November 9, 2012


 
 
 
 
Fri, 9 Nov 2012, IST    vv

చంద్రబాబు మండిపాటు


రంగారెడ్డి(వి.వి) : నిత్యావసర వస్తువులు, పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెంచుతున్న పాలకులు ప్రజల కనీస అవసరాలైన మరుగుదొడ్లను కూడా నిర్మించి ఇవ్వలేకపోతున్నారని టిడిపి అధ్యక్షులు ఎన్‌.చంద్రబాబునాయుడు విమర్శించారు. రాష్ట్రంలో చేతకాని ప్రభుత్వం ఉందని నిప్పులు చెరిగారు. కిరణ్‌కుమార్‌ పనికిమాలిన ముఖ్యమంత్రని ఆయన నిందించారు. పాలన పూర్తిగా పక్కదారి పట్టిందని విమర్శించారు. రంగారెడ్డి జిల్లా గండీడ్‌ మండలం సల్కార్‌పేట నుంచి శుక్రవారం ఆయన పాదయాత్ర ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఆయన సల్కార్‌పేట చౌరస్తా, గండీడ్‌లలో ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ఉపాధి హామీ పథకం ద్వారా 150 రోజులు కూలీలకు పని కల్పించాల్సింది పోయి, వాటిని 30 రోజులకు మాత్రమే కుదించి, మిగతా మొత్తాన్ని కాంగ్రెస్‌ నాయకులంతా కలిసి మెక్కుతున్నారని దుయ్యబట్టారు. లక్షలు తిని బొజ్జలు పెంచుకుని తిరుగుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రాభివృద్ధికి కాంగ్రెస్‌ చేస్తున్నదేమి లేదన్నారు. తన పాలనలో రాష్ట్రాన్ని అభివృద్ధిలో మొదటిస్థానంలో నిలిపితే, కాంగ్రెస్‌ మాత్రం అవినీతిలో ప్రథమ స్థానంలో నిలిపిందన్నారు. రైతులు అధిక పెట్టుబడి పెట్టి పంటలు పండించినా కూడా వాటిని కొనే నాథుడే లేకుండా పోయాడని అన్నారు. ప్రభుత్వం అవలంభిస్తున్న విధానాలతో రైతులు దివాళా తీస్తున్నారని ఆవేదన చెందారు. వర్షాకాలంలోనే కరెంట్‌ కోతలు విధిస్తే ఇక వేసవిలో ఎలాంటి పరిస్థితి ఉంటుందో ఊహించవచ్చన్నారు. తెలంగాణపై కాంగ్రెస్‌ దొంగటాడుతున్నదని చంద్రబాబు విమ ర్శించారు. అన్ని పార్టీలు కాంగ్రెస్‌లో కలిసిపోయేవే అని, ప్రజలకు మిగిలేది టిడిపి ఒక్కటేనని ఆయన తేల్చిచెప్పారు. టిడిపి చచ్చిపోయిందని కొందరంటు న్నారని, అయితే ఎవరి పార్టీ చచ్చి పోతుందో కాలమే చెబుతుందని వ్యాఖ్యానించారు. దోచుకున్న డబ్బును దాచుకోవటానికి జగన్‌ పార్టీ పెట్టుకున్నారని ఎద్దేవా చేశారు. కోట్ల రూపాయలు తీసుకుని కొందరు జగన్‌ పార్టీలో చేరుతున్నారని ఆయన ఆరోపించారు. వస్తున్నా...మీకోసం పాదయాత్ర శుక్రవారంతో 35వ రోజుకు చేరుకున్నది. సల్కార్‌పేట్‌ నుంచి మొదలుపెట్టి గండీడ్‌, నంచర్లగేట్‌ల గుండా ఆయన సాయంత్రంలోగా 7 కి.మీ పాదయాత్ర జరిపారు. అటు తర్వాత గడ్డిర్యాల్‌ నుంచి పుట్టపహాడ్‌ వరకు 7 కి.మీ పాదయాత్ర చేసి, రాత్రి అక్కడే బస చేస్తారు. బాబుతో పాటు టిడిపి జిల్లా అధ్యక్షులు పి.మహేందర్‌రెడ్డి, ప్రధానకార్యదర్శి సుభాష్‌ యాదవ్‌, ఎమ్మెల్యేలు ప్రకాష్‌గౌడ్‌, రత్నం, మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, ఎమ్మెల్సీ నరేందర్‌రెడ్డి తదితరులు ఉన్నారు.

