December 3, 2012

రాష్ట్రం కోసం చంద్రబాబు నాయుడు సాహసం చేస్తున్నారని, వ స్తున్నా మీ కోసం యాత్ర సాహస యా త్ర అని టీడీఎల్‌పీ భేటీలో సీనియర్ నాయకులు మోత్కుపల్లి నర్సింలు అ న్నారు. టీడీఎల్‌పీ సమావేశంలో పలువురు సీనియర్ ఎమ్మెల్యేల అభిప్రాయాలను చంద్రబాబు తెలుసుకున్నా రు. సాలంపాడ్‌లో నిర్వహించిన టీడీఎల్‌పీ భేటీలో పలువురు సీనియర్ ఎ మ్మెల్యేలు బాబు యాత్ర మన అందరి కి ఆదర్శనమన్నారు. మోత్కుపల్లి నర్సి ంలు మాట్లాడుతూ 2014లో టీడీపీ అధికారంలోకి రావడం ఖాయమని, చంద్రబాబు యాత్రతో పార్టీ పరిస్థితి మెరుగు పడిందన్నారు. ఎన్ని ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నా వీరు ముందుకు సాగుతున్న తీరు అభినందనీయమన్నారు.

శాసన మండలి ఫ్లోర్ లీడర్ దాడి వీరభద్రరావు మాట్లాడు తూ రాష్ట్రంలో కొన్ని నియోజకవర్గాల్లో పాదయాత్రలు చేపట్టడం లేదని కొం దరు నేతలు హైదరాబాద్ పార్టీ కార్యాలయానికే పరిమితం అవుతున్నారన్నా రు. ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్యే సుమ న్ రాథోడ్ మాట్లాడుతూ తన నియోజకవర్గంలో రెండు మండలాల్లో పాదయాత్ర పూర్తి చేశానని, ఇంకా రెండు మండలాల్లో మీ యాత్ర వచ్చేలోపు పూర్తి చేస్తానన్నారు. ప్రజలకు రుణాలు చెల్లించొదన్నారు. కరీంనగర్ జిల్లా పా ర్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే విజయరమణరావు మాట్లాడుతూ పాదయాత్రతో క్యాడర్‌లో ఉత్సాహం పెరిగిందని, కరె ంటు సరఫరా అస్తవ్యస్తంగా మారింద ని, ట్రాన్స్‌ఫార్మర్లు నెలలతరబడి ఇ వ్వడం లేదని చంద్రబాబుకు స్పష్టం చే శారు. మహబూబ్‌నగర్ జిల్లా ఎ మ్మెల్యే జైపాల్‌యాదవ్ మాట్లాడతూ బీసీ, మైనార్టీ, మహిళ డిక్లరేషన్లు ఎం తో ఉపయోగకరంగా ఉన్నాయని, ఎ స్సీ వర్గీకరణ విషయంలో పార్టీ తీసుకున్న నిర్ణయం క్షేత్ర స్థాయిలో ఎంతగానో ఉపయోగపడుతున్నాయన్నారు. ఎమ్మెల్యేలు చెప్పిన మాటలు విన్నబాబు క్షేత్ర స్థాయిలో అందరు పాదయాత్రలు చేయాలని, అవినీతిని ఎండగట్టాలని, వైఎస్సార్‌సీపీ, టీఆర్ఎస్ కు ట్రలను ప్రజలకు తెలియజేయాలన్నా రు. సమావేశంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఎర్రబెల్లి దయాకర్‌రావు, మండవ వెంకటేశ్వర్‌రావు, అన్నపూర్ణమ్మ, అరికెల నర్సారెడ్డి, వీజీగౌడ్, హన్మంత్‌షిండే, సీతక్క, రేవంత్‌రెడ్డి, దూలిపాల నరేంద్ర, రామారావు పాల్గొన్నారు.

