November 11, 2012


41వ రోజు పాదయాత్ర పోటోలు....11.11.2012తెలంగాణపై కాంగ్రెస్ దొంగాట
సమస్యను పరిష్కరించాలని ప్రధానికి లేఖ రాశా
వర్గీకరణను మేం తెచ్చాం.. వైఎస్ అడ్డుకున్నారు
రంగా వర్సిటీ స్థలంపై సీఎం సోదరుడి కన్ను
వైస్ చాన్సలర్‌గా అస్మదీయుడి నియామకం

రంగారెడ్డి జిల్లా,నవంబర్ 11- ఆంధ్రజ్యోతి: "తెలంగాణపై అఖిలపక్షాన్ని ఏర్పాటు చేసి సమస్యను పరిష్కరించాలని నేను కేంద్రానికి లేఖ రాశాను. దానిపై ప్రధాని నుంచి నాకు ప్రత్యుత్తరం కూడా అందింది. కానీ, లేఖ తనకు అందలేదని కేంద్ర హోం మం త్రి షిండే చెప్పడం విడ్డూరం. కాంగ్రెస్ దొంగ నాటకాలకు ఇదే నిదర్శ నం'' అని టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. తెలంగాణపై నిర్ణయం చెప్పాలని తాము లేఖ రాశామని, దానిపై ఇప్పటి వరకు ఏమీ తేల్చలేదని, పైగా టీడీపీనే దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేస్తోందని ధ్వజమెత్తారు. "1999లో టీడీపీ ఎస్సీ వర్గీకరణను తీసుకొచ్చింది. దాంతో, 22,500 ఉద్యోగాలు వచ్చాయి. కానీ, వర్గీకరణ జరగకుండా వైఎస్ రాజశేఖరరెడ్డి అడ్డుకున్నారు.

దాంతో, మాదిగలు తమకు రావాల్సిన ఉద్యోగాలను నష్టపోయారు'' అని చంద్రబాబు వివరించారు. ఎన్జీ రంగా వర్సిటీ స్థలాన్ని సీఎం కిరణ్ సోదరుడు కబ్జా చేయాలని ప్రయత్నిస్తున్నాడని, అందుకే తనకు అనుకూలంగా ఉన్న వ్యక్తిని వైస్ చాన్సలర్‌గా నియమించుకున్నారని ఆరోపించారు. రంగా వర్సిటీకి తెలంగా ణ ప్రాంతానికి చెందిన వ్యక్తిని వైస్ చాన్సలర్‌గా నియమించాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు చేపట్టిన వస్తున్నా మీ కోసం పాదయాత్ర ఆదివారం దోమ మండలం మోత్కూర్ నుంచి తిమ్మాయిపల్లి వరకు పది కిలోమీటర్ల మేర కొనసాగింది. ఈ సందర్భంగా దోమ, పాలెపల్లి, తిమ్మాయపల్లిల్లో జరిగిన బహిరంగ సభల్లో ఆయన మాట్లాడారు. తెలంగాణకు టీడీపీ ఎప్పటికీ వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు.

తెలంగాణ ను అభివృద్ధి చేసింది తమ ప్రభుత్వమేనని, దీనిపై చర్చించేందుకు రావాలని సవాల్ విసిరితే ఎవరూ రా వడం లేదని వ్యాఖ్యానించారు. గతంలో హైదరాబా ద్, సికింద్రాబాద్‌లే ఉండేవని, టీడీపీ కేవలం తొమ్మిదేళ్లలో సైబరాబాద్ సిటీనే నిర్మించిందని చెప్పారు. తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ రాష్ట్రాన్ని దోచేసిందని, వైఎస్ తన తనయుని కోసం సగం హైదరాబాద్‌ను దోచిపెట్టారని ధ్వజమెత్తారు. సీబీఐ తేల్చిన లెక్క రూ.43 వేల కోట్లని, వైఎస్, ఆయన బంధువులు, సన్నిహితుల వద్ద కూడబెట్టిన సొమ్ము అంచనా వేయలేనంతగా ఉందని ఆరోపించారు. ఈ అవినీతి సొమ్మును రాష్ట్ర ప్రజలకు పంచితే ప్రతి కుటుంబానికి రెండు లక్షల వంతున ఇవ ్వవచ్చని చెప్పారు. ప్రపంచంలోనే పేరుగాంచిన కంపెనీలను హైదరాబాద్‌కు రప్పించి వేలాది మంది నిరుద్యోగులకు తాము ఉపాధి కల్పించామని, కానీ, ఆయా కంపెనీలు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభు త్వ వైఖరితో బెంగళూరు, పుణె, ఢిల్లీలకు తరలిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

