుండె ఆగిపోయేలా ఉందన్నారు. ట్రాన్స్‌ఫార్మర్ కాలి పోతే చేతులు తడపందే కొత్త ట్రాన్స్ ఫార్మర్ ఇవ్వడం లేదన్నారు. జిల్లాలో లక్షలాది ఎకరాల్లో పత్తి, ప సుపు పంటలను సాగు చేస్తున్నారనీ, వీరి కోసం పొగాకు బోర్డు మాదిరిగా పసుపు, పత్తి పంటలకు అభివృద్ధి బో ర్డును ఏర్పాటు చేయిస్తానని ఆయన అ న్నారు. జిల్లాలోని పత్తి, పసుపు తదితర వ్యవసాయ ఉత్పత్తుల కోసం జిన్నింగ్, స్పిన్నింగ్ తదితర పరిశ్రమలను ఏర్పాటు చేసి జిల్లాలోని నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పిస్తామన్నారు. గ్రామాల్లో సాగునీరు. డ్రైనేజీ , పాఠశాల, ఆసుపత్రుల భవనాలను నిర్మించి, అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతానన్నారు. ఆదర్శ రైతులు ఒక్కసారి కూడా పొలాలకు వెళ్లి వ్యవసాయ సలహాలు ఇవ్వకుండా, బెల్లు షాపులు పెట్టి మద్యాన్ని విచ్చల విడిగా విక్రయిస్తున్నారని విమర్శించారు.

పిల్లలకు ఉచిత విద్యను అందించి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని, నిరుద్యోగ భృతి చెల్లిస్తానని ఆయన చెప్పారు. జిల్లాలో లక్షలాది మంది బిడీ కార్మికులు ఉన్నారని, బీడీ కార్మికులకు ఎక్కువ పని ది నాలు కల్పించి, వెయ్యి బీడీ రూ. 150 చెల్లించి, బీడీ కార్మికులందరికి లక్షన్నర రూపాయల వ్యయంతో ఉచితంగా ఇళ్లు కట్టిస్తామన్నారు. జిల్లాకు చెందిన లక్షలాది మంది ఉపాధి కోసం గల్ఫ్ దే శాలకు వెళ్లారని, అక్కడి కొంత మంది చనిపోతే వారి శవాలను తీసుక రావడానికి ప్రభుత్వం తన వద్ద డబ్బులు లేవని చేతులు ఎత్తేస్తుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత గల్ఫ్ బాధితు ల కోసం మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసి, వారి సమస్యలను పరిష్కరిస్తామన్నారు. తాను తెలంగాణకు గతంలో, ప్రస్తుతం, భవిష్యత్‌లో వ్యతిరేకం కాదని ప్రజలను మనోభావాలను గౌరవిస్తానన్నారు.

ముస్లింల సంక్షేమం కోసం మరో రూ. 2500 కోట్లతో ఇస్లామిక్ బ్యాంకు ఏర్పాటు చేయించి వడ్డీలేని రుణాలు అందిస్తానని హామీ ఇచ్చారు. సమావేశాల్లో టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, ఆదిలాబాద్ ఎంపీ రమేష్ రాథోడ్, నిజాబాబాద్ రూరల్ ఎమ్మెల్యే మండవ వెంకటేశ్వర్‌రావు, టీడీపీ జిల్లా అధ్యక్షుడు, బోథ్ ఎమ్మెల్యే నగేష్, టీడీపీ సీనియర్ నాయకులు పాయల శంకర్, లోలం శ్యామ్ సుం దర్, బాబర్, యూనిస్ అక్బానీ, రాష్ట్ర పరిశీలకుడు అర్షపల్లి విద్యాసాగర్‌రావు, రాష్ట్ర నాయకులు శ్రీశైలం, కోటేశ్వర్‌రావు, అందుగుల శ్రీనివాస్, జైపూర్ మాజీ జడ్పీటీసీ పెద్దపల్లి తిరుపతి, నారాయణరెడ్డి, జుట్టు అశోక్, ఆ దిలాబాద్ నియోజక వర్గం నాయకుడు గణేష్‌రెడ్డి, రాజిరెడ్డి పాల్గొన్నారు.

బాబుకు నీరాజనం: నార చంద్రబాబునాయుడుకు గు రువారం ప్రజలు నీరాజనం పలికారు. కొరిటికల్ క్రాస్ రోడ్, కొరిటికల్, మామడ, పోనికల్ క్రాస్ రోడ్, డాంబర్ ప్లాంట్, దిమ్మదుర్తి వరకు పాదయాత్ర నిర్వహించిన చంద్రబాబునాయుడుకు ప్రజలు పూలమాలలతో, మంగళహారతులతో ఘనంగా స్వాగతం పలికి, తమ గ్రామాల్లో నెలకొన్న సమస్యలను విన్నవించారు.

కొరిటికల్ నుంచి దిమ్మదుర్తి వరకు ఉన్న గ్రామాల్లోని ప్రజలను, పొలాల్లో పని చేస్తున్న రైతులను, కల్లుగీత కార్మికులను, బీడీ కార్మికులను పలుకరిచారు. ప్రజల కష్టాలు తెలుసుకునేందుకే పాదయాత్ర చేపట్టాననీ, ఓపిగ్గా వారు చెప్పే సమస్యలు విని ఆ సమస్యల పరిష్కారానికి ఎలాంటి చర్యలు చేపడితే పేదలు బాగుపడుతా రో.. చెప్పాలని కోరారు. ఈత, తాటి వ నం పెంచుకునేందుకు భూములు ఇప్పించాలని కొరిటికల్‌లో కల్లుగీత కా ర్మికుడు గంగాధర్‌గౌడ్ కోరగా చర్యలు తీసుకుంటానన్నారు. వెనకబడిన కూ లాలకు చెందిన తాము కూలీ పని చేసుకుంటూ బతుకుతున్నామనీ,భూమి ఇప్పించాలని కోరారు. అధికారంలోకి వచ్చిన తరువాత బీసీలకు భూములు కొనుగోలు చేసి ఇచ్చేలా చర్యలు చేపడుతానని చంద్రబాబు పేర్కొన్నారు.

