November 19, 2012


49వ రోజు సోమవారం పాదయాత్ర పోటోలు..(andhrajyothi) 19.11.2012


49వ రోజు సోమవారం పాదయాత్ర పోటోలు..(eenadu) 19.11.2012


49వ రోజు సోమవారం పాదయాత్ర పోటోలు... 19.11.2012

టీచర్ బాబు!
ఇంద్రకరణ్ స్కూలుకు రూ.2 లక్షలిప్పిస్తానని హామీ

సంగారెడ్డి, నవంబర్ 19 : ఎప్పుడూ రాజకీయాలు మాట్లాడే చంద్రబాబు సోమవారం స్కూలు టీచర్ పాత్ర పోషించి విద్యార్థులను ఆకట్టుకున్నారు. ఇంద్రకరణ్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు వెళ్లి 45 నిమిషాల పాటు విద్యార్థులతో గడిపారు. 'టీచర్లున్నారా? వస్తున్నారా? పుస్తకాలున్నాయా?' అని ఆరా తీశారు. టీచర్‌గా మారి విద్యార్థులకు హితబోధ చేశారు. మహాత్మాగాంధీ మధ్యతరగతి కుటుంబానికి చెందినవారని, కష్టపడి చదువుకున్నారని చెప్పారు.

అంబేద్కర్ తన తల్లిదండ్రులకు 14వ సంతానమని, పేదరికంలో ఉండి కూడా బాగా చదువుకుని రాజ్యాంగాన్ని రాశారని చెప్పారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ కష్టపడి, చదువుకుని రాష్ట్రపతి అయ్యారని తెలిపారు. మధ్య తరగతి కుటుంబానికి చెందిన ఎన్టీఆర్ కూడా బాగా చదువుకొని పేద ప్రజల సంక్షేమం కోసం పాటు పడ్డారన్నారు. పాఠశాలలో తాగునీటి వసతి కల్పించేందుకు ఎంపీ నిధుల నుంచి రెండు లక్షల రూపాయలు ఇప్పిస్తానని హామీ ఇచ్చారు.

ఇంద్రకరణ్ స్కూలుకు రూ.2 లక్షలిప్పిస్తానని హామీ

శుభం జరిగిందని మనం నోరు తీపి చేసుకుంటున్నామంటే.. పాయసం వండుకుని ఇష్టంగా తింటున్నామంటే అందుకు కారణం చెరకు రైతు! అంతెందుకు!? ఉదయాన్నే నిద్ర లేచిన వెంటనే టీ తాగాలంటే కావాల్సింది చక్కెరే కదా! నిత్యం లక్షలాదిమంది నోటిని తీపి చేసే చెరకు రైతుకు మాత్రం జీవితమంతా చేదే! కేంద్రం ఎరువుల ధరలను ఇష్టారాజ్యంగా పెంచింది. డీజిల్ ధర పెరిగింది. కూలీలు దొరకడం లేదు! కష్టాల సాగు చేయలేక ఇప్పటికే కొంతమంది సాగు మానుకున్నారు. చక్కెరను దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి! వినియోగదారులు అధిక ధరలకు కొనుగోలు చేయాల్సిన దుస్థితి! అయినా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మొద్దునిద్రను వీడడం లేదు.

మెదక్ జిల్లా ఇంద్రకరణ్, చేర్యాల, కాశీపూర్ గ్రామాల పర్యటనలో చెరకు రైతులు పెద్ద ఎత్తున వచ్చి కలిసి తమ కష్టాలను వివరించినప్పుడు గుండె చెరువైంది. గత ఏడాది టన్నుకు రూ.2100 మద్దతు ధర ప్రకటించారట. అది ఏమూలకూ చాలదు. ఇక, ఈ ఏడాది ఇప్పటి వరకు మద్దతు ధర ఊసే లేదు. చెరకుకు మద్దతు ధర నిర్ణయించే అంశాన్ని ఈ ప్రభుత్వం పూర్తిగా ఫ్యాక్టరీల యాజమాన్యాలకు వదిలేసింది.

