November 26, 2012

  ఆదరణ ఏదీ..!

ఇప్పుడు నేత దుస్తులకు ఆదరణ ఎక్కడుంది!? అలా వెళ్లడం.. ఇలా రెడీమేడ్ దుస్తులు కొనుక్కు రావడం! దీంతో, నేతన్నలూ నష్టపోతున్నారు. దర్జీలకూ ఉపాధి కరువైంది!

పేదవాడి ఫ్రిజ్జు అయిన కుండకు ఆదరణ ఏదీ!? దీపావళికి ప్రతి ఇంటా మట్టి దీపాలు కళకళలాడేవి. అనారోగ్యకారకమని తెలిసినా.. ఇప్పుడన్నీ ప్లాస్టిక్ బిందెలు. రెడీమేడ్ దీపాలే! ఇళ్ల నిర్మాణంలో.. ఇంట్లో విడిచిన దుస్తులను భద్రపరచడం సహా పలు పనులకు బుట్టలు, గంపలు వాడేవారు. ఇప్పుడు ప్లాస్టిక్ గంపలు, టబ్‌లు వచ్చేశాయి!

ప్రపంచీకరణ ఫలితంగా చేతి వృత్తులు, కుల వృత్తులు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఇటువంటి ప్రమాదాన్ని ముందుగా ఊహించే టీడీపీ హయాంలో చేతి వృత్తుల వారికి ఆధునిక పనిముట్లు ఇచ్చి కొంతవరకు ఆదుకున్నాం. కానీ, ఈ ప్రభుత్వానికి ముందు చూపు ఏదీ!? సోమవారంనాటి పాదయాత్రలో బుట్టలు అల్లేవారు, నేతన్నలు, కుమ్మర్లు, చేతివృత్తిదారులు వచ్చి కలిశారు. తమ ఉత్పత్తులకు గిరాకీ లేకుండాపోయిందని, ఉపాధి దెబ్బతిందని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రభుత్వం బాధ్యత కలిగినది అయితే వారికి పునరావాసం కల్పించడమో.. మార్పులకు అనుగుణంగా శిక్షణ ఇచ్చి చేయూత ఇవ్వడమో చేయాలి! కానీ, తన విధానాలతో వారిని మరింత ఇబ్బందులకు గురి చేస్తోంది. దీంతో, చేతివృత్తిదారుల సమస్యల పరిష్కారానికి ప్రపంచవ్యాప్తంగా ఏం జరుగుతోందనే దానిపై దృష్టిసారించా. చైనా అనుభవం ఆసక్తికరంగా ఉంది. చేతివృత్తిదారులు కుటీర పరిశ్రమల్లో పనిచేస్తారు. అక్కడే అన్నిటినీ తయారు చేస్తారు. వాటిని ప్రపంచవ్యాప్తంగా విక్రయిస్తారు. రాష్ట్రంలోనూ అటువంటి వాతావరణాన్ని తీసుకురావాలని నిర్ణయించాను.

ఆదరణ ఏదీ..! చంద్రబాబు

కేసీఆర్.. నీ బిడ్డలకేనా కొలువులు?
తెలంగాణ ప్రజలకు ఉపాధి అక్కర్లేదా?
కేంద్ర మంత్రిగా ఎన్ని ఉద్యోగాలు తెచ్చావు?
చంద్రబాబు చండ్ర నిప్పులు

సంగారెడ్డి, నవంబర్ 26 : "ఆయన కొడుకు, కూతురు, అల్లుడికి ఉద్యోగాలు ఉంటే చాలు. మరెవరి ఉపాధి, ఉద్యోగంతో కేసీఆర్‌కు పని లేదు'' అంటూ గులాబీ అధిపతిపై టీడీపీ అధ్యక్షుడు నిప్పులు చెరిగారు. సూర్యాపేట వేదికగా కేసీఆర్ తనపై చేసిన ప్రతి విమర్శనూ మెదక్ జిల్లా పాదయాత్రలో చంద్రబాబు సమర్థంగా తిప్పికొట్టారు. మోకాళ్లపై నడిచినా చంద్రబాబును ఎవరూ నమ్మరన్న కేసీఆర్ వ్యాఖ్యలను.. "నీ మాటల గారడీని నమ్ముతారా'' అంటూ ధీటుగా జవాబిచ్చారు.

