October 26, 2012

జైల్లో మీ ఆయన భోగాల మీద
రేగిన దుమారానికి
విరుగుడుగా బిడ్డల
మీద ప్రమాణానికి
సవాల్ చేస్తూ
సతిగా పరిణితి లేని పసతో
ఓ లేఖ రాసారు
ప్రతిపక్షం వాళ్ళు
జైళ్ల శాఖ దగ్గర ఆరా తీస్తే
అంతెందుకు ఉలిక్కి పడ్డారు
ఆ పడేదేందో
అవినీతి మీద
ప్రాధమిక దర్యాప్తులో
వెల్లడైన వాస్తవాలతో
అరెస్ట్ అయ్యి అక్కడికి
వెళ్ళిన రోజే
ఇంటిల్ల పాది
నడి రోడ్డు మీద రక్తి కట్టించిన నాటకం లో
ఈ ప్రమాణపు సన్ని’వేషం’ పెట్టి వుంటే
ఉప ఎన్నికలలోమరింత సానుభూతి వచ్చేది కదా
అసలు సిసలు అవినీతి ఆస్తి పాస్తుల కొండంత భోగాల మీద
ఆ ఇంటి కోడలుగా కొద్దిగా దృష్టి సారించి
మడమ తిప్పకుండా ప్రమాణం చేసి వుంటే
ఊరూ వాడా అయ్యో పాపం అనేది
జైల్లో పెళ్లి రోజు జరుపుకోడానికి
ఏకాంత సేవ ఏర్పాట్లు చేయలేదనే
ఏడుపు గొట్టు రాజకీయ లేఖలు ఎందుకో?
అయినా మైనారిటీ తీరని బిడ్డల మీద ప్రమాణం అంటే
మీ మావయ్య అరిగిపోయిన రికార్డు లా చెప్పే
చట్టం తన పని తాను చేసుకు పోదూ
మీకా హక్కు ఎక్కడ వుందని.
మావయ్య బతికి ఉన్నప్పుడే
చట్టం తన పని తాను చేసుకు పోలేందు
కుట్రలతో శాసించ వచ్చు అని
ఎదురు చెప్పి ఉండాల్సింది
రామ కోటి రాసుకోడానికి
భంగం కల్పించే నాటకంలో
బావ కళ్ళలో ఆనందం చూసినోడి పిల్లలు
తండ్రి లేని అనాధలు అయ్యే వారు కాదు
అలాంటి మామ ఇలాకాలోని సన్నివేశాలు
మాటి మాటి కి కుట్ర ల ను గుర్తుకు తెస్తున్నాయా?
చట్టం తన పని చేస్తుంటే
ప్రతి మలుపుకూ కుట్ర కుట్ర అని
ఇంటిల్ల పాదీ పాడుతుంటే
పార్టీ కూడా వంత పాడుతుంటే
బతికి లేని మావయ్య గారి
ఆత్మ భరించగలదా?
కోడలుగా మావయ్య ఆత్మను
అంతగా ఇబ్బంది పెడితే
ఆయన అభిమానుల గుండెలు ఆగితే
ఓదార్పుల నాటకాలు ఎవరు చేస్తారు?
అసలే ఓట్లకోసం ఇంటిల్ల పాదీ
పడరాని పాట్లు పడుతున్నారే!

www.chaakirevu.blogspot.com

జైల్లో పెళ్లి రోజు జరుపుకోడానికి ఏకాంత సేవ ఏర్పాట్లు చేయలేదనే ఏడుపు గొట్టు రాజకీయ లేఖలు ఎందుకో?

మహబూబ్‌నగర్ జిల్లా గద్వాల పట్టణం! శుక్రవారం రాత్రి 9 గంటలు! చేనేత పరిరక్షణ సమితి నాయకులు పాదయాత్ర చేస్తున్న చంద్రబాబుకు సన్మానం చేశారు! చంద్రబాబు ప్రసంగించారు! పరిరక్షణ సమితి నాయకులు కిందకి దిగి వెళుతున్నారు! అదే సమయంలో, టీడీపీలో చేరేందుకు కొంతమంది నాయకులు వేదికపైకి ఎక్కారు! అంతే.. తాత్కాలికంగా ఏర్పాటు చేసిన వేదిక ఒక్కసారిగా కుప్పకూలింది. అసలే అది చిన్న వేదిక. ఎక్కువమంది దానిపై ఎక్కడంతో నిట్టనిలువుగా పడిపోయింది.