ప్రజలను దోచేస్తున్నారు- విశాలాంధ్ర 

 

 

మీ మధ్యనే ఉంటా...అందరిలా హైదరాబాద్‌లో ఉండకుండా.. మీ మధ్యనే ఉంటానని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. సమస్యలు ఎక్కడుంటే అక్కడికొచ్చి వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు. రంగారెడ్డి జిల్లా గండ్వీడ్‌ మండలం సల్కర్‌పేట గ్రామం నుంచి ఉదయం 11 గంటలకు చంద్రబాబు పాదయాత్ర రెండోరోజు ప్రారంభమైంది. ముందుగా అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళ్లర్పించారు. అనంతరం రెడ్డిపల్లి, గండ్వీడ్‌, రుసుంపల్లి చౌరస్తాల మీదుగా కుల్కచర్ల మండలం పుట్టాపాడ్‌ గ్రామానికి యాత్ర చేరుకుంది. ఈ పాదయాత్ర సందర్భంగా పలుచోట్ల బాబు ప్రసంగిస్తూ ఎరువులు, విత్తనాల ధరలు పెంచి కాంగ్రెస్‌ సర్కారు రైతుల నడ్డి విరగొట్టిందన్నారు. బ్యాంకు రుణాలను రైతులు చెల్లించొద్దనీ, ఎవరైనా అడిగితే తనపేరు చెప్పాలనీ బాబు సూచించారు. ఈ పనికిమాలిన ప్రభుత్వంలో ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారని చెప్పారు. అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్‌ను ప్రపంచపటంలో పెట్టిన ఘనత టిడిపికే దక్కుతుందన్నారు. కాంగ్రెస్‌ పార్టీలో చోటా, మోటా నాయకులు ఆయా స్థాయిల్లో ప్రజలను మోసం చేస్తూ నిధులను పందికొక్కుల్లా మేస్తున్నారన్నారు. రూ.43 వేల కోట్ల రూపాయలు అవినీతి జరిగిందన్నారు. టిడిపి హయాంలో అవకాశమున్న రంగాలన్నింటిలోనూ ఉద్యోగాలు కల్పించామన్నారు. నాడు అభివృద్ధిలో రాష్ట్రం పేరు తెచ్చుకుంటే... నేటి కాంగ్రెస్‌ ప్రభుత్వం అవినీతిలో పేరుమోసిందనీ ఎద్దేవ చేశారు.
30 ఏళ్లుగా పోరాడుతున్నాననీ, తెలంగాణలో ఏ పార్టీ అభివృద్ధి చేసిందో ప్రజలు గ్రహించాలన్నారు. పాదయాత్రలో ఎర్రబెల్లి దయాకర్‌రావు, నామా నాగేశ్వరరావు, టిడిపి జిల్లా అధ్యక్షులు మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు ప్రకాష్‌గౌడ్‌, రత్నం, ఎమ్మెల్సీ నరేందర్‌రెడ్డి పాల్గొన్నారు.
సర్దార్‌ ఆలీఖాన్‌ మృతికి బాబు సంతాపం
హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సర్దార్‌ ఆలీఖాన్‌ మృతి పట్ల టిడిపి అధినేత చంద్రబాబు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. న్యాయమూర్తిగా, మానవ హక్కుల కమిషన్‌ సభ్యునిగా ఆయన చేసిన సేవలను కొనియాడారు. ఆలీఖాన్‌ కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేశారు.

