October 18, 2012

చంద్రబాబు పాదయాత్ర .. నేటి షెడ్యూల్ ఇదీ

ఎమ్మిగనూరు, అక్టోబర్ 18 :చంద్రబాబు పాదయాత్ర శుక్రవారం కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణ శివార్లలోని కలుగొట్ల రోడ్డులోని సమీరా రైస్‌మిల్లు నుంచి ప్రారంభమవుతుంది. కలుగొట్లలో వికలాంగుల సమస్యలను వింటారు. కె.తిమ్మాపురం గ్రామచావిడి దగ్గర రచ్చబండ నిర్వహించి సమస్యలు తెలుసుకుంటారు. జడ్పీ హైస్కూలులో భోజనం చేస్తారు. అనంతరం పాదయాత్ర దైవందిన్నె వరకు కొనసాగుతుంది. అనంతరం కంపాడు గ్రామానికి చేరుకొని రాత్రి అక్కడే బస చేస్తారు.

18వ రోజు padayatra shedule 19.10.2012

. బాల వాక్కు బ్రహ్మ వాక్కంటారు. అదెంత నిజమో తెలియదు. కానీ నన్ను చుట్టుకొని తిరుగుతూ, తమ బుడిబుడి అడుగులతో నన్ను అందుకునేందుకు వాళ్లు పడుతున్న తిప్పలు ముద్దొస్తున్నాయి. నడకలో ఆటవిడుపుగానేకాక, ఇన్ని సమస్యలు వింటున్నా, దారిలో కనిపించిన దారుణ సంగతులు కలచివేస్తున్నా ఉత్సాహంగా నన్ను ముందుకు నడిపిస్తున్నది పసితనం వదలని చిన్నారుల మాటలే. ఏమి చేస్తే ఆ లేత కళ్లల్లోని అమాయకత్వాన్ని కాపాడుకోగలను?

అప్పుడు మాటల పుట్టలు.. ఇప్పుడు సమస్యల పుట్టలు.. ఎమ్మిగనూరు దారిలో ఆ మహిళతో మాట్లాడేప్పుడు ఇలాగే అనిపించింది. "సీతాఫలాలు అమ్ముతాను సార్. ఈ దారిన పోయే మీ లాంటోళ్లు కొంటే ఆ రోజుకు తిండి. లేదంటే లేదు. ఊళ్లలో అమ్ముకోడానికి ఎవరు ఉన్నారు సార్. అంతా వలస పోతిరి. నాలాగే వాళ్లూ రోడ్డున పడితిరి. అందరం రోడ్డుపైనే ఉన్నాం సార్. మీరైనా కొంటే ఆ డబ్బుతో ఇంటికెళ్లి వండుకుంటా సార్'' అంటూ జయలక్ష్మి బాధల మూట విప్పింది.

"ఇంట్లో గ్యాస్ పొయ్యి ఉందా అమ్మా'' అని నేను అడిగినప్పుడు ఎగదన్నిన ఆవేశం వల్లనో ఏమో దడదడగా మాట్లాడింది. "ఏమి చెప్పాలి సార్ మా బాధలు. అప్పుడెప్పుడో నువ్వు ఇచ్చిన గ్యాస్ బండ. తరువాత వచ్చినోళ్లు ఏమీ ఇయ్యకపోయినా దొంగ కార్డులంటూ ఉన్న తెల్లకార్డునూ లాగేసుకున్నారు. పళ్లు అమ్ముకునేవాళ్లం.. ఆ పాపపు పని చేస్తామా? అయినా వినలేదు. గ్యాస్ పొయ్యిపైన ఎసరుకు బియ్యం లేకుండా చేశారు. ఇప్పుడేమో గ్యాస్‌బండ పిరెం చేసి పొయ్యి కింద మంటని కూడా ఆర్పేశారు సార్'' అని కన్నీళ్లు పెట్టుకొంది.

