December 8, 2012

08.12.2012 "vastunna meekosam" padayatra photos (andhrajhothi)

కుంటాల/భైంసా/లోకేశ్వరం/ముథోల్: వస్తున్నా మీకోసం పాదయాత్రలో భాగంగా మూడవ రోజైన శనివారం భైంసా నుంచి కుంటాల మం డం వరకు ప్రజలు చంద్రబాబుకు అ డుగడుగున నీరాజనం పలికారు. మీ రు మళ్లీ అధికారంలోకి రావాలి.. మా కష్టాలు తీర్చాలి అని వేడుకున్నారు. రెండు రోజుల పాదయాత్రతో పోలిస్తే శనివారం పాదయాత్రకు ప్రజలు, కా ర్యకర్తలు భారీగా తరలివచ్చారు. ఎక్క డ చూసినా 61వ జాతీయ రహదారి జనసంద్రమైంది. ప్రజాస్పందనను చూసిన బాబు ఉత్సాహంగా నడుస్తూ అవకాశం చిక్కినప్పుడూ ప్రజలతో ము చ్చటిస్తూ ముందుకు సాగారు.

మాటే గాం సమీపంలో వ్యవసాయ కూలీలతో మాట్లాడారు. తమకు కూలీ గిట్టుబాటు అవుతలేదని చంద్రబాబుతో వా రు వాపోయారు. నిత్యవసర ధరలు పె రిగాయని ఏమి తినేటట్లు లేదని తెలిపారు. షిర్డికి పాదయాత్రగా వెళ్తున్న సా యిభక్తులు చంద్రబాబును కలిసి మీ లాంటి వ్యక్తే రాష్ట్రానికి మళ్లీ ముఖ్యమంత్రిగా వస్తే మంచి జరుగుతుందని అన్నారు. మరికొంతమంది వృద్ధులు తమకు పింఛన్లు రావడం లేదని గోడు వెళ్లబోసుకున్నారు. వీటిపై స్పందించిన చంద్రబాబునాయుడు టీడీపీని ఆదరించి గెలిపిస్తే ఇంటి పెద్దకొడుకుగా మీ కష్టాలన్నీ తీరుస్తానన్నారు.

చంద్రబాబు పాదయాత్రపైఇంటెలీజెన్స్ ఆరా...జిల్లాలో మూడు రోజులుగా కొనసాగుతున్న వస్తున్నా మీకోసం చంద్రబాబు పాదయాత్రపై ఇంటలిజెన్స్ అధికారులు ఆరా తీశారు. చంద్రబాబు ప్ర సంగించిన సమయంలో ప్రజాస్పందన ఎలా ఉంది.జనసమీకరణ తదితర అం శాలపై ఆరా తీశారు. చంద్రబాబు పై ప్రజల నాడి ఎలా ఉందో తెలుసుకు నే ప్రయత్నం కూడా చేశారు.

బాబు పాదయాత్రకు విశేష స్పందన...

భైంసా/ముథోల్/లోకేశ్వరం/కుంటాల : టీడీపీ అధికారం ఇస్తే గ్రా మీణ ప్రాంతాల్లో పరిశ్రమలను ఏర్పా టు చేసి నిరుద్యోగ సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని టీడీపీ అధినేత చం ద్రబాబునాయుడు అన్నారు. పాదయాత్రలో భాగంగా మూడవ రోజైన శనివారం భైంసాలోని దుర్గ ఇండస్ట్రీస్‌లో వ్యాపార, కులవృత్తుల సమావేశంలో మాట్లాడారు.

గ్రామీణ ప్రాంతాల్లో అవసరమైన పరిశ్రమలను ఏర్పాటు చేస్తే ఇక్కడ ఉన్న నిరుద్యోగులు పట్టణ ప్రాంతాలకు వలస వెళ్లకుండా స్థానికంగానే ఉద్యోగాలు పొందవచ్చని అన్నా రు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కు లవృత్తులు, చేతివృత్తుల వారు రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఉన్న పరిశ్రమలకు సైతం ప్రభుత్వం విద్యుత్‌ను అందించలేని స్థితిలో ఉందని విమర్శించారు. నిండు మనసుతో ఆశీర్వదిస్తే సుపరిపాలన అందిస్తానన్నారు.

