October 20, 2012పూరీ ‘ జగన్ ‘….. ‘ జగన్ ‘ మనిషా …???

ఇంతకాలానికి గురువుని మించిన శిష్యుడు…. అనిపించుకున్నాడు పూరీ జగన్నాధ్. ఇప్పటివరకు కధలనో, హీరో ఇమేజ్ నో, పంచ్ డైలాగులనో నమ్ముకుని సినిమాలు తీసిన పూరి తొలిసారి వివాదాల కోసం, ఓ పార్టీని, ఓ రాజకీయ నేతనీ కొమ్ముకాయడానికి ఓ సినిమా తీసాడేమో అనే అనుమానం వేస్తోంది. వివాదాన్నే ఆయుధంగా చేసుకుని సినిమాని చుట్టేయడం రామ్ గోపాల్ వర్మ స్టైల్. ‘కెమెరా మెన్ గంగతో రాంబాబు’ కోసం వర్మ శిష్యుడు జగన్ కుడా ఆ దారినే ఎంచుకున్నాడు. రాజకీయాలపైన, సినిమాలపైన కనీస అవగాహన ఉన్న ఎవరికైనా… ‘….రాంబాబు’ సినిమా చూస్తే మూడు విషయాలు అర్ధమైపోతాయి.
1. వై యస్ రాజ శేఖర రెడ్డి ని హీరోగా చూపిద్దాం అనేది పూరి ప్రధాన ఉద్దేశ్యం. సీ యం పాత్ర నాజర్ పోషించారు. ఆ పాత్రకు ఆయన పెట్టిన పేరు… ‘చంద్ర శేఖర రెడ్డి’. ఆపాత్ర వై యస్ ఆర్ ని పోలి ఉంటుంది.
2. ఈ సినిమాలో ప్రతినాయకుడు ప్రకాష్ రాజ్. ఈయన పేరేమో…. ‘రానా బాబు’. తిరగేస్తే… ‘నారా బాబు’. అది చంద్రబాబు కి పేరడి అని వేరే చెప్పాలా.? “రాజకీయాలంటే ఎన్ని ఒత్తిడిలో నేకేం తెలుసు… అది భరించలేక ‘బొల్లి’ కుడా వచ్చేస్తుంది” అని రానా బాబు చేత చెప్పించారు. ఆరోగ్య సమస్యలను అపహాస్యం చేస్తూ.. అదే సృజనాత్మకత అని మురిసిపోవడం పూరి లాంటి దర్శకుడికి ఎంతవరకు సమంజసం?
3. సున్నితమైన తెలంగాణా సమస్యపై… పూరి తన వైఖరిని ప్రకటించడానికి ఈ సినిమాని ఓ వేదికగా చేసుకున్నాడు. పవన్ కళ్యాన్ భావాల పేరిట.. తన అభిప్రాయాన్ని బలవంతంగా ప్రేక్షకులపై రుద్దే ప్రయత్నం చేసాడు.పూరి జగన్నాధ్ వై యస్ అభిమాని అనే విషయం సుస్పష్టం. ఈ విషయాన్ని పూరీ నే చాలా సార్లు బహిరంగంగా చెప్పారు. రాజశేఖర్ రెడ్డి జీవితకథను సినిమాగా తీసే ప్రయత్నం కుడా చేసారు. అంతెందుకు… పూరి తమ్ముడు గణేష్ … వై యస్ ఆర్ పార్టీ తీర్ధం పుచ్చుకున్న వ్యక్తే. ఉపఎన్నికల సందర్భంలో పూరి స్వగ్రామం ‘నర్సీపట్నం’ని విజయమ్మ, షర్మిల సందర్శించారు అప్పుడు వాళ్ళిద్దరి బస… పూరి ఇంట్లోనే. ‘మీ రాకతో నా జీవితం పునీతం అయ్యింది’ అని పూరి ఓ స్టేట్మెంట్ కుడా ఇచ్చాడు. పూరి కుమార్తెకు ‘పరికిణి’ వేసినప్పుడు… ఆ శుభ కార్యానికి జగన్ అతిథిగా వెళ్ళడం అందరికి గుర్తే. అప్పటి నుంచి పూరి…. జగన్ కి ఫ్యాన్ అయిపోయాడు. ఆ అభిమానం … ‘….రాంబాబు’ సినిమాతో చూపించేసాడు.