జయలక్ష్మి లాంటి చిన్నిచిన్న బేరగాళ్లకు చన్నీళ్లకు వేన్నీళ్లలా ఉంటాయనుకున్న పొదుపు సంఘాలు కడకు కడగండ్లనే మిగిల్చాయని, రెండు రూపాయలు వడ్డీలు కట్టలేక, అప్పూ తీరక వారందరివీ కప్పులేని బతుకులయిపోయాయని ఆమె మాటల్లో తెలుసుకొన్నప్పుడు బాధనిపించింది. సీమలోనే కాదు.. తమ బతుకుల్లోనూ అన్నీ కరువేనని చివరకు మరుగుదొడ్డి వసతి కూడా లేదని చెబుతుంటే ఆడమనిషైనా కూడా బయటకు ఇలా చెప్పడం మహిళల దైన్యాన్ని కళ్లకు కట్టింది. డబ్బులిచ్చి బుట్టలోంచి కొన్ని పండ్లు తీసుకొని అక్కడి నుంచి కదిలాను.

ఏమిటీ మహిళల దైన్యం? chandrababu naidu padayatra 17th day


పెరుగుతున్న కాలునొప్పి

పాదయాత్ర 17వ రోజుకు చేరింది. చంద్రబాబుకు కాళ్ల నొప్పులు కూడా రోజురోజుకు పెరుగుతున్నాయి. రెండు రోజులుగా నడిచేటప్పుడు ఆయన కుడి కాలు నొప్పితో బాధ పడుతున్నారు. గురువారం నొప్పి ఇంకా పెరుగుతున్నట్లు అనిపించడంతో తారు రోడ్డుపై కాకుండా రోడ్డు అంచున ఉన్న మట్టిపై నడవడం మొదలుపెట్టారు. నిర్ణీత వేళలకు మించి పాదయాత్ర జరుగుతుండడం, విశ్రాంతి తక్కువ కావడం కూడా బాబుకు ఇబ్బందికరంగా మారింది. బుధవారం రాత్రి ఆయన నిద్రించేసరికి 12 దాటింది.

గురువారం ఉదయం 10 గంటలకల్లా బయటకు వచ్చి రోజువారీ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ఈలోపే తాను రోజూ క్రమం తప్పకుండా చేసే యోగా, ట్రెడ్‌మిల్, కాళ్లకు సంబంధించిన వ్యాయామాలు, కాలకృత్యాలు పూర్తి చేసుకున్నారు. ఇవన్నీ ఉదయమే జరగాల్సి రావడంతో ఆయన నిద్రపోయే సమయం తగ్గిపోతోందని, దీనివల్ల కూడా అలసట పెరుగుతోందని పార్టీ నాయకులు చెబుతున్నారు. ప్రస్తుతం ఆయన పాదయాత్ర రోజూ సరాసరిన 20 కిలోమీటర్ల వరకూ ఉంటోంది. దానిని కనీసం 15 కిలోమీటర్లకు తగ్గించాలంటూ పార్టీ నాయకులు ఒత్తిడి తెస్తున్నా చంద్రబాబు అంగీకరించలేదు.

అధైర్యపడొద్దు
వివిధ వర్గాలతో ముఖాముఖిలో చంద్రబాబు

పాదయాత్రలో చంద్రబాబు రైతులు, మహిళలు, గొర్రెల కాపరులతో మాట కలిపారు. వారి కష్టసుఖాలను తెలుసుకొని ఓదార్చారు.

బాబు: ఏవయ్యా.. ఎలా ఉన్నావు? ఏ పంటను సాగుచేశావు?
నరసన్న (రైతు): వేరుశనగ పంట ఎండిపోయింది. ఆరెకరాల్లో సాగు చేశాను. వానలు లేక పూర్తిగా ఎండిపోయింది. పెట్టుబడి కూడా రాదు.
బాబు: అధైర్యపడొద్దు. మేము అధికారంలోకి వస్తే మీ రుణాలు మాఫీ చే యిస్తా.

బాబు: మీకు ఎలాంటి సాగునీటి ఆధారం లేదా? చెక్‌డ్యాంలు నిర్మించాం కదా?
దొడ్డయ్య: వర్షాధారంతోనే బతుకుతున్నాం. ఒకప్పుడు కనుమదొడ్డయ్య చెరువు ఉండేది. ఇప్పుడది పూడిపోయింది. చెరువు నిర్మించండి.

అక్కమ్మ: సార్! వచ్చే రూ.200 పింఛన్‌తో బతకడం కష్టంగా ఉంది.
బాబు: మా ప్రభుత్వం వస్తే రూ.600 పింఛన్ ఇప్పిస్తా. ఖర్చులకు 5 వేలు ఉంచుకో.