మీ మధ్యనే ఉంటా...ప్రజాశక్తి


ఒక్క బల్బు .. ఏడు వేల బిల్లు!
కాంగ్రెస్‌ను గెలిపించి తప్పు చేశాం
మరోసారి ఆ తప్పు చేయం
మీరు సీఎం అయి మా బాధలు తీర్చాలి
చంద్రబాబుకు మహిళల మొర, బిల్లుల దహనం
పాదయాత్ర ఆద్యంతం బిల్లులపైనే ఫిర్యాదులు
ఏ పార్టీనీ నమ్మొద్దు, బడుగుల పార్టీ టీడీపీనే
రంగారెడ్డి జిల్లా! గండీడు మండలం కొమిరెడ్డిపల్లి! చంద్రబాబు శుక్రవారం ఉదయం పాదయాత్రకు శ్రీకారం చుట్టారు! కొద్ది దూరం నడిచిన తర్వాత అదే గ్రామంలో రచ్చబండ నిర్వహించారు! ఎప్పట్లానే.. 'ఏమిటి విశేషాలు!? మీ సమస్యలు చెప్పండి' అని అన్నారు! అంతే..! రెండు రోజుల కిందట కరెంటు బిల్లు వచ్చినప్పటి నుంచీ కడుపులోనే దాచుకున్న ఆగ్రహం.. గుండెల్లో గూడు కట్టుకున్న వేదన.. ఒక్కసారిగా కట్టలు తెంచుకుంది! "మా ఇంట్లో ఒక్క బల్బు ఉందయ్యా! దానికే ఏడు వేల రూపాయల బిల్లు వచ్చింది'' అని ఓ మహిళ అంటే.. "కరెంటు కోసం రాత్రిళ్లు జాగారం చేయాల్సి వస్తోంది. కరెంటు ఇవ్వకపోయినా వేలల్లో బిల్లులు మాత్రం పంపుతున్నారు'' అని మరో మహిళ మండిపడింది.

"మేం కాంగ్రెస్‌ను గెలిపించి తప్పు చేశాం. మళ్లీ కాంగ్రెస్ మాట ఎత్తం! మళ్లీ మీరే ముఖ్యమంత్రి అయి మా బాధలు తీర్చాలి'' అని మహిళలు ఒకరి తర్వాత మరొకరుగా ముక్తకంఠంతో నినదించారు. ఒక్క కొమిరెడ్డిపల్లి మాత్రమే కాదు. శుక్రవారం చంద్రబాబు పాదయాత్ర అడుగడుగునా ఇదే పరిస్థితి! ప్రతి గ్రామంలోనూ మహిళలు ముందుకు వచ్చి మరీ కరెంటు బిల్లులు చూపి ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు చూపించిన బిల్లులు చూసి చంద్రబాబు కూడా ఆశ్చర్యానికి లోనయ్యారు. రెండు సర్‌చార్జీల పోటుతో విద్యుత్ బిల్లులు పేలిపోతున్నాయి. దీంతో, శుక్రవారం చంద్రబాబు పాదయాత్రలో ఇదే ప్రధాన అంశమైంది. ఆయన ఎక్కడకు వెళ్లినా దీనిపైనే పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చాయి.

ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నారని చంద్రబాబు వారిని ప్రశ్నించగా.. ఇంత డబ్బు ఎక్కడ నుంచి తీసుకువచ్చి కట్టాలి? కరువు వచ్చి తింటానికి తిండి లేక మేము బతుకుతున్నాం. ఈ డబ్బు కట్టేది లేదు'' అని వారు తెగేసి చెప్పారు. దీంతో, "అలానే చేయండి. ఒక బల్బు ఉన్న వారెవరూ అదనపు చార్జీలు చెల్లించవద్దు'' అని చంద్రబాబు వారికి స్పష్టం చేశారు. సల్కార్‌పేటలో ఆగ్రహాన్ని ఆపుకోలేని కొందరు మహిళలు చంద్రబాబు వెళ్లిన తర్వాత కరెంటు బిల్లులు అన్నిటినీ కాటన్ బాక్స్‌లో పెట్టి తగలబెట్టారు. "బయట ధరలన్నీ పెరిగాయి. ఎలా బతుకుతున్నామో దేవునికే ఎరుక. రూపాయికే కిలో బియ్యం పథకం అమల్లోకి వచ్చిన తర్వాతే ఇలా జరుగుతోంది'' అని గ్రామంలోని మహిళలంతా ఆవేదన వ్యక్తం చేశారు. బియ్యం రూపాయికి ఇచ్చి మిగతా వాటి ధరలు పెంచేశారని ధ్వజమెత్తారు.