ఆదరించండి.. అభివృద్ధి చేసి చూపిస్తా..: చంద్రబాబు

నిర్మల్..ఆదిలాబాద్ జిల్లాకే కాదు, మొత్తం ఆంధ్ర దేశానికే సాంస్కృతిక చిహ్నం. కొయ్య బొమ్మల కుటీర పరిశ్రమే ఇక్కడి వేలాది కుటుంబాలకు ఆధారం. సృజనాత్మక కళాకారుల చేతుల్లో రూపుదిద్దుకునే ఈ అందమైన బొమ్మలకు దేశ ,విదేశాల్లో మంచి మార్కెట్ ఉంది. ఈ విషయం అప్పట్లోనే గుర్తించి ఎన్నో పథకాలను ప్రవేశపెట్టాను. అటు కళాకారులూ ఇటు రాష్ట్రమూ ఆర్థికంగా బాగు పడేలా చర్యలు తీసు కున్నాను.

ఇతర దేశాల ప్రతినిధులు, వీఐపీలు ఎవరొచ్చినా నిర్మల్ కొయ్యబొమ్మల విశిష్టతను ప్రత్యేకంగా పరిచయం చేసేవాళ్లం. హైదరాబాద్ శిల్పారామంలో ఆ బొమ్మలు పెట్టించి ప్రోత్సహించాం. పర్యాటక ప్రాంతంగానూ అభివృద్ధి చేశాం. ఎండకు, వానకు బొమ్మలు దెబ్బతినకుండా షెడ్లు కట్టించాం. ఎంతో చేసి వీళ్లకప్పగిస్తే, ఉన్నదాన్నీ నిలుపుకోలేకపోయారు. కొయ్యబొమ్మల కాళ్లు విరిచారు. బొమ్మలు తయారు చేయడానికి కొనికి కర్ర వాడతారు. ఈ కలప వేగంగా అంతరించిపోతోంది. పైగా అన్నిహంగులతో దిగుతున్న చైనా బొమ్మలతో పోటీ మరింత కుంగదీస్తోంది.

కొనికి మొక్క పెంపకం, మార్కెట్ నియంత్రణ తదితర చర్యలు తీసుకోకుంటే నిర్మల్ బొమ్మ బతికి బట్టకట్టలేదనిపిస్తోంది. మామడ వైపు వెళుతుండగా 'అదే సరస్వతి కాలువ' అని ఓ రైతు చూపించాడు. నిర్మల్ ఆయకట్టుకు వరదాయని ఈ కెనాల్. ఈ ప్రధాన కాలువలో చాలాచోట్ల మట్టి పేరుకుపోవడం కనిపించింది. ఎస్ఆర్ఎస్‌పీకి నీళ్లొస్తేనే ఈ పంట కాలువ నిండుతుందని ఆ రైతు చెప్పుకొచ్చాడు. పైనున్న బాబ్లీ ప్రాజెక్టు నిండి నీళ్లు కిందకు పారితేనే కాలువలు నిండుతాయంటూ ఉన్న పరిస్థితిని, తమ దీనస్థితిని కళ్లకు కట్టాడు.

"ఏటా తంటానే సార్. పంట వేయాలా వద్దా అనేది చివరిదాకా తేల్చుకోలేకపోతున్నాం. వేసి నీళ్లు రాకపోతే నిండా మునిగిపోతాం'' అని ఆయన వాపోతుంటే.. నా హయాంలో ఎస్ఆర్ఎస్‌పీ బ్యాక్‌వాటర్ ఆయకట్టుకు లిప్టుల ద్వారా నీళ్లు అందించిన విషయం గుర్తొచ్చింది. అదే అడిగితే..'కరెంట్ లేకుండా లిప్టులెక్కడ పనిచేస్తాయి సార్' అన్న జవాబొచ్చింది. నిర్మల్‌బొమ్మకే కాదు, సరస్వతి కాలువకూ ప్రాణం పోయాల్సిన బాధ్యత నాదేనన్న విషయాన్ని ఆ రైతు మాటలు మరింతగా గుర్తుచేశాయి.

కాళ్లిరిగిన కొయ్యబొమ్మ!

చిరుత సంచారంపై స్థానికుల సమాచారం
బాబు బస వద్ద పోలీసులు అప్రమత్తం

ఖానాపూర్, డిసెంబర్ 13: అది... కాకులు దూరని కారడివి కాదు! కానీ... చిరుతలు తిరిగే చిట్టడివి! అక్కడే... టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు రాత్రి బస! దీంతో... భద్రతా సిబ్బంది మరింత అప్రమత్తమయ్యారు. గురువారం రాత్రి ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్ మండలం ఎక్బాల్‌పూర్ సమీపంలో చంద్రబాబు బస చేశారు. పార్టీ నేతలు చంద్రబాబు కోసం, ఇతర నేతల కోసం గుడారాలు ఏర్పాటు చేశారు.