దాంతో, చంద్రబాబు ఒక్కసారిగా కుడి వైపునకు కూలబడిపోయారు. వేదికపై ఉన్నవారు ఒకరిపై మరొకరు పడిపోగా.. చంద్రబాబుపైనా కొంతమంది పడిపోయారు. వేదిక కూలగానే, 'సార్‌ను చూసుకోండి.. సార్‌ను చూసుకోండి' అంటూ నాయకులు గన్‌మెన్‌లు ఒక్కసారిగా వేదిక వద్దకు పరుగెత్తారు. ఘటన జరిగిన వెంటనే తేరుకున్న బ్లాక్ క్యాట్ కమెండోలు, వ్యక్తిగత భద్రతా సిబ్బంది చంద్రబాబును పైకి లేపారు. సురక్షితంగా కిందకు తీసుకు వచ్చారు.

అనూహ్యంగా ఘటన జరగడంతో చంద్రబాబు సహా నేతలంతా ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు. వేదికపై నుంచి కిందకు వచ్చిన తర్వాత చంద్రబాబు మాట్లాడారు. "దేవుడి దయ వల్ల సురక్షితంగా ఉన్నాం. ఎవరికీ ఏమీ కాలేదు'' అని అన్నారు. కార్యకర్తలు ఆందోళన చెందవద్దని స్పష్టం చేశారు. దీంతో, పార్టీ కార్యకర్తలు బాణసంచా తీసుకువచ్చి కాల్చి సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం బాబు యథావిధిగా పాదయాత్రను తిరిగి ప్రారంభించారు.

ఒక కిలోమీటరు మేర పాదయాత్ర కొనసాగించారు. అయితే, వేదికతోపాటు చంద్రబాబు కూడా కుప్పకూలడం, ఆయనపై కొంతమంది పడిపోవడంతో ఆయన వెన్నెముకపై ఒత్తిడి పెరిగింది. కిలోమీటరు నడక కొనసాగించిన తర్వాత ఆ నొప్పి మరికాస్త ఎక్కువైంది. దీంతో, చంద్రబాబు పాదయాత్రను కొనసాగించలేకపోయారు. రాత్రి బసకు రెండు కిలోమీటర్లకు ముందే చంద్రబాబు పాదయాత్రను నిలిపి వేశారు. అక్కడే బస చేశారు. అయితే, ముందు జాగ్రత్త చర్యగా హైదరాబాద్ నుంచి ప్రత్యేక వైద్యులను గద్వాలకు రప్పిస్తున్నారు. వారు వచ్చి చంద్రబాబును పరిశీలించనున్నారు.

వైద్యుల సలహా మేరకే పాదయాత్ర కొనసాగింపుపై నిర్ణయం తీసుకుంటామని ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి తెలిపారు. కాగా, ఈ ప్రమాదంలో ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, జిల్లా పార్టీ అధ్యక్షుడు పోకల మనోహర్, గద్వాల మాజీ మున్సిపల్ చైర్మన్ రమాదేవి, మాజీ మార్కెట్ యార్డు చైర్మన్ వెంకట్రాంరెడ్డి తదితరులు స్వల్పంగా గాయపడ్డారు.