వ్యవసాయాన్ని లాభసాటి చేస్తాటీడీపీకి అధికారాన్ని అప్పగిస్తే వ్యవసాయాన్ని లాభసాటి చేసి రైతు కళ్లలో ఆనందాన్ని నింపుతానని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అన్నా రు. మాటేగాం సభలో మాట్లాడుతూ వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చే క్రమంలో రైతుల రుణాలన్నింటినీ మాఫీ చేస్తూ తొలి సంతకం పెడతానని ప్రకటించారు. అంతేకాకుండా రైతాంగానికి తొమ్మిది గంటల పాటు నాణ్యమైన విద్యుత్‌ను అందిస్తామన్నారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేస్తామన్నారు. సామాన్య, మధ్యతరగతి ప్రజలకు గుదిబండగా మారిన నిత్యావసర వస్తువుల ధరలను అదుపులో ఉంచుతామన్నారు. మీ పిల్లల చదువు బాధ్యతలను తామే తీసుకొని డాక్టర్లు, ఇంజనీర్లుగా తీర్చిదిద్దుతామన్నారు. నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి చెల్లిస్తామన్నారు.

జనాభా దామాషా పద్ధతిన అన్ని వర్గాల ప్రజలను ఆదుకుంటామని స్పష్టం చేశారు. 2500 కోట్లతో మైనార్టీ సంక్షేమానికి ప్రత్యేకంగా కృషి చేస్తామని వెల్లడించా రు. వికలాంగులకు ప్రత్యేక పాలసీని అమలు చేస్తామన్నారు. 500 జనాభా ఉన్న ప్రతి తండాను గ్రామ పంచాయతీలుగా మారుస్తామన్నారు. దేశంలో ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక గుర్తింపు తెచ్చేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపడతామన్నారు. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని జగన్‌మోహన్ రెడ్డి ప్రజాధనాన్ని దోచుకున్నారని విమర్శించారు. తెలంగాణపై అధికారంలో ఉన్నవారు ఏ నిర్ణయం తీసుకోకుండా టీడీపీని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారని, ప్రజలు దీనిని గమనించాలని కోరారు. చంద్రబాబు నాయుడుతో పాటు జిల్లా ఎంపీ రాథోడ్ రమేష్, పార్టీ జిల్లా అధ్యక్షుడు నాగేష్, ముథోల్ నియోజక వర్గ ఇన్‌చార్జి నారాయణరెడ్డి, లోలం శ్యామ్‌సుందర్, జుట్టు అశోక్, రమాదేవి తదితరులు ఉన్నారు.

కాంగ్రెస్ అవినీతిని ఎండగట్టిన బాబుకుంటాల/లోకేశ్వరం : అధికారం చేజిక్కించుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధిని మరిచి అవినీతిలో ము నిగిపోయిందని టీడీపీ అధినేత చంద్ర బాబు నాయుడు విమర్శించారు. పాదయాత్రలో శనివారం రాత్రి 9:45 గంటలకు కుంటాల మండలంలోని కల్లూర్ గ్రామంలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.

కాంగ్రెస్ ప్రభుత్వం కల్లిబొల్లి కబర్లు చెప్పి అధికారంలోకి వచ్చిందని వచ్చిన నాటి నుంచి అవినీతికి తెర లేపిందన్నారు. ఉచిత విద్యుత్ అంటూనే ప్రస్తుతం గృహ విద్యుత్‌కు సర్ చార్జీలు విధిస్తూ సామాన్యుడి నడ్డి విరుస్తోందన్నారు. కాంగ్రెస్ పాలనలో మంత్రులు, అధికా రులు సైతం నిందితులయ్యారని విమర్శించారు. లక్షల కోట్లు అక్రమం గా దండుకున్నారని పేర్కొన్నారు. నిత్యవసర సరుకుల ధరలతో పాటు డిజిల్, పెట్రోల్ ధరలు పెంచారన్నా రు. ఇప్పటికే కాంగ్రెస్‌లో నుంచి విడిపోయిన పిల్ల కాంగ్రెస్ అధికారం కోసం తహతహలాడుతోందని వారికి అధికారం ఇస్తే రాష్ట్రాన్ని అమ్మి వేస్తారన్నారు. సామాజిక న్యాయం అంటూ రాజకీయాల్లోకి వచ్చిన సినీ నటుడు చిరంజీవి మంత్రి కాగానే కాంగ్రెస్‌లో పార్టీని విలీనం చేశారని విమర్శించారు. పేదల పార్టీ టీడీపీ పార్టీ అని మరోసారి తనకు అవకాశం ఇస్తే పెద్దబిడ్డగా రాష్ట్ర అభివృద్ధి కోసం అంకితమవుతానని పేర్కొన్నారు. ప్రత్యేక తెలంగాణ కోసం తానెప్పుడూ వ్యతిరేకిని కానని స్పష్టం చేశారు.

