November 22, 2012


వైసీపీ అధినేత జగన్ ముందు చిత్రగుప్తుడు కూడా పనికి రాడని చంద్రబాబు విమర్శించారు. "వైఎస్ అధికారంలో ఉన్నప్పుడు బెంగళూరులో ఉండే జగన్ ఇంత పెద్ద అవినీతికి పాల్పడ్డారు. 53 సెజ్‌లకు 8 వేల ఎకరాల భూములను అప్పనంగా ఇచ్చి కోట్ల రూపాయలను విదేశాలకు తరలించారు. తప్పుడు, గొలుసు కంపెనీల పేరిట అక్కడి నుంచి డబ్బులు తెచ్చిన జగన్ పెద్ద వ్యాపారిలా ఫోజు పెట్టారు. ఇలా లెక్కల తయారీలో చిత్రగుప్తుడిని మించిపోయారు'' అని మండిపడ్డారు.

అవినీతి డబ్బులతో పత్రిక పెట్టి మూడు పేజీలు వాళ్ల గురించి రాసుకుని, రెండు పేజీలు తమకు వ్యతిరేకంగా రాస్తున్నారని దుయ్యబట్టారు. ఇలాంటి వ్యక్తి రాజకీయాల్లో ఉంటే మన ఇంటి పైకప్పులను కూడా లాక్కెళ్తారన్నారు. తీవ్రవాదులు, నక్సలైట్లకన్నా అవినీతే ప్రమాదమని చంద్రబాబు చెప్పారు. అవినీతికి వ్యతిరేకంగా కలిసికట్టుగా పోరాడాల్సిన అవసరం ఉందని, ఇందుకు మీరందరూ సహకరించాలని కోరారు.

జగన్ ముందు చిత్రగుప్తుడు కూడా పనికి రాడు...మాఫీ చేసి చూపిస్తాం
రైతు రుణాలపై చంద్రబాబు
తొలి సంతకం దానిపైనే
అప్పట్లో వైఎస్ వ్యతిరేకించారు
మా పోరాటంతోనే దేశవ్యాప్తంగా అమలు
సాధ్యాసాధ్యాలు మాకు తెలుసు
అన్నీ ఆలోచించాకే హామీలు
తెలంగాణ అమరుల కుటుంబాలకు న్యాయం చేస్తా
ఈ రాష్ట్ర ప్రజలకు చంద్రుడే దిక్కు
రాత్రి పూట వెన్నెల వెలుగే శరణ్యం

సంగారెడ్డి, నవంబర్ 22 : 'అధికారంలోకి వస్తాం. రుణమాఫీ చేస్తాం' అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పునరుద్ఘాటించారు. పెరిగిన పెట్టుబడి వ్యయం, ప్రకృతి కన్నెర్రతో రాష్ట్రవ్యాప్తంగా రైతులు కష్టాల్లో ఉన్నారని, అధికారంలోకి వచ్చిన వెంటనే తొలి సంతకం రుణ మాఫీ ఫైలుపైనే చేస్తానని స్పష్టం చేశారు. మెదక్ జిల్లాలో ఐదో రోజైన గురువారం ఆయన మునిపల్లి, ఝరాసంగం మండలాల్లో పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. "రుణ మాఫీ చేస్తే బ్యాంకులు దివాలా తీస్తాయని అప్పట్లో వైఎస్ రాజశేఖర రెడ్డి అన్నారు.

ఒక్కొక్కరికి రూ.5000 ఇస్తే చాలని కేంద్రానికి లేఖ కూడా రాశారు. మేం చేసిన ఉద్యమాలతోనే కేంద్రం దిగొచ్చింది. రుణమాఫీ ప్రకటించింది. రుణమాఫీకి మేం ఉద్యమాలు చేస్తే.. వైఎస్ వద్దన్నారు. రుణమాఫీ సాధ్యాసాధ్యాల గురించి మాకు స్పష్టంగా అవగాహన ఉంది. అన్నీ ఆలోచించిన తర్వాతే మేం హామీలు ఇస్తాం. ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటాం'' అని వ్యాఖ్యానించారు.

