November 23, 2012


వచ్చె ఎన్నికలలో తెదేపా దే విజయం - జూనియర్ ఎన్టీఆర్

రుణ మాఫీ ఎందుకొద్దు?
తల్లి కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్‌లు కావాలనే వ్యతిరేకిస్తున్నాయి
కిరికిరి పెడుతున్న కిరణ్ ప్రభుత్వం
నాడే వ్యతిరేకించిన వైఎస్
దివాలా తీస్తామంటూ కేంద్రానికి లేఖ
జగన్ కొల్లగొట్టిన లక్షకోట్లు రికవరీ చేస్తే మాఫీ
ఎంత పని?: బాబు స్పష్టీకరణ

" వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో జగన్ దోచుకున్న లక్ష కోట్ల రూపాయలను రికవరీ చేస్తే రైతు రుణాలను మాఫీ చేయొచ్చు. అంతేకాదు, రాష్ట్రంలోని ప్రతి రైతుకూ రెండు లక్షల రూపాయలు చొప్పున పంచొచ్చు. నిజానికి, రైతులు తీసుకున్న రుణాలను మాఫీ చేయాలని 2009కి ముందు నేనూ, ఎస్పీ నేత ములాయంసింగ్, అన్నాడీఏంకే అధినేత్రి జయలలిత కలిసి జాతీయ స్థాయిలో ఉద్యమించాం. అప్పట్లో నా ప్రయత్నాలను వైఎస్ గట్టిగా వ్యతిరేకించారు. రుణమాఫీ చేస్తే బ్యాంకులు దివాలా తీస్తాయంటూ ఆయన కేంద్రానికి లేఖ కూడా రాశారు. దానికి బదులు రైతులకు ఐదు వేల రూపాయల చొప్పున చెల్లిస్తే సరిపోతుందని సూచించారు. అయితే మా ఒత్తిడికి కేంద్రం దిగి వచ్చి రుణమాఫీ ప్రకటించింది. పంచాయతీ సర్పంచ్‌గా కూడా ఎన్నిక కాలేని వారూ అవినీతి డబ్బుతో పార్టీ పెట్టిన వారా రుణ మాఫీపై నన్ను ప్రశ్నించేది?''
- సంగారెడ్డి సభలో చంద్రబాబు


సంగారెడ్డి, నవంబర్ 23 (ఆంధ్రజ్యోతి): రైతుల రుణాలను మాఫీ చేసేందుకు తల్లి కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్ (వైసీపీ) వ్యతిరేకమని టీడీపీ అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఆయన కుమారుడు వైఎస్ జగన్ దోచుకున్న లక్ష కోట్ల రూపాయలను రికవరీ చేస్తే రైతు రుణ మాఫీ పెద్ద విషయమేమీ కాదని తెగేసి చెప్పారు. అంతేకాదు, ఆర్ఆర్ చట్టం కింద ఆ డబ్బునంతా వెలికితీస్తే, రాష్ట్రంలోని ప్రతి రైతుకూ రెండు లక్షలు చొప్పున సాయం చేయొచ్చుననీ సూచించారు.

"చంద్రబాబూ.. ఏ ప్రభుత్వాన్ని అడిగి రైతు రుణ మాఫీ చేస్తావో చెప్పు..''అని వైసీపీ నాయకురాలు విజయలక్ష్మి చేసిన సవాల్‌కు చంద్రబాబు దీటుగా ప్రతిస్పందించారు. రైతు రుణం విషయమై కాంగ్రెస్ ఫ్రభుత్వం, వైఎస్ చేసిన ద్రోహాన్ని వివరిస్తూ మెదక్ జిల్లాలో ఆరో రోజు పాదయాత్రను చంద్రబాబు కొనసాగించారు. ఆయన శుక్రవారం ఝరాసంగం, న్యాల్‌కల్ మండలాలలో పలు సభల్లో ప్రసంగించారు. ఈ సందర్భంగా పదేపదే రైతు రుణ మాఫీ అంశాన్ని ప్రస్తావిస్తూ వైఎస్‌పైనా కేంద్ర ప్రభుత్వంపైనా నిప్పులు చెరిగారు. '2009కి ముందు మేం ఉద్యమిస్తే.. రుణమాఫీ చేస్తే బ్యాంకులు దివాళా తీస్తాయని అప్పటి సీఎం వైఎస్ అడ్డుతగిలారు.