అఖి లపక్ష సమావేశం నిర్వహిస్తే తమ వైఖరిని స్పష్టం చేస్తామన్నారు. వృద్ధు ల, వికలాంగుల, మహిళల యువత కోసం పలు సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టడానికి ముందుంటానన్నారు. కుం టాల మండలంలోని సమస్యల పరి ష్కారానికి తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. చంద్రబాబు వెంట ముథోల్ నియోజకవర్గ ఇన్‌చార్జీ ఎల్. నారాయణరెడ్డి, ఆదిలాబాద్ నియో జకవర్గ ఇన్‌చార్జీ పాయల్ శంకర్, టీడీ పీ జిల్లా నాయకులు యూనిస్ అక్బానీ, అబ్దుల్ కలాం తదితరులు ఉన్నారు.

నారాయణ్‌రెడ్డిముథోల్ టిక్కెట్ ఇవ్వాలికుంటాల/భైంసా/ముథోల్/లోకేశ్వరం : ముథోల్ టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జిగా ఉన్న నారాయణ్‌రెడ్డికే అసెంబ్లీ టికెట్‌ను ఇవ్వాలని ఓ కార్యకర్త బాబు బహిరంగ సమావేశంలో మైకు పట్టుకుని విజ్ఞప్తి చేశారు.

పాదయాత్రలో భాగంగా మాటేగాం వద్ద ఆగిన చంద్రబాబు కార్యకర్తలకు మైకు ఇచ్చి మాట్లాడాల్సిందిగా కోరారు. దీంతో మకు అందుకున్న ఓ కార్యకర్త నీతివంతుడైన నారాయణరెడ్డికి టికెట్ ఇచ్చి గెలిపిస్తే నియోజకవర్గంలో కార్యకర్తలకు న్యాయం జరుగుతుందన్నారు. దీంతో అక్కడ ఉన్న ప్రజలు, కార్యకర్తలు చప్పట్లు కొట్టారు.

బాబు దీనిపై స్పందిస్తూ నీతివంతమైన వారికే ఓటు వేసి గెలుపించుకోవాలని అన్నారు.

చంద్రబాబు దిష్టిబొమ్మ దహనంతానూరు : మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద శనివారం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దిష్టిబొమ్మను మండల మాల మహనాయకులు దహనం చేశారు. శాంతియుతంగా నిరసన కార్యక్రమం చేపడుతుండగా పోలీసులు లాఠీచార్జీ చేయడం అమానుషం అన్నారు. సాయినాథ్ బద్రే, రాందాస్ పవార్, సాహెబ్‌రావు, భీంరావు పవార్ తదితరులు ఉన్నారు.

గ్రామీణ ప్రాంతాల్లో పరిశ్రమలు ఏర్పాట్లు

బాసర: బాసర సరస్వతీ అమ్మవారిని శనివారం టీడీపీ అధినేత నారాచంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి దర్శించుకున్నారు. జిల్లా లో సాగుతున్న వస్తున్నా మీ కోసం పాదయాత్రలో ఉన్న చంద్రబాబు నాయుడిని కలిసేందుకు హైదరాబాద్ నుంచి భైంసాకు వెళ్తూ మార్గమధ్యంలో ఆలయాన్ని సందర్శించారు. ఆలయం వద్దకు చేరుకున్న ఆమెకు ఆ లయ పండితులు మంగళ వాయ్యిదాలతో ఘనస్వాగతం పలికారు. సరస్వతీదేవిని దర్శించుకుని ఆమె ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ప్రసాదాన్ని అందజేసి పండితులు ఆమెను ఆశీర్వాదించారు