రాష్ట్రం కోసం చంద్రబాబు నాయుడు సాహసం చేస్తున్నారు: మోత్కుపల్లి

 టీడీపీ అధినేత చంద్రబాబునాయు డు వస్తున్నా.. మీ కోసం పాదయాత్ర ఒక రోజు ఆలస్యంగా ప్రారంభమవుతోంది. ఈ నెల 5 నుంచి ప్రారంభం కావాల్సిన యాత్ర 6 నుంచి ప్రారంభం కానుంది. మొదటి రోజు బాసరలో చి వరి రోజు ఖానాపూర్‌లో బహిరంగ స భలను నిర్వహించనున్నారు. పాదయాత్ర కొనసాగే గ్రామాల్లో నిర్వహిం చే సమావేశాల్లో చంద్రబాబునాయు డు ప్రసంగిస్తారు. నిజామాబాద్ జిల్లా నుంచి జిల్లాలో ప్రవేశించే చంద్రబాబునాయుడు పాదయాత్ర జిల్లాలోని పలు మండలాల మీదుగా సాగి కరీంనగర్ జిల్లాకు చేరుకుంటుంది. ఈ నెల 6 నుంచి 13వ తేదీ వరకు జిల్లాలోని మూడు నియోజవర్గాల్లో చంద్రబాబునాయుడు పాదయాత్ర చేపట్టనున్నా రు.

మొత్తం 8 రోజుల్లో 124 కిలోమీటర్లకుపైగా చంద్ర బాబునాయుడు పాదయాత్ర నిర్వహించనున్నారు. మొదటి రోజు 16.2 కిలోమీటర్లు, రెం డో రోజు 15.9, మూడో రోజు 15.5, నాలుగో రోజు 13.3, ఐదో రోజు 16.2, ఆరో రోజు 15.4, ఏడో రోజు 16.9, ఎ నిమిదో రోజు 15.7 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తారు. నిజామాబాద్ జిల్లాలోని నవీపేట మండలంలోని ఎంచ గ్రామం నుంచి ఈ నెల 5 రాత్రి చంద్రబాబునాయుడు పాదయాత్ర బాసరకు చేరుకుంటుంది. బాసరలో రాత్రి బస చేసి 6న ఉదయం బాసర అమ్మవారికి పూ జలు నిర్వహించిన జిల్లాలో చంద్రబాబునాయుడు పాదయాత్ర ప్రారంభమవుతుంది. బాసరలో నిర్వహించే బ హిరంగ సభలో చంద్రబాబునాయు డు ప్రసంగిస్తారు. అనంతరం చంద్రబాబునాయుడు పాదయాత్ర మైలాపూర్, బాసర త్రిబుల్ ఐటీ, బిద్రవల్లికి చేరుకుంటుంది. బిద్రవెల్లిలో భోజనం చేసి టాక్లీ, ముథోల్‌క్రాస్‌రోడ్, మెయిన్‌రోడ్‌లో రాత్రి బస చేస్తారు. 7న ఉద యం తరోడ, సరస్వతీనగర్, దెగాం చే రుకుంటుంది. దేగాంలో భోజనం చేసి తరువాత బోకర క్రాస్‌రోడ్, నుంచి బైంసాకు చేరుకుంటుంది.

బైంసా మె యిన్‌రోడ్ పక్కన రాత్రి బస చేసి 8న ఉదయం మెటేగాం, వానల్‌పాడు చే రుకుంటుంది. అక్కడ భోజనం చేసిన తరువాత కుంటాల మండలంలోని తి మ్మాపూర్ క్రాస్‌రోడ్, కల్లూరు, బూర్గప ల్లి, ఆర్లిక్రాస్‌రోడ్, చాక్‌పల్లి, కుంటాలక్రాస్ రోడ్‌కు చేరుకుంటుంది. కుంటా ల క్రాస్‌రోడ్‌లో రాత్రి బస చేసి 9న ఉ దయం నందనక్రాస్, నర్సాపూర్, నసీరాబాద్, రాంపూర్, గుండపల్లి, దిలవార్‌పూర్ టెంపుల క్రాస్ రోడ్‌కు చేరుకుంటుంది. దిలవార్‌పూర్ చర్చి పక్కన రా త్రి బస చేసి 10న ఉదయం లోలం, కాల్వతండాక్రాస్, సిర్గాపూర్ క్రాస్, చి ట్యాలక్రాస్, తల్వేదక్రాస్‌కు చేరుకుంటుంది. తల్వేద క్రాస్‌లో భోజనం చేసి న తరువాత మంజులాపూర్, నిర్మల్ పట్టణంలోని ఈద్గాచౌరస్తా, రూరల్‌పోలీస్‌స్టేషన్ చేరుకుంటుంది. అక్కడ ని ర్వహించే బహిరంగ సభలో బాబుమా ట్లాడుతారు. తరువాత మంచిర్యాల క్రాస్‌రోడ్, శాంతినగర్‌చౌరస్తా మీదు గా వెంకటాపూర్ చేరుకుంటుంది.