"దేవుడి దయ వల్ల సురక్షితంగా ఉన్నాం. ఎవరికీ ఏమీ కాలేదు'' -చంద్రబాబు

 వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి భార్య భారతి రెడ్డికి తెలుగుదేశం పార్టీ మహిళా అధ్యక్షురాలు శోభా హైమావతి సవాల్ విసిరారు. ఆస్తుల కేసులో అరెస్టై చంచల్‌గూడ జైలులో ఉన్న జగన్ సెల్‌ఫోన్ వాడుతున్నట్లు మీ బిడ్డలపై ప్రమాణం చేసి చెప్తారా అని భారతి అడుగుతున్నారని, తన భర్త జగన్ ఎటువంటి అక్రమాలకు పాల్పడలేదని తన బిడ్డలపై ఆమె ప్రమాణం చేసి చెప్పగలరా అని ఎదురు దాడి చేశారు.
జగన్‌కు చెందిన పలు కంపెనీలలోకి పెట్టుబడులు ఎలా వచ్చాయో భారతి చెప్పాలని డిమాండ్ చేశారు. లోటస్ పాండ్, బెంగళూరులో ఆధునాతన భవంతులు ఎలా వచ్చాయో ప్రమాణం చేస్తారా అని ప్రశ్నించారు. జగన్ సోదరి షర్మిల ఏ మొహం పెట్టుకొని పాదయాత్ర చేస్తున్నారని ఆమె విమర్శించారు. రాష్ట్రాన్ని నిలువునా దోచారని మండిపడ్డారు.

లోటస్ పాండ్, బెంగళూరులో ఆధునాతన భవంతులు ఎలా వచ్చాయో ప్రమాణం చేస్తారా ..


TV9 - Chandrababu naidu falls from stage during 25th day of Padayatra
TV9 - Chandrababu Naidu struggling with Back Painచంద్రబాబుకి తప్పిన ప్రమాదం...గద్వాలలో కుప్పకూలిన సభవేధిక...26.10.2012

Balakrishna Images in Pdayatra

25వ రోజు చంద్రబాబు పాదయాత్రలో నందమూరి బాలక్రిష్ణ పోటోలు...26.10.2012

64 Photos...Slideshow

25 వ రోజు చంద్రబాబు పాదయాత్ర పోటోలు..26.10.2012

తెలుగుదేశం పార్టీ తెలంగాణకు ఎప్పుడూ వ్యతిరేకం కాదని ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. తమ వైఖరిని ఎప్పుడో తెలియజేశామని, తాను ఎప్పుడూ తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడలేదని తెలిపారు. తెలంగాణపై అఖిలపక్షం ఏర్పాటు చేస్తామని చెప్పిన కేంద్రం ఇంతవరకు ఎందుకు పెట్టలేదని చంద్రబాబు ప్రశ్నించారు.

చంద్రబాబునాయుడు 'వస్తున్నా...మీకోసం' పాదయాత్ర శుక్రవారం నాటికి 25వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా బూడిదపాలెంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీని దెబ్బతీసేందుకే కాంగ్రెస్ పార్టీ కుట్రపన్నుతోందని, అందులో భాగంగానే టీఆర్ఎస్, వైఎస్సార్ పార్టీలను కలుపుకునేందుకు యత్నిస్తోందని ఆయన ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్‌కు తగిన విధంగా బుద్ధి చెప్పాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.

 

ఎన్టీఆర్ కూడా త్వరలో చంద్రబాబు పాదయాత్రలో
టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ కూడా త్వరలో చంద్రబాబు పాదయాత్రలో పాల్గొననున్నారని సమాచారం. కలిసి వెళ్లడం కాకుండా కాసేపు ఆయన చంద్రబాబుతో పాదయాత్ర చేసే అవకాశముంది. శుక్రవారం ఉదయం జిల్లాలోని అమరవాయి నుంచి చంద్రబాబు పాదయాత్రను ప్రారంభించారు. ఈ రోజు 12 కిలోమీటర్ల మేర బాబు పాదయాత్రగా వెళ్లనున్నారు. 

టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ కూడా త్వరలో"వస్తున్నా మీకోసం" పాదయాత్రలో పాల్గొననున్నారని సమాచారం

రాజన్న రాజ్యం అంటే దోపిడీ రాజ్యం
వైఎస్ హయంలో ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వలేదు
జగన్‌కు అధికారం కోసమే షర్మిల యాత్ర 

హైదరాబాద్, అక్టోబర్ 26 : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి సోదరి షర్మిల రాష్ట్రంలో రాజన్న రాజ్యం తీసుకువస్తామని చెబుతున్నారని, అసలు రాజన్న రాజ్యం అంటే ఏమిటో తెలుసా? అని టీడీపీ నేత గాలి ముద్దుకృష్ణమ నాయుడు ప్రశ్నించారు. రాజన్న రాజ్యం అంటే దోపిడీ రాజ్యం, గుండాల రాజ్యమని విమర్శించారు. రాజన్న రాజ్యం వస్తే రాష్ట్ర పరిస్థితి అధ్వాన్నంగా తయారవుతుందని ఆయన అన్నారు.

