December 9, 2012

నిర్మల్: తెలుగుదేశం పార్టీ 2014లో అధికారంలోకి వస్తే మొదటి సంతకం రైతుల రుణాల మాఫీపైనే పెడతానని టీడీపీ అధినేత నారా చంద్ర బాబు నా యుడు అన్నారు. ఆదివారం మీకోసం వస్తున్నా పాదయాత్రలో భాగంగా కుం టాల మండలం చాక్‌పెల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన పాదయాత్రకు హాజరైన ప్రజలనుద్దేశించి మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయంలో రైతుల పరిస్థితి దయనీయంగా తయారైందని, రైతుల జీవితాల్లో బంగారు భవిష్యత్తు నింపడానికి తనవంతు కృషి చేస్తానని అన్నారు. కాంగ్రెస్ తొమ్మిది సంవత్సరాల పాలనలో రాష్ట్రానికి ఒరిగిందేమి లేదని, ప్రభుత్వం రాక్షస పాలన చేస్తున్నారే తప్ప ప్రజలకు రక్షణ లేకుండా పోయిందన్నారు.

ఈ రాక్షస పాలనలో ఏ ఒక్కరు అభివృద్ధి చెందలేదని, అ న్ని ంటా వెనుకబడిపోయారని అ న్నారు. రైతులకు యూరియా రేట్లు విపరీతం గా పెంచి యూరియా కోసం రైతులు క్యూకట్టి పోలీసుల లాఠీదెబ్బ లు తినవలసిన పరిస్థితులు దాపురించాయన్నారు. రైతులు తాము పంటల కోసం చేసిన రుణాలను మాఫీ చేయడానికి, రైతుల సంక్షేమం కోసం రుణ మాఫీపై మొదటి సంతకం చేసి తీరుతానని అ న్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రైతులకు తొమ్మిది గంటలు విద్యుత్ సరఫరా చేశామని, అప్పుడు కరెంటు కొరత ఉన్నప్పటికీ ప్రజలకు, రైతులకు ఇబ్బందులు కలుగకుండా పల్లె పల్లెకు విద్యుత్‌ను అందించామన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఆనవాళ్లు లేకుండాపోతుందని, వైయస్సార్సీపీ అవినీతి కుంభకోణాల్లో కొట్టుమిట్టాడుతుందని, టీఆర్ఎస్ ప్రభావం ఏ మీ లేదన్నారు.ఈ కార్యక్రమంలో జి ల్లా ఎంపీ రాథోడ్ రమేష్, టీడీపీ జిల్లా అ«ధ్యక్షుడు గెడం నగేష్, జిల్లా ప్రధాన కార్యదర్శిలు లోలం శ్యామ్‌సుందర్, అబ్దుల్ కలాం, నిర్మల్ నియోజక వర్గ ఇ న్‌చార్జి బాబర్, ముథోల్ నియోజక వర్గ ఇన్‌చార్జి నారాయణరెడ్డి తదితరులు ఉ న్నారు.

ముస్లింల సమస్యలపై చంద్రబాబుకు వినతి: కుంటాల మండలం చాక్‌పెల్లి గ్రామంలో టీడీపీ మైనార్టీసెల్ రాష్ట్ర నేత ఎండీ యూనుస్ అఫ్ఘని నేతృత్వంలో చాక్‌పెల్లి మైనార్టీల సమస్యలను టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకవచ్చారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ముస్లీం మైనార్టీల అభివృద్ధికి పాటుపడతానని, వీరి సంక్షేమం కోసం రూ. 2500 కోట్ల నిధులు కేటాయించడం జరుగుతుందన్నారు.

మొదటి సంతకం రుణ మాఫీ పైనే...


ఆదిలాబాద్ జిల్లా ప్రజలు తాగునీటి కోసం అ నేక ఇబ్బందులకు గురవుతున్నారనీ, గోదావరి జలాలను జిల్లాలోని ప్రతి ప ల్లెకు సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటానని టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు అన్నారు. వస్తు న్నా.. మీ కోసం పాదయాత్రలో భా గంగా ఆదిలాబాద్ జిల్లాలోని అర్లి క్రాస్ రోడ్, కుంటాల క్రాస్్‌రోడ్, నం దన్ క్రాస్‌రోడ్, నర్సాపూర్ (జి) క్రాస్‌రోడ్, చర్లపల్లి వరకు 11.5 కిలో మీ టర్లు ఆదివారం పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా పలుచోట్ల ఆయన మాట్లాడారు. జిల్లాలో అనేక గ్రామాల్లో పారిశుధ్యం లోపించిందన్నారు. రోడ్లు అధ్వానంగా తయారయ్యాయని, తాము అధికారంలోకి వ చ్చిన తరువాత గ్రామాల్లో నెలకొన్న స మస్యలను పరిష్కరిస్తానని అన్నారు. రైతుల, ప్రజల కష్టాలను తెలుసుకునేందుకే పాదయాత్రను ప్రారంభించానని, ఇప్పటి వరకు 1100 కిలో మీటర్ల పాదయాత్ర పూర్తి చేశానని ఆయన చెప్పా రు.