రాత్రి 10.30 గంటల సమయానికి చంద్రబాబు అక్కడికి చేరుకున్నారు. అక్కడ గుడారాలు వేస్తున్న సమయంలోనే స్థానికులు పార్టీ శ్రేణులను, పోలీసులను అప్రమత్తం చేశారు. ఈ ప్రాంతంలో చిరుత పులి తిరుగుతోందని చెప్పారు. రాత్రి వేళల్లో పక్కనే ఉన్న చెరువులో నీళ్లు తాగేందుకు వస్తుందని తెలిపారు.

పెంబి అటవీ ప్రాంతంలోని వేణునగర్ సమీపంలో మూడు నెలల క్రితం ఒక చిరుత పులి రెండు మేకలు, ఒక ఆవును చంపిందని పోలీసుల దృష్టికి తీసుకొచ్చారు. చంద్రబాబు బస చేసిన చోటు ఈ అడవికి 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. పైగా... జనావాసాలకు ఒకటిన్నర కిలోమీటరు దూరంలో గుడారాలు వేశారు. అసలే ఇది తీవ్రవాద ప్రభావిత ప్రాంతం కావడం, ఆపై చిరుత సంచారంపై సమాచారం రావడంతో పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు.

చిరుత అడవిలో బాబు బస

ఆదిలాబాద్, డిసెంబర్ 13 : సీఎంగా తాను నిజాయితీగా, నిప్పులా బతికాననీ,దాంతో తనపై ఎన్ని ఎంక్వైరీలు వేసినా తనకు ఏమి కాలేదని టీడీపీ అధినేత చంద్రబాబుఅన్నారు. పాదయాత్రలో భాగంగా ఆదిలాబాద్ జిల్లా మామడలో ఆయన మాట్లాడారు. ఏటా తన కుటుంబ సభ్యుల ఆస్తులను ప్రజల ముందు పెడుతున్నాననీ, ఇతర పార్టీల నేతలు కూడా ఆస్తులు ప్రకటిస్తే బాగుంటుందన్నారు.

వైఎస్ సీఎం కాగానే భూములను, గనులను అమ్ముకున్నాడనీ, జలయజ్ఞాన్ని ధన యజ్ఞంగా మార్చాడని ఆయన విమర్శించారు. లక్ష కోట్ల రూపాయలను దోచుకుని కొడుకుకు అప్పగించాడన్నారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ ముందుగా తెలంగాణపై తన వైఖరి చెప్పాలనీ, తరువాత తమ వైఖరి చెప్తామనీ తెలిపారు.

నిజాయితీగా, నిప్పులా బతికాను: బాబు

కాంగ్రెస్సే చెప్పాలి
తెలంగాణపై అక్కడిక్కడే మేమూ తేల్చేస్తాం
సాగుకు పగటిపూటే 9 గంటలు కరెంటు
టీఆర్ఎస్‌తో పొత్తు లేకుంటే గెలిచేవాళ్లం!
పాదయాత్రలో చంద్రబాబు

ఆదిలాబాద్, డిసెంబర్ 13 : అధికారంలోకి వస్తే రైతులకు పగటి పూటనే తొమ్మిది గంటల నాణ్యమైన ఉచిత వి ద్యుత్ ఇస్తామని తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు ప్రకటించా రు. రాత్రిపూట కరెంటుతో రైతులు పడుతున్న ఇబ్బందులకు తెర దించుతామని హామీ ఇచ్చారు. తెలంగాణ ఇవ్వాల్సింది కేంద్రం లో, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాలే అని చెప్పా రు. తెలంగాణను ఇవ్వకుండా టీడీపీని దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారంటూ కాంగ్రెస్‌పై మండిపడ్డారు.

అఖిలపక్ష సమావేశంలో కాంగ్రెస్ ముందుగా తన వైఖరిని వెల్లడించాలనీ, ఆ వెంటనే, అక్కడికక్కడే టీడీపీ తన వైఖరి చెబుతుందని స్పష్టం చేశారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ చెప్పకుండా... విపక్షమైన టీడీపీ వైఖరి చెప్పాలని డిమాండ్ చేయడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. తెలంగాణకు టీడీపీ ఎప్పుడూ వ్యతిరేకం కాదని పునరుద్ఘాటించారు. 'మాది ప్రజల మనోభావాలను గౌరవించే పార్టీ' అని బాబు తెలిపారు.

'వస్తున్నా మీకోసం' పాదయాత్రలో భాగంగా గురువారం ఆయన ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ నియోజకవర్గంలోని కొరటికల్, మామడ, పొన్కల్ క్రాస్, డాంబర్ ప్లాంట్, దిమ్మదుర్తి వరకు... 14.3 కిలోమీటర్ల దూరం నడిచారు. పలుచోట్ల ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. గతంలో భూమిలేని ఎస్సీలకు భూమి కొనుగోలు చేసి ఇచ్చామనీ, తాను ముఖ్యమంత్రి అయితే భూములు లేని బీసీలకు కూడా భూములు ఇస్తామని ప్రకటించారు. పొగాకు బోర్డు మాదిరిగానే పసుపు బోర్డు, పత్తి అభివృద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.

ఒక్కో కాంగ్రెస్ కార్యకర్త నాలుగైదు పేర్లమీద ఇళ్లను కట్టకుండానే... ఇందిరమ్మ బిల్లులు మింగేశారని ఆరోపించారు. అవినీతికి వైఎస్ నాంది పలికాడనీ, హైదరాబాద్‌లోని ఎనిమిది వేల ఎకరాల ప్రభుత్వ భూములను 53 మందికి అప్పగించి వేలాది కోట్లు అక్రమంగా దండుకున్నారన్నారు. జగన్ ప్రస్తుతం జైలుకెళ్లి అక్కడి నుంచే రాజకీయాలు నడిపిస్తున్నారని విమర్శించారు. "ఒకరిద్దరు ఎమ్మెల్యేలున్న పార్టీలు కూడా పత్రికలను, చానళ్లను పెడుతున్నాయి. తటస్థంగా ఉన్నవాళ్లు పత్రికలు, చానళ్లు పెడితే వాస్తవాలు తెలుస్తాయి'' అని బాబు అన్నారు.

టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ తెలంగాణ అభివృద్ధి గురించి పట్టించుకోరని విమర్శించారు. 2009 ఎన్నికల్లో టీఆర్ఎస్‌తో పొత్తు పెట్టుకోకుంటే టీడీపీ అధికారంలోకి వచ్చేది. ప్రజలు కష్టాలు తీరేవన్నారు. కిరికిరి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి ప్రజల సమస్యలు పట్టించుకోరని... ఇస్త్రీ నలగని దుస్తులతో ఫ్రెష్‌గా తిరుగుతుంటారని ఎద్దేవా చేశారు. ప్రజలంతా కష్టపడుతుంటే కాంగ్రెస్ నేతలు మాత్రం బొర్రలు పెంచుకొని తిరుగుతున్నారనీ విమర్శించారు.

జైలు నుంచే జగన్ రాజకీయాలు: చంద్రబాబు

13.12.2012 "vastunna meekosam" padayatra photos ( part-2)

13.12.2012 "vastunna meekosam" padayatra photos ( part-1)

నిర్మల్/నిర్మల్అర్బన్/సారంగాపూర్/లక్ష్మణచాంద/మామడ/ఖానాపూర్: టీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రజలకు చేసిందేమి లేదని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అ న్నారు. బుధవారం రాత్రి లక్ష్మణచాంద మండలంలోని పీచర గ్రామంలో పాదయాత్ర నిర్వహించిన అనంతరం బహిరంగ సభలో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ, వైయస్సార్ పార్టీ నాయకులు తోడు దొంగలని, వారు అవినీతి కుంభకోణాల్లో కూరుకుపోయి పందికొక్కు ల్లా బలిశారన్నారు. జగన్‌పై కేసుల మాఫీ కోసం కాంగ్రెస్ పార్టీలో వైయస్సార్‌సీపీ విలీనమవడం ఖాయమన్నారు.

టీఆర్ఎస్ అధినేత చంద్రశేఖర్‌రావు ఫాంహౌజ్‌లో కుంభకర్ణుడిలా ని ద్రపోతున్నాడే తప్ప తెలంగాణపై చిత్తశుద్ధి లేదన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉందని, గతంలో లేఖను సైతం సమర్పించామని గుర్తు చేశారు. ప్రస్తుత ప్రభుత్వం తెలంగాణ కోసం నాన్చుడు ధోరణి అవలంభించడంతో పాటు తెలుగుదేశం పార్టీపై లేనిపోని అభాండాలు మోపుతున్నారన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైయస్.రాజశేఖర్‌రెడ్డి చేసిన అవినీతిలో తన తనయుడు వైయస్.జగన్ అవినీతికి పాల్పడి జైలు జీవితం గడుపుతున్నాడన్నారు. పేద విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని ప్రతీ విద్యార్థికి తమ పార్టీ అధికారంలోకి వస్తే ల్యాప్‌టాప్‌లు ఇస్తామని అన్నారు. ఎస్సారెస్పీ ముంపు బాధితులకు నష్టపరిహారం అందించేలా కృషి చేస్తామని పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఎమ్మె ల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎంపీ రాథోడ్ రమేష్, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గెడం నగేష్, లోలం శ్యామ్‌సుందర్, అబ్దుల్‌కలాం, తలసాని శ్రీనివాస్ యాదవ్, నిర్మల్ నియోజక వర్గ ఇన్‌చార్జి బాబర్, రాష్ట్ర రైతు కార్యదర్శి కొరిపెల్లి భూషణ్‌రెడ్డి, నిర్మల్ పట్టణ, మండల అధ్యక్షులు గండ్రత్ రమేష్, ఆదుముల్ల గంగన్న తదితరులు ఉన్నారు.

బాలికలకు ఉద్యోగం వచ్చే వరకు చదివిస్తాం: బాలికలకు ఉద్యోగం వచ్చేంత వర కు పూర్తిగా ఉచితంగా చదివిస్తానని టీ డీపీ అధినేత చంద్రబాబు నాయుడు బుధవారం అన్నారు. పాదయాత్రలో భాగంగా బుధవారం వెల్మల్‌లో జరిగి న బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. బుధవారం నిర్మల్ మండలం మూఠాపూర్ నుండి 1.10 నిమిషాలకు బయలుదేరిన ఆయన సాయంత్రం 3 గంటలకు వెల్మల్‌బొప్పారం గ్రామాన్ని చేరుకున్నారు. అనంతరం అక్కడ జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ బీసీలకు వందసీట్లు కేటాయించిన ఘన త తమదేనన్నారు. బాబు మాట్లాడుతుండగా స్థానిక ఉన్నత పాఠశాల బాలిక నిఖిలకు మాట్లాడమని మైక్ ఇచ్చారు. ఆమె మాట్లాడుతూ సార్ మీ తొమ్మిదేళ్ల పాలన ఎంతో బాగుందని, అయితే మా గ్రామం పక్కనుండే గోదావరి వెళ్తుందని, కానీ మా గ్రామానికి తాగునీరు అందడం లేదని తెలిపింది. అలాగే మా పాఠశాలలో బా ల బాలికలకు మరుగుదొడ్లు లేవని తెలిపింది. దీంతో ఆయన మాట్లాడుతూ ఎంపీ నిధులతో ప్రత్యేక మరుగుదొడ్లు ఏర్పాటు చేయడంతో పాటు లిఫ్ట్ సౌకర్యం కల్పించడం ద్వారా వెల్మల్ గ్రామానికి తాగునీరు అందిస్తామన్నారు.