విజయ్‌గౌడ్: సార్.. మీరు ప్రధాన మంత్రి అయితే మా సమస్యలన్నీ తీరతాయి.
బాబు: మీ అభిమానానికి ధన్యవాదాలు. 

ఈత చెట్టెక్కిన బాబు

పాదయాత్రలో భాగంగా ఎమ్మిగనూరు సమీపంలోని కొటేకల్లు వద్ద చంద్రబాబు గీత కార్మికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రోడ్డు పక్కన ఉన్న ఈదు (ఈతవనం)లో కల్లుకుండ పట్టుకుని కొంతవరకు ఈత చెట్టు ఎక్కారు. టీడీపీ హయాంలో గీత కార్మికుల సంక్షేమం కోసం ఐదెకరాల స్థలాన్ని కేటాయించారని, ఈ ఏడేళ్లలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యలు తీరాలంటే బాబు ప్రధాని కావాలని కోరుకున్నారు.

మీరు సీఎం అవుతారు సార్!
బాబుపై మూడో తరగతి బుల్లోడి అభిమానం

  ఆ చిన్నారి పేరు ఈడిగ గోపాల్. చదివేది మూడో తరగతి. చంద్రబాబు అంటే ఎనలేని అభిమానం. బాబు ఎమ్మిగనూరు వస్తున్నారని తెలుసుకున్నాడు. పుస్తకం కొనుక్కోవాలంటూ తండ్రి దగ్గర మూడు రూపాయలు తీసుకున్నాడు. ఆటో ఎక్కి వచ్చేశాడు. ఎమ్మిగనూరు సరిహద్దు కోటేకల్ వద్ద బాబును చూడగానే పరుగున వెళ్లి నమస్తే సార్ అంటూ కరచాలనం చేశాడు. 'సార్ మీరు మరోసారి సీఎం అవుతారు' అంటూ తన అభిమానాన్ని చాటాడు. దాంతో, 'నీకు ఓటు హక్కు ఉండి ఉంటే నన్ను ఇప్పుడే సీఎంను చేసేలా ఉన్నావు' అని బాబు చమత్కరించారు. 

chandrababunaidu vastunna meekosam padayatra 18.10.2012 hilights
17వ రోజు "వస్తున్నా మీకోసం" పాదయాత్ర విశేషాలు.18.10.2012

ముందుంది మంచి కాలం
మన ప్రభుత్వం వస్తుంది
కొద్ది కాలం ఓపిక పట్టండి
ఏడాదికి పది సిలిండర్లు
గొర్రెల కాపరులకు పదెకరాలు
పంట నష్టపరిహారంగా ఎకరాకు పది వేలు
9 గంటల నిరంతర విద్యుత్తు..
సాగునీటికి సమగ్ర ప్రణాళిక
పగలు విమర్శలు.. రాత్రి రాయబారాలు
ఎప్పుడైనా కాంగ్రెస్, వైసీపీ ఒక్కటే

  "ఇంకా కొద్ది కాలమే. ఓపిక పట్టండి. అధైర్యపడొద్దు. మన ప్రభుత్వం వస్తుంది. మంచి కాలం వస్తుంది'' అని కర్నూలు జిల్లా పాదయాత్రలో తమ కష్టాలను చెప్పుకొన్న ప్రజలకు చంద్రబాబు ధైర్యం నూరిపోశారు. ఎమ్మిగనూ రు మండలం ఆరేకల్లు నుంచి 17వ రోజు గురువారం పాదయాత్రను ప్రారంభించిన బాబు అడుగడుగునా బడుగులను పలకరించారు. ఆరేకల్లులోని పొలాల్లో ఆముదం పంటలో పని చేసుకుంటున్న రైతు దంపతులతో.. కనుమదొడ్డి చెరువు వద్ద సీతాఫలాలు అమ్ముకునే జయలక్ష్మితో మాట్లాడారు.