అదే విషయం ఆయన కేంద్రానికి లేఖ కూడా రాశారు. దానికి బదులు రైతులకు ఐదు వేల రూపాయల చొప్పున చెల్లిస్తే సరిపోతుందని సూచించారు. అయితే మా ఒత్తిడికి కేంద్రం దిగి వచ్చి రుణమాఫీ ప్రకటించింది'' అని వివరించారు. రుణ మాఫీ ఎలా చేస్తారని విజయలక్ష్మి ప్రశ్నించడాన్ని ఆయన ఎద్దేవా చేశారు. 'పంచాయతీ సర్పంచ్‌గా కూడా ఎన్నిక కాలేని వారూ.. అవినీతి డబ్బుతో పార్టీ పెట్టిన వారా నన్ను అడిగేది?' అని ప్రశ్నించారు. తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా పని చేసిన తనకు రైతుల రుణాలను ఎలా మాఫీ చేయాలో తెలుసన్నారు.

అధికారంలోకి వచ్చాక మొదటి సంతకం రైతుల రుణమాఫీపైనే ఉంటుందని చంద్రబాబు పునరుద్ఘాటించారు. కాగా, ముఖ్యమంత్రిగా రెండేళ్లు పూర్తి చేశానని సంబరాలు చేసుకుంటున్న కిరణ్ ఏం సాధించారో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రతీ ప్రజాసంక్షేమ పనికి ఏదో అడ్డంకి సృష్టించి కిరికిరి రెడ్డిగా మారారన్నారు. రాష్ట్రంలో నెలకొన్న కరెంట్ సంక్షోభానికి రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డిలే కారణమని చంద్రబాబు విమర్శించారు. కిరణ్ ప్రజల సీఎం కాదని, సీల్డ్‌కవర్ సీఎం అని విమర్శించారు. మరోవైపు స్థానిక మంత్రి గీతారెడ్డి అభివృద్ధి పనులు ఏమి చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు.

అవినీతికి పాల్పడే కాంగ్రెస్ నాయకులను చిత్తుచిత్తు చేసి శాశ్వతంగా రాజకీయాలకు దూరం చేయాలని పిలుపునిచ్చారు. చిరుధాన్యాలకు గిట్టుబాటు ధర కల్పించాలని తుల్జమ్మ కోరగా, అధికారంలోకి వస్తే గిట్టుబాటు ధర కల్పిస్తానని హామీనిచ్చారు. చిరుధాన్యాలను ఆహారంగా తీసుకుంటే ఎలాంటి రోగాలు రావని ఆయన సూచించారు. తాము అధికారంలోకి వస్తే బీఈడీ అభ్యర్థులకు ఎస్‌జీటీతో పాటుగా నిరుద్యోగ వ్యవస్థను పూర్తిగా నిర్మూలిస్తానని హామీనిచ్చారు.

అది ఆరు పేజీల ముచ్చట
'మీపై కొన్ని పత్రికలలో వ్యతిరేక వార్తలు వెల్లువెత్తుతున్నాయ'ని యువకులు చంద్రబాబు దృష్టికి తెచ్చారు. దానిపై ఆయన తేలిగ్గా స్పందించారు. 'నాపై రాయడానికి ఒకే ఒక్క అవినీతి మీడియా సాక్షి ఉంది. నా గురించి మూడు పేజీలు రాస్తారు. వారి గురించి మూడు పేజీలు రాసుకుంటారు అంతే' అని వ్యాఖ్యానించారు. అవినీతిపై పోరాడడమే కాకుండా అవినీతి నాయకులకు బుద్ధి చెప్పాలని సూచించారు. కడపలో పార్టీ ఉపాధ్యక్షుడు శశికుమార్ వాహనాన్ని దగ్ధం చేసిన సంఘటనపై తక్షణమే విచారణ జరిపించాలని, దుండగులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.