ఈ సందర్భంగా శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇప్పటికే కాంగ్రెసు పార్టీ రాష్ట్రాన్ని ఆగాథం చేసిందని ముద్దుకృష్ణమ నాయుడు ఆరోపించారు. తన సోదరుడు జగన్ కోసం పాదయాత్ర చేస్తున్న షర్మిలకు ప్రజా సమస్యలు తెలుసుకుందామని, కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాన్ని నిలదీద్దామనే ఆలోచన ఏమాత్రం లేదన్నారు. జగన్ గురించి చెబుతూ తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పైనే విమర్శలు గుప్పిస్తున్నారన్నారు. వైయస్ జలయజ్ఞం పేరుతో కోట్లు దండుకొని ఒక్క ఎకరాకు కూడా నీళ్లు ఇవ్వలేదన్నారు.

షర్మిల ప్రజా సమస్యలపై పోరాటం చేయడం లేదని గాలి ముద్దుకృష్ణమ నాయుడు అన్నారు. ఆమె అధికార పార్టీని వదిలి చంద్రబాబు నాయుడును విమర్శించడమేమిటని ప్రశ్నించారు. షర్మిల పాదయాత్రను ప్రజలు ఏమాత్రం పట్టించుకోవడం లేదన్నారు. అన్నకు అధికారం కోసమే ఆమె పాదయాత్ర చేస్తున్నారని కృష్ణమనాయుడు పేర్కొన్నారు.

చంచల్‌గూడ జైలులో ఉన్న జగన్ ములాఖత్ విషయంలో అధికారులు నిబంధనలను పాటించడం లేదని టీడీపీ నేత యనమల రామకృష్ణుడు ఆరోపించారు. జైల్లో జగన్ సెల్‌ఫోన్ వాడుతున్నారన్నారు. అందుకే ఆర్డీఐ కింద సమాచారం కావాలని కోరామని, జైలు అధికారులు సమాచారం ఇవ్వకపోతే కోర్టును ఆశ్ర యిస్తామని యనమల హెచ్చరించారు. జగన్ జైలుకెళ్లినప్పటి నుండి అతనిని ఎంతమందిని కలిశారో సమాచారం ఇవ్వాలన్నారు.

షర్మిల ప్రజా సమస్యలపై పోరాటం చేయడం లేదు,అన్నకు అధికారం కోసమే ఆమె పాదయాత్ర చేస్తున్నారు. 26.10.2012

సుదీర్ఘ పాదయాత్రలో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబునాయుడిని బావమరిది బాలకృష్ణ కలుసుకున్నారు. శుక్రవారం ఉదయం జిల్లాలోని అమరవాయిలో బాబును కలిసి ఆయన యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్నారు. చంద్రబాబు పేరుపై అక్కడి లక్ష్మీ వెంకటేశ్వరాలయంలో ప్రత్యేక పూజలు చేశారు.

అనంతరం మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు పరిపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారని, పాదయాత్రకు మంచి స్పందన వస్తుందన్నారు. బాబుకు సంఘీబావం తెలియచేసేందుకు వచ్చినట్లు ఆయన చెప్పారు. భవిష్యత్‌లో పాదయాత్ర విషయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని బాలయ్య తెలిపారు. 

25వ రోజు చంద్రబాబు పాదయాత్ర ప్రారంభం

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పాదయాత్ర 25వ రోజుకు చేరుకుంది. శుక్రవారం ఉదయం జిల్లాలోని అమరవాయి నుంచి చంద్రబాబు పాదయాత్రను ప్రారంభించారు. ఈ రోజు 12 కిలోమీటర్ల మేర బాబు పాదయాత్రగా వెళ్లనున్నారు.