మాఫీ చేసి చూపిస్తాం,సాధ్యాసాధ్యాలు మాకు తెలుసుముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర్‌రెడ్డి దోచుకున్న కోట్లాది రూపాయల అవినీతిలో ఆయన కుమారుడు జగన్‌తో పాటు భార్య విజయలక్ష్మి,కుమార్తె షర్మిల,కోడలు భారతిలకు కూడా వాటాలున్నాయని టీడీపీ ఎమ్మెల్యేలు గాలి ముద్దుకృష్ణమ నాయుడు, బొజ్జల గోపాలకృష్ణా రెడ్డి ఆరోపించారు.కాబట్టి వారిని కూడా అరెస్టు చేసి జైల్లో  పెట్టాలని డిమాండు చేశారు.

తిరుపతిలో గురువారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ముద్దుకృష్ణమ నాయుడు మాట్లాడుతూ 2004లో ఎన్నికల సందర్భంగా జగన్ ఎన్ని ఆస్తులు చూపారో అందరికీ తెలుసని,ఈ మధ్యకాలంలోనే ఇన్ని వేల కోట్లు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. సీఎంగా ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రజాధనాన్ని దోచిపెడితే విజయలక్ష్మి దాచిపెట్టిందని విమర్శించారు. వైకాపా సంతలో పశువుల్లా ఎమ్మెల్యేలను కొంటూ రాజకీయ వ్యభిచారానికి పాల్పడుతోందని మండిపడ్డారు.రాష్ట్రంలో ఇంతకంటే సిగ్గుమాలిన పార్టీ మరొకటి లేదన్నారు.చేసిన అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి విశ్వసనీయత అంటూ డ్రామాలు ఆడుతున్నారని ధ్వజమెత్తారు.

డబ్బు, కుర్చీ కోసమే ఈ తాపత్రయమన్నారు.వైకాపాకు ఏ మాత్రం దమ్ము,ధైౖర్యమున్నా వారి పార్టీకి చెందిన,మద్దతిస్తున్న 30 మంది ఎమ్మెల్యేల చేత అవిశ్వాస తీర్మానం పెట్టించడానికి సిద్ధం కావాలన్నారు. జగన్ బెయిల్ కోసం ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్, కాంగ్రెస్ నేతలు గులాంనబీ ఆజాద్, అహ్మద్ పటేల్ కాళ్ళు పట్టుకుంటున్నారని ఆరోపించారు.

ఎన్‌టీ రామారావు మరణానికి లక్ష్మీపార్వతి తప్ప మరొకరు కారణం కాదన్నారు.ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా వున్న వైఎస్ ఆయన్ను అవినీతి పరుడని ఆరోపించిన విషయాన్ని గుర్తు చేస్తూ అప్పుడు రామారావు విచారణకు కమిషన్ వేసుకుంటే కనీసం సాక్ష్యం చెప్పడానికి కూడా వైఎస్ ముందుకు రాలేదన్నారు.


కోట్లాది రూపాయల అవినీతిలో జగన్‌తో పాటు విజయలక్ష్మి,కుమార్తె షర్మిల,కోడలు భారతిలకు కూడా వాటాలు

ఎర్రన్నాయుడికి లోక్‌సభ నివాళి

న్యూఢిల్లీ, నవంబర్ 22 : కేంద్ర మా.జీ మంత్రి, తెలుగుదేశం పొలిట్‌బ్యూరో సభ్యుడు కింజరపు ఎర్రన్నాయుడికి లోక్‌సభ నివాళి అర్పించింది. శీతాకాల సమావేశాల తొలిరోజు గురువారం సభ ప్రారంభం కాగానే తొలుత ఇద్దరు కొత్త సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం నాలుగుసార్లు లోక్‌సభకు ఎన్నికైన ఎర్రన్నాయుడు, మరో తొమ్మిది మంది మా.జీ ఎంపీలతో పాటు శివసేనన అధినేత బాల్‌ఠాక్రే మృతికి స్పీకర్ మీరాకుమార్ సంతాపం ప్రకటించారు. ఈ సందర్భంగా లోక్‌సభ కొద్దిసేపు మౌనం పాటించింది.