జైల్లో ఉన్న జగన్‌కు విముక్తి కల్పిస్తే వైసీపీ కాంగ్రెస్‌లో విలీనం కావడం ఖాయమన్నారు. ఇక కాంగ్రెస్‌లో చేరిపోతామని టీఆర్ఎస్ ప్రతి రోజూ చెబుతోందని ఎద్దేవా చేశారు. రుణ మాఫీపై వైఖరిని స్పష్టం చేయాలని కాంగ్రెస్‌ను డిమాండ్ చేశారు. రాష్ట్రంలో 50 వేల ఆద ర్శ దొంగ రైతులను పెట్టుకుని వచ్చిన ఇన్‌పుట్ సబ్సిడీని పంది కొక్కుల్లా మింగేస్తున్నారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తాము అధికారంలోకి వస్తే వ్యవసాయ రంగానికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తామన్నారు. టీడీపీ హయాంలో దామాషా ప్రకారం తెలంగాణకు 42% నిధులతోపాటు ప్ర భుత్వ ఉద్యోగాలు, నామినేటెడ్ పదవులు, మంత్రుల పోర్టుఫోలియోలు కేటాయించామని గుర్తు చేశారు. అవినీతి, అరాచకాలకు పాల్పడుతున్న కిరణ్ సర్కార్‌ను బంగాళాఖాతంలో కలిపేద్దామని పిలుపునిచ్చారు.

ప్రజలతో మమేకం
పాదయాత్రలో భాగంగా చంద్రబాబు విద్యార్థులు, రైతులు, కార్మికులు, మహిళలు ఇలా.. అన్ని వర్గాలతోనూ మమేకమయ్యారు. వారి కష్టసుఖాలను అడిగి తెలుసుకున్నారు. పాదయాత్ర ప్రారంభించిన మోత్కూర్‌లో జడ్పీ ఉన్నత పాఠశాలకు వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. బోరు వేయిస్తానని, క్రీడా పరికరాలు ఇప్పిస్తానని హామీ ఇచ్చా రు. చంద్రబాబు పాదయాత్రకు మద్దతుగా ఆదర్శ క్రైస్తవ సంఘం ఆధ్వర్యంలో పలువురు క్రైస్తవులు సంఘీభావం తెలిపారు. పాదయాత్ర పొడవునా మహిళలు, రైతులతో బాబు ముచ్చటించారు.

మోత్కూర్ గ్రామానికి చెందిన ఓ రైతు పొలంలోకి వెళ్లి స్వయంగా వరి కోత కోశారు. సాగు వివరాలు ఆరా తీశారు. ఆదివారం సెలవు కావడంతో యువకులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాదయాత్రలో పాల్గొని చంద్రబాబుతో ఫొటోలు దిగారు. పాలెపల్లి శివారులో సీతారామయ్య అనే రైతు పత్తి పొ లంతోపాటు కాపు రాములమ్మ మొక్కజొన్న పొలం, ఊటుపల్లి అంజిలయ్య మొక్కజొన్న కల్లాన్ని పరిశీలించారు. టీడీపీ అధికారంలోకి వచ్చి న వెంటనే రైతుల కష్టాలన్నీ పరిష్కరిస్తామని, రుణాలు మాఫీ చేస్తామని పునరుద్ఘాటించారు.

ఇదే గ్రామంలో ఊటుపల్లి వెంకటమ్మ, బొక్క ఎల్ల మ్మ, అనంతమ్మ అనే వృద్ధులు తమకు నెల నెలా ఇచ్చే రూ.200 పింఛ ను సరిపోవడం లేదని చెప్పారు. దీంతో, వారికి ఒక్కొక్కరికి వెయ్యి రూ పాయలు ఇచ్చిన చంద్రబాబు.. అమ్మా.. టీడీపీకే ఓటు వేయండి, మేము అధికారంలోకి వస్తే రూ.600 పింఛను ఇస్తామని హామీ ఇచ్చారు.