జిల్లాలో ఉర్దూ టీచర్ల పోస్టులు 324 ఖాళీ ఉన్నప్పటికీ ఆ పోస్టులను భర్తీ చేయలేదని ఆయన విమర్శించారు. టీడీపీ హయాంలో ఉర్దూ టీచర్ల పోస్టులను భర్తీ చేశామనీ, ముస్లింల అభివృద్ధికి అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశామన్నారు. ముస్లిం ల కోసం 2500 కోట్ల రూపాయలతో ఇ స్లామిక్ బ్యాంకును ఏర్పాటు చేసి వడ్డీలేని రుణాన్ని అందిస్తామన్నారు. ము స్లింల పిల్లలకు కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యను అందిస్తామని ఆయన తెలిపారు. అవినీతి, అసమర్థ, దుర్మార్గపు కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడిస్తేనే ప్రజల కష్టాలు తీరుతాయన్నారు. జిల్లాలో లక్షలాది ఎకరాల్లో రైతులు ప త్తిపంటను సాగు చేశారని, పెట్టుబడి పెరిగి దిగుబడి తగ్గి వచ్చిన కొద్దిపాటి పత్తిని విక్రయిద్దామనుకున్న రైతన్నకు మద్దతు ధర లభించడం లేదన్నారు. పత్తి రైతులను ఆదుకునేందుకు మద్దతు ధర లభించే వరకు తాను పోరాటం చే స్తానని అన్నారు. క్వింటాలు పత్తికి రూ. 5 వేల ధర చెల్లించాలని డిమాండ్ చే శారు.

పత్తి రైతుల సమస్యల పరిష్కా రం కోసం త్వరలోనే ఆదిలాబాద్‌లో లేకుంటే కరీంనగర్‌లో ఒకరోజు పెద్ద ఎత్తున ధర్నా చేస్తానని ఆయన అన్నారు. రైతు సమస్యలు స్వయంగా చూసిన తాను ఎంతో ఆవేదన చెందాన ని, రైతులు తీసుకున్న అన్ని రకాల రు ణాలను మాఫీ చేస్తానని ఆయన చెప్పా రు. సమావేశాల్లో ఆదిలాబాద్ ఎంపీ రాథోడ్ రమేష్, టీడీపీ జిల్లా అధ్యక్షు డు, బోథ్ ఎమ్మెల్యే నగేష్, టీడీపీ ఎస్సీసెల్ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీశైలం, వికలాంగుల సంక్షేమ కార్పోరేషన్ చైర్మన్ కోటేశ్వర్‌రావు, టీడీపీ సీనియర్ నాయకులు పాయల శంకర్, లోలం శ్యామ్ సుంద ర్, నారాయణరెడ్డి, బాబర్, యూనిస్ అక్బానీ, జీవి రమణ, అందుగుల శ్రీనివాస్, జుట్టు అశోక్, రమాదేవి, జైపూర్ మాజీ జడ్పీటీసీ పెద్దపల్లి తిరుపతి, కడెం మాజీ ఎంపీపీ రాజేశ్వర్‌గౌడ్, సి. శంకర్ పాల్గొన్నారు.

రోజురోజుకు పెరుగుతున్న జనం: చంద్రబాబునాయుడి పాదయాత్ర కు, సభలకు రోజు రోజుకు ప్రజలు అధి క సంఖ్యలో హాజరవుతున్నారు. జిల్లా లో చంద్రబాబునాయుడి పాదయాత్ర ఆదివారంతో నాలుగో రోజుకు చేరుకుం ది. పాదయాత్రను జయప్రదం చేసేందుకు ఆదిలాబాద్ ఎంపీ రమేష్ రాథో డ్, టీడీపీ జిల్లా అధ్యక్షుడు, బోథ్ ఎ మ్మెల్యే నగేష్, మాజీ జడ్పీ చైర్మన్ లో లం శ్యామ్‌సుందర్, నియోజక వర్గాల ఇన్‌చార్జీలు పాయల శంకర్, నారాయణరెడ్డి, బాబర్ తదితర నాయకులు జ నసమీకరణ దృష్టి సారించారు. సభల కు వివిధ గ్రామాల నుంచి పెద్ద ఎత్తున జనాన్ని సమీకరిస్తున్నారు. దీనికి తోడు టీడీపీ మైనార్టీ రాష్ట్ర నాయకుడు యూనిస్ అక్బానీ పాదయాత్ర వెళ్లే గ్రామాల్లోని మైనార్టీలను సభలకు తరలిస్తున్నారు.