టీడీపీపీలో..
తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ కార్యాలయంలో ఎర్రన్నాయుడుకు ఆ పార్టీ ఎంపీలు ఘనంగా నివాళులర్పించారు. ఎర్రన్నాయుడు చిత్రపటాన్ని ఏర్పాటు చేసి నామా నాగేశ్వరరావు, కొనకళ్ల నారాయణరావు, మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, శివప్రసాద్, నిమ్మల కిష్టప్ప, రమేశ్ రాథోడ్, గుండు సుధారాణి, సుజనా చౌదరి, సీఎం రమేశ్‌లతో పాటు కార్యాలయ కార్యదర్శి సత్యనారాయణ, సిబ్బంది నివాళులు అర్పించారు. ఎంపీగా, టీడీపీపీ నాయకుడిగా పార్లమెంటు లోపల, బయటా ఎర్రన్నాయుడు పార్టీ ప్రతిష్టను పెంచారని వారు కొనియాడారు.

ఎర్రన్నాయుడికి లోక్‌సభలో ఘనంగా నివాళి


బాబు తెలంగాణా వచ్చిన రోజు
అడ్డుకొంటామని
ఆ తరువాత నిరసన తెలపతామని
ఆవేశంతో ఊగిపోతూ వెళ్లి
అరెస్టయిన
ఆచార్య గారు
ఈ రోజు అయిపు లేడు
ఆచార్య సామాజిక వర్గం
అయితే సరేనా?
లేక ఉద్యమం ముసుగులో వచ్చి
రాజకీయ నాయకులుగా మారుతున్న వేళ
అందరిలా తన రాజకీయ సోపాన మార్గ
సుగుమం కోసం మునగదీసుకొన్నాడా ?
ఏరుదాటాక తెప్ప తగలేసినట్టు
తెలంగాణా ఎన్నికలు అయిన తక్షణమే
అక్కడికి వెళ్ళాలంటే వీసా కావాల్సి వస్తుందని
ఇక్కడ చెప్పిన రాజన్న రాజ్యం కోసం
తపిస్తున్న పిల్ల కాంగ్రెస్స్ రాజకీయ చిన్నపిల్ల ముందు
నిరసించడానికి నీరసం ఎందుకో?
పిల్ల కాంగ్రెస్స్ జెల్ల కాంగ్రెస్స్
ఓ సారి దేవత మరో సారి వంచన పరురాలుగా
భావించే వేర్పాటు పార్టీ
అంతా ఒక్కటే
వారి అజెండా ఒక్కటే
అని ప్రజలకు అర్థం అయ్యే రోజు
ముందు ముందు వస్తుంది
అందరిలా తన రాజకీయ సోపాన మార్గ
సుగుమం కోసం మునగదీసుకొన్నాడా ?
ఏరుదాటాక తెప్ప తగలేసినట్టు
తెలంగాణా ఎన్నికలు అయిన తక్షణమే
అక్కడికి వెళ్ళాలంటే వీసా కావాల్సి వస్తుందని
ఇక్కడ చెప్పిన రాజన్న రాజ్యం కోసం
తపిస్తున్న పిల్ల కాంగ్రెస్స్ రాజకీయ చిన్నపిల్ల ముందు
నిరసించడానికి నీరసం ఎందుకో?
పిల్ల కాంగ్రెస్స్ జెల్ల కాంగ్రెస్స్
ఓ సారి దేవత మరో సారి వంచన పరురాలుగా
భావించే వేర్పాటు పార్టీ
అంతా ఒక్కటే
వారి అజెండా ఒక్కటే
అని ప్రజలకు అర్థం అయ్యే రోజు
ముందు ముందు వస్తుంది


www.chaakirevu.wordpress.com

ఉద్యమం ముసుగులో వచ్చి రాజకీయ నాయకులుగా మారుతున్న వేళ....