కాగా, కాంగ్రెస్, టీఆర్ఎస్, వైసీపీ ఎప్పటికైనా ఒకటేనని, వాటిని నమ్మవద్దని చంద్రబాబు పిలుపునిచ్చారు. పీఆర్పీలాగే టీఆర్ఎస్, వైసీపీ కాంగ్రెస్‌లో విలీనం కావడం ఖాయమన్నారు. వాటిని నమ్ముకుంటే లాభం ఉండదన్నారు. పాదయాత్రలో భాగంగా వివిధ సందర్భాల్లో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ నేతలు అధికారాన్ని అడ్డుపెట్టుకుని రాష్ట్రాన్ని పందికొక్కుల్లా దోచుకుతింటుంటే.. టీఆర్ఎస్, వైసీపీ ప్రజలను మోసం చేసి పబ్బం గడుపుకుంటున్నాయని మండిపడ్డారు. జగన్‌పై కేసులు ఎత్తివేస్తే ఏ క్షణమైనా కాంగ్రెస్‌లో కలిసేందుకు వైసీపీ సిద్ధంగా ఉందన్నారు. టీఆర్ఎస్‌కు ప్రజల్లో విశ్వసనీయత లేదని, ఆ పార్టీ కూడా కాంగ్రెస్‌లో కలిసేందుకు బేరసారాలు సాగిస్తోందని చెప్పారు. పేదలు, బడుగు, బలహీన వర్గాల ప్రజలకు ఇక మిగిలేది టీడీపీనేనని చెప్పారు.

సర్కారుకు ఏడు సూచనలు
ఇటీవలి నీలం తుఫాను, ఆ తర్వాత రాష్ట్రాన్ని ముంచెత్తిన వరదల నేపథ్యంలో బాధితులకు సహాయ చర్యలనందించడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని టీడీపీ అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు.

తుఫాను బాధితులు తలదాచుకున్న పునరావాస కేంద్రాలకు ఆహారం, మంచినీటిని పూర్తి స్థాయిలో సరఫరా చేయడం, చిన్నారులకు వ్యాధి నిరోధక మందుల సరఫరా, వైద్య బృందాలు, పశు వైద్యుల తరలింపు, ఎక్స్‌గ్రేషియా చెల్లింపు, ప్రత్యామ్నాయ పంటలకు వెళ్లేలా రైతులకు తగిన సహకారం, నష్టపరిహారం కోసం కేంద్రానికి లేఖ తదితర అంశాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి చంద్రబాబు తన లేఖలో సూచించారు.


ఒక్క బల్బు .. ఏడు వేల బిల్లు! కాంగ్రెస్‌ను గెలిపించి తప్పు చేశాం..


chandrababunaidu_vastunnameekosam_padayatra_9.11.2012

వస్తున్నా మీకోసం పాదయాత్ర 39వ రోజు పోటోలు...రంగారెడ్డి జిల్లా..9.11.2012టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేపట్టిన వస్తున్నా...మీకోసం పాదయాత్రకు ఎన్నారైలు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఇటీవల ఎన్నారై టీడీపీ కనెక్టికట్ మద్దతుదారులు మాంచెస్టర్‌లోని నార్త్‌వెస్ట్ పార్క్ వద్ద దాదాపు 200 మందితో సంఘీభావ సదస్సు నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ఆంద్రప్రదేశ్ నుంచి టీడీపీ నేతలు కోడెల శివప్రసాదరావు, దేవినేని ఉమా, పయ్యావుల కేశవులు హాజరై పాదయాత్రకు ఎన్నారైల మద్దతుపై తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. నార్త్‌జోన్ పార్క్ చుట్టూ తెలుగుదేశం పార్టీ బ్యానర్లు, బ్యాడ్జీలు, కండువాలు, చంద్రబాబు- ఎన్టీఆర్ ఫ్లెక్సీలతో పాదయాత్ర చేశారు. 100 కార్లతో జైతెలుగు దేశం, వర్ధిల్లాలి చంద్రబాబు నాయకత్వం అంటూ నినాదాలు చేస్తూ పార్క్ చుట్టూ ర్యాలి నిర్వహించారు.

