November 10, 2012ప్రతి గిరిజన కుటుంబానికి ఇల్లు, 2 ఎకరాల భూమి
రూ. 5 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు
గ్రామపంచాయీతీలుగా 500 జనాభాగల తండాలు
టీడీపీ అధికారంలోకి వస్తే గిరిజన యూనివర్సిటీ
ఇది చంద్రబాబు నాయుడు గిరిజన డిక్లరేషన్
ఇప్పటికే బీసీ, మైనారిటీల డిక్లరేషన్ ప్రకటించిన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు టీడీపీ అధికారంలోకి వస్తే గిరిజనులకు కోసం చేపట్టే కార్యక్రమాలకు సంబంధించి డిక్లరేషన్‌ను శనివారం సాయంత్రం ప్రకటించారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు 11 ఐటీడీఏలను ఏర్పాటు చేయగా, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక నిర్వీర్యంచేసిందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ గిరిజనులు ఓటు బ్యాంకుగా మార్చుకుందని ఆయన విమర్శించారు.

ఇవి గిరిజన డిక్లరేషన్ విధానాలు...


* ఇళ్లులేని గిరిజనులకు రూ.1.50లక్షలు ఇచ్చి ఇంటి నిర్మాణం.
* భూమి లేని గిరిజనులకు రెండెకరాలు భూమి
* 500 జనాభా ఉన్న తండాలు ప్రత్యేక గ్రామ పంచాయీతీలుగా చేయడం
* జిల్లా యూనిట్‌గా తీసుకొని గిరిజన జనాభా ప్రకారం రిజర్వేషన్లు
* రూ.5 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు మంజూరు.
* ప్రత్యేక గిరిజన యూనివర్సిటీ, ఎస్టీ కమీషన్ ఏర్పాటు
* ప్రతి జిల్లాలో మైదాన ప్రాంతాల్లో ప్రత్యేక ఐటీడీఎలు
* 50ఏళ్లు దాటిన గిరిజనులకు పింఛన్ సౌకర్యం
* డయేరియా, మలేరియా, డెంగ్యూలాంటి వ్యాధులకు ఆరోగ్య బీమా ద్వారా వైద్య సదుపాయం.
* కేజీ నుంచి పీజీ వరకు గిరిజన పిల్లలకు ఉచిత విద్య
* గిరిజనులకు ప్రత్యేక డీఎస్సీ
* తండాల్లో మౌలిక సదుపాయాలు
* ఖాళీగా ఉన్న బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీ
* గిరిజన అమ్మాయి పెళ్లికి రూ.50వేల ఆర్థిక సహాయం
* జనాభా ప్రాతిపదికన నామినేటెడ్ పోస్టులు భర్తీలో గిరిజనులకు ప్రాధాన్యాం
* ప్రతి జిల్లాలో గిరిజన్ భవన్, గిరిజన యువకులకు ఉపాధి, ఉద్యోగావకాశాలు.
* గిరిజన చట్టాలు పకడ్బందీగా అమలు, సంస్కతి సంప్రదాయాల పరిరక్షణకు పూజారులకు రూ.5 వేలు
* గిరిజన ఉప ప్రణాళిక నిధులకు చట్టబద్దత కల్పించి అభివద్ధి పరచడం.
* ఐటీడీఏ, ఇతర శాఖల లో కాంట్రాక్ట్ పద్దతిని పని చేస్తున్న గిరిజనులకు రెగ్యూలరైజేషన్.
* గిరిజన ప్రాంతాల్లో ప్రకతి సంపదపై వారికే హక్కు కల్పించడం
* ప్రతి యూనివర్సిటీ, ఇతర సంస్థల పాలక మండలిలో ఎస్టీలకు ప్రా
«థినిత్యం
* గిరిజనులకు వ్యవసాయ సౌకర్యం నిమిత్తం ఇరిగేషన్ సదుపాయాలు కల్పించడం

చంద్రబాబు నాయుడు గిరిజన డిక్లరేషన్ ,టీడీపీ అధికారంలోకి వస్తే గిరిజన యూనివర్సిటీఈనాడు పోటోలు