52వ రోజు గురువారం "వస్తున్నా మీకోసం"పాదయాత్ర పోటోలు (eenadu) 22.11.2012

పార్లమెంట్‌లో తెలంగాణపై బిల్లు ఎందుకు పెట్టలేదు
కల్లును నిషేధిస్తానని ఎప్పుడూ చెప్పలేదు
గీత కార్మికుల పొట్టకొట్టిన వైఎస్
గీత కార్మికులకు లైసెన్సులు : చంద్రబాబు నాయుడు

మెదక్, నవంబర్ 22 : ఎవరి మద్ధతు లేకుండానే కేంద్రం అణుఒప్పందం బిల్లును ఆమోదించిందని, అలాంటిది అందరూ ఒప్పుకున్నప్పటికీ పార్లమెంట్‌లో ప్రత్యేక తెలంగాణపై బిల్లు ఎందుకు పెట్టలేదని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ప్రశ్నించారు. రాష్ట్రంలోని టీడీపీ హయాంలో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా వ్యవసాయానికి 9 గంటలపాటు నిరంతర కరెంట్ ఇచ్చిన ఘనత టీడీపీదేనని అన్నారు.

చంద్రబాబు నాయుడు ప్రారంభించిన 'వస్తున్నా...మీకోసం' పాదయాత్ర జిల్లాలో 48వ రోజైన గురువారం కొనసాగుతోంది. ఈ ఉద యం మునిపల్లి మండలం అంతారం నుంచి బాబు పాదయాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయని, సామాన్య ప్రజలు ఏవీ కొనుక్కునే పరిస్థితి కనిపంచడంలేదని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు ప్రభుత్వం గ్యాస్ సబ్సీడీ ఎత్తివేసి మధ్య తరగతి ప్రజలపై మరింత భారం మోపిందని ధ్వజమెత్తారు.

పిల్లా కాంగ్రెసుకు చెందిన పత్రికలో గీత కార్మికులను అవమానించేలా రాతలు వచ్చాయని, బెల్టు షాపులను రద్దు చేస్తానని తాను చెప్పానని, కానీ గీత కార్మికులను కూడా ఆ పత్రిక కలిపిందని చంద్రబాబు మండిపడ్డారు. కల్లుకు, బెల్టు షాపులకు సంబంధం లేదన్నారు. కల్లుని నిషేధిస్తానని తాను చెప్పలేదన్నారు. వైయస్ ఉన్నప్పుడు గీత కార్మికుల పొట్ట కొట్టాడన్నారు. అప్పుడు రెండు లక్షల కుటుంబాలు రోడ్డున పడ్డాయన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే గీత కార్మికులకు లైసెన్సులు ఇస్తామన్నారు. చంద్రబాబు వెంట పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలివస్తున్నారు. ఈ రోజు మొత్తం 17 కి.మీ మేర పాదయాత్ర చేయనున్నారు.

పార్లమెంట్‌లో తెలంగాణపై బిల్లు ఎందుకు పెట్టలేదు 22.11.2012

ఇప్పటి వరకు సుమారు 800 కిలోమీటర్ల పాదయాత్ర చేసిన తాను కాళ్లు నొప్పులు.. పాదాలకు బొబ్బలతో ఇబ్బందులు పడుతున్నానని చంద్రబాబు తెలిపారు. నడిచి నడిచి కాలు, ఒక వేలు నొప్పి ఎక్కువగా ఉందన్నారు. ప్రతిరోజూ సాయంత్రానికి కుంటుకుంటు నడుస్తున్న రాత్రి నిద్రకుపక్రమించే సమయంలో పాదయాత్రపై పట్టుదల మరింత పెరుగుతోందని చెప్పారు.