సినిమా అనేది ఓ వినోద సాధనం మాత్రమే అని తరచూ చెప్పే పూరి.. మొదటిసారి తన సరిహద్దుని విస్మరించాడు. సినిమాని సినిమాగా తీయకుండా, సినిమాని సినిమాగా చూడకుండా… తన స్వలాభం కోసం, స్వంత ప్రయోజనాల కోసం, తన మనుషుల మెప్పుకోసం …. వాడుకున్నాడు. సున్నితమైన విషయాలలో తన వైఖరిని ఘాటుగా ప్రకటించి.. ఎంతో మంది మనోభావాలను దెబ్బతీసాడని సినీ పెద్దలు సైతం అభిప్రాయపడుతున్నారు. నిర్మాతల సొమ్ముతో చెలగాటం ఆడేసాడు. పవన్ సినిమాలకు బ్రహ్మరధం పట్టే నైజాం అబిమానులు పోస్టర్లు పీకి, ప్రింట్లు తగలెట్టేస్తున్నారంటే దానికి కారణం ఎవరు? పవన్ వ్యక్తిగత ఇమేజ్ కి భంగం కలిగించడంలో పూరి ఉద్దేశ్యం ఏమిటి? ‘రాజకీయాలపై నాకు అవగాహన లేదు’ అని చెప్పుకునే పూరి…. ఆ నేపద్యంలో సినిమా తీసే దుస్సాహసానికి ఎందుకు ఒడిగట్టాడు? అనేవి సమాధానం లేని ప్రశ్నలు. ఈ సినిమాలో పూరీ తెలంగాణా ఉద్యమాన్ని అవహేళన చేసే విధంగా కొన్ని సన్నివేశాలను చిత్రికరించాడని ఆందోళనలు కూడా జరుగుతున్నాయి. అంటే పరోక్షంగా వై.ఎస్ జగన్ తెలంగాణాకు వ్యతిరేకి అని పూరీ చెప్పదలచుకున్నాడా ?
‘నా పారితోషికం ఎగ్గోట్టాడు’ అని నిర్మాతలపై.. ఫిర్యాదు చేసిన పూరి… ఇప్పుడు వాళ్లకు జరిగిన నష్టానికి ఎంతవరకు బాద్యత వహిస్తాడు? ‘….రాంబాబు’ సినిమాలో 12 సన్నివేశాలను తొలగిస్తాం అని చెప్పారు. 60 లో 12 కత్తిరిస్తే ఇక మిగిలేది ఏమిటి? అతుకుల బొంత ప్రేక్షకులకు అర్ధమవుతుందా? జగన్ పై అభిమానం ఉంటే … మిగతా పార్టీలపై గుర్రు ఉంటే … మరోలా తన స్పందనలను తెలియచేయవలసింది. లేదంటే సొంత డబ్బుతో ఓ సినిమా తీసుకుంటే ఏ గొడవా ఉండక పోదును. పక్కవాడి డబ్బుతో జూదం ఆడి, దానికి పవన్ ఇమేజ్ పణంగా పెట్టడం ఎంతవరకు భావ్యమో తనకు తానే ప్రశ్నించుకోవాలి.

పూరీ ‘ జగన్ ‘….. ‘ జగన్ ‘ మనిషా …???

chandrababu naidu vastunna meekosam padayatra at kurnool dist

ముఖ్యమంత్రి అవుతా.. మీ కష్టాలు తీరుస్తా
రాష్ట్రమే నా కుటుంబం.. ప్రజలే కుటుంబ సభ్యులు
వారి కష్టాలు చూసి కన్నీళ్లొస్తున్నాయి..
రుణ మాఫీ ఎలాగో చేసి చూపిస్తా
నల్ల ధనాన్ని కాపాడుకునేందుకే నల్ల బ్యాడ్జీ యాత్రలు
తప్పులేమీ లేకుండానే జైల్లో పెడతారా!?..


"నేను దాదాపు అన్ని పదవులూ చేశాను. వాటిపై అనురక్తి లేదు. రాష్ట్రమే నా కుటుంబం. కష్టాల్లో ఉన్న ప్రజలే మా కుటుంబ సభ్యులు. వారి కష్టాలు చూసి కన్నీళ్లు వస్తున్నాయి. రాష్ట్రంలో మహిళలు, రైతులు, విద్యార్థులు, బడుగు వర్గాలు తీవ్ర కష్టాల్లో ఉన్నారు. నేను మళ్లీ ముఖ్యమంత్రినై వారందరి కష్టాలు తీరుస్తాను'' అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు భరోసా ఇచ్చారు.