టీడీపీ హయాంలో ఎక్కడ మంచి ధర వస్తే అక్కడ రైతులు అమ్ముకునేవారు. కానీ, ఇప్పుడు ఏ జోన్‌లో ఉన్న రైతులు అక్కడి ఫ్యాక్టరీకే చెరకును అమ్ముకోవాలి. వారు చేసిందే చట్టం. ఇచ్చిందే మద్దతు ధర. ప్రభుత్వ జోక్యం లేదు. దీనికితోడు, ఫ్యాక్టరీల నుంచే నేరుగా రైతుల రుణాలను రికవరీ చేసేసుకుంటున్నారు. చెరకు రైతుకు సలహా సూచనలూ లేవు. పరిశోధనలూ లేవు. దిగుబడి పెంచేందుకు కొత్త ఆవిష్కరణలూ లేవు.

కర్షక పరిషత్తు చైర్మన్‌గా ఉన్నప్పుడు చెరకు రైతుకు యంత్ర పరికరాలపై దృష్టిపెట్టా. అప్పట్లో కొంత చేయగలిగాను. అసలు చేయాల్సిందంతా ఇప్పుడే ఉందనిపిస్తోంది. చెరకుకు వెన్ను పుట్టింది. అది రైతు వెన్నును విరిచేస్తోంది. కష్టాల్లో కూరుకున్న చెరకు రైతును ఆదుకోవాల్సిందే. కానీ ఎలా!?

మనసులో మాట..చంద్రబాబు నాయుడు

కిరణ్ అహంకారి.. బొత్స లిక్కర్ డాన్
వాళ్ల మంత్రే చెప్పాడు
ఆ ఇద్దరితో రాష్ట్రం భ్రష్టుపట్టింది..
పాదయాత్రలో బాబు నిప్పులు
ముస్లింలను దూరం చేసుకున్నామంటూ పశ్చాత్తాపం

 సంగారెడ్డి, నవంబర్ 19 : సీఎం కిరణ్ అహంకారి అని, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ లిక్కర్ డాన్ అని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు. ఆ ఇద్దరిపై వాళ్ల పార్టీ మంత్రే మండిపడుతున్నారంటూ కిశోర్‌చంద్రదేవ్ అధిష్ఠానానికి రాసిన లేఖలోని అంశాలను ప్రస్తావించారు. ముస్లింలను దూరం చేసుకోవడంపై పశ్చాత్తాపం వ్యక్తం చేశారు.

మెదక్ జిల్లాలో రెండో రోజైన సోమవారం సంగారెడ్డి మండలం ఇంద్రకరణ్, చేర్యాల, కాశీపూర్, కంది, సంగారెడ్డిలలో 18.2 కిలోమీటర్లు చంద్రబాబు పాదయాత్ర నిర్వహించారు. కిరణ్, బొత్స తీరువల్ల రాష్ట్రం భ్రష్టు పట్టిపోయిందని విమర్శించారు రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి కాగానే అవినీతికి ఆజ్యం పోశారని, సోనియాగాంధీకి తెలిసినా పట్టించుకోలేదని విమర్శించారు.

తొమ్మిదేళ్లు రాష్ట్రాన్ని దోచుకున్న తల్లి కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్‌లు ఇప్పుడు దేనికోసం విడిపోయారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఐదేళ్లలో ఇంత డబ్బు ఎలా సంపాదించారో చెప్పాలని న్యాయమూర్తి అడిగితే నీళ్లు నమిలే పరిస్థితి జగన్‌కు వచ్చిందని గుర్తుచేశారు. పిల్ల కాంగ్రెస్ నేత జైలులో ఉండి కూడా రాజకీయాలు చేస్తున్నారని, 10 కోట్లు చొప్పున పశువులకంటే హీనంగా ఎమ్మెల్యేలను కొంటున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ పాలనలో హైదరాబాద్ కుంభకోణాల రాజధానిగా మారిందని ఆరోపించారు. కిరణ్ అసమర్థ, చేతకానితనం వల్ల కరెంట్ కొరతలు పెరిగిపోయాయని విమర్శించారు.