అమ్మవారిని దర్శించుకున్న చంద్రబాబు సతీమణి

ఆదిలాబాద్ : జిల్లాలో అధికంగా గిరిజనులు ఉన్నారనీ, తా ను అధికారంలోకి వచ్చిన తరువాత గిరిజనులను అన్ని రంగాల్లో అ భివృద్ధి చేస్తానని టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు అన్నారు. వస్తున్నా.. మీ కోసం పాదయాత్రలో భాగంగా మూడో రోజు జిల్లాలోని భైంసా పట్టణంతోపాటు పిప్రికాలనీ, మాటేగాం, వానలపాడు, తిమ్మాపూర్ క్రాస్‌రోడ్, కల్లూరు, బూర్గుపల్లి, అ ర్లిక్రాస్‌రోడ్, చాక్‌పల్లి, కుంటాల క్రా స్‌రోడ్ వరకు 14 కిలోమీటర్ల వరకు శనివారం పాదయాత్ర నిర్వహించా రు. ఈ సందర్భంగా భైంసా, మా టే గాం, వానల్‌పాడ్, కల్లూరు, బూరుగు పల్లి వద్ద నిర్వహించిన సమావేశాల్లో ఆయన మాట్లాడారు.

బీడీ కా ర్కానాల్లో, జిన్నింగ్‌లలో, దారి పొడువునా రైతులతో ఆయన మా ట్లాడారు. 5 వందల జనాభా ఉన్న ప్ర తి గిరిజన గూడెం, తండాను ప్రత్యేక పంచాయతీలుగా ఏర్పాటు చేయిస్తాన నీ, గిరిజనులకు రూ. లక్షా 50 వేలతో ఇళ్లు నిర్మించి ఇస్తామనీ, ఉచితంగా రెండు ఎకరాల భూమి, గిరిజనుల పి ల్లలకు ఎల్‌కేజీ నుంచి పీజీ వరకు ఉ చిత విద్య, గిరిజనుల ఆడపిల్లలకు రూ. 50 వేలను ఇచ్చి వివాహం జరిపిస్తానని చెప్పారు. కాంగ్రెస్ పాలనలో కుల, చేతి వృత్తులు దెబ్బతిన్నాయనీ, తాను అధికారంలో ఉన్నప్పుడు ఆదరణ పథకం కింద ఇచ్చిన పనిముట్లే కనిపిస్తున్నాయన్నారు. మంగలి షాపు ల్లో కుర్చీలు, లాండ్రీషాపుల్లో ఇస్త్రీ పె ట్టెలు ఆదరణ పథకం కింద ఇచ్చామ ని, అవి ఇప్పుడు ఆ దుకాణాల్లో కనిపిస్తున్నాయన్నారు.

విద్యుత్ కోత వల్ల జిన్నింగ్ ఫ్యాక్టరీలు పని చేయకపోవడంతో వేలాది మంది కార్మికులు ఉ పాధి కోల్పోయారన్నారు. జిల్లాలో ల క్షలాది మంది బీడీ కార్మికులు ఉన్నార ని, వెయ్యి బీడీలకు 110 రూపాయలు ఇస్తున్నారన్నారు. బీడీలు చుట్టడం వల్ల వారి ఆరోగ్యాలు పాడైపోతున్నాయనీ, నెలకు 12 రోజులు పని కల్పించడంతో బీడీ కార్మికులు పస్తులుంటున్నారన్నారు. టీడీపీ అధికారంలోకి వ చ్చిన తరువాత వెయ్యి బీడీలకు రూ. 150, నెలకు 26 రోజులు పని కల్పించడంతోపాటు ఈఎస్ఐ ఆసుపత్రులను ఏర్పాటు ఏయడంతోపాటు బీడీ కార్మికులకు రూ. లక్షా 50 వేలతో ఇళ్లు ని ర్మించి ఇస్తామన్నారు. జిల్లాలో 10 ల క్షల ఎకరాల్లో పత్తి పంటను సాగు చే స్తున్నారని, పెరిగిన ఎరువుల ధరల వల్ల పెట్టుబడి పెరిగి, ఈ ఏడు దిగుబడి తగ్గిందన్నారు. దానికి తోడు ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో గిట్టుబాటు ధర లభించడం లేదన్నారు.

