December 1, 2012

61వ రోజు శనివారం "వస్తున్నా మీకోసం"పాదయాత్ర పోటోలు.... 01.12.2012

61వ రోజు శనివారం "వస్తున్నా మీకోసం"పాదయాత్ర పోటోలు (eenadu) 01.12.2012

            

'మీకోసం వస్తున్నా' పాదయాత్ర మొత్తం 117 రోజులు! నేటికి దాదాపు సగం రోజులు పూర్తయ్యాయి! ఈ రెండు నెలల్లో ఎన్నో అనుభవాలు! ఎందరివో కష్టాలను కళ్లారా చూశాను. యాత్ర మొదలుపెట్టిన దగ్గర్నుంచి నేను కూడా వ్యక్తిగతంగా, ఆరోగ్యపరంగా రకరకాల సమస్యలను ఎదుర్కొంటున్నా. అనంతపురంలోనే మడమ దగ్గర సమస్య! గద్వాలలో వేదిక కూలి ఇబ్బంది! ఎడమ కాలి చిటికెన వేలు సలిపేస్తోంది. ఇటీవలే షుగర్ కూడా వచ్చింది. ఇబ్బందిగానే ఉన్నా ప్రజలతో మమేకమవుతూ వాటిని మర్చిపోతున్నా!

నేను కూడా చిన్నప్పటి నుంచీ ఎన్నో కష్టాలు పడి ఉన్నత స్థానానికి వచ్చాను. క్రమశిక్షణను, కష్టాన్నే నమ్ముకున్నాను. ప్రజాసేవలో ఉన్నప్పుడు పది మందికీ ఆదర్శంగా ఉండాలని అనుకుంటాను. ఏదైనా అనుకుంటే దానిని సాధించే వరకు పోరాడే తత్వం నాది. ఇప్పుడు కూడా రకరకాల ప్రలోభాలు, విమర్శలూ వస్తున్నాయి. వాటిని అధిగమించి ముందుకు సాగుతున్నా!!

తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నా! తొమ్మిదేళ్లుగా ప్రతిపక్ష నేతను! పదేళ్ల తర్వాత కూడా ప్రజలు నా పాలనను గుర్తు చేసుకుంటున్నారు. అప్పట్లో రోడ్లు బాగున్నాయి. విద్యుత్తు సరఫరా బాగుండేది. వరుస కరువుల్లోనూ మంచి పాలన అందించారని నాతోనే చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీ మభ్యపెట్టి నమ్మక ద్రోహం చేసిందని మండిపడుతున్నారు. క్షేత్రస్థాయి పరిస్థితులు దారుణంగా ఉన్నాయని, వారికి అండగా నిలవాలనే ఎంతమంది వద్దని వారించినా సొంతంగా నిర్ణయం తీసుకుని పాదయాత్రకు బయలుదేరాను. క్షేత్రస్థాయిలో ఎన్నో సమస్యలు! కష్టాలు.. కన్నీళ్లు! అన్నిటినీ సావధానంగా వింటూ.. నా అనుభవాన్ని జోడించి వాటిని ఎలా పరిష్కరించాలని ఆలోచన చేస్తూనే ముందుకు కదులుతున్నా!

సమస్యలను పరిష్కరిస్తా!


బాన్సువాడలో చంద్రబాబుకు బ్రహ్మరథం

నిజామాబాద్, నవంబర్ 30 (ఆంధ్రజ్యోతి) : టీఆర్ఎస్ ఇలాకాలో శుక్రవారం బాబుకు బ్రహ్మరథం పట్టారు. ఆయన పాదయాత్రకూ, సభలకూ జనం నుంచి అనూహ్య స్పందన వెల్లివిరిసింది. వేల సంఖ్యలో గిరిజన మహిళలు చంద్రబాబు వెంట నడిచారు. అన్ని వర్గాల ప్రజలు కూడా బాబుకు మద్దతు ప్రకటించడం కనిపించింది. అనేక చోట్ల ప్రజలు కూడా తరలివచ్చి తమ సమస్యలను చెప్పుకొన్నారు.

చంద్రబాబు ప్రసంగానికి ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించింది. ముఖ్యంగా రుణ మాఫీ చేస్తామనే హామీ పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమైంది. యాత్ర ఆసాంతం బీసీలు దన్నుగా నిలిచారు. బాబు చెప్పిన ప్రతీ మాటను చప్పట్లతో స్వాగతించారు. ఈ క్రమంలో ఎక్కడా చిన్న నిరసన స్వరం సైతం వినిపించకపోవడం పార్టీ శ్రేణులను ఉత్సాహపరిచింది.

వాస్తవానికి 2009ఎన్నికల్లో ఈ స్థానాన్ని టీడీపీయే గెలుచుకుంది. తెలంగాణ వాదం నేపథ్యంలో పోచారం శ్రీనివాస్‌రెడ్డి 2011, అక్టోబర్‌లో టీఆర్ఎస్‌లో చేరి.. ఉప ఎన్నికల్లో ఆ పార్టీ తరఫున గెలిచారు. స్థానిక వ్యతిరేకత కారణంగా ఆసమయంలో టీడీపీ తన అభ్యర్థిని కూడా పెట్టలేకపోయింది. పార్టీ ఎమ్మెల్యేలు కనీసం నియోజకవర్గంలో పర్యటించలేకపోయారు.

కాగా, చంద్రబాబు పాదయాత్రను అడ్డుకొనే విషయమై స్థానిక ఎమ్మెల్యే పోచారం పెద్ద ఆసక్తి చూపలేదని సమాచారం. చంద్రబాబు కూడా పోచారంపై విమర్శలు చేయకపోవడం ఒక విశేషమైతే.. కేసీఆర్‌పై మరింతగా చెలరేగి చంద్రబాబు విమర్శలు చేయడం మరో విశేషం.