దూకుడు పెంచిన బాబు!
తెలంగాణపై ఆచితూచి మాట్లాడే చంద్రబాబు అనూహ్య దూకుడు ప్రదర్శిస్తున్నారు. 'అభివృద్ధి' చర్చ నుంచి పక్కకు పోకుండానే ఎదురుదాడిని పెంచేశారు. తెలంగాణ ఉద్యమ సారథి సొంత గడ్డపైనే ఆయననూ ఆయన పార్టీనీ చంద్రబాబు తూర్పారపడుతున్న తీరు చర్చనీయాంశంగా మారింది. మెదక్ జిల్లాలో ఆరు రోజులుగా పాదయాత్రలో ఉన్న చంద్రబాబు తెలంగాణకు టీడీపీ వ్యతిరేకం కాదని పదేపదే నొక్కిచెప్పారు.

భవిష్యత్తులోనూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించబోదని రెట్టించిన స్వరంతో చెప్పడం పార్టీ వర్గాలకు ఊరటనిచ్చింది. 'ఆరు నెలలు నిద్ర.. ఒక రోజు గారడీ మాటలు'గా కేసీఆర్ ఉద్యమిస్తున్నారని కూడా బాబే ఎద్దేవా చేశారు. దీన్నిబట్టి ఆ పార్టీనీ, కేసీఆర్‌నూ చంద్రబాబు లక్ష్యం చేసుకొని ముందుకు వెళుతున్నట్టు జిల్లాలోని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. చంద్రబాబు ఇస్తున్న ఊపుతో ఇక తమకు తెలంగాణలో ఇబ్బందులు తొలగినట్టేనని పార్టీవర్గాలు అంటున్నాయి. మరోవైపు నడిపించే నాయకుడు నడుస్తుంటే..అనుసరించాల్సిన అనుచరులు వాహనాలను ఆశ్రయిస్తున్నారు.

వయస్సునూ లెక్కచేయకుండా అధినేత ముందుకు దూసుకెళుతుంటే అనుయాయులు మాత్రం కార్లపై అనుసరిస్తున్నారు. మెదక్ జిల్లాలో ఆరు రోజులుగా కొనసాగుతున్న చంద్రబాబు పాదయాత్రలో కనిపిస్తున్న దృశ్యమిది. సెక్యూరిటీ భారీ స్థాయిలో ఉండడం, వారికి తోడు రోప్‌పార్టీ దూకుడు వల్ల.. చంద్రబాబుతో కలిసి పాదయాత్ర చేయడం అందరికీ సాధ్యం కావడం లేదు. ఈ కారణంగానే తామంతా ఏదో వాహనంలో వెళ్లాల్సి వస్తున్నదని స్థానిక నేతలు చెబుతున్నారు.

రుణ మాఫీ ఎందుకొద్దు? చంద్రబాబు

53వ రోజు శుక్రవారం "వస్తున్నా మీకోసం"పాదయాత్ర పోటోలు (fb) 23.11.2012

53వ రోజు శుక్రవారం "వస్తున్నా మీకోసం"పాదయాత్ర పోటోలు (abn) 23.11.2012

న్యూఢిల్లీ, నవంబర్ 23 : నీలం తుపాన్ ప్రభావం వల్ల నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో కేంద్రం పూర్తిగా విఫలమైందని తెలుగుదేశం పార్టీ ఎంపీ నామా నాగేశ్వరరావు విమర్శించారు. రాష్ట్రం నుంచి 11 మంది కేంద్ర మంత్రులు ఉన్నా బాధితులకు న్యాయం చేయలేకపోయారని ఆయన పేర్కొన్నారు.

శుక్రవారం పార్లమెంట్ వద్ద ఆందోళన చేపట్టిన నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ టీడీపీ ఎంపీలు ధర్నా చేస్తుంటే మంత్రులు నవ్వుతూ వెళ్లడం రైతులను హేళన చేసినట్లేనని ఆయన అన్నారు. ఎఫ్‌డీఐల ద్వారా రైతులకు జరిగే మేలేంటో ప్రభుత్వం చెప్పాలని నామా డిమాండ్ చేశారు. చిరు వ్యాపారుల పొట్ట కొట్టేందుకే ఎఫ్‌డీఐలకు అనుమతి అని ఎంపీ నామా మండిపడ్డారు.