చంద్రబాబు యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్న బాలకృష్ణ, 25వ రోజు చంద్రబాబు పాదయాత్ర ప్రారంభం

మహబూబ్‌నగర్ జిల్లాలో పాదయాత్ర నిర్వహిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబును శుక్రవారం ఆయన వియ్యంకుడు, సినీ నటుడు బాలకృష్ణ కలవనున్నారు. ఉదయం 8 గంటల ప్రాంతంలో ఆయన చంద్రబాబు బస చేసిన మల్దకల్ మండలం అమరవాయి గ్రామానికి చేరుకోనున్నట్లు సమాచారం. అయితే, పాదయాత్రలో ఆయన పాల్గొంటారా..? లేదా అన్నది నిర్థారణ కాలేదని పార్టీ వర్గాలు తెలిపాయి.

నేటి పాదయాత్ర ఇలా: చంద్రబాబు గురువారం రాత్రి వరకు 452 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశారు. శుక్రవారం బూడిదపాడు, పెద్దపల్లి ద్వారా గద్వాల చేరుకుంటారు. గద్వాలలోని రాజీవ్ చౌక్‌లో ఏర్పాటు చేయనున్న బహిరంగ సభలో ప్రసంగిస్తారు. రాత్రికి అక్కడే బస చేస్తారు.

నేడు బాబు వద్దకు బాలకృష్ణ

తాగునీటి కోసం ఎన్టీఆర్ సుజల
చంద్రబాబు ప్రకటన..
తిరుపతికి వెళ్లకుండానే గుండు
మధ్యతరగతి ఏం పాపం చేసింది?..
వాళ్లకెందుకు అదనపు సిలిండర్లు ఇవ్వరు?..
అధికారంలోకి వస్తే పది సిలిండర్లు ఇస్తాం..


టీడీపీ అధికారంలోకి వస్తే, రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో తాగునీటి సమస్య శాశ్వత పరిష్కారానికి 'ఎన్టీఆర్ సుజల' పేరిట ప్రత్యేక పథకాన్ని ప్రారంభించనున్నట్లు ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు ప్రకటించారు. ఈ పథకాన్ని మహబూబ్‌నగర్ జిల్లా నుంచే ప్రారంభిస్తామన్నారు. ఈ పథకంతో రాష్ట్రంలోని అన్ని పంచాయతీలు, మున్సిపాల్టీల్లో తాగునీటి సమస్య పరిష్కారం అవుతుందన్నారు.

"నిత్యావసర ధరల పెరుగుదలతో జనం ఇప్పటికే సమస్యల సుడిలో చిక్కుకున్నారు. కేవలం దీపం లబ్ధిదారులకే అదనంగా మూడు సిలిండర్లు ఇవ్వాలని నిర్ణయించడం దారుణం. ఆ నిర్ణయంతో 25 శాతం మందికే లబ్ధి చేకూరుతుంది. మిగిలిన మధ్యతరగతి ప్రజలు ఏం పాపం చేశారు? వారికి ఎందుకు అదనపు సిలిండర్లు ఇవ్వరు? వెయ్యి రూపాయలు పెట్టి సిలిండర్ కొనే స్థోమత మధ్యతరగతి ప్రజలకు ఉంటుందా? పార్టీ అధ్యక్షురాలు చెప్పినా.. సీఎం కిరణ్ పట్టించుకోవడం లేదు'' అంటూ చంద్రబాబు ధ్వజమెత్తారు. తాము అధికారంలోకి వస్తే, ఇప్పటి రేటుకే ఏడాదికి 10 సిలిండర్లు ఇచ్చి తీరతామని స్పష్టం చేశారు.

బుధ, గురువారాల్లో అలంపూర్ నియోజకవర్గంలోని అయిజ, గద్వాల నియోజకవర్గంలోని మల్దకల్ మండలాల్లో 'వస్తున్నా మీ కోసం' పాదయాత్ర కొనసాగింది. రెండురోజుల్లో 26.1 కిలోమీటర్ల మేర చంద్రబాబు పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా వివిధ సభల్లో ఆయన మాట్లాడారు. "ఇప్పటికే నిత్యావసరాలను విపరీతంగా పెంచేశారు. గ్యాస్ సిలిండర్ ధర పెంచేశారు. ఒకదాని తర్వాత మరొకటిగా పన్నులతో బాదేస్తున్నారు. గుండు కోసం తిరుపతి వెళ్లాల్సిన అవసరం లేదు'' అని ఎద్దేవాచేశారు. పేదల ఆరోగ్యాన్ని కాపాడే బాధ్యత ప్రభుత్వానిదేనని, టీడీపీ అధికారంలోకి వస్తే, అన్ని వ్యాధులు కవరయ్యేలా కొత్త ఆరోగ్య శ్రీ పథకాన్ని చేపడతామని ప్రకటించారు.