గులాబీ ఇలాకాలో పసుపు పతాక

చెప్పిన మాట చెప్పకుండా గారడీ చేస్తాడు
ఎప్పుడో అప్పుడు కాంగ్రెస్‌లో కలిసేవాడే
గిరిజన మహిళ నిజాయితీ కూడా వైఎస్‌కు లేదు
కొడుకుకు లక్ష కోట్లు దోచి పెట్టాడు
నిజామాబాద్ పాదయాత్రలో చంద్రబాబు నిప్పులు


నిజామాబాద్, నవంబర్ 30 (ఆంధ్రజ్యోతి): "కేసీఆర్ పెద్ద అబద్ధాలకోరు. చెప్పిన అబద్ధం మళ్లీ చెప్పకుండా పుట్టెడు మాటలు చెబుతాడు. కేసీఆర్ మన వెంట ఉన్నవాడే. 6 నెలలు కుంభ కర్ణుడిలా నిద్రపోతాడు. ఒకరోజు లేచి మాటల గారడీ చేస్తాడు. టీఆర్ఎస్ కూడా కాంగ్రెస్‌లో కలిసే పార్టే. కలుపుతానని కేసీఆరే స్వయంగా చెప్పాడు'' అంటూ టీఆర్ఎస్ అధినేతపై టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు చండ్రనిప్పులు కక్కారు. "మాయగాళ్ల మాటలు నమ్మకండి. మంత్రాలకు చింతకాయలు రాలవు. ఇకనైనా ఆలోచించండి'' అని ప్రజలను కోరారు.

నిజామాబాద్ జిల్లాలో ఒకప్పటి టీడీపీ స్థానం, ప్రస్తుతం టీఆర్ఎస్ ఇలాకా అయిన బాన్సువాడలో శుక్రవారం చంద్రబాబుకు జనం బ్రహ్మరథం పట్టారు. అంతకుముందు పిట్లం మండలం బొల్లక్‌పల్లి గ్రామం నుంచి ఆయన పాదయాత్ర ప్రారంభించారు. ఈ సమయంలో ఆయనను డ్వాక్రా మహిళలు వచ్చి కలిశారు. "డ్వాక్రా మహిళలకు నాటి విలువ ఇప్పుడు లేదు. మీరు ఊతమిచ్చి జీవితాలు నిలబెట్టారు. కానీ ఇప్పుడు పావలా వడ్డీ అని పరిహాసం చేస్తున్నార''ని భూదవ్వ అనే మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. బాన్సువాడ మండలం తాడ్కోల్, సోమేశ్వర్‌ల్లో కూడా మహిళలు తమ గోడు వెళ్లబోసుకున్నారు.

అనంతరం బాన్సువాడ పట్టణంలో జరిగిన సభలో కేసీఆర్‌పై నిప్పులు చెరిగారు. బాబ్లీ ప్రాజెక్టుకు నిరసనగా తాను జైలుకు వెళ్లానని, ఆ పోరాటం సమయంలో టీఆర్ఎస్ నేతలు ఎక్కడున్నారని ప్రశ్నించారు."తొమ్మిదేళ్లు సీఎంగా పనిచేశాను. నాతో పాటు కుటుంబ సభ్యులందరి ఆస్తులు ప్రకటించాను. ఆ దమ్ము కేసీఆర్‌కు, జగన్‌కు ఉన్నాయా?'' అని ప్రశ్నించారు. వైఎస్ సీఎంగా ఉండగా తన కొడుకుకు లక్ష కోట్లు దోచిపెట్టాడని, ఒక మామూలు గిరిజన వృద్ధురాలికి ఉండే నిజాయితీ సైతం వైఎస్‌కు లేకుండా పోయిందని దుయ్య బట్టారు. వైఎస్ తనకొడుకును అదుపుచేసి ఉంటే నేడు రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు ఈ క ష్టాలు వచ్చి ఉండేవికావని చెప్పారు.

కేసులు ఎత్తేస్తే జగన్ పార్టీ కూడా కాంగ్రెస్‌లో కలుస్తుందన్నారు. "పార్టీల పనితీరును బట్టి ప్రజలు ఆలోచించాలి. నేను చెప్పింది వాస్తవం అయితేనే సహకరించాలి. ప్రలోభాలకు లొంగకూడదు'' అని కోరారు. తెలంగాణ అభివృద్ధి తెలుగుదేశం హయాంలోనే జరిగిందని మరో సారి స్పష్టంచేశారు. కాంగ్రెస్ నేతలు 8 లక్షల కోట్లు దోచుకుతిన్నారని చెప్పారు. జనాభా దామాషా ప్రకారం బీసీలకు పదివేల కోట్ల ప్యాకేజీతోపాటు వంద సీట్లు ఇస్తామని చెప్పారు. గీత కార్మికులకు శాశ్వత లైసెన్సు ఇస్తామని ప్రకటించారు.

ఎస్టీల వివాహాలతో పాటు మైనార్టీ వివాహాలకు కూడా రూ.50వేల సహాయం అందిస్తామని చెప్పారు. 1.65 కోట్ల మందికి సబ్సిడీ సిలిండర్లు ఇస్తామని చెప్పారు."పల్లకీ మోయడం కాదు.. పల్లకీ ఎక్కడం నేర్చుకోవాల''ని బీసీలను కోరారు. ఎస్సీ సబ్ ప్ల్లాన్‌లో మాదిగలకు దామాషా ప్రకారం నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు.

కేసీఆర్ పెద్ద అబద్ధాలకోరు!: చంద్రబాబు