వెం కటాపూర్‌లో రాత్రి బస చేసి 11న ఉద యం అక్కాపూర్, మార్జాపూర్, లక్ష్మణచందా మండలంలోని కొత్తవెల్మల్, వె ల్మల్ బొప్పారంలో మధ్యాహ్నం భోజ నం చేస్తారు. తరువాత పీచర, ధర్మా రం, మల్లాపూర్ చేరుకుంటుంది. మ ల్లాపూర్‌లో రాత్రి బస చేసిన తరువాత 12న లక్ష్మణచందా, కోరిటికల్‌క్రాస్ వ ద్ద మధ్యాహ్నాం భోజనం చేస్తారు. త రువాత కోరిటికల్, మామడ, పోనికల్‌క్రాస్, డాంబర్‌ప్లాంటు వద్ద రాత్రి బస చేస్తారు. 13న ఉదయం దిమ్మదుర్తి, ఎ క్బాల్‌పూర్, ఖానాపూర్‌క్రాస్‌రోడ్, ఖా నాపూర్ చేరుకుంటుంది. ఖానాపూర్ లో నిర్వహించే బహిరంగ సభలో మా ట్లాడుతారు. తరువాత బాధన్‌కుర్తి మీ దుగా కరీంనగర్ జిల్లా ఒబులాపూరం చేరుకుటుంది.

6నుంచి ఆదిలాబాద్ జిల్లాలో 'వస్తున్నా.. మీకోసం' పాదయాత్ర

వెయ్యి కిలోమీటర్లు నడిచా! లక్షలమందిని కలిశా! వేల ఆలోచనలు పంచుకున్నా! నా యాత్ర ఉద్దేశం నెరవేరుతున్నట్లే కనిపిస్తోంది! తొమ్మిదేళ్ల కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు, అవినీతిపై ప్రజల్లో చైతన్యం తీసుకు రావాలని భావించాను. కానీ, ఈ ప్రభుత్వం తమను ఎన్ని ఇబ్బందులకు గురి చేస్తోందో ప్రజలే స్వయంగా వచ్చి నాకు వివరిస్తున్నారు. కన్నీటితో తమ కష్టాలను చెబుతున్నారు. గోడు వెళ్లబోసుకుంటున్నారు. నా పాలనను గుర్తు చేసుకుని, ఈ పాలనతో పోల్చి చూసుకుంటున్నారు.

తొమ్మిదేళ్లపాటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రపంచస్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాను. అంతకుముందు నేషనల్ ఫ్రంట్, యునైటెడ్ ఫ్రంట్, ఎన్డీయే హయాముల్లో కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో అత్యున్నత పాత్రను పోషించాను. అదంతా ఓ శకం. నా రాజకీయ జీవితంలో ఇప్పుడు చేస్తున్న పాదయాత్ర వాటన్నిటికీ భిన్నమైనది. ఇదో కొత్త అనుభవం.