రైతులను ఆదుకునేందుకు రుణాల మాఫీ ఒకటే సరిపోదని, 9 గంటలపాటు ఉచిత కరెంట్, పంటలకు గిట్టుబాటు ధర, నాణ్యమైన విత్తనాలు, అందుబాటులో ఎరువులు తదితర కార్యక్రమాలు చేపట్టి వ్యవసాయ రంగానికి ఊపిరి పోస్తానని హామీ ఇచ్చారు.

కాంగ్రెస్ పార్టీ కమీషన్ల పార్టీగా మారిపోయిందని ధ్వజమెత్తారు. చంద్రబాబు 19వ రోజు పాదయాత్ర శనివారం కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గం సి.బెళగల్ మండలంలోని కంపాడు నుంచి ప్రారంభమైంది. ఈ సందర్భంగా కంపాడులో చంద్రబాబు కొర్ర పంటను కోశారు. ఉల్లి పంటను తీశారు. సజ్జలను సంచీల్లోకి పోశారు. డ్రమ్స్ వాయించారు. వికలాంగులతో ముచ్చటించారు.


నల్ల ధనాన్ని కాపాడుకునేందుకే కొందరు నల్ల బ్యాడ్జీలతో యాత్రలు ప్రారంభించారని, తన పాదయాత్రకు లభిస్తున్న ఆదరణను చూసి ఓర్వలేకనే పోటీ యాత్ర చేపట్టారంటూ పరోక్షంగా కడప ఎంపీ వైఎస్ జగన్ చెల్లెలు షర్మిలను ఆయన విమర్శించారు. ఏ తప్పులూ చేయకుండానే జైల్లో పెడతారా..? అని ప్రశ్నించారు. వైఎస్ ఐదేళ్ల 3 నెలల పాలనలో రాష్ట్రం కుప్పకూలిందని ధ్వజమెత్తారు.

తన హయాంలో 1.6 లక్షల టీచర్ పోస్టులను భర్తీ చేశామని చెప్పారు. ఐటీ రంగంలో రాష్ట్ర యువత ప్రపంచవ్యాప్తంగా పని చేస్తున్నారని, ఆ ఘనత తనదేనని చంద్రబాబు చెప్పారు. తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌కు ఉద్యోగాలపై శ్రద్ధ లేదని, గంజి తాగి పిల్లలను చదివించుకున్న నిరుపేదలు వారికిఉద్యోగాలు రాక అప్పుల్లో కూరుకుపోతున్నారన్నారు.

నా జీవితంలో ఈనెల 18 మరువలేనిది
తన జీవితంలో సెప్టెంబర్ 18వ తేదీ మరువలేనిదని, ఎమ్మిగనూరు ప్రాంతంలో ఆత్మహత్య చేసుకున్న 13 మంది చేనేత కార్మికుల ఆత్మ శాంతికి ఉపవాసం పాటించిన రోజని చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. కాగా, కాళ్లనొప్పితో పాదయాత్ర చేస్తున్న చంద్రబాబును పరామర్శించేందుకు ఎన్టీఆర్ కుమారుడు రామకృష్ట, చిన్న అల్లుడు శ్రీనివాసరావు, చంద్రబాబు కుమారుడు లోకేష్ వచ్చారు. చంద్రబాబు వెంట లోకేష్, శ్రీనివాసరావు నడక సాగించారు.

రాష్ట్రమే నా కుటుంబం.. ప్రజలే కుటుంబ సభ్యులు 19వ రోజు పాదయాత్రలో చంద్రబాబు నాయుడుchandrababunaidu padayatra vastunnameekosam photos at kurnool dist 20.10.2012

19వ రోజు "వస్తున్నా మీకోసం" పాదయాత్ర పోటోలు,కర్నూల్ జిల్లా(20.10.2012)

20th day chandrababunaidu padayatra vastunna meekosam route map_21.10.2012

ప్రెస్ నోట్ (20వ రోజు అదివారం పాదయాత్ర రూట్)20.10.2012

షర్మిలా.. కారుకూతలు, వ్యక్తిగత విమర్శలు వద్దు: కవిత

పాదయాత్ర ఎందుకు చేస్తున్నారో స్పష్టం చేయాలని షర్మిలను తెలుగుదేశం పార్టీ మహిళా నాయకురాలు కవిత డిమాండ్ చేశారు. తమ పార్టీ అధినేత చంద్రబాబు అనుభవమంత వయస్సు కూడా లేని షర్మిలకు ఆయనపై వ్యక్తిగత విమర్శలు చేసే స్థాయి కానీ, అర్హత కానీ లేవన్నారు. శుక్రవారం విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. షర్మిల కుటుంబం రాజకీయాలను దుర్వినియోగం చేసిందని.. తాత రాజారెడ్డి, తండ్రి వైఎస్, అన్న జగన్ చరిత్రలను షర్మిల గుర్తు చేసుకోవాలని కవిత హితవు పలికారు.