ఆంధ్రజ్యోతి పోటోలు

39వ రోజు పాదయాత్ర పోటోలు....Part -2కేసీఆర్.. ఒళ్లు జాగ్రత్త!
మా పార్టీ చచ్చిపోయిందంటావా?
పూటకో మాట మాట్లాడేది నువ్వే
ఏనాడూ తెలంగాణకు వ్యతిరేకం లేం
కోదండకు చెప్పి జేఏసీ నుంచి మమ్మల్ని తరిమేశావు
కాంగ్రెస్ మోసకారి అని ఇన్నాళ్లకు తెలిసిందా?
టీఆర్ఎస్ అధినేతపై టీడీపీ నిప్పలు

కరీంనగర్ వేదికగా టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. 'తెలంగాణలో తెలుగుదేశం పార్టీ చచ్చిపోయింద''న్న గులాబీ అధినేత ప్రకటనపై టీడీపీ ఘాటుగా స్పందించింది. "ఒళ్లు దగ్గర పెట్టుకో''మని గట్టిగా హెచ్చరించింది. " వంద అసెంబ్లీ, 15 ఎంపీ సీట్లు గెలిస్తే తెలంగాణ ఎలా వస్తుందో చెప్పాలని'' వైసీపీ నిలదీయగా, "ఢిల్లీలో నీతో ఎవరు మాట్లాడారో చెప్పు'' అని కాంగ్రెస్ తీవ్రస్వరంతో ప్రశ్నించింది. 'ఉన్న మాటంటే ఉలుకెందుకు'' అంటూ టీఆర్ఎస్ సైతం ఎదురుదాడికి పదును పెడుతోంది.

గత ఎన్నికల్లో తమ పార్టీతో పొత్తుపెట్టుకొని తెర వెనక కాంగ్రెస్‌ను గెలిపించిన ఘనుడు కేసీఆర్ అని టీ-టీడీపీ ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర్‌రావు దుయ్యబట్టారు. కేసీఆర్‌కు దమ్ముంటే బస్సు యాత్ర కాక, తమ అధినేతలా పాదయాత్రకు సిద్ధం కావాలని సవాల్ విసిరారు. తెలంగాణ విషయంలో కేసీఆర్ పూటకో మాట.. రోజుకో మాట మాట్లాడుతున్నారని టీడీపీకి చెందిన ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి ధ్వజమెత్తారు. తెలంగాణపై టీడీపీ వైఖరి స్పష్టంగా ఉందని, ఎప్పుడూ తెలంగాణకు వ్యతిరేకం కాదని ఆయన పేర్కొన్నారు. ఒళ్లు దగ్గర పెట్టుకుని కేసీఆర్ మాట్లాడాలని ఆదిలాబాద్ ఎంపీ రమేష్ రాథోడ్ హెచ్చరించారు.

కాంగ్రెస్‌తో కుమ్మక్కై బ్లాక్‌మొయిల్ రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ మాటలను ప్రస్తుతం తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని ఎంపీ నామా నాగేశ్వరరావు అభిప్రాయపడ్డారు. పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు పెడితే టీడీపీ మద్దతు ఇస్తుందని స్పష్టం చేశారు. కేసీఆర్‌కు జ్ఞానోదయమైనట్టుగా ఉందని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి కడియం శ్రీహరి అన్నారు. కేసీఆర్ ఒత్తిడి వల్లే జేఏసీ నుంచి తమను అకారణంగా జేఎసీ నుంచి బహిష్కరించిందని ధ్వజమెత్తారు. తన అజ్ఞానానికి, ఇన్నాళ్లూ ప్రజలను మోసం చేసినందుకు ప్రజలకు కేసీఆర్ క్షమాపణ చెప్పాలని పొలిట్‌బ్యూరో సభ్యుడు అరవింద్ గౌడ్ డిమాండ్ చేశారు.

కేసీఆర్ పూటకో మాట మాట్లాడేది నువ్వే,ఏనాడూ తెలంగాణకు వ్యతిరేకం లేం