చిన్న తరహా పరిశ్రమల యజమానులతోనూ కార్మికులతోనూ మాట్లాడి త్వరలోనే పార్టీపరంగా విధానం ప్రకటిస్తామని చెప్పారు. తెలంగాణ అభివృద్ధిపై చర్చకు సిద్ధమంటూ మరోసారి కాంగ్రెస్ పార్టీకి సవాల్ విసిరారు. "తెలంగాణలో రోడ్లు, మురుగుకాల్వలు, పాఠశాలలకు భవనాలు, ఇతరత్ర నిర్మాణాత్మక కార్యక్రమాలు చేపట్టింది మేమే. మళ్లీ అధికారంలోకి వస్తే యువకులకు ఉద్యోగాలు ఇస్తాం. ఉద్యోగం లేక ఉపాధి దొరికే వరకు నిరుద్యోగ భృతి చెల్లిస్తాం. బలహీనవర్గాల వారికి లక్ష రూపాయలు ఖర్చు చేసి, ఇల్లు కట్టించి ఇచ్చే బాధ్యత తీసుకుంటా''మన్నారు.

నేతల పర్యటనల విషయంలో టీఆర్ఎస్ ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తోందని మండిపడ్డారు. సీఎం కిరణ్, వైసీపీ నేతలు వస్తే అడ్డుకోని టీఆర్ఎస్ తనను మాత్రం అడ్డుకునేందుకు ప్రయత్నిస్తుందని విమర్శించారు. తెలంగాణపై గడువులతో గారడీలు చేస్తున్న కేసీఆర్ మాటలు నమ్మొద్దని కోరారు. ఆర్నెల్లు పడుకుని, ఆ తర్వాత ఒక్క రోజు వచ్చి గారడీ చేస్తున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణలో ప్రజలు సమస్యల పరిష్కారం కోసం ఏనాడూ స్పందించిన పాపాన పోలేదని మండిపడ్డారు.

కాగా, గుజరాత్ అల్లర్ల సమయంలో ఎన్డీయే సర్కారుకు మద్దతు ఉపసంహరించుకొని ఉంటే బాగుండేదని, సకాలంగా నిర్ణయం తీసుకోలేకపోవడం వల్ల ముస్లింలను దూరం చేసుకోవాల్సి వచ్చిందని, అందుకు చింతిస్తున్నానని పశ్చాత్తాపం ప్రకటించారు. మళ్లీ అధికారంలోకి వస్తే ముస్లింల సంక్షేమానికి చర్యలు తీసుకుంటానని, ఉద్యోగ, విద్యా రంగాల్లో ఎనిమిది శాతం కోటా కల్పిస్తానని హామీ ఇచ్చారు.

కిరణ్, బొత్స తీరువల్ల రాష్ట్రం భ్రష్టు పట్టిపోయింది, కిరణ్ అహంకారి.. బొత్స లిక్కర్ డాన్


నేటి పాదయత్ర రూట్ మ్యాప్....20.11.2012

నవంబర్ 19, 2012
తన పై వచ్చిన ఆరోపణల ఆధారంగా పెట్టిన కేసులన్నీ ఎత్తివేస్తే జగన్ కూడా వై‌ఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీని మూసి వేసి చిరంజీవి లాగా కాంగ్రెస్ పార్టీలో విలీనం అవ్వటం ఖాయమని తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అన్నారు.
వస్తున్నా మీకోసం .. పాదయాత్ర మేదక్ జిల్లా సంగారెడ్డి లోని ఇంద్రకిరణ్ నుండి నేడు యాత్ర ప్రారంభించిన చంద్రబాబు, సభలో ప్రజలనుద్దేశిస్తూ ప్రసంగించారు. ప్రపంచవ్యాప్తంగా తెలుగువారి కోసం శ్రమించిన పార్టీ ఒక్క తెలుగుదేశం అని చంద్రబాబు ఈసందర్భంగా అన్నారు. తాను ఏనాడూ తెలంగాణా కు వ్యతిరేకంగా మాట్లాడలేదని చంద్రబాబు ఈ సందర్భంగా తెలిపారు.
సామాజిక న్యాయం అంటూ ఏర్పడిన పార్టీ ఇప్పటికే కాంగ్రెసు పార్టీలో కలిసిపోయిందని ప్రజారాజ్యం పార్టీని ఉద్దేశించి అన్నారు. సామాజిక న్యాయం అంటూ సొంత న్యాయాన్ని చేసుకున్నారని చిరంజీవిని పరోక్షంగా విమర్శించారు. కేసులన్నీ ఎత్తివేస్తే జగన్ కూడా ఇదే బాటలో పయనించడం ఖాయమని ఆయన అన్నారు.