'పీవీ నర్సింహారావుపై చెప్పులు విసరడమే కాదు... మరెందరికో వెన్నుపోట్లు పొడిచిమీ తండ్రి వైఎస్ సీఎం అయ్యారు. మీ కుటుంబ చరిత్రను తవ్వి తీయడానికి ఒక్క క్షణం పట్టదు' అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్రాహ్మణ కుటుంబీకుడైన అనిల్‌కుమార్ తండ్రి రామారావు కుటుంబాన్ని వెన్నుపోటు పొడిచిన చరిత్ర షర్మిలది అని కవిత ఆరోపించారు. షర్మిల వ్యక్తిగత విమర్శలు మానుకుంటే మంచిదని.. లేకుంటే ఆమె జీవితచరిత్ర మొత్తాన్ని బయటపెట్టాల్సి వస్తుందని హెచ్చరించారు.

అనిల్‌కుమార్ తండ్రి రామారావు కుటుంబాన్ని వెన్నుపోటు పొడిచిన చరిత్ర షర్మిలది -కవిత


Sri N.Chandrababu Naidu Padayatra at C.Belagal on 20-10-12
Special Discussion about Chandrababu Naidu Padayatra - TDP _ Hmtv
Day 7 of Chandrababu's Padayatra to begin in kurnool

Chandrababu Padayatra reaches 19th day 

 

చంద్రబాబు పాదయాత్ర టి.వీ కవరేజ్ 19వ రోజు

  • - ఈనెల 22న జిల్లాకు చంద్రబాబు పాదయాత్ర
  • - మొదటి సభ రాజోళిలో
  • - ఏర్పాట్లను పరిశీలించిన రాష్ట్ర నాయకులు

టీడీపీ నాయకులు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ‘వస్తున్నా మీకోసం’ పేర నిర్వహిస్తున్న పాదయాత్ర ఏర్పాట్లను ఆ పార్టీ రాష్ట్ర నాయకులు శుక్రవారం పరిశీలించారు. ఎమ్మెల్యేలు రావుల చంద్రశేఖర్ రెడ్డి, అచ్చంపేట ఎమ్మెల్యే రాములు, ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎర్రశేఖర్, మాజీమంత్రులు పెద్దిరెడ్డి, కడియం శ్రీహరి, సీనియర్ నాయకురాలు వావిలాల సునీత రాజోలి గ్రామాన్ని పరిశీలించారు. సుంకేసుల బ్యారేజీ మీదుగా పాదయాత్ర ఉండటంచేత బ్యారేజీపై, రాజోలిలో సభ కోసం ఎంపిక చేసిన స్థలాన్ని కూడా పరిశీలించారు. అనంతరం గ్రామంలో పాదయాత్ర ఏఏ వీధులగుండా వెళ్ళాలి అనే విషయాలపై చర్చించారు. ఈ నెల 22న ఉదయం చంద్రబాబు రాజోలి గ్రామంలోకి ప్రవేశిస్తారన్నారు. గతంలో అనుకున్న విధంగా 21 రాత్రి రాజోలిలో బసచేసే కార్యక్రమం రద్దయిందని వారు తెలిపారు. తెలంగాణవాదానికి టీడీపీ వ్యతిరేకంకాదని స్పష్టం చేశారు. కార్యక్రమంలో టీడీపీ మండలాధ్యక్షులు చంద్రశేఖర్ గౌడు, బీసీసెల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎస్. గజేంద్రగౌడు, బీసీ సెల్ మండల అధ్యక్షులు జి రాజోలి కిష్టన్న, వెంకటస్వామి, విజయ్, ఉసేన్ పాల్గొన్నారు.

మహబూబ్ నగర్ జిల్లా రాజోలిలో ‘వస్తున్నా మీకోసం’ ఏర్పాట్ల పరిశీలన

దోచుకున్నవారంతా జైలుకు వెళుతున్నారు
ప్రజలకు తాగునీరు ఇవ్వలేని పరిస్థితిలో ప్రభుత్వం
సిబ్బందిలేక గ్రామాల్లో అంటువ్యాధులు, విషజ్వరాలు
టీడీపీ హయాంలో ఎక్కువ ఉద్యోగాలు

  దివంగత వైఎస్ హయంలో దోచుకున్న నేతలు, అధికారులు జైలుకు వెళుతున్నారని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. ప్రభుత్వం పెద్దల తప్పుడు నిర్ణయాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అవినీతి పరులవల్ల మోయలేని ఆర్థిక భారం ప్రజలపై పడుతోందని, ప్రభుత్వం కనీసం ప్రజలకు తాగునీరు కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉందని బాబు విమర్శించారు.