ఆదిలాబాద్ జిల్లా వాసులకు గోదావరి జలాలందిస్తాం..

ఉపాధ్యాయులుగా ఎంతోమంది తలెత్తుకు తిరిగేలా చేశాం! ముస్లిములకు ప్రత్యేక డీఎస్సీ నిర్వహించాం. ఏకంగా 1300 పోస్టులను రోస్టర్ లేకుండానే భర్తీ చేశాం. 13 జిల్లాల్లో ఉర్దూను సెకండ్ లాంగ్వేజీ చేశాం. టీచర్ పోస్టుల భర్తీకి, ముస్లిములకు ఎంతో ప్రాధాన్యం ఇచ్చాం. మరి ఇప్పుడు పరిస్థితి ఏమిటి!? పాదయాత్రలో ప్రతి జిల్లాలోనూ దారి పొడవునా ఉపాధ్యాయ అభ్యర్థులు కలుస్తున్నారు.

తమ గోడు వెళ్లబోసుకుంటున్నారు. వారి ఆవేదన అంతా ఇంతా కాదు. బీఈడీ చదువుకున్న వారికి ఎస్జీటీకి అవకాశం లేకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బీఈడీ చదువుకుని కూడా ఎస్జీటీ పోస్టుకు అర్హత లేకుండా ఖాళీగా ఉండాల్సి వస్తోందని మదన పడుతున్నారు. ఒక్క కలం పోటుతో ఈ ప్రభుత్వం ఆరు లక్షలమంది ఉసురు పోసుకుంటోంది.

ముస్లిములు ఉర్దూలో చదువుకోవడానికే ప్రాధాన్యం ఇస్తారు. జనాభా ప్రాతిపదికన ఉర్దూ టీచర్ పోస్టులను భర్తీ చేయాలి. కానీ, టీడీ పీ హయాంలో భర్తీ చేసిందే ఆఖరు. ఉర్దూ టీచర్ పోస్టులు కూడా మెజారిటీ ఖాళీ. ఎక్కడికక్కడ టెంట్లు వేసుకుని మరీ వాళ్లు ఆందోళన చేస్తున్నారు. పాదయాత్రలో భాగంగా నన్ను కలిసి తమ ఆవేదన వ్యక్తం చేశారు. వారి కోసం ప్రత్యేక డీఎస్సీని నిర్వహించాల్సిందే! కానీ, ఈ ప్రభుత్వం ఆ పని చేస్తుందా!?

ఆదిలాబాద్ జిల్లా నర్సాపూర్ పరిసర ప్రాంతాల్లో పర్యటిస్తున్నప్పుడు ఎస్సారెస్పీ నిర్వాసితులు వచ్చి కలిశారు. తమకు ఇప్పటి వరకు పరిహారం అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సారెస్పీ నిర్వాసితులు..! ఎన్నేళ్ల కిందటి మాట ఇది? వాళ్లకు ఇప్పటి వరకు పరిహారం ఇవ్వలేదు. ఈ ప్రభుత్వం వారిని రకరకాల వివాదాల్లోకి నెట్టేస్తోంది. వారికి వెంటనే పరిహారం ఇవ్వాలి. వారి ఉసురు పోసుకోవద్దని ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నా!

టీడీపీ హయాంలో డీఎస్సీలను ఓ జాతరగా జరిపాం

ఒక ఎంపినో, ఎమ్మెల్యేనో పోయినా ఫరవాలేదు
మా ఎంపీలు చేసిన పని బాధ కలిగించింది
విలువలే నాకు ముఖ్యం.. వాళ్లు పశ్చాత్తాపం చెందుతున్నారు
ప్రలోభాలకు లొంగినట్లు తేలితే క్షమించబోను
ఆదిలాబాద్ పాదయాత్రలో చంద్రబాబు
ఆ పార్టీలకు మమ్మల్ని విమర్శించే హక్కు ఎక్కడుంది
ఓ పార్టీ ప్రణబ్‌కు ఓటేసింది
టీఆర్ఎస్ ఏకంగా ముగ్గురు ఎమ్మెల్యేలను అమ్ముకుంది
1100 కిలోమీటర్లు పూర్తి చేసుకున్న టీడీపీ అధినేత
పత్తి రైతు కోసం ఒక రోజు దీక్షకు నిర్ణయం