క్వింటాలు పత్తికి రూ. 5 వేల మద్దతు ధర లభించేలా కృషి చేస్తానన్నారు. రైతులు తీసుకున్న అన్ని రుణాలను మాఫీ చేస్తాననీ, ముఖ్యమంత్రి అయిన తరువాత రుణ మాఫీ ఫైల్‌పైనే తొలి సంతకం చేస్తానన్నారు. బెల్ట్‌షాపులను తొలగిస్తామన్నారు. కాంగ్రెస్ నేతలు రైతుల ఇన్‌పుట్ సబ్సిడీ రూ. 4 కోట్లను కాజేస్తే ఒక ఏడీఏ జైలు పాలయ్యారనీ, కాంగ్రెస్ నేతలు మాత్రమే బయట హాయిగా తిరుగుతున్నారన్నారు. అర్హులైన వారికి పింఛన్లు ఇవ్వడం లేదనీ, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మాత్రమే పింఛన్లు ఇచ్చారని ఆరోపించారు. పాఠశాలల గదుల కొరత, ప్రహారీలు లేకపోవడంతో విద్యార్థులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నా రు. గ్రామాల్లో సీసీ రోడ్లు, మురికి కా లువలు లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

వేణుగోపాలచారిని ఎమ్మెల్యే, ఎంపీ, రాష్ట్ర, కేంద్ర మం త్రిని చేస్తే ఆయన ప్రలోభాలకు లొంగి పార్టీని వీడాడనీ, ఇలాంటి అవకాశవాద నాయకులను చిత్తుచిత్తుగా ఓ డించాలన్నారు. పార్టీని వీడిన వారు కా ర్యకర్తలను బెదిరిస్తున్నారనీ, వారికి భ యపడవద్దనీ, అవసరమైతే కార్యకర్తల కోసం తన ప్రాణాలను సైతం అర్పిస్తానన్నారు. సమావేశాల్లో ఎంపీ రమేశ్‌రాథోడ్, ఎమ్మెల్యే, టీడీపీ జిల్లా అధ్యక్షుడు నగేశ్, టీడీపీ నాయకులు లోలం శ్యాం సుందర్, పాయల శంకర్, నారాయణరెడ్డి, టీడీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీశైలం, వికలాంగుల సంక్షేమ కార్పొరేషన్ మాజీ చైర్మన్ కోటేశ్వర్‌రావు జీవీ రమణ, కడెం మాజీ ఎంపీపీ రాజేశ్వర్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

గిరిజనుల అభివృద్ధికి కృషి.. చంద్రబాబు

జగన్ డబ్బుకు అమ్ముడుపోతున్నారు
అలాంటి నేతలను చిత్తు చేయండి
అదంతా రాష్ట్రాన్ని దోచి కూడబెట్టిందే
అందులే పదిశాతం పంచినా గ్రామాలకు మహర్దశ
పార్టీని వదిలేసిన వాళ్ల బెదిరింపులకు వెరవం
కార్యకర్తల కోసం ప్రాణాలు ఇస్తా
ఆదిలాబాద్ పాదయాత్రలో చంద్రబాబు

ఆదిలాబాద్, డిసెంబర్ 8 :పంట చేన్లలో అడవి పందులు పడి తిన్నట్టు రాష్ట్రంలో కాంగ్రెస్ నేతలు పడి తింటున్నారని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు తీవ్రంగా మండిపడ్డారు. కాంగ్రెస్ ఐ తల్లి పార్టీ అయితే కాంగ్రెస్ వై ( వైసీపీ) పిల్ల కాంగ్రెస్ అని, ఆ రెండు ఒకటవ్వడం ఖాయమని వ్యాఖ్యానించారు. జగన్ దోచిన లక్ష కోట్ల డబ్బులో పది శాతం ఖర్చు చేసినా ఎన్నో గ్రామాలు అభివృద్ధి చెందుతాయని పేర్కొన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో మూడో రోజైన శనివారం భైంసా పట్టణం నుంచి చంద్రబాబు పాదయాత్ర మొదలైంది. పిప్రికాలనీ, మాటేగాం, వానలపాడు, తిమ్మాపూర్ క్రాస్‌రోడ్, కల్లూరు, బూర్గుపల్లి, అర్లిక్రాస్‌రోడ్, చాక్‌పల్లి, కుంటాల క్రాస్‌రోడ్, అర్లీ క్రాస్ వరకు 16 కిలోమీటర్ల దూరం నడిచారు.