ఇప్పుడు రాజకీయాల్లో ఎన్నడూ చూడని కొత్త ధోరణులు వచ్చాయి. అధర్మం ధర్మంగా.. అవినీతి నీతిగా చలామణి అవుతోంది. పత్రికలు, టీవీలు పెట్టుకుని వింత పోకడలు పోతున్నారు. ప్రజలను మభ్యపెట్టడం, అయోమయానికి గురి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రజలకు వాస్తవాలు వివరించడం నా బాధ్యతగా భావించా. 63 ఏళ్ల వయసులో పాదయాత్ర అనే కఠిన నిర్ణయం తీసుకున్నా.

వ్యక్తిగతంగా, ఆరోగ్యపరంగా, శారీరకంగా అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అయినా, ప్రజల్లో ఉన్నందుకు ఉత్సాహంగా ఉంది. మంచి పని చేస్తున్నందుకు సంతోషంగా ఉంది. ఎన్నో అడ్డంకులు, అవాంతరాలను అధిగమించి వెయ్యి కిలోమీటర్లు పూర్తిచేశా. అన్నిటినీ అధిగమించి ముందుకు వెళుతున్నా ధర్మాన్ని రక్షించుకోవాలని, నీతిని కాపాడుకోవాలనే ధ్యేయంతో!! ఇప్పుడు రాష్ట్రంలో ఏ ఇద్దరు కలిసినా నా యాత్రపైనే చర్చ జరుగుతోంది. ప్రజల్లో చైతన్యమూ పెరుగుతోంది. అందుకే, ఇంకెన్ని ఇబ్బందులు ఎదురైనా అకుంఠిత దీక్షతో అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటాఛి!

ధర్మో రక్షతి రక్షితః

03.12.2012 Chandrababunaidu "vastunnameekosam"padayatra photos (andhrajyothy)

జనం భాషలో జగన్ పని పట్టండి! నేతలకు చంద్రబాబు క్లాస్

హైదరాబాద్, డిసెంబర్ 3 : అవినీతిని ప్రజలు పట్టించుకోవడం లేదని అనుకోవడం సరికాద ని, వారికి అర్థమయ్యేలా చెప్పడం ముఖ్యమని టీడీఎల్పీ భేటీలో చం ద్రబాబు అభిప్రాయపడ్డారు. జనం భాషలో జగన్ అవినీతిని ఎండగట్టాలని సూచించారు. ఈ సందర్భంగా నేతలకు ఆయన భాషకు సంబంధించిన కొన్ని మెళుకువలను విప్పిచెప్పారు. "జగన్ లక్ష కోట్లు తిన్నాడని మనం అంటే ఏదో తిన్నాడని అనుకొంటున్నారు.

గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నవారికి కోటి రూపాయలు ఎంతో కూడా తెలియదు. జగన్ దోచుకొన్న డబ్బును వంద రూపాయల్లోకి మారిస్తే అవి వెయ్యి లారీలకు సరిపోతాయని వివరిస్తే బాగా అర్థమవుతుంది. బంగారం ధర ఇటీవలికాలంలో విపరీతంగా పెరిగిపోతూ వస్తోంది. గాలి జనార్దన్‌రెడ్డి వంటివారు గనులు దోచి ఆ డబ్బుతో కిలోలకు కిలోలు బంగారం కొని మూటలు కట్టడం వల్లే దాని ధర విపరీతం గా పెరిగిపోయి సామాన్యులకు అందుబాటులో లేకుండా పోయిం ది. నేను గ్రామాల్లో తిరుగుతున్నప్పుడు ఇలాంటి విషయాలను ప్రజలకు అర్థమయ్యేలా వివరిస్తే వచ్చే స్పందన స్పష్టంగా కనిపించింది.