ఆదిలాబాద్, డిసెంబర్ 9 : చిల్లర వర్తకులను నట్టేట ముంచే ఎఫ్‌డీఐలకు టీడీపీ వ్యతిరేకమని చంద్రబాబు స్పష్టం చేశారు. రాజ్యసభలో ఎఫ్‌డీఐలపై జరిగిన ఓటింగ్‌లో తమ పార్టీ ఎంపీలు తప్పు చేసి ఉంటే శిక్ష తప్పదని తెగేసి చెప్పారు. ఆదిలాబాద్ జిల్లాలో ఆదివారం ఆర్లి క్రాస్ రోడ్ నుంచి ఆయన పాదయాత్ర ప్రారంభించారు. కుంటాల క్రాస్్‌రోడ్, నందన్ క్రాస్‌రోడ్, నర్సాపూర్ (జి) క్రాస్‌రోడ్, చర్లపల్లి వరకు 11.5 కిలోమీటర్లు నడిచి 1100 కిలోమీటర్లు పూర్తి చేశారు. రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి రాజీనామా నేపథ్యంలో ఎఫ్‌డీఐలపై ఓటింగ్ అంశాన్ని పలు సభల్లో చంద్రబాబు ప్రముఖంగా ప్రస్తావించారు.

"ఎఫ్‌డీఐలకు తెలుగుదేశం పార్టీ వ్యతిరేకం. మొన్న రాజ్యసభలో ఓటింగ్ జరిగిన సమయంలో మా పార్టీకి చెందిన ముగ్గురు ఎంపీలు హాజరు కాలేకపోయారు. నేను ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఎంతో వ్యయప్రయాసలకు ఓర్చి ఇప్పటికే 1100 కిలోమీటర్లకు పైగా నడిచాను. ఈ సమయంలో ఇలాంటి సంఘటనలు జరగడం నాకు తీవ్రమైన బాధ కలిగించింది. అనారోగ్యం కారణంగా వెళ్లలేకపోయానని దేవేందర్ గౌడ్ ముందే చెప్పారు. మిగతా ఇద్దరూ (సుజనా చౌదరి, గుండు సుధారాణి) లిఖితపూర్వకంగా జరిగినదాన్ని నాకు వివరించారు. తప్పు చేశామంటూ పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. నాకూ, పార్టీ కార్యకర్తలకూ క్షమాపణ చెప్పారు.

నేను ఈ విషయాన్ని పరిశీలిస్తున్నాను. ప్రలోభాలకు లోనయినట్టు తేలితే ఎవరినైనా క్షమించేది లేదు. అదే సమయంలో తెలియక పొరపాటు జరిగి ఉంటే శిక్షించడం కూడా సరికాదు. ఒక ఎంపియో ఎమ్మెల్యేనో పోయినా ఫరవాలేదు. విలువలతో కూడిన రాజకీయం చేస్తా'' అని స్పష్టం చేశారు. ఈ అంశంలో తమపై విమర్శలు చేస్తున్న ఇతర పార్టీలకు దీటైన సమాధానం ఇచ్చారు. " రాష్ట్రాన్ని దోచుకున్న వారూ మమ్మల్ని విమర్శించే పరిస్థితికి వచ్చారు. జైల్లోఉండి కూడా ప్రణబ్‌కు ఓటు వేశారు. ఇప్పుడు ఎఫ్‌డీఐలపై గైర్హాజరయ్యారు. ఆ పార్టీ వాడినని చెప్పుకునే అనకాపల్లి ఎంపీ (సబ్బం హరి) కాంగ్రెస్‌కు అనుకూలంగా ఓటేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్.. ముగ్గురు ఎమ్మెల్యేలను అమ్ముకుంది. ఇలాంటి వాళ్లా మా గురించి మాట్లాడేది?'' అని ప్రశ్నించారు.

ఎన్టీఆర్ గానీ తాను గానీ నిప్పులా బతికామని, అందుకే ఎవరూ ఏమీ చేయలేకపోయారని పేర్కొన్నారు. అయినా అన్ని పార్టీలకూ టీడీపీయే లక్ష్యంగా మారిందని చెప్పారు. వైసీపీ పుట్టుకే అవినీతి పుట్టుక అని, అది రాష్ట్రాన్ని దోచుకున్న సొమ్ముతో ఏర్పటైన పార్టీ అని తీవ్రంగా ధ్వజమెత్తారు. రాష్ట్ర చరిత్రలోనే ప్రజలకు ఎప్పుడు ఇన్ని కష్టాలు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పెట్టుబడి పెరిగి, దిగుబడి తగ్గి, పంటలకు గిట్టుబాటు ధర కరువై రైతులు దిగాలుపడ్డారని వివరించారు. పెరిగిన ధరలతో ప్రజలు అల్లాడి పోతున్నారని చెప్పారు.