పదో తరగతి పరీక్ష కేంద్రాన్ని సోన్‌లో కాకుండా న్యూ వెల్మల్‌లోనే ఏ ర్పాటు చేయాలని విద్యార్థులు కో రడంతో చంద్రబాబు ప్రసంగ స్థలం నుండే కలెక్టర్‌కు ఫ్యాక్స్ ద్వారా సమాచారాన్ని అందించారు. బొప్పారంలో ఎస్సారెస్పీలో ముంపుకు గురైన గ్రామాల యువకులు భూము లు కో ల్పోయిన వారికి భూములను, ఉద్యోగాలను కల్పించాలని కోరారు. దీంతో బాబు వెంటనే కలెక్టర్‌కు ఫ్యాక్స్ ద్వారా లేఖను పంపారు.వెల్మల్ గ్రామంలో ప్రారంభమైన బాబు పాదయాత్ర పీచర, ధర్మారం, మల్లాపూర్, లక్ష్మణచాంద మీదుగా సాగింది. పాదయాత్రలో ఆయన వెంట మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు భీంరెడ్డి, ఆదిలాబాద్ ఎంపీ రాథోడ్ రమేష్, నిర్మల్ నియోజక వర్గ ఇన్‌చార్జి బాబర్ బేగ్, టీడీపీ నాయకులు లోలం శ్యామ్‌సుందర్, భూషణ్‌రెడ్డి, ఎమ్మెల్యే నగేష్‌లతో పాటు పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు.

ఈ గ్రామం ఎంతో చల్లగా ఉంది: మూఠాపూర్‌లో చంద్రబాబునాయుడు మాట్లాడుతూ ఈ గ్రామం ఎం తో చల్లగా ఉంది. ఇక్కడే పడుకోవాలని పిస్తోందని అన్నారు. జిల్లాలో పాదయాత్ర చేసినప్పటికీ ఇంతటి చల్లని వాతావరణం, చెట్లు ఎక్కడా కనిపించలేవని, తాను నడిచి అలసిపోయినప్పటికీ ఈ చెట్టుకింద నిలబడి మాట్లాడడం ఆనందాన్ని కలిగించిందన్నారు.

బీసీల రాజ్యాధికారం కోసం కృషి: బొప్పారం గ్రామ పంట పొలాల్లో ఏర్పాటు చేసిన సిర్పూర్ కాగజ్‌నగర్ ని యోజక వర్గస్థాయి సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు. వెనుకబడిన తరగతులకు రానున్న ఎన్నికల్లో వంద సీట్లు ఇస్తామని ప్రకటించామని, మహిళలకు కూడా 33 శాతం సీట్లు ఇచ్చే ప్ర యత్నం చేస్తామని అన్నారు. పార్టీ కోసం పనిచేసిన వారిని విస్మరించబోమని, తగిన సమయంలో తగిన గుర్తిం పు ఇస్తామని కార్యకర్తలను ఉత్సాహ పరిచారు.సిర్పూర్, కాగజ్‌నగర్, కౌటాల, బెజ్జూర్‌కు చెందిన కాం గ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున చంద్రబాబు సమక్షంలో చేరారు.

బాబుకు బంతిపూల సైకిల్: ఖానాపూర్: లక్ష్మణచాంద మండ లం కొత్త వెల్మల్ గ్రామంలో మీకోసం పాదయాత్రలో మాట్లాడుతున్న చంద్రబాబుకు తెలుగుదేశం పార్టీ వీరాభిమాని ఒకరు బంతి పూలతో తయారు చేసిన సైకిల్‌ను బహుకరించారు.

చంద్రబాబుకు వినతుల వెల్లువ: నిర్మల్ మండలంలోని మంజులాపూర్, తాంస గ్రామాల మధ్య గల స్వర్ణ ప్రాజెక్టుపై బ్రిడ్జి నిర్మించాలని తాంస గ్రామస్థులు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడికి చిట్యాల్‌లో వినతి పత్రం సమర్పించారు.చిట్యాల్ గ్రామ సమీపంలో గల డాంబర్ ప్లాంట్‌ను తొలగించాలని, దీంతో కాలుష్యం తలెత్తి అనేక అనారోగ్యాలకు గురవుతున్నామని చం ద్రబాబుకు వినతి పత్రం సమర్పించారు. దిలావర్‌పూర్ మండలం లోలం గ్రామ ఎస్సారెస్పీ ముంపు బాధితులకు నష్టపరిహారం కోసం వినతి పత్రం సమర్పించారు.

అవినీతిని అంతమొందించడమే లక్ష్యం: నిర్మల్/ నిర్మల్ అర్బన్/ లక్ష్మణచాంద : రాష్ట్రంలో పెరిగిపోతున్న అవినీతిని అంతమోదించడానికి కంకణబద్ధుని అయ్యాయని టీడీపీ అధినేత చం ద్రబాబునాయుడు అన్నారు. బుధవా రం రాత్రి పాదయాత్రలో భాగంగా లక్ష్మణచాంద మండలంలోని మల్లాపూర్ గ్రామంలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే ఎస్ఆర్ఎస్‌పీ ప్రాజెక్టులో ముం పునకు గురైన గ్రామాల బాధితులకు నష్టపరిహారం అందేలా కృషి చేస్తామన్నారు. కాంగ్రెస్ హయాంలో రైతుల పరిస్థితి దయనీయంగా మారిందన్నారు.