కేసులన్నీ ఎత్తివేస్తే జగన్ కూడా వై‌ఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీని మూసి వేసి కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయ్యటం ఖాయం..

హైదరాబాద్, నవంబర్ 19 : కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి చీకటి ఒప్పందాలు కుదుర్చుకున్నారని తెలుగుదేశం పార్టీ నేత రేవంత్ రెడ్డి విమర్శించారు. ఈ సందర్భంగా సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సుప్రీంకోర్టులో జగన్‌కు బెయిల్ రావాలంటే సుమారు మూడు, నాలుగేళ్లు పడుతుందని అన్నారు.

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అవిశ్వాసం పెడితే తాము యూపిఏ2కు వ్యతిరేకంగా ఓటు వేసేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. తాము కూడా వ్యతిరేకంగా ఓటేస్తామని వైయస్సార్ కాంగ్రెసు చెప్పగలదా అని ప్రశ్నించారు. కేసులను మూసేస్తే కాంగ్రెసులో తన పార్టీని కలిపేందుకు జగన్ సిద్ధంగా ఉన్నారన్నారు. వెలుగులో ముగ్గురు చీకట్లో పదిమంది పార్లమెంటు సభ్యులు తమ వెంట ఉన్నారని చెప్పే పిల్ల కాంగ్రెసు అవిశ్వాసం పెడితే ఎవరి వైపు ఉంటారో ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. యూపిఏకి జగన్ మద్దతు ఎందుకు ఉపసంహరించుకోవడం లేదని ప్రశ్నించారు.

డబ్బులు వెదజల్లి ఇతర పార్టీల ఎమ్మెల్యేలను తమ పార్టీలో చేర్చుకోవడమే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నైతికతనా అని ప్రశ్నించారు. జగన్ పార్టీకి పార్లమెంటరీ వ్యవస్థపై ఏమాత్రం అవగాహన లేదన్నారు. అందుకే అసెంబ్లీ సమావేశాలు లేని సమయంలో అవిశ్వాసం పెట్టాలని డిమాండ్ చేస్తున్నారన్నారు. సమావేశాలు జరగనప్పుడు తీర్మానం ఎలా పెడతారని ప్రశ్నించారు. రాజ్యాంగ పరిజ్ఞానం లేకుండా మాట్లాడటం సరికాదన్నారు.

టిడిపి అవిశ్వాసం పెడితే ముడుపులు అందుకునేందుకే వైయస్సార్ కాంగ్రెసు ప్రయత్నాలు చేస్తోందన్నారు. గతంలో అవిశ్వాసం పెట్టినప్పుడు భారీగా ముడుపులు చేతులు మారాయన్నారు. వారి అవిశ్వాసం డిమాండ్ బేరకసారాల కోసమే అన్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో కాంగ్రెసుకు మద్దతిచ్చి ఇప్పుడు ప్రభుత్వాన్ని కూల్చుతామని చెబుతున్నారని, ఏది నమ్మాలన్నారు. ఓ వైపు అవిశ్వాసం అంటూ మరోవైపు బెయిల్ కోసం కేంద్రంపై వారు ఒత్తిడి తీసుకు వస్తున్నారని ధ్వజమెత్తారు. అవిశ్వాసం పేరుతో బెయిల్ పొందే ప్రయత్నం చేస్తున్నారని అనుమానం వ్యక్తం చేశారు.