మీరూ ఇలాంటి విషయాలపై కసరత్తు చేసి ఏది ఎలా చెప్పాలో ఆలోచించండి' అని ఆయన అన్నారు. నడుస్తూ తిరుగుతూ ప్రజల్లోకి వెళ్ళడం వల్ల వారు ఇప్పుడు తాను చెప్పే విషయాలను శ్రద్ధగా వింటున్నారని చెప్పుకొచ్చారు. అనేక ఇబ్బందులను అధిగమిస్తూ చంద్రబాబు వెయ్యి కిలోమీటర్ల పాదయాత్రను పూర్తి చేసుకోవడం పట్ల ఆయనను అభినందిస్తూ సమావేశం తీర్మానం చేసింది. రైతులకు రుణ మాఫీ, పేదలకు పింఛను మొత్తం రూ. ఆరు వందలకు పెంపు, బెల్టు షాపుల ఎత్తివేత వంటి వాగ్దానాలతోపాటు బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనారిటీ డిక్లరేషన్లను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలని సమావేశం నిర్ణయించింది.

లక్ష కోట్లు కాదు.. వెయ్యి లారీల డబ్బు అని చెప్పండి

కాంగ్రెస్ కలవకపోతే అంతే సంగతులు
అసెంబ్లీలో వైసీపీని ఇరుకునపెట్టాం
'మ్యాచ్ ఫిక్సింగ్' కుట్రను ఎండగట్టాం
'అవిశ్వాసం' సవాల్‌ను తుత్తునీయం చేశాం
టీడీఎల్పీ భేటీలో చంద్రబాబు
ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు అభినందన
పాదయాత్ర ఆలోచన లోకేశ్‌దేనని వెల్లడి
ప్రసంగంలో పలుసార్లు తనయుడి ప్రస్తావన

నిజామాబాద్, హైదరాబాద్, డిసెంబర్ 3 : రాష్ట్రంలో కాంగ్రెస్‌కు పుట్టగతులు లేవని, వైసీపీ నేత జగన్ పని అయిపోయిందని, ఆ పార్టీలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని టీడీఎల్పీ అభిప్రాయపడింది. టీడీపీ అధికారంలోకి రావడం ఖాయమంటూ అధినేత చంద్రబాబు.. భేటీలో పాల్గొన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ఉత్సాహపరిచారు. ప్రతి నియోజకవర్గంలో చేపట్టి కాంగ్రెస్, వైసీపీ అవినీతిని వివరించాలని మార్గనిర్దేశం చేశారు. ముఖ్యంగా ఆ రెండు పార్టీలు మాదిగలను మోసగించిన వైనాన్ని ఎండగట్టాలని పిలుపునిచ్చారు.

నిజామాబాద్ జిల్లా సాలంపాడ్ వద్ద సోమవారం ఆయన టీడీఎల్పీ సమావేశం నిర్వహించారు. పలు అంశాల్లో తన తనయుడు లోకేశ్ చొరవను చంద్రబాబు ప్రశంసించడం అక్కడున్న నేతల్లో ఆసక్తిని రేకెత్తించింది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరు కావల్సిన సమావేశానికి లోకేశ్ హాజరు కావడం చర్చనీయాంశమైంది. బాబుతోపాటు సోమవారం పాదయాత్రలో ఉన్న లోకేశ్, టీడీఎల్పీ భేటీకి కూడా హాజరయ్యారు.

"పాదయాత్ర కు స్ఫూర్తి లోకేశ్. కుప్పం నియోజకవర్గంలోని రెండు మండలాల్లో లోకేశ్ పాదయాత్ర నిర్వహించి, ఆ ఫలితాలను నాకు తెలియజేశారు. దాని ఆధారంగానే ' వస్తున్నా మీ కోసం' రూపుదిద్దుకుంది'' అని వివరించారు. తన యాత్రను స్ఫూర్తిగా తీసుకొని రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో "పల్లెపల్లెకు తెలుగుదేశం'' పేరిట పాదయాత్రలు నిర్వహించాలని నాయక శ్రేణులకు పిలుపునిచ్చారు. ఇప్పటికే దీనిపై నిర్ణయం తీసుకున్నా అమలు చేయలేదని, ఇకనైనా దృష్టి పెట్టాలని కోరారు. రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులను చంద్రబాబు విశ్లేషించారు.