టీఆర్ఎస్‌తో ప్రజలకు ప్రయోజనం లేదు

నిర్మల్/నిర్మల్ అర్బన్/సారంగాపూర్/మామడ/లక్ష్మణచాంద/ఖానాపూర్: మీకోసం.. మీ కష్టాలు తీర్చేందుకు ఈ పాదయాత్ర చేస్తున్నానని, ఇంటి పెద్ద బిడ్డగా ఆశీర్వదిస్తే కష్టాలు తీరుస్తానని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. లక్ష్మణచాంద మండలం న్యూవెల్మల్‌లో పాదయాత్ర సందర్భంగా ప్రజలతో మాటా మంతి నిర్వహించారు.

వృద్ధురాలు: అన్ని ధరలు పెరిగా యి. లిసలెండర్ ధర కూడా పెంచారు. చక్కెర కేజీకి రూ. 42, పప్పు కేజీకి రూ. 75, ఉప్పు రూ.10, నూనె రూ. 100కు పెంచారు. మేమెట్ల బతికేది.

చంద్రబాబు: కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలు ఎంతో నష్టపోయారని, వారిని ఆదుకోవాల్సిన బాధ్యత నాపై ఉందని, తులం బంగారం రూ. 5 వేలు ఉంటే అప్పుడు, ఇప్పుడు రూ. 40 వేలు చేశారని, నాకు అవకాశం ఇస్తే పూర్వ వైభవం తీసుకవస్తా.

వృద్ధురాలు: ఒక బల్బుకు రూ. 400 బిల్లు వస్తుంది సారు..

చంద్రబాబు: కాంగ్రెస్ ప్రభుత్వం ఉచిత విద్యుత్ అని చెప్పి నాటకాలు ఆడుతుంది. 18 గంటల కరెంటు ఇస్తామని మోసం చేశారు. వేరే రాష్ట్రాలకు మిగులు విద్యుత్‌ను అమ్ముకుంటున్నా రు. ఇప్పటికైనా మీకు న్యాయం చేసేందుకు కృషి చేస్తా. నాణ్యమైన విద్యుత్‌ను సరఫరా చేయిస్తా.

విద్యార్థి: మాకోసం పాదయ్రాత చేస్తున్నందుకు ధన్యవాదాలు.. మా పాఠశాలలో మరుగుదొడ్ల సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నాం. ఎవరికి చెప్పినా పట్టించుకోవడం లేదు. పక్కనే గోదావరి నీరు ఉన్నా ఉపయోగించుకోలేక పోతున్నాం. అన్ని కష్టాలే ఉన్నా యి. మా బాధలను తీర్చండి.

చంద్రబాబు: పాఠశాలకు ఎంపీ ఫండ్ కింద మరుగుదొడ్ల నిర్మాణం కోసం నిధులు మంజూరు చేయిస్తా, గో దావరి నీరు అందరికీ అందే విధంగా లిఫ్ట్ పెట్టించి తాగునీటి సమస్య తీర్చు తా. భవిష్యత్తులో విద్యార్థులకు ఎలాం టి నష్టం జరుగకుండా ఉచితంగా పూ ర్తిస్థాయిలో చదివించి ఉద్యోగం ఇప్పి స్తా. ఉద్యోగం రాకపోతే నిరుద్యోగ భృ తి అందజేయిస్తా. గతంలో విద్యార్థుల సౌకర్యం కోసం సైకిళ్లు ఇచ్చాం. ఇప్పు డు కూడా మళ్లీ అందజేస్తాం.

విద్యార్థి: తెలంగాణకు మద్దతు తెలపాలి.

చంద్రబాబు: తెలంగాణ విషయంలో స్పష్టంగా తెలియజేశాను. కాంగ్రెస్, టీఆర్ఎస్, పీఆర్పీ కుట్రలు పన్ని మోసంతో అధికారంలోకి వచ్చా రు. లేకపోతే ఎప్పుడో తెలంగాణ వచ్చేదన్నారు.

మీ పెద్ద బిడ్డగా ఆశీర్వదించండి:చంద్రబాబు

నిర్మల్/నిర్మల్ అర్బన్/సారంగాపూర్/మామడ/లక్ష్మణచాంద/ఖానాపూర్: జిల్లాలో అసెంబ్లీకి పోటీచేసే తొలి అభ్యర్థిని చంద్రబాబు బుధవారం ప్రకటించారు. పాదయాత్ర బాసర నుంచి మొదలుకొని నిర్మల్, ఖానాపూర్ మీదుగా కరీంనగర్ తరలివెళ్తున్న క్రమంలో నిర్మల్ మండలం మూఠాపూర్ వద్ద మంగళవారం రాత్రి బాబు బస చేశారు. బుధవారం ఉదయమే ఆదిలాబాద్ జిల్లా నేతలతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశంలో ఆదిలాబాద్ నియోజక వర్గ ఇన్‌చార్జి పాయల శంకర్ పాదయాత్రకు అ త్యంత సహకారం అందిస్తూ కార్యకర్తలను సైతం తరలించడంలో కీలక పాత్ర పోషిస్తూ అధినేత మెప్పును పొందారు. దీంతో పాటు ఆ నియోజక వర్గంలో కార్యకర్తలు, నాయకులతో పాయల శంకర్ సన్నిహిత సంబంధా లు ఉన్నాయి.