సోనియాతో చీకటి ఒప్పందం కుదుర్చుకున్న జగన్

తెలంగాణకు ఎప్పుడూ వ్యతిరేకంగా మాట్లాడలేదు
విద్యుత్ చార్జీలు పెంచడం దారుణం
అవినీతిపై పోరాటం చేస్తున్న పార్టీ టీడీపీ
ఎన్టీఆర్ సుజల పేరుతో రక్షిత మంచి నీరు

మెదక్, నవంబర్ 19 : ప్రత్యేక తెలంగాణకు తాను వ్యతిరేకమంటూ ఎప్పుడూ మాట్లాడలేదని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. తెలంగాణపై తమ వైఖరిని ఇదివరకే స్పష్టం చేశామని తెలిపారు. తెలుగువారి సంక్షేమం కోసం కృషి చేస్తున్న పార్టీ టీపీడీయేనని ఆయన అన్నారు.

మెదక్ జిల్లా, సంగారెడ్డి మండలం, ఇంద్రకరణ్ నుంచి సోమవారం చంద్రబాబునాయుడు పాదయాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడ ప్రజలనుద్దేశించి ఆయన మాట్లాడుతూ సామాజిక న్యాయమంటూ ఏర్పడిన ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్‌లో కలిసిపోయిందని ఎద్దేవా చేశారు. మరి ఈరోజున కేసులన్నీ ఎత్తివేస్తే పిల్లకాంగ్రెస్, తల్లి కాంగ్రెస్‌లో కలిసిపోవడానికి సిద్ధంగా ఉందని అన్నారు. ఇక పోతే తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) ఆరు నెలలు పడుకుని, తర్వాత లేచి ప్రజల మధ్యకు వచ్చి ఏవోవో మాటలు చెబుతుంది. అవన్నీ మాటలుగానే మిగిలిపోతాయి తప్ప ప్రజలకు ఒరిగేది ఏమీ ఉండదని అన్నారు, అది కూడా కాంగ్రెస్‌లో కలిసిపోడానికి సిద్ధంగా ఉందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఇన్ని సంత్సరాలుగా టీఆర్ఎస్ ఉద్యమం చేస్తోంది, ఏమైనా సాధించిందా, ప్రజల కోసం ఏం పోరాటం చేశారు? రైతుల కోసం ఏమైనా ఉద్యమాలు చేశారా అని చంద్రబాబు ప్రశ్నించారు.

గత ఇరవైఐదేళ్లుగా అవినీతిపై ఒక్క తెలుగుదేశం పార్టీయే పోరాటం చేస్తుందని చంద్రబాబు నాయడు పేర్కొన్నారు. అందుకే కాంగ్రెస్, వైఎస్సార్ కాంగ్రెస్, టీఆర్ఎస్‌లు కుమ్మక్కయి టీడీపీని టార్గెట్ చేశాయని ఆయన ఆరోపించారు. పేదవారందరికి ఉచితంగా ఇల్లు కట్టించే బాధ్యత తెలుగుదేశం పార్టీదేనని బాబు హామీ ఇచ్చారు. విద్యుత్ చార్జీలు విపరీతంగా పెంచుతూ సామాన్యుడిపై భారం మోపుతున్నారని చంద్రబాబు ప్రభుత్వంపై ధ్వజమెత్తారు.

పరిశ్రమలవల్ల కలుషితమైన భూగర్భజలాలతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ఎన్టీఆర్ సుజల పేరుతో రక్షిత మంచినీటిని అందిస్తామని చంద్రబాబునాయుడు హామీ ఇచ్చారు. గ్రామస్థుడని జగ్గారెడ్డికి ఓటేస్తే ఎక్కడి సమస్యలు అక్కడే ఆగిపోయాయని అన్నారు. ఉపాధి అవకాశాలు సన్నగిల్లి యువకుల శక్తి నిర్వీర్యమవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.

గ్రామాల్లోకి వెళ్ళేందుకు రోడ్డు కూడా సక్రమంగా లేవని చంద్రబాబు విమర్శించారు. జగ్గారెడ్డి సొంత గ్రామం ఇంద్రకరణ్ ప్రభుత్వ పాఠశాలను సందర్శించి ఆయన విద్యార్ధుల ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పొలాల వద్ద రైతులతో ముచ్చటించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

అవినీతిపై పోరాటం చేస్తున్న పార్టీ టీడీపీ