మరోచో ట చెట్టు కింద ఉన్న మహిళలు, వృద్ధులతో నులక మంచంపై కూర్చుని సంభాషించారు. కల్లుగీత కార్మికులను పలకరించారు. గీత కార్మికులను ఆదుకుంటామని చెప్పడంతో వారి ముఖాల్లో ఆనందం కనిపించింది. వివిధ సందర్భాల్లో చంద్రబాబు మాట్లాడుతూ, రాష్ట్రంలో కాంగ్రెస్, వైసీపీ పగలంతా ఒకదానిని మరొకటి విమర్శించుకుంటూ రాత్రంతా జగన్ బెయిల్ కోసం రాయబారాలు జరుపుతున్నాయని విమర్శించారు. గొర్రెలకు మేత లేక గొర్రెల కాపరులు నానా ఇబ్బందులు పడుతున్నారని, తాను అధికారంలోకి వస్తే మేత కోసం పదెకరా లు కేటాయిస్తానని హామీ ఇచ్చారు.

వంటగ్యాస్ సిలిండర్లను కాంగ్రెస్ ప్రభు త్వం ఆరుకు కుదించిందని, తాము అధికారంలోకి వస్తే 10 సిలిండర్లు ఇస్తామని చెప్పారు. రైతుల గడ్డు పరిస్థితిని చూస్తే రుణ మాఫీ ఒకటే సరిపోదని అనిపిస్తోందని, ఉపాధి హామీని వ్యవసాయంతో అనుసంధానం చేయడంతోపాటు సాగునీటి కోసం సమగ్ర ప్రణాళిక రూపొందిస్తామని వెల్లడించారు. తాము అధికారంలోకి వస్తే సమగ్ర నీటి యాజమాన్యం అభివృద్ధి చేస్తామని, అందుకు చట్టాన్ని తీసుకు వస్తామని హామీ ఇచ్చారు.

పంట నష్ట పరిహారంగా ఎకరానికి రూ.2500 కాకుండా మరికొంత పెంచాలని 2004లో అప్పటి సీఎం వైఎస్‌కు తాను వివరించానని, అయినా పట్టించుకోలేదని, తాను అధికారంలోకి వస్తే పరిహారాన్ని ఎకరాకు 10 వేలు ఇస్తానని హామీ ఇచ్చారు. టీడీపీ హయాంలో 9గంటలు నిరంతరంగా సేద్యానికి కరెంట్ ఇచ్చామ ని, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం 3 గంటలు కూడా ఇవ్వడం లేదన్నా రు. వైసీపీ హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తోందని, ఆ పార్టీ నేతల కారణంగానే రాయలసీమలో చాలా గ్రామాలు నాశనమైపోయాయని మండిపడ్డారు.

చంద్రబాబుకు రైతుల సన్మానం
రాష్ట్రంలో రైతుల కడగండ్లు గమనించి రుణ మాఫీపై హామీ ఇచ్చిన చంద్రబాబుకు ఎమ్మిగనూరు మండలం బోసిబండలో రైతులు సన్మానం చేశారు. సీపీఐకు చెందిన రాష్ట్ర రైతు సంఘం నాయకుడు రామచంద్రయ్య అఖిల పక్ష రైతు సంఘం తరపున చంద్రబాబును కలిసి సంఘీభావాన్ని ప్రకటించారు. ఆలూరు నియోజకవర్గం నుంచి సీపీఐ నేతలు ఎక్కడికక్కడ పాదయాత్రలో పాల్గొంటూ మద్దతు ప్రకటించారు. బెల్టు షాపులు రద్దు చేస్తామని ప్రకటించినందుకు మహిళా సంఘం నాయకురాలు జోతిర్మయి చంద్రబాబును కలిసి కృతజ్ఞతలు తెలిపారు.

కాగా.. ఎమ్మిగనూరులో చంద్రబాబు చేనేత కుటుంబాలను పరామర్శించారు. ఆ ప్రాంతంలో 13 మంది చేనేత కార్మికులు ఆత్మహత్యకు పాల్పడ్డారని స్థానిక నాయకులు బాబు దృష్టకి తీసుకెళ్లడంతో.. వారి ఆత్మశాంతి కోసం గురువారం రాత్రి ఉపవాసం ఉంటున్నట్లు ప్రకటించారు. కాగా.. జీవవైవిధ్య సదస్సులో ప్రధాని మన్మోహన్ పర్యటనకు కొన్ని మీడియా సంస్థలను అనుమతించకపోవడాన్ని చంద్రబాబు తప్పుపట్టారు. ప్రత్యేకించి కొన్ని మీడియా సంస్థలపై వివక్ష చూపడం సరికాదని వ్యాఖ్యానించారు.

(17వ రోజు) పగలు విమర్శలు.. రాత్రి రాయబారాలు,ఎప్పుడైనా కాంగ్రెస్, వైసీపీ ఒక్కటే


• Rs 1,000 monthly stipend to unemployed
• Fee reimbursement for poor among FCs
• Allowance to Imams and other Muslim leaders
• He covers a distance of 22 km on 16th day
• The walkathon crosses 300 km milestoneTelugu Desam president N Chandrababu Naidu playing a percussion instrument during his padayatra in Kurnool district on Wednesday.

Kurnool: TDP president N Chandrababu Naidu, who is wooing all sections of the society during his ‘Vastunna Meekosam’ padayatra, on Wednesday promised retired government employees that his government would provide them free medical facilities apart from constructing houses for them free of cost.

Naidu seemed to have made the major promise in a bid to endear the party to the government employees whose dissent was said to be a major reason for his party’s defeat in the last two elections. He said the Congress party misled the people during the TDP rule that the RTC would be privatised, and in fact it was now trying to privatise the corporation.

Earlier, Naidu began his 16th day padayatra from Danapuram at 11 am. A large number of people from various communities like Kuruma, Gangaputra and SCs and Muslims welcomed him into their villages and took part in the padayatra. He addressed a large turnout of people at Danapurm.

During his address, Naidu showered promises upon the unemployed and minorities. He said the TDP government would pay a monthly stipend of Rs 1,000 to all the unemployed youth in the State and would create jobs for them on a large-scale.

He said the fee reimbursement scheme would be extended to the poor among the forward castes, too. He reminded them that the TDP government had filled 1.67 lakh teacher jobs during its stint. Reaching out to the minorities, Naidu said his government would pay an honorary monthly allowance of Rs 5,000 to the religious heads and Rs 3,000 to imams.

From Danapuram, Naidu proceded to Kallubavi Circle, where MRPS and CPI activists extended solidarity to the padayatra. Moving on, he came across the students of Bheema engineering college and spoke to them about his plans to put the State back on the rails. He reached Srinivas Circle in Adoni by 4.15 pm and there a huge meeting was addressed by him.

Continuing his tirade against the Congress party and also the YSR Congress party, he said there was no ideological differences between the two, and the latter was waiting to strike a deal with the Congress to wriggle its president Jaganmohan Reddy out of jail.

He compared Jagan to Robert Vadra, the son-in-law of Congress president Sonia Gandhi, who was mired of late in a major land scam. Referring to the free power scheme for the farming sector, he said his warning that it would result in major power crisis, affecting the farmers, was vindicated by the current turmoil in the sector.

He criticised that the Congress government was not even in a position to hold elections to the local bodies. As a result, the State had lost a Central grant to the tune of Rs 2,000 crore.

Naidu promises free medicare, houses for retired employees

నల్లకాలువ శపథం
కారాగారంలో కలిసిపోయింది
పోయి’నాయన’ కోసం
పోయినోళ్ళ లెక్క
మిగిలి వుండగానే
నాయుడి గారి నడక
మింగుడు పడక
రాజకీయంగా వెనకబడుతున్నామని
వెంటనే నాయుడి గారి వెనకే
నడక మొదలెట్టారు
అన్నగారి బెయిలు తెలంగాణా లెక్కన
వస్తుందో చస్తుందో తెలియదు
అంతవరకూ సచ్చిన వాళ్ళ
కుటుంబాలు కుళ్ళి కుళ్ళి
ఏడుస్తూ వుండాల్సిందేనా
ఓదార్చనివ్వలేదనేగా
రాహుల్జీని ప్రధానిగా చూడాలనే
నాన్న కోరికను గట్టున పెట్టి
పిలకాయల కాంగ్రెస్స్ పెట్టింది
ఆదరాబాదరాగా
అన్న వదిలిన బాణం
అయిపోయి
చెల్లెమ్మ నడిచేస్తే
అక్కడక్కడా అమ్మ వచ్చి
ఓ బిడ్డను జైలుకు పంపా
ఇంకో బిడ్డను మీకోసం పంపుతున్నా అని
విషాదాన్ని రంగరించి ఒలికిస్తే
మడమ తిప్పిన విషయం జనం మరిచిపోతారా  

www.chaakirevu.wordpress.com

నల్లకాలువ శపథం కారాగారంలో కలిసిపోయింది -చాకిరేవు

వైఎస్ఆర్ కాంగ్రెస్ అదినేత జగన్ సోదరి షర్మిల పాదయాత్ర సభ పూర్తి కాగానే ఆమె, అలాగే ఆమె తల్లి విజయమ్మ చేసిన విమర్శలపై టిడిపి అదికార ప్రతినిది, ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి తీ్వ్రంగా స్పందించారు.ప్రపంచంలో ఎక్కడా ప్రతిపక్షానికి వ్యతిరేకంగా పాదయాత్ర చేసిన చరిత్ర లేదని, షర్మిల పాదయాత్ర ఆ విషయంలో ఒక రికార్డు అవుతుందని ద్వజమెత్తారు.మాచ్ ఫిక్సింగ్ అన్న పదానికి పర్యాయపదమే వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ అని ఆయన విజయమ్మ, షర్మిల లు చేసిన విమర్శలను తిప్పికొట్టారు.అవిశ్వాసం పెట్టినప్పుడు ఎందుకు ప్రభుత్వాన్ని పడగొట్టలేకపోయారని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రపతి ఎన్నికలలో ప్రణబ్ కు ఓటు వేయడం ద్వారా మాచ్ ఫిక్సింగ్ కు పాల్పడింది వారేనని ఆయన ఆరోపించారు.

ప్రతిపక్షానికి వ్యతిరేకంగా పాదయాత్ర చేస్తారా! -రేవంత్ రెడ్డి100 ఎలుకల్ని కడుపారా తినేసిన పిల్లి ఆనక తీర్థయాత్ర చేసినట్లుగా షర్మిల చేస్తున్న పాదయాత్ర ఉన్నదని తెలుగుదేశం పార్టీ నాయకుడు రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. ప్రజా సమస్యలు, సంక్షేమ పథకాలే కాదు... అన్న వెనకేసుకున్న అవినీతి సొమ్ము గురించి, బెంగళూరులోని విశాల భవంతుల గురించి కూడా అన్ని వివరాలను పాదయాత్రలో చెపితే బావుంటుందన్నారు.

ప్రభుత్వాన్ని పడగొట్టడం లేదు తెదేపా అని చెప్పే వైకాపా, గతంలో ఆ పార్టీ అధ్యక్షుడు ఢిల్లీలో ఏం చెప్పారో గుర్తుకు తెచ్చుకోవాలన్నారు. తాను జెంటిల్మెన్‌ను అనీ, కనుకనే తన వైపు ఉన్న ఎమ్మెల్యేలు ప్రభుత్వాన్ని పడగొడదామని చెప్పినా, ఇది తన తండ్రి తెచ్చిన ప్రభుత్వం కనుక 2014 దాకా చేయి పెట్టనని చెప్పిన ఘనుడు జగన్ అని దెప్పిపొడిచారు.

ఇప్పుడు ఆ మాటలన్నీ ఏమయ్యాయంటూ నిలదీశారు. పూటకో మాట చెపుతో ప్రజలను మభ్యపెట్టాలని చూస్తే ఆ ప్రజలే బుద్ధి చెప్పే సమయం ఆసన్నమవుతుందన్నారు.

100 ఎలుకల్ని తిన్న పిల్లి తీర్థయాత్రలా షర్మిల పాదయాత్ర: రేవంత్ రెడ్డి


Telugudesam party office release press note_ Tomarrow vastunna meekosam padayatra shedule _chandrababu naidu

ప్రెస్ నోట్ (Telugudesam party office)18.10.2012Chandra babu naidu "vastunna meekosam" Padayatra photos today

17వ రోజు చంద్రబాబు నాయుడి "వస్తున్నా మీకోసం" పాదయాత్ర పోటోలు 19.10.2012

కర్నూల్ జిల్లాలో 17వ రోజు పాదయాత్ర  ..."vastunna meekosam " Padayatra videos  from Tv channels

Etv 2 News


Tv5 News


కర్నూల్ జిల్లాలో 17వ రోజు పాదయాత్ర విడీయెలు