"మూడేళ్లుగా టీఆర్ఎస్, వైసీపీ ప్రజలను మాయ చేస్తున్నాయి. అవినీతి అందరూ చేస్తారంటూ వైసీపీ.. ప్రజలను మభ్యపెట్టేందుకు యత్నిస్తోంది. సెంటిమెంటును అడ్డం పెట్టుకున్న టీఆర్ఎస్.. తానేమి చేసినా తిరుగులేదన్నట్టు వ్యవహరిస్తోంది. ఇతర పార్టీలు తెలంగాణలో తిరగొద్దంటూ హుకుంలు జారీ చేసింది. మ రోవైపు, కాంగ్రెస్ పార్టీ అన్ని అంశాల్లో విఫలమైంది'' అని వివరించారు. ఈ పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు తెలివితో వ్యవహరించి ఓ పద్ధతి ప్రకారం ముందుకు సాగాలని కోరారు. గతంలో టీడీపీ పరిపాలన ఎలా ఉంది, భవిష్యత్తులో ఎలా ఉండబోతుందో అర్థమయ్యేలా ప్రజలకు వివరించాలన్నారు. ఎస్సీ సబ్‌ప్లాన్ విషయంలో అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యేల చొరవను చంద్రబాబు అభినందించారు.

"అసెంబ్లీలో మన వ్యూహానికి వైసీపీ ఇబ్బంది పడింది. వర్గీకరణకు అనుకూలమో, వ్యతిరేకమో తేల్చుకోలేకపోయింది. ఆ విధంగా వైసీపీ కుట్రను ఎండగట్టగలిగాం. దమ్ముంటే అవిశ్వాసం పెట్టాలని ఇన్నాళ్లు డిమాండ్ చేసిన ఆ పార్టీ నిన్న అసెంబ్లీలో ఎస్సీ సబ్‌ప్లాన్ బిల్లుకు ప్రతిపక్షాలకు మద్దతు ఇచ్చి ప్రభుత్వా న్ని గద్దె దించే అవకాశమున్నా ఎందుకు వెనుకడుగు వేసింది? ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్‌రెడ్డి తాము అవిశ్వాసం పెట్టబోమని చెప్పా రు. జగన్ జైలు నుంచి విడుదలయ్యాక దానిపై ఆలోచిస్తామని మాట్లాడడం వెనుక ఆంతర్యమేమిటి? దీన్ని బట్టే మ్యాచ్‌ఫిక్సింగ్ ఏ రెండు పార్టీల మధ్య ఉందో తెలిసిపోయింది. ఈ విషయాలను ప్రజల్లోకి విస్త్రతంగా తీసుకెళ్లండి'' అని కోరారు. కాంగ్రెస్‌లో చేరకపోతే వైసీపీకి భవిష్యత్తు లేదన్నారు. ఇక కాంగ్రెస్ పార్టీని ఇరు వర్గాల ఓట్లకు దూరం చేయాలన్నారు.

జగన్ పార్టీ పని ఖతం!

వెయ్యినొక్కసారి..
అక్షరమాలలో తొలి అక్షరం అనంతపురంలో శ్రీకారం చు ట్టుకొన్న పాదయాత్ర సోమవారం విజయవంతంగా వెయ్యి కి లోమీటర్ల దూరం పూర్తి చేసుకుంది. నిజామాబాద్ జిల్లా సాలంపాడ్ గ్రామం వద్ద వెయ్యి కిలోమీటర్లలో చివరి అడుగును చం ద్రబాబు మోపారు. దీంతో టీడీపీ శ్రేణుల్లో సంబరాలు అంబరాన్ని అంటాయి. భారీ ఎత్తున కటౌట్‌లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. వికలాంగులకు ట్రై సైకిళ్లు, దుప్పట్లు పంపిణీ చేశారు. టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో 999 కొబ్బరికాయలు కొట్టారు. జాడిజమాల్‌పూర్‌లో పాదయాత్రకు గుర్తుగా స్తూపంతో పాటు ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. నాయకులు బాబుతో కేక్ కట్ చేయించారు. వెయ్యి బెలూన్లను గాలిలోకి వదిలారు.