అయితే గత ఉప ఎన్నికల్లో పాయల శంకర్ పోటీ చేసి ఓట మి పాలైన అప్పటి నుంచి పార్టీ పటిష్టత కోసం తీవ్ర కృషి చేశారు. అయితే బాబు పాదయాత్రలో అక్కడక్కడ నియోజక వర్గాల్లో అసెంబ్లీకి పోటీ చేసే అభ్యర్థుల పేర్లను ఖరారు చేశా రు. అయితే ఆదిలాబాద్ జిల్లాలో ము థోల్ నియోజక వర్గ, నిర్మల్ నియోజక వర్గంలలో పాదయాత్ర కొనసాగినా అక్కడ స్పష్టమైన అభ్యర్థుల పేర్లు ఖరారు చేయలేదు. బుధవారం మా త్రం మూఠాపూర్ వద్ద జరిగిన ఆదిలాబాద్ నియోజక వర్గ సమీక్షా సమావేశంలో ఆదిలాబాద్ అభ్యర్థిగా పా యల శంకర్ పేరును చంద్రబాబు ప్రకటించారు. దీంతో ఆదిలాబాద్ నియోజక వర్గ టీడీపీ కార్యకర్తలు, ము ఖ్య నాయకులు పాయల శంకర్ పేరు ఖరారు పట్ల హర్షం వ్యక్తం చేశారు.

టీడీపీతోనే ప్రజల కష్టాలు దూరం: ఈ సందర్భంగా పాయల శంకర్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తేనే ప్రజల కష్టాలు గట్టెక్కుతాయని అన్నారు. రైతులు, మహిళలు టీడీపీ ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నారని అన్నారు. మధ్యంతర ఎన్నికలే గానీ, 2014లో జరిగే ఎన్నికలు గానీ వస్తే పార్టీ అఖండ విజ యం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సమావేశంలో లక్షెటిపేట్ మార్కెట్ మాజీ చైర్మన్ సల్ల నాగభూషణ్, జిల్లా ఉపాధ్యక్షులు దిమ్మ సం తోష్, మాజీ ఎంపీపీ ఫణింధర్‌రావు, రాష్ట్ర రైతు కార్యదర్శి భూషణ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఆదిలాబాద్ జిల్లాలో తొలి అభ్యర్థిని ప్రకటించిన చంద్రబాబు

ఆదిలాబాద్ : కాంగ్రెస్ సర్కార్ పాలనలో నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్నంటడం తో పేదలు ఏమి కొనేటట్టు లేదనీ, ఏమీ తినేటట్టు లేదనీ, కాంగ్రెస్ సర్కార్‌ను బంగాళాఖాతంలో కలపాలని టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు ప్రజలకు పిలుపునిచ్చారు. వస్తున్నా.. మీకోసం పాదయాత్రలో భాగంగా ఆదిలాబాద్ జిల్లాలోని ని ర్మల్ నియోజక వర్గంలోని కొత్త వెల్మ ల్, వెల్మల్ బొప్పారం, పీచర, ధర్మా రం, మల్లాపూర్, లక్ష్మణచాంద, తెరిపెల్లి, గాంధీచౌక్ వరకు బుధవారం 14.9 కిలో మీటర్లు పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభల్లో ఆయన మాట్లాడుతూ ఉప్పు, పప్పు, చింతపండు, చక్కెరలాంటి నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయనీ, దాం తో ప్రజలు అర్ధాకలితో అలమటించిపోతున్నారని ఆయన అన్నారు.

నిత్యావసర సరుకుల ధరలను నియంత్రించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ఆయన విమర్శించారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత నిత్యావసర సరుకుల ధరలను అదుపులోకి తెస్తామన్నారు. టీడీపీ పాలనలో తులం రూ. 5 వేలు ఉన్న బంగారం ఇప్పుడు రూ. 35 వేలు దాటిందని, ఆడ బిడ్డ పెళ్లికి బంగారు మంగళ సూత్రం కూడా చేయించలేని పరిస్థితి ఏర్పడిందనీ, కాంగ్రెస్ నాయకులు మాత్రం రాష్ట్రాన్ని దోచుకుని బంగారం కంచం, మంచం, కుర్చీలు ఏర్పాటు చేసుకుంటున్నారని ఆయన విమర్శించారు.

గతంలో ఎన్టీ రామారావు, తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జిల్లాను ఆదర్శ జిల్లాగా ప్రకటించి ప్రత్యేక శ్రద్ధ చూపి విద్య, వైద్య, రోడ్లు తదితర అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడంతో పాటు పలు సంక్షేమ పథకాలను అమలు చేశామని ఆయన తెలిపారు. గిరిజన విద్యార్థుల కోసం అనేక పాఠశాలలు, కళాశాలలు, ఆశ్రమ పాఠశాలలు ఏర్పాటు చేయించి విద్యనందించామన్నారు. జిల్లాలో పర్యాటక కేంద్రం ఏర్పాటు చేసి ఎంతో మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాననీ, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఆ పర్యాటక కేంద్రాలన్నీ వెలవెలబోతున్నాయని ఆ యన అన్నారు.

జిల్లాలోని వందిలాది గ్రామాల ప్రజానీకం తాగునీటి కోసం తల్లాడిల్లిపోతుందని, ప్రజల తాగునీటి కష్టాలను తీర్చేందుకు అన్ని గ్రామాలకు గోదావరి జలాలను అందిస్తానన్నారు. పాదయాత్రలో అనేక గ్రామాలను సందర్శించినప్పుడు ఆయా గ్రామాల ప్రజలు తాగునీటి కోసం ఎదుర్కొంటున్న కష్టాలను చూశానని, గ్రామీణ ప్రజలందరికి గోదావరి జలాలను అందించి తాగునీటి సమస్యలను పరిష్కరిస్తామన్నారు. జిల్లాలోని రైతు లు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పిస్తానన్నారు. జిల్లాలో విద్యుత్ కోత అధికంగా ఉండడం వల్ల పంటల దిగుబడులు తగ్గిపోయాయన్నారు. విద్యుత్ సరఫరా చేయడంలో విఫలమైన ప్రభుత్వం సర్‌చార్జీల పేరిట అధిక బిల్లులు వేస్తోందనీ, రెండు బుగ్గలు ఉన్న ఇంటికి రూ. 500 బిల్లు వేస్తుందని ఆయన విమర్శించారు.