తన హయాంలో రిటైర్మెంట్లే గానీ రిక్రూట్‌మెంట్లు లేవన్న విమర్శపై.."కేసీఆర్ కేంద్రంలో మంత్రిగా ఉండి ఎన్ని ఉద్యోగాలు ఇప్పించారో చెప్పా''లంటూ సూటి ప్రశ్నించారు. మెదక్ జిల్లాలో సోమవారం నారాయణఖేడ్, పెద్దశంకరంపేట మండలా లలో చంద్రబాబు పాదయాత్ర సాగించారు. నారాయణఖేడ్ నుంచి పెద్దశంకరంపేట వరకు 15.1 కిలోమీటర్ల దూరం నడిచారు. ఈ సందర్భంగా జరిగిన పలు సభల్లో టీఆర్ఎస్ మాటల పార్టీ అని ధ్వజమెత్తారు. కేసీఆర్‌కు, ఆయన కొడుకు, కూతురుకు ఉద్యోగాలు ఉంటే చాలని, మీకు రాకపోయినా ఆయనకేమీ పట్టదన్నారు.

ఉద్యమంలో ఇప్పటికే పదేళ్లు నష్టపోయారని, ఒక తరం పోయిందని ఆవేదన వ్యక్తంచేశారు. "ఇంకో పదేళ్లు ఇలాగే కొనసాగితే జీవితాలపైనే ఆశ పోతుంది'' అని గుమిగూడిన యువకులను ఉద్దేశించి చంద్రబాబు అన్నారు. చంద్రబాబు మోకాళ్ల మీద నడిచినా ప్రజలు నమ్మరన్న కేసీఆర్ వ్యాఖ్యలపై స్పందిస్తూ.. ఆయన మాటల గారడీని ప్రజలు నమ్మాలా అని ప్రశ్నించారు. నీతి, నిజాయతీకి కట్టుబడి ఉన్నానని, అందుకే ప్రజలసమస్యలు తెలుసుకునేందుకు పాదయాత్ర చేస్తున్నానని చెప్పారు.

ఆర్నెల్లు కుంభకర్ణునిలా ఫాంహౌస్‌లో పడుకునే కేసీఆర్.. ఆ తర్వాత ఒక్క రోజు లేచి మాయమాటలు, రెచ్చగొట్టే మాటలతో ప్రజల బతుకులను ఆగం చేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్, వైసీపీలు అవినీతి పార్టీలని చంద్రబాబు విమర్శించారు. సామాజిక న్యాయమన్న చిరంజీవి.. కేంద్రంలో ఒక్క పదవి రాగానే తన పార్టీని కాంగ్రెస్‌లో కలిపేశారని మండిపడ్డారు. తెలంగాణను అన్ని రకాలుగా అభివృద్ధి చేసిన పార్టీ టీడీపీయేనన్నారు.

కాగా, నారాయణఖేడ్ మండలం హన్మంతరావు పేటలో చంద్రబాబు చేనేత కార్మికులను కలుసుకొని సమస్యలపై ఆరాతీశారు. "వెయ్యి కోట్ల రూపాయలకు తక్కువ కాకుండా బడ్జెట్ ప్రవేశపెడతాం. నూలు, రంగును సబ్సిడీ ధరపై ఇప్పిస్తాం. ఎటువంటి ష్యూరిటీ లేకుండా రూ.50 వేల వరకు రుణాలు ఇప్పిస్తాం. ప్రతి కార్మికుడికి ఇల్లు, షెడ్ నిర్మించి ఇస్తాం. బీమా సౌకర్యం కల్పిస్తాం. జనాభా దామాషా ప్రకారం ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తాం'' అని వారికి హామీ ఇచ్చారు.