తెలంగాణపై కాంగ్రెస్ దొంగాట, సమస్యను పరిష్కరించాలని ప్రధానికి లేఖ రాశాపరిగి, నవంబర్ 11: టీడీపీ అధినేత చంద్రబాబును కలుసుకుని యోగక్షేమాలు తెలుసుకునేందుకు ఆయన సతీమణి భువనేశ్వరి శనివారం రాత్రి దోమ మండలం మోత్కూర్ జడ్పీ ఉన్నత పాఠశాలకు వచ్చారు. బాబు ఆరోగ్యం గురించి ఆరా తీశారు. ఆదివారం మధ్యాహ్నం వరకు బాబుతోనే గడిపిన భవనేశ్వరి.. ఒంటిగంటకు హైదరాబాద్ వెళ్లిపోయారు. కాగా, తాను బస చేసిన బస్సులోనే ఆదివారం ఉదయం చంద్రబాబు చిత్తూరు టీడీపీ నేతలతో సమావేశమయ్యారు. జిల్లాలో పార్టీ పరిస్థితి గురించి సమీక్షించారు.

చంద్రబాబు వద్దకు భువనేశ్వరి

మీ చలవతోనే ఐటీ నిపుణులమయ్యాం
బాబుకు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ల సంఘీభావం


"మేం రైతు బిడ్డలం. మీ చలవతో సాఫ్ట్‌వేర్ నిపుణులమయ్యాం. మీ స్ఫూర్తితో ఎదిగాం. మీ రుణం తీర్చుకోవాలని.. కలిసి సంఘీభావం తెలపాలని వచ్చాం'' - హైదరాబాద్ హైటెక్ సిటీలో పనిచేసే 250 మందికిపైగా ఐటీ నిపుణులు చంద్రబాబుతో అన్న మాటలివి. దోమ మండలం మోత్కూరులో పాదయాత్ర చేస్తున్న చంద్రబాబును ఆదివారం కలిసి వారు సంఘీభావం తెలిపారు. ఐటీ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రతినిధులు రఘునాథ్ చౌదరి, బ్రహ్మయ్య, అజిత్ పాష, వెంకట్, రజనీకాంత్, రమేశ్ తదితరులు బాబును కలిశారు.

ఐటీ రంగం మీవల్లే అభివృద్ధి చెందిందని, తమకు ఉద్యోగాలు వచ్చాయని, కానీ, కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి కారణంగా ప్రస్తుతం ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. మళ్లీ మీరు అధికారంలోకి వస్తే ఐటీ రంగం అభివృద్ధి చెందే అవకాశం ఉందని ఆకాంక్షించారు. ఢిల్లీలో లా చదువుతున్న వరంగల్‌కు చెందిన విద్యార్థి మోత్కూరు చేరుకుని చంద్రబాబుకు సంఘీభావం తెలిపారు.

బాబుకు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ల సంఘీభావంPublish Date:Nov 11, 2012

chandrababu padayatra, chandrababu meekosam yatra, tdp padayatra, chandrababu telangana

రాష్ట్రంలో ఐటీ పరిశ్రమ అభివృద్ధి చెందిందంటే ముఖ్య కారణం చంద్రబాబు నాయుడు ముందుచూపే కారణమని తెదేపా సీనియర్ నేత యనమల్ రామకృష్ణుడు అన్నారు. చెంద్రబాబు చేపట్టిన పాదయాత్రకు సంఘీభావంగా ఐటీ నిపుణులు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ నుంచి రంగారెడ్డి జిల్లా పరిగి వరకూ ర్యాలీ నిర్వహించారు. నాడు రైతు బిడ్డలుగా ఉన్నవారంతా సాఫ్ట్ వేర్ పరిశ్రమ ద్వారా ఉద్యోగాలు పొంది నేడు లక్షల్లో జీతాలు తీసుకొనే పరిస్థితి ఉందన్నారు. చంద్రబాబు యాత్రకు మద్దతు తెలుపుతున్న ఐటీ నిపుణులంతా భవిష్యత్తులో చంద్రబాబు నాయకత్వం మళ్ళీ వచ్చేందుకు కృషి చేయాలని కోరారు. టిడిపి నేత పెద్దిరెడ్డి తో పాటు ఐటీ పరిశ్రమలకు చెందిన నిపుణులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

చంద్రబాబు పాదయాత్రకు ఐటీ నిపుణుల సంఘీభావం