కర్నూలు జిల్లా కంపాడులో శనివారం 19వ రోజు పాదయాత్రను ప్రారంభించిన ఆయన మాట్లాడుతూ పంచాయతీ సిబ్బందిలేక గ్రామాల్లో అంటువ్యాధులు, విషజ్వరాలు ప్రభలుతున్నాయని అన్నారు. నిత్యావసర ధరలు విపరీతంగా పెరిగిపోయాయని, మరోవైపు పంటలు పండించిన రైతులకు గిట్టుబాటు ధర లభించడం లేదని అన్నారు. టీడీపీ హయాంలోనే ఎక్కువ ఉద్యోగాలు కల్పించినట్లు చంద్రబాబు తెలిపారు.

జిల్లాలో చంద్రబాబునాయుడు శనివారం ఉదయం కంపాడు నుంచి పాదయాత్రను ప్రారంభించారు. ఆయన వెంట కుమారుడు లోకేష్ నాయుడు, బావమరిది రామకృష్ణ ఉన్నారు. ఈరోజు 16.1 కిలోమీటర్ల మేర చంద్రబాబు పాదయాత్ర సాగనుంది.

కాగా చంద్రబాబు నాయుడు తనయుడు లోకేష్ శుక్రవారం సాయంత్రం చంద్రబాబు బసచేసే గ్రామమైన కర్నూలు జిల్లా బెళగల్ మండలం కంపాడు గ్రామానికి చేరుకున్నారు. చంద్రబాబు చేస్తున్న పాదయాత్రలో రెండు రోజుల పాటు పాల్గొనేందుకు ఆయన వచ్చారు. పాదయాత్ర ముగించుకొని బస చేసిన ప్రాంతానికి చేరుకున్న చంద్రబాబును లోకేష్ కలుసుకుని యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.

నేటి పాదయాత్ర షెడ్యూల్డ్

చంద్రబాబు నాయుడు మీ కోసం పాదయాత్ర 19వ రోజు శనివారం కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గంలో సాగనుంది. కంపాడు గ్రామం నుంచి శనివారం ఉదయం 9.00గంటలకు పాదయాత్ర ప్రారంభమయింది. మధ్యాహ్నం సి.బెళగల్ గ్రామానికి చేరుకున్నారు. మార్గమధ్యంలో రైతులతోను, రైతు కూలీలతోను సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు.

అలాగే బెళగల్ సమీపంలో ఉన్న చెరువును పరిశీలిస్తారు. మధ్యాహ్న భోజనం అక్కడే చేస్తారు. తిరిగి 2గంటలకు బెళగల్ గ్రామం నుంచి యాత్ర ప్రారంభమై పోలకల్ గ్రామానికి 3 గంటలకు చేరుకుంటారు. మార్గమధ్యంలో జీఆర్పీ రిజర్వాయర్‌ను పరిశీలిస్తారు. అలాగే రైతులతో మాట్లాడతారు. అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సాయంత్రం 4గంటలకు ప్రసంగిస్తారు. అక్కడి నుంచి 5 గంటలకు యాత్ర ప్రారంభమై రాత్రికి జూలకల్ గ్రామానికి చేరుకొని అక్కడే బసచేస్తారు. 

chandrababunaidu padayatra vastunnameekosam at kurnool dist 20.10.2012

కర్నూలు జిల్లా కంపాడులో శనివారం 19వ రోజు పాదయాత్రను ప్రారంభించిన చంద్రబాబునాయుడు 20.10.2012

జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పాదయాత్ర 19 వ రోజుకు చేరుకుంది. శనివారం ఉదయం కంపాడు నుంచి పాదయాత్రను ప్రారంభించారు. ఆయన వెంట కుమారుడు లోకేష్ బావమరిది రామకృష్ణ ఉన్నారు. ఈరోజు 16.1 కిలోమీటర్ల మేర చంద్రబాబు పాదయాత్ర సాగనుంది.

19వ రోజు చంద్రబాబు పాదయాత్ర ప్రారంభం 20.10.2012

పెద్దదిగా చూడటానికి పోటో మీద క్లిక్ చెయ్యండి.
WordPress plugin

18వ రోజు "వస్తున్నా మీకోసం" పాదయాత్ర పోటోలు (part-2 )