ఎఫ్‌డీఐల ద్వారా రైతులకు జరిగే మేలేంటో ప్రభుత్వం చెప్పాలి...నామా నాగేశ్వరరావుఎమ్మెల్యేగా పోటీ చేస్తా
పార్టీలు మారేవారంతా అవకాశవాదులు
వలసలవల్ల టీడీపీకి నష్టం లేదు

హైదరాబాద్, నవంబర్ 23 : సాధారణ ఎన్నికల్లో పోటీ అంశంపై టాలీవుడ్ హీరో నందమూరి బాలకృష్ణ స్పష్టత ఇచ్చారు. శుక్రవారం ఉదయం మీడియాతో మాట్లాడుతూ ఎంపీగా పోటీ చేస్తారన్న ప్రచారాన్ని బాలయ్య తోసిపుచ్చారు. పోటీ చేస్తే ఎమ్మెల్యేగా పోటీ చేస్తానన్నారు. పార్టీలు మారేవారంతా అవకాశవాదులని, కొందరు స్వార్థం కోసమే వలసలు వెళ్తున్నారని ఆయన తెలిపారు. వలసల వల్ల తెలుగుదేశం పార్టీకి ఎలాంటి నష్టం లేదని బాలకృష్ణ పేర్కొన్నారు.

అనంతపురం జిల్లా హిందూపురం నుంచి బాలకృష్ణ లోకసభకు పోటీ చేయనున్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. ఆ వార్తల్లో నిజం లేదని బాలకృష్ణ అన్నారు. తాను శాసనసభకే పోటీ చేస్తానని, ఎక్కుడి నుంచి పోటీ చేయాలనేది పార్టీ నిర్ణయిస్తుందని అన్నారు. పార్టీని వీడేవారంతా అవకాశవాదులేనని ఆయన అభిప్రాయపడ్డారు. కొందరు పార్టీని వీడినా నష్టం లేదని ఆయన అన్నారు. ఎన్నికలకు ముందు వలసలు సాధారణమేనని ఆయన అన్నారు. స్వార్థంతోనే ఇతర పార్టీలకు కొంత మంది వలసలు పోతున్నారని ఆయన విమర్శించారు.

ప్రజల బలం తమ పార్టీకి ఉందని, ఎక్కుడి నుంచి పోటీ చేయాలని తాను అనుకుంటున్నానో పార్టీ అధిష్టానంతో చర్చించిన తర్వాత తెలియజేస్తానని బాలయ్య తెలిపారు. పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని చెప్పారు. వైయస్ రాజశేఖర రెడ్డి కూడా వలసలను ప్రోత్సహించారని ఆయన విమర్శించారు. పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని బాలకృష్ణ పేర్కొన్నారు.

పోటీ చేస్తే ఎమ్మెల్యేగా పోటీ చేస్తా -నందమూరి బాలకృష్ణరుణ మాఫీకి కాంగ్రెస్ వ్యతిరేకం
ప్రభుత్వం ఏర్పాటు చేసి మాఫీ చేస్తా
అవినీతి డబ్బుతో పార్టీ పెట్టిన వారు అడగడమా?
కరెంట్ కష్టాలకు రోశయ్య, కిరణ్‌లే బాధ్యులు : చంద్రబాబు
సంగారెడ్డి, నవంబర్ 23 : రైతుల రుణాలను మాఫీ చేసేందుకు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకమని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ధ్వజమెత్తారు. రైతులు తీసుకున్న రుణాలను మాఫీ చేయాలని 2009కి ముందు తాను, ములాయంసింగ్, జయలలిత కలిసి జాతీయ స్థాయిలో ఉద్యమిస్తే కాంగ్రెస్ వ్యతిరేకించిందన్నారు. మెదక్ జిల్లాలో జరుపుతున్న పాదయాత్రలో భాగంగా ఆరో రోజయిన శుక్రవారం ఝరాసంగం, న్యాల్‌కల్ మండలాలలో జరిగిన సభలలో ప్రసంగించారు. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ కూడా రుణమాఫీ చేస్తే బ్యాంకులు దివాళా తీస్తాయని, అందువల్లరుణాల మాఫీ అవసరం లేదని కేంద్రానికి లేఖ కూడా రాశారని చెప్పారు. రుణ మాఫీకి బదులుగా రైతులకు అయిదు వేల రూపాయల చొప్పున చెల్లిస్తే సరిపోతుందని వైఎస్ సూచించారన్నారు. అయితే తామందరం చేసిన ఒత్తిడి వల్ల కేంద్రం రుణ మాఫీకి అంగీకరించిందన్నారు.