తాను ఇప్పటి వరకూ నడిచిన 51 రోజులలో చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ప్రజలు కష్టాలు పడుతున్న విషయం తన దృష్టికి వచ్చిందని, వాటి ముందు తాను పడుతున్న ఇబ్బంది పెద్దదేం కాదని చంద్రబాబు అన్నారు. డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ తమను ఇబ్బంది పెడుతున్నారంటూ అందోల్ నియోజకవర్గం మునిపల్లి మండలం బుధేర చౌరస్తాలో పలువురు ఆయన దృష్టికి తీసుకవచ్చారు. ఇందుకు స్పందించిన చంద్రబాబు తమ పార్టీ కార్యకర్తల జోలికి వస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవల్సి వస్తుందని హెచ్చరించారు.

రూపాయి బియ్యమిచ్చి రూ.60 లాక్కుంటున్నారు.. ఆరూర్ సభలో రైతులు చంద్రబాబు మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. 'రూపాయికి కిలో బియ్యం కావాలని మేం అడగనే లేదు. అయినా కాంగ్రెస్ వాళ్లు ఇస్తున్నారు. అయితే ఇలా బియ్యం ఇచ్చి మిగతా సరకుల పేరిట రూ.60లు లాక్కుంటున్నారు. ఈ ప్రభుత్వం వ్యాపారిలా వ్యవహరిస్తోంది' అని కోనాపూర్‌కు చెందిన రైతు ఎండి అక్బర్ ఆరూర్ సభలో చంద్రబాబు దృష్టికి తెచ్చారు.

ఉపాధి హామీ పథకం డబ్బులను కాంగ్రెస్ నాయకులు స్వాహా చేస్తున్నారని, ఇది దొంగ ప్రభుత్వమని వ్యాఖ్యానించారు. రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తున్న కాంగ్రెస్‌కు ఓటేయరాదని అక్బర్ అనడంతో చంద్రబాబులో ఉత్సాహం రెట్టింపయింది. దీని తర్వాత చంద్రబాబు మాట్లాడుతూ కాంగ్రెస్ పాలనలో రాత్రి విద్యుత్ వల్ల రాష్ట్రంలో నాలుగు వేల మంది చనిపోయారని చంద్రబాబు తెలిపారు.

ప్రజల కష్టం ముందు నా ఇబ్బంది ఏ పాటి

స్థానికులకే ఉద్యోగాలు
పరిశ్రమలన్నీ అమలు చేయాలి.. లేకుంటే ఉద్యమానికి సిద్ధం
విత్తనాలు, ఎరువులు పోలీస్ స్టేషన్‌లోనా?
ఇంత దుస్థితి ఇంతకు ముందెప్పుడైనా చూశారా?
ప్రజలను ఇబ్బందుల్లోకి నెట్టి.. కాంగ్రెస్ నేతలు బలిసిపోయారు
హైదరాబాద్‌ను పునర్ నిర్మించాలి.. పాదయాత్రలో చంద్రబాబు

సంగారెడ్డి, నవంబర్ 21: 'ఎక్కడ పరిశ్రమలు పెట్టారో.. అక్కడి వారికే ఉద్యోగాలివ్వండి'.. టీడీపీ అధినేత చంద్రబాబు తాజా నినాదమిది. పరిశ్రమలలో స్థానికులకే ఉద్యోగాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలంటూ పోరాటానికి సిద్ధమవుతామని ఆయన ప్రకటించారు. మెదక్ జిల్లా సదాశివపేట ప్రాంతంలో జిన్నింగ్, టెక్స్‌టైల్ పరిశ్రమలు ఎక్కువగా ఉన్నాయని, అయితే వాటిలో ఇతర ప్రాంతాల వారికే ఉద్యోగాలు ఇచ్చారని అన్నారు.