ఇప్పుడు మీ వద్దకు వస్తున్నామని అంటున్న నాయకులు వైఎస్ ఉన్నప్పుడు ఎక్కడికెళ్లారంటూ జగన్‌ను ఉద్దేశించి విమర్శించారు. "ఇప్పటిదాకా మీరు పల్లకీలు మోశారు. ఇక పల్లకీ ఎక్కడం నేర్చుకోండి. మీలో ఐకమత్యం రావాలి. నాయకత్వ లక్షణాలు పెంచుకోవాలి'' అని చంద్రబాబు, సగర, బోయ కులస్తులకు పిలుపునిచ్చారు. తమను ఎస్టీల్లో చేర్చాలని వారు కోరగా తప్పకుండా న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. అయిజ - బింగిదొడ్డి మధ్య బాబును చూసేందుకు జయమ్మ అనే యువతి చేనులోంచి పరుగెత్తుకు రాగా, ఆమెవెంట ఆమె పెంచుకుంటున్న పొట్టేలు కూడా పరుగెత్తుతూ వచ్చింది.

ఇది చూసిన బాబు.. తన యజమానురాలు వెళ్తుంటే ఆమె వెన్నంటే వెళ్లిన పొట్టేలుకు ఉన్న విశ్వాసం కూడా కొంతమంది నాయకులకు లేకుండా పోయిందని, ఆయారాం.. గయారాంలు ఎక్కువయ్యారని పార్టీ నుంచి బయటకు వెళ్లినవారిని ఉద్దేశించి మండిపడ్డారు. ఇప్పుడు కనీసం ఇళ్లు అయినా కనిపిస్తున్నాయని, వైసీపీ అధికారంలోకి వస్తే ఇళ్ల పైకప్పులు కూడా ఉండబోవని అన్నారు. బింగిదొడ్డి వద్ద గురువారం మధ్యాహ్నం చంద్రబాబు ప్రసంగిస్తుండగా ఆర్టీసీ బస్సు అక్కడ నిలిచి ఉంది. దీంతో, "ఆర్టీసీ డ్రైవర్ గారూ.. నమస్కారం! అందరికీ చెప్పండి త్వరలోనే మంచి రోజులు వస్తాయని. ఆర్టీసీని మనమందరం కాపాడుకుందాం. ఉద్యోగులకు ప్రత్యేక విధానం కల్పిస్తాం. డ్రైవర్లు, కండక్టర్లకు న్యాయం చేస్తాం'' అని చెప్పారు.

అదే బస్సులోని ప్రయాణికులనుద్దేశించి చంద్రబాబు మాట్లాడుతూ తల్లీ నమస్కారం! తమ్ముళ్లు బాగుతున్నారా! అంటూ పలకరించారు. పాదయాత్రలో భాగంగా జిన్నింగ్ మిల్లులో పని చేస్తున్న బాలికలతో ఆయన మాట్లాడారు. తనకు చదువుకోవాలని ఉందని, కానీ, ఆర్థిక ఇబ్బందులు సహకరించడం లేదని, తమకు తండ్రి లేడని, ముగ్గురమూ ఆడపిల్లలమేనని ఝాన్సీ అనే బాలిక చంద్రబాబుకు వివరించింది. చదివించేవారు లేక ఉన్నత చదువులు చదవలేకపోతున్నానని ఏడో తరగతి చదువుతున్న మహేశ్వరి ఆవేదన వ్యక్తం చేసింది. దీంతో, ఆ ఇద్దరినీ తాను చదివిస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు.

"ఇప్పటిదాకా మీరు పల్లకీలు మోశారు. ఇక పల్లకీ ఎక్కడం నేర్చుకోండి. మీలో ఐకమత్యం రావాలి. నాయకత్వ లక్షణాలు పెంచుకోవాలి''