చేతకాని దుర్మార్గపు కిరణ్ సర్కార్ ప్రజల సమస్యల పరిష్కారంలో విఫలమైందన్నారు. సీఎం కిరణ్‌కుమార్ రెడ్డి ఇందిరమ్మబాట వీడి పొలంబాట పడితే పేద ప్రజలు, రైతుల కష్టాలు తెలుస్తాయనీ, వెంటనే ఆయన ఆ పనిచేయాలని డిమాండ్ చేశారు. పత్తిపంటకు పెట్టుబడి పెరిగి దిగుబడులు తగ్గగా, ఈ యేడు మద్దతు ధర కూడా లభించకపోవడంతో రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయారన్నారు. క్వింటాలు పత్తికి రూ. 5 వేలు మద్దతు ధర చెల్లించాలని డిమాండ్ చేశారు. "ఆరు లాఠీ దెబ్బలు తింటే ఒక యూరియా బస్తా రైతుకు దక్కుతోందని, ఈ కాంగ్రెస్ పాలనకు త్వరలోనే ప్రజలు చరమగీతం పాడతారని ఆశాభావం వ్యక్తం చేశారు.

పత్తి రైతుల సమస్యపై ఆదిలాబాద్ లేక కరీంనగర్‌లో ఒకరోజు ధర్నా చేస్తానని ప్రకటించారు. రుణ మాఫీ సాధ్యం కాదంటూ కాంగ్రెస్, వైసీపీ విమర్శిస్తున్నాయని, ఆ పార్టీలకు దమ్ముంటే రుణమాఫీకి వ్యతిరేకమని ప్రకటించాలని సవాల్ విసిరారు. తన చివరి రక్తపు బొట్టు ఉన్నంత వరకు పేదల బాగు కోసం పోరాటం చేస్తానని వెల్లడించారు. స్థానిక ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఆ పనిని వాయిదా వేయడం వల్ల రూ.2500 కోట్ల కేంద్ర నిధులు వెనక్కి వెళ్లిపోయాయని విమర్శించారు. ఇదిలాఉండగా, పాదయాత్రగా సాగిన చంద్రబాబుకు ముథోల్, నిర్మల్ నియోజక వర్గాల్లో అపూర్వ స్వాగతం లభించింది. పలు గ్రామాల్లో మంగళ హారతులతో పెద్దఎత్తున మహిళలు ఎదురొచ్చారు. పూలమాలలు వేసి సమస్యలపై వినతి పత్రాలు సమర్పించారు.

"తెలుగుదేశం హయాంలో వేసిన రోడ్లే సార్. అప్పటి రోడ్లపై ఇప్పటి ప్రభుత్వం తట్టెడు మట్టి కూడా పోయలేదు. వీధి బల్బులు కూడా పెట్టడం లేద''ని కుంటాల మండలం తురాటి గ్రామస్తులు గోడు వెళ్లబోసుకున్నారు. పత్తి పంటకు పెట్టిన పెట్టుబడి రాలేని పరిస్థితి ఉందని, ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించకపోవడంతో తమ పరిస్థితి అధ్వానంగా మారిందని నందన్ గ్రామ మహిళలు వాపోయారు. అధికారంలోకి వచ్చిన వెంటనే వికలాంగులకు రూ.1500 పింఛన్ ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. నర్సన్న అనే అంధుడికి రూ.2 వేల ఆర్థిక సహాయం అందించారు.

కాగా, ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటల తరువాత ప్రారంభిస్తున్న చంద్రబాబునాయుడి పాదయాత్ర ఆదివారం మాత్రం మధ్యాహ్నం 3.30కి ప్రారంభమైంది. పాదయాత్రలో ఎంపీ నామ నాగేశ్వర్‌రావు, టీడీపీ తెలంగాణ ఫోరం అధ్యక్షుడు ఎర్రబెల్లి దయాకర్‌రావు పాల్గొన్నారు. కాగా, భైంసాలో జరిగిన పాదయాత్రలో పాల్గొని ఇంటికి వెళ్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన ముగ్గురు ఎమ్మార్పీఎస్ కార్యకర్తల కుటుంబాలను ఆదుకుంటానని చంద్రబాబు హామీ ఇచ్చారు.

తప్పు చేస్తే శిక్ష తప్పుదు

09.12.2012 "vastunna meekosam" padayatra photos ( part-1)