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు వెయ్యి కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి చేసుకొన్న సందర్భంగా ఎన్టీఆర్ భవన్‌లో సోమవారం సాయంత్రం దీపోత్సవం నిర్వహించారు. 'వస్తున్నా.. మీ కోసం' అన్న పేరును పసుపు కుంకుమ, రంగులతో రాసి వాటిని పార్టీ అనుబంధ తెలుగు మహిళా విభాగం నాయకులు దీపాలతో అలంకరించారు. మొదటి దీపాన్ని పార్టీ వ్యవస్ధాపక అధ్యక్షుడు ఎన్టీ రామారావు విగ్రహం వద్ద వెలిగించి తర్వాత మిగిలినచోట్ల వెలిగించారు. ఈ సందర్భంగా బెలూన్లు ఎగురవేసి కేక్ కత్తిరించారు. మహిళా నాయకురాళ్ళు కొద్దిసేపు నృత్యం చేశారు. చంద్రబాబు నిండు ఆరోగ్యంతో పాదయాత్ర పూర్తి చేసుకోవాలని నాయకులు ఆకాంక్ష వ్యక్తం చేశారు.

విజయవంతంగా వెయ్యి కి లోమీటర్ల దూరం పూర్తి


నిజామాబాద్‌లో మంగళవారం ఉదయం చంద్రబాబు బోధన్ మండలం జాడి జమాల్‌పూర్ నుంచి పాదయాత్ర సాగిస్తారు. బండారుపల్లి మీదుగా పెద్దమావంది, చిన్నమావంది చేరుకొని మధ్యాహ్న భోజనం తీసుకుంటారు. కొద్ది విశ్రాంతి తరువాత పెగడాపల్లి గ్రామం మీదుగా సాటాపూర్ చేరుకుంటారు. రాత్రికి అక్కడే బస చేస్తారు.

నేటి షెడ్యూల్

ఎన్టీఆర్ ఆశయాలను సాధిస్తా
నిజాయితీని నిరూపించుకుంటా
సంకల్పం పూనిన చంద్రబాబు
నిజామాబాద్ జిల్లా సాలంపాడ్ వద్ద
వెయ్యి కిలోమీటర్లు పూర్తి
సంబరాలు చేసుకున్న కార్యకర్తలు
నా మాటల్లో నిజం ఉంటేనే మద్దతివ్వండి
మాదిగలకు వైసీపీ వ్యతిరేకం
పాదయాత్రలో చంద్రబాబు

నిజామాబాద్, డిసెంబర్ 3 : "ఎన్టీఆర్ విగ్రహాలను చూస్తే ఆదర్శం. వైఎస్ విగ్రహాలను చూస్తే అవినీతి గుర్తొస్తుంది'' అని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. రాజశేఖరరెడ్డి వంటి తప్పుడు వ్యక్తుల వల్లే సమాజం దారి తప్పుతోందని విమర్శించారు. నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం పాతసాలంపాడు గ్రామం వద్ద చంద్రబాబు పాదయాత్ర 1000 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. "ఉగ్రవాదం కంటే అవినీతే ప్రమాదకరం. రాష్ట్రంలో ఉన్న పార్టీలు లక్షల కోట్ల ప్రజల సొమ్మును దోపిడీ చేశాయి. ఆ సొమ్ముతో అరాచకాలు చేస్తున్నాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే రాష్ట్రంలో ప్రజలు ప్రమాదక ర పరిస్థితిని ఎదుర్కొంటారు. అందుకే ప్రజలను మేల్కొల్పడానికి, సమస్యలు తెలుసుకుని ధైర్యం చెప్పడానికి పా దయాత్ర చేపట్టా''నని పెంటాఖుర్దులో జరిగిన 'వెయ్యి కిలోమీటర్ల వేడుక సభ'లో చంద్రబాబు విశ్లేషించారు.