'వస్తున్నా మీకోసం' పాదయాత్ర జిల్లాలో నాలుగో రోజు కొనసాగింది. బుధవారం సదాశివపేట సమీపంలోని మద్దికుంట చౌరస్తా నుంచి మునిపల్లి మండలం పెద్దచల్మెడ వరకు 18.6 కిలోమీటర్లు పాదయాత్ర నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ధరల సలహా మండలి లేకుండా చేసిందని ఈ సందర్భంగా విమర్శించారు. టీడీపీ అధికారంలోకి రాగానే ధరల సలహా మండలిని ఏర్పరుస్తామని హామీనిచ్చారు.

డీఏపీ బస్తా ఒక్కటి రూ.1,300 కు అమ్ముతున్నారని, అదీ పోలీస్ స్టేషన్‌లో పెట్టి నాలుగు లాఠీ దెబ్బలు తిన్నాకే రైతులకు అందుతోందని మండిపడ్డారు. విత్తనాలు కూడా పోలీస్‌స్టేషన్‌లోనే అమ్మే దుస్థితి దాపురించిందని అన్నారు. తాము అధికారంలోకి రాగానే తిరిగి వ్యవసాయాన్ని లాభసాటిగా మారుస్తామని ఎరువుల ధరలు తగ్గిస్తామని చెప్పారు. అలాగే తొమ్మిది గంటలు నాణ్యమైన విద్యుత్‌ను ఉచితంగా సరఫరా చేస్తామన్నారు. కాంగ్రెస్ హయాంలో ప్రజలందరి బతుకులు చితికిపోయాయన్నారు. నాయకులు బలిసిపోయాయన్నారు.

ప్రజల బాధలు చూస్తే కోపం వస్తొందని, అయితే సంస్కారం అడ్డు వస్తొందన్నారు. హైదరాబాద్‌ను మళ్లీ పునర్నిర్మించాల్సిన అవసరం ఏర్పడిందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. మల్కాజిగిరి కార్పొరేటర్ సుమలతారెడ్డి ఆధ్వర్యంలో పలువురు ఆరూర్ శివారులోకి వచ్చి ఆయనను కలిశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, టీడీపీ హయంలో హైదరాబాద్‌ను అభివృద్ధి చేసి, ప్రపంచ పటంలో చోటు కల్పించామన్నారు. అలాంటి హైదరాబాద్‌లో ఇప్పుడు అన్నీ అవస్థలేనన్నారు. వీటన్నిటికి కారణమైన తల్లి కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్, టీఆర్ఎస్‌లను తరిమికొట్టాలని బాబు పిలుపు ఇచ్చారు.

బాబు వచ్చినా గేటు తీయని ఎంఆర్ఎఫ్
సదాశివపేట సమీపంలోని ఎంఆర్ఎఫ్‌కు బాబు వార్నింగ్ ఇచ్చారు. పాదయాత్రగా వెళ్తున్న బాబును ఎంఆర్ఎఫ్ వద్ద కార్మికులు 'అన్నా రండి' అంటూ పిలిచారు. మీరే రోడ్డుపైకి రావాలంటూ పార్టీ నాయకులు కోరడంతో.. గేటు తీయడం లేదని వారు తెలిపారు. దాంతో బాబు ఎంఆర్ఎఫ్ గేట్ వద్దకు వచ్చారు. అయినా సెక్యూరిటీ సిబ్బంది గేటు తీయలేదు. గేటు బయట నుంచే బాబు ఎందుకు తీయడం లేదని కార్మికులను అడిగారు. డ్యూటీ సమయంలో గేటు తీయరని కార్మికులు చెప్పడంతో ఇదేమన్నా జైలా అని ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చాక ఎంఆర్ఎఫ్ సంగతి చూస్తానని హెచ్చరించారు.

స్థానికులకే ఉద్యోగాలు పరిశ్రమలన్నీ అమలు చేయాలి.. లేకుంటే ఉద్యమానికి సిద్ధం