కార్ఖానాల్లో కార్మికులను పలకరిస్తూ, బీడు భూముల్లో రైతుల బాధలు వింటూ ముందుకు సాగారు. భైంసాలోని బీడీ కార్ఖానాల్లోకి వెళ్లి బీడీ కార్మికులను పలకరించారు. వారి చెప్పిన సాధక బాధకాలు విని ధైర్యం చెప్పారు. అనంతరం భైంసా, మాటేగాం, వానల్‌పాడ్, కల్లూరు, బూరుగుపల్లి సభల్లో ప్రసంగించారు. వైఎస్ జగన్ లక్ష కోట్ల రూపాయలను దోచుకున్నారనీ, ఆ డబ్బులతోనే ఎమ్మెల్యేలను, ఎంపీలను కొంటున్నారని మండిపడ్డారు. అలాంటి ప్రలోభాలకు లొంగిపోయిన వారిని చిత్తుగా ఓడించాలని కోరారు. పార్టీని వీడిన వారు..పార్టీ కార్యకర్తలను బెదిరిస్తున్నారనీ, వారి బెదిరింపులకు భయపడవద్దని పిలుపునిచ్చారు.

అవసరమైతే కార్యకర్తల కోసం ప్రాణాలు అర్పిస్తానన్నారు. తాను ఏ కులానికి వ్యతిరేకం కాదని, సామాజిక న్యాయం కోసమే పార్టీ పాటుపడుతున్నదంటూ..భైంసాలో శుక్రవారం మాలల నిరసన యత్నాన్ని పరోక్షంగా గుర్తు చేశారు. కాంగ్రెస్ పాలనలో హైదరాబాద్ అవినీతికి కేంద్రంగా మారిందని మండిపడ్డారు. అధికారంలోకి వస్తే గోదావరి జలాలను తరలించి గిరిజనులకు తాగునీటిని సరఫరా చేస్తానని భరోసా ఇచ్చారు. వెయ్యి బీడీలకు 150 రూపాయలు ఇచ్చేలా, మరిన్ని ఈఎస్ఐ ఆసుపత్రులు ఏర్పాటు చేసేలా చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చి, రైతులు తీసుకున్న రుణాలను మాఫీ చేస్తానని హామీ ఇచ్చారు.

రాష్ట్రాన్ని గుజరాత్ చేయండి సార్
యువకుడి విన్నపం
ఆదిలాబాద్ జిల్లా మాటేగాం గ్రామంలో చంద్రబాబుకు ఓ అరుదైన అనుభవం ఎదురైంది. అవినీతి రూపుమాపే చర్యలపై మాట్లాడాలని చంద్రబాబు కోరగా.. ఓ యువకుడు ముందుకొచ్చాడు. తన పేరు చంద్రశేఖర్ అని పరిచయం చేసుకున్నాడు. "మీరు మళ్లీ సీఎం కావాలి సార్.. ఆ తరువాత మన రాష్ట్రాన్ని గుజరాత్‌గా మార్చే బాధ్యత మీదే'' అని అభ్యర్థించారు.

అప్పటి టీడీపీ పాలనను, ఇప్పటి కిరణ్ పాలనతో పోల్చుతూ చంద్రశేఖర్ వెలిబుచ్చిన అభిప్రాయాలను చంద్రబాబు చిరునవ్వుతో ఆలకించారు. "ఈ ఎనిమిదేళ్లు మీరే ముఖ్యమంత్రిగా ఉండిఉంటే మన ఆంధ్రప్రదేశ్ కూడా గుజరాత్ రాష్ట్రంలా వెలిగిపోయేది'' అని చెప్పారు. చంద్రబాబు సీఎం అయితే, మోడీ గుజరాత్‌ను అభివృద్ధి చేసినట్టు రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారన్న ఆశాభావాన్ని వెలిబుచ్చారు.

సీరియస్‌గా తీసుకుంటా: బాబు
ఆదిలాబాద్: "వచ్చారు.. కలిశారు.. ఇలాంటి వాటిని సీరియస్‌గా తీసుకుంటాను. కఠినంగా ఉంటాను''.. ఎఫ్‌డీఐల ఓటింగ్ సమయంలో కొందరు పార్టీ ఎంపీల గైర్హాజరీపై చంద్రబాబు వ్యాఖ్య ఇది. చిల్లర వర్తకంలోకి ఎఫ్‌డీఐలను అనుమతించే విషయమై రాజ్యసభలో శుక్రవారం జరిగిన ఓటింగ్‌లో టీడీపీకి చెందిన ఐదుగురు ఎంపీల్లో ముగ్గురు పాల్గొనలేదు. ఈ అంశం శనివారం వానల్‌పాడు గ్రామానికి పాదయాత్ర చేరుకున్నప్పుడు ప్రస్తావనకు వచ్చింది.