రుణ మాఫీ ఎలా చేస్తారని, ఏ ప్రభుత్వాన్ని అడిగి చేయిస్తారని వైసీపీ గౌరవాధ్యక్షురాలు విజయలక్ష్మి అడగడాన్ని చంద్రబాబు ఎద్దేవా చేశారు. 'పంచాయతీ సర్పంచ్‌గా కూడా ఎన్నిక కాలేని వారు, అవినీతి డబ్బుతో పార్టీ పెట్టిన వారు నన్ను అడగడమా?' అని ప్రశ్నించారు. తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా పని చేసిన తనకు రైతుల రుణాలను ఎలా మాఫీ చేయాలో తెలుసన్నారు. అధికారంలోకి వచ్చాక మొదటి సంతకం రైతుల రుణమాఫీపైనే ఉంటుందని చంద్రబాబు పునరుద్ఘాటించారు. వైఎస్ అధికారంలోకి రాగానే రైతుల ఆత్మహత్యలు ఆగిపోతాయన్నారని, కాని ప్రతి రోజు నలుగురైదుగురు రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతూనే ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

కరెంట్ కష్టాలకు రోశయ్య, కిరణ్‌లే బాధ్యులు

రాష్ట్రంలో నెలకొన్న కరెంట్ సంక్షోభానికి రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డిలే కారణమని చంద్రబాబు విమర్శించారు. టీడీపీ హయాంలో కరవు వచ్చినా రైతులకు తొమ్మిది గంటల కరెంట్ సరఫరా చేశామని చెప్పారు. వైఎస్ ముఖ్యమంత్రి అయ్యాక కరెంట్‌ను నిర్లక్ష్యం చేశారన్నారు. తాను సీఎంగా ఉన్నప్పుడు వందరూపాయల ఆదాయం వస్తే 8 రూపాయలు కరెంట్ కోసం ఖర్చు చేశామని, వైఎస్ సీఎం అయ్యాక 4 రూపాయలే ఖర్చుపెట్టారని చెప్పారు.

ముఖ్యమంత్రి, మంత్రులు పూర్తిగా అవినీతిలో కూరుకుపోయారని చంద్రబాబు ఆరోపించారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి చెబితే మంత్రులు, ఎమ్మెల్యేలు వినడం లేదని, అధికారులు కూడా వినరన్నారు. అసమర్థ సీఎం వల్ల రాష్ట్రం పూర్తిగా నష్టపోయిందన్నారు. కాంగ్రెస్ అసమర్థ, అవినీతి వల్లే మనం కష్టాల్లో బతకాల్సి వస్తున్నదన్నారు. కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రజల సీఎం కాదని, సీల్డ్‌కవర్ సీఎం అని విమర్శించారు. ఢిల్లీ నుంచి సోనియాగాంధీ సీల్డ్‌కవర్‌లో పంపిస్తే ఈయన సీఎం అయ్యారని విమర్శించారు. ఎమ్మెల్యేల చేత ఎన్నికైన వ్యక్తి కాదని, అందుకే ప్రజా సమస్యలు పట్టడం లేదన్నారు. ముఖ్యమంత్రిగా రెండేళ్లు పూర్తి చేశానని సంబరాలు చేసుకుంటున్న కిరణ్ ఏం సాధించారో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రతీ ప్రజాసంక్షేమ పనికి ఏదో అడ్డంకి సృష్టించి కిరికిరి రెడ్డిగా మారారన్నారు. రాష్ట్రంలో గ్యాస్ కనెక్షన్లు ఉన్న వారందరికీ అదనంగా మూడు సిలిండర్లు ఇవ్వాలని సోనియాగాంధీ చెబితే దీపం పథకం వారికే ఇస్తామంటూ కిరణ్ కిరికిరి పెట్టారని చంద్రబాబు విమర్శించారు.