విద్యుత్ సరఫరా చేయలేని ప్రభుత్వం అధిక బిల్లులు మాత్రం వసూలు చేస్తోందనీ, తాను గతంలో చెప్పినట్లుగానే విద్యుత్ తీగలపై బట్టలు ఆరవేసుకునే పరిస్థితి వచ్చిందని ఆయన అన్నా రు. జిల్లాలోని రైతాంగం వేసిన పంటలకు పెట్టుబడి అధికమై, దిగుబడి తగ్గి కనీస మద్దతు ధర లభించక పోవడం తో రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎరువుల ధరలను తగ్గించడం తో పాటు పంటలకు గిట్టుధర చెల్లిస్తామని, రైతులు తీసుకున్న అన్నిరుణాలను మాఫీ చేస్తామని ఆయన చెప్పా రు. జిల్లాలో లక్షలాది మంది ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లారని, వారి సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదనీ, గల్ఫ్ బాధితుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యేక మం త్రిత్వ శాఖను ఏర్పాటు చేస్తానని ఆయ న చెప్పారు.

శ్రీరాంసాగర్ ప్రాజెక్టు కిం ద భూములు, ఇళ్లు కోల్పోయిన వారికి ఇప్పటి వరకు నష్టపరిహారం, ఉద్యోగా లు రాలేదనీ, వారికి నష్టపరిహారంతో పాటు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు. టీఆర్ఎస్ తిరకాసు పార్టీ అని, ఆ పార్టీ అధినేత ప్రజా సమస్యలను పట్టించుకోకుండా ఆరు నెలలు ఫాం హౌజ్‌లో పడుకొని తరువాత మభ్యపెట్టే ప్రకటనలు చేస్తూ పబ్బం గడుపుకుంటాడనీ, అలాంటి వ్యక్తి చెప్పే మాటలు నమ్మవద్దని కోరారు. బాబ్లీ ప్రాజెక్టు కట్టినా తెలంగాణలో కరువుతో ప్రజలు అల్లాడుతున్నా ఏరోజు వారి సమస్యలపై ఆయన పోరాడలేదనీ, ప్రజల సమస్యలపై టీడీపీ నిత్యం పో రాటాలు చేస్తూ వారికి అండగా నిలుస్తోందన్నారు. ఎన్నికల్లో ప్రలోభాలకు, మాయమాటలకు లొంగిపోవద్దనీ, పేద ప్రజల పార్టీ అయిన టీడీపీని ఆదరించాలని, టీడీపీని గెలిపిస్తే పేదల కష్టాలు తొలగిపోతాయన్నారు.

సామాజిక తెలంగాణ పేరుతో పార్టీ పెట్టిన చిరంజీవి మంత్రి పదవి కోసం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేశాడనీ, పిల్ల కాంగ్రెస్ అయిన వైఎస్సార్ సీపీ తల్లి కాంగ్రెస్ అయిన కాంగ్రెస్ పార్టీలో కలవడం ఖాయమన్నారు. తెలంగాణకు టీడీపీ గతంలో, ప్రస్తుతం, భవిష్యత్‌లో వ్యతిరేకం కాదన్నారు. ఈ సమావేశాల్లో టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యు లు, ఆదిలాబాద్ ఎంపీ రమేష్ రాథోడ్, టీడీపీ జిల్లా అధ్యక్షుడు, బోథ్ ఎమ్మెల్యే నగేష్, టీడీపీ సీనియర్ నాయకులు పా యల శంకర్, లోలం శ్యామ్ సుందర్, బాబర్, యూనిస్ అక్బానీ, నారాయణరెడ్డి, జుట్టు అశోక్, రమాదేవి, ఆదిలాబాద్ నియోజక వర్గం నాయకుడు గణే ష్‌రెడ్డి, గిమ్మ సంతోష్, అల్లూరి రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

బాబుకు ఘనస్వాగతం: చంద్రబాబునాయుడుకు బుధవారం ఘన స్వాగతం లభించింది. పాదయాత్రలో భాగంగా నిర్మల్ ని యోజక వర్గంలోని కొత్త వెల్మల్, వెల్మ ల్ బొప్పారం, పీచర, ధర్మారం, మల్లాపూర్, లక్ష్మణచాంద, తెరిపెల్లి, గాంధీచౌక్ వరకు బుధవారం 14.9 కిలో మీ టర్లు పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా పలు గ్రామాల ప్రజలు డప్పు చప్పుళ్లతో, మేళ వాయిద్యాలతో, మంగళ హారతులతో ఘనంగా స్వాగ తం పలికారు. ప్రజలు చంద్రబాబునాయుడికి పూలమాలలు వేసి సమస్యలను విన్నవించారు. కాంగ్రెస్ పాలన లో అభివృద్ధి జరుగకపోగా, పాత పనులకు కూడా మరమ్మత్తులు చేయడం లేదని బాబుకు విన్నవించారు.

ఏం కొనేటట్లు లేదు... ఏం తినేటట్లు లేదు