గ్రామంలో ఏర్పాటుచేసిన సభలో పాల్గొన్న చంద్రబాబు, కాంగ్రెస్.. వైసీపీ నేతల అవినీతిపై చెలరేగి విమర్శలు చేస్తున్న సమయంలో సభలోని ఓ యువకుడు ముందుకొచ్చాడు. "ఎఫ్‌డీఐలపై ఓటింగ్‌లో పాల్గొనని రాజ్యసభ సభ్యులపై చర్యలు తీసుకోవాలని'' గట్టిగా అరిచాడు. ఆవేశంతో ఊగిపోతున్న అతడికి సర్దిచెప్పేందుకు అక్కడి కార్యకర్తలు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. దీంతో చంద్రబాబే స్పందించాల్సి వచ్చింది.

వైసీపీ కాదు.. కాంగ్రెస్ వై:పాదయాత్రలో చంద్రబాబు
కల్లూరు దారిలో కలిసిన ఏ రైతును కదిలించినా కన్నీరే. తెలంగాణలో, అందులోనూ ఆదిలాబాద్‌లో పత్తి పంట ఎక్కువ. వాళ్లంతా కౌలు రైతులే. ప్రభుత్వం విదిలిస్తున్న రూ.3900 ఏ పాటి? ప్రభుత్వ కనీస మద్దతు ధర ఖరారు తీరే లోపభూయిష్టం. ఎరువులు, పురుగు మం దుల ధరలు మండిపోతున్నా, ఆ మంటల సెగలో రైతు బతుకు బుగ్గి అవుతున్నా నీరో చక్ర వర్తిలా ప్రభుత్వం పొద్దుపుచ్చుతోంది. ఎంతటి అసమర్థ పాలకులు వీళ్లు! రైతు ప్రభుత్వం అని చెప్పుకొంటూ వాస్తవంలో ఇచ్చే మద్దతు ఇదా?

ఉపాధి హామీ పథకం వచ్చాక పొలంలో దిగే కూలీ కనిపించడం లేదు. ఎక్కడైనా ఉన్నా అంతకుఅంత ఇచ్చి తీసుకురావాల్సిన పరిస్థితి. ఒక్కోసారి నాలుగైదు కిలోమీటర్ల నుంచి ట్రాక్టర్ల మీద తరలించాల్సి వస్తోంది. ఉపాధి పథకం మంచిదే. కానీ, రైతునూ పట్టించుకోవాలి కదా? ఈ పథకాన్ని రైతుకు శత్రువుగా మార్చడం దగ్గరే ప్రభుత్వం కుట్ర ఉన్నదనిపిస్తోంది. పత్తికి కేజీకి ఆరు, ఏడు రూపాయలు ఖర్చు చేస్తున్నామని చాక్‌పల్లి రైతులు వాపోయారు. దిగుబడి మాత్రం ఎకరాకు రెండు, మూడు క్వింటాళ్లు మించడం లేదని చెబుతుంటే..పత్తి చేతిలో నిలువునా చిత్తవుతున్న రైతులు కళ్లలో మెదిలారు.

వ్యవసాయ దేశంలో ఏది పట్టినా, పట్టకున్నా రైతును విస్మరిస్తే మాత్రం అనర్ధాలు తప్పవు. ఈ విషయం గుర్తించి మార్క్‌ఫెడ్, సీసీఐలను పరుగులు తీయించాలి. కానీ, ఏ గ్రామంలోనూ అలాంటి హడావుడి కనిపించలేదు. ప్రైవేట్ వ్యాపారులు సిండికేట్లుగా తయారై మరీ దారుణమైన ధరలకు రైతుల వద్ద కొనుగోలు చేస్తున్నారు. వాళ్ల బాధలన్నీ విన్న తరువాత పత్తికి కనీసం మద్దతు ధర రూ. 5000 ఉంటే తప్ప రైతులు కోలుకునే పరిస్థితి లేదనిపించింది. నెపం ప్రకృతిపైకి నెడితే కుదరదు. ఇలాంటప్పుడు ఆదుకుంటారనే కదా ఓట్లేసి గెలిపించింది. ఆ పనీ చేయలేకపోతే ఆ పదవి ఎందుకు?

ప్రతి రైతు కంటా కన్నీరే!

08.12.2012 "vastunna meekosam" padayatra photos (eenadu)