ప్రభుత్వం ఏర్పాటు చేసి మాఫీ చేస్తా, అవినీతి డబ్బుతో పార్టీ పెట్టిన వారు అడగడమా?


53వ రోజు శుక్రవారం "వస్తున్నా మీకోసం"పాదయాత్ర పోటోలు (eenadu) 23.11.2012జన్మభూమి.. ఈ కార్యక్రమం అనగానే అప్పట్లో గ్రామగ్రామానా ఓ పండుగ వాతావరణం! శ్రమదానం.. గ్రామస్తులందరూ ముందుకు వచ్చి తమ సమస్యలను తామే పరిష్కరించుకుని, గ్రామానికి ఆస్తులనూ సమకూర్చుకున్న పవిత్ర కార్యక్రమం! పాదయాత్రలో భాగంగా మెదక్ జిల్లాలోని పెద్ద చెల్మడ, జీర్లపల్లి గ్రామాల్లో ప్రజలు గ్రామసభను ఏర్పాటు చేశారు. చెట్టు కిందే కూర్చుని మంచీ చెడూ మాట్లాడారు. టీడీపీ హయాంలో శ్రమదాన కార్యక్రమంలో భాగంగా ఫలానా చెరువును అభివృద్ధి చేసుకున్నామని, ఇప్పుడు మళ్లీ పూడిక వచ్చేసిందని, పట్టించుకునేవారు లేరని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ గ్రామాలకు వెళ్లడానికి ముందే మార్గమధ్యలో కొన్ని చెక్‌డ్యాములను చూశాను.

అవన్నీ నా హయాంలో ఏర్పాటు చేసినవే. అక్కడ చెక్‌డ్యాములు చూశాక.. ఇక్కడ గ్రామస్తులతో మాట్లాడిన తర్వాత ఒక్కసారిగా పాత జ్ఞాపకాల్లోకి వెళ్లిపోయాను. నా హయాంలో చేసిన గ్రామసభలే గుర్తుకు వచ్చాయి. జన్మభూమి, శ్రమదానం తదితర పథకాలు మదిలో మెదిలాయి.

ప్రభుత్వం ఖర్చు చేసే ప్రతి పైసా ప్రజలకు చేరాలని, ప్రభుత్వ పథకాల్లో ప్రజలను భాగస్వాములను చేయాలన్న ఉద్దేశంతో ఆ పథకాలకు రూపకల్పన చేశాను. గ్రామాలకు వెళితే కుటుంబ సభ్యులుగా వచ్చి సమస్యలు చెప్పుకొనేవారు. అధికారం ఉంది కనక అక్కడికక్కడే ఆదేశాలు ఇచ్చేవాడిని. కన్నతల్లి కంటే జన్మనిచ్చిన భూమి గొప్పదన్న ఉద్దేశంతో జన్మభూమి పెట్టా. గ్రామస్తులంతా ఏకమయ్యారు. విదేశాల్లోని తెలుగువారూ చేయూతనిచ్చారు.

కానీ, ఇప్పుడో!? ఏకతాటిపై ఉండే ఊరు ఇప్పుడు రాజకీయాలకు నిలయంగా మారింది. ఎవరికి ఎవరూ కాకుండా పోయారు. గ్రామాల్లో మళ్లీ ఆ స్ఫూర్తి రావాలి. ఆ ప్రశాంత వాతావరణం ఏర్పడాలి. శ్రమదానంతో చేయీ చేయీ కలిపే పరిస్థితి రావాలి. జై జన్మభూమి!