ఈ గ్రామంలో పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ విగ్రహాన్ని సోమవారం ఆయన ఆవిష్కరించారు. ఎన్టీఆర్ వ్యక్తి కాదు.. ఓ మహావ్యవస్థ అని, సినిమా రంగంలోనూ ఆదర్శ ప్రాయుడిగా నిలిచిన మహా శక్తి అంటూ ఎన్టీఆర్ జ్ఞాపకాలను చంద్రబాబు నెమరు వేసుకున్నారు. ఈ సందర్భంగానూ, పాదయాత్రలోనూ వైఎస్‌పై చంద్రబాబు నిప్పులు చెరిగారు. రైతు రుణమాఫీని అడ్డుకున్న పాపం వైఎస్‌దేనని మండిపడ్డారు. రాష్ట్రాన్ని దివాలా తీయించాడని, తన కొడుకుకు ప్రజల సొమ్ము దోచిపెట్టాడని మండిపడ్డారు. దీనివల్లే రాష్ట్రం అనా«థలా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నేతలు అడవి పందుల్లా ప్రజల సొమ్మును దోపిడీ చేయడంతో పాటు వ్యవస్థలనూ సర్వనాశనం చేశారని విమర్శించారు. ప్రజల ఆశీస్సులతోనే 1000 కిలోమీటర్లు నడవగలిగానని చెప్పారు. తాను రాష్ట్ర ఆదాయాన్ని పెంచి అభివృద్ధి చేస్తే కాంగ్రెస్ పా ర్టీ పెరిగిన ఆదాయాన్ని దోపిడీ చేసి ప్రజలను సమస్యల వలయంలోకి నెట్టేసిందని చెప్పారు.

ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌పై అసెంబ్లీలో జరిగిన ఓటింగ్‌లో వైసీపీ మోసం చేసిందని ధ్వజమెత్తారు. మాదిగలకు వైసీపీ వ్యతిరేకమన్న విష యం బయటపడిందని చెప్పారు. ఎస్సీ వర్గీకర ణ విషయంలో ఇప్పుడు అన్ని పార్టీలు తమదారిలోకే వస్తున్నాయని గుర్తు చేశారు. "వర్గీకరణ విషయంలో వైసీపీ మోసం చేసింది. ఆ పార్టీ వర్గీకరణకు అనుకూలంగా ఓటు వేసి ఉం టే ప్రభుత్వం కూలిపోయేది. నిన్నటివరకు అవిశ్వాసంపై టీడీపీని బదనాం చేసిన వైసీపీ ఇప్పు డు ఎందుకు వెనక్కి తగ్గినట్టు? వారికి ఆ దమ్మూధైర్యం ఉందా? తల్లి కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్ ఒక్కటేనని తేలిపోయింది. జైల్లో ఉండే వ్యక్తిని సీఎంని చేస్తామని చెప్పినా ప్రజలు చూస్తూ ఊరుకుంటా రా?'' అని ప్రశ్నించారు.

కేసులు ఎత్తివేసి జైలునుంచి విడుదల చేస్తే పార్టీని కాంగ్రెస్‌లో కలపడానికి జగన్ సిద్ధంగా ఉన్నారని విమర్శించారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వంటివారు మాటల గారడి చేసి ప్రజలను మభ్యపెడుతున్నారని, ఆరునెలలు కుంభకర్ణుడిలా నిద్రపోయే కేసీఆర్ నిద్రలేచి ప్రజలను ఏమార్చే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. తాను చెప్పింది నమ్మితేనే మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. "హైదరాబాద్‌ను ఎంతగానో అభివృద్ధి చేసి లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చాను. నేను చెప్పింది బాగా ఆలోచించి బాగుందనుకుంటే ఆశీర్వదించండి. అనాథలా మారిన రాష్ట్రాన్ని మళ్లీ బాగు చేసే అవకాశమివ్వండి'' అని కోరారు.

ఎన్టీఆర్ విగ్రహం చూస్తే ఆదర్శం.. వైఎస్ విగ్రహాన్ని చూస్తే అవినీతి.. గుర్తుకొస్తుంది

03.12.2012 సోమవారం "వస్తున్నా మీకోసం"పాదయాత్ర పోటోలు...(eenadu)