ధర్మానపై ప్రాసిక్యూషన్‌కు ఆదేశించండి.. గవర్నర్‌కు వినతి

రాష్ట్ర మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రాసిక్యూషన్‌కు అనుమతించాలని టీడీపీ అధినేత చంద్రబాబు..గవర్నర్ నరసింహన్‌ను కోరారు. ప్రాసి క్యూషన్ అవసరం లేదన్న కేబినెట్ తీర్మానాన్ని తిర స్కరించాలని విజ్ఞప్తి చేశారు. సిగ్గులేకుండా మంత్రి ధర్మానకు సీఎం కిరణ్ అండగా నిలవడం శోచనీయమన్నారు.

ఆయనతీరు చూస్తే ఎంత దోచుకున్నా ఫరవాలేదన్నట్టు ఉన్నదని దుయ్యబట్టారు. అవినీతిపరులను రక్షించవద్దని, ఇలాంటివారిపై కఠినచర్యలు తీసుకోవాలని గవర్నర్‌ను కోరారు. దోచుకున్న డబ్బును రికవరీ చేయాలని డిమాండ్ చేశారు. మంత్రులకో రూలు దొంగలకోరూలు ఉండరాదని, చట్టం అందరికీ ఒకటేలాగా ఉండాలని గుర్తుచేశారు.


తెలంగాణ ప్రజలకు ఉపాధి అక్కర్లేదా?చంద్రబాబు

56వ రోజు సోమవారం పాదయాత్ర పోటోలు.. 26.11.2012

56వ రోజు సోమవారం పాదయాత్ర పోటోలు..(andhrajyothi) 26.11.2012

56వ రోజు సోమవారం పాదయాత్ర పోటోలు..(eenadu) 26.11.2012

ఉపాధిహామీ పథకం కుంభకోణాల మయం
కాంగ్రెస్ హయాంలో మూడుపుటాలా తిండి లేదు
టీడీపీ అధికారంలోకి వస్తే ప్రజా సమస్యలు పరిష్కారం : బాబు

మెదక్, నవంబర్ 26 : జాతీయ ఉపాధిహామీ పథకం కుంభకోణాల మయంగా మారిపోయిందని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. ఐదు వందల జనాభా ఉన్న తండాల్ని పంచాయతీలుగా గుర్తించడంతోపాటు సేవాలాల్, మహరాజ్ ఆలయాల్ని నిర్మిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు.

'వస్తున్నా....మీకోసం' కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు నాయుడు చేపట్టిన పాదయాత్ర మెదక్ జిల్లాలో 56వ రోజైన సోమవారం కొనసాగుతోంది. ఈ ఉదయం నారాయణఖేడ్ నుంచి వెంకట్‌రావు తండా మీదుగా యాత్ర ముందుకు సాగుతోంది. ఈ సందర్భంగా ఆయన ప్రజలతో మాట్లాడుతూ తండాలకు ఇదివరకు ప్రకటించిన తీర్మానాలను మరొక్కసారి ఈరోజు తెలియజేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇళ్ల నిర్మానాల మొదలు, విద్యా, ఉద్యోగాలు, ఆడపిల్లల పెళ్లిల్లు అన్ని కరాల సౌకర్యాలు కల్పిస్తామని స్పష్టం చేశారు.

కాంగ్రెస్ హయాంలో మూడు పూటలా తిండి కూడా తినలేదని దుస్థితి దాపురించిందని చంద్రబాబునాయుడు విమర్శించారు. టీడీపీ అధిరంలోకి వస్తేనే ప్రజల సమస్యలకు పరిష్కారం దక్కుతుందని ఆయన అన్నారు. బాబు యాత్ర హన్మంతరావుపేట, భుజరాంపల్లి శంకర్‌పేట మీదుగా పెద్ద శంకరం పేటవరకూ సాగుతుంది. బాబు వెంట పెద్ద ఎత్తున టీడీపీ కార్యకర్తలు తరలివచ్చారు. ఈ రోజు మొత్తం 15 కి.మీ మేర పాదయాత్ర సాగనుంది.

ఉపాధిహామీ పథకం కుంభకోణాల మయం