అనంతరం చంద్రబాబు పాదయాత్రపై పలువురు ప్రసంగించారు. పెద్ద ఎత్తున ప్రజలు సదస్సుకు హాజరై విజయవంతం చేసినందుకు ఎన్నారై టీడీపీ కనెక్టికట్ సభ్యులు శ్రీనివాస్ యండూరి, తరణి పరచూరి, గోపాల కృష్ణ (గోపి), యోగేష్ అబ్బురి, శ్రీనివాస్ అట్లూరి, రామకృష్ణ ఇంతూరి ఎంతో సంతోషం వ్యక్తం చేశారు.

అదే విధంగా ఇటీవలే రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన టీడీపీ నేత ఎర్రన్నాయుడు సంతాపసభ నిర్వహించడంతో పాటు, దారుణ హత్యకు గురైన చిన్నారి శాన్వికి క్రొవ్వొత్తులు వెలిగించి నివాళులర్పించారు.

వస్తున్నా...మీకోసం పాదయాత్రకు ఎన్నారైలు మద్దతురైతులకు ఖర్చు పెరిగినా ఉత్పత్తులు కొనే నాథుడే లేడని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. శుక్రవారం ఉదయం భాగంగా జిల్లాలోని సల్కలూరు నుంచి 35 వ రోజు పాదయాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రభుత్వంపై నిప్పులు చరిగారు. ప్రభుత్వ విధానాలతోనే రైతులు చితికిపోతున్నారని మండిపడ్డారు. వర్షాకాలంలో కరెంట్ కోతలున్నాయన్నారు. ఒక ఇంటికి రూ.7 వేలు బిల్లు వేస్తే పేదలు ఎలా కడతారని ప్రశ్నించారు.

కరెంటు రాదు...బిల్లు భారం మాత్రం పెరిగిందని చంద్రబాబు పేర్కొన్నారు. కిరణ్ ఓ చేతకాని సీఎం అని వ్యాఖ్యానించారు. ప్రజలు కష్టాలు పడుతున్నా పట్టించుకోవడం లేదన్నారు. పిల్ల కాంగ్రెస్‌లో ఒకరు జైలులో ఉంటే, ఇంకొకరు పాదయాత్ర చేస్తున్నారని, మరొకరు ఎమ్మెల్యేలను కొంటున్నారని ఆరోపించారు. తెలంగాణపై కాంగ్రెస్ దొంగాట ఆడుతుందని విమర్శించారు. అన్ని పార్టీలూ కాంగ్రెస్‌లో కలిసిపోయేవే అని, ప్రజల కోసం మిగిలేదని టీడీపీ అని తేల్చి చెప్పారు. టీడీపీ చచ్చిపోయిందని కొందరు అంటున్నారు, అయితే ఎవరి పార్టీ చచ్చిపోతుందో రాబోయే రోజుల్లో తేలిపోతుందని చంద్రబాబు చెప్పారు.

" కిరణ్ ఓ చేతకాని సీఎం " శుక్రవారం పాదయాత్రలో చంద్రబాబుతనకు సైకిల్ కావాలని కోరిన ఓ రైతు ముచ్చటను చంద్రబాబు తీర్చారు. పాదయాత్రలో భాగంగా రెండు రోజుల కిందట దారిలో లక్ష్మయ్య అనే రైతును చంద్రబాబు పలకరించారు. పంట ఎలాగుంది? నీ ఇబ్బంది ఏమిటి? అంటూ ముచ్చటించారు. కరెంటు కోతను ప్రస్తావించిన రైతు లక్ష్మయ్య, తనకు పొలం దూరంగా ఉందని, సైకిల్ కావాలని అభ్యర్థించాడు. సైకిల్ ఇస్తానని అప్పట్లో హామీ ఇచ్చిన చంద్రబాబు.. బుధవారం రాత్రి తాను బస చేసిన శేరివెంకటాపురం క్యాంప్‌కు ఆయన్ను పిలిపించుకుని, కొత్త సైకిల్‌ను బహుమతిగా ఇచ్చారు. దీంతో, లక్ష్మయ్య ఆనందానికి అవధుల్లేకుండాపోయాయి.

రైతు ముచ్చటను తీర్చిన చంద్రబాబు ,సైకిల్‌ బహుమతి