.. గుర్తుకొస్తున్నాయీ..! చంద్రబాబుమీ ప్రాణాలకు నా ప్రాణం అడ్డు
'మీ ప్రాణాలకు నా ప్రాణాలు అడ్డువేసి మిమ్మల్ని కాపాడుకుంటా'నని కార్యకర్తలకు చంద్రబాబు భరోసా ఇచ్చారు. పెద్దచల్మెడలో జరిగిన సభలో పలువురు పార్టీ కార్యకర్తలు డిప్యూటీ సీఎం దామోదర్ రాజనర్సింహ్మ అనేక రకాలుగా తమను ఇబ్బందులు పెడుతున్నారని బాబు దృష్టికి తీసుకువచ్చారు.

ఇందుకు స్పందించిన టీడీపీ అధినేత.. "డిప్యూటీ సీఎం వైఖరికి నిరసనగా ధర్నాలు చేయండి. మీకు అండగా మీ నాయకుడు బాబూమోహన్ వస్తారు. జిల్లా నాయకులు వచ్చి ఆందోళన చేస్తారు. అయినా సమస్యలు పరిష్కారం కాకపోతే నేనే ఆందోలు వచ్చి రాజనర్సింహ గుండెల్లో నిద్రపోతా'' అని చంద్రబాబు హెచ్చరించారు. ఏ కార్యకర్తకు అన్యాయం జరిగినా ఊర్కోనన్నారు.

రాత్రి పూట ఇక చంద్రుడే దిక్కు
రాష్ట్రంలో ఇక రాత్రి పూట కూడా కరెంట్ ఉండదని, మీకు చంద్రుడే దిక్కు అని ప్రజలను ఉద్దేశించి చంద్రబాబు వ్యాఖ్యానించారు. విద్యుత్తు వ్యవస్థను కాంగ్రెస్ నాశనం చేసిందన్నారు. కరెంట్ ఎప్పుడు వస్తుందో కరంటోళ్లకే కాకుండా చివరికి దేవుడికి కూడా తెలియదని ఎద్దేవా చేశారు. కానీ, రాని కరెంట్‌కు బిల్లులు, సర్‌చార్జీలు వేసి కాంగ్రెస్ పాలకులు వేలల్లో డబ్బులు వసూలు చేస్తున్నారని మండిపడ్డారు.

తెలంగాణ అమరుల కుటుంబాలకు న్యాయం చేస్తా
తెలంగాణ సాధనలో భాగంగా ప్రాణాలు పోగొట్టుకున్న వారి కుటుంబాలకు న్యాయం చేస్తానని చంద్రబాబు ప్రకటించారు. జీర్లపల్లి సమీపంలో సామాజిక తెలంగాణ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ సతీష్ మాదిగ ఆధ్వర్యంలో పలువురు కార్యకర్తలు చంద్రబాబును కలిసి వినతి పత్రం అందజేశారు. తెలంగాణ కోసం 900 మంది ఆత్మ బలిదానాలు చేసుకున్నారని, వీరి కుటుంబాలను ఆదుకోవాలని కోరారు.

ఇందుకు స్పందించిన చంద్రబాబు టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ కోసం అమరులైన వారి కుటుంబాలను అన్ని విధాల ఆదుకుంటామన్నారు. తెలంగాణను టీడీపీ ఎన్నడూ వ్యతిరేకించలేదని, వ్యతిరేకంగా మాట్లాడలేదని, భవిష్యత్‌లోనూ వ్యతిరేకించేది లేదని పునరుద్ఘాటించారు.

తెలంగాణపై అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించాలని కోరామని, అయినా కేంద్రం పెట్టడం లేదని, నిర్ణయం తీసుకోవాలని అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ను అడిగితే నిర్ణయం తీసుకోవడం లేదని విమర్శించారు. తెలంగాణపై కావాలనే డ్రామాలు ఆడుతోందని ధ్వజమెత్తారు. తెలంగాణ అంశంలో మరో అడుగు ముందుకు వేసిన చంద్రబాబు.. మొదటిసారిగా అమరులు, వారి కుటుంబాల గురించి ప్రస్తావించడం పార్టీ వర్గాల్లో నూతనోత్సాహాన్ని ఇచ్చింది.

మీ ప్రాణాలకు నా ప్రాణాలు అడ్డువేసి మిమ్మల్ని కాపాడుకుంటా 22.11.2012