October 10, 2012

ఉత్సాహం…అదే పలుకరింపు

 • జనంవైపు అడుగులు
 • రోజుకు 20 కిలో మీటర్లు
 • 117 రోజుల పాటు ప్రజల్లోనే
 • 35 ఏళ్ళక్రితం మొదటి యాత్ర
 • అప్పట్లో కాణిపాకం నుంచి చంద్రగిరి వరకు పాదయాత్ర
 • సుదీర్ఘ ప్రసంగాల్లేవు
 • వ్యవహార శైలిలో మార్పు
 • ఆప్యాయంగా పలుకరింపు
 • సామాన్య జనం మాట చంద్రబాబు నోట
 • సాదాశీదాగా కులవృత్తుల ప్రతినిధులతో మమేకం
 • పార్టీ శ్రేణులతో ప్రత్యక్ష సంబంధాలు
 • స్థానిక నేతలతో పార్టీ అంశాలపై చర్చ
old
ప్రజల ఇబ్బందులను, కడగండ్లను చంద్రబాబు ప్రత్యక్షంగా చూస్తున్నారు. ఒకేమాదిరి ఊకదంపు డు ఉపన్యాసాల జోలికి వెళ్లకుండా ప్రజలతో మమేకమవుతున్నారు. పనిలో పనిగా కార్యకర్తలతో ప్రత్యక్ష సంబంధాలు ఏర్పాటు చేసుకుని నేరుగా వారిలో విశ్వాసం నింపుతున్నారు. చంద్రబాబు తలపెట్టిన ఈ యాత్రకు సామాన్య జనం నుంచి హర్షం వ్యక్తమవుతోంది. చంద్రబాబు మారిన శైలిపై ఓ కథనం.
టీడీపీ అధినేత చంద్రబాబు చేపట్టిన వస్తున్నా.. మీ కోసం యాత్రతో తెలుగుతమ్ముళ్లలో నూతనోత్తేజం కనిపిస్తోంది. సరాసరి రోజుకు 20 కిలో మీటర్ల చొప్పున నడుస్తూ… 117 రోజులపాటు ప్రజల కష్టాల్ని మరింత దగ్గరగా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు బాబు.ప్రజల్లోకి వెళ్లేందుకు బాబు పాదయాత్ర చేయడం కొత్తేమీ కాదు. 35 ఏళ్ల కిందట చిత్తూరు జిల్లా కాణిపాకం నుంచి పాదయాత్ర చేసి గడప గడపా తొక్కారు. మూడు పదుల వయసులో ఆనాడు బాబు చేసిన యాత్రకు విశేష స్పందన వచ్చింది. కాణిపాకం నుంచి చంద్రగిరి వరకూ సాగిన ఆ టూర్‌… ఇప్పటికీ అక్కడి జనం కళ్లముందు కదులుతూనే ఉంది. యూత్ కాంగ్రెస్ నేతగా ఉన్నప్పటి నుంచే ప్రజల పక్షాన ఎన్నోపోరాటాలు … పాదయాత్రలు చేశారు బాబు.
new
 ప్రస్తుత పాదయాత్రలో భాగంగా.. అనంతపురం జిల్లాలో 60 గ్రామాల్లో ప్రజల కష్టసుఖాలు అడిగి తెలుసుకున్నారు చంద్రబాబు. ఈ యాత్ర సమయంలో బాబు వ్యవహారశైలిలోనూ మార్పువచ్చింది. అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ ముందుకు వెళ్లడమే కాదు… ప్రసంగ శైలినీ బాబు మార్చుకున్నారు. సుదీర్ఘమైన ప్రసంగాలకు బదులు.. ఇప్పుడు  సూటిగా జనం నచ్చిన మాటలే మాట్లాడుతున్నారు.పనిలో పనిగా పార్టీ కార్యకర్తలతో ప్రత్యక్ష సంబంధాలు కొనసాగిస్తున్నారు. నేరుగా వారిని విశ్వాసంలోకి తీసుకుంటున్నారు. అటు సామాన్య జనం..ఇటు పార్టీ శ్రేణులను పటిష్టం చేయగలిగేందుకు ఈ యాత్ర ఉభయతారంగా ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.తాను మారానని పదేపదే చెప్తున్న బాబు మాటలు ఇప్పుడు జనానికి బాగానే చేరుతున్నాయి. ప్రజలతో మమేకమౌతూ పాదయాత్ర చేస్తున్న ఆయన… ఇప్పుడు అందరివాడుగా మారారన్న భావన సామాన్యుల్లో కనిపిస్తోంది.

by.....pravasarajyam.com

ఉత్సాహం…అదే పలుకరింపు


ప్రెస్ నోట్ 10.10.2012 PRESSNOTEపాదయాత్ర పోటోలు ఎనిమిదో రోజు -2 ( 09.10.2012 )

8th Day Vastunna meekosam padayatra at Kalyanadurgam

మళ్లీ ప్రజాస్వామ్యాన్ని తెద్దాం
నా హయాంలో ప్రపంచవ్యాప్త గుర్తింపు
కాంగ్రెస్ కుంభకోణాలకు కేరాఫ్ అడ్రస్
అధికారంలోకి వస్తే అందరికీ ఉద్యోగం
నిరుద్యోగులకు రూ.1000 భృతి

  "మీ ప్రోత్సాహంతోనే నేను నడుస్తున్నాను. మీరే నన్ను నడిపిస్తున్నారు. రోజుకు 12 గంటలు నడిచినా కాళ్లకు నొప్పులు లేవు. మీ కష్టాలే కనిపిస్తున్నాయి. మీ కష్టాలు తీర్చి మీ కళ్లల్లో ఆనందం చూడాలని ఉంది. రాష్ట్రానికి పూర్వ వైభవం తీసుకు రావడానికి మీరంతా సహకరించాలి. మీరు సహకరిస్తే ప్రజాస్వామ్యాన్ని పునర్నిర్మిద్దాం'' అని టీడీపీ అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. ఆయన పాదయాత్ర ఎనిమిదో రోజు కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని నారాయణపురం క్రాస్ నుంచి ప్రారంభమైంది.

మంగళవారం 18.4 కిలోమీటర్ల మేర పాదయాత్ర కొనసాగించి బెళుగుప్ప మండలం విరూపాపల్లి క్రాస్ వద్ద బస చేశారు. మంత్రి రఘువీరా ఇలాకా కళ్యాణదుర్గంలో ప్రజలు బాబుకు నీరాజనం పలికారు. ఇక్కడే చంద్రబాబు కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు. అవినీతి, కుంభకోణాలకు కేరాఫ్ అడ్రస్‌గా కాంగ్రెస్ మారిందన్నారు. "టీడీపీ హయాంలో విద్యా రంగంలో ప్రవేశపెట్టిన వినూత్న పద్ధతుల కారణంగా ప్రపంచవ్యాప్తంగా అనేకమంది యువతీ యువకులు ఉద్యోగాలు సంపాదించారు.

నా హయాంలో రాష్ట్రానికి నాలెడ్జి హబ్‌గా ప్రపంచవ్యాప్త గుర్తింపు తీసుకొచ్చా. కానీ, కాంగ్రెస్ పార్టీ దేశాన్ని, రాష్ట్రాన్ని అవినీతి కుంభకోణాల్లోకి నెట్టింది. రాష్ట్రంలో కరెంటు ఎప్పుడు వస్తుందో తెలియదు. వ్యవసాయ మోటార్లు ఆడవు. వీధిలైట్లు వెలగవు. తాగేందుకు నీళ్లు కూడా దొరకవు. రాని కరెంటుకు 15 రెట్లు చార్జీలు పెంచి వసూలు చేస్తున్నారు. ఇంటి పన్ను పెంచేశారు. అన్ని ధరలూ పెంచేసి.. దోపిడీ చేసేసి కనీసం తాగునీరు కూడా సక్రమంగా అందించలేని కాంగ్రెస్ ప్రభుత్వానికి అధికారంలో కొనసాగే అర్హత ఎక్కడ ఉంది!?'' అని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

యువత, విద్యార్థి లోకం అవినీతిపరుల గుండెల్లో నిద్రపోవాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. టీడీపీ అధికారంలోకి వస్తే చదువుకున్న ప్రతి ఒక్కరికీఉద్యోగంతోపాటు నెలకు రూ.1000 చొప్పున నిరుద్యోగ భృతి కూడా కల్పిస్తామని హామీ ఇచ్చారు. కనీసం స్థానిక సంస్థల ఎన్నికలు కూడా నిర్వహించలేని దుస్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉందన్నారు. మిగులు బడ్జెట్‌తోపాటు మిగులు విద్యుత్ కూడా అందించిన ఘనత టీడీపీదేనన్నారు. కాంగ్రెస్ పాలన దాదాపు గాడి తప్పిందని, దానిని గాడిలో పెట్టే బాధ్యతను టీడీపీ తీసుకుంటుందని, ఇందుకు ప్రజల సహకారం కావాలని విజ్ఞప్తి చేశారు. 'మీకు రఘువీరా ఏమైనా న్యాయం చేశారా?' అని కళ్యాణదుర్గం ప్రజలను చంద్రబాబు ప్రశ్నించారు.

వారి నుంచి 'లేదు.. లేదు..' అని జవాబు వచ్చింది. దీంతో, "ఈ ప్రభుత్వంలో కాంగ్రెస్ నేతలు అభివృద్ధి చెందారు. రఘువీరా రెడ్డి బ్రహ్మాండమైన ప్యాలెస్ నిర్మించారు. ప్రజలకు ఏమాత్రం మౌలిక సదుపాయాలు కల్పించలేదు' అని దుయ్యబట్టారు. అవినీతికి పాల్పడ్డ మంత్రుల్లో ఇప్పటికే కొందరు చంచల్‌గూడ జైల్లో ఉన్నారని, మరికొందరు వెళ్లడానికి సిద్ధంగా ఉన్నారని, కేబినెట్ సమావేశాలు అక్కడే పెట్టుకునే పరిస్థితి ఉంద'ని ఎద్దేవా చేశారు. వాల్మీకులు, వడ్డెరలకు రాజకీయంగా ప్రాధాన్యం ఇస్తామని, వారిని ఎస్టీ జాబితాలో చేరుస్తామని హామీ ఇచ్చారు.

ఎనిమిదో రోజు పాదయాత్ర కళ్యణదుర్గం 09.10.2012
పాదయాత్ర పోటోలు ఎనిమిదో రోజు 09.10.2012


నేటి పాదయాత్ర (10.10.2012)ప్రెస